women safety
-
కోటి మంది మహిళల్ని కోటీశ్వరుల్ని చేస్తాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఈ దిశలో ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. నగరంలో మహిళల భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్‌తో (హెచ్సీఎస్సీ) కలిసి నగర పోలీసులు మంగళవారం నిర్వహించిన ‘స్త్రీ’(షీ ట్రంప్స్ థ్రూ రెస్పెక్ట్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్) సమ్మిట్ 2.0కు భట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బంజారాహిల్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్, ప్రముఖ క్రీడాకారిణి నైనా జైశ్వాల్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ‘స్త్రీలకు సమాన హక్కులు కల్పించిన, రాజ్యాంగానికి రూపమిచ్చిన బీఆర్ అంబేడ్కర్ జయంతి మరుసటి రోజే ఈ సదస్సు నిర్వహించుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు అన్ని రకాలైన సాధికారత కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. మహిళా సంఘాలకు ప్రభుత్వం ఏటా రూ.20 వేల కోట్ల మేర వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నా.. లక్ష్యాన్ని మించి రూ.21 వేల కోట్లు అందించాం. గ్రీన్ ఎనర్జీలో మహిళల్ని భాగస్వాముల్ని చేస్తున్నాం. సోలార్ రంగంలో 1,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి మహిళా సంఘాలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాం.మహిళల కోసం ప్రత్యేక చట్టాలు చేయడంతో పాటు వాటిని అమలు చేస్తేనే మహిళ సాధికారికత సాధ్యం. తెలంగాణ ప్రభుత్వం దీనికి కట్టుబడి ఉంది’అని అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘మహిళల కోసం ఎన్ని చట్టాలు వచ్చినా ఇప్పటికీ నేరాలు జరుగుతున్నాయి. గత ఏడాది నగరంలో 250 అత్యాచారం కేసులు, 713 పోక్సో కేసులు నమోదయ్యాయి. మహిళలకు న్యాయం చేయడానికి షీ–టీమ్స్‌తో పాటు భరోసా కేంద్రం పనిచేస్తోంది.హైదరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 19 డీసీపీ పోస్టులు ఉండగా... వీటిలో ఎనిమిది మంది మహిళా అధికారులు ఉన్నారు’అని పేర్కొన్నారు. మహిళ సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని నీతి ఆయోగ్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ భానుశ్రీ వెల్పాండియన్ అన్నారు. ఈ కోణంలో దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో ఉత్తమ విధానాలు అమలవుతున్నాయని కితాబిచ్చారు. -
ఏపీలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కల్యాణి
-
మహానగరంలో ఏదీ భద్రత?
ఆడపిల్లల భద్రతకు ప్రమాదం పొంచివున్నదని స్పష్టంగా కనబడుతున్నా కళ్లుమూసుకున్న పోలీస్ యంత్రాంగం సాక్షిగా హైదరాబాద్‌లో మొన్న శనివారం ఒక యువతిపై లైంగిక దాడి జరిగింది.ఎంఎంటీఎస్‌లో ప్రయాణిస్తుండగా బోగీలో ఎవరూలేని సమయం చూసి దుండగుడు దాడి చేయగా తప్పించుకునే యత్నంలో నడుస్తున్న రైలునుంచి ఆమె దూకి తీవ్ర గాయాలపాలైంది. పగలంతా కిక్కిరిసి వుండే ఎంఎంటీఎస్ రైళ్లు చీకటిపడే వేళకు దాదాపు ఖాళీ అవుతుంటాయి. జనం ఎక్కువున్న సమయాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ఆడవాళ్ల బోగీల్లో ఎక్కి వెకిలిచేష్టలకు పాల్పడటం, సెల్ఫోన్లు, ఆభరణాలు అపహరించటం వంటివి పెరిగాయని అనేకులు చెబుతున్నారు. హిజ్రాల ఆగడాలు సరేసరి. ఒంటరిగా ప్రయాణించక తప్పని స్థితిలో ఈ అరాచకాలు ఇంకెంత మితిమీర గలవో సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ మాదిరి ఉదంతాలపై నిత్యం ఫిర్యాదులు అందుతూనే ఉంటాయని మీడియా కథనాలు చెబుతున్నాయి. ప్రయాణికుల సంఘాలు కూడా ఆందోళనలు చేసినా పోలీసులు మేల్కొనలేదు. రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్), ప్రభుత్వ రైల్వే పోలీస్(జీఆర్పీ) విభాగం అసలు దీన్ని సమస్యగానే భావించలేదు. ఆ విభాగాలు కర్తవ్య నిర్వహణలో విఫలం కావటమే నిజమైన సమస్య. కనీసం చీకటిపడింది మొదలు అర్ధరాత్రి సర్వీసులు ఆగిపోయే వరకైనా బందోబస్తు అవసరమని గ్రహించలేదు. సరిగదా అంతక్రితం ఎంఎంటీఎస్ రైళ్లలోవుండే హోంగార్డుల్ని సైతం ఈమధ్య తొలగించారంటున్నారు. హైదరాబాద్ నగరంలో సుమారు 30 ఎంఎంటీఎస్ స్టేషన్లువుంటే కేవలం పది స్టేషన్లలో మాత్రమే భద్రత ఉండటం, అది కూడా అంతంత మాత్రం కావటం దారుణం. స్టేషన్లలో అక్కడక్కడ పేరుకు ఆర్పీఎఫ్, జీఆర్పీ కానిస్టేబుళ్లు కనబడు తుంటారు. కానీ మహిళల కోచ్‌లు ఎలావున్నాయో, భద్రత ఏ మేరకు అవసరమో గమనించేపాటి పని కూడా వారినుంచి ఆశించే స్థితి లేదంటే నిర్వాహకులు సిగ్గుపడాలి. సాంకేతికత విస్తరించిన ఈ కాలంలో కూడా దాన్ని సవ్యంగా వినియోగించలేని అశక్తతలో ప్రభు త్వాలుండటం విచారకరం. హైదరాబాద్ నగర శివారులో 2019 నవంబర్‌లో ఒక మహిళా వైద్యు రాలిని అపహరించి, ఆమెపై అత్యాచారం జరిపి హత్య చేసిన ఉదంతం చోటు చేసుకున్నప్పుడు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాన్ని తెలంగాణకు సంబంధించిందిగా చూడలేదు. అలాంటి పరిస్థితి ఏపీలో తలెత్తకూడదన్న సంకల్పంతో పోలీస్ వ్యవస్థను కదిలించి కేవలం మూడు నెలల వ్యవధిలోనే దిశ యాప్ అందుబాటులోకి తెచ్చారు. దిశ ప్రత్యేక పోలీస్ స్టేషన్లు నెలకొల్పారు. లక్షలాదిమంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవటంవల్ల ఆపత్కాలంలో అనేకమందిని రక్షించటం సాధ్యమైంది. 2021 సెప్టెంబర్‌లో ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష రాయటానికి ఢిల్లీ వెళ్లిన ఏపీ యువతి తెల్లారుజామున దిగి ఆటో ఎక్కాక కీడు శంకించినప్పుడు దిశ యాప్ వల్లే పోలీసులను అప్రమత్తం చేసింది. ఏపీ పోలీసుల సమన్వయంతో ఆమె క్షేమంగా పరీక్ష రాసింది. తిరిగి ఏపీకి వెళ్లే రైలు ఎక్కేవరకూ సాయం దొరికింది. హైదరాబాద్‌లో బెంగళూరు వెళ్లే రైలెక్కిన మహిళ సైతం ఈ యాప్‌ను ఉపయోగించుకునే తనను తాను రక్షించుకోగలిగింది. దేశంలో ఏ మూలనున్నా ఈ యాప్ ద్వారా సమాచారం అందుకుని మహిళలను రక్షించిన ఉదంతాలు కోకొల్లలు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక వెనకా ముందూ చూడకుండా దీన్ని రద్దుచేశారు. తొమ్మిది నెలలు జాప్యంచేసి, అదే యాప్‌కు సురక్షా అనే పేరు తగిలించి ఈ నెల మొదటివారంలో మళ్లీ తీసుకొచ్చారు. వేషం మారిన ఈ యాప్‌పై మహిళల్లో పెద్దగా ప్రచారం చేసిన దాఖలా కూడా లేదు. అఘాయిత్యాలు మితిమీరిన ఈ కాలంలో దిశవంటి యాప్‌ను కనీసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకునేవరకైనా కొనసాగించాలన్న ఇంగితజ్ఞానం కూటమి ప్రభు త్వానికి లేకపోయింది. బహుశా ఆ యాప్ కొనసాగివుంటే ఎంఎంటీఎస్‌లో ఆపదలో చిక్కుకున్న యువతికి అది ఆసరాగా నిలిచేదేమో! ఎక్కడో వేరే రాష్ట్రంలోవున్న యువతులకు ఆపత్కాలంలో సాయపడటం మాట అటుంచి, తాడేపల్లిలో డీజీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో దుండ గుల బారిన పడిన మహిళను కూడా కాపాడలేని అశక్తతలో ఏపీ పోలీసులు కూరుకుపోయారు. ఫలితంగా ఆ మహిళపై దుండగులు అత్యాచారం చేసి, హతమార్చారు. అదే ప్రాంతంలో మొన్న జనవరి 31న మరో మహిళ బలైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈమాదిరి అఘాయిత్యాలకు అంతేలేదు.ఎంఎంటీఎస్ ఉదంతంలో రైల్వే పోలీసులు బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. దుండ గుడు పట్టుబడవచ్చు కూడా. ఈ ఉదంతం పోలీసులకు ఎలాంటి గుణపాఠం నేర్పిందోగానీ మళ్లీ మరోటి జరిగేవరకూ పట్టనట్టు వ్యవహరించే ధోరణికి ఇకనైనా స్వస్తి పలకాలి. ఖర్చు తగ్గించుకుని లాభార్జన చేయాలన్న యావ భద్రతకు తూట్లు పొడుస్తుందన్న సంగతి ఎంఎంటీఎస్ నిర్వాహకులు తెలుసుకోవాలి. ఆకతాయిలూ, అసాంఘిక శక్తులూ, యధేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘించేవారూ తమకేం కాదన్న భరోసాతో ఉండటం మహిళలకూ, పిల్లలకూ ప్రాణాంతకమవుతుంది. రైల్వే స్టేషన్లతోపాటు బోగీల్లో సైతం సీసీ కెమెరాలుంటే, వాటిని నిత్యం పర్యవేక్షిస్తుంటే, తక్షణం చర్యలు తీసుకునే యంత్రాంగం పనిచేస్తే ఆగడాలను అరికట్టడం సులభమవుతుంది. అలాగే మహిళల రక్షణకు తగిన యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలి. గడప దాటితే క్షేమంగా తిరిగొస్తామో లేదోనన్న భయాందోళనల మధ్య పౌరులు బతికే దుఃస్థితి ఉండటం మంచిదికాదని ప్రభుత్వం, రైల్వేశాఖ గుర్తించాలి. -
రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణం
సాక్షి, హైదరాబాద్/ గాంధీఆస్పత్రి: రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా తయారైందని, ఎంఎంటీఎస్ రైలులో అత్యాచారయత్నం ఘటనలో ఓ యువతి తీవ్ర గాయాలపాలవడం అత్యంత బాధాకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ‘ఎక్స్’లో వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసేలా ఆదేశించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించడం వల్లే ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయని కేటీఆర్ పేర్కొన్నారు. రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన మొత్తం తెలంగాణ సమాజాన్ని కలిచివేసేదిలా ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.హోంశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి చేతగానితనం వల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని తెలిపారు. రాష్ట్ర రాజధానిలో ఈ తరహా దారుణాలు జరుగుతుంటే, ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైల్వే సిబ్బంది ఏమి చేస్తోందని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచారయత్నం ఘటన పట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైల్వే ఎస్పీ చందన దీప్తితో కవిత ఫోన్లో మాట్లాడి యువతిపై అత్యాచారయత్నం ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత కరువైంది: సబిత, శ్రీనివాస్గౌడ్నడుస్తున్న రైలులో అత్యాచారయత్నం రాష్ట్రానికే సిగ్గుచేటని, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మహిళలకు భద్రత కరువైంద ని మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ ఆవే దన వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ గాంధీఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత మహిళను వారు సోమవారం పరామ ర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రంలో షీ టీమ్ పనితీరు ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. -
మహిళల భద్రతపై మండలిలో కూటమిని రఫ్ఫాడించిన వరుదు కళ్యాణి
-
మహిళలపై నేరాలు తగ్గాయనడం పచ్చి అబద్ధం: వరుదు కల్యాణి
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి పాలన చేపట్టాక మహిళలపై నేరాలు తగ్గాయని చట్టసభల సాక్షిగా అబద్ధాలు చెబుతున్నారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి(Varudu Kalyani) ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలపై నేరాలకు సంబంధించిన ప్రభుత్వం వెల్లడించిన లెక్కలను ఖండించిన ఆమె.. ఈ అంశంపై వివరంగా మాట్లాడారు. ‘‘మహిళల పై నేరాలు తగ్గాయని సభసాక్షిగా హోం మంత్రి అనిత(Home Minister Anita) అబద్ధాలు చెప్పారు. ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం రోజుకి మహిళల పై 70 సంఘటనలు జరుగుతున్నాయి. ఈ పదినెలల్లో మహిళల పై నేరాలు దాడులు పెరిగాయి. అలాంటప్పుడు.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఎందుకు ప్రయత్నించడం?. లెక్కలు క్లియర్‌గా ఉంటే మరి మోసం చేయడం ఎందుకు?.. అని నిలదీశారామె. .. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారు. దిశా యాప్‌ను తెచ్చారు. దిశా యాప్ పైన ఇదే మంత్రి గతంలో చాలా వెటకారంగా మాట్లాడారు. కానీ, ఇప్పుడు అదే దిశ యాప్ ను కాపీ కొట్టి శక్తి యాప్ అని తెచ్చారు. మహిళా దినోత్సనం రోజున శక్తి యాప్ ప్రారంభించారు. కేవలం పదిరోజుల్లోనే కోటి 49 లక్షల మంది శక్తి యాప్ ను డౌన్ లోడు చేసుకోవడం విడ్డూరంగా ఉంది... కృష్ణాజిల్లాలో 14 ఏళ్ల బాలిక పై సామూహిక అత్యాచారం జరిగింది. ఇంత దారుణాలు జరిగినా ప్రభుత్వంలో చలనం లేదు. మహిళల పై నేరాలు పెరగడానికి కారణం మద్యం,గంజాయి,డ్రగ్స్. సీఎం చంద్రబాబు నివాసముంటున్న జిల్లాలోనే డ్రగ్స్ దొరికాయి. గంజాయిని కంట్రోల్ చేయడానికి ఈగల్ తెచ్చామంటున్నారు సంతోషం. కానీ, జగన్ మోహన్ రెడ్డి గతంలో సెబ్ తెచ్చారు. సెబ్ డీజీపీ కంట్రోల్లో ఉండేది. సెబ్‌ను తీసేసి ఈగల్ తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. మహిళల రక్షణకు తాము కట్టుబడి ఉన్నామంటున్నారు. కానీ, ప్రభుత్వం మాటలు కాకుండా చేతలతో చిత్తశుద్ధి నిరూపించుకోవాలి.కేంద్రం వద్ద దిశ చట్టం(Disha Act) పెండింగ్ లో ఉంది. కేంద్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వమే కదా. మరి ఆ చట్టానికి ఆమోద ముద్ర వేయించొచ్చు కదా అని అనితను ఉద్దేశించి కల్యాణి అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మభ్యపెట్టే మాటలు మానుకోవాలని కూటమి ప్రభుత్వానికి వరుదు కల్యాణి హితవు పలికారు.ఇదే అంశంపై మాట్లాడిన ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి.. మహిళలకు ఇంటా బయటా రక్షణ లేకుండా పోయిందని అన్నారు. పోలీస్ స్టేషన్లలోనే మహిళా పోలీసుల పై దాడులు జరుగుతున్నాయన్న ఆమె.. శక్తి యాప్ కూడా దిశా యాప్ మాదిరిగానే పనిచేస్తుందా? అని అనుమానాలు వ్యక్తం చేశారు. -
మక్కీకి మక్కీ దిశ యాప్‌ను కాపీ చేసిన చంద్రబాబు ప్రభుత్వం
సాక్షి, విజయవాడ : వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన హయాంలో దిశ యాప్‌కు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం అందుబాటులోకి తెచ్చిన యాప్ దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆ యాప్‌ను నిర్విర్యం చేసింది. తాజాగా అదే యాప్‌ను కూటమి ప్రభుత్వం కాపీ కొట్టింది. మక్కీకి మక్కీ దిశ యాప్ ఫీచర్ల తోనే శక్తి యాప్ రూపొందించింది. ఆ యాప్ వివరాల్ని అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు ప్రకటించారు. గతంలో దిశ యాప్‌ని చంద్రబాబు, హోంమంత్రి అనిత ఎగతాళి చేశారు. అదే దిశ యాప్‌ని కాపీ కొట్టి నేడు అమలు చేయడం గమనార్హం -
ఏమైంది డిప్యూటీ సీఎం సార్ .. శ్యామల ఫన్నీ సెటైర్స్
-
నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతూ...
‘మహిళల శక్తి సామర్థ్యాలు సమాజానికి సంపూర్ణంగా ఉపయోగపడితేనే అభివృద్ధి సాధ్యం’ అనే భావనను చాలామంది ప్రముఖులు వ్యక్తీకరిస్తుంటారు. ఈ అభిప్రాయం మంచి ఉద్దేశంతో చేసిందే కావచ్చు గానీ... మహిళల శక్తి సామర్థ్యాలు సంపూర్ణంగా సమాజానికి ఉపయోగపడటం లేదనే అర్థం స్ఫురిస్తుంది. అనాదిగా మహిళలు తమ సంపూర్ణ శక్తి సామర్థ్యాలను తమ కుటుంబానికి, తద్వారా సమాజానికి అందిస్తూనే ఉన్నారు. కాకపోతే, వారు చేసే సేవ లను కొలిచే కొలమానం ఉండదు. వారి సేవలు అనేక రూపాల్లో కారు చౌకగా దోపిడీకి గురవుతున్నాయి. ఉదాహరణకు చట్టాలు ఉన్నప్పటికీ వ్యవసాయ రంగంలో పురుష కూలీకి లభించే వేతనం మహిళా కూలీకి దక్కదు.మహిళల శక్తి సామర్థ్యాలను అన్ని రంగాలలో సమాన ప్రాతినిధ్యంలో ఉపయోగించుకోగలిగితేనే సమాజం మరింత అభివృద్ధి చెందగలుగుతుందన్నది ఓ కఠోర వాస్తవం. తదనుగుణమైన కార్యాచరణకు పూనుకోవాల్సింది ప్రభుత్వాలే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ కావాలని కలవరిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యం నెరవేరడం అన్ని రంగాలలో మహిళలను వినియోగించుకోవడం మీదనే ఆధారపడి ఉంది.భారతదేశంలో, ఆ మాటకొస్తే ప్రపంచంలోని అనేక దేశాలలో శతాబ్దాలపాటు కొనసాగిన సాంఘిక దురాచారాలు, కట్టుబాట్లు మహిళల మనో వికాసాన్ని, ఆరోగ్యాన్ని, అభివృద్ధిని దెబ్బ తీశాయి. రాజ్యాంగంలోని 14, 15 అధికరణలు పురుషులతో పాటు మహిళలకు సమాన అవకాశాలు కల్పించి నప్పటికీ ఆచరణలో ఆమడ దూరంలోనే ఉన్నాయి. సామాజిక, రాజకీయ కారణాల వల్ల కొన్ని చట్టాల్ని అమలు చేయలేక ప్రభుత్వాలు నిస్సహాయంగా ఉండి పోతున్నాయి.అయితే, సానుకూల పరిస్థితులు క్రమేపీ నెల కొంటున్నాయి. ప్రపంచీకరణ మొదలై ప్రైవేటు రంగం ఆధిపత్యం, టెక్నాలజీ వినియోగం పెరిగిన నేపథ్యంలో పలు రంగాల్లో మహిళలు అగ్రభాగాన రాణిస్తున్నారు. ఉదాహరణకు చంద్రయాన్–3 ప్రాజెక్టులో వంద మందికిపైగా మహిళా శాస్త్రవేత్తలు పని చేశారు. 2018లో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మహిళా శాస్త్రవేత్తల పథకం మంచి ఫలితాలు అందిస్తోంది. దాదాపు 2,000 మంది మహిళా శాస్త్ర వేత్తలు చేసే పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు అందజేస్తోంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) చేస్తున్న కృషి కారణంగా, 2000– 01లో జరిగిన పరిశోధనలలో 13 శాతంగా ఉన్న మహిళల వాటా, ప్రస్తుతం 30 శాతం దాటింది.దాంతోపాటు, మహిళల ఆరోగ్యం, భద్రత లపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ‘నేషనల్ క్రైవ్‌ు రికార్డ్స్ బ్యూరో’ వివరాల ప్రకారం, దేశ వ్యాప్తంగా మహిళలపై జరుగుతున్న నేరాలు ఏటా 8% మేర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. మహిళల భద్రత విషయంలో అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో భారతదేశం 5వ స్థానంలో నిలవడం సిగ్గుచేటు. మన దేశంలో పర్యటించే విదేశీ మహిళా టూరిస్టులకు ఆ యా దేశాలు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇది దేశ పర్యాటక రంగం అభివృద్ధికి అవరోధం. రాజకీయ భాగస్వామ్యం పెరగాలి!మహిళల శక్తి సామర్థ్యాలు మిగతా రంగాలలో కంటే రాజకీయ రంగంలో అతి తక్కువ స్థాయిలో వినియోగం అవుతున్నాయి. ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత ఢిల్లీకి ముఖ్యమంత్రిగా రేఖాగుప్తాను ఎంపిక చేసిన బీజేపీ... మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నట్టు ప్రకటించుకొంది. అందుకు వారిని అభినందించాల్సిందే! కానీ, ఇది ఒక పార్శ్వం మాత్రమే. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీకి ఎంపికైన మహిళలు కేవలం ఐదుగురే. లోక్‌సభలో సైతం మహిళల ప్రాతినిధ్యం గరిష్ఠంగా 15 శాతం మించడం లేదు. 17వ లోక్‌సభలో మహిళా సభ్యుల శాతం 14.4 శాతం కాగా, ప్రస్తుత 18వ లోక్‌సభలో అది 13.6 శాతానికి తగ్గడం గమనార్హం!లోక్‌సభ, శాసనసభలలో 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు రిజర్వ్ చేయడానికి ఉద్దేశించిన బిల్లు 1996లో హెచ్.డి.దేవెగౌడ సారరథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ప్రవేశ పెట్టినపుడు ఈ రచయిత కేంద్రమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో కలిసిరాని రాజకీయ పార్టీల వైఖరి కారణంగా ఈ బిల్లు పలు పర్యాయాలు వాయిదాలు పడుతూ ఎట్టకేలకు 27 సంవత్సరాల తర్వాత మోదీ చొరవతో 2023లో పార్లమెంట్ ఆమోదం పొంది చట్టంగా రూపొందింది. అయితే జనగణన, డీలిమిటేషన్ వంటి ప్రక్రియలను దాటాలి కనుక 2029 నుంచి మాత్రమే ఈ చట్టం అమలులోకి రాగలదు. కానీ చట్టం అమలయ్యే వరకు వేచి చూడకుండా, పార్టీల పరంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు ఇవ్వొచ్చు కదా? అని ప్రశ్నించుకొంటే అందుకు జవాబు దొరకదు.అనేక దేశాలలో మహిళలకు లభించిన హక్కులు, స్వేచ్ఛ, ఇతర సామాజికపరమైన భద్రతలన్నీ ఉద్యమాలు, పోరాటాల కారణంగానే లభించాయి. మహిళల భాగస్వామ్యం పెరిగితే దేశ రాజకీయాల స్వరూపం మారుతుంది. బ్రిటన్‌కు చెందిన ‘వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ ఎకనమిక్స్ రీసెర్చ్’... మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాలలో ఆర్థికాభివృద్ధి ఎక్కువగా ఉందనీ, అక్కడి ప్రజలు సైతం తమ ప్రజాప్రతినిధి పనితీరు పట్ల ఎక్కువ సంతృప్తికరంగా ఉన్నారనీ వెల్లడించింది. ‘ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం’ అంటూ మాటల్లో మాత్రమే మహిళలను అందలం ఎక్కించడం కాకుండా, రాజకీయ పార్టీలు చిత్తశుద్ధితో వారికి సముచిత ప్రాతినిధ్యం అందించాలి. అప్పుడే సమాజం అభివృద్ధి పథంలో వడిగా ముందుకు సాగుతుంది. డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి -
ఈక్వల్ జర్నీ స్లోగా ఉంది
పని ప్రదేశాల నుండి బహిరంగ ప్రదేశాల వరకు ఎన్నో చోట్ల భద్రతప్రాపాముఖ్యతను గుర్తుతెస్తుంది... జాతీయ భద్రతా దినోత్సవం (National Safety Day). భద్రతా అవగాహన–అమలుకు అంకితమైన ‘నేషనల్ సేఫ్టీ వీక్’లో భాగంగా వివిధ రంగాలలో, వివిధ ప్రదేశాలలో, వివిధ కోణాలలో మహిళల భద్రతకు ఎదురవుతున్న సవాళ్లకు పరిష్కార మార్గాలు వెదకడం అత్యవసరం. అనివార్యం. వికసిత భారత్‌కు ఆయువు పట్టు... మహిళల శ్రేయస్సు, భద్రత...నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం భారతదేశంలో 15–49 సంవత్సరాల వయస్సు గల 30 శాతం మంది మహిళలు శారీరక, లైంగిక, గృహహింసను అనుభవిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన దేశంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల భద్రతకు అత్యంతప్రాపాధాన్యత ఇస్తున్నాయి.మహిళల భద్రత, భద్రతాప్రాపాజెక్ట్ల కోసం ప్రభుత్వం ‘నిర్బయ నిధి’ని ఏర్పాటు చేసింది. నిర్భయ నిధి కింద బ్యూరో ఆఫ్ పోలిస్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (బిపీఆర్ అండ్ డి) దర్యాప్తు అధికారులు,ప్రాపాసిక్యూషన్ అధికారులు, వైద్య అధికారులకు శిక్షణ ఇస్తారు. నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. లైంగిక దాడి సాక్ష్యాల సేకరణ(సెక్సువల్ అసాల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్) కిట్లను రాష్ట్రాలు, కేంద్రపాలితప్రాపాంతాలకు పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు.‘ఉమెన్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇండెక్స్’(డబ్ల్యూపీఎస్–2023)లో 177 దేశాల్లో మహిళల భద్రతలో మన దేశం నాలుగో స్థానంలో నిలిచింది. మొదటి రెండు స్థానాలను డెన్మార్క్, స్విట్జర్లాండ్ దక్కించుకున్నాయి. ఆఫ్గనిస్తాన్ అట్టడుగు స్థానంలో ఉంది.2022: మహిళలను లక్ష్యంగా చేసుకొని రాజకీయ హింసకుపాల్పడే టాప్10 దేశాల్లో భారత్ కూడా ఉంది. ఈ జాబితాలో 537 సంఘటనతో మెక్సికో అగ్రస్థానంలో ఉంది. 125 సంఘటనలతో మన దేశం 7వ స్థానంలో ఉంది.ఉమెన్ సేఫ్టీకి సంబంధించి వివిధ సంస్థలు ట్రైనింగ్ సెషన్స్ నిర్వహిస్తున్నాయి. ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలి నుంచి సేఫ్టీకి సంబంధించిన టిప్స్, సేఫ్టీకి సంబంధించిన గోల్డెన్ రూల్స్ చెప్పడం, యాప్స్‌ను పరిచయం చేయడం వరకు ఎన్నో చేస్తున్నారు. సెల్ఫ్–డిఫెన్స్‌కు సంబంధించి అపోహలను తొలగిస్తున్నారు. హక్కులను సాధించడానికి పోరాటపటిమ... అవకాశాలను అందుకోవడానికి ప్రతిభాపాటవాలు... సాధించి, అందుకున్న దాంట్లో స్థిరపడే చోటేపోరాటం... ఇవన్నీ అవసరం అవడానికి కారణం అభద్రత, రక్షణలేమి! అవి ఇన్నేళ్ల మహిళల ప్రయాణాన్ని మళ్లీ మొదటికే తీసుకొస్తాయేమోననే భయం వెంటాడుతోంది! తర్వాత తరాలను జీరో దగ్గర నిలబెట్టకుండా.. వాళ్లకో మైల్‌స్టోన్‌ను అందివ్వాలనేదే ఈతరం మహిళల ఆరాటం! అది విమెన్ ఫ్రెండ్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్లే సాధ్యం! ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రపోలీస్ శాఖ చేసిన, చేస్తున్న ప్రయత్నాలను వివరించారు తెలంగాణ సీఐడీ, విమెన్ సేఫ్టీవింగ్ ఏడీజీపీ శిఖాగోయల్ (Shikha Goel).ఏ రంగంలో అయినా మహిళాప్రాపాతినిధ్యం పెరిగితేనే మహిళలకు అనుకూలమైన వాతావరణం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. మొదటినుంచీ పురుషాధిపత్య రంగమైనపోలీస్ డిపార్ట్మెంట్లోనూ మహిళలప్రాతినిధ్యం పెరగాలి. ఇదివరకటితో పోలిస్తే పెరిగింది కూడా. అయినా జాతీయ స్థాయిలో చూస్తే వీరి సంఖ్య 25 శాతం కూడా లేదు. తెలంగాణపోలీస్ శాఖలో మహిళల సంఖ్య పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం 33 శాతం రిజర్వేషన్‌ను అమలు చేస్తోంది. దాంతో రాష్ట్రపోలీస్ శాఖలో మహిళల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2024లో రికార్డ్ స్థాయిలో 2,500 మంది మహిళలను అపాయింట్ చేశాం. అంటే దాదాపు 20 శాతం. ఎస్‌సీటీపీసీ ప్రోగ్రామ్ ద్వారా 2,338 మందిని తీసుకున్నాం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్ద బ్యాచ్ ఇది.పోలీస్ డిపార్ట్మెంట్లోకి మహిళలను ప్రోత్సహించడానికే ఇలాంటి ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్‌ని ఏర్పాటు చేశాం. మౌలిక సదుపాయాల కల్పనలోనూ కృషి జరుగుతోంది. అయినా ఈ రంగంలో స్త్రీ, పురుష సమానత్వాన్ని సాధించడానికి ఇంకా చాలా దూరమే ప్రయాణించాల్సి ఉంది. మహిళల నియామకాలను పెంచడంలో చిత్తశుద్ధి ప్రయత్నాలతోపాటు జెండర్పాలసీ, మహిళలకు లీడర్షిప్ ట్రైనింగ్స్ అనేవీ చాలా అవసరం. ఇన్ని అవాంతరాల మధ్య కూడా గుర్తించదగిన విజయాన్నే సాధిస్తున్నాం.భద్రతా నగరాల్లో ఒకటిగా...మహిళా భద్రత, రక్షణ కేవలం బహిరంగ ప్రదేశాలకే పరిమితమైంది కాదు. ఇంటి నుంచి మొదలు స్కూల్, వర్కింగ్ ప్లేస్, ట్రాన్స్΄ోర్ట్ ఇలా అన్ని చోట్లా సమస్యగానే ఉంది. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత, రక్షణకు పెద్ద పీట వేస్తోంది. షీ టీమ్స్, భరోసా సెంటర్స్, సాహస్, సీడీఈడబ్ల్యూ (డొమెస్టిక్ వయొలెన్స్) కౌన్సెలింగ్ సెంటర్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, చట్టాలను కఠినంగా అమలుపరచడం, నిర్భయ ఫండ్స్‌తో అధునాతన నిఘా పరికరాలు, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ సెంటర్స్, హెల్ప్‌లైన్స్ వంటివాటితో భద్రత, రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేశాం. దీంతో మహిళ లు నిర్భయంగా బయటకు వచ్చి.. తమకు నచ్చిన రంగంలో రాణించే వాతావరణం ఏర్పడింది. కిందటేడు మార్చిలో టీ సేఫ్ సర్వీస్నుప్రాపారంభించింది ప్రభుత్వం. ఇది చదువు, స్త్రీల హక్కులు, చట్టాల గురించి అమ్మాయిల్లో అవగాహన కల్పించడం, అలాగే మహిళలను గౌరవించాలనే స్పృహను అబ్బాయిల్లో కలిగించడం వంటి కార్యక్రమాలను చేపడుతూ సమాజంలో మహిళల మీద జరుగుతున్న హింసను తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తోంది. వీటన్నిటి వల్లే తెలంగాణ ఈరోజు దేశంలోనే అత్యధిక వర్కింగ్ విమెన్ ఉన్న రాష్ట్రంగా, హైదరాబాద్.. దేశంలోకెల్లా భద్రతా నగరాల్లో ఒకటిగా నిలిచాయి. సవాళ్లు...ఇంత చేస్తున్నా ఇంకా చాలామంది మహిళల్లో తమ హక్కులు, చట్టాల విషయంలో పూర్తి అవగాహన రాలేదు. దీనివల్ల గృహహింస, పనిప్రదేశాల్లో లైంగికవేధింపులు వంటివాటి మీద ఫిర్యాదు చేయడం లేదు. అవగాహన ఉన్నవారు కూడా వెనుకడుగు వేస్తున్నారు పరువు, ప్రతిష్ఠ లాంటి భయాల వల్ల. ఇవన్నీ మహిళల భద్రత, రక్షణకు అడ్డంకులుగా మారుతున్నాయి. అయినాపోలీస్ శాఖ అలుపెరగని ప్రయత్నం చేస్తోంది.మనమే క్రియేట్ చేసుకోవాలి...ఏ రంగంలో మహిళలు మైనారిటీగా ఉంటారో ఆ రంగంలో సవాళ్లు తప్పనిసరి. అయితే వాటికి భయపడకుండా మన స΄ోర్ట్ సిస్టమ్‌ను మనమే రూ΄÷ందించుకోవాలి. దాన్ని విజయానికి సోపానంగా మలచుకోవాలి.ప్రాపాధాన్యాలను గ్రహించి.. దానికి అనుగుణంగా పనిచేసుకుపోవడమనేది కూడా ఒక నైపుణ్యంగా మారుతుంది.ప్రాపాధాన్యాలను గ్రహిస్తూ వర్క్– లైఫ్ బ్యాలెన్స్‌ని ఒక స్కిల్లా డెవలప్ చేసుకోవాలి. -శిఖాగోయల్డిజిటల్ థ్రెట్‌ను ఢీ కొట్టాలిట్రెడిషినల్ ముప్పుకు అదనంగా ఈ–థ్రెట్స్ సోషల్‌మీడియా రాకతో మరింత పెరుగుదల భయం వీడితేనే నేటి మహిళకు పూర్తి భద్రత బాధితుల వివరాల గోప్యతకుపోలీస్ భరోసా ‘సోషల్ మీడియా సహా డిజిటల్ ప్రపంచం మానవ జీవితాల్లోకి చొచ్చుకుపోయింది. ఆపై దాని వల్ల ముంచుకొస్తున్న ముప్పును తెలుసుకున్నాం. ఇప్పుడు నిరోధక మార్గాలు అన్వేషిస్తున్నాం. నేటి మహిళకు పెను సవాల్‌గా మారిన డిజిటల్ థ్రెట్‌ను సమర్థంగా ఢీ కొట్టాలి. ఇబ్బంది ఎదురైనప్పుడు ధైర్యంగా ఫిర్యాదు చేయాలి’... అన్నారు సీనియర్ ఐపీఎస్ అధికారి, హైదరాబాద్ నేర పరిశోధన విభాగం డీసీపీ ఎన్.శ్వేత. మహిళల భద్రతపై ఆమె ‘సాక్షి’తో మాట్లాడుతూ పలు కీలకాంశాలు వివరించారు.వేధింపులు పరిధి దాటాయిప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా పని చేస్తున్నారు. ఆమెకు ఏళ్లుగా ఎదురవుతున్న వేధింపులు, గృహహింస తదితరాలను ట్రెడిషనల్ థ్రెట్‌గా చెప్పుకోవచ్చు. నేటి మహిళ వీటిని చాలా వరకు సమర్థంగా ఎదుర్కొంటోంది. ఫలానాప్రాపాంతం లో ఈవ్ టీజింగ్ చేసేపోకిరీలు ఉన్నారని తెలిస్తేపోలీసులకు ఫిర్యాదు చేస్తాం లేదా ఆ వైపు వెళ్లకుండా జాగ్రత్త పడతాం. అయితే డిజిటల్ థ్రెట్‌కు, సైబర్పోకిరీలకుప్రాపాంతం, పరిధి అంటూ ఉండవు.ముప్పును పట్టించుకోవట్లేదుడిజిటల్ మీడియాను మహిళలు, యువతులు ఓ మంచి ఎక్స్ప్రెషన్ లాట్ఫాంగా వినియోగించుకుంటున్నారు. తమ అభిప్రాయాలు, అభిరుచులను అక్కడ స్వేచ్ఛగా వెలిబుచ్చుతున్నారు. తద్వారా వేల మందికి సుపరిచితులుగా మారిన, ఆర్థికంగా నిలదొక్కుకున్న అతివలూ ఎందరో ఉన్నారు. అయితే ఈ ఎక్స్ప్రెషన్లో అంతర్లీనంగా ఉన్న ముప్పును గుర్తించలేక΄ోతున్నారు. ఫలితంగా అనేక మంది మహిళలు ఫిజికల్‌గా, వర్చువల్‌గా, ఎమోషనల్‌గా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జాగ్రత్తలను విస్మరిస్తున్నారుస్వభావ సిద్ధంగానే మహిళలు బాహ్య ప్రపంచంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. తొందరగా అపరిచిత వ్యక్తులతో మాట్లాడరు. నమ్మకం కలిగే వరకు అభిరుచులు పంచుకోవడం మాట అటుంచి కనీసం తమ పేరు కూడా చెప్పరు. రియల్ వరల్డ్‌లో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా... వర్చువల్ వరల్డ్‌లో మాత్రం తొందరపడుతున్నారు. హాయ్, హలోతో మొదలైన ఈ పరిచయాలు వ్యక్తిగత ఫొటోలు షేర్ చేసుకునే వరకు వెళుతున్నాయి. ఇవే కొన్నిసార్లు విపరీత పరిణామాలకు కారణం అవుతున్నాయి.వీరి భయమే వారికి ధైర్యండిజిటల్ థ్రెట్‌కు లోనైన మహిళలు, యువతులు ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయట్లేదు. కుటుంబం, సమాజం, వ్యక్తిగత జీవితం.. ఇలా అనేక అంశాలను ఊహించుకుని భయపడుతున్నారు. ఈ భయమే ఎదుటి వారికి ధైర్యం అవుతోంది. మరింత రెచ్చి΄ోతూ బ్లాక్మెయిల్ చేసే స్థాయికి వెళుతున్నారు. మీ పరువు అనేది మీ చేతుల్లో, మీ ప్రవర్తనలోనే ఉంటుందని గుర్తుంచుకోండి. నట్టింట్లో, నడివీధిలోనే కాదు... ‘నెట్’ఇంట్లోనూ బాధితురాలిగా మారిన అతివకు అన్ని ఏజెన్సీలు అండగా ఉంటాయి. వీళ్లు తమకు సమస్యలు ఉన్నాయని ఒప్పుకోవాలి. ధైర్యంగా ముందుకువచ్చిపోలీసులతోపాటు సంబంధిత ఏజెన్సీలకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు ఎక్కడైనా చేయవచ్చుమీరు ఏప్రాపాంతంలో ఉన్నప్పటికీ మరేప్రాపాంతంలో అయినా ఏ ఏజెన్సీకి అయినా ఫిర్యాదు చేయవచ్చు. కేసు నమోదు చేసిన వాళ్లే దర్యాప్తు చేయడమో, సంబంధితప్రాపాంతానికి బదిలీ చేయడమో జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బా«ధితుల పేర్లు, వివరాలు బయటకు రాకుండా గోప్యతపాటిస్తారు. ఈ విషయంలో న్యాయస్థానాలు సైతం బాధితులకు పూర్తి అండ, సహాయసహకారాలు అందిస్తుంటాయి. టెక్నాలజీని వాడుకోవాలి, విచక్షణతో ముందుకు వెళ్లాలి. – ఎన్.శ్వేత. డీసీపీ నేర పరిశోధన విభాగం, హైదరాబాద్ -
‘సగానికి’ భాగమిదేనా?
ఎంతో ఆత్రుతగా ఎదురు చూసిన బడ్జెట్ రానే వచ్చింది.. పేదలు, యువత, రైతులు, మహిళల అభివృద్ధే లక్ష్యంగా భావిస్తున్న ఈ ప్రభుత్వం జెండర్ బడ్జెట్లో ఆ దిశగా కేటాయింపులనూ పెంచామంటోంది. ఇక్కడొక మాట.. జెండర్ బడ్జెట్ అనేది మహిళల కోసం ప్రత్యేకమైంది కాదు. కానీ వార్షిక బడ్జెట్లోనే లింగసమానత్వం, మహిళా ప్రగతికి ప్రత్యేక నిధులు ఇస్తుంది వివిధ శాఖలు, విభాగాలలో బాలికలు, మహిళలకున్న సంక్షేమ పథకాలకు పూర్తిగా లేదా పాక్షిక కేటాయింపులతో! ఈ లెక్కన ఈ ఆర్థిక సంవత్సరానికి ఈ బడ్జెట్లో జెండర్ బడ్జెట్ కింద రూ. 4.49 లక్షల కోట్లను కేటాయించింది ప్రభుత్వం. మొత్తం బడ్జెట్లో ఇది 8.86 శాతం. కిందటేడుతో పోలిస్తే 37 శాతం పెరిగింది. అంకెల్లో ఇది పెరిగినట్టు కనిపించినా దాన్ని శాఖలు, విభాగాల వారీగా విశ్లేషించాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.అన్ని మంత్రత్వ శాఖలు, విభాగాల కేటాయింపుల్లో స్త్రీ పక్షపాతమే చూపించామని... ఏకపక్షంగా నిధులు ఇచ్చామని... మహిళల ప్రగతి విషయంలో తమ దృక్పథంలో మార్పేమీ లేదు..అంటున్న ప్రభుత్వం మరి తగ్గించిన కేటాయింపులు, అసలు కేటాయింపులే చేయని వాటికి సమాధానమేం చెబుతుందని ప్రశ్నిస్తున్నారు ఆర్థిక విశ్లేషకులు. జెండర్ బడ్జెట్ కేటాయింపుల మీద తెలుగు రాష్ట్రాల్లోని పలు రంగాలకు చెందిన నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదుజెండర్ బడ్జెట్ అంటే ప్రత్యేకించి మహిళల ఆరోగ్యం, చదువు, ఉపాధి, రక్షణ, ఆంట్రప్రెన్యూర్షిప్కి సంబంధించి ఉండాలి. స్త్రీ, పురుష అసమానతలను తొలగించే దిశగా కేటాయింపులు చేయాలి. ఉదాహరణకు పదేళ్ల నుంచి జెండర్ బడ్జెట్‌ను పెడుతూ వస్తున్నారు. ఈ పదేళ్ల జెండర్ బడ్జెట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లెక్క ఎక్కడా లేదు. డిపార్ట్మెంట్ల వారీగా డిపార్ట్మెంట్ల డబ్బులను దామాషా పద్ధతిలో పంచి చూపిస్తుందే తప్ప మహిళల కోసం ప్రత్యేకమైన పథకాలు లేవు. మహిళల అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు, ప్రత్యేక పనివిధానం కోసం కేటాయించి.. ఆ లక్ష్య సాధనకే ఖర్చు చేసినప్పుడే అది జెండర్ బడ్జెట్ అవుతుంది. ఇది అయితే కాదు. – మల్లెపల్లి లక్ష్మయ్య, సీనియర్ జర్నలిస్ట్ ఇదీ చదవండి: బాల్యంలో నత్తి.. ఇపుడు ప్రపంచ సంగీతంలో సంచలనం! గర్భిణులు, తల్లుల కోసం పెట్టిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఊసే లేకుండా పోయింది. అన్నిటికన్నా ముఖ్యం అయినది.. మహిళల భద్రత, రక్షణ! ఇటీవలి కోల్‌కతా ఆర్.జి. కర్ ఆసుపత్రిలో యువ డాక్టర్ హత్యాచారం నేపథ్యంలో ఇకనైనా ప్రభుత్వాలు మహిళల భద్రత, రక్షణను యుద్ధ్రపాతిపదికన తీసుకుంటాయని, కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని బడ్జెట్లో కేటాయింపుల రూపంలో చూపిస్తుందని ఆశపడ్డ వారికి నిరాశే ఎదురైంది. ఈ ఏడు నిర్భయ ఫండ్ కింద కేటాయించింది కేవలం రూ. 30 కోట్లే! ఇది పెట్టిన తొలినాళ్లలో దీనికి వెయ్యి కోట్ల రూపాయలను కేటాయించిన ప్రభుత్వాలు.. అంతకంతకు పెరుగుతున్న నేరాల దృష్ట్యా ఈ నిధులను పెంచాల్సింది పోయి రెండంకెలకు కుదించడం మహిళల భద్రత, రక్షణ పట్ల వాటికున్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది.ఇంకొంత కసరత్తుఈ ఏడు జెండర్ బడ్జెట్‌కు కేటాయింపులు పెరిగాయి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం పలు పథకాల అమలుకు రూ. 3 లక్షల కోట్లకు పైగా నిధులను కేటాయించారు. మహిళా సాధికారత కోసం మిషన్ శక్తి కింద రూ.3,150 కోట్లకు పెంచారు. బేటీ బచావో – బేటీ పఢావో, వన్‌స్టాప్ కేంద్రాలు, నారీ అదాలత్‌లు, మహిళా సహాయవాణులు, మహిళా పోలీసు వాలంటీర్లకు రూ. 628 కోట్లు కేటాయించారు. ఇవన్నీ బాగానే ఉన్నాయి. కానీ మహిళల భద్రత– రక్షణ కోసం, స్త్రీ, పురుష అసమానతలను రూపుమాపే దిశగా బడ్జెట్ పరంగా ఇంకొంత కసరత్తు జరగాల్సింది. – మల్లవరపు బాల లత, మాజీ డిప్యూటీ డైరెక్టర్, రక్షణ మంత్రిత్వశాఖనిజాయితీతో కూడిన మద్దతు అవసరంమహిళలకు వంద శాతం నిధులు కేటాయించవలసిన ’కేటగిరీ–ఎ’లో 23.5 శాతం మంది మాత్రమే లబ్ధిదారులున్నారు. మెజారిటీ కేటాయింపులు మహిళా లబ్ధిదారులు తక్కువ ఉండే ఇతర పథకాలకు తరలుతున్నాయి. తక్షణ ఫలితాలనిచ్చే బాలికల విద్య, ఉన్నతికి కేటాయించిన నిధులు ఆయుష్మాన్ భారత్ వంటి దీర్ఘకాలిక పథకాలకు తరలిస్తున్న సందర్భాలున్నాయి. సిసలైన మహిళా సాధికారతకు, అభివృద్ధికి రాజకీయ ఉపన్యాసాలకన్నా నిజాయితీతో కూడిన రాజకీయ మద్దతు చాలా అవసరం.– డా. సమున్నత, వైస్ ప్రిన్సిపల్కామర్స్ కాలేజి, ఉస్మానియా యూనివర్సిటీపెద్దగా మార్పు కనపడలేదు2047 కల్లా దేశాన్ని వికసిత్ భారత్.. అంటే అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని ప్రధాని లక్ష్యం. అదీ మహిళల నేతృత్వంలోనే జరగాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో మొదటిసారి మహిళా ఆంట్రప్రెన్యూర్స్ కోసం రెండు కోట్ల రూపాయలను కేటాయించారు. ఇది శుభపరిణామం. మొత్తంమీద మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెరిగినా ప్రత్యేకించి మహిళల కోసమే ఉన్న కేటాయింపుల్లో పెద్దగా మార్పు కనపడలేదు. అంటే జెండర్ ఈక్వాలిటీ, మహిళల అభివృద్ధికి చేపట్టిన పథకాల మీద కేటాయింపులను పెంచలేదు. ఆ విషయంలో కొంత అసంతృప్తి ఉంది. – ప్రియ గజ్దార్, చైర్పర్సన్, ఎఫ్ఎల్ఓ హైదరాబాద్శ్వేతపత్రం విడుదల చేయాలిస్త్రీ పక్షపాతినని చెప్పుకుంటున్న ప్రభుత్వం జనాభా నిష్పత్తిలో బడ్జెట్ కేటాయించాలి కదా! అసలు ఆ మాటకొస్తే పదిహేనేళ్లుగా జనాభా లెక్కలే లేవు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు స్త్రీలకు కేటాయించింది ఎంత? అందులో ఖర్చు పెట్టింది ఎంత? ఇంకెంత బాకీ ఉంది? అన్న దాని మీద శ్వేతపత్రం విడుదలచేయాలి. అప్పుడు తెలుస్తుంది ప్రభుత్వాలకున్న చిత్తశుద్ధి! – ఝాన్సీ గడ్డం, నేషనల్ కన్వీనర్, దళిత్ స్త్రీ శక్తి – సరస్వతి రమ -
కంటిపాపలకు కనురెప్పలా...
‘స్వావలంబన దిశగా భవిష్యత్’ అనే థీమ్‌ను నిర్ణయించారు. నేటి బాలికలు భద్రంగా ఉంటేనే భవిష్యత్ సాధికారత సాధ్యమవుతుంది! ఆ భద్రతే నేడు అతి పెద్ద సమస్య! సమస్య ఆలోచనలను రేకెత్తిస్తుంది.. వినూత్న ఆవిష్కరణలు ఆకారం దాల్చేలా చేస్తుంది!అలాంటి యువ ఆవిష్కర్తలనే ఇక్కడ పరిచయం చేయబోతున్నాం.. ఆడపిల్లల భద్రత కోసం వారు రూ΄పొందించిన డివైజెస్‌తో!గణేశ్ రూరల్ ఇన్నోవేటర్. సైన్స్ అండ్ టెక్నాలజీలో అయిదు ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్‌ను సాధించాడు. గణేశ్ ఘనత గురించి తన ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ కూడా ప్రస్తావించారు. కట్టెల΄పొయ్యి మీద వంట చేస్తున్నప్పుడు ఆ ΄పొగను తట్టుకోలేకపోతున్న అమ్మ అవస్థను చూసి ఆమె కోసం తన పదకొండేళ్ల వయసులోనే హ్యాండ్ ఫ్యాన్ తయారు చేసి ఇచ్చాడు. ఆనాడు మొదలైన ఆ ప్రస్థానం నేడు 30కి పైగా ఆవిష్కరణలకు చేరుకుంది. అందులోదే బాలికల భద్రత కోసం రూ΄పొందించిన సంస్కార్ టాయ్. పిల్లలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాలంటే వారిని ముట్టుకునే చెప్పాల్సి వస్తోంది. వారిని తాకకుండా.. దూరంగానే ఉంటూ చెప్పడమెలా అన్న అతని ఆలోచనకు పరిష్కారమే ‘సంస్కార్ టాయ్’. దీనిపేరు ఆద్య. ఇది మాట్లాడే బొమ్మ. ఆద్యను ఛాతీ ప్రాంతంలో తాకామనుకో.. ‘అక్కడ తాకకూడదు’ అంటూ హెచ్చరిస్తుంది. ఇలా శరీరంలో ఏ స్పర్శ తప్పో.. ఏ స్పర్శ భద్రమో.. ఆద్యను టచ్ చేస్తూ తెలుసుకోవచ్చన్నమాట. భద్రమైన చోట కూడా తాకడం నచ్చకపోతే ఐ మే నాట్ లైక్ అని చెప్పచ్చని చెబుతుంది. అంతేకాదు ఆపదలో ఉన్నప్పుడు ఏం చేయాలో కూడా చెబుతుంది.హెల్ప్‌లైన్ నంబర్లను వల్లె వేస్తుంది. సైబర్ క్రైమ్ గురించి, డ్రగ్స్ హాని గురించీ హెచ్చరిస్తుంది.‘సంస్కార్ టాయ్’ లో బాయ్ వర్షన్ కూడా ఉంది. పేరు ఆదిత్య. అబ్బాయిలకూ అవన్నీ చెబుతుంది. అదనంగా ఆడపిల్లలతో ఎలా మెసలుకోవాలో కూడా చెబుతుంది. అంతేకాదు చూపు, వినికిడి లోపాలున్న పిల్లలకూ సంస్కార్ టాయ్ ఉంది. చూపు లోపం ఉన్నవారికి వైబ్రేట్ అవుతూ టీచ్ చేస్తే, వినికిడి లోపం ఉన్న వాళ్లకు రెడ్, గ్రీన్, ఆరెంజ్ లైట్స్‌తో బోధిస్తుంది. గణేశ్ ఈ బొమ్మను రూపొందించిన (2021) నాటి నుంచి నేటి వరకు తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది, ఉత్తరాది కలుపుకుని మొత్తం అయిదు రాష్ట్రాల్లో, 65 వేల మంది విద్యార్థులకు భద్రత మీద అవగాహన కల్పించే ప్రయత్నం చేశాడు. కొన్ని స్కూల్స్‌కి ఉచితం గానే సేవలందించాడు. త్వరలోనే ఎల్ఎల్ఎమ్ మాడ్యూల్స్‌తో అప్డేట్ అవుతూ ‘సంస్కార్ 2.0’పేరుతో హ్యుమనాయిడ్ రోబోను తయారు చేస్తున్నాడు. ఇది పిల్లలతో ఇంటరాక్ట్ అవుతుంది. ‘చిన్నప్పటి నుంచీ నాకు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వెన్షన్స్ అంటే ఇష్టం. దీనికి సంబంధించి నాకు ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏమీ లేదు. యూట్యూబ్ చూసే నేర్చుకున్నాను. ఇన్నోవేటివ్ మైండ్‌సెట్ ఉన్నవాళ్లకు ఓ ΄్లాట్‌ఫామ్ తయారు చేయాలన్నదే నా లక్ష్యం. అందుకే ‘సంస్కార్ ఎలక్ట్రానిక్స్’ అనే స్టార్టప్ పెట్టాను. సామాజిక బాధ్యతే నా ప్రధాన ఆశయం! ఆసక్తి ఉన్న విద్యార్థులకి ఫ్రీగానే ట్రైనింగ్ ఇస్తున్నాం. సంస్కార్ టాయ్ తయారు చేయడానికి సైకాలజిస్ట్స్, సైకియాట్రిస్ట్స్, పిల్లల హక్కులు – భద్రత కోసం పనిచేస్తున్న ఎన్జీవోలు వంటి వాళ్లందరినీ కలిసి, రీసెర్చ్ చేసి ఒక కాన్సెప్ట్‌ను తయారు చేసుకున్నాం. మళ్లీ దాన్ని వాళ్లందరికీ చూపించి.. ఓకే అనుకున్నాకే టాయ్‌ని డెవలప్ చేశాం’ అని సంస్కార్ టాయ్ వెనకున్న తన శ్రమను వివరించాడు గణేశ్.సంస్కార్ టాయ్ఆవిష్కర్త: యాకర గణేశ్, వయసు: 25 ఏళ్లు, ఊరు: వరంగల్ జిల్లా, నందనం గ్రామం, తెలంగాణ!తల్లిదండ్రులు: స్వరూప, చంద్రయ్య. వ్యవసాయ కూలీలు. ఇంకా.. తెలంగాణ, వికారాబాద్‌కు చెందిన సానియా అంజుమ్.. ఆడపిల్లల భద్రతకు ‘షీ (ఫర్ అజ్)’ అనే వినూత్న ఆలోచన చేసింది. పీరియడ్స్ టైమ్‌లో ఆడపిల్లల అవసరాలను తీర్చే అన్ని ఎక్విప్మెంట్స్తో ప్రతి స్కూల్లో ప్రత్యేకంగా ఓ గదిని ఏర్పాటు చేయాలనేదే‘ షీ’ కాన్సెప్ట్. మంచిచెడులను గైడ్ చేయడానికి, ధైర్యం కోల్పోకుండా అమ్మాయిలను మోటివేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్, టీచర్స్‌తో కలిపిన ఒక బృందం, అలాగే క్రమం తప్పకుండా గైనకాలజిస్ట్ విజిట్స్‌ను ఏర్పాటుచేయాలనేది ‘షీ’ ఉద్దేశం! హైదరాబాద్‌కు చెందిన హరీష్ గాడీ అనే అబ్బాయి.. ఎలక్ట్రానిక్ సెక్యూరిటీ బ్యాంగిల్‌ని తయారుచేశాడు. ఇది మామూలు గాజునే పోలి ఉంటుంది. దీన్ని వేసుకుంటే.. దాడి చేసిన వాళ్లకు ఆ గాజు తగిలి షాక్‌నిస్తుంది. అంతేకాదు అందులో ఫీడ్ అయి ఉన్న నంబర్లకు మీరున్న లొకేషన్ కూడా వెళ్తుంది. దీన్ని కనిపెట్టినందుకు హరీష్‌కి ఇంటర్నేషనల్ ఇన్నోవేషన్ ఫెయిర్ (2019) లో గోల్డ్ మెడల్ వచ్చింది. ఆదిలాబాద్‌కు చెందిన ఎ. సాయి తేజస్వి ‘గర్ల్ సేఫ్టీ డివైస్’ను కనిపెట్టింది. చాలా తేలికగా ఉండే ఈ పరికరాన్ని కాలికి కట్టుకొని స్టార్ట్ బటన్ నొక్కేయాలి. ఎమర్జెన్సీ టైమ్‌లో యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని టచ్ చేసిన వాళ్లకు షాక్‌నిస్తుంది. దాంతో దుండగులు మిమ్మల్ని ముట్టుకునే సాహసం చేయరు. సికింద్రాబాద్‌కు చెందిన వైష్ణవి చౌధరీ, మనోజ్ఞ సిద్ధాంతపు, నక్షత్ర పసుమర్తి.. ఈ ముగ్గురూ కలిసి ‘మహిళా సురక్షా బ్యాండ్’ను తయారుచేశారు. ఇది కూడా ఎవరైనా మీ మీద దాడికి పాల్పడితే వాళ్లకు షాక్‌నిస్తుంది. పెద్దగా డేంజర్ అలారమ్‌ని మోగిస్తుంది. మీరు ఆపదలో ఉన్న సందేశంతోపాటు మీ లొకేషన్‌నీ అందులో ఫీడైన నంబర్లకు షేర్ చేస్తుంది. ఈ డివైస్ చూడ్డానికి స్టయిలిష్‌గానూ ఉంటుంది. ఇలా అమ్మాయిల భద్రత కోసం యువత తమ వంతు ప్రయత్నాలు చేస్తోంది. మహిళల సాధికారతకు మద్దతునిస్తోంది. బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు→ గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. → అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూ ప్రోత్సహిస్తోంది. → ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. → గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! → ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. → బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్ఆవిష్కర్త: ఎస్. పూజ, చదువు: బీటెక్ సెకండియర్, ఊరు: కరీంనగర్ జిల్లా, మానకొండూరు, తెలంగాణ. తల్లిదండ్రులు: సుమిత్ర (గృహిణి), రమేశ్ (బైక్ మెకానిక్). వయసుతో సంబంధం లేకుండా స్త్రీల మీద జరుగుతున్న దాడులు, వాళ్లకు భద్రత, రక్షణ లేకపోవడం వల్ల చాలామంది అమ్మాయిలు చదువుకు దూరమవడం వంటివన్నీ వినీ, చూíసీ చలించిపోయింది పూజ. తనకు చేతనైనంతలో ఆ సమస్యకో పరిష్కారం కనిపెట్టాలనుకుంది. అదే ‘విమెన్ సేఫ్టీ హెయిర్ రబ్బర్ బ్యాండ్!’ ఇదెలా పనిచేస్తుందంటే.. జడకు మామూలు రబ్బర్ బ్యాండ్‌ని ఎలా పెట్టుకుంటారో దీన్నీ అలాగే పెట్టుకోవాలి. ఆపద ఎదురైనప్పుడు ఆ రబ్బర్ బ్యాండ్‌ను నొక్కితే చాలు.. వెంటనే పోలీస్ హార్న్ సౌండ్ వస్తుంది. ఆ శబ్దానికి భయపడి ఈవ్‌టీజర్స్, దుండగులు పారిపోతారు. ఒకవేళ వాళ్లు వెళ్లకుండా ఇంకా ఇబ్బంది పెడుతుంటే.. ఆ బ్యాండ్ ను మరొకసారి నొక్కాలి. అప్పుడు ఆ ప్రదేశానికి దగ్గరలో ఉన్న షీ టీమ్ ఆఫీస్‌కి ‘ఆపదలో ఉన్నాను.. రక్షించండి..’అన్న వాయిస్ మెసేజ్ వెళ్తుంది. అంతేకాదు, మీరున్న లైవ్ లొకేషన్‌నూ చూపిస్తుంది. వాటి ఆధారంగా షీ టీమ్ అలర్ట్ అయ్యి రక్షిస్తారు. ‘సమాజంలో అమ్మాయిలకు భద్రత, రక్షణ లేక వాళ్లు చాలా రంగాల్లోకి అడుగుపెట్టలేక పోతున్నారు. శక్తిసామర్థ్యాలున్నా రాణించలేకపోతున్నారు. ఆమె లక్ష్యానికి భద్రత, రక్షణలేములు ఆటంకాలు కాకూడదు అనిపించి ఈ హెయిర్ రబ్బర్ బ్యాండ్‌ను తయారు చేశాను’ అని చెబుతుంది పూజ.బాలికలకు మన దగ్గరున్న న్యాయపరమైన హక్కులు∙గర్భస్థ పిండం ఆడ, మగ అని తెలుసుకోవడం నేరం. తెలుసుకుని ఆడ శిశువును గర్భంలోనే చంపేయడం మరింత నేరం. ∙అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు చదువుకునే హక్కుంది. ద రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, 2009.. ఆరు నుంచి పద్నాలుగేళ్ల పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య హక్కును కల్పిస్తోంది. ఇది పిల్లలందరికీ వర్తిస్తున్నా.. బాలికా విద్యనూప్రోత్సహిస్తోంది. ∙ ఆడపిల్లలు సహా పిల్లలందరికీ సురక్షిత వాతావరణంలో పెరిగే హక్కుంది. ∙ గృహ హింస చట్టం మహిళలకే కాదు బాలికలకూ వర్తిస్తుంది. ఆడపిల్లల మీద కుటుంబ సభ్యులు ఎలాంటి శారీరక, భావోద్వేగ, లైంగిక, ఆర్థిక వేధింపులు, హింసకు పాల్పడినా అది నేరమే! ∙ ‘స్త్రీ ధన్’ పేరుతో అమ్మాయిలకు స్థిర, చరాస్తుల్లో హక్కుంటుంది. అంతేకాదు వారసత్వంగా వచ్చే ఆస్తిలోనూ అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలకు హక్కు ఉంటుంది. ∙ బాల్య వివాహాల నిరోధక చట్టం ప్రకారం.. పద్దెనిమిదేళ్లు నిండని అమ్మాయిలకు పెళ్లి చేయడం నేరం. ∙ ఇంటా.. బయటా.. ఎక్కడైనా అమ్మాయిలను లైంగిక వేధింపులకు గురిచేయడం, లైంగిక దాడితోపాటు వారి మీద అసభ్యపదజాలాన్ని ఉపయోగించడం, అసభ్యకరమైన సంజ్ఞలు చేయడం, అసభ్యకరమైన చిత్రాలు చూపించడం, ప్రైవేట్ పార్ట్స్ తాకడం వంటివన్నీ నేరాలే! ఇలాంటి వాటిని అరికట్టేందుకు పిల్లలందరి (బాలికలు సహా) కోసం పోక్సో అనే ప్రత్యేక చట్టమే ఉంది.– సరస్వతి రమ -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు: ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ(YSRCP) మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కళ్యాణి (Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె.. హోం మంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు, బెల్ట్ షాప్‌లు, గంజాయి, కొకైన్ వంటి మాదకద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.వరుదు కళ్యాణి ఇంకా ఏం మాట్లాడారంటే..:మహిళలకు భద్రత లేదు: రాష్ట్రంలో మహిళలు ఇంట్లో ఉన్నా, బయటకు వెళ్ళినా రక్షణ లేని పరిస్థితి నెలకొంది. పాఠశాలలకు వెళ్ళే విద్యార్ధులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయంతో రోజులు గడపాల్సిన దుస్థితి నెలకొంది. ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు. భీమిలి నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపైన మద్యం తాగిన దుండగుడు అత్యాచారం చేశాడు. అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్ళి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు.తిరుపతి జిల్లా సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పని చేస్తున్న మహిళలపై దౌర్జన్యం చేశాడు. కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాధమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్ లో చదువుతున్న విద్యార్థినులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. కేవలం రోజుల వ్యవధిలోనే ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉంటే, ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు. మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు.గతంలో జగన్‌గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కొత్తగా ఎటువంటి వ్యవస్థను తీసుకు రాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండుమూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి. ఇవి ప్రభుత్వం చెబుతున్న లెక్కలు. దీనికి ప్రధానంగా మద్యం ఏరులై పారుతోంది. 50వేలకు పైగా బెల్ట్‌షాప్‌లు రాష్ట్రంలోని మారుమూల గ్రామాల్లో కూడా వెలిశాయి. ఇటీవల సంక్రాంతి పండుగ సంబరాల్లో ఇష్టారాజ్యంగా బెల్ట్‌షాప్‌లు నిర్వహించినా ప్రభుత్వం పట్టించకోలేదు. ఎనీటైం మద్యం లభించే గ్రామాలు ఎన్నో ఉన్నాయి. ఈ మద్యం మత్తులో మందుబాబులు పట్టపగలే మహిళలపై దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటి వరకు నమోదైన జాతరలో ఎనబై శాతం మద్యం మత్తులో జరిగినవే.మాదక ద్రవ్యాల నియంత్రణలో చర్యలు ఏవీ?గంజాయిని వంద రోజుల్లో అరికడతామని చెప్పిన హోం మంత్రి తాను నివాసం ఉంటున్న విశాఖపట్నంలో ఉన్న కేజీహెచ్ లోనూ, విశాఖ జైలు ఆవరణలోనూ గంజాయిని పండిస్తుంటే ఏం చేస్తున్నారు? సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ గంజాయి సాగు జరుగుతోంది. హోం మంత్రి సొంత నియోజకవర్గం మీదుగా గంజాయి రవాణా జరుగుతోంది. సాక్షాత్తు స్పీకర్ చెప్పిన మాటల ప్రకారం విశాఖ కేంద్రంగా గంజాయి సాగు, రవాణా జరుగుతోంది. రాష్ట్రంలో అసమర్థమైన పాలన జరగుతోంది. మహిళా రక్షణపై నిత్యం హోం మంత్రి ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా కోడిపుంజులతో ఫోటోలు దిగడం, పోలీసుల పహారాలో కోడిపందాలు, బెల్ట్షాపల్ నిర్వాహణ కొనసాగించారు.హోం మంత్రినే స్వయంగా అలా చేస్తే ఇక అసాంఘిక శక్తులకు పట్టపగాలు ఉంటాయా? మరోవైపు ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న జిల్లాలోనే రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కొకైన్ వంటి ప్రమాదకరమైన మాదకద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఇలాంటి పరిస్థితి ఉంటే మహిళల గౌరవానికి రక్షణ లేదు. రాష్ట్రంలోని పోలీసులను ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడానికి, ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెట్టేందుకే వినియోగించుకుంటున్నారు. చివరికి దావోస్ వెళ్ళిన మంత్రి నారా లోకేష్ అక్కడ కూడా తన రెడ్‌బుక్ రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నారు.దాడుల ఘటనల్లో బాధితులకు భరోసా ఏదీ?:యలమంచిలి ఏటికొప్పాకలో నాలుగేళ్ళ బాలికపై లైంగిక దాడి జరిగితే రాష్ట్ర హోం మంత్రి ఏమైనా స్పందించారా? మీ పక్క నియోజకవర్గం యలమంచిలిలో రాంబిల్లి గ్రామంలో ఒక యువతిని సురేష్ అనే నిందితుడు కత్తితో పొడిచి చంపేశాడు. ఈ సంఘటన జరిగి ఆరు నెలలు అయినా, నేటికీ హోమంత్రి ఆ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. ఆ కుటుంబానికి ఎటువంటి సాయం అందించలేదు. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధ్యతా యుతమైన ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ స్పందించి, ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్నారని తెలియగానే హడావుడిగా కూటమి ప్రభుత్వంలోని మంత్రులు అక్కడికి పరుగులు పెడుతుంటారు.ఇదీ చదవండి: కూటమి సర్కార్.. పరిశ్రమలకు శాపం: నాగార్జున యాదవ్ఎక్కడ తమకు చెడ్డపేరు వస్తుందోనని మాత్రమే వారు స్పందిస్తున్నారు తప్ప నిజంగా చిత్తశుద్దితో వారు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. బాధిత కుటుంబాలకు మేం అండగా ఉంటామనే భరోసాను కల్పించలేక పోతున్నారు. ఎంతసేపు రాజకీయాలు చేయడం, ఇసుక, మద్యం ఆదాయాన్ని పంచుకోవడం, సీఎం, డిప్యూటీ సీఎం అంటూ పదవులను పంచుకోవడంపైనే శ్రద్ద కనపరుస్తున్నారు. మధ్యం, మాదక ద్రవ్యాల కారణంగానే మహిళలపై దాడులు జరుగుతున్నాయి. అందుకే వెంటనే రాష్ట్రంలోని బెల్ట్షాప్లన్నింటినీ తొలగించాలని, మద్యం విక్రయాలను నియంత్రించాలని, లేని పక్షంలో బెల్ట్‌షాప్‌లను మహిళలే ధ్వంసం చేస్తారని వరుదు కళ్యాణి స్పష్టం చేశారు. -
తప్పు ఎవరిది? శిక్ష ఏమిటి?
దేశాన్ని అట్టుడికించిన కేసులో కోర్టు తీర్పు వెలువడింది. తీరా తీర్పు సైతం ఆ కేసులానే చర్చకు దారి తీస్తోంది. కోల్‌కతాలోని ఆర్.జి. కర్ ఆస్పత్రిలోని సెమినార్ గదిలో విశ్రాంతి తీసుకుంటున్న జూనియర్ డాక్టర్‌పై గత ఆగస్ట్ 9న జరిగిన దారుణ హత్యాచార ఘటనపై తాజా తీర్పు సహేతుకం కాదనే విమర్శ వినిపిస్తోంది. ఆస్పత్రిలో వాలంటీరైన సంజయ్ రాయ్ భారతీయ న్యాయ సంహిత లోని వివిధ సెక్షన్ల కింద నేరస్థుడంటూ శనివారమే కోర్ట్ ప్రకటించేసింది. కానీ, ఈ కేసులో అతనికి ఉరిశిక్ష బదులుగా యావజ్జీవ కారాగారవాస శిక్ష మాత్రమే విధిస్తున్నట్టు సియాల్డాలోని అడిషనల్ జిల్లా, సెషన్స్ కోర్ట్ సోమవారం తీర్పు చెప్పేసరికి మళ్ళీ తేనెతుట్టె కదిలింది. బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారే కాక, అటు కేంద్ర నేరదర్యాప్తు సంస్థ (సీబీఐ), ఇటు బాధితురాలి కుటుంబం సైతం నేరస్థుడికి ఉరిశిక్ష విధించాలంటూ వాదించింది. కానీ, అంతటి తీవ్ర శిక్ష విధించేందుకు హేతుబద్ధత లేదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం గమనార్హం. దాంతో, మహిళా లోకంలో, బాధిత, వైద్య వర్గాల్లో అసహనం కట్టలు తెంచుకుంది. సామాజిక మాధ్యమాల్లోని దృశ్యాలే అందుకు నిదర్శనం.హత్యాచారానికి గురైన ఆడకూతురు, ఆమె కుటుంబం బాధను ముగ్గురు ఆడపిల్లలకు తల్లినైన తాను అర్థం చేసుకోగలనంటూ నేరస్థుడి తల్లే స్వయంగా అనడం గమనార్హం. కన్నకొడుకైనా సరే నేరం రుజువైతే, శిక్ష పడాల్సిందేనని ఆ మాతృమూర్తి అన్న మాటలు జరిగిన ఘటన రేపిన భావోద్వేగాలను గుర్తు చేస్తుంది. పైపెచ్చు, ఆగస్ట్ 9 తర్వాత బెంగాల్లో అయిదు హత్యాచార ఘటనల్లో, మైనర్లపై దారుణానికి పాల్పడ్డ నేరస్థులకు ‘పోక్సో’ కోర్టులు ఏకంగా మరణశిక్షే విధించాయి. అందుకే, ఈ కేసులోనూ నేరస్థుడికి ఉరిశిక్ష పడుతుందనీ, పడాలనీ బలమైన భావన వ్యాపించింది. అయితే జరిగింది వేరు. బెంగాల్‌నే కాక అప్పట్లో భారత్ మొత్తాన్నీ కదిలించిన ఈ ఘటనలో బాధిత కుటుంబానికి రూ. 17 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలంటూ ప్రభుత్వాన్ని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే, ఈ ఘటన ఉరిశిక్ష విధించాల్సినంత అత్యంత అరుదైన కేసు ఏమీ కాదంటూ కోర్ట్ వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది. బెంగాల్ ఏలిక మమతా బెనర్జీ సైతం తీర్పుతో సంతృప్తికరంగా లేమంటూ కుండబద్దలు కొట్టేసి, తీర్పుపై హైకోర్టుకు వెళతామని తేల్చేశారు. సర్వసాధారణంగా నేరం తాలూకు తీవ్రత, సమాజంపై దాని ప్రభావం, నేరస్థుడి గత చరిత్ర, ప్రవర్తన లాంటివన్నీ మరణశిక్ష విధింపునకు ప్రాతిపదిక అవుతాయి. అయితే, గౌరవ న్యాయస్థానం తన ముందున్న సాక్ష్యాధారాలను బట్టి మాత్రమే ఎలాంటి తీర్పునైనా ఇస్తుంది. తీర్పు చెబుతూ న్యాయమూర్తి సైతం ఆ మాటే అన్నారు. అంతేతప్ప, మీడియాలో సాగుతున్న ప్రచారం సహా ఇతరేతర కారణాలను బట్టి శిక్షపై నిర్ణయం తీసుకోవడం జరగదు. కాబట్టి, తగినంత బలమైన సాక్ష్యాధారాలు లేనందు వల్లనే ఈ కేసులో నేరస్థుడికి కోర్ట్ మరణశిక్ష విధించలేదా అన్నది ఆలోచించాల్సిన అంశం. తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి వచ్చిన తర్వాత కానీ ఆ అంశంపై మరింత స్పష్టత రాదు. ఆస్పత్రి సిబ్బంది భద్రత కోసం పనిచేయాల్సిన వాలంటీర్ రాయ్ అసలు తన ఉద్యోగ ధర్మాన్నే మంటగలిపి, కాపాడాల్సిన డాక్టర్నే కాటేశాడన్నది చేదు నిజం. అతడు చేసిన నేరం ఘోరం, హేయమన్నదీ నిర్వివాదాంశం. అయితే, హత్యాచారానికి పాల్పడ్డ సదరు నేరస్థుడు జీవితంలో మారే అవకాశం లేదంటూ ప్రాసిక్యూషన్ బలంగా వాదించలేక పోయింది. ఆ మాటను నిరూపించలేక పోయింది. అది కూడా శిక్ష విషయంలో నేరస్థుడికి కలిసొచ్చిందని నిపుణుల మాట.కోల్‌కతా కేసు దర్యాప్తు ఆది నుంచి అనుమానాలకు తావివ్వడం దురదృష్టకరం. నిజానిజా లేమో కానీ, అత్యంత హేయమైన ఈ ఘటనలో శిక్షపడ్డ నేరస్థుడే కాక, ఇంకా పలువురి హస్తం ఉంద నేది అందరి నోటా వినిపిస్తున్న మాటే. స్థానిక పోలీసుల నుంచి చివరకు సీబీఐ చేతుల్లోకి దర్యాప్తు వెళ్ళినా జనంలో అనుమాన నివృత్తి కాలేదన్నది నిష్ఠురసత్యం. సీసీ టీవీ దృశ్యాల్లో 68 దాకా రాకపోకలు కనిపించినా, రాయ్ ఒక్కరినే గుర్తించారన్న ఆరోపణలే అందుకు సాక్ష్యం. పనికి మాలిన రీతిలో దర్యాప్తు జరిగిందనీ, పలుకుబడి గల బడాబాబులు తప్పించుకున్నారనీ, ఆఖరికి ఒకడే నేర స్థుడని తీర్మానించి యావజ్జీవ ఖైదుతో సరిపెట్టారనీ విమర్శలు వెల్లువెత్తడానికి కారణమూ అదే. ఆర్.జి. కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ సహా పలువురి వ్యవహారశైలి, ఆశ్రిత పక్ష పాతం, అవినీతి ఆరోపణలు, ఆస్పత్రి యంత్రాంగం పనితీరు, వగైరా... ఎన్నో ప్రశ్నల్ని ముందుకు తెచ్చాయి. సాక్ష్యాధారాల తారుమారు యత్నంలో ప్రిన్సిపాల్‌ను సీబీఐ అరెస్ట్ చేసినా, నిర్ణీత 90 రోజుల వ్యవధిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోయే సరికి నిష్పూచీగా ఆయన బయటకొచ్చారంటే మన నిఘా, దర్యాప్తు సంస్థలు ఎంత ఘనంగా పనిచేస్తున్నాయో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కీలకమైన మరో విషయం – ఈ ఘటనకు కారణమైన పరిస్థితులు. ప్రగతి బాటలో ముందున్నా మనే దేశంలో... పనిప్రదేశాల్లో సైతం మహిళలకు రక్షణ కొరవడడం, ఉద్యోగస్థలాలు స్త్రీలకు సురక్షితంగా లేకపోవడం శోచనీయం. కోల్‌కతా ఘటనతో పార్టీలు, ప్రజలు కదం తొక్కిన మాట నిజమే కానీ, ఇప్పటికైనా ఈ పరిస్థితుల్ని సమూలంగా మార్చాల్సిన అవసరం పాలకులకుంది. అవినీతి పంకిలమై, లోపభూయిష్ఠంగా నడుస్తున్న అనేక వ్యవస్థల్ని చక్కదిద్దాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లోనే కోర్టులు ఉన్నంతలో సత్వర న్యాయం అందించడం, ప్రజాభిప్రాయం కన్నా ప్రత్యక్ష సాక్ష్యాలే ప్రాతి పదికగా తీర్పులివ్వడం ఆహ్వానించదగ్గదే. అయితే, చాలా సందర్భాల్లో న్యాయం చెప్పడమే కాదు... న్యాయమే చేస్తున్నట్టు కనిపించడం ముఖ్యం. ఈ కేసులో అది జరిగిందా అన్నదే పలువురి ప్రశ్న. -
మహిళలు, బాలికలపై దాడులు పెరగడం సిగ్గుచేటు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహిళలు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. వారిపై గతంలోకంటే ఇప్పుడు దాడులు పెరిగా యని పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే రాష్ట్రంలో నేరాల రేటు 22.5 శాతం పెరిగిందన్నారు. అత్యాచార కేసులు 28.94 శాతం పెరిగాయని, ఏడాదిలో మొత్తం 2,945 కేసు లు నమోదయ్యాయని వివరించారు.మహిళలపై అఘా యిత్యాలకు సంబంధించి రాష్ట్రంలో రోజుకు సగటున 8 కేసు లు నమోదవుతున్నాయని, ఇందులో 82 శాతం మైనర్ బాలి కల అపహరణ కేసులు నమోదవడం సిగ్గుచేటని అన్నారు. ఇవన్నీ గమనిస్తే.. కాంగ్రెస్ పాలనలో మహిళలకు భద్రత లేదని స్పష్టమవుతోందని, ప్రజా భద్రత పూర్తిగా దిగజారిందని ఆయన ధ్వజమెత్తారు. అంబర్‌పేటలో రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ గంగారెడ్డి, ఆయన భార్య హత్య (నాలుగు నెలల క్రితం) కేసు ఇంకా పరి ష్కారం కాలేదని, ఆర్నెల్లక్రితం హత్యకు గురైన బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్‌రెడ్డి కేసులో కూడా నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.రాష్ట్రంలో 163కి పైగా ప్రధాన కేసులు ఇప్పటికీ పరిష్కారం కాలేదని, రూ.10 కోట్ల విలువైన ఆర్థిక మోసాలకు సంబంధించి రికవరీ జరగలేదని ఆక్షేపించారు. రాష్ట్రంలో నేరాల గుర్తింపు రేటు 31 శాతంగా ఉందని, ఈ విషయంలో బిహార్‌లాంటి రాష్ట్రాలతో పోటీపడే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఏదైనా ఘటన జరిగినప్పుడు గోల్డెన్ పీరియడ్ స మయాన్ని వృథా చేయడం వల్ల బాధితులకు న్యాయం జర గడం లేదని పేర్కొన్నారు. నిందితులు స్వేచ్ఛగా తిరుగు తున్న పరిస్థితి పోలీసుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు. హోంశాఖను కూడా నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం వల్ల తెలంగాణ పోలీసులకు ఉన్న మంచి నైపుణ్యాన్ని, శక్తిని కోల్పోతున్నారన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించడానికి సీఎం రేవంత్‌రెడ్డే కారణమని హరీశ్‌రావు అన్నారు.కాంగ్రెస్ పాలనలో విద్యార్థులు బతికితే చాలనుకుంటున్నారు: మాజీ మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో పిల్లలు ప్రాణాలతో బతికుంటే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆదివారం ఒక ప్రకటనలో అన్నారు. గురుకులాలు, కేజీబీవీలు, హాస్టళ్లలో పెడుతున్న బువ్వ తమ కొద్దని, ఇక్కడ తాము ఉండలేమంటూ విద్యార్థులు తల్లిదండ్రులను వేడుకుంటున్నారని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గురుకులాల దీనస్థితి చూస్తే బాసర సరస్వతి తల్లి మనసు తల్లడిల్లుతోందన్నారు.అనంతపేట్ కేజీబీవీలో విషాహారం తిని పదిమంది విద్యార్థులు ఆస్పత్రి పాలైన దుస్థితి బాధాకరమని, విషాహారం తిని వాంకిడి గురుకుల విద్యారి్థని మరణించిన ఘటన మరువకముందే ఇలాంటివి పునరావృతం కావడం సిగ్గుచేటని హరీశ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో జరుగుతున్న పోలీసుల ఆత్మహత్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్, సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్.. ఇలా స్వల్ప కాలంలో ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. పని ఒత్తిడి, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్లే పోలీసులపై తీవ్ర ప్రభావం పడుతోందని హరీశ్‌రావు తెలిపారు. -
భేష్ సుకన్య మేడమ్..! నాటి రాజుల పాలన..
ఆమె ఆగ్రా ఏసిపి అర్ధరాత్రి 12 తర్వాత రైల్వేస్టేషన్ దగ్గర నిలబడి హెల్ప్‌లైన్‌కు కాల్ చేసింది ‘ఒంటరి ప్రయాణికురాలిని.. హెల్ప్ చేస్తారా?’ అని పోలీసులు ఎలా స్పందించారు? మహిళల రక్షణ విషయంలో పోలీసు అధికారుల ఇలాంటి ప్రయత్నాలు ఎలాంటి హెచ్చరికలు పంపుతాయి? రెండు మూడు రోజుల క్రితం. ఆగ్రాలోని రైల్వేస్టేషన్ దగ్గర ఒక మహిళ నిలుచుని ఉంది. తెల్ల షర్టు, బ్లాక్ జీన్స్ ధరించి ఉంది. చేతిలో చిన్న బ్యాగ్ ఉంది. అప్పటికి రాత్రి ఒంటి గంట. ఉత్తర ప్రదేశ్ హెల్ప్‌లైన్ 112కు కాల్ చేసింది. ‘నేను ఒంటరి ప్రయాణికురాలిని. ట్రైన్ మిస్ అయ్యాను. నాకు సాయం చేయగలరా?’ అని అడిగింది. అవతలి వైపు పోలీసుల స్పందన ఎలా ఉంటుందో చూసింది. ఆ పోలీసులు వెంటనే స్పందించారు. ‘మీరు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండండి లేదా ఏదైనా జనం ఉండే చోట ఉండండి. మా వాళ్లు మీ కాంటాక్ట్‌లోకి వస్తారు’ అని చెప్పారు. మరికొన్ని క్షణాల్లోనే మరో ఫోన్. ‘మేం బయలుదేరాం. మీ లైవ్ లొకేషన్ పెట్టండి’ అని. ‘భేష్. మీరు రానక్కర్లేదు. నేను ఆగ్రా ఏసీపీ సుకన్య శర్మను’ అని ఫోన్ పెట్టేసింది.ఆ తర్వాత ఆటోను పిలిచింది. ఎక్కడకు వెళ్లాలో చెప్పి ఆటో ఎక్కింది. ‘డ్రైవర్ భయ్యా... ఒంటరి మహిళలు ఈ టైమ్‌లో ఆటో ఎక్కడం సేఫేనా’ అని అడిగింది. ఆటోడ్రైవర్ ‘ఏం పర్లేదమ్మా. పోలీసులు ఆటోడ్రైవర్ల అన్ని వివరాలు తీసుకుంటున్నారు. ఖాకీ షర్ట్ లేకుండా డ్రైవింగ్ చేయవద్దంటున్నారు. మీకేం ఇబ్బంది లేదు’ అని ఆమె కోరిన చోట దించాడు. అప్పుడు ఆమె తనెవరో చెప్పి ‘స్త్రీలు మెచ్చే విధంగా ఉన్నావు. ఇలాగే అందరూ వ్యవహరించాలి’ అని అభినందించింది. పూర్వం ఎలా పాలన జరిగేదో చూడటానికి రాజులు మారు వేషాలు వేసేవారు. ఇలా అధికారులు కూడా సామాన్యుల్లా వ్యవహరించి తిరిగితే లోపాలు తెలిసి సమస్యలు దృష్టికి వచ్చి స్త్రీలకు మరింత రక్షణ ఏర్పాట్లు చేయవచ్చు. భేష్ సుకన్య మేడమ్.(చదవండి: పెప్పికో మాజీ సీఈవో ఇంద్రా నూయి పేరెంటింగ్ టిప్స్) -
వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత కల్పించాలి: మంత్రి సీతక్క
సాక్షి, హైదరాబాద్: తాము పని చేస్తున్న ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదన్నారు మంత్రి సీతక్క. అలాగే, తాము తక్కువ అనే ఆలోచన నుండి మహిళలు బయటపడాలని సూచించారు. సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకూడదు అంటూ కామెంట్స్ చేశారు.మాదాపూర్‌లోని టెక్ మహీంద్రా క్యాంపస్‌లో CII ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ తెలంగాణ 10వ వార్షిక లీడర్షిప్ సదస్సు జరిగింది. ఈ సదస్సును మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం, సీతక్క మాట్లాడుతూ..‘మహిళలు సమాజ సృష్టికర్తలు. కానీ మహిళలను చిన్నచూపు చూసే మెంటాలిటీ ఉంది. అందుకే మహిళలు ఇంకా వెనకబడే ఉన్నారు. ఎన్నో రంగాల్లో మహిళలు రాణిస్తున్నా.. పురుషులే గొప్ప అనే భావన ఉంది. తక్కువ అనే ఆలోచన నుండి మహిళలు బయటపడాలి. నేను ఎవరి మీద ఆధారపడకుండా కష్టాన్ని నమ్ముకుని పనిచేశాను. మూడుసార్లు ఎమ్మెల్యే అయ్యి మంత్రిగా సేవలు అందిస్తున్నాను. ఆదివాసి మహిళ అయిన నాకు పంచాయతీరాజ్ వంటి పెద్ద శాఖను ఇచ్చారు. 13వేల గ్రామ పంచాయతీలు, రెండు కోట్ల మంది ప్రజలకు సేవ చేసే బాధ్యతను నాకు అప్పగించారు. బాధ్యతలు స్వీకరించి పట్టుదలతో పనిచేస్తున్నాను.పని ప్రాంతాల్లో మహిళలకు భద్రత కల్పించాలి. వర్క్ ప్లేస్‌లో మహిళలకు భద్రత లేకపోతే ఇంకెక్కడ భద్రత ఉంటుంది. ఏమైనా సమస్యలు ఎదుర్కొంటే వెంటనే ప్రశ్నించడం నేర్చుకోవాలి. మీకు ఎదురవుతున్న సవాళ్లను మా దృష్టికి తీసుకొస్తే పరిష్కారం కోసం చట్టాలు చేస్తాం. పని ప్రాంతాల్లో మహిళల మీద వేధింపులను సహించేది లేదు. వ్యాపారాలు, వ్యాపారవేత్తలు పట్టణాలకే పరిమితం కాకూడదు. గ్రామీణ ప్రాంతాల నుంచి పారిశ్రామికవేత్తలు ఎదిగినప్పుడే సమాజంలో అంతరాలు తగ్గుతాయి. అభివృద్ధి ఒకే చోట కాకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. గ్రామీణ ప్రాంతాల్లో కూడా పరిశ్రమలు నెలకొల్పాలి. ఒక గ్రామీణ ప్రాంత బిడ్డగా నేను అదే కోరుకుంటున్నాను. స్థానిక వనరుల కేంద్రంగా వ్యాపార అభివృద్ధి జరగాలి. స్కిల్ డెవలప్మెంట్ కోసం సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మినిస్టర్ శ్రీధర్ బాబు దృష్టి పెట్టారు. గ్రామీణ ప్రాంతాలకు ఐటీని విస్తరిస్తున్నారు. సవాళ్లు ఎదురైనప్పుడు పారిపోకూడదు. సవాళ్లను చాలెంజ్‌గా తీసుకొని మహిళలు నిలదొక్కుకోవాలి. మహిళా భద్రత, సాధికారత కోసం మా ప్రభుత్వం పనిచేస్తుంది. మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. ప్రయాణాలు, పని ప్రాంతాల్లో మహిళా భద్రత కోసం టీ-సేఫ్ యాప్ తీసుకొచ్చాం. ఇతర రాష్ట్రాలకు టీ-సేఫ్ ఆదర్శంగా నిలుస్తోంది.లింగ సమానత్వం రావాలంటే అన్నిచోట్ల మహిళలు ముందుకు రావాలి. మహిళలపై ఎలాంటి వివక్షత చూపకుండా సమాన అవకాశాలు కల్పించాలి. మహిళలు ఉన్నత స్థాయికి చేరే విధంగా అంతా పనిచేయాలి. పారిశ్రామిక రంగంలో ముందంజలో ఉన్న మహిళలు వెనుకబాటుతనంలో ఉన్న మహిళలకు తోడ్పాటు ఇవ్వాలి. అప్పుడే మహిళలు అభివృద్ధి బాటలో పరిగెత్తగలరు. మహిళలకు మానవత్వం ఎక్కువ. సమస్యల్లో ఉన్నవారికి అక్కలా చెల్లెలా తల్లిలా చేయూత ఇవ్వాలి. యంగ్ ఇండియాలో నిరుద్యోగము పెద్ద సమస్యగా మారింది. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అంకితభావంతో మీ సేవలను అందించాలి. ఒకరికొకరు ఆసరాగా ఉండి తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: ప్రజాభవన్ చుట్టూ కంచెలు ఎందుకు?: కేటీఆర్ -
శాండల్‌వుడ్‌లో ‘శ్వా’ ఏర్పాటు కావాలి: సంజనా గల్రానీ
చలన చిత్రపరిశ్రమలో మహిళల భద్రత, సమాన గౌరవం, పని హక్కు వంటి అంశాలపై నటి సంజనా గల్రానీ కన్నడ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్‌కు ఓ లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఈ విధంగా... ‘‘ఇండస్ట్రీలో ఒక ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ ఉండాలి. ఆల్రెడీ ఉన్న ఆర్టిస్టు అసోసియేషన్‌తో కలిసి ఈ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్ పని చేయాలి. ఓ నటికి ఉండాల్సిన కనీస హక్కులు గురించిన చర్చ జరగాలి. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాల నిర్వహణ జరగాలి. ప్రస్తుతం తోటి పరిశ్రమల్లో జరుగుతున్న పరిణామాలు బాధ కలిగిస్తున్నాయి. అలాంటి బ్లాక్ మార్క్స్ కన్నడ ఇండస్ట్రీపై పడకూడదు. అందుకే ఈ లేఖ రాస్తున్నాను.కన్నడ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఆర్టిస్టు అసోసియేషన్, ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, డైరెక్టర్స్ అసోసియేషన్, టెక్నీషియన్స్ అసోసియేషన్ల విలువైన సలహాలతో ‘శాండిల్‌వుడ్ ఉమెన్ ఆర్టిస్టు అసోసియేషన్’ (ఎస్డబ్ల్యూఏఏ – ‘శ్వా’) ఏర్పాటు కావాలి. ముఖ్యంగా ఈ ‘శ్వా’పై కర్ణాటక ప్రభుత్వం పర్యవేక్షణ ఉండాలి’’ అని సంజన ఆ లేఖలో రాసుకొచ్చారు.అలాగే ఈ లేఖను పరిశీలించవలసినదిగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్య, హోం మినిస్టర్ పరమేశ్వర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్టర్ లక్ష్మీ హెబ్బాల్కర్లను అడ్రస్ చేశారు సంజన. అలాగే సెట్స్‌లో నటీమణులు దుస్తులు మార్చుకునేందుకు ప్రత్యేక క్యారవేన్ ఉండాలని, ఓ గది అయినా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని, రాత్రి షూట్ సమయంలో సరైన పరిస్థితులు ఉండాలని... ఇవన్నీ ‘శ్వా’కి ప్రాథమిక నియమాలుగా ఉండాలంటూ మరికొన్ని నియమాలను కూడా స్పష్టం చేశారు సంజన. -
మహిళా కమిషన్‌ను ఏర్పాటు చేయాలి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న మహిళల భద్రత, రక్షణలను మరింత మెరుగుపరచడం కోసం వారి తరఫున ప్రాతినిధ్యం వహించేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరినట్లుగా ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణు పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిలకు ‘మా’ అధ్యక్షుడిగా నాది ఒక విజ్ఞప్తి.తెలుగ చిత్ర పరిశ్రమలోని మహిళల భద్రత, రక్షణ మరింత మెరుగుపడేలా, వారి తరఫున ప్రాతినిధ్యం ఉండేలా ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయండి. కెమెరా ముందు, వెనక ప్రతి ఒక్కరికీ భద్రతతో కూడిన పరిస్థితులు ఉండాలన్న దానికి ప్రాధాన్యం ఇస్తున్నాం. భద్రత, సాధికారితలకు చలన చిత్ర పరిశ్రమ ప్రతిరూపంగా నిలిపేందుకు తెలుగు ఇండస్ట్రీలో భాగమైన ప్రతి ఒక్కర్నుంచి సలహాలు ఆహ్వానిస్తున్నాం’’ అంటూ గురువారం ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు ‘ఎక్స్’లో పేర్కొన్నారు.ఇదిలా ఉంటే... మలయాళ పరిశ్రమలో జస్టిస్ హేమా కమిటీ నివేదికలోని అంశాలు వెలుగులోకి వచ్చాక ఇతర పరిశ్రమల్లోనూ ఆ తరహా కమిటీ ఏర్పాటు చేయాలని పలువురు స్టార్స్ అంటున్న విషయం తెలిసిందే. తెలుగులో ఉన్న విభాగాల్లో ఓ కీలక విభాగం అయిన ‘మా’ తరఫున మంచు విష్ణు కమిటీ ఏర్పాటుని ప్రతిపాదించారు. -
మహిళలకు ఇది చీకటి కాలం..
-
కర్రసాము.. మార్షల్ ఆర్ట్స్.. ఇప్పుడు 'హర్ ఘర్ దుర్గ'!
కోల్‌కతాలో అభయ... హైదరాబాద్‌లో దిశ... ఢిల్లీలో నిర్భయ. చెప్పుకుంటూ పోవడమేనా? వేదన నింపుకోవడమేనా? లేడి కొమ్ములు దిగబడిన పులి కళ్లల్లో భయం కూడా సాధ్యమే. శిక్షణ తీసుకుంటే రక్షణాయుధాన్ని వాడితే దుర్మార్గం ఆగుతుంది. దుష్టుడు మన చేత చిక్కి కటకటాల పాలవుతాడు.ఆపద వస్తే ఎవరు సహాయం చేస్తారా అని నిస్సహాయంగా చూడడం కాదు, తనను తాను రక్షించుకోవడానికి ‘ఆమె’ను సమాయత్తం చేయాలి. మహారాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ పని చేస్తోంది. ‘హర్ ఘర్ దుర్గ’ (ప్రతి ఇంట్లో దుర్గ) అనే నినాదంతో మహిళలకు స్వీయరక్షణ ప్రచారం మొదలుపెట్టింది. అమ్మాయిలకు కరాటే, జూడోలలో శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని ఐటీఐలన్నింటిలోనూ అమ్మాయిలకు ఆత్మరక్షణ కోసం కరాటే, జూడో క్లాసులు నిర్వహించనుంది. వారంలో కనీసం రెండు గంటల సమయం శారీరక వ్యాయామం, ఆత్మరక్షణ విద్యలకు కేటాయిస్తున్నారు. ఇందుకోసం స్వచ్ఛంద సంఘాల సహకారం తీసుకోనున్నట్లు తెలియచేశాయి అధికార వర్గాలు. మనదగ్గర ఈ పని ఐదేళ్ల్ల కిందటే మొదలైంది. తెలంగాణ, నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన తగుళ్ల స్వర్ణయాదవ్ అనే యువతి కర్రసాము నేర్చుకుని, హైదరాబాద్‌లో అకాడమీ స్థాపించి బాలికలకు నేర్పిస్తోంది.కర్రసాము... మార్షల్ ఆర్ట్స్స్వర్ణ యాదవ్ ఫోక్ సింగర్. పాటలు పాడడానికి ఒంటరిగా వెళ్లాల్సి వచ్చేది. ్రపోగ్రామ్ పూర్తయిన తర్వాత ఇంటికి చేరేసరికి రాత్రి పది దాటుతుంది. తనను తాను రక్షించుకోవడానికి మార్షల్ ఆర్ట్ నేర్చుకోవాలనుకుందామె. మన దగ్గర కర్రసాము ఉందిగాని నేర్పించేవారు లేరు. తమిళనాడులో సిలంబం (కర్రసాము) ఆర్ట్ బాగా విస్తరించి ఉంది. తమిళనాడు వెళ్లి రెండేళ్ల కోర్సు చేశారు స్వర్ణ. తాను నేర్చుకుంటే సరిపోదు, వీలయినంత ఎక్కువ మంది అమ్మాయిలకు నేర్పించాలని నిర్ణయించుకుంది. హైదరాబాద్‌కి తిరిగి వచ్చిన తర్వాత 2019 నుంచి స్కూళ్లలో నేర్పించడం మొదలు పెట్టింది. ‘స్వర్ణ ఆర్ట్స్ అకాడమీ’ని 2022లో రిజిస్టర్ చేసింది. మహిళా దినోత్సవం సందర్భంగా గవర్నర్ బంగ్లాలో ప్రదర్శన ఇచ్చి ప్రశంసలు అందుకుంది. పది మందికి శిక్షణ ఇచ్చి పూర్తి స్థాయిలో శిక్షకులుగా తయారు చేసి వారి సహాయంతో యూసుఫ్‌గూడ, ఉప్పల్, పటాన్చెరు, ఎల్బీనగర్, మాదాపూర్, కూకట్‌పల్లిలో ఫ్రీ క్యాంపులు నిర్వహించింది. స్కూళ్లలో కూడా ఉచితంగా నేర్పించింది.. హైదరాబాద్ నగరంలో శిక్షణ తర్వాత తమ సర్వీస్‌ని తెలంగాణ జిల్లాలకు విస్తరించాలనుకుంటున్నట్లు చెబుతోందామె.అబ్బాయిలకు కూడా!‘‘కర్రసాముతోపాటు మనదేశీయ యుద్ధకళలన్నింటినీ మా అకాడెమీలో పరిచయం చేయాలనేది భవిష్యత్తు ఆలోచన. రాబోయే వేసవికి పంజాబ్ మార్షల్ ఆర్ట్ ‘గట్కా’ను ప్రవేశపెడుతున్నాం. స్కూళ్లలో అమ్మాయిలతోపాటు అబ్బాయిలకు కూడా నేర్పిస్తున్నాం. ఎందుకంటే ఈ జనరేషన్ అబ్బాయిల్లో దేహదారుఢ్యం తగినంతగా ఉండడం లేదు. స్మార్ట్ ఫోన్లలో మునిగిపోయి ఊబకాయులవుతున్నారు. అమ్మాయిలకు ఆత్మరక్షణ ద్వారా వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, అబ్బాయిల్లో ఫిట్నెస్ పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నాం’ అన్నారు స్వర్ణ యాదవ్. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
మీ భద్రతకు మాది భరోసా
రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు అతివలకు అన్ని వేళలా అండగా ఉంటామని మహిళా భద్రత విభాగం డీజీ శిఖాగోయల్ భరోసా ఇచ్చారు. సమస్య ఏదైనా డయల్ 100కు కాల్ చేస్తే నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వస్తారని హామీ ఇచ్చారు. రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్న వారిలో కొందరు నేటికీ ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్న నేపథ్యంలో వారి సమస్యలను నేరుగా శిఖాగోయల్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘మీతో సాక్షి’ శీర్షికన ఆగస్టు 27 నుంచి 3 రోజులపాటు సాక్షి నిర్వహించిన ప్రత్యేక క్యాంపెయిన్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మహిళలు పలు సమస్యలను ‘సాక్షి’ దృష్టికి తీసుకురాగా వాటికి శిఖాగోయల్ సమాధానాలిచ్చారు. పలువురు మహిళలు అడిగిన ప్రశ్నలు, వాటికి శిఖాగోయల్ ఇచ్చిన సమాధానాలు..ప్రశ్న: కోల్‌కతాలో ఓ జూనియర్ డాక్టర్‌పై హత్యాచారం నేపథ్యంలో రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో మహిళా డాక్టర్ల భద్రతతోపాటు మహిళా రోగులు, వారి సహాయకుల భద్రతకు మీరు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? – (అనురాధరావు, బాలలహక్కుల సంఘం) జవాబు: ఆస్పత్రుల్లో భద్రతాపరమైన మౌలికవసతుల కల్ప నపై దృష్టి పెట్టాం. అన్ని ఆస్పత్రుల వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ పాయి ంట్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా లేదా తెలుసుకొనేందుకు స్థానిక పోలీసుల ద్వారా సెక్యూరిటీ ఆడిట్లు నిర్వహిస్తున్నాం. ఆస్పత్రుల్లో ఇప్పటికే ఉన్న సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రుల్లో భద్రత ప్రమాణాలు మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై త్వరలోనే కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ నుంచి మాకు సమాచారం అందింది. ఆ నిబంధనలు రాగానే ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటాం.ఆస్పత్రుల వద్ద సెక్యూరిటీ సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చే లా యాజమాన్యాలతో సమన్వయం చేసుకుంటున్నాం. విమెన్ సేఫ్టీ వింగ్‌లో అత్యంత క్రియాశీలకంగా పనిచేసే సాహస్ మాడ్యూల్ ద్వారా పోష్ యాక్ట్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెస్సల్)పై ప్రచారం కలి్పస్తున్నాం. ఆస్పత్రుల్లో లైంగిక వేధింపులను కట్టడిచేసేందుకు ‘సాహస్’ మాడ్యూల్ ద్వారా చర్యలు తీసుకుంటాం.ప్రశ్న: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరి«ధిలో గతంలో ఆటోలు, క్యాబ్‌లకు ప్రత్యేక నంబర్ ఇచ్చి అది ఆ వాహనం వెనుక డిస్ప్లే అయ్యేలా చేశారు. ఈమధ్య అది కనిపించట్లేదు. ఆటోలు, క్యాబ్‌ల డ్రైవర్ల వివరాలు పోలీసుల దృష్టిలో ఉండేలా మహిళా భద్రత విషయంలో ఏం చర్యలు తీసుకుంటారు? – (హిమజ, ఓ కార్పొరేట్ కంపెనీ ఎండీ హైదరాబాద్) జవాబు: రాష్ట్రంలోని అనేక జిల్లాలు, నగర యూనిట్లలో ‘మై ఆటో ఈజ్ సేఫ్’ ప్రచారం ఉంది. ఆటో డ్రైవర్ల వివరాలు పోలీసులు తనిఖీ చేసి ధ్రువీకరిస్తారు. ఆటోలలో పోలీసుల ఫోన్ నంబర్లు ఉండేలా చూస్తున్నాం. మై ఆటో ఈజ్ సేఫ్ కార్యక్రమం అంతటా అమలయ్యేలా చర్యలు తీసుకుంటాం. మీరు మీ ప్రయాణ సమయంలో సురక్షితంగా ఉండేలా డయల్ 100కు కాల్ చేసి అందులో 8 నొక్కడం ద్వారా ‘టీ–సేఫ్’ను ఎంచుకుంటే మీ ప్రయాణం పూర్తయ్యే వరకు పోలీసు పర్యవేక్షణ ఉంటుంది. https://womensafetywing. telang ana. gov. in/ women& safety& apps/ tsafe/ వెబ్సైట్లో లేదా టీ–సేఫ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకొని అందులో మీ ప్రయాణ వివరాలు నమోదు చేసినా కూడా పోలీసులు మీ ప్రయాణం సురక్షితంగా పూర్తయ్యే వరకు పర్యవేక్షిస్తారు. ఏ సమస్య ఉన్నా వెంటనే రంగంలోకి దిగుతారు. టీ–సేఫ్ యాప్‌లో ఎస్ఓఎస్ బటన్ నొక్కినా వెంటనే పోలీసులు అప్రమత్తమవుతారు.ప్రశ్న: ఆఫీసుల్లో మహిళా ఉద్యోగుల హక్కులు, వారి భద్రత వంటి అంశాలపై చర్చించేందుకు తరచూ సమావేశాలు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా మా కార్యాలయంలో అలాంటి సమావేశాలు నిర్వహించట్లేదు. వర్క్ ప్లేస్‌లో వేధింపులు, టీజింగ్‌పై ఫిర్యాదు చేసేందుకు మహిళలు వెనకాడుతున్నారు. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలి? – (నీలిమ, ఓ ఐటీ సంస్థ ప్రాజెక్టు మేనేజర్, గచ్చి»ౌలి) జవాబు: పనిప్రదేశాల్లో లైంగిక వేధింపులను నిరోధించేందుకు తెచి్చన పోష్ యాక్ట్–2013 ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నల్ కమిటీ (ఐసీ) ఉండాలి. అందులో ప్రిసైడింగ్ అధికారి, ఆ కార్యాలయ సభ్యులు సహా బయటి నుంచి ఒక నిపుణుడితో కలిసి కమిటీ పనిచేయాలి. మీ కార్యాలయంలో ఆ కమిటీ పనిచేయకపోతే మీరు మమ్మల్ని సంప్రదించొచ్చు. రాష్ట్రంలోని ఏ కార్యాలయంలోని సిబ్బంది అయినా ఫిర్యాదులు చేసేందుకు, శిక్షణ, అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం మీరు మహిళా భద్రత విభాగంలోని సాహస్ మాడ్యూల్ సిబ్బందిని సంప్రదించొచ్చు. మీ అభ్యర్థన మేరకు నిపుణులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. ప్రశ్న: ఐడీఎఫ్సీ బ్యాంక్‌లో మాకు తెలిసిన వాళ్లు లోన్ తీసుకొని నా పేరు ష్యూరిటీగా పెట్టారు. ఆ డబ్బులు ఇప్పుడు మీరే కట్టాలని మూడు నంబర్ల నుంచి ఫోన్ చేసి విపరీతంగా వేధిస్తున్నారు. బూతులు మాట్లాడుతున్నారు. నాతోపాటు నా మరదలికి కూడా 928xxx2832, 630xxx3981, 630xxx9649 నంబర్ల నుంచి ప్రతిరోజూ కాల్స్ వస్తున్నాయి. మమ్మల్ని వేధిస్తున్న వ్యక్తులను కనిపెట్టి వారిపై చర్యలు తీసుకోవాలని మనవి. – (ప్రియాంక) జవాబు: మీరు వెంటనే మీ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయండి. సైబర్ క్రైం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా వాళ్లు మీకు తగిన సాయం చేస్తారు. ప్రశ్న: హైదరాబాద్‌లో స్వాగ్ అనే ఒక ఆఫీస్ (అది ఫేక్ కంపెనీ)లో జాబ్ ఉందని మా సిస్టర్ కాల్ చేస్తే ఉద్యోగం కోసం వెళ్లా. అక్కడ శ్యామ్ అనే వ్యక్తి నన్ను గదిలోకి తీసుకెళ్లి రేప్ చేశాడు. ఇప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. ఈ విషయం మా ఇంట్లో చెప్పాను. మా అమ్మ అతడితో మాట్లాడితే డబ్బిస్తా.. ప్రెగ్నెన్సీ తీయించాలని చెబుతున్నాడు. నన్ను మోసం చేసినట్లే శ్యామ్ ఎందరో ఆడపిలల్లల జీవితాలతో ఆడుకుంటున్నాడు. నాకు ఇప్పుడు చావు తప్ప వేరే దారి లేదు. నాకు న్యాయం చేయండి..? – (శ్రీజ) జవాబు: మీరు వెంటనే మీ దగ్గరిలోని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి. మీకు మా నుంచి సహాయం కావాలంటే లక్డీకాపూల్‌లోని మహిళా భద్రత విభాగం కేంద్ర కార్యాలయంలో సంప్రదించండి. మీకు తగిన సూచనలతోపాటు న్యాయపరమైన అంశాల్లో సాయం అందిస్తాం. ప్రశ్న: నాకు పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈమధ్య ఎవరో ఒక వ్యక్తి నా భర్త మొబైల్‌కు నా గురించి చెడుగా మెసేజ్‌లు పంపుతున్నాడు. వాటిని నమ్మి నా భర్త వారం నుంచి నాతో గొడవపడుతున్నాడు. అవతలి వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదు. రోజూ గుర్తు తెలియని ఫోన్ నంబర్ల నుంచి నా భర్తకు ఫోన్లు చేసి నా గురించి చెడుగా చెబుతున్నాడు. దయచేసి చర్యలు తీసుకోగలరు..? – (చందన, హనుమకొండ జిల్లా)జవాబు: మీ సమస్యను మా అధికారులు పరిశీలిస్తున్నారు. తగిన చర్యలు తీసుకుంటాం. ప్రశ్న: గుర్తుతెలియని ఈ–మెయిల్ ఐడీ ద్వారా నన్ను వేధిస్తున్నారు. నా వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా సోషల్ మీడియాలో నా ఫ్రెండ్స్‌కు కూడా పోస్టులు పెడుతున్నారు. తగిన చర్యలు తీసుకోగలరు. - (నిహారిక) జవాబు: మహిళా భద్రత విభాగం మీ ఫిర్యాదును తీసుకుంది. వివరాల కోసం మా షీ–టీమ్స్ అధికారి సంప్రదిస్తారు. ప్రశ్న: నాకు వివాహేతర సంబంధం అంటగట్టి వేధిస్తుంటే నా భర్తపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశా. పోలీసులు నా భర్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపినా ఏదో రకంగా వేధిస్తున్నాడు. మా ఇంట్లో హిడెన్ కెమెరాలు పెట్టినట్టు నా అనుమానం. ఈ సమస్యల నుంచి బయటపడేలా నాకు పరిష్కారం చూపగలరు. -(హరిణి)జవాబు..: మా టీం మిమ్మల్ని సంప్రదించినా హిడెన్ కెమెరాలకు సంబంధించి తగిన వివరాలు ఇవ్వలేకపోయారు. -
ఈ దేశాల్లో మహిళలకు రక్షణ కరువు.. భారత్ ఎక్కడంటే?
కోల్‌కతా దారుణ హత్యాచార ఘటనో లేదంటే.. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోతున్న అఘాయిత్యాల వల్లనో స్పష్టమైన కారణం తెలీదు.. సెర్చ్ ఇంజిన్ గూగుల్‌లో ప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఇవిగో అంటూ ఒక జాబితా ట్రెండ్ అవుతోంది. ఆ జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంటడం ఆందోళన కలిగిస్తోంది. ఆ జాబితాలోని దేశాల్లో ఉన్న పరిస్థితులు తెలుసుకోండి..దక్షిణాఫ్రికాఇప్పటివరకు మహిళలకు రక్షణ లేని దేశాలలో దక్షిణాఫ్రికా మొదటి స్థానంలో ఉంది. ఇక్కడ రోడ్లపై ఒంటరిగా నడిచే మహిళలకు భద్రత చాలా తక్కువగా ఉంది. దీంతో ఇక్కడ మహిళా ప్రయాణికులు ఒంటరిగా ప్రయాణాలు చేయటం, డ్రైవింగ్ లేదా కాలినడకలో బయటకు వెళ్లటం మంచిది కాదని పలు కథనాలు వెల్లడించాయి. వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రపంచంలోనే ఆడవారికి రక్షణ విషయంలో చాలా ప్రమాదకరమైన దేశం దక్షిణాఫ్రికా అని పేర్కొంది. ఇక్కడ కేవలం 25 శాతం మంది మహిళలు మాత్రమే తాము ఒంటరిగా రోడ్లపై నడుస్తున్నప్పుడు సురక్షితంగా ఉన్నట్లు భావించటం గమనార్హం.భారతదేశంఆసియాలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశంగా భారత్ తరచుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. ఇటీవల ఓ స్పానిష్ జంట భారత్‌తో తాము హింస అనుభవించినట్లు నమోదైన కేసు కూడా వైరల్‌గా మారింది. భారత్‌లో మహిళలు లైంగిక వేధింపులు, వేధింపులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని రాయిటర్స్ ఓ కథనంలో వెల్లడించింది. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలకు పరిశీలిస్తే.. బలవంతంగా కార్మికులుగా మార్చటం, లైంగిక వేధింపు ఘటనలు పెరగటం, మానవ అక్రమ రవాణా ఇప్పటికీ దేశ భద్రతను దెబ్బతీస్తోందని తెలుస్తోంది.ఆఫ్ఘనిస్తాన్తాలిబన్ల పాలనలో ఆఫ్ఘనిస్థాన్‌లో మహిళలు తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని రాయిటర్స్ నివేదించింది. అయితే ఇక్కడ లైంగిక హింస కంటే.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు అందుబాటులో ఉండకపోవటం, బాలికల చదువుపై నిషేధాలు విధించటం వంటి వాటివల్ల మహిళలు ఆఫ్ఘనిస్తాన్ తమకు సురక్షితమైన దేశం కాదని భావిస్తున్నట్లు ఇప్పటికే పలు అంతర్జాతీయ కథనాలు వెలువడ్డాయి. ఇక్కడ తాలిబన్లు అమలు చేసే నిబంధనలు మహిళల స్వేచ్ఛను హరిస్తున్నాయి.సిరియామహిళలు తీవ్రమైన లైంగిక, గృహ వేధింపులకు గురవుతున్న మరో దేశం సిరియా. ఇక్కడ మహిళలకు ఆరోగ్య సంరక్షణ అందుబాటులో లేకపోవడం చాలా ఆందోళన కలిగించే విషయం. మధ్య ప్రాచ్య దేశాల్లో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో సిరియా ఒకటి.సోమాలియామహిళల హక్కులు, భద్రతను పట్టించుకోని మరో దేశం సోమాలియా. రాయిటర్స్ నివేదించిన ప్రకారం.. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు పెంచుకోవటం పరంగా మహిళలకు ఇక్కడ చాలా సవాలుతో కూడిన పరిస్థితులు ఉన్నాయి. హానికరమైన సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులను పాటించటం ఇక్కడి మహిళలకు శాపంగా మారుతోంది.సౌదీ అరేబియామహిళల హక్కులలో సౌదీ అరేబియా కొంత పురోగతి సాధించినప్పటికీ త్రీవమైన లింగ వివక్ష కొనసాగుతోంది. పని ప్రదేశాల్లో ఉండే రక్షణ, ఆస్తి హక్కులకు సంబంధించి ఇక్కడి మహిళలకు సౌదీ అరేబియా సురక్షితంకాని దేశంగా మిగిలిపోయింది.పాకిస్తాన్‌ఆర్థిక వనరులు అందుబాటులో లేకపోవడం, మహిళల పట్ల వివక్ష చూపించటంలో మహిళలకు రక్షణలేని దేశాల జాబితాలో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇక్కడి మహిళలకు హానికరమైన మత, సాంప్రదాయ పద్ధతులు సవాలుగా మారుతున్నాయి. ఇక్కడి మహిళపై దారుణమైన పరువు హత్యలు నమోదు కావటం గమనార్హం.డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోఈ దేశంలో చట్టవిరుద్ధం, కక్షపూరిత అల్లర్ల కారణంగా లక్షలాది మంది ప్రజలు దారుణమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మరోవైపు.. ఇక్కడి మహిళలు తీవ్రమైన వేధింపుల బారినపడుతున్నారని పేర్కొంది.యెమెన్తరచూ మానవతా సంక్షోభాలకు గురవుతున్న యెమెన్ దేశంలో ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక వనరులు, సాంస్కృతిక, సాంప్రదాయ పద్ధతులు మహిళలకు ప్రమాదకరంగా మారుతున్నాయి. అందుకే ఈ దేశం మహిళలకు సురక్షితమైన దేశం కాదని పలు వార్తలు వెలువడ్డాయి.నైజీరియా నైజీరియాలో మహిళలకు రక్షణ లేకపోవడాని అక్కడి ఇస్లామిస్ట్ జిహాదిస్ట్ సంస్థ కారణమని ప్రజలు నమ్ముతారు. తీవ్రవాదులు పౌరులను హింసించటం, మహిళలను అత్యాచారం, హత్యలు చేయటం వంటి చర్యలకు పాల్పడుతుంటారని ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు.. నైజీరియన్ మహిళలు హానికరమైన సాంప్రదాయ పద్ధతులు పాటించటం, మానవ అక్రమ రవాణాకు గురవుతున్నారు. దీంతో ఈ దేశం మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలలో ఒకటిగా మిగులుతోంది. -
ఇప్పటికీ తప్పంతా ఆమెదేనా?: సిరాజ్ పోస్ట్ వైరల్
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటన నేపథ్యంలో టీమిండియా స్టార్ క్రికెటర్ మహ్మద్ సిరాజ్ పురుషాధిక్య వ్యవస్థపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇలాంటి దురాగతాల్లోనూ మహిళలదే తప్పంటారేమో అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించాడు. ఈసారి ఏ సాకు తప్పించుకుంటారో చెప్పాలంటూ నిందితులకు వంతపాడేవాళ్లకు చురకలు అంటించాడు.ఈ మేరకు.. ‘‘జార్ఖండ్: జంషెడ్‌పూర్‌లో మూడున్నరేళ్ల నర్సరీ విద్యార్థినిపై స్కూల్ వ్యాన్ డైవర్ లైంగిక దాడి. ‘బహుశా తనే ఇలా చేయమని అడిగిందేమో!’... రెండేళ్లుగా మైనర్ కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడుతున్న తండ్రిని రాక్షసుడిగా అభివర్ణిస్తూ దోషిగా తేల్చిన ఢిల్లీ హైకోర్టు.. అయినా, అపరిచితులతో ఫ్రెండ్లీగా ఉండవద్దని అమ్మాయిలకు చెబుతూనే ఉంటారు కదా!మద్యం మత్తులో పట్టపగలే వైజాగ్‌లో మహిళపై అత్యాచారం... ‘రాత్రుళ్లు బయటకు వెళ్లవద్దని.. అమ్మాయిలకు చెప్పినా వినరే!.. యాత్రకు వెళ్తున్న టీనేజర్‌పై సామూహిక అత్యాచారం.. ఏడుగురి అరెస్ట్... ‘అమ్మాయిలను బార్లు, క్లబ్బులకు వెళ్లవద్దని చెప్తూనే ఉన్నారు కదా! అయినా ఇదేంటో?!’..నన్‌పై లైంగికదాడి కేసులో బిషప్‌ను నిర్దోషిగా తేల్చారు.. ‘అసలు ఆమె ఎలాంటి దుస్తులు ధరించింది?’.. యూపీలో అత్యాచారానికి గురై 85 ఏళ్ల వృద్ధురాలి మృతి.. ‘తాగి ఉన్నదా ఏంటి?’... కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య... పశ్చిమ బెంగాల్లో మిన్నంటిన నిరసనలు... ‘అసలు తను అలాంటి వృత్తి ఎందుకు ఎంచుకున్నట్లు?’...ఈసారి ఎలా తప్పించుకోబోతున్నారు? ఏం సాకులు వెదకబోతున్నారు? లేదంటే ఎప్పటిలాగే ఈసారీ ఆమెదే తప్పు.. మగాడు ఎల్లప్పుడూ మగాడే అంటారు కదా!?’’ అంటూ వివిధ ఘటనలకు సంబంధించిన వార్తా క్లిప్పింగులు, ఆ ఘటనల నేపథ్యంలో నిందితులకు మద్దతునిచ్చే వారి మాటలు ఎలా ఉంటాయో చెబుతూ చెంప చెళ్లుమనేలా వేసిన సెటైర్లను సిరాజ్ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేశాడు.అత్యంత హేయమైన ఘటనకాగా కోల్‌కతా ఆర్జీ కార్ ప్రభుత్వ వైద్యకళాశాల ట్రైనీ వైద్యురాలి హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం విదితమే. అత్యంత హేయమైన రీతిలో డాక్టర్‌పై దారుణానికి పాల్పడ్డారు దుండగులు. దీంతో పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా అట్టుడుకుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈ ఘటనపై విచారణ జరుపుతోంది. ఈ విస్మయకర ఘటనపై సిరాజ్ శుక్రవారం ఈ మేర పోస్ట్ పెట్టాడు.ఇక శ్రీలంక పర్యటన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న ఈ హైదరాబాదీ పేసర్..తదుపరి దులిప్ ట్రోఫీ- 2024 టోర్నీతో బిజీ కానున్నాడు. టీమ్-బిలో అతడు చోటు దక్కించుకున్నాడు. ఈ జట్టుకు బెంగాల్ క్రికెటర్ అభిమన్యు ఈశ్వరన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. చదవండి: అర్ధరాత్రిలో స్వతంత్ర పోరాటం -
ఆపరేషన్ ముస్కాన్‌కు సమాయత్తం
సాక్షి, హైదరాబాద్: బాలకార్మికులు, వెట్టిచాకిరీ, యాచన చేసే చిన్నారులు, అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట జూలై 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కూడిన యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ సిబ్బందితోపాటు కార్మికశాఖ, మహిళా శిశుసంక్షేమశాఖ, పాఠశాల విద్య, ప్రజారోగ్య, లీగల్ సరీ్వస్ అథారిటీతోపాటు ఎన్జీవోలు ఈ స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొంటాయి. మొత్తం 120 సబ్ డివిజనల్ కమిటీలు ఈ స్పెషల్ డ్రైవ్‌ను ఈనెల 31 వరకు కొనసాగించనున్నాయి. నెలపాటు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్‌కు సంబంధించి సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఇందులో అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులు పాల్గొని క్షేత్ర స్థాయి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు.తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న దర్పణ్ పరిజ్ఞానాన్ని సైతం ఈ డ్రైవ్‌లో అధికారులు వినియోగించనున్నారు. ఈ యాప్ ద్వారా క్షేత్రస్థాయిలో గుర్తించే చిన్నారుల వివరాలు నమోదు చేయడంతోపాటు అదృశ్యమైన చిన్నారుల కేసుల గణాంకాలను సరిపోల్చి చూస్తారు. ఇలా చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలోని అదృశ్యమైన చిన్నారుల కేసులు సైతం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. -
Lok shabha Elections 2024: ఎవరిని ఎన్నుకుందాం?!
400కు పైగా అని ఒక కూటమి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని మరో కూటమి. హోరాహోరీగా సాగిన సార్వత్రిక ఎన్నికల పోరు తుది అంకానికి చేరుతోంది. జూన్ 1న చివరిదైన ఏడో విడతతో దేశవ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ముగియనుంది. చివరి విడతలో పోలింగ్ జరుగుతున్న రాష్ట్రాల్లో హిమాచల్‌ప్రదేశ్ ఒకటి. అక్కడి తొలి ఓటర్లు పలు అంశాలపై చురుగ్గా స్పందిస్తున్నారు. నాణ్యమైన విద్య, ఉద్యోగావకాశాలు, మహిళా భద్రత తదితరాలకే తమ ప్రాధాన్యత అని చెబుతున్నారు. అయితే అధికార ఎన్డీఏ, విపక్ష ఇండియా కూటముల్లో ఎవరికి ఓటేయాలో తేల్చుకోలేని డైలమాలో ఉన్నామని ఈ యంగ్ ఓటర్స్‌లో పలువురు అంటున్నారు. నోటాకే తమ ఓటని పలువురు చెబుతుండటం విశేషం. రాష్ట్రంలో 4 లోక్‌సభ సీట్లతో పాటు ఉప ఎన్నికలు జరుగుతున్న 6 అసెంబ్లీ స్థానాలకు జూన్ 1న పోలింగ్ జరగనుంది.ఉచితాలు అనుచితాలే...! కొన్నేళ్లుగా పారీ్టలన్నీ పోటాపోటీగా ప్రకటిస్తున్న పలు ఉచిత హామీలపై, అమలు చేస్తున్న ఉచిత పథకాలపై యువ ఓటర్లలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండటం విశేషం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాల భారమంతా అంతిమంగా పన్నులు చెల్లిస్తున్న మధ్యతరగతి ప్రజానీకంపైనే పడుతోందని వారంటున్నారు. అధికారంలోకి వచ్చే పార్టీ ఏదైనా హిమాచల్‌లో ఉచితాలను నిలిపివేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. ‘‘అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సిన నిధులు ఉచితాల కారణంగా పక్కదారి పడుతున్నాయన్నది నిస్సందేహం’’ అంటున్నారు సోలన్‌కు చెందిన రియా. ఆమె ఈ ఎన్నికల్లో తొలిసారి ఓటేస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపైనా యువత నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. పదేళ్ల బీజేపీ పాలనను కొందరు విమర్శిస్తుంటే మరికొందరు ప్రశంసిస్తున్నారు. ‘‘బీజేపీ సారథ్యంలోని నియంతృత్వమా? విపక్ష ఇండియా కూటమి సంకీర్ణమా? కేంద్రంలో ఎవరికి మద్దతివ్వాలో తేల్చుకోలేకపోతున్నా. ఏమైనా రాజకీయాల్లో సానుకూల మార్పు మాత్రం కోరుకుంటున్నా’’ అంటున్నాడు మరో ఓటరు నితీశ్. బీజేపీ సర్కారు అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, రాజ్యాంగ సంస్థలన్నింటినీ దురి్వనియోగం చేస్తోందని డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి రోహిత్ విమర్శిస్తున్నారు. ‘‘మోదీకి ఓటేయడమంటే నియంతృత్వాన్ని సమర్థించడమే. అయితే సంకీర్ణ ప్రభుత్వాలు కూడా దేశానికి మంచివి కావు. కనుక ఇండియా కూటమికి ఓటేయడం కూడా సరికాదు’’ అంటున్నాడతను! ఔత్సాహిక జర్నలిస్టు...సంజౌలీ ప్రభుత్వ పీజీ కాలేజీలో జర్నలిజం చదువుతున్న అన్షుల్ ఠాకూర్ ఈసారి ఓటేయాలని ఉత్సాహంతో ఉన్నాడు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు కలి్పంచి, మహిళలకు భద్రతను పెంచేవారికే తన ఓటని స్పష్టంగా చెబుతున్నాడు. పారిశ్రామికవేత్త కావాలన్నది తన కల అని మరో పీజీ విద్యార్థి పరీక్షిత్ అంటున్నాడు. ఆధునిక సాంకేతికతను, స్టార్టప్ సంస్కృతిని, యువతను ప్రోత్సహించే వారికే తన ఓటని చెబుతున్నాడు. ‘‘ఏ పార్టీ అధికారంలోకి వచి్చనా ఉమ్మడి పౌరస్మృతి, నూతన విద్యా విధానాలను సమర్థంగా అమలు చేయాలి. ఈశాన్య ప్రాంతాలతోపాటు లద్దాఖ్ వంటి ప్రదేశాలపై దృష్టి పెట్టాలి. భారత సంస్కృతిని పరిరక్షించాలి. తొలిసారి ఓటరుగా ఇది నా ఆకాంక్ష’’ అని సంజౌలీ పీజీ కాలేజీకి చెందిన మరో విద్యార్థి వశి‹Ù్ట శర్మ చెప్పాడు. అభ్యర్థులెవరూ నా అంచనాలకు తగ్గట్టుగా లేరు. అందుకే నా తొలి ఓటు నోటాకే’’ అని మంచీకి చెందిన అదితి ఠాకూర్ చెప్పుకొచి్చంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
మహిళల సమస్యలపై ‘సాహస్’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగులు ఎదుర్కొనే లైంగిక వేధింపులు, ఇతర సమస్యలపై ‘సాహస్’పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. ఉద్యోగం చేసే మహిళలు ఈ పోర్టల్‌లో తమ సమస్యలు చెప్పుకునేందుకు ‘గెట్ హెల్ప్’ఆప్షన్ ఉన్నట్టు వారు వెల్లడించారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతి రోజూ ఉదయం 10–30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 7331194540 నంబర్లోనూ ఫిర్యాదు చేయవచ్చని అధికారులు సూచించారు. సాహస్ పోర్టల్‌ను ఇప్పటికే ప్రారంభించామని, మహిళల్లో అవగాహన కోసం దీనిపై మరింత ప్రచారం చేస్తున్నామని పేర్కొన్నారు. పని ప్రదేశంలో మహిళా ఉద్యోగుల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలు మొదలు.. లైంగిక వేధింపులపై ఎలా ఫిర్యా దు చేయాలి, న్యాయ సాయం ఎలా పొందాలో పోర్టల్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. ఫిర్యాదులకు https:// womensafetywing. telangana. gov. in/ sahas/ లో క్లిక్‌చేసి వివరాలు పొందవచ్చని వివరించారు. -
మహిళలు, విద్యార్థినులపై వేధింపులు.. భద్రతకు కొత్త ఫోన్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళా భద్రత విభాగం కొత్త ఫోన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చినట్టు అధికారులు తెలిపారు. ఈ మేరకు మహిళా భద్రత విభాగం ట్విట్టర్ (ఎక్స్)లో నూతన నంబర్లను వెల్లడించారు. ఏ రకమైన వేధింపులున్నా మహిళలు, విద్యార్థినులు 8712656858 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని స్పష్టం చేశారు. 8712656856 నంబర్‌కు వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ రెండు నంబర్లు గుర్తు లేకపోతే డయల్ 100కు ఫోన్ చేయాలని సూచించారు. చదవండి: షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కిషన్ రెడ్డి #WomenSafetyWing is dedicated & committed to your well-being & safety. Don't hesitate to call us!#Dial: #918712656858 #Chat: #9187126 56856 For EMERGENCY DIAL 100.#SuicideAwarenes #AskForHelp #Telangana #Help #MentalHealthMatters #MentalHealthAwareness #Support pic.twitter.com/HELLdkKCLP — Women Safety Wing, Telangana Police (@ts_womensafety) September 8, 2023 -
‘భరోసా’ మరింత పెంచేలా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళ భద్రతా విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న భరోసా కేంద్రాల్లో బాధితులకు భరోసా మరింత పెంచడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. భరోసా కేంద్రాలకు సాయం కోసం వచ్చిన బాధితుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు. లైంగికదాడులు, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికలో పోలీస్, న్యాయ, వైద్య సాయం అందించేందుకు రూపొందించిన ఈ కేంద్రాల్లో.. సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది? సకాలంలో స్పందిస్తున్నారా? ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? భరోసా సెంటర్‌కు అదే రోజు తీసుకెళ్లారా? మీతో లేడీ కానిస్టేబుల్ వచ్చారా? పోలీసులు వారి వాహనంలోనే తీసుకెళ్లారా? భరోసా సెంటర్లో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? కేసుల ఫాలోఅప్ సక్రమంగా ఉంటోందా? లైంగిక దాడులకు గురైన చిన్నారుల విషయంలో కేంద్రాల సిబ్బంది సరైన రీతిలో స్పందిస్తున్నారా? సేవల్లో ఇంకేమైనా లోపాలున్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు. అంతేకాదు.. బాధిత మహిళలకు మరింత అండగా నిలిచేందుకు ఇంకా ఏయే చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు కూడా కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. -
బాధితులకు భరోసా..
సాక్షి, హైదరాబాద్: ఎవరు అవునన్నా, కాదన్నా.. పురుషాధిక్య సమాజంలో మహిళలంటే చిన్నచూపే. లైంగిక దాడికి గురైన బాధితులంటే మరీనూ. బయటికొస్తే చాలు అవమానపు మాటలు, అనుమానపు చూపులతో బతకడమే వృథా అనే పరిస్థితులను అధిగమించి.. కొత్త జీవితాన్ని ప్రారంభించాలంటే ఎంతో మనోధైర్యం, భరోసా అవసరం. ఇలాంటివారి జీవితాల్లో వసంతాన్ని నింపేందుకు తెలంగాణ మహిళా భద్రతా విభాగం సరికొత్త కార్యక్రమానికి ప్రణాళిక రచిస్తోంది. బాధిత మహిళలు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు అవసరమైన ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందిస్తోంది. ఇందుకోసం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ఇంక్యుబేటర్ వీ–హబ్‌తో చేతులు కలిపింది. బాధిత మహిళలకు జీవనోపాధికి అవసరమైన ఆర్ధిక భరోసా, సాంత్వన అందించనుంది. ఎంపిక ఎలా? ఎలాంటి వ్యాపారాలు? మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా కేంద్రాల ద్వారా లైంగిక దాడికి గురైన బాధితులను ఎంపిక చేస్తారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, పథకాలు గురించి వారికి అవగాహన కల్పిస్తారు. సొంతంగా వ్యాపారం, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలన్న ఆసక్తి, నైపుణ్యం ఉంటే.. వారితో మాట్లాడి, ఆలోచనలకు కార్యరూపంలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తారు. వారి ఆర్ధిక వనరుల గురించి అధ్యయనం చేసి, చేయూతనిస్తారు. స్వీట్లు, బిస్కెట్లు, చాక్లెట్లు, బేకరి ఉత్పత్తులు వంటి తినుబండారాల వ్యాపారం, బ్యూటీపార్లర్, కుట్లు అల్లికలు, జ్యువెలరీ తయారీ వంటి చిన్న తరహా వ్యాపారాలు చేసుకునేందుకు సహకరిస్తారు. వందకు పైగా బాధితులకు శిక్షణ.. తొలి దశలో మేడ్చల్, వరంగల్ వంటి ఏడు జిల్లాల నుంచి వందకు పైగా బాధిత మహిళలను ఎంపిక చేసినట్లు తెలిసింది. తొలి సెషన్లో బాధితులు, వారి కుటుంబ సభ్యులతో చర్చించి, వారి వ్యాపార ఆలోచనల గురించి తెలుసుకున్నామని, ఆయా వ్యాపార అవకాశాలపై వారికి అవగాహన కల్పిచామని వీ–హబ్ ప్రతినిధి ఒకరు తెలిపారు. త్వరలో రెండో సెషన్ నిర్వహించి, ఎవరు ఏ కేటగిరీ వ్యాపారాలకు సెట్ అవుతారో అధ్యయనం చేసి, ఎంపిక చేస్తామన్నారు. వీ–హబ్ ఏం చేస్తుందంటే? ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ఎదురయ్యే ప్రధాన ఇబ్బంది గుర్తింపు లేకపోవటమే. బాధిత ఎంటర్ప్రెన్యూర్లకు ఆ ఇబ్బంది ఉండదు. ఏ తరహా వ్యాపారానికి ఎలాంటి లైసెన్స్‌లు అవసరం దగ్గరి నుంచి డాక్యుమెంటేషన్, మార్కెటింగ్, పథకాలు, ఆర్ధిక వనరుల వరకూ అన్ని వైపుల నుంచి సహాయసహకారాలు అందిస్తారు. వీ–హబ్ మెంటార్షిప్తో పాటు క్రెడిట్ లింకేజ్ కోసం రుణ దాతలు, రుణ గ్రహీతలను కలుపుతారు. ప్రాథమిక దశలో ఉంది.. మహిళల భద్రతే షీ టీమ్స్, ఉమెన్ సేఫ్టీ వింగ్ తొలి ప్రాధాన్యం. లైంగిక దాడి బాధితులకు కావాల్సిన సహాయం చేసేందుకు నిత్యం సిద్ధంగా ఉంటాం. బాధిత మహిళలకు అండగా నిలవడం కోసం చేపట్టిన ఈ కార్యక్రమం ప్రస్తుతం ప్రారంభ దశలో ఉంది. – శిఖా గోయల్, అదనపు డీజీ, ఉమెన్ సేఫ్టీ వింగ్ -
Asha Malviya: మహిళల భద్రత దిశగా ఆశా యాత్ర
మనదేశంలో మహిళల భద్రత, మహిళాసాధికారత సాధన కోసం ఆశా మాలవీయ దేశపర్యటనకు సిద్ధమయ్యారు. విజయవంతంగా సాగుతున్న ఆమె యాత్ర తెలుగు రాష్ట్రంలో ప్రవేశించింది. మహిళల భద్రత విషయంలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శవంతంగా ఉందని చెప్పారామె. ఆశా మాలవీయది మధ్యప్రదేశ్ రాష్ట్రం, రాజ్‌ఘర్ జిల్లా సతారామ్ గ్రామం. ఆమె క్రీడాకారిణి, పర్వతారోహణలో అభిరుచి మెండు. మహిళాభ్యుదయం లక్ష్యంగా సాగుతున్న ఆమె సైకిల్ పర్యటనలో స్త్రీ సాధికారత, భద్రత గురించి సమాజాన్ని చైతన్యవంతం చేస్తోంది. ఆమె పర్యటన ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశించింది. ఈ సందర్భంగా ఆమె సోమవారం నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె తన లక్ష్యాన్ని వివరించారు. అపోహను తొలగిస్తాను! ‘‘నేను స్పోర్ట్స్‌లో నేషనల్ ప్లేయర్‌ని. పర్వతారోహణలో రికార్డు హోల్డర్ని. ప్రస్తుతం 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ ఒకటిన భోపాల్‌లో ప్రారంభమైన నా సైకిల్ యాత్రలో ఎనిమిది వేల కిలోమీటర్లు పూర్తయ్యాయి, విజయవాడ చేరుకున్నాను. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో యాత్ర నిర్వహించాలనేది లక్ష్యం. ఇప్పటికే ఏడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తయింది. భారతదేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. ‘దిశ’ బాగుంది సీఎం జగన్ గారిని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి గారి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి. మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం ప్రవేశపెట్టిన దిశ యాప్ డౌన్‌న్‌లోడ్ చేసుకున్నాను. ఈ యాప్ చాలా బాగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలే కాదు, ప్రజలంతా సురక్షితంగా ఉన్నారు. ముఖ్యమంత్రిగారు నన్ను ప్రశంసలతో ముంచెత్తడంతోపాటు నా ఆశయం కోసం 10లక్షల రూపాయల ప్రోత్సాహకం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. తిరుపతి వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించినప్పటి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు. స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఎంతో మంచివి. దేశానికే ఆదర్శంగా నిలిచిన జగన్‌న్‌మోహన్‌న్‌రెడ్డి లాంటి మఖ్యమంత్రిని కలవడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఆశా మాలవీయ. మహిళల భద్రత, సాధికారతతోపాటు ప్రపంచదేశాల ముందు మనదేశం గౌరవాన్ని ఇనుమడింపచేయాలనే ఆమె ఆశయం ఉన్నతమైనది. ఈ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆమెను ఆశీర్వదిద్దాం. – సాక్షి, ఏపీ బ్యూరో -
అతివలకు భరోసా.. హైదరాబాద్‌లో సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ఆన్లైన్ వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులకు మరింత భరోసా ఇవ్వడానికి హైదరాబాద్ నగర పోలీసు విభాగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు కొత్తగా సైబర్ షీ–టీమ్స్‌ను ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ నిర్ణయించారు. ఈ బృందాల్లో సాంకేతిక నిపుణులతోపాటు ఎథికల్ హ్యాకర్లు కూడా ఉండనున్నారు. ఈవ్‌టీజింగ్ సహా వివిధ రకాల వేధింపులు ఎదుర్కొంటున్న మహిళలు, యువతులు, బాలికల కోసం షీ–టీమ్స్ పని చేస్తున్నాయి. ఈవ్‌టీజర్లపై కన్నేసి రెడ్çహ్యాండెడ్‌గా పట్టుకోవడం దగ్గరి నుంచి కుటుంబ సమస్యల పరిష్కారం వరకు అనేక విధాలుగా అండగా నిలుస్తున్నాయి. కానీ ఇటీవల కాలంలో వేధింపుల తీరు మారింది. స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత ‘ఈ–పోకిరీ’లు పెరిగిపోయారు. వారు బాహ్య ప్రపంచంలో కాకుండా సోషల్ మీడియా ద్వారా రెచి్చపోతున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్.. ఇలా వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్ కేంద్రంగా వేధింపులకు పాల్పడుతున్నారు. వారికి చెక్ చెప్పడానికే సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటు చేయనున్నారు. బయటికి చెప్పుకోలేక భరిస్తూ.. ఆన్లైన్ వేధింపుల బారినపడుతున్న అతివల్లో అనేక మంది తమకు ఎదురైన ఇబ్బందులను బయటికి చెప్పుకోలేకపోతున్నారు. వేధింపులకు పాల్పడుతున్నవారి నుంచి వస్తున్న బెదిరింపులకు తోడు పరువు పోతుందనే ఉద్దేశంతో మిన్నకుండిపోతున్నారు. ఈ పరిస్థితిని అలుసుగా తీసుకుంటున్న మోసగాళ్లు మరింతగా రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ షీ–టీమ్స్‌కు వస్తున్న ఫిర్యాదుల్లో 60శాతం దాకా ఆన్లైన్ వేధింపులకు సంబంధించినవే ఉంటున్నాయి. శాంతిభద్రతల విభాగం, సైబర్ క్రైమ్ ఠాణాలకు వస్తున్న సైబర్ కేసుల్లోనూ వేధింపులకు సంబంధించినవే అధికంగా ఉంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చూస్తే.. 2022లో సైబర్ నేరాల కేసులు 9,815 నమోదుకాగా.. వీటిలో సైబర్ వేధింపులకు సంబంధించినవి 1,118, అశ్లీల సందేశాలు పంపడానికి సంబంధించినవి 141 ఉన్నాయి. ఈ వేధింపులు, అశ్లీల సందేశాల కేసుల్లో బాధితులు మహిళలు, యువతులే. దీనికితోడు ఇటీవలి కాలంలో ప్రేమ ముసుగులో జరిగే ‘ఈ–నేరాలు’ పెరిగిపోయాయి. వాటితో యువతులు, మహిళలు వ్యక్తిగతంగా, మానసికంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో.. సైబర్ వేధింపులు ఎదురైన బాధితులు నేరుగా షీ–టీమ్స్ వద్దకు రావాల్సిన అవసరం లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫోన్, వాట్సాప్, ఫేస్బుక్.. ఇలాంటి మార్గాల్లోనూ ఫిర్యాదు చేయవచ్చని చెప్తున్నారు. బాధితుల వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సైబర్ షీ–టీమ్స్‌కు వచ్చే ఫిర్యాదులకు సంబంధించిన అంశాలను దర్యాప్తు చేయడం, నిందితులను గుర్తించి పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతోపాటు ప్రత్యేక టూల్స్ వినియోగించనున్నారు. ఆయా అంశాల్లో నిష్ణాతులైన వారిని బృందాల్లో నియమించనున్నారు. అవసరమైతే డార్క్‌నెట్‌ను కూడా ఛేదించే నైపుణ్యమున్న ఎథికల్ హ్యాకర్ల సేవలను వినియోగించుకుంటారు. ఇప్పటికే సిటీ పోలీసు విభాగం మహేశ్ బ్యాంకు కేసు సహా పలు సైబర్ నేరాల దర్యాప్తు కోసం ఎథికల్ హ్యాకర్ల సేవలు వినియోగించుకుంది. స్మార్ట్‌ఫోన్ కూడా చేటుకు కారణం! ఒకప్పుడు ఫోన్ విలాసవస్తువు. ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ నిత్యావసరంగా మారిపోయింది. ఇవి వచ్చాక ఎవరికి వారికి ‘స్వేచ్ఛ’ పెరిగింది. ఆకర్షణను ప్రేమగా భావిస్తున్న యువతులు అపరిచితులతోనూ హద్దులు దాటుతున్నారు. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత అంశాలను రికార్డు చేయడాన్నీ పట్టించుకోవడం లేదు. ఓ దశలో ఇవే వారి పాలిట శాపంగా మారుతున్నాయి. ఏటా నమోదవుతున్న సైబర్ నేరాల్లో ఈ తరహాకు చెందినవి పెద్ద సంఖ్యలో ఉంటున్నాయి. సైబర్ షీ–టీమ్స్ ఏర్పాటుతో పరిస్థితులు మారే అవకాశం ఉంది. – సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల షీ–టీమ్స్‌కు వచ్చిన ‘ఈ–కేసు’ల్లో కొన్ని... ► బెంగళూరుకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కొంతకాలం హైదరాబాద్‌లోని ఓ మలీ్టనేషనల్ కంపెనీలో పనిచేశాడు. అప్పట్లో తన సహోద్యోగిని అయిన యువతిపై ఆన్లైన్లో వేధింపులకు పాల్పడ్డాడు. ఈ–మెయిల్స్, సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ ద్వారా అభ్యంతరకర ప్రచారానికి దిగాడు. పోలీసులు సదరు సాఫ్ట్వేర్ ఇంజనీర్‌ను అరెస్టు చేశారు. ► హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లికి చెందిన ఓ మరుగుజ్జు యువకుడు ఫేజ్‌బుక్‌లో తనదేనంటూ ఓ అందమైన యువకుడి ఫొటో పెట్టాడు. ఓ యువతి ‘ఫ్రెండ్’గా పరిచయం కావడంతో చాటింగ్ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో వలవేసి.. అనేక కారణాలు చెప్పి ఆమె నుంచి రూ.3 లక్షల నగదు, 50 తులాల బంగారం స్వాహా చేశాడు. ► ఓ వ్యక్తి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ప్రాజెక్టు వర్క్ నేపథ్యంలో పరిచయమైన యువతిని ప్రేమించాడు. ఆమె తిరస్కరించడంతో కక్షగట్టాడు. ఓ ల్యాప్‌టాప్, డేటాకార్డ్ కొనుగోలు చేసి.. సదరు యువతి మెయిల్ ఐడీని హ్యాక్ చేశాడు. ఆమె బంధువులు, స్నేహితులకు ఆమే పంపిస్తున్నట్టుగా అసభ్య చిత్రాలు, సందేశాలు పంపాడు. చదవండి: Telangana: గ్రూప్–4లో 8,039 పోస్టులే! -
Hyderabad: మహిళలపై పెరుగుతున్న నేరాలు.. ఈ ఏడాదిలోనే ఎన్ని కేసులంటే!
సాక్షి, హైదరాబాద్: ‘మహిళల భద్రత, రక్షణే ప్రథమ కర్తవ్యం’ ఇదీ రాష్ట్ర పోలీసు యంత్రాంగం నినాదం. కానీ, ఇది ఆచరణలో ఆమడదూరంలో ఉంది. ఇంటా బయటా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్ని చట్టాలు, శిక్షలు అమలు చేస్తున్నా స్త్రీలకు భద్రత కరువైంది. గృహ హింస, అత్యాచారం, హత్యలు, వరకట్న మరణాలు, అపహరణలు ఇలా ఎన్నెన్నో దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. ఏటా మహిళలపై నేరాలు పెరుగుతూనే ఉన్నాయి. గతేడాది గ్రేటర్లో మహిళలపై 7,459 నేరాలు జరగ్గా... ఈ ఏడాది 7,578 నేరాలు నమోదయ్యాయి. అన్ని రంగాల్లోనూ పురుషులతో పోటీ పడుతున్న ఈ రోజుల్లో కూడా స్త్రీలపై గృహ హింసలు, వేధింపులే జరగడం బాధాకరం. ఏటేటా ఈ తరహా కేసులు పెరుగుతుండటం గమనార్హం. గతేడాది హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ మూడు కమిషనరేట్లలో కలిపి 4,674 వేధింపుల కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 4,891లకు పెరిగాయి. అయితే అత్యాచారాలు, పోక్సో కేసులు కాస్తా తగ్గుముఖం పట్టాయి. 2021లో 1,089 అత్యాచారాలు జరగ్గా.. ఈ ఏడాది 984లకు తగ్గాయి. అలాగే గతేడాది చిన్నారులపై 1,161 అఘాయిత్యాలు జరగగా.. ఈ ఏడాది 1,052 పోక్సో కేసులు నమోదయ్యాయి. తెలిసినోళ్లే తోడేళ్లు.. ఈ ఏడాది రాచకొండలో 372 అత్యాచారాలు జరగగా.. ఇందులో స్నేహితులు, కుటుంబ సభ్యులు రేప్ చేసిన సంఘటనలే ఎక్కువ. స్నేహితులు రేప్ చేసిన కేసులు 352 కాగా.. చుట్టుపక్కల వాళ్లు 4, కుటుంబ సభ్యులు 2 రేప్ కేసులున్నాయి. ఇతరుల చేసిన అత్యాచార కేసులు 14 ఉన్నాయని వార్షిక నివేదికలో వెల్లడైంది. సైబరాబాద్, హైదరాబాద్‌తో పోలిస్తే ఈ ఏడాది రాచకొండలో పోక్సో కేసులు ఎక్కువయ్యాయి. గతేడాది 394 పోక్సో కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది 442కు పెరిగాయి. పోకిరీల భరతం.. విద్యా సంస్థలు, కార్యాలయాలు, బస్‌స్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, బహిరంగ ప్రదేశాల్లో మహిళలను వేధిస్తున్న ఆకతాయిల భరతం పడుతుంది షీ టీమ్స్. ఈ ఏడాది 7,521 మంది పోకిరీలను మూడు కమిషనరేట్ల షీ టీమ్స్ పోలీసులు పట్టుకున్నారు. ఆయా నిందితులకు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. రెండోసారి పోలీసులకు చిక్కిన ఆకతాయిలపై ఎఫ్ఐఆర్లు, పెట్టీ కేసులు నమోదు చేస్తున్నారు. ఈ ఏడాది రాచకొండలో 176 మంది పోకీరీలపై ఎఫ్ఆర్లు, 195 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. అలాగే హైదరాబాద్‌లో 137 మందిపై ఎఫ్ఆర్లు, 426 మందిపై పెట్టీ కేసులు, సైబరాబాద్‌లో 82 మందిపై ఎఫ్ఆర్లు, 1,306 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. -
Andhra Pradesh: శభాష్.. ‘దిశ’
అనంతపురానికి చెందిన లావణ్య విజయవాడలో ఇంటర్ చదువుతోంది. ఇటీవల సెలవులకు ఇంటికి వెళ్లింది. తిరిగి కళాశాల వద్దకు వచ్చి దిగబెట్టడానికి తండ్రికి వీలుపడలేదు. బస్సు ఎక్కిద్దామని బస్టాండ్‌కు వచ్చాడు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే సెల్‌ఫోన్‌లోని ‘దిశ’ యాప్‌ను ఉపయోగించమని చెప్పాడు. ఇలా ఉపయోగించాలని చూపించబోగా ‘నాన్నా.. నాకు తెలుసులే’ అని లావణ్య చెప్పడంతో జాగ్రత్తలు చెప్పి వెనుదిరిగాడు. ఇలా లక్షలాది మందికి ‘దిశ’ ఓ ఫ్రెండ్‌గా, ఓ సోదరుడిగా, ఓ బాడీగార్డ్‌గా నిలిచిందనడంలో ఎలాంటి సందేహం లేదు. సాక్షి, అమరావతి: సినిమాల్లో చివరి సీన్లోనే పోలీసులు వస్తారని ఎన్నో దశాబ్దాలుగా చూపిస్తున్నారు. దుర్ఘటన జరిగాక తీరిగ్గా పోలీసులు వస్తారు తప్ప.. వెంటనే రక్షణ కల్పించరనే అపప్రద దేశ వ్యాప్తంగా పోలీసులపై ఉంది. కానీ, రాష్ట్ర పోలీసు శాఖ ఆ చరిత్రను తిరగరాస్తోంది. ఆపదలో ఉన్నామని ఇలా చెబితే చాలు అలా క్షణాల్లో అక్కడకు చేరుకుని భద్రత కల్పిస్తోంది. మహిళలు సంప్రదించగానే తక్షణం భద్రత కల్పించే వ్యవస్థను రూపొందించాలన్న సీఎం వైఎస్ జగన్ ఆలోచనలకు ఆచరణ రూపమే దిశ మొబైల్ యాప్. ఇది రక్షణ కోసం మహిళలకు ప్రభుత్వం అందించిన అస్త్రం. ఆధునిక సమాచార సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటూ రూపొందించిన ఈ యాప్ మహిళా భద్రతకు పూర్తి భరోసానిస్తోంది. ఈ యాప్‌ను రికార్డు స్థాయిలో మహిళలు డౌన్లోడ్ చేసుకుంటుండటమే అందుకు నిదర్శనం. ఇప్పటి వరకు 1,10,40,102 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఏ మొబైల్ యాప్‌ను కూడా ఇంత భారీ స్థాయిలో ఎవరూ డౌన్లోడ్ చేసుకుని, రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. క్షణాల్లో ఆపన్న హస్తం.. ఇప్పటి వరకు దిశ యాప్ ద్వారా 9.60 లక్షల ఎస్ఓఎస్ వినతులు దిశ కమాండ్ కంట్రోల్‌కు చేరాయి. యాప్ డౌన్లోడ్ చేసుకోగానే యాప్ పని తీరు పరీక్షించేందుకు చేసే ఎస్ఓఎస్ వినతులూ అత్యధికంగా ఉన్నాయి. అలాగే, ఇప్పటి వరకు చర్యలు తీసుకోదగిన 23,039 ఎస్ఓఎస్ వినతులు వచ్చాయి. పోలీసులు తక్షణం స్పందించి చర్యలు చేపట్టారు. ప్రమాదకర పరిస్థితుల్లో చిక్కుకున్న 1,237 మందికి భద్రత కల్పించారు. నేరాలకు యత్నించిన కేసుల్లో 2,323 మందిపై ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. మొత్తంగా 3,560 ఘటనల్లో బాధితులకు అండగా నిలిచారు. పటిష్ట వ్యవస్థతో సమర్థ పర్యవేక్షణ దిశ యాప్ సమర్థవంతంగా పని చేసేందుకు రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో ఒక అదనపు ఎస్పీ, ఒక డీఎస్పీ, 15 మంది ఇతర అధికారులతో కూడిన బృందం 24/7 కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దిశ యాప్ పని తీరును సాంకేతిక సమస్యల్లేకుండా చూసేందుకు 51 మందితో కూడిన సహాయక బృందాన్ని కూడా నెలకొల్పింది. ఇక గస్తీ విధుల కోసం 900 ద్విచక్ర వాహనాలతోపాటు 163 బోలెరో వాహనాలను సమకూర్చింది. దాదాపు 3 వేల పోలీసు వాహనాలకు జీపీఎస్ ద్వారా దిశ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానించారు. ఫోరెన్సిక్ సైన్స్ విభాగాన్నీ బలోపేతం చేసింది. కేంద్ర హోంశాఖ ప్రమాణాల ప్రకారం 60 రోజుల్లోపే రాష్ట్ర పోలీసులు అత్యధిక కేసుల్లో చార్జ్‌షీట్ దాఖలు చేస్తున్నారు. దోషులను గుర్తించి సకాలంలో శిక్షలు పడేలా చూస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో అత్యాచారం–హత్య కేసుల దర్యాప్తునకు సగటున 222 రోజులు సమయం పట్టగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కేవలం సగటున 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేస్తున్నారు. జాతీయ స్థాయిలో 19 అవార్డులు దిశ యాప్ ప్రభావంతో రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక (ఎన్సీఆర్బీ)–2021 వెల్లడించింది. ప్రతి లక్ష జనాభాకు తెలంగాణలో మహిళలపై నేరాల కేసులు 111.2 నమోదవుతుండగా కేరళలో 73.3 కేసులు ఉన్నాయి. అదే ఏపీలో 67.2 కేసులు నమోదవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారం–హత్య కేసులు గణనీయంగా తగ్గాయి. 2019లో ఆరు, 2020లో ఐదు కేసులు నమోదు కాగా 2021లో రెండు కేసులు నమోదయ్యాయి. అత్యాచారయత్నం కేసులు 2019లో 177, 2021లో 162 కేసులు నమోదయ్యాయి. బాలికలపై అత్యాచార యత్నం కేసులు 2019లో 45, 2020లో 40, 2021లో 35 నమోదయ్యాయి. మహిళలపై దాడుల కేసులు ఎనిమిది శాతం తగ్గాయి. ఇంత సమర్థవంతంగా పని చేస్తున్న దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో ఇప్పటి వరకు 19 అవార్డులు వచ్చాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శం మహిళా భద్రతను ప్రథమ ప్రాధాన్యత అంశంగా తీసుకున్నాం. ఇందుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా దిశ యాప్‌పై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాం. డౌన్ లోడ్, రిజిస్ట్రేషన్లపై శ్రద్ధ తీసుకున్నాం. దాంతో ఏపీలో మహిళలపై వేధింపులు తగ్గాయని జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. దిశ యాప్ పనితీరును ఇతర రాష్ట్రాల పోలీసు శాఖలు కూడా పరిశీలించాయి. దిశ వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. – కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, డీజీపీ దిశ యాప్ మహిళలకు ఒక వరం ఆపదలో ఉన్న మహిళలకు దిశ యాప్ ఎంతోగానో ఉపయోగపడుతుంది. పోలీస్ అవసరం ఉన్న వారు ఎస్ఓఎస్ బటన్ నొక్కడం ద్వారా సత్వర సహాయం అందుతుంది. ఆపదలో ఉన్నప్పుడు కాల్ చేసే అవకాశం లేకపోతే ఫోన్‌ను నాలుగైదుసార్లు షేక్ చేస్తే చాలు.. పోలీసులకు సమాచారం అందుతుంది. ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ మహిళలపై దాడులు ఆపలేకపోతున్న పరిస్థితుల్లో దిశ యాప్ ఒక వరం లాంటిది. – కె శ్యామల, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పోక్సో కోర్టు యాప్‌పై అవగాహన పెంచుకోవాలి దిశా యాప్ మహిళలకు అండగా నిలుస్తోంది. విద్యార్థినులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది. పెద్దగా చదువుకోని మహిళలు కూడా ఈ యాప్‌ను సులువుగా ఉపయోగించవచ్చు. మహిళలు, విద్యార్థినులు ఈ యాప్‌పై అవగాహన పెంచుకోవాలి. – పి.రమణమ్మ, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, విజయనగరం. విజయనగరం జిల్లా పూసపాటిరేగలో ఓ యువతిని రాంబాబు అనే యువకుడు ప్రేమిస్తున్నానని నమ్మించాడు. వారి పెళ్లికి పెద్దలు కూడా సమ్మతించారు. కానీ, ఆ యువతిపై అనుమానం పెంచుకున్న రాంబాబు ఆమెను అడ్డు తొలగించుకోవాలని భావించాడు. ఆమె ఇంట్లోకి ప్రవేశించి, ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీన్ని గుర్తించిన ఆ యువతి సోదరి దిశ యాప్ ద్వారా పోలీసులను సంప్రదించగా వారు కేవలం ఆరు నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న రాంబాబును అరెస్టు చేశారు. విజయవాడలో ఓ బిడ్డకు తల్లి అయిన ఒంటరి మహిళను ఓ యువకుడు నమ్మించి మోసగించాడు. దాంతో ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తన బిడ్డను సంరక్షించమని దిశ యాప్ ద్వారా పోలీసులను కోరింది. పోలీసులు కేవలం 3 నిమిషాల్లోనే సంఘటన స్థలానికి చేరుకుని ఆమెను ఆస్పత్రికి తరలించి ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఆమెను మోసగించిన యువకుడిపై కేసు నమోదు చేశారు. మహిళలకు ఒక భరోసా ప్రయాణ సమయంలో దిశ యాప్‌లో ఉండే ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉపయోగించి గమ్య స్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. ప్రయాణించే వాహనం దారి తప్పితే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్‌కు తెలుస్తుంది. అప్పుడు పోలీసులు వెంటనే స్పందించే తీరు హర్షణీయం. సీఎం వైఎస్ జగన్ మహిళల భద్రతకు ఏర్పాటు చేసిన దిశ యాప్ ఎంతో భరోసా కల్పిస్తోంది. – జి.రత్నకుమారి, గృహిణి, గుంటూరు -
చైన్ స్నాచర్స్, ఈవ్ టీజర్లకు చెక్!..'శక్తి స్క్వాడ్' ఎంట్రీ
జార్ఖండ్: దసరా నవరాత్రుల సందర్భంగా పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు దేవాలయాలకు వెళ్లి పూజలు నిర్వహిస్తుంటారు. ఇదే అదనుగా చేసుకుని ఈవ్ టీజర్లు, చైన్ స్నాచర్స్, పోకిరి వెధవలు రెచ్చిపోతుంటారు. అందుకోసం అని ఈ పండుగ సందర్భంగా మహిళల రక్షణ కోసం 'శక్తి స్క్వాడ్' ఏర్పాటు చేస్తున్నట్లు జంషేడ్‌పూర్ పోలీసు అధికారులు తెలిపారు. మహిళలను నిర్భయంగా పూజలు నిర్వహించునేలా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా ఉండేలా 'శక్తి స్క్వాడ్' పేరుతో మహిళా మొబైల్ పోలీసు బలగాలు నగరమంతా మోహరిస్తారని అధికారులు తెలిపారు. ఈ మేరకు సూపరింటెండెంట్ పోలీస్ ప్రభాత్ కుమార్, జిల్ మెజిస్ట్రేట్ నందకుమార్ శుక్రవారం మహిళల భద్రత కోసం లాంఛనంగా ఈ శక్తి స్క్వాడ్‌ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ శక్తి స్క్వాడ్ సుమారు 25 పింక్ స్కూటీలతో ఈ పండగ సీజన్లో నగరమంతా గస్తీ కాస్తారని అన్నారు. ముఖ్యంగా దుర్గా పూజ కోసం మహిళలు నిర్భయంగా దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకోవాలనే ఉద్దేశంతో, వారి భద్రత కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఒకవేళ ఏదైన సమస్య తలెత్తితే పింక్ స్కూటీ పెట్రోలింగ్ సభ్యులు 100కి డయల్ చేయడం లేదా సీనియర్ అధికారులను సంప్రదిస్తారని తెలిపారు. అవసరమనుకుంటే మరింతమంది సిబ్బందిని రంగంలోకి దింపుతామని కూడా చెప్పారు. ఈ పండుగ సీజన్లో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకూడదనే లక్ష్యంతో ఈ ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేగాదు తాము సోష్ల్ మీడియాపై కూడా నిఘా ఉంచామని చెప్పారు. ఎవరైన అసభ్యకరమైన వీడియోలు, మెసేజ్‌లు పెట్టడం లేదా ఫార్వార్డ్ చేయడం వంటివి చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. (చదవండి: మాజీ మంత్రిపై బెదిరింపుల ఆరోపణలు) -
Dovely: హైదరాబాద్‌లో తొలిసారిగా మహిళల కోసం
హైదరాబాద్‌లో సిటీ సర్వీసుల సంఖ్య గణనీయంగా తగ్గపోయింది. ఎంఎంటీఎస్ రైళ్లు ఇంకా పూర్తి స్థాయిలో పట్టాలెక్కలేదు. మెట్రోరైలు ఉన్నా రాత్రి వేళలో సర్వీసులు లేవు. ఈ తరుణంలో అత్యవసర సమయంలో బయటకు వెళ్లాలనుకునే మహిళల కోసం నగరంలో డోవ్లీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. మహిళ సేఫ్టీకే అధిక ప్రాధాన్యం ఇస్తూ ఈ సర్వీసును ప్రారంభించారు. మహిళలు.. మహిళలు నగరానికి చెందిన జైనాబ్ కాతూన్, ఉజ్మా కాతూన్, మసరట్ ఫాతిమాలు డోవ్లీ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు. వీరికి ఓబైదుల్లా ఖాన్ సహకారం అందించారు. ఓలా, ర్యాపిడో తరహాలో రెంటల్ బైక్ (బైక్ ట్యాక్సీ) సర్వీసులు డోవ్లీ అందిస్తుంది. అయితే డోవ్లీలో రైడర్‌గా మహిళలే ఉండగా ఇందుగా కస్టమర్లకు కూడా కేవలం మహిళలే కావడం డోవ్లీ ప్రత్యేకత. అంటే మహిళల కోసం మహిళల చేత ఇక్కడ సేవలు అందివ్వబడతాయి. సెక్యూరిటీ కీలకం శాంతిభద్రతలు ఎంతగా మెరుగైనా ఇప్పటికీ మహిళల భద్రత విషయంలో సరికొత్త సవాళ్లు ఉదయిస్తూనే ఉన్నాయి. అందుకే విమెన్ సెక్యూరిటీకి పెద్ద పీట వేస్తూ డోవ్లీని అందుబాటులో తెచ్చారు. రైడ్ మొదలైనప్పటి నుంచి ఎండ్ అయ్యే వరకు ప్రతి క్షణం ప్రయాణాన్ని మానిటర్ చేస్తుంటారు. అప్పటి వరకు రైడర్ లైవ్ లొకేషన్‌ను ఆన్‌లోనే ఉంచాల్సి ఉంటుంది. వాట్సాప్ వేదికగా వాట్సాప్ వేదికగా డోవ్లీ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. డోవ్లీ పేరుతో యాప్ కూడా అందుబాటులో ఉన్నప్పటికీ ఇంకా ప్లేస్టోర్, యాప్స్టోర్లలో అందుబాటులోకి తేలేదు. ప్రస్తుతం డోవ్లీలో కస్టమర్ల సంఖ్య నాలుగు వందలు ఉండగా రైడర్ల సంఖ్య ఇరవైకి పైగా ఉన్నారు. అతి త్వరలోనే రైడర్ల సంఖ్యను రెండు వందల వరకు తీసుకుళ్లి నగరంలో విరివిరిగా సేవలు అందించే యోచనలో డోవ్లీ ఫౌండర్లు ఉన్నారు. చదవండి: ఇది చాలా సీరియస్ ప్రాబ్లెమ్.. పట్టించుకోక పోతే అంతే సంగతులు -
‘భార్యను కొట్టినా పర్వాలేదండి’.. తెలుగు రాష్ట్రాలే టాప్..
సాక్షి, అమరావతి: దేశంలో మహిళా రక్షణకు ప్రభుత్వాలు అనేక చట్టాలు చేస్తుంటే.. అదే సమయంలో మహిళలు కొన్ని సందర్భాల్లో గృహ హింస పర్వాలేదని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్)–5లో చాలా మంది భార్యలు కొన్ని సందర్భాల్లో తమ భర్తలు చేయి చేసుకోవడాన్ని సమర్థించడం గమనార్హం. ఇందులో తెలుగు రాష్ట్రాల్లోని మహిళలు ఎక్కువగా ఉన్నారు. భర్తకు చెప్పకుండా బయటకు వెళ్లడం, ఇంటిని, పిల్లలను నిర్లక్ష్యం చేయడం, భర్తతో వితండవాదం, నమ్మకద్రోహం, అత్తమామలను అగౌరవ పరచడం తదితర సందర్భాల్లో భర్త అవసరమైతే భార్యపై చేయి చేసుకోవచ్చని దేశ వ్యాప్తంగా 45.4 శాతం మంది మహిళలు, 44 శాతం మంది పురుషులు అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని గత సర్వేతో పోలిస్తే మహిళల్లో 7 శాతం తగ్గగా, పురుషుల్లో రెండు శాతం పెరిగింది. చదవండి: సిద్దిపేట జిల్లా గుడాటిపల్లిలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీఛార్జ్ తెలుగు రాష్ట్రాలే టాప్.. నిర్దిష్ట కారణాలతో భార్యను కొట్టడాన్ని సమర్థించే మహిళల్లో తెలంగాణ (83.8 శాతం) అగ్ర స్థానంలో, ఏపీ (83.6 శాతం) రెండో స్థానంలో నిలిచింది. కర్ణాటకలో అత్యధికంగా పురుషులు (81.9 శాతం) భార్యలపై చేయి చేసుకోవచ్చన్నారు. హిమాచల్ ప్రదేశ్, దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయూలో మాత్రం అతి తక్కువ మంది భార్యలు మాత్రమే భర్తలు కొట్టడాన్ని సమర్థించారు. భర్తలు చేయి చేసుకోవచ్చనే అభిప్రాయం మహిళల్లో వయసుతో పాటు పెరుగుతుండగా, పురుషుల్లో తగ్గుతోంది. భర్తలు దాదాపు 25 శాతం భార్యలను చెంప దెబ్బ కొడుతున్నట్టు సర్వే పేర్కొంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా భర్యను కొట్టడంలో తప్పులేదనే అభిప్రాయం వ్యక్తమైంది. అత్తమామలను సరిగా చూసుకోని సందర్భంలో భార్యను కొట్టొచ్చని 32 శాతం మహిళలు, 31 శాతం పురుషులు చెప్పారు. -
Women Safety: ఈ ‘బ్రేస్లెట్’, ‘లాకెట్’ మీ దగ్గర ఉన్నాయంటే..
ధర్మం వైపు నిలిస్తే దర్భపోచ కూడా గర్జిస్తుంది...అనేది పెద్దల మాట.ఆపద చుట్టుముడితే ఈ చిట్టిపొట్టి ఆభరణాలు కూడా ఆయుధాలై గర్జిస్తాయనేది నేటి మాట... రివోలర్: దీన్ని కీచైన్‌కు తగిలించుకోవచ్చు. దుస్తులకు స్టైలీష్‌గా పిన్ చేసుకోవచ్చు. ఇది వైఫైతో పనిచేస్తుంది. అత్యవసర సమయంలో సింగిల్క్లిక్తో మన కుటుంబసభ్యులకు ప్రమాద హెచ్చరిక వెళ్లిపోతుంది. ‘అవసరం నుంచే ఆవిష్కరణ’ అన్నట్లు ఆపద సమయం నుంచి పుట్టుకువచ్చిందే ఈ రివోలర్. ఈ కంపెనీ సీయివో జాక్వీలైన్ రోజ్ సోదరి రెండుసార్లు లైంగిక వేధింపుల ప్రమాదం నుంచి బయటపడింది. ఆ చేదు జ్ఞాపకాలను దృష్టిలో పెట్టుకొని, చాలామంది సర్వైవర్లతో మాట్లాడి ఈ ‘రివోలర్’ను డిజైన్ చేసింది జాక్వీలైన్. న్యూ డీల్ డిజైన్ అనే డిజైనింగ్ స్టూడియో ఆకట్టుకునే రకరకాల సేఫ్టీ డివైజ్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి డిజైన్‌లో పాలుపంచుకున్న జెనిఫర్ లాంగ్ ఒకప్పుడు లైంగిక వేధింపుల బాధితురాలే. ‘సొనాటా వాచ్ ఏసీటి’ అనేది టైమ్ చూపించడమే కాదు. మన టైమ్ బాగో లేనప్పుడు రక్షణగా నిలుస్తుంది. ఆపద సమయంలో వాచ్‌ని క్లిక్ చేస్తే కుటుంబసభ్యులకు మనం ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే సమాచారం చేరిపోతుంది. స్టిలెట్టో: ఈ వేరబుల్ టెక్‌ను బ్రేస్లెట్లాగా చేతికి ధరించవచ్చు. స్టైలీష్ లుక్‌తో నెక్లెస్‌లా మెడలో వేసుకోవచ్చు. ఆపద సమయంలో దీన్ని సింగిల్ప్రెస్ చేస్తే చాలు ఎమర్జెన్సీ కాంటాక్ట్ లీస్ట్లోని వారికి సమాచారం చేరవేసి అలార్ట్ చేస్తుంది. అథెనా: లాకెట్‌లా అందంగా కనిపించే ఈ నల్లని గ్యాడ్జెట్‌ను మెడలో వేసుకోవచ్చు. అవసరం అనుకుంటే పర్స్‌కు పిన్ చేయవచ్చు. దీని సహాయంతో మనం ప్రమాదకరమైన పరిస్థితులలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులకు మెరుపువేగంతో సమాచారం చేరవేయవచ్చు. సేఫ్‌లెట్: ఈ సేఫ్లెట్కు రెండు బటన్లు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో వీటిని నొక్కడం ద్వారా, సమాచారం మనవాళ్లకు చేరిపోతుంది. ఇది యూజర్ సెల్‌ఫోన్‌కు సింకై ఉంటుంది. ఆడియో రికార్డింగ్ చేస్తుంది. చదవండి: సైబర్ టాక్: కొనకుండానే లాటరీ వచ్చిందా?! -
మహిళలకు అండగా ‘దిశ’ స్టేషన్లు
పీఎం పాలెం (భీమిలి): దిశ పోలీస్స్టేషన్లు మహిళల రక్షణకు నిరంతరం అండగా ఉంటాయని రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత చెప్పారు . శనివారం విశాఖలోని ఎండాడ దిశ పోలీస్‌స్టేషన్‌ను ఆమె సందర్శించారు. మహిళలు, బాలికలపై జరుగుతోన్న అమానుష ఉదంతాలు తనని తీవ్రంగా కలిచి వేస్తున్నాయన్నారు. దిశ పోలీస్స్టేషన్లు రాష్ట్రవ్యాప్తంగా ఆపదలో ఉన్న 900 మంది మహిళలకు రక్షణ కల్పించాయని వివరించారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1.24 కోట్ల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ దిశ పోలీస్ స్టేషన్ పరిధిలో 7.31 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నట్లు తెలిపారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తరవాత విధిగా దిశ పోలీస్ స్టేషన్లో రిజిస్ట్రేషన్ (ఎస్‌వోఎస్) చేయించుకోవాలని సూచించారు. ఎస్‌వోఎస్ సమయంలో కొంత సమాచారం ఇవ్వవలసి ఉంటుందని అంతమాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. మహిళలకు అవగాహన కల్పించడానికి స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రదర్శనను ఆమె తిలకించారు. -
తేడా వస్తే.. ఆ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు.. వాళ్లకు అలర్ట్ వెళ్లిపోద్ది
ఆరోజు రాత్రి పనిఒత్తిడి వల్ల శ్వేతకు ఆఫీసు నుంచి బయటకు రావడం బాగా ఆలస్యం అయింది. ఆ సమయంలో వాళ్ల ఏరియాకు వెళ్లే బస్సులు లేవు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆటో ఎక్కాల్సి వచ్చింది. కొంత దూరం వెళ్లాక డ్రైవర్ ప్రవర్తనలో మార్పు కనిపించింది. అట్టే ఆలస్యం చేయకుండా తన మెడలోని లాకెట్‌ను రెండుసార్లు నొక్కింది శ్వేత. ప్రమాదం నుంచి బయటపడింది. అది మంత్రం దట్టించిన లాకెట్ కాదు. మామూలు లాకెట్టే...కాకపోతే టెక్నో లాకెట్టు! ‘ఆభరణాలు అందం కోసం’ అనేది నిన్నటి మాట. ‘అభరణాలు అందం కోసమే కాదు స్వీయరక్షణ కోసం కూడా’ అనేది నేటి మాట. ‘ఏ పుట్టలో ఏ పాము ఉందో’ అన్నట్లుగా ఎక్కడ, ఎప్పుడు, ఎలా ప్రమాదాలు పొంచి ఉంటాయో తెలియదు మనకు. వైద్యసూక్తి ‘చికిత్స కంటే నివారణ ముఖ్యం’లాగే మన వ్యక్తిగత భద్రత విషయంలోనూ నివారణ అనేది ముఖ్యం కావాలి. ప్రమాదాలను నివారించడంలో అందమైన ఆభరణాలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయి. మచ్చుకు కొన్ని... మీ మెడలో కనిపించే ఇన్విసావేర్ లాకెట్‌ను చూసిన వాళ్లు ‘ఎంత బాగుందో’ అంటారు. అయితే ఈ లాకెట్పని అందంగా కనిపించడం మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ. మీరు ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు దీనిలోని హిడెన్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు మీ కుటుంబసభ్యులు, స్నేహితులలో అయిదుమందికి మీరు ప్రమాదంలో ఉన్నట్లు తెలియజేసే మెసేజ్ చేరుతుంది. బ్లూటూత్‌తో అనుసంధానమై ఉన్న ఈ లాకెట్ జీపిఎస్ లొకేషన్ తెలియజేస్తుంది. ఈ గోల్డ్ప్లేటెడ్ లాకెట్ మన భద్రత విషయంలో బంగారంలాంటి విలువైనది అని చెప్పుకోవచ్చు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న ‘పెండెంట్ విత్ వైట్సేఫర్ వీఐ.0’ లాకెట్ గురించి... గ్రీన్‌కలర్‌లో మెరిసిపోయే ఈ లాకెట్‌లోని బాక్స్‌లో మైక్రో యుఎస్బి అమర్చబడి ఉంటుంది. బ్లూటూత్ టెక్నాలజీతో, ‘సేఫర్ బీ లీఫ్’ యాప్‌తో కలిసిపనిచేస్తుంది. ప్రమాదపరిస్థితుల్లో ఈ లాకెట్ బటన్‌ను రెండుసార్లు నొక్కితే చాలు మన వాళ్లకు సమాచారం చేరిపోతుంది. సమీపంలో ఉన్న పోలిస్‌స్టేషన్, హాస్పిటల్‌ను యూజర్ నేవిగేట్ చేసే ఆప్షన్ ఉంది. మెడలో సులభంగా ఇమిడిపోయి, ఆకర్షణీయంగా కనిపించే గ్లాస్ పెండెంట్ ‘సేఫర్’ కూడా ప్రమాద సమయాలలో మన వాళ్లను అప్రమత్తం చేయడానికి ఉపయోగపడుతుంది. ఐఐటీ–దిల్లీ, దిల్లీ టెక్నలాజికల్ యూనివర్శిటీ విద్యార్థులు దీనికి రూపకల్సన చేశారు. ‘ఒంటరి సమయంలో కూడా నా చుట్టూ పదిమంది ఉన్నారు అనే ధైర్యాన్ని సేఫర్ ఇస్తుంది’ అంటున్నారు. ‘ఏదో కొన్నామంటే కొన్నాం అన్నట్లుగా కాకుండా ప్రతిరోజు విధిగా లాకెట్‌ను మెడలో ధరించాలి’ అంటున్నారు భద్రత నిపుణులు. -
మహిళల అభివృధ్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు
-
ముంబైలో మరో 7 వేల సీసీ కెమెరాలు.. ఎందుకంటే?
సాక్షి, ముంబై: మహిళలు, ఆడ పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకొని ముంబైలో అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మహారాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి సతేజ్ పాటిల్ వెల్లడించారు. ఏటా ముంబైలో వందలాది మంది ఆడ పిల్లలు అదృశ్యమవుతున్నారు. గడిచిన మూడేళ్లలో 3,519 మంది ఆడ పిల్లలు అదృశ్యమయ్యారు. ఆధారాలు, సీసీ కెమెరాలు అనేక చోట్ల లేకపోవడంతో వారి ఆచూకీ లభించడం లేదు. ఫలితంగా ఆ అదృశ్యమైన కేసులు చేధించడంలో పోలీసులు సఫలీకృతం కాలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నగరంలో ఉన్న 5 వేల సీసీ కెమెరాలకు అదనంగా మరో 7 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సతేజ్ పాటిల్ వివరించారు. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం రోజురోజుకూ విస్తరిస్తోంది. ఇదే క్రమంలో నగరంలో నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. పరీక్ష తప్పడంతో తల్లిదండ్రులు మందలించారని కొందరు, గొడవ పడి, ప్రేమలో పడి మరికొందరు ఇళ్ల నుంచి పారిపోతారు. ఆ తరువాత ఇంటికి వెళ్లలేక, ఎక్కడికెళ్లాలో తెలియక రోడ్లపై, బస్టాండ్లలో, రైల్వే స్టేషన్ ఆవరణల్లో, ప్లాట్‌ఫారాలపై తిరుగుతుంటారు. ఆ తరువాత ఎవరి మాయలోనో పడి అదృశ్యమవుతారు. (చదవండి: 15-18 యేళ్ల వయసు వారికి జనవరి 3 నుంచి కోవిడ్ వ్యాక్సినేషన్!) ఇలాంటి కేసులు నిత్యం ముంబైలోని వివిధ పోలీసు స్టేషన్లలో నమోదవుతూనే ఉంటాయి. ఇందులో కొన్ని కేసులను పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చేధిస్తారు. మరికొన్ని కేసులు ఆధారాలు లేక అలాగే పెండింగులో ఉంటాయి. దీంతో అదనంగా మరిన్ని సీసీ కెమెరాలు అమర్చితే అదృశ్యమైన యువతులు, బాలికలు ఎలా వెళ్లారు, ఏ మార్గంలో వెళ్లారో ఆచూకీ వెంటనే కనుక్కొని కేసులను సత్వరమే పరిష్కరించవచ్చని సతేజ్ పాటిల్ అభిప్రాయపడ్డారు. కేసులు చేధించకపోవడంతో ఇప్పటికే అనేక రంగాల నుంచి పోలీసు శాఖ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇక అలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. (చదవండి: పరిస్థితి చేయి దాటుతోందా? ఒక్క రోజులోనే లక్ష కోవిడ్ పాజిటివ్ కేసులు..) -
కన్నీటిని కన్నీటితోనే తుడవలేం! స్త్రీలపై జరిగే హింసకు వ్యతిరేకంగా పోరాడుదాం..
International Day for the Elimination of Violence against Women: ఒకరోజు వెనక్కి వెళితే... కేరళలోని ఎర్నాకుళంలో పర్వీన్ అనే లా స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంది. తన చేతిరాతతో కూడిన ఒక సూసైడ్ నోట్ సంఘటన స్థలంలో దొరికింది. భర్త, అత్తమామలు పెట్టే హింసను తట్టుకోలేక చనిపోతున్నానని రాసింది. రెండు రోజులు వెనక్కి వెళితే... కెన్యాలో అకియో అనే పేరుగల స్త్రీ హత్యకు గురైంది. చంపింది ఎవరో కాదు... భర్తే. అనుమాన పీడితుడైన భర్త అకియోను తరచు హింసించేవాడు. ఒకరోజు బాగా తాగి వచ్చి అందరూ చూస్తుండగానే భార్యను హత్య చేశాడు. కేరళ నుంచి కెన్యా వరకు, అమెరికా నుంచి చైనా వరకు...దేశాల మధ్య భౌగోళిక దూరాలు ఉండొచ్చుగానీ, స్త్రీలపై జరిగే హింస విషయంలో మాత్రం ఎలాంటి దూరాలు లేవు. ఇక్కడెంతో అక్కడంతే! అక్కడెంతో ఇక్కడ అంతే!! బాల్యవివాహాలు, వరకట్న వేధింపులు, వర్ణవివక్షతతో కూడిన హింస, లింగనిర్ధారణ పరీక్షలు, భ్రూణహత్యలు, పరువు హత్యలు... ఇలా వివిధ రూపాల్లో స్త్రీలపై జరిగే హింసను నిరోధించడానికి ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం స్త్రీ హింసా వ్యతిరేక దినం (నవంబర్ 25) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటుంది, ఈ సంవత్సరం ‘ఆరేంజ్ ది వరల్డ్: ఫండ్, రెస్పాండ్, ప్రివెంట్, కలెక్ట్’ గ్లోబల్ థీమ్‌తో నేటి నుంచి డిసెంబర్ 10 (మానవ హక్కుల దినోత్సవం) వరకు 16 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో ప్రపంచవ్యాప్తంగా 6000కు పైగా ఉమెన్ ఆర్గనైజేషన్స్, 180 దేశాల ప్రతినిధులు, మరెంతో మంది స్త్రీ ఉద్యమ కార్యకర్తలు పాల్గొంటారు. చదవండి: Winter Heart Attacks: అందుకే శీతాకాలంలో హార్ట్ అటాక్స్ అధికంగా సంభవిస్తాయి..! కన్నీటిని కన్నీటితోనే తుడవలేం...కార్యాచరణ కావాలి...ప్రణాళిక కావాలి. ఆచరణ వైపు వడివడిగా అడుగులు పడాలి. ఈ సమావేశాలు అలాంటి పనే చేస్తున్నాయి. లోకల్, కంట్రీ, గ్లోబల్ నేపథ్యంలో ఆలోచనలు, ఆచరణలను సమన్వయం చేస్తున్నాయి. ‘ఇదిగో మా దగ్గర ఇలా చేశాం. మీ దగ్గర మాత్రం ఎందుకు చేయరు’ అని ఒక సూచన ఇస్తాయి. హింసకు వ్యతిరేకంగా పోరాడే స్త్రీ యోధురాళ్ల ఉపన్యాసాలు వెయ్యి ఏనుగుల బలాన్ని ఇస్తాయి. ‘ఎక్కడో మహిళలపై జరిగే హింస గురించి మాట్లాడడానికి ముందు, మీ ఇంట్లో అలాంటి హింస జరగకుండా చర్యలు తీసుకోండి’ అని దేశ దేశాలకు ఉపదేశం ఇస్తాయి. కాలంతో పాటు హింసా రూపాలు మారుతున్నాయి. కొత్తగా ‘డిజిటల్ వయొలెన్స్’ వచ్చింది... ఇలాంటి ఎన్నో వికృతరూపాల గురించి ఈ సమావేశాలు లోతుగా చర్చిస్తాయి. నిర్మాణాత్మకమైన పరిష్కార మార్గాలు ఆలోచిస్తాయి. ‘ఎండ్ వయొలెన్స్ అగెనెస్ట్ ఉమెన్ నౌ’ అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదం ఇచ్చేలా చేస్తాయి. చదవండి: Octopus Unknown Facts: 9 మెదడులు, 3 గుండెలు.. ఐనా పాపం పిల్లలు పుట్టగానే మరణిస్తుంది!! -
SHE Teams: ఏడేళ్లుగా ‘ఆమె’కు నిరంతరం రక్షణగా..
సంతోషకరమైన జీవనం వైపుగా అడుగులు వేయడానికి భద్రమైన మార్గంలో పయనించడానికి సమాజం మనందరికీ చేదోడు వాదోడుగా నిలుస్తుంది. కానీ, ఈ సమాజంలో మహిళ రక్షణ ఎప్పుడూ ప్రశ్నార్థకంగానే ఉంటోంది. దీనికి సమాధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటైంది ‘షీ టీమ్’. ఉమెన్ సేఫ్టీ వింగ్ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీల రక్షణ కోసం 24 గంటలూ పనిచేస్తూ మహిళా నేస్తంగా మారిన ‘షీ టీమ్’ సేవలకు ఏడేళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో మహిళల భద్రత ఏవిధంగా ఉంది? పెరుగుతున్న నేరాలు, మారుతున్న విధానాలు తీసుకుంటున్న చర్యల గురించి పూర్తి సమాచారంతో మన ముందుంచింది తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్. వేధింపులకు చెక్‌పెట్టడమే లక్ష్యం – స్వాతి లక్రా ► తెలంగాణలో ‘షీ టీమ్’ ఏర్పాటై ఏడేళ్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించిన ఫలితాలను చూసినప్పుడు మీకేమనిపించింది? ‘షీ టీమ్’ గురించి 90 శాతం ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో అవగాహన రావడం చాలా సంతోషాన్ని కలిగించింది. ఒక స్వచ్ఛంద సంస్థ ద్వారా ఇదే విషయం మీద సర్వే చేశాం. దాంట్లో మంచి రేటింగ్ వచ్చింది. ప్రజలకు ‘షీ టీమ్’ సేవలు బాగా నచ్చాయి. మంచి ఫలితాలు వచ్చాయి. ప్రతి యేటా 5 వేలకు పైగా ఫిర్యాదులపై చర్యలు తీసుకుంటున్నాం. మహిళల రక్షణ, వారి భద్రతకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఒక వేదిక ఉండాలనుకుని ప్రభుత్వం అక్టోబర్ 24, 2014లో హైదరాబాద్‌లో షీ టీమ్‌ను ప్రారంభించింది. ఏప్రిల్, 2015లో తెలంగాణ మొత్తంగా షీ టీమ్ సేవలను విస్తృతం చేసింది. ► ఇన్నేళ్లుగా వచ్చిన మహిళలకు సంబంధించిన ఫిర్యాదులు, ఇటీవల మహిళలపై నేరాలకు పాల్పడుతున్న సంఘటనలు ఎలాంటివి? గతంలో భౌతిక దాడులు, లైంగిక వేధింపులు, ఈవ్ టీజింగ్‌కు సంబంధించినవి మొదటి జాబితాలో ఉండేవి. దాదాపు వందలో 60 శాతం ఫోన్ వేధింపులు, సామాజిక మాధ్యమాలకు సంబంధించిన ఫిర్యాదులు ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల్లో వాట్సప్ ద్వారా వచ్చేవి ఎక్కువ ఉండగా, డయల్ –100, ఫేస్బుక్, హ్యాక్ ఐ యాప్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్ నుంచి కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. ► సామాజిక మాధ్యమాల ద్వారా పెరిగే వేధింపులకు అడ్డుకట్ట వేయడానికి తీసుకుంటున్న చర్యలు? మహిళలు చాలా మంది వేధింపుల బారిన పడుతున్నామని తెలిసినా ఫిర్యాదు చేయడానికి ఇంకా ముందుకు రావడం లేదు. ముందు వాళ్లలో చాలా మార్పు రావాలి. ఏ వేధింపులైనా వెంటనే మాకు తెలియజేయడం ద్వారా సత్వర పరిష్కారం లభిస్తుంది. ఉమన్ సేఫ్టీ వింగ్‌లో ప్రత్యేకంగా సైబర్ క్రైమ్‌కు సంబంధించి ‘షీ ల్యాబ్’ను కూడా ప్రారంభిస్తున్నాం. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ వేధింపులను సైబర్ నిపుణుల ద్వారా కనిపెట్టి, వీటికి అడ్డుకట్ట వేస్తున్నాం. ఇతర రాష్ట్రాల నుంచీ సైబర్ నేరస్తులు ఉంటున్నారు. ఇలాంటప్పుడు వారిని పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సాయమూ తీసుకుంటున్నాం. ఏఅగిఓ ఉ్గఉ మొబైల్ అప్లికేషన్ ఉంది. ఇది ఇప్పటికే 30 లక్షల మందికి పైగా రీచ్ అయ్యింది. మా వెబ్సైట్లో సోషల్‌మీడియాలో మహిళలు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే విధానాలపై పూర్తి సమాచారం ఉంచాం. వాటిని చదివి తెలుసుకోవచ్చు. ‘షీ టీమ్’ సమావేశం అనంతరం సభ్యులతో స్వాతి లక్రా ► షీ టీమ్‌లో మహిళా భద్రత కోసం ఎంత మంది వర్క్ చేస్తుంటారు? 33 శాతం మహిళలకు రిజర్వేషన్ వచ్చాక మహిళలు అధిక సంఖ్యలో పోలీసు విభాగంలోకి వస్తున్నారు. కానీ, ఇంకా తక్కువమంది మహిళా పోలీసులు ఈ విభాగంలో ఉండటం ఆలోచించ వలసిన విషయం. షీ టీమ్ బృందాలుగా రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తారు. ఒక బృందంలో 5 గురు సభ్యులు, ప్రతి బృందంలో తప్పనిసరిగా ఒక మహిళ ఉంటారు. వీళ్లు యూనిఫామ్‌లో కాకుండా సివిల్ డ్రెస్‌లో డిప్యూటీ సూపరిండెంట్ ఆఫీసర్ పర్యవేక్షణలో విధులను నిర్వర్తిస్తుంటారు. ఇదే విధానం తెలంగాణ మొత్తం ఉంటుంది. సుశిక్షితులైన వారే ఈ టీమ్‌లో ఉంటారు. అలాగే, సమాజంలో మహిళల స్థానం పట్ల అవగాహన, వారి పట్ల నడుచుకునే విధానం, ఆపరేషన్ నైపుణ్యాలు, పద్ధతులు, సాంకేతిక నైపుణ్యం, న్యాయపరమైన, చట్టపరమైన నిబంధనల పట్ల పూర్తి సమాచారం కలిగి ఉంటారు. ► మన సమాజ మూలాల్లోనే కుటుంబాల్లోనూ అమ్మాయిల పట్ల ఒక వివక్ష ఉంది. షీ టీమ్ ఏర్పాటై ఇన్నేళ్ల తర్వాత ఈ విధానంలో ఏమైనా మార్పు వచ్చిందంటారా? చాలా మార్పు వచ్చింది. వివక్ష లేకపోలేదు. కానీ, వివక్ష తీవ్రత తగ్గింది. 2016–17 సమయంలో అమ్మాయిలను వేధించేవారిలో చాలా మంది మైనర్ అబ్బాయిలను మేం పట్టుకున్నాం. వారికి కౌన్సెలింగ్ చేస్తూ వచ్చాం. దీంతో వారిలో మార్పు తీసుకురావడానికి జూనియర్, డిగ్రీ స్థాయి కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేశాం. స్వచ్ఛంద సంస్థలతో కలిసి ప్రోగ్రామ్‌లు చేశాం. ఇప్పుడు సర్వే చేస్తే మైనర్ అబ్బాయిలు వేధింపులకు పాల్పడటం లేదని తెలిసింది. అవగాహన కావచ్చు. కౌన్సెలింగ్ కావచ్చు. అన్నీ దోహదం చేస్తున్నాయి. కాలేజీల్లో అబ్బాయిలు కూడా షీ టీమ్ కార్యక్రమాల సమయంలో పాల్గొనడానికి స్వచ్ఛందంగా ముందుకువస్తున్నాయి. అమ్మాయిలను ఎలా చూడాలనే ఆలోచనల్లో మార్పు రావడానికి మేం చేస్తున్న కార్యక్రమాలు దోహదం చేస్తున్నాయి. ఇళ్లలో చూస్తే ఈ మార్పు చాలా నెమ్మదిగా ఉంది. మరొక బాధాకరమైన విషయం ఏంటంటే.. బధిరులను వేధించడం, వారిపై లైంగిక దాడులకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయి. బధిరుల పట్ల ఎలా నడుచుకోవాలనే విషయాల పట్ల కుటుంబాల నుంచే అబ్బాయిల్లో అవగాహన పెంచితే మరింత బాగుంటుంది. ► ఇటీవల చిన్నపిల్లలపై లైంగిక దాడుల సంఘటనలు ఎక్కువ వింటున్నాం. తెలిసినవారే నిందితులుగా ఉంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? నిజమే, పిల్లలపై దాడులు చేసేవారు 90 శాతం కంటే ఎక్కువ ఆ కుటుంబాలకు తెలిసినవారే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే కుటుంబాల నుంచి ఫిర్యాదు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఇంట్లో, ఇంటి చుట్టుపక్కల ఉండే ‘అంకుల్స్’ వల్ల ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. పిల్లలపై లైంగిక దాడి జరిగిందని తెలిసినప్పుడు తప్పనిసరిగా ఫిర్యాదు చేయాలి. ఆ నేరాన్ని దాచిపెట్టాలని చూసినా అది నేరమే. ఈ విషయాలు పిల్లలకు కూడా తెలియాలని పాఠశాలల్లో ‘సేఫ్–అన్ సేఫ్ టచ్’ పట్ల అవగాహన కల్పిస్తున్నాం. సమస్య తెలిసినప్పుడు టీచర్లు కూడా ఫిర్యాదు చేయాల్సిన బాధ్యత గురించి తెలియజేస్తున్నాం. ► మహిళకు సమస్య వచ్చి, మిమ్మల్ని కలిసిన తర్వాత ఆమె జీవితంలో నిలదొక్కుకోవడానికి ఎలాంటి భరోసా కల్పిస్తున్నారు? బాధితుల్లో ఎలాంటి అండ లేనివారికి ప్రభుత్వం నుంచి పరిహారం ఉంటుంది. వారు నిలదొక్కుకోవడానికి చదువు, జీవననైపుణ్యాలను కల్పించేందుకు తగిన శిక్షణ కూడా ఉంటుంది. ► చాలా వరకు మహిళా బాధితుల్లో ఇప్పటికీ పోలీసు స్టేషన్‌కి రావాలంటే ఒక తెలియని సందిగ్ధత ఉంటుంది. షీ టీమ్ వచ్చాక ఈ విధానంలో మార్పు వచ్చిందంటారా? గత పోలీసు స్టేషన్లు, నేటి పోలీసు స్టేషన్లను చూస్తే ఆ తేడా మీకే అర్థమవుతుంది. ఒక మంచి వాతావరణంలో మా సిబ్బంది పనిచేస్తున్నారు. ముఖ్యంగా లింగసమానతలు, సున్నితమైన విషయాల గురించిన అవగాహనతో పనిచేస్తున్నారు. ఒక మహిళ పోలీస్ స్టేషన్‌కు వస్తే ఆమెతో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలనే విషయాల పట్ల మార్పు వచ్చింది. అలాగే, ప్రతీ పోలీసు స్టేషన్ రిసెప్షన్లో ఒక మహిళ ఉంటుంది. దీని వల్ల మంచి మార్పుతోపాటు గతంలో ఉన్న సందిగ్ధతలు చాలా వరకు తగ్గాయి. ఒక మహిళ ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేస్తే, మేం వారిని నేరుగా సంప్రదించి వివరాలన్నీ తీసుకుంటున్నాం. అంటే, మహిళ పోలీసు స్టేషన్‌కు రాకుండానే ఆమెకు న్యాయం జరిగేలా చూస్తున్నాం. ► ఇతర రాష్ట్రాల్లో ‘షీ టీమ్’ లాంటి మహిళా రక్షణ కోసం చేస్తున్నæ విభాగాలున్నాయా? మనం వారి నుంచి స్ఫూర్తి పొందినవి ఉన్నాయా? తప్పకుండా ఉంటాయి. మన సెంటర్స్ ఏ విధంగా పనిచేస్తున్నాయో తెలుసుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం నుంచి వచ్చి చూస్తుంటారు. మేం కూడా మహిళా రక్షణలో ఇతర రాష్ట్రాల పోలీసు విభాగం చేస్తున్న కార్యక్రమాల గురించి తెలుసుకుంటుంటాం. ఇది రెండువైపులా ఉంటుంది. ► ఇక్కడి మహిళలు వేరే దేశాల్లో వేధింపులకు గురైన సందర్భాల్లో వచ్చిన ఫిర్యాదులు.. ఈ విధానంలో ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి? ఉమెన్ సేఫ్టీ వింగ్లోనే ‘ఎన్ఆర్ఐ సెల్’ కూడా ఏర్పాటు చేశాం. ఎన్ఆర్ఐ లను పెళ్లి చేసుకున్న మహిళలు విదేశాలకు వెళ్లిన తర్వాత వారిని వదిలేయడం, అదనపు కట్నం కోసం వేధించడం వంటి సంఘటనలు చూస్తున్నాం. ఇలాంటి వారి కోసం ఒక టీమ్ పని చేస్తుంది. లాయర్ ద్వారా, స్వచ్ఛంద సంస్థల నుంచి, ఎంబసీస్, విదేశీ మంత్రిత్వ శాఖ, ఆర్పీఓ .. అందరినీ సంప్రదించి ఆ సదరు మహిళకు ఎలా సాయం అందించాలో చూస్తున్నాం. కొన్ని విషయాల్లో టైమ్ పడుతుంది కానీ, మంచి ఫలితాలు వస్తున్నాయి. ► మహిళా రక్షణ విషయంలో ఇప్పటి వరకు ఉన్న చట్టాలు సరిపోతాయా? అదనంగా కొత్త చట్టాలను చేర్చాల్సిన అవసరం ఉందా? చట్టాలు చాలా ఉన్నాయి. వాటిని అమల్లో పెట్టడం ముఖ్యం. ఈ విషయంపైనే మేం దృష్టి పెడుతున్నాం. విచారణ త్వరగా పూర్తి చేయాలి. చార్జ్‌షీట్ ఫైల్ చేశాక త్వరగా బాధితులకు న్యాయం జరగాలి.. ఈ విధానంలోనే మేం పనిచేస్తున్నాం. ► సమాజంలో చోటు చేసుకోవాలనుకుంటున్న మార్పుల గురించి? దేశవ్యాప్తంగా పోలీసు విభాగంలో మహిళల సంఖ్య తక్కువే ఉంది. ఇప్పుడిప్పుడే మహిళా పోలీసుల సంఖ్య పెరుగుతోంది. మన సమాజంలో 50 శాతం మహిళలు ఉంటే అంత శాతం పోలీసు విభాగంలోనూ ఉండాలి. దీనివల్ల సమాజంలో ఉన్న మహిళలకు మరింత మేలు జరుగుతుంది. ఏ సమయంలోనైనా మహిళ ధైర్యంగా తన పనుల నిమిత్తం వెళ్లగలిగే పరిస్థితి రావాలనుకుంటున్నాను. ఆ రోజు తప్పక వస్తుంది అన్న నమ్మకమూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళల రక్షణే ధ్యేయంగా పనిచేస్తున్న ‘షీ టీమ్’, ఉమెన్ సేఫ్టీ వింగ్ ఇన్చార్జ్, అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డిఐజీ సుమతి ఇంటర్వ్యూలతో షీ టీమ్ గురించిన సమగ్ర సమాచారం. ఎంబీయే చేస్తున్న నాకు మా కాలేజీలో చదువుతున్న సురేష్ (పేరు మార్చడమైనది) ప్రేమిస్తున్నానంటూ దగ్గరయ్యాడు. ఏడాదిగా బాగానే ఉన్న సురేష్ అనుమానంతో విసిగిస్తుండటంతో భరించలేక బ్రేకప్ చెప్పేశాను. ఆనాటి నుంచి తన దగ్గరున్న ఫొటోలతో నన్ను బెదిరించడం మొదలుపెట్టాడు. నా ఫోన్లో ఉన్న మా బంధుమిత్రుల నెంబర్లన్నీ ట్యాప్‌చేసి, తీసుకొని వారందరికీ మా ప్రేమ గురించి, ఫొటోల గురించి చెబుతానని బెదిరించేవాడు. ఇది నా భవిష్యత్తుకే ప్రమాదం అనుకున్నాను. మా ఫ్రెండ్ ఇచ్చిన సలహాతో ‘షీ టీమ్’ను వాట్సప్ నెంబర్ ద్వారా సంప్రదించాను. పోలీసులు సురేష్‌ను హెచ్చరించి, అతని వద్ద నాకు సంబంధించి ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయించారు. ఇక నుంచి ఎలాంటి వేధింపు చర్యలకు పాల్పడబోనని రాతపూర్వకంగా రాయించుకొని, అతని మీద నిఘా పెట్టారు. రెండు నెలలుగా ఈ సమస్యతో నరకం చూసిన నాకు, షీ టీమ్ ద్వారా ఒక్క రోజులోనే పరిష్కారం దొరికింది. ఇప్పుడు హాయిగా ఉన్నాను. – బాధితురాలు మా అమ్మాయి ఏడవ తరగతి చదువుతుంది. సెలవులకు మా అమ్మ వాళ్ల ఊరు వెళ్లింది. అదే ఊళ్లో ఉంటున్న తెలిసిన వ్యక్తే మా అమ్మాయి పట్ల దారుణంగా ప్రవర్తించడమే కాకుండా, ఫొటోలు, వీడియోలు తీసి మమ్మల్ని మానసికంగా వేధించేవాడు. భరించలేక షీ టీమ్‌ను ఫోన్ ద్వారా సంప్రదించాం. షీ టీమ్ సదరు వ్యక్తి నుంచి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా సరైన విధంగా బుద్ధి చెప్పారు. ఏడాది నుంచి సమస్యేమీ లేకుండా మనశ్శాంతిగా ఉన్నాం. – మరో బాధితురాలి తల్లి అవగాహన తీసుకొస్తున్నాం– బి. సుమతి ► మహిళల వేధింపులకు సంబంధించి రోజూ ఎన్ని కేసులు ఫైల్ అవుతుంటాయి? రోజూ దాదాపు 20 నుంచి 25 కేసుల వరకు ఉంటాయి. వీటిలో లైంగిక వేధింపులు ఎక్కువ. స్నేహం, ప్రేమ పేరుతో దగ్గరయ్యి ఫొటోలు, వీడియోలు నలుగురిలో పెట్టి పరువు తీస్తామనే బెదిరింపులూ ఎక్కువే. పదేళ్ల లోపు చిన్నపిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉంటున్నాయి. వీటిలో తీవ్రత శాతాన్ని బట్టి మానిటరింగ్ ఉంటుంది. ప్రధానంగా నేరాల తీవ్రతను బట్టి ఒక షెడ్యూల్‌ను రూపొందించాం. పిల్లలు, మహిళలపై పబ్లిక్‌గా జరిగే దాడులు, లైంగిక హింస, మనుషుల అక్రమరవాణా, సైబర్‌క్రైమ్, గృహహింస ప్రధానమైనవి. ► షీ టీమ్ ఆధ్వర్యంలో పిల్లల భద్రత కోసం చేస్తున్న కార్యక్రమాలు గురించి? చిన్న పిల్లల్లో అవగాహన కల్పించడానికి రాష్ట్రస్థాయిలో స్కూళ్లను ఎంచుకున్నాం. షీ టీమ్, సైబర్ నిపుణులు, స్వచ్ఛంధ సంస్థ భాగస్వామ్యంతో ఇప్పటికి 1650 స్కూళ్లలో ‘సైబర్ కాంగ్రెస్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశాం. తెలంగాణలోని 33 జిల్లాల్లోనూ ప్రతి స్కూల్ నుంచి విద్యార్థులు పాల్గొనేలా చూస్తున్నాం. ► టీనేజర్లు, యువతలో మహిళల భద్రతకు సంబంధించి చేస్తున్న కార్యక్రమాలు? యువతలో 19 నుంచి 25 ఏళ్ల లోపు అమ్మాయిలపై వేధింపులు ఎక్కువున్నాయి. అందుకని, కాలేజీల్లో ‘గర్ల్ సేఫ్టీ క్లబ్స్’ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో 25 మంది విద్యార్థులను తీసుకుంటే సగం అమ్మాయిలు, సగం అబ్బాయిలు ఉండేలా చూస్తున్నాం. ఒక కాలేజీలో 25 మంది సేఫ్టీ క్లబ్‌గా ఉంటే వారి చుట్టుపక్కల, కాలేజీలో ఏదైనా సమస్య వస్తే ఎలా స్పందించాలి, అనే విషయాల పట్ల శిక్షణ ఇస్తాం. వాళ్లు పరిష్కరించలేని సమస్యలను మా దగ్గరకు తీసుకువచ్చేలా శిక్షణ ఇస్తున్నాం. ► ఆన్లైన్ మోసాలకు గురయ్యేవారిలో గృహిణులూ ఉంటున్నారు. వీరి రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు? గృహిణులు సైబర్ మోసాల బారినపడకుండా, అవగాహన కల్పించేందుకు ‘సైభర్’ కార్యక్రమం రూపొందించాం. ఆన్లైన్ మాధ్యమంగానే చేసిన ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 50 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్లమ్స్‌లలో కూడా అక్కడి అమ్మాయిల భాగస్వామ్యంతో గృహిణుల రక్షణ కోసం అవగాహనా కార్యక్రమాలు చేస్తున్నాం. వీటి విస్తృతి పెంచేందుకు మరికొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ► గ్రామస్థాయిల్లో మహిళలకు రక్షణ కల్పించేందుకు, అవగాహన పెంచేందుకు చేస్తున్న కృషి? పట్టణ, గ్రామీణ స్థాయిలోనూ షీ టీమ్ ద్వారా నేరుగా దాదాపు 30 లక్షల మందికి రీచ్ అయ్యాం. స్థానిక జానపద కళాకారులతో కలిసి గ్రామస్థాయిలో కార్యక్రమాలు చేశాం. వీటిని మరింతగా జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం. షీ టీమ్ మీ కోసమే.. ► పబ్లిక్ ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపులు (ఈవ్ టీజింగ్.. వంటివి) జరిగినా ► ఫోన్‌కాల్, మెసేజ్‌లు, ఇ–మెయిల్స్, సోషల్ మీడియా వేదికగా వేధింపులకు గురిచేసినా ► మహిళ ఒంటరిగా ప్రయాణించే సందర్భాలలో వెంటనే పోలీసు సాయం అందాలన్నా షీ టీమ్ వెంటనే స్పందిస్తుంది. ► మహిళలపై తీవ్రమైన నేరాలను అరికట్టడానికి నిరోధక శక్తిగా పనిచేస్తుంది. ► తప్పుదారి పట్టిన యువతను బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి నిపుణులచే కౌన్సెలింగ్ ద్వారా అవగాహన కల్పింస్తుంది. వారిని తమ నిఘానేత్రంతో నిశితంగా గమనింఇస్తుంది. ► మహిళకు హక్కుల పట్ల షీ టీమ్ వివిధ వేదికల ద్వారా అవగాహన కలిగిస్తుంది. భద్రత... సురక్షితం ► బృందాలుగా తెలంగాణ వ్యాప్తంగా ‘షీ టీమ్’ పనిచేస్తుంది. ప్రతి టీమ్‌లో ఒక మహిళా పోలీస్ అధికారి ఉంటారు. ► బస్స్టాండ్లు, రైల్వేస్టేషన్లు, స్కూళ్లు–కాలేజీలు, లేడీస్ హాస్టల్స్, పార్కులు, ఆసుపత్రుల చుట్టుపక్కల ప్రాంతాలను హాట్స్పాట్లుగా గుర్తించి నిఘాను ఉంచుతుంది. ► చట్టం, న్యాయం, సాంకేతిక విషయాల్లో సుశిక్షితులైన వారు ఈ బృందంలో తమ విధులను నిర్వర్తిస్తుంటారు. ఎప్పటికప్పుడు షీ టీమ్‌కు నిఘా విభాగం నుంచి సమాచారం చేరుతూనే ఉంటుంది. ► మహిళలు ఆన్లైన్ వేదికల ద్వారా తమ ఫిర్యాదులను అందజేయవచ్చు. షీ టీమ్ బృందం సివిల్ డ్రెస్సులో బాధితులను నేరుగా కలిసి, తదుపరి విచారణ కొనసాగిస్తుంది. ► ఒకసారి ఒక వ్యక్తిపై మొదటిసారి నేరారోపణ వస్తే సుమోటోగా బుక్ చేసి, తగిన చర్యలు తీసుకుంటారు. అదే నేరసుడిపై మరోసారి ఫిర్యాదు వస్తే.. ఆ కేసును నిర్భయ యాక్ట్ కింద బుక్ చేసి, మరిన్ని కఠిన చర్యలు తీసుకుంటారు. అందుకని, బాధితులు వెనుకంజ వేయకుండా తమ సమస్యను నివేదించి, సరైన పరిష్కారం పొందవచ్చు. ► సమాజంలో మహిళలకు సంబంధించిన సమస్యలను పరువుగా చూస్తారు. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తే ఆ వివరాలు బయటకు వచ్చి, తమ కుటుంబ పరువు పోతుందేమో అని భయపడతారు. షీ టీమ్ లోబాధితుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు. సామాజిక మాధ్యమాలు, ఫోన్ నెంబర్, నేరుగా.. ఫిర్యాదులను స్వీకరించడమే కాకుండా, అత్యంత వేగంగా పరిష్కారం చూపుతారు. అందుకని మహిళలు తమను వేధించేవారిని ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వారికై వారుగా ముందుకు రావాలి. ► మహిళా రక్షణ కోసం షీ టీమ్ వివిధ వేదికల ద్వారా ప్రజలలో అవగాహన కలుగజేస్తుంది. ఆ కార్యక్రమాలలో పాల్గొని తమ అభిప్రాయాలనూ పంచుకోవచ్చు. ఫిర్యాదులకు వేదికలు తెలంగాణ మొత్తానికి మహిళకు రక్షణకవచంలా ఉంది షీ టీమ్. సమస్య వచ్చినప్పుడు సందేహించకుండా సత్వర పరిష్కారం కోసం సంప్రదించాల్సిన వేదికలు.. ఇన్స్టాగ్రామ్:telanganasheteams ఫేస్బుక్, ట్విటర్:@ts-womensafety మెయిల్: womensafety-ts@tspolice.gov.in య్యూట్యూబ్: Women Safety Wing Telangana Police వాట్సప్ నెం. 944 166 9988 క్యూ ఆర్ కోడ్.. వంటి వేదికల ద్వారా ఫిర్యాదు చేయచ్చు. లైంగిక వేధింపులు, దాడులు, సైబర్ నేరాల నుంచి ‘ఆమె’ను రక్షించడానికి నిరంతరాయంగా కృషి చేస్తున్న షీ టీమ్‌కు ‘సాక్షి’ సెల్యూట్. – నిర్మలారెడ్డి, ఫొటోలు: నోముల రాజేష్‌రెడ్డి -
భద్రతకు ‘దిశ’ నిర్దేశం
సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా బి.కొత్తకోటలో ఓ యువకుడు ఇద్దరు బాలికలను మంగళవారం రాత్రి 7.20 గంటలకు వారి ఇంటి మేడ మీదకు తీసుకువెళ్లి అసభ్యకరంగా తాకుతూ వేధించాడు. వెంటనే ఓ బాలిక కిందకు దిగొచ్చి, అమ్మమ్మకు విషయం చెప్పింది. అంతకు రెండు రోజుల ముందే వార్డు వలంటీర్ ఆమె మొబైల్ ఫోన్లో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేశారు. దాంతో ఆమె 7.26 గంటలకు దిశ యాప్‌లోని ఎస్‌వోఎస్ బటన్ నొక్కారు. 7.30 గంటలకు పోలీసులు అక్కడికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోస్కో, నిర్భయ చట్టాల కింద కేసు నమోదు చేశారు. ‘వామ్మో పోలీసులా.. కంప్లైంట్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలా.. అంతకంటే మౌనంగా ఉండటమే నయం.’ ఇదీ రాష్ట్రంలో రెండున్నరేళ్ల క్రితం వరకు మహిళల పరిస్థితి. తమకు అన్యాయం జరిగినా, వేధింపులకు గురైనా.. ఇతరత్రా సమస్యలు వచ్చినా సరే పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు మహిళలు జంకేవారు. పోలీస్ స్టేషన్‌కు వెళ్లాలంటేనే హడలిపోయేవారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యలు స్వీకరించాక పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆపదలో చిక్కుకున్న మహిళలు దిశ యాప్‌లో ఎస్‌వోఎస్ బటన్ నొక్కితే చాలు.. క్షణాల్లో పోలీసులు వచ్చి రక్షణ కల్పిస్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్.. స్పందన ద్వారా ఆన్లైన్లో ఫిర్యాదు చేస్తే చాలు.. సమస్య ఇట్టే పరిష్కారమైపోతోంది.. సైబర్‌మిత్ర వాట్సాప్ నంబరుకు సమాచారం ఇస్తే చాలు.. సైబర్ వేధింపులకు అడ్టుకట్ట పడుతోంది. ప్రతి గ్రామ/ వార్డు సచివాలయంలోనే మహిళా పోలీసులు తోబుట్టువులా అందుబాటులో ఉంటున్నారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మహిళ మిత్ర గ్రూప్ సభ్యులు మేమున్నాంటున్నారు. పోలీస్ స్టేషన్లో సేవలన్నీ కూడా పోలీస్ సేవా యాప్ ద్వారా అరచేతిలోకి వచ్చాయి. పోలీస్ స్టేషన్‌కు వెళితే హెల్ప్ డెస్క్ సిబ్బంది సాదరంగా పలకరించి సమస్యను పరిష్కరిస్తున్నారు. దీంతో మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయగలుగుతున్నారు. మొత్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం మహిళా భద్రత కోసం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాలలో మహిళా పోలీసులు, దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు వంటి విప్లవాత్మక రీతిలో వ్యవస్థాగత సంస్కరణలు, మౌలిక వసతుల కల్పన... మరోవైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దిశ యాప్, ఆన్లైన్లో ఫిర్యాదుల కోసం స్పందన పోర్టల్ వంటి అద్భుత ఆవిష్కరణలతో రాష్ట్రంలో కొత్త చరిత్రకు నాంది పలికారు. సత్వరమే దోషులకు శిక్ష పడేలా తగిన వ్యవస్థను ఏర్పాటు చేశారు. భద్రత దిశగా కీలక నిర్ణయాలు ► రాష్ట్రంలో ప్రత్యేకంగా 18 దిశ పోలీస్ స్టేషన్ల ఏర్పాటు. ► గస్తీని పటిష్టం చేసేందుకు ప్రత్యేకంగా 900 స్కూటర్లు. ► దిశ గస్తీ కోసం రూ.16.60 కోట్లతో 145 మహింద్రా స్కార్పియో వాహనాలను కొనుగోలుకు నిర్ణయం. ► మహిళలపై లైంగిక నేరాలకు పాల్పడ్డ రికార్డు ఉన్న 2,11,793 మందిని జియో ట్యాగింగ్ ద్వారా నిఘా. ► దాడులు, వేధింపులకు అవకాశం ఉన్న సున్నిత ప్రాంతాల మ్యాపింగ్. ► దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లను ఏర్పాటు. 58 మంది ఫోరెన్సిక్ నిపుణుల పోస్టుల భర్తీ తక్షణ భద్రత.. వేగంగా దర్యాప్తు ► దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 3,68,771 కాల్ రిక్వెస్టులు వచ్చాయి. కొత్తగా యాప్ డౌన్లోడ్ చేసుకున్న వారు చేసే టెస్టింగ్ కాల్స్‌ను మినహాయిస్తే, 4,366 కాల్స్ చర్యలు తీసుకునేవి ఉన్నాయి. వాటిపై పోలీసులు సత్వరం స్పందించి తగిన చర్యలు తీసుకున్నారు. ► దిశ యాప్ ద్వారా నమోదు చేసిన కేసుల విచారణ పట్ల పోలీసు శాఖ ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. రికార్డు స్థాయిలో ఎఫ్ఐఆర్లు నమోదు చేసి, కేసుల దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు 589 ఎఫ్ఐఆర్లు నమోదు కావడం విశేషం. ఇందులో మహిళల గౌరవానికి భంగం కలిగించినవి 149, భర్త వేధింపులకు సంబంధించి 118, మహిళలను అవమానించడంపై 77 కేసులున్నాయి. ► మహిళలపై నేరాలకు పాల్పడిన ఘటల్లో ఏడు రోజుల్లోనే 1,136 మందిపై చార్జిషీట్లు, 15 రోజుల్లో 2,265 చార్జిషీట్లు దాఖలు చేశారు. ► బాధితులు ఏ పోలీస్ స్టేషన్ నుంచి అయినా సరే ఫిర్యాదు చేసేందుకు జీరో ఎఫ్ఐఆర్ విధానాన్ని ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోంది. 2019లో 59, 2020లో 338, 2021లో ఇప్పటి వరకు 224 జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ► దిశ యాప్ విజయవంతం కావడంతో రాష్ట్రంలో బుధవారం నాటికి రికార్డు స్థాయిలో 53,75,075 మంది ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ► స్పందన కార్యక్రమం/పోర్టల్ ద్వారా ఇప్పటి వరకు 1,40,341 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో 1.32 లక్షల కేసులను పరిష్కరించారు. లక్ష కేసులను కేవలం వారం రోజుల్లోనే పరిష్కరించడం విశేషం. 35,581 కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ► పోలీస్ సేవా యాప్‌తో 87 సేవలు అందిస్తున్నారు. ఒక ఫిర్యాదు నుంచి పరిష్కారం వరకు మొత్తం 24 ఎస్ఎంఎస్లు ఫిర్యాదుదారులకు ఇస్తుండటం పోలీసుల నిబద్ధతకు నిదర్శనం. ► సైబర్ మిత్ర వాట్సాప్ నంబరు 9121211100, సీఐడీ విభాగం వాట్సాప్ నంబరు 9701666667 ద్వారా కూడా ఫిర్యాదులకు అవకాశం కల్పించారు. ► గ్రామ, వార్డు సచివాలయాల్లో 15 వేల మంది మహిళా పోలీసులను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలో 10 మంది సభ్యులతో మహిళా మిత్ర బృందాలను ఏర్పాటు చేశారు. ► మహిళలపై దాడుల కేసుల్లో 148 మందిలో ముగ్గురికి ఉరి శిక్ష, 17 మందికి జీవిత ఖైదు, ముగ్గురికి 20 ఏళ్ల జైలు శిక్ష, 10 మందికి పదేళ్ల జైలు, మిగిలిన వారికి ఇతర శిక్షలు విధించారు. -
మహిళల రక్షణకై నిర్భయ స్క్వాడ్: ముంబై
ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని సాకినాకలో మహిళపై పాశవికంగా హత్యాచారం చేసిన సంగతి తెసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం ముంబై పోలీసులు నగరంలో మహిళల రక్షణ కోసం నిర్భయ స్క్వాడ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ స్క్వాడ్ టీంలో ఒక మహిళా ఆఫీసర్, పీఎస్ఐ లేదా ఏఎస్ఐ ఉంటారని తెలిపారు.(చదవండి: ముళ్లపందితో పోరులో పులి మృతి ) ఈ క్రమంలో ప్రతి పోలీస్ స్టేషన్లో ఒక మహిళా భద్రతా సెల్(విమెన్ సేఫ్టీ సెల్) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. మహిళల భద్రత సమీక్షించటం కోసం ప్రతినెల మొదటివారం నిర్భయ స్క్వాడ్ సమావేశాన్ని సంబంధిత ప్రాంతీయ అదనపు డివిజనల్ కమిషనర్ ఏర్పాటు చేస్తారని వెల్లడించారు. మహిళలపై నేరాలు ఎక్కువుగా జరిగే ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు మరింత ముమ్మరం చేస్తామని ముంబై పోలీస్ కమిషనర్ హేమంత్ నగ్రాలే తెలిపారు. (చదవండి: నిమిషాల వ్యవధిలో రెండు సార్లు వ్యాక్సిన్.. తట్టుకోలేక) -
రమ్య కుటుంబానికి ఐదు సెంట్ల ఇంటి స్థలం
గుంటూరు ఈస్ట్: మృగాడి చేతిలో హత్యకు గురైన రమ్య కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవతో ఐదు సెంట్ల నివేశన స్థలం మంజూరైంది. ఇంటి స్థలం పట్టాను శనివారం హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పరమాయ కుంటలోని రమ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులకు అందజేశారు. గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు గ్రామంలోని 5 లే అవుట్లో స్థలాన్ని కేటాయించారు. ఈ సందర్భంగా మంత్రి సుచరిత మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎంతగానో స్పందించి.. రమ్య కుటుంబానికి అండగా అనేక చర్యలు చేపట్టారని చెప్పారు. రమ్య తల్లిదండ్రులు కోరిన విధంగా నిందితుడికి త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ యాక్ట్ ప్రకారం రమ్య తల్లిదండ్రులకు త్వరలో ఐదెకరాల భూమిని ప్రభుత్వం అందజేస్తుందని స్పష్టం చేశారు. వచ్చే సంవత్సరం రమ్య సోదరి మౌనిక డిగ్రీ పూర్తవుతుందని, అయితే మానవీయ కోణంలో సీఎం సూచన మేరకు డిగ్రీ పూర్తికాక ముందే సాంఘిక సంక్షేమ శాఖలో ఉద్యోగం ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. రమ్య కుటుంబానికి అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సహాయం అందజేశాక, వారితో కలిసి టీ తాగుతానని సీఎం చెప్పారని వివరించారు. అందరూ దిశ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి ప్రతి మహిళ, యువతి సహా పురుషులు సైతం ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని, అనుకోని ఘటనలు జరిగినప్పుడు పోలీసుల సాయం కోరవచ్చని హోం మంత్రి సూచించారు. మేడికొండూరు ఘటనలో పోలీసులు సమర్థవంతంగా విచారణ చేస్తున్నారని, ఆ విషయాలు బయటపెడితే నేరస్తుడు తప్పించుకునే అవకాశం ఉంటుందని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ఎమ్మెల్యే మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. రమ్య ఘటనలో సీఎం స్పందించిన తీరు తమందరి హృదయాల్లో నిలిచి పోతుందన్నారు. అట్రాసిటీ యాక్ట్‌లో పేర్కొన్న పరిహారం కన్నా ఎక్కువగా సహాయం చేయడం సీఎం గొప్పతనాన్ని చాటిందన్నారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలని అనుకుంటారా.. అంటూ గత ప్రభుత్వ పెద్దలు చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరచిపోలేదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యేలు షేక్ మొహమ్మద్ ముస్తఫా, మద్దాళి గిరిధర్, జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్, జీడీసీసీ బ్యాంకు చైర్మన్ రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము), తూర్పు తహసీల్దారు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం: సుచరిత
సాక్షి, గుంటూరు: మహిళల భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చినట్లు హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. శాసనసభ, మండలిలో దిశ చట్టాన్ని ఆమోదించి కేంద్రానికి పంపాం.. కేంద్రం ఆమోదించగానే వెంటనే అమలు చేస్తామని పేర్కొన్నారు. దిశ యాప్‌తో ఇప్పటికే చాలామంది మహిళలను రక్షించినట్లు చెప్పారు. దిశ చట్టాన్ని కేంద్రం ఇంకా ఆమోదించలేదనే విషయం చంద్రబాబు నాయుడు, లోకేశ్ తెలుసని తెలిపారు. దిశ చట్టాన్ని అమలు చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. దిశ చట్టం కింద కొన్ని ప్రత్యేకమైన నేరాలు వస్తాయని ముందుగా లోకేష్ తెలుసుకోవాలని హితవు పలికారు. తెలుగుదేశం హయాంలో మహిళల రక్షణ ఏ విధంగా ఉందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. చదవండి: నూతన విద్యా విధానం అమలుపై సిద్ధం కావాలి: సీఎం జగన్ విద్యాదీవెన, ఇంటర్ ఆన్లైన్ అడ్మిషన్లపై అప్పీల్‌కు వెళ్తాం.. -
మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చాం: హోంమంత్రి సుచరిత
-
నువ్వంటే క్రష్.. ‘ఓయో’లో కలుద్దామా: ఉద్యోగినికి బాస్ వేధింపులు
సాక్షి, హైదరాబాద్: మహిళలు, చిన్నారులపై వేధింపులు, అఘాయిత్యాల నివారణకు సైబరాబాద్ పోలీస్ విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. ఐటీ పరిధిలో ఉద్యోగినులు కూడా వేధింపులకు గురవుతున్నాయి. తమ భవిష్యత్... సమాజంలో గౌరవం వంటి విషయాలతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసం వాట్సప్ నంబర్‌తో ఫిర్యాదు స్వీకరించేందుకు సైబరాబాద్ పోలీసులు నిర్ణయించారు. ఆ వాట్సప్‌కు స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో వాట్సప్‌కు వచ్చిన ఫిర్యాదు చూస్తుంటే పని ప్రాంతాల్లో ఉద్యోగులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో అర్థమవుతుంది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా సైబరాబాద్ మహిళ, చిన్నారుల రక్షణ వింగ్ ట్విటర్లో బహిర్గతం చేసింది. ఓ ఉద్యోగినికి వాట్సప్‌లో ఆమె బాస్ మెసేజ్ చేశాడు. హలో.. అంటూ ప్రాజెక్ట్ వర్క్‌పై మాట్లాడాడు. నీ పర్ఫామెన్స్ పూర్‌గా ఉందని చెప్పాడు. దీంతో ఆమె లేదు సార్ మొత్తం నేనే చేశానని చెప్పగా కాదు అని చెప్పాడు. దీంతో భయాందోళనకు గురయిన ఆమె నా భవిష్యత్ అంటూ వాపోయింది. హేం కంగారొద్దు.. నీకు ప్రమోషన్, జీతం పెంపు చేస్తా అని వరాలు కురిపించి కానీ అని గ్యాప్ ఇచ్చాడు. ఆ ‘కానీ’లో ఎంతో దురుద్దేశం దాగి ఉంది. (చదవండి: రాఖీ కట్టేందుకు వచ్చిన చెల్లెలు బంగారం అన్న చోరీ) కానీ ఏంటి సార్ అని అడగా అతడి వక్రబుద్ధి బయటపడింది. ఆమెను ఓయో రూమ్‌లో కలుద్దామని అడిగాడు. దీంతోపాటు మొదటి నుంచి నీపై క్రష్ ఉందని చెప్పాడు. దీనికి ఆ యువతి ‘క్షమించండి సార్’ అనగా సరే ‘నీ ప్రమోషన్, జీతం పెంపు విషయంలో కూడా సారీ’ అని ఆ బాస్ చెప్పేశాడు. అతడి స్పందనపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ బాధితురాలు ‘నీ కెరీర్‌ను కాపాడుకో’ అంటూ పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2003 కింద కేసు నమోదు చేశా అని సమధానం చెప్పింది. అయితే అతడి వేధింపులు ఎప్పటి నుంచో ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అతడి పేరు డైనో‘సార్’ అని పెట్టుకోవడం చూస్తుంటే అర్థమవుతోంది. (చదవండి: ప్రో కబడ్డీకి పాలమూరువాసి: ఏ జట్టుకు ఆడనున్నాడంటే..?) ఈ చాట్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ మహిళలకు కార్యాలయాల్లో కూడా భద్రత లేదని అర్థమవుతోంది. ‘నేను కూడా అలాంటి వాడిని కాదు. బట్.. నువ్వంటే క్రష్ ఉంది నాకు... ఫ్రమ్ ద ఫస్ట్ డే’ అని సైబరాబాద్ మహిళా, శిశు రక్షణ వింగ్ తన ఖాతాలో పోస్టు చేసింది. అయితే ఆ స్క్రీన్ షాట్ నిజమైన ఫిర్యాదా? లేక అవగాహన కల్పించేందుకు చేసిన చిత్రమా? అనేది తెలియలేదు. ఒకవేళ ఫిర్యాదు అయితే ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించలేదు. మహిళలను అప్రమత్తం.. అవగాహన కల్పించేందుకు సృష్టించిన చాటింగ్‌లా కనిపిస్తోంది. ఏది ఏమున్నా మహిళలు మీ రక్షణకు పోలీసులు ఉన్నారనే విషయం మరచిపోకండి. వేధింపులు ఎదుర్కొంటుంటే నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయలేకపోతే ఆన్లైన్లో కూడా చేయవచ్చు. మీ వివరాలను గోప్యంగా ఉంచుతారు. నేను కూడా అలాంటి వాడిని కాదు. But నువ్వంటే క్రష్ ఉంది నాకు... From the first day. #Dial100 #cyberabadsheteam #WomenSafety pic.twitter.com/LUpKRjucLa — Women & Children Safety Wing Cyberabad (@sheteamcybd) August 31, 2021 -
లోకేశ్ రచ్చ.. సామాన్య కుటుంబానికి శిక్ష
సాక్షి, అమరావతి: రాజకీయ ప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతామని ప్రతిపక్ష టీడీపీ మళ్లీ మళ్లీ రుజువు చేస్తోంది. అందుకోసం సామాన్య మహిళలు, కుటుంబాల పరువు ప్రతిష్టలను భంగపరచడానికి సైతం వెనుకాడని దుష్ట రాజకీయానికి పాల్పడుతోంది. దిశ వంటి పటిష్ట వ్యవస్థతో మహిళా భద్రతకు నిర్మాణాత్మక చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ప్రజల్లో మంచిపేరు రావడాన్ని ఏమాత్రం సహించలేకపోతోంది. గుంటూరులో ఓ విద్యార్థినిపై అత్యాచారం జరిగిందంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అవాస్తవ ప్రచారాన్ని ప్రముఖంగా లేవనెత్తడం.. దానికి టీడీపీ శ్రేణులు తానా తందాన అంటూ రాజకీయ లబ్ధికి తెగబడటం నివ్వెరపరుస్తోంది. తన రాజకీయ ప్రయోజనం కోసం ఇలా దుష్ప్రచారం చేయడం ద్వారా అభం శుభం తెలియని ఓ విద్యార్థిని అవమాన పరుస్తున్నానని, ఆమె కుటుంబాన్ని వీధిలోకి లాగుతున్నాననే కనీస ఇంగిత జ్ఞానం లోకేశ్‌కు లేకపోవడం విస్మయపరుస్తోంది. చదవండి: తాలిబన్ల దమనకాండ ఇదీ అసలు విషయం.. గుంటూరులో ఓ కానిస్టేబుల్ ఎంతగా వారిస్తున్నా తమ కుమార్తెతో చనువుగా మాట్లాడుతున్నారని ఆమె తల్లిదండ్రులు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్‌కు ఈ నెల 19న ఫిర్యాదు చేశారు. శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బందులకు గురి చేయలేదని చెప్పారు. తాము వారిస్తున్నా సరే మాట్లాడుతుండటం మాత్రమే తమ అభ్యంతరం అని స్పష్టంగా చెప్పారు. దీంతో ఆ కానిస్టేబుల్‌ను ఈ నెల 20న సస్పెండ్ చేశారు. అతనిపై క్రిమినల్ కేసు నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఈ నెల 21న ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. దీంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు తమ సమస్య పరిష్కారమైందని పోలీసు ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. లోకేశ్ రాజకీయ రచ్చ... ఈ అంశాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేందుకు ఆ కానిస్టేబుల్ ఆ విద్యార్థినిని అత్యాచారం చేశాడంటూ నారా లోకేశ్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడంతో అందరూ విస్తుపోయారు. దీనికి వంత పాడుతూ అత్యాచారం జరిగిందంటూ టీడీపీ అనుకూల పత్రికలు, టీవీ చానళ్లలో హడావుడి మొదలుపెట్టారు. సోషల్ మీడియాలో గగ్గోలు పెడుతూ ప్రభుత్వంపై బురదజల్లడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాధారణంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఎవరైనా వేధింపులకు గురైతే వారి పేర్లను మీడియాలో ప్రచురించరు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటి వరకు పోలీసులు, న్యాయస్థానాలు, పత్రికలు ఈ నియమావళిని కచ్చితంగా పాటిçస్తూనే ఉన్నాయి. కానీ నారా లోకేశ్ ఈ కనీస సంస్కారాన్ని కూడా ప్రదర్శించ లేదు.చదవండి: ఐటీ పోర్టల్ లోపాలు.. ఇన్ఫోసిస్‌పై కేంద్రం గరం ఆ విద్యార్థినిపై అత్యాచారం జరగ లేదు.. ఆమె ఏ విధంగానూ వేధింపులకు గురికాలేదు.. కేవలం తల్లిదండ్రులు వద్దని చెప్పినా సరే ఆమెతో కానిస్టేబుల్ మాట్లాడారు. ఆ అంశాన్ని కూడా పోలీసు ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించి కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ వాస్తవాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమెపై అత్యాచారం జరిగిందని ప్రచారం చేస్తుండటంతో ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నారు. లోకేశ్ వైఖరితో తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగిందని వాపోతున్నారు. లోకేశ్ తీరును రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా ఖండించింది. -
‘వాళ్ల కోసమే ఎదురు చూస్తున్నా.. వచ్చి నన్ను చంపేస్తారు’
Taliban Control Over Afghanistan: ‘‘నేను ఇక్కడే.. నా ఇంట్లో కూర్చుని వారి రాక కోసం ఎదురుచూస్తున్నాను. నాకు గానీ, నా కుటుంబ సభ్యులకు గానీ సహాయం చేసేందుకు ఎవరూ లేరు. అయినా, సరే.. నేను నా భర్తతో కలిసి ఇక్కడే కూర్చున్నా. నాలాంటి వాళ్లను చంపడం వారికి ఇష్టం కదా. వాళ్లు ఇక్కడికి తప్పకుండా వస్తారు. నన్ను చంపేస్తారు’’... అఫ్గనిస్తాన్ తాలిబన్ల వశమైందన్న ప్రకటన వెలువడగానే.. ఆ దేశంలో అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా మేయర్ జరీఫా ఘఫారీ స్పందన ఇది. తాలిబన్ల బలం ముందు నిలవలేక సైన్యం చేతులెత్తేసిన వేళ.. అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఆయన బృందం దేశం విడిచి పారిపోయిన తరుణంలో 27 ఏళ్ల జరీఫా మొండి ధైర్యం ప్రదర్శించారు. చచ్చినా, బతికినా ఇక్కడే.. ‘‘నా దేశం విడిచి నేను ఎక్కడికి వెళ్లాలి.. అసలెందుకు వెళ్లాలి.. బతికినా, చచ్చినా ఇక్కడే ’’ అంటూ మహిళా శక్తిని చాటారు. మూడేళ్ల క్రితం మైదాన్ వర్దక్ ప్రావిన్స్ మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా జరీఫా గుర్తింపు పొందారు. ఒక స్త్రీ ఈ విధంగా రాజకీయ చైతన్యం పొందడం సహజంగానే తాలిబన్లకు కంటగింపుగా మారింది. చంపేస్తామంటూ ఆమెను బెదిరించారు. మూడుసార్లు హత్యాయత్నం చేశారు కూడా. కానీ విఫలమయ్యారు. దీంతో.. ఎలాగైనా జరీఫా మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్న ఉద్దేశంతో.. గతేడాది నవంబరులో ఆమె తండ్రి, జనరల్ అబ్దుల్ వసీ ఘఫారీని కాల్చి చంపేశారు. అయినా.. సరే ఆమె వెనకడుగు వేయలేదు. తాలిబన్ల దురాక్రమణలు కొనసాగుతున్న వేళ గాయపడ్డ సైనికులు, సాధారణ పౌరులను కాపాడే ప్రయత్నం చేశారు. త్వరలోనే అఫ్గాన్లకు తాలిబన్ల నుంచి విముక్తి లభిస్తుందని, దేశానికి, ఆడపిల్లలకు గొప్ప భవిష్యత్తు ఉంటుందని గట్టిగా విశ్వసించారు. కానీ.. అలా జరగలేదు. తాలిబన్లు ఆదివారం అఫ్గనిస్తాన్‌ను పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారన్న వార్త వినగానే ఆమె కలలు కల్లలయ్యాయి. అందుకే.. రాజకీయ నాయకురాలినై, ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న తనను కచ్చితంగా చంపేస్తారని జరీఫా వ్యాఖ్యానించారు. ప్రత్యక్ష నరకం తప్పదంటూ ఆందోళనలు! తాలిబన్ రాజ్యం వస్తే మహిళలకు ప్రత్యక్ష నరకం తప్పదంటూ ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. గతంలో స్త్రీల పట్ల తాలిబన్లు వ్యవహరించిన తీరు.. ‘‘పదిహేనేళ్లు దాటిన ఆడపిల్లలు, 45 ఏళ్ల లోపు వయస్సు గల వితంతువుల జాబితా ఇవ్వండి. వారిని తాలిబన్ యోధులకు ఇచ్చి పెళ్లి చేస్తాం’’.. అఫ్గనిస్తాన్‌లోని ఇమామ్‌లు, ముల్లాలకు తాలిబన్ గ్రూపు సాంస్కృతిక కమిషన్ పేరిట ఇటీవల వచ్చిన నోట్ ఈ భయాందోళనలను రెట్టింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు వారాల క్రితం అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జరీఫా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అఫ్గన్ మహిళ ఆవేదన హక్కుల కోసం పోరాడతారు.. ‘‘దేశ పరిస్థితులు, చోటుచేసుకుంటున్న పరిణామాల గురించి నవతరానికి అవగాహన ఉంది. సోషల్ మీడియాలో వారు తమ అభిప్రాయాలు పంచుకోగలుగుతున్నారు. ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. అభ్యుదయ భావజాలంతో తమ హక్కుల కోసం వారు కచ్చితంగా పోరాడతారనే నమ్మకం నాకు ఉంది. నా దేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని విశ్వసిస్తున్నా’’ అని జరీఫా పేర్కొన్నారు. అయితే, నెల కూడా తిరక్కుండానే కాబూల్ తాలిబన్ల హస్తగతం కావడంతో.. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు ఎప్పుడు ఏమవుతుందోనన్న ఆందోళన ఆమెను వెంటాడుతోంది. నిజంగా తాలిబన్లు మాట నిలబెట్టుకుంటారా?! దేశం పూర్తిగా తమ గుప్పిట్లోకి వచ్చిన తర్వాత.. ప్రజలు ఆందోళనతో విదేశాలకు పారిపోతున్న వేళ.. ‘‘ప్రజలపై మేం ప్రతీకార చర్యలకు దిగబోము’’ అని తాలిబన్లు ప్రకటించారు. అంతేకాదు.. మహిళలను బానిసలుగా మార్చాలనుకోవడం లేదని, వారికి కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పిస్తామని మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మలాలా యూసఫ్‌జాయ్ అయితే, జరీఫాతో పాటు గతంలో ఆమె వలె బెదిరింపులు ఎదుర్కొన్న చాలా మంది మహిళలు ఈ విషయాన్ని పూర్తిగా నమ్మడం లేదు. స్త్రీ విద్యను వ్యతిరేకించి, మలాలా వంటి అనేక మంది ఆడపిల్లలను ఇబ్బంది పెట్టిన తాలిబన్ల పాలనలో తమకు స్వేచ్ఛ దొరకడం కష్టమేనంటూ సామాజిక మాధ్యమాల్లో తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. -సాక్షి, వెబ్‌డెస్క్. చదవండి: Afghanistan: తాలిబన్ల కీలక ప్రకటన.. అఫ్గాన్లకు.. మళ్లీ నరకంలోకా?.. మా వల్ల కాదు -
‘దిశ’ డౌన్‌లోడ్స్‌లో మెరిసిన చంద్రగిరి
తిరుపతి రూరల్: మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘దిశ యాప్’ డౌన్లోడ్స్ చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో అత్యధికంగా నమోదయ్యాయి. ఇక్కడ రికార్డు స్థాయిలో 1,73,363 మంది తమ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రతి మహిళా భద్రత కోసం దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలన్న ముఖ్యమంత్రి సందేశాన్ని అతి తక్కువ సమయంలో ఇంటింటికీ తీసుకెళ్లేందుకు ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి చొరవ తీసుకుని మహిళా సంఘాలు, సంఘ మిత్రలు, మహిళా పోలీస్‌లను దీన్లో భాగం చేశారు. తొలుత వారికి అవగాహన కల్పించి... తరువాతి దశలో వలంటీర్లు, వార్డు సభ్యుల్ని కూడా కలుపుకున్నారు. వీరందరి ద్వారా నియోజకవర్గంలోని మహిళలందరి చేతా డౌన్లోడ్లు చేయించారు. ఈ నియోజకవర్గం విషయం సీఎం దృష్టికి వెళ్లటంతో అక్కడ తీసుకున్న చర్యలను అనుసరిస్తూ... అన్ని చోట్లా యాప్ డౌన్లోడ్లు చేయించి, మహిళల భద్రతకు భరోసా ఇవ్వాలని సూచించారు. అక్కడ ఏ ప్రక్రియను అనుసరించారనేది చిత్తూరు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడాలంటూ... కలెక్టర్లందరికీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సూచనలు పంపించారు. కాగా అత్యధిక డౌన్లోడ్లు చేయించిన సంఘమిత్రలు, వలంటీర్లకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి ప్రోత్సాహక బహుమతులు కూడా అందించటం విశేషం. -
మహిళను రక్షించిన దిశ యాప్.. 8 నిమిషాల్లో ఘటనా స్థలానికి పోలీసులు
పెనమలూరు: ఆపదలో ఉన్న ఓ మహిళను దిశ యాప్ ఎనిమిది నిమిషాల్లోనే ఆదుకుని అండగా నిలిచింది. కృష్ణా జిల్లాలో తనపై దాడిచేసి తల పగలగొట్టిన భర్తపై ఓ వివాహిత దిశ యాప్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిమిషాల వ్యవధిలో చేరుకుని బాధితురాలిని రక్షించి ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బాధితురాలు షేక్ హీరుతున్నీసా 2018లో ఇంజనీరింగ్ కాలేజీ అధ్యాపకుడు ఇస్మాయిల్‌ను పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి సమయంలో కట్నకానుకలు అందచేశారు. వివాహం జరిగిన కొద్దిరోజులకే భర్త, అత్తమామల వేధింపులు మొదలయ్యాయి. బాధితురాలికి ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా ఉద్యోగం రావటంతో వీరంకిలాకులో కాపురం ఉంటున్న సమయంలో అత్తింటి వారి వేధింపులు ఎక్కువయ్యాయి. వీటిని తాళలేక పమిడిముక్కల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. కేసు రాజీ కుదరటంతో నాలుగు నెలల నుంచి పోరంకి బాలాజీనగర్‌లో నివసిస్తున్నారు. అయితే అత్తింటి వారిలో మార్పు రాలేదు. అదనపు కట్నం కోసం వేధిస్తూ బాధితురాలిని హింసిస్తున్నారు. బాధితురాలిని కాపాడిన దిశ యాప్.. ఆదివారం మధ్యాహ్నం హీరుతున్నీసాపై భర్త ఇస్మాయిల్ దాడి చేసి తలపగలగొట్టాడు. చంపేస్తానని బెదిరించాడు. బాధితురాలు దిశ యాప్‌లో మధ్యాహ్నం 3.10 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సత్యనారాయణ రక్షక్ వాహనంలో వెంటనే సిబ్బందిని పంపడంతో ఫిర్యాదు అందిన 8 నిమిషాల్లోనే ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసుల రాకతో ఇస్మాయిల్ పరారయ్యాడు. తలకు తీవ్రగాయం కావడంతో బాధితురాలిని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దిశ యాప్ తన ప్రాణాలు కాపాడిందని బాధితురాలు పేర్కొంది. భర్త, అత్తింటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
దశ'దిశ'లా పటిష్టం
సాక్షి, అమరావతి: మహిళా భద్రత కోసం నెలకొల్పిన ‘దిశ’ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం మరింతగా బలోపేతం చేస్తోంది. ప్రధానంగా గస్తీ (పెట్రోలింగ్)ను పటిష్టం చేయడం ద్వారా విజబుల్ పోలీసింగ్‌ను వ్యవస్థాగతంగా బలోపేతం చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అందుకోసం ప్రత్యేకంగా దిశ పోలీస్ వ్యవస్థ కోసం 145 స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే మహిళా భద్రత కోసం రాష్ట్రంలో ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఒకటి చొప్పున 900 స్కూటర్లను ప్రభుత్వం సమకూర్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్కార్పియో వాహనాలు కొనుగోలు చేయాలన్న నిర్ణయంతో దిశ గస్తీ మరింత పటిష్టం కానుంది. దిశ గస్తీ పటిష్టం ఇలా... ► 145 స్కార్పియో వాహనాల కోసం రూ.16.60 కోట్లను పోలీసు శాఖ వెచ్చించనుంది. ► ఒక్కోటి దాదాపు రూ.11 లక్షల చొప్పున మొత్తం రూ.15.95 కోట్లతో 145 స్కార్పియో వాహనాలను కొనుగోలు చేస్తారు. ► వీటికి ఎల్ఈడీ లైట్లు, పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం, జీపీఎస్ పరికరాలు, బాడీ డెకాల్, ఇతర గస్తీ పరికరాలను రూ.65 లక్షలతో ఏర్పాటు చేస్తారు. ► రాష్ట్రంలో 5 పోలీస్ కమిషనరేట్లకు 10 వాహనాల చొప్పున మొత్తం 50 వాహనాలను అందిస్తారు. 13 పోలీసు జిల్లాలకు 5 వాహనాల చొప్పున మొత్తం 65 వాహనాలను సమకూరుస్తారు. ► ఈ వాహనాలతో విజుబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేస్తారు. ప్రధానంగా విద్యా సంస్థలు, మార్కెట్ ప్రదేశాలు, ఇతర జనసమ్మర్థమైన సున్నిత ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తారు. దిశ పోలీస్ స్టేషన్లకు సొంత భవనాలు మహిళా భద్రత కోసం ప్రభుత్వం రాష్ట్రంలోని జిల్లా ప్రధాన కేంద్రాల్లో ప్రత్యేకంగా దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. ఇక కొత్తగా 6 దిశ పోలీస్స్టేషన్లు నిర్మించాలని నిర్ణయించింది. అందుకోసం ఒక్కో పోలీస్‌స్టేషన్ నిర్మాణానికి రూ.2.73 కోట్ల చొప్పున మొత్తం రూ.16.40 కోట్లను కేటాయించింది. కౌన్సెలింగ్ రూమ్, వెయిటింగ్ హాల్, క్రచ్–ఫీడింగ్ రూమ్, టాయిలెట్లు, ఇతర వసతులతో ఈ దిశ పోలీస్ స్టేషన్లు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించింది. -
మన మహిళలు దేశానికే ఆదర్శం
అక్క చెల్లెమ్మల భద్రత కోసమే దిశ యాప్‌ను రూపొందించాం. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మ మొబైల్ ఫోన్లో దిశ యాప్ ఉండాలి. కనీసం కోటి మందికిపైగా సెల్ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. ఈ యాప్ ఉంటే అన్నయ్య తోడున్నట్టే. ఆపదలో చిక్కుకుంటే ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు. అందుకు అవకాశం లేకుంటే సెల్ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు. నిమిషాల్లో పోలీసులు మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. అందుకోసం ఎన్నో ఫీచర్లు ఈ యాప్‌లో అందుబాటులోకి తెచ్చాం. – సీఎం వైఎస్ జగన్ ప్రతి ఇంటికీ వెళ్లి యాప్ డౌన్లోడ్ చేయిస్తున్నాం మా సచివాలయంలో 32 మంది వలంటీర్లకు గాను 26 మంది మహిళా వలంటీర్లు ఉన్నారు. వాళ్లందరికీ దిశ యాప్ గురించి వివరించి డౌన్లోడ్ చేయించాను. వీరందరూ ఇంటింటికీ వెళ్లి యాప్ ఉపయోగం గురించి వివరిస్తూ డౌన్లోడ్ చేయిస్తున్నారు. రెండు రోజుల్లో 1,515 మంది సెల్ ఫోన్లలో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేయించారు. – కనకదుర్గ, మహిళా పోలీస్, గొల్లపూడి సచివాలయం సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహిళ దేశానికే ఆదర్శం కావాలన్నదే తమ లక్ష్యం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. ఆ దిశగా ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకున్నామని, ప్రతి అడుగు కూడా అక్కచెల్లెమ్మలకు మేలు చేసేదిగానే ఉంటుందన్నారు. మహిళల భద్రత కోసం స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్తున్నామన్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో కనీసం ఒక్కో జిల్లాలో ఒక్కొక్కటి చొప్పున.. మొత్తంగా 18 దిశ పోలీస్స్టేషన్లు ఏర్పాటు చేశామని చెప్పారు. 900 మొబైల్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను ప్రారంభించామని, ఒక వారంలో మరిన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. దిశ కేసులకు సంబంధించి ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించామని, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. దిశా చట్టాన్ని మెరుగు పరుస్తూ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించామని చెప్పారు. వీటన్నింటికీ తోడు ఆపద వేళల్లో అక్కచెల్లెమ్మలకు ఓ అన్నయ్యగా అండగా నిలిచేలా ‘దిశ’ యాప్‌ను రూపొందించామని, ఈ యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకునేలా చూడాలన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని గ్రామ సచివాలయంలో మంగళవారం నిర్వహించిన ‘దిశ యాప్ అవగాహన సదస్సు’లో ఆయన పాల్గొన్నారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద ఎదురైతే ఆ యాప్‌ను ఉపయోంచి తక్షణం పోలీసు రక్షణ పొందే విధానాన్ని ఆయన స్వయంగా మహిళలకు వివరించారు. మహిళలు, యువతులతో గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్‌లో దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేయించారు. యాప్ పనితీరులో భాగంగా దిశ పోలీసులు నిర్వహించిన డెమోనూ మహిళలకు చూపించి వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి పైగా పోలీస్ స్టేషన్లలో అధికారులు, ఇతర సిబ్బంది వర్చువల్‌గా వీక్షించిన ఈ సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సదస్సులో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు వనిత, సుచరిత, పుష్పశ్రీవాణి, సదస్సులో యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని..మొబైల్‌ను చూపుతున్న మహిళలు ఇంటింటికి వెళ్లి అవగాహన కల్పించాలి – అక్కచెల్లెమ్మల సెల్ఫోన్లో ఈ దిశ యాప్ ఉండాలి. అందుకోసం మహిళా పోలీసులు, వలంటీర్లు తమ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాల్సిన ఆవశ్యకతను వివరించాలి. ఈ యాప్ ఉంటే జరిగే మంచి గురించి తెలపాలి. దిశ యాప్‌ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో స్వయంగా వివరించాలి. ఈ ప్రచారాన్ని ఒక ప్రత్యేక డ్రైవ్‌లా చేపట్టాలి. – దిశ యాప్‌కు ఎంతటి ప్రాముఖ్యత ఉందన్నది మహిళా పోలీసులు, వలంటీర్లకు బాగా తెలుసు. మొన్న ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటన నా మనసును చాలా కలచివేసింది. ఓ అమ్మాయి ఏ సమయంలోనైనా బయటకు వెళ్లినప్పుడు, జన సందోహం లేనప్పుడు అనుకోకుండా ఏమైనా జరిగితే వాళ్ల పరిస్థితి ఏమిటన్నదానికి ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగిన సంఘటనే నిదర్శనం. – ఏడాది క్రితం తెలంగాణలో దిశ అనే అమ్మాయిపై జరిగిన అఘాయిత్యం తెలిసిందే. అలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు మనం దాన్ని ఎలా ఆపగలం అనే ఆలోచన నుంచే ఈ దిశ యాప్‌ను అభివృద్ధి చేశాం. ఈ యాప్‌ను ఎంత ఎక్కువ మంది అక్కచెల్లెమ్మలతో డౌన్లోడ్ చేయించగలిగితే అంత ఎక్కువగా వారికి సహాయం చేయగలుగుతాం. – ఆపదలో వారికి తోడుగా నిలబడే పరిస్థితి వస్తుంది. అందుకే మహిళా పోలీసులు, వలంటీర్లు, ఇతర సచివాలయ సిబ్బంది దిశ యాప్ రాయబారులుగా వ్యవహరించాలి. ప్రతి ఇంటికి వెళ్లి ఈ యాప్ ఆవశ్యకతను వివరించి డౌన్లోడ్ చేయించాలి. బటన్ నొక్కితే చాలు వెంటనే పోలీసు రక్షణ – ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుంటే ఓ అన్నయ్య మీకు తోడున్నట్టుగా భావించవచ్చు. అనుకోని విధంగా ఏదైనా ఆపద కలిగినప్పుడు ఈ యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్ నొక్కిన వెంటనే పోలీసులు నిమిషాల్లో మీ దగ్గరకు వస్తారు. – ముందు మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్ ఎత్తి పొరపాటున బటన్ నొక్కుకుపోయింది అని అంటే సరే అని రారు. ఇబ్బందుల్లో ఉన్నాము అని మీరు చెబితే నిమిషాల్లోనే మీరున్న ప్రదేశానికి వచ్చి మీకు రక్షణ కల్పిస్తారు. – ఒకే వేళ మీరు ఫోన్ ఎత్తకపోయినా సరే.. మీరు ఆపదలో ఉన్నారని అర్థం చేసుకుని వెంటనే వచ్చి మీకు రక్షణగా నిలుస్తారు. ఈ యాప్ ద్వారా మీ లొకేషన్ అంటే మీరున్న ప్రదేశం ఎక్కడ ఉందన్న సమాచారం నేరుగా కంట్రోల్ రూమ్‌కు తెలుస్తుంది. తద్వారా పోలీసులు నేరుగా మీరున్న ప్రదేశానికి వచ్చి రక్షణ కల్పించేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఆపదలో ఫోన్ ఊపితే చాలు.. – అక్కచెల్లెమ్మలకు ఆపద కలిగినప్పుడు ఫోన్లో ఉన్న బటన్ నొక్కేంత సమయం లేనప్పుడు.. ఆ ఫోన్‌ను అటూ ఇటూ గట్టిగా ఊపితే చాలు మీరు ఆపదలో ఉన్నారని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం వెళ్తుంది. అక్కడ నుంచి మీకు ఫోన్ చేస్తారు. మీరు ఫోన్‌కు స్పందించలేదంటే మీరు ఆపదలో ఉన్నారని గుర్తించి వెంటనే మీ వద్దకు చేరుకుని రక్షణ కల్పిస్తారు. – ఈ విధంగా మనం ఎక్కడికి పోయినా, ఏ పరిస్ధితుల్లో ఉన్నా ఫోన్ మన దగ్గర ఉంటే చాలు మనకు ఎలాంటి ముప్పు కలగకుండా ఓ అన్నయ్యలా ఈ యాప్ అండగా నిలుస్తుంది. ఈ యాప్‌ను ఎంత ఎక్కువగా డౌన్ లోడ్ చేయిస్తే అంత మంచి జరుగుతుంది. – అది ఎలా వాడాలి, దాని వల్ల ఉపయోగాలు ఏంటి అనేది నేర్పించాలి. ఇదొక పెద్ద కార్యక్రమం. దీన్ని వలంటీర్లు, మహిళా పోలీసులు, మహిళా మిత్రలు అందరూ బాధ్యతగా తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి డౌన్ లోడ్ చేయించాలి. – గొల్లపూడి గ్రామంలో దాదాపు 2,800 ఇళ్లకు గాను ఇప్పటికే 15 వందల ఇళ్లలో డౌన్ లోడ్ చేశారు. మిగిలిన 1,300 ఇళ్లలో త్వరలోనే డౌన్లోడ్ చేయిస్తారనే నమ్మకం ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో అందరి ఇళ్లకు వెళ్లి దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయించాలి. ట్రాక్ మై ట్రావెల్ ఫీచర్ – ఈ యాప్‌లో ఉన్న మరో ముఖ్య అంశం కూడా ఉంది. మనం ఎక్కడకైనా ఆటోలోనో, ట్యాక్సీలోనో తెలియని వాళ్ల వాహనంలో ప్రయాణం చేయాల్సి రావచ్చు. అప్పుడు వాళ్ల మీద మనకు ఏమైనా కొద్దిగా అనుమానం వచ్చినా ఈ యాప్ మనకు రక్షణగా నిలుస్తుంది. – ఈ యాప్‌లో మనం వెళ్లాల్సిన లొకేషన్‌ను ఈ యాప్‌లో టైప్ చేసి ట్రాక్ మై ట్రావెల్ అనే బటన్ నొక్కితే చాలు. మీరు వెళ్లాల్సిన రూట్‌ను చూపిస్తుంది. మీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని పోలీస్ కంట్రోల్ రూం ట్రాకింగ్‌లో పెడుతుంది. ఆ వాహనం సరైన మార్గంలో వెళ్లకపోతే పోలీసులు వెంటనే వస్తారు. మీకు రక్షణ కల్పిస్తారు. – మహిళలకు పోలీసులు ఏదైనా సందేశం ఇవ్వడానికి ‘పుష్’ బటన్ ఆప్షన్ ఈ యాప్‌లో ఉంది. త్వరలోనే మరిన్ని ఆప్షన్లను కూడా పొందుపరచనున్నాం. సున్నితమైన, ప్రమాదకర ప్రదేశాలు, చైన్ స్నాచింగ్ వంటి వాటికి ఆస్కారం ఉన్న ప్రాంతాల గురించి మహిళలను అప్రమత్తం చేసేలా అదనపు ఫీచర్లు ఏర్పాటు చేయబోతున్నాం. కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకునేలా చేయాలి – రాష్ట్రంలో స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతి అక్క, చెల్లెమ్మ ఫోన్లో ఈ యాప్ డౌన్లోడ్ కావాలి. ఇప్పటికే 17 లక్షల మందికిపైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారు. – కనీసం కోటి మందికిపైగా డౌన్లోడ్ చేసుకునేలా చేయాలి. మన ప్రభుత్వం రూపొందించిన దిశ యాప్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఇప్పటికే నాలుగు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. దిశ పోలీస్ స్టేషన్లు – మహిళల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోంది. 18 దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. ప్రతి జిల్లాకు కనీసం ఒక పోలీస్ స్టేషన్ ఉండేలా చేయడంతో పాటు వాటిలో పూర్తిగా మహిళా అధికారులు, సిబ్బందినే నియమించాం. – మహిళలకు సైబర్ క్రైం, ఇతరత్రా సమస్యలు ఎదురైతే ఆ పోలీస్ స్టేషన్‌కు వెళితే చాలు. అక్కడ అంతా మహిళలే ఉంటారు కాబట్టి మనస్ఫూర్తిగా వారితో మాట్లాడొచ్చు. వారు మీ సమస్యలు పూర్తిగా వింటారు. ఫిర్యాదు తీసుకుంటారు. మీ సమస్యను సత్వరం పరిష్కరిస్తారు. – దాదాపు 900 మొబైల్ పెట్రోలింగ్ ద్విచక్ర వాహనాలను కూడా ఈ మధ్యే ప్రారంభించాం. పెట్రోలింగ్‌ను ఇంకా పెంచేందుకు ఈ వారంలోనే మరిన్ని వాహనాలు వాహనాలను తీసుకురానున్నాం. ప్రత్యేక కోర్టులు – దిశా చట్టాన్ని కూడా మెరుగ్గా చేసేందుకు, మరింత ఉపయోగకరంగా ఉండేటట్టు చేసి బిల్లును కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. అనుమతులు మంజూరు కేంద్రం చేతిలో ఉంది కాబట్టి ఇంకా పూర్తి చట్టం తీసుకురాలేకపోయాం. ఈలోగా మనం చేయాల్సిన వాటికి సంబంధించి ప్రతి అడుగు ముందుకు వేస్తున్నాం. – దిశ కోసం ప్రత్యేక కోర్టులను కూడా ఏర్పాటు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో మాట్లాడుతున్నాం. ప్రత్యేకంగా దిశ కేసులనే చూడటానికి ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించాం. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం – ఈ రాష్ట్ర హోం మంత్రి ఓ మహిళ. నా చెల్లి, దళితురాలు. అట్టడుగు వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ఈ విషయం చెబుతున్నాం. అట్టడుగు వర్గాలకు కూడా పూర్తి న్యాయం జరుగుతుంది. పోలీసుల దగ్గరికి వెళ్లడానికి భయపడాల్సిన పని లేదు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు అనే మెసేజ్ పోవడానికి ఉపయోగపడుతుంది. – ఈ యాప్ అభివృద్ధి చేసే విషయంలో సుచరితమ్మ కూడా కీలక పాత్ర పోషించారు. ‘దిశ’కు సంబందించిన ఇద్దరు మహిళా అధికారులను నియమించాం. ఐపీఎస్ అధికారి దీపికా పాటిల్, ఐఏఎస్ అధికారి కృతికా శుక్లా ప్రత్యేకంగా దిశ కార్యక్రమాల మీదే పని చేస్తున్నారు. – ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంత్రులు తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని), పేర్ని వెంకట్రామయ్య(నాని), ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ, డీజీపీ గౌతం సవాంగ్, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు, గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది, వలంటీర్లు పాల్గొన్నారు. మూడు నిమిషాల్లోనే పోలీసు రక్షణ సదస్సుకు హాజరైన ఓ వలంటీర్ తన సెల్‌ఫోన్ నుంచి దిశ యాప్‌లోని ఎస్ఓస్ బటన్‌ను నొక్కింది. వెంటనే పోలీస్ కంట్రోల్ రూం నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. మీ రక్షణకు వస్తున్నాం.. ఏమీ కంగారు పడొద్దు.. అని వారు ధైర్యం చెప్పారు. అనంతరం కంట్రోల్ రూం సిబ్బంది ఆమె ఉన్న ప్రదేశానికి సమీపంలోని భవానీపురం పోలీస్ స్టేషన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. వెంటనే ఆ యువతి రక్షణకు వెళ్లాలని చెప్పారు. ఆ వెంటనే భవానీపురం పోలీసులు ఆ వలంటీర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. కాసేపటికే తమ వాహనంలో ఆమె వద్దకు వచ్చారు. వలంటీర్ దిశ యాప్‌ను ఉపయోగించినప్పటి నుంచి కేవలం మూడు నిముషాల్లోనే ఆమె వద్దకు పోలీసులు రావడం విశేషం. ఆమె ఉన్న ప్రదేశం గురించి నావిగేషన్ ద్వారా తెలుసుకోవడం, తక్షణ ఆధారాల సేకరణ కోసం పోలీసుల యూనిఫాంకు కెమెరాలు అమర్చిన విషయాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అందరికీ వివరించారు. ఈ మొత్తం డెమోను డ్రోన్ కెమెరా ద్వారా చిత్రీకరిస్తూ స్రీన్లపై చూపించడంతో యాప్ ఎంత సమర్థంగా పని చేస్తుందన్నది అందరికీ స్పష్టంగా తెలిసింది. -
నేడు గొల్లపూడిలో దిశ యాప్ అవగాహన సదస్సు
సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ): విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలో మంగళవారం నిర్వహించనున్న ‘దిశ’ మొబైల్ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తారు. దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్ విధానంలో పాల్గొంటారు. (ఫైల్‌ఫోటో) ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం 10గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఐదుగురు మహిళలతో వారి మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్లోడ్ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్ డౌన్లోడ్ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్ విధానంలో వీక్షిస్తారు. ఈ సందర్భంగా దిశ యాప్ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా చెబుతారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరిస్తారు. మహిళా భద్రతకు సీఎం పెద్దపీట ఈ కార్యక్రమం కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను సోమవారం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా పాల్గొననుండటం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని చెప్పారు. ఇప్పటికే 20 లక్షలమంది దిశ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దిశ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కృష్ణాజిల్లా కలెక్టర్ జె.నివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు, దిశ యాప్ అమలు విభాగం ప్రత్యేక అధికారి దీపిక పాటిల్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ చదవండి: కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు -
దిశా యాప్ ను ప్రతి ఒక్క మహిళ డౌన్ లోడ్ చేసుకోవాలి :పుష్పశ్రీవాణి
-
దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మహిళల భద్రత కోసం మరింత పకడ్బందీగా వ్యవహరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. మహిళల భద్రతపై సీఎం జగన్ అత్యున్నత స్థాయి సమావేశం అనంతరం బుధవారం ఆమె తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడారు. దిశ యాప్ వినియోగంపై స్పెషల్ డ్రైవ్ పెట్టాలని సీఎం ఆదేశించారని పేర్కొన్నారు. ప్రతి ఇంటిలోని మహిళలకు ఈ యాప్‌పై అవగాహన వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. ఇంటింటికీ వెళ్లి అక్కచెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసేలా చూడాలన్నారు. కాలేజీలు, స్కూళ్లు తెరిచిన తర్వాత విద్యార్థినులకు దిశ యాప్‌పై ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలను, సీసీ కెమెరాలను అవసరమైన చోట పెంచాలని సీఎం ఆదేశించారని చెప్పారు. -
మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రజలకు దిశ యాప్‌పై పూర్తి అవగాహన, చైతన్యం కలిగించాలని సూచించారు. దిశ యాప్‌ను ఎలా వాడాలన్న దానిపై అవగాహన కలిగించాలని అధికారులకు స్పష్టం చేశారు. మహిళా భద్రత, దిశ యాప్ వినియోగంపై బుధవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ కె.వి.రాజేంద్రనాథ్‌రెడ్డి, సీఎంవో అధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి అక్క చెల్లెమ్మల ఫోన్లలో యాప్‌ను డౌన్లోడ్ చేసి అవగాహన కల్పించాలని చెప్పారు. గ్రామ సచివాలయాల్లోని మహిళా పోలీసులు, వలంటీర్లకు తొలుత శిక్షణ ఇచ్చి, తర్వాత వారి ద్వారా అక్క చెల్లెమ్మలకు దిశ యాప్‌పై అవగాహన కలిగించాలని సూచించారు. ప్రమాదకర పరిస్థితుల్లో ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలనే విషయంపై అక్క చెల్లెమ్మలకు విడమరచి చెప్పాలన్నారు. దీన్ని ఒక డ్రైవ్‌గా తీసుకుని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. కాలేజీలు, విద్యా సంస్థల్లోనూ విద్యార్థినులకు యాప్ వినియోగంపై అవగాహన కలిగించాలని, ఈ చర్యతో దిశ యాప్ వినియోగం పెరుగుతుందని పేర్కొన్నారు. అక్క చెల్లెమ్మలకు మరింత భద్రత కల్పించేందుకు వెంటనే చర్యలు తీసుకునేలా యంత్రాంగం సిద్ధం కావాలన్నారు. దిశ, స్థానిక పోలీస్స్టేషన్లు సత్వరమే స్పందించేలా వారిని సన్నద్ధం చేయాలని, పోలీస్ స్టేషన్లలో అవసరమైనన్ని పెట్రోలింగ్‌వాహనాలను సమకూర్చాలని ఆదేశించారు. -
ప్రత్యేక టీం: మహిళలను వేధిస్తే ఇక తాట తీసుడే..
హైదరాబాద్: మహిళలపై వేధింపులు, ఎన్నారైల సమస్యలపై కృషి చేస్తున్న విమెన్ సేఫ్టీ వింగ్ మరో ముందడుగు వేసింది. గృహహింస, వరకట్న వేధింపుల్లో చిక్కుకున్న మహిళల కోసం విమెన్ విక్టిమ్స్ కాల్ సెంటర్‌ను త్వరలో ఏర్పాటు చేయనుంది. లక్డీకాపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్‌లో డొమెస్టిక్ వయొలెన్స్(డీవీసీ) కాల్ సెంటర్‌కు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అడిషనల్ డీజీ స్వాతిలక్రా ఆధ్వర్యంలో డీఐజీ సుమతి కాల్‌సెంటర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 200 మంది సిబ్బందితో జూలై మొదటి వారంలో కాల్‌సెంటర్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడుభాషల్లో టెలీకాలర్స్: లాక్డౌన్ కాలంలో గృహహింస కేసులు పెరిగిపోయాయి. ఏప్రిల్, మే నెలలో 14 వేలకుపైగా గృహహింసకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీనెల 1,800–2,000 కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ఈ కేసుల్లో బాధితులుగా ఉన్న వారికి విమెన్ విక్టిమ్ కాల్ సెంటర్ నుంచి కాల్ చేస్తారు. కేసు పురోగతి ఎలా ఉంది? దర్యాప్తు అధికారి (ఐవో) ఎలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? తదితర విషయాలు కాల్ చేసి తెలుసుకుంటారు. తెలంగాణలో అనేక భాషల వారు నివసిస్తున్న నేపథ్యంలో తెలుగు, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో టెలీకాలర్స్‌ను నియమించనున్నారు. ఐవో, బాధితులతో మాట్లాడి, డైలీ సిచ్యుయేషన్ రిపోర్ట్ (డీఎస్ఆర్)ను ఏరోజుకారోజు నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్, కౌన్సెలింగ్‌లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను గుర్తిస్తారు. -
2 Years YSJagan Ane Nenu: భద్రతలో రాజీ లేదు
వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మహిళల భద్రతపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు సీఎం వైఎస్ జగన్. రెండేళ్ల పాలన కాలంలో మహిళ భద్రత విషయంలో రాజీలేని ధోరణి కనబరిచారు. మహిళలపై అఘాయిత్యాలు అరికట్టే లక్ష్యంతో కొత్తగా దిశా చట్టం తెచ్చారు. ఈ చట్టం పక్కాగా అమలు చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్ స్టేషన్లు ప్రారంభించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమించారు. కేవలం చట్టం చేయడం, పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టుకోలేదు దాన్ని అమలు చేసేందుకు అవసరమైన మౌలిక వసతులు సమకూర్చారు. ప్రత్యేకంగా మహిళ రక్షణ కోసం గస్తీ కాసేందుకు 900 దిశా పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. అంతేకాదు ఘటనా స్థలంలో ఆధారాలు పకడ్బందీగా సేకరించేందుకు 18 ఇంటిగ్రేటెడ్ క్రైమ్ సీన్ మేనేజ్మెంట్ వెహికల్స్‌ని కూడా రెడీ చేశారు. దీని వల్ల నేరాలు చేసిన వ్యక్తులకు శిక్షలు పడేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేపడితే పక్కాగా చేయడం సీఎం జగన్ నైజం అని చెప్పేందుకు ఈ పనులు మరో ఉదాహరణగా నిలుస్తున్నాయి. హెల్ప్‌డెస్క్‌లు రాష్ట్రవ్యాప్తంగా 700 దిశా హెల్ప్ డెస్కులు పని చేస్తున్నాయి. రాష్ట్రంలో 12 లక్షల మందికి పైగా మహిళలు అభయం యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్నారు. వీరిలో ఎవరైనా ఆపదలో ఎస్ఓఎస్ బటన్ నొక్కితే చాలు వెంటనే వారికి రక్షణగా వచ్చేందుకు పెట్రోలింగ్ వాహనాలు అన్ని వేళల్లో సిద్ధంగా ఉంటాయి. ఇటీవల కాలంలో మహిళలపై పెరిగిపోయిన సైబర్ నేరాలను అరికట్టేందుకు నడుం ఏపీ ప్రభుత్వం బిగించింది. మహిళలను సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు 50 సైబర్ కియోస్కులు ఏర్పాటు చేశారు. -
Women Safety Tool: ‘టచ్’ చేస్తే షాకే!
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మహిళలపై నానాటికీ పెరుగుతున్న అరాచకాలను దృష్టిలో ఉంచుకుని తూర్పు గోదావరి జిల్లా సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినులు ఉమెన్ సేఫ్టీ పరికరాన్ని రూపొందించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌కు చెందిన మౌనిక, దివ్య, ఎస్.మహేశ్వరి, ఆశ్రిత, ఐశ్వర్య, సంకీర్తన, మోనిష, గాయత్రిలతో కూడిన బృందం ఈ పరికరాన్ని తయారుచేసింది. విజిటింగ్ కార్డు సైజ్ ఉండే ఈ పరికరాన్ని మహిళలు లోదుస్తుల్లో లేదా పాకెట్లో ఎక్కడైనా అమర్చుకోవచ్చు. దాన్ని ఎవరైనా ముట్టుకుంటే వెంటనే వారికి కరెంట్ షాక్ తగిలి, దాదాపు 5 నిమిషాల పాటు ఏమీ చేయలేకుండా ఉండిపోతారు. ఆ సమయంలో మహిళలు ఆపద నుంచి బయటపడొచ్చని, ఈ పరికరం వారికి ఎంతో ఉపయోగపడుతుందని ప్రాజెక్టు గైడ్ వి.శేషగిరిరావు తెలిపారు. పరికరం తయారీకి విజిటింగ్ కార్డు సైజ్ బోర్డు, రెండు స్టీల్ పేట్లు, 4 ఓల్ట్ బ్యాటరీ, ఫ్రీక్వెన్సీ ట్రాన్స్ఫార్మర్, స్పార్క్ గ్యాప్ కెపాసిటర్, పుష్ ఆన్ స్విచ్ వాడామని చెప్పారు. అరగంట చార్జింగ్ పెడితే దాదాపు 6 గంటల వరకు ఈ పరికరం పనిచేస్తుందన్నారు. -
నగ్న ఫొటోలు పంపాడు.. నాకేమీ తెలియదంటూ బోరుమంది
వైష్ణవి (పేరు మార్చడమైంది)కి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలని కోరిక. ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రయత్నం చేద్దామని అమ్మానాన్నలకు అబద్ధం చెప్పి ఇంటి నుంచి బయటకు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన ఓ వ్యక్తి ఆమెను రిసీవ్ చేసుకున్నాడు. సాయం చేస్తానని మాటిచ్చాడు. తగ్గట్టే తనకు తెలిసిన సినీపరివారాన్ని పరిచయం చేశాడు. ఉండాల్సిన చోటు చూపించాడు. నగరం అందాలను కళ్లకు కట్టాడు. నటిగా అవకాశం రావడంతో పొంగిపోయింది వైష్ణవి. అతన్ని గుడ్డిగా నమ్మి తన ఫొటోలు అతనికి ఇచ్చింది. ఆ ఫొటోలను మార్ఫింగ్ చేసి తను చెప్పినట్టు చేయమని, లేదంటే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి పరువు తీస్తానని వేధించడం మొదలుపెట్టాడు. దిక్కుతోచని స్థితిలో ఉండిపోయింది వైష్ణవి. టెన్త్ క్లాస్ పూర్తయిన మీనా (పేరుమార్చడమైంది) ఈ మధ్యే పట్నంలో ఉంటున్న అన్నా వదినల వద్దకు వచ్చింది. ఇంట్లో బోర్ కొడుతుందని రోజూ నసుగుతుంటే మీనా వదిన తన సెల్‌ఫోన్ ఇచ్చింది. దాంతో మీనా ప్రపంచమే మారిపోయింది. రోజూ ఫొటోలు దిగడం సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, వచ్చిన లైక్‌లు, ఫ్రెండ్ రిక్వెస్ట్‌లకు మురిసిపోవడం ఆ విషయాలను ఇంట్లో సంబరంగా చెప్పుకునేది. ఓ రోజు ఆత్మహత్య ప్రయత్నం చేసిన మీనా కోలుకున్నాక చెప్పిన విషయం విని అన్నావదినలు ఆశ్చర్యపోయారు. సోషల్ మీడియాలో పరిచయం అయిన ఓ వ్యక్తి తన న్యూడ్ ఫొటోలు పంపించాడని, అవేవీ తనకు తెలియదని బోరుమంది మీనా. ‘హాయ్!’తో మొదలయ్యే వేధింపులు అమ్మాయిలు అదీ పట్టణాల్లో ఉన్నవారితో పోల్చితే గ్రామాల్లో ఉంటున్న యువతులు సోషల్ మాధ్యమాల్లో పరిచయం అయిన అపరిచిత వ్యక్తుల ద్వారా మోసపోతున్నవారి సంఖ్య ఇటీవల పెరిగిందంటున్నారు సైబర్‌క్రైమ్ అధికారులు. సోషల్ మీడియాలో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను యాక్సెప్ట్ చేయడంతో క్రమంగా చిట్చాట్లు... ఫొటోలు, వీడియోలు షేర్ చేయడాలు... వాటిని ఆసరాగా తీసుకుని ‘ఫేక్ వీడియో’లు సృష్టించి బ్లాక్మెయిల్ చేస్తుంటారు. కొందరమ్మాయిలు ఆ అపరిచిత వ్యక్తులను బయట నేరుగా కలిసి స్నేహం పెంచుకుంటారు. వారు చెప్పే మాయమాటలకు మోసపోతుంటారు. బ్రేక్ తప్పనిసరి తమ ఫొటోలను అప్లోడ్ చేయడం, తెలియని వారి నుంచి వచ్చే కామెంట్స్‌కి మెసేజ్‌లు, చాటింగ్ చేయడం, వీడియో కాల్స్‌ని రిసీవ్ చేసుకోవడం, సదరు వ్యక్తులను బయట కలవడం .. వల్లే వేధింపుల సమస్యలు పెరుగుతుంటాయి. ఫ్రెండ్ లిస్ట్‌ను ఎప్పటికప్పుడు ఫిల్టర్ చేసుకోవాలి. వర్చువల్ ఫేక్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్‌ను రిసీవ్ చేసుకోకుండా జాగత్తపడాలి. అపరిచిత వ్యక్తులు మన నెట్టింట్లోకి జొరబడకుండా ముందస్తు జాగ్రత్తలే తీసుకోవడమే సముచితం. ఇట్టే తెలిసిపోతుంది నెల క్రితం సోషల్‌మీడియా అంశం మీదే అవగాహనా కార్యక్రమం చేపట్టాం. అమ్మాయిలు సోషల్ మీడియాలో మోసానికి గురైతే, వెంటనే షీ టీమ్‌కు కంప్లైంట్ చేయచ్చు. సోషల్ మీడియాలోనే షీ టీమ్ వాట్సప్ నెంబర్, క్యూ ఆర్ కోడ్ ఉన్నాయి. దీని ద్వారా ఒక మెసేజ్ చేసినా చాలు. నిందితుడు దొరక్కపోవడం అనే సమస్యే ఉండదు. జాగ్రత్తపడాలంటే బాధితురాలు ఆ నిందితుడి పేజీ స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోవడం మరీ మంచిది. దీనివల్ల ఆ అకౌంట్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో ఇట్టే తెలిసిపోతుంది. – సుమతి, డిఐజి–ఉమన్ సేప్టీ వింగ్, తెలంగాణ జాగ్రత్తలే మందు కేసు రిజిస్టర్ చేసిన దగ్గర నుంచి నిందితులను పట్టుకునేవరకు పోలీసులు అన్ని ప్రయత్నాలు చేస్తారు. కానీ కేసు పూర్తయ్యేవరకు పూర్తి గ్యారెంటీ ఉండదు. జాగ్రత్తలే దీనికి అసలైన మందు. సైబర్ క్రైమ్ ఇప్పటివరకు పరిష్కరించిన కేసులు చాలానే ఉన్నాయి. నేరం రుజువైతే క్రైమ్‌ని బట్టి... సెక్షన్ల బట్టీ శిక్ష ఉంటుంది. సైబర్ క్రైమ్‌కి రిపోర్ట్ చేయడానికి ఆన్లైన్ ఆప్షన్స్ ఉన్నాయి. రిపోర్ట్ చేయవచ్చు. ‘షీ టీమ్’కు కాల్ చేసి మాట్లాడవచ్చు. లేదా నేరుగా వెళ్లి ఫిర్యాదు చేయచ్చు. – సందీప్ ముదల్కర్, సైబర్ సెక్యూరిటీ, ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ చదవండి: పైకి చూస్తే మైనర్.. పనులు మాత్రం ముదురే -
నెట్టింట వేధింపులకు నట్టింట పరిష్కారం!
సాక్షి, హైదరాబాద్: తెలిసీ తెలియక కొందరు యువతులు, విద్యార్థినులు ఆన్లైన్ నేరగాళ్ల వలలో చిక్కుకుంటున్నారు. ఇలాంటి బాధితుల రక్షణ కోసం విమెన్ సేఫ్టీ వింగ్ త్వరలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఇకపై సైబర్ బాధితుల ఇంటికే నేరుగా పోలీసులు వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించనున్నారు. ఇందుకోసం షీ టీమ్స్‌లో కొందరు మహిళా పోలీసులకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వనున్నారు. వీరు ఆర్థిక నేరాలు మినహా మహిళలకు ఆన్లైన్లో ఎదురయ్యే అన్నిరకాల మోసాలు, వేధింపులపై తమకు ఫిర్యాదు రాగానే.. వెంటనే బాధితుల వద్దకు వెళ్తారు. అక్కడే ఫిర్యాదు తీసుకుని పరిస్థితిని బట్టి చర్యలు తీసుకుంటారు. ఈ టీం సభ్యులకు సైబర్ నేరాలు, ఆన్లైన్ వేధింపులు.. వాటిని ఎలా ఎదుర్కోవాలి తదితర విషయాలపై ఇప్పటికే సమగ్ర అవగాహన కల్పించారు. అంతేకాకుండా ఈ బృందంలో ఒక సైకియాట్రిస్ట్ కూడా ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందం ఏమేం చేస్తుంది? వాస్తవానికి ఉద్యోగం చేస్తున్న మహిళలు, చదువుకుంటున్న యువతులు, స్కూలు విద్యార్థినులు నిత్యం ఏదో ఒకచోట రకరకాల వేధింపులు ఎదుర్కొంటున్నారు. వాటిని పరిష్కరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 341 షీ టీమ్స్ ఉన్నాయి. ఇలాంటి ఫిర్యాదులను స్వీకరించేందుకు ఇటీవల ప్రత్యేకంగా క్యూఆర్ కోడ్లు కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆన్లైన్లో ఎదురయ్యే వేధింపులపై చాలామంది పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేందుకు వెనకడుగు వేస్తుంటారు. ఎవరికీ చెప్పుకోలేక, తమలో తామే కుమిలిపోతుంటారు. కొందరికి ఆడ పిల్ల పోలీస్‌స్టేషన్ గడప తొక్కకూడదన్న ఆలోచనలతో వదిలేయాలని పెద్దలు సలహా ఇస్తుంటారు. అవసరమైతే ఆఫీసు, కాలేజీ, స్కూలు మాన్పించి వేధింపులకు దూరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. చాలా సందర్భాల్లో సోషల్ మీడియా, ఆన్లైన్, సెల్‌ఫోన్.. ఇలా మాధ్యమం ఏదైనా, అది ఎలాంటి వేధింపులైనా, లేక ప్రేమ వ్యవహారం నడిపి మోసం చేసినా, పెళ్లిపేరుతో మ్యాట్రిమోనీ వెబ్సైట్లలో పరిచయం పెంచుకుని మాట తప్పినా.. అవేమీ వెలుగు చూడటం లేదు. కారణం పరువుపోతుందన్న భయం. అయితే, ఇకపై అలాంటి భయాలు అవసరం లేదని షీ టీమ్స్ పోలీసులు అంటున్నారు. ‘మీరు షీ టీమ్స్‌కు కాల్ చేయగానే సైబర్ టీం మీ ముందుకు వస్తారు. మీ పేరు, వివరాలు ఎక్కడా బయటకు రావు. వారు ముందుగా మీలో ధైర్యాన్ని నింపుతారు. ఓదార్పునిస్తారు. నిందితులను క్షణాల్లో గుర్తించి వారిపై చర్యలు తీసుకుంటారు. మీకు ఇకపై నిందితుల నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా, విషయం మూడో కంటికి తెలియకుండా సమస్యను పరిష్కరిస్తారు’అని చెబుతున్నారు. ఒక వేళ సమస్య తీవ్రత అధికంగా ఉంటే, తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నతాధికారులను సంప్రదించి కేసు పెడతారు. లాక్‌డౌన్‌తో పెరిగిన సమస్యలు.. కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్ కారణంగా ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. అయితే అంతే స్థాయిలో మహిళలు, పిల్లలకు ఆన్లైన్ వేధింపులు కూడా అధికమయ్యాయి. అలాంటి వేధింపులకు చరమగీతం పాడేందుకు, బాధితులకు తామున్నామన్న భరోసా కల్పించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఇలాంటి వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. ఇప్పటికే లాక్డౌన్ కాలంలో గృహహింస, భార్యాభర్తల కలహాలపై టెలిఫోన్లో కౌన్సెలింగ్ నిర్వహించి అనేక సమస్యలు పరిష్కరించిన విమెన్ సేఫ్టీ వింగ్‌పై ప్రశంసల జల్లు కురిసింది. రాష్ట్రంలో వేలాదిమంది గృహిణులకు స్వాంతన చేకూర్చింది. ఇపుడు ఈ విధానం కూడా లక్షలాది మంది యువతులు, విద్యార్థినులలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెంచుతుందని పోలీసు ఉన్నతాధికారులు ధీమాగా ఉన్నారు. -
సర్వే: షీ టీమ్‌ల పనితీరుపై 89 శాతం సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: నేర నియంత్రణలో స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యంతో మంచి ఫలితాలు వస్తాయని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బాల్య వివాహాలు, గృహహింస, లైంగిక వేధింపుల నిరోధంపై స్వయం సహాయక బృందాల మహిళలకు చైతన్యం, అవగాహన కల్పించేందుకు పోలీస్ శాఖ, పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా)లు కలసి పనిచేయనున్నాయి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ పరిపాలన శాఖ సంచాలకుడు సత్యనారాయణ, పోలీస్ శాఖ మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రాల మధ్య ఈ మేరకు ఒప్పందం కుదిరింది. జూమ్ ద్వారా డీజీపీ మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, రక్షణకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని, దేశంలో తొలిసారిగా అడిషనల్ డీజీ నేతృత్వంలో మహిళా భద్రతా విభాగం ఏర్పాటు చేసిన ఘనత రాష్ట్రానికే దక్కిందని గుర్తుచేశారు. పోలీసులు ప్రతిచోటా భౌతికంగా ఉండలేరని, ఈ నేపథ్యంలోనే స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా సమాజ భద్రతలో భాగస్వామ్యం చేయాలని నిర్ణయించామని వెల్లడించారు. 89 శాతం మంది సంతృప్తి.. షీ టీమ్‌లకు 2020లో 5 వేల ఫిర్యాదులు అందాయని మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా చెప్పారు. షీ టీమ్‌ల పనితీరుపై ప్రముఖ సంస్థ సెస్ ద్వారా సర్వే నిర్వహించగా 89 శాతం మంది షీ టీమ్‌ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారని వెల్లడించారు. రాష్ట్రంలో 1.70 లక్షల మహిళా బృందాల్లో 17 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారని, వీరికి గృహహింస, పని ప్రాంతాల్లో వేధింపులు, ఇతర సామాజిక సమస్యలపై చైతన్యం కల్పించడం హర్షణీయమని మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ చెప్పారు. పలు స్కూళ్లు, కళాశాలల విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా భద్రతా విభాగాల అధికారులు పాల్గొన్నారు. అనంతరం యూజర్ ఫ్రెండ్లీ సాంకేతిక విధానం క్యూఆర్ కోడ్ ద్వారా ఫిర్యాదు చేసే పోస్టర్, కౌమార బాలికలపై జరిగే సైబర్ క్రైమ్స్ నిరోధం తదితరాలపై ప్రచురించిన పుస్తకాలను డీజీపీ ఆవిష్కరించారు. వేధింపులపై క్యూఆర్ కోడ్‌తో ఫిర్యాదు.. ఇటు మహిళల భద్రతకు చేపట్టిన చర్యల్లో భాగంగా క్యూఆర్ కోడ్ (కాప్స్ యాప్)తో ఫిర్యాదు చేసే విధానాన్ని పోలీస్ మహిళా భద్రతా విభాగం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలోని ఏ ప్రాంతం నుంచైనా క్యూఆర్ కోడ్ సాయంతో మహిళలపై వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలు, పని ప్రాంతాల్లో వేధింపులు తదితర సమస్యలపై మహిళా భద్రతా విభాగానికి ఫిర్యాదు చేసే విధానాన్ని సోమవారం డీజీపీ మహేందర్‌రెడ్డి ప్రారంభించారు. తమ మొబైల్ ఫోన్లో ఈ లింక్‌ను సేవ్ చేసుకొని, లింక్ ఓపెన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఫిర్యాదుల పేజ్ ఓపెన్ అవుతుంది. దానిలో ఫిర్యాదు వివరాలు నమోదు చేస్తే ఆ ఫిర్యాదు షీ టీమ్ సెంట్రల్ సర్వర్‌కు వెళ్తుంది. క్యూఆర్ కోడ్ ద్వారా అందే ఫిర్యాదులపై తీసుకునే చర్యలు, అధికారుల ప్రవర్తన తదితరాలపై ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. -
టచ్ చేసి చూస్తే మంచీచెడు చెప్పే బొమ్మ..?
సాక్షి, హైదరాబాద్: లైంగిక వేధింపులకు పెద్దలే కాదు అభం శుభం తెలియని చిన్నారులూ గురవుతున్నారు. ఏమీ తెలియని వయసులో ప్రమాదాన్ని పసిగట్టలేని పిల్లలపై సొంత బంధువులు, సన్నిహితంగా మెలిగే ఇరుగుపొరుగువారే అఘాయిత్యాలకు పాల్పడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఘటనలను పిల్లల్లో అవగాహన పెంపొందించడం ద్వారానే నిలువరించగలం. ఈ దిశలో వినూత్నంగా ఆలోచించిన వరంగల్ వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థి భరద్వాజ్ మరో ఇద్దరి సహకారంతో ఓ ప్రత్యేకమైన బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను తాకినప్పుడు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అనే శబ్దాలతో అది స్పందిస్తుంది. దీనిని మరింత అభివృద్ధి చేసి పాఠశాలల్లో చిన్నారులకు అవగాహన కల్పించాలంటూ.. ట్విట్టర్ వేదికగా తన ఆలోచనలను బహిర్గతం చేయగా.. ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పాటు షీటీమ్, తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ తదితర ప్రభుత్వ విభాగాలు స్పందించాయి. తాకగానే స్పందించే ‘సంస్కార్’ భరద్వాజ్, వరంగల్‌కు చెందిన రూరల్ ఇన్నోవేటర్ యాకర గణేశ్ సహకారంతో ఈ బొమ్మ (టాయ్)ను తయారు చేశాడు. దీనికి ‘సంస్కార్’ అనే పేరు పెట్టారు. ఈ బొమ్మ తయారీకి కొన్ని రకాల సెన్సార్లు, ట్రాన్సిస్టర్లు, స్పీకర్, మైక్రో ప్రాసెసర్లను వినియోగించారు. ఈ బొమ్మను తాకినప్పుడు అది స్పందిస్తుంది. కొన్ని సందర్భాల్లో తాకేందుకు ప్రయత్నించే సమయంలోనే స్పందిస్తుంది. బొమ్మ వేర్వేరు భాగాలను తాకుతున్నప్పుడు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్ అనేది స్పీకర్ ద్వారా శబ్దం వెలువడుతుంది. ఈ బొమ్మ తయారీతో పాటు పనిచేస్తు న్న తీరుపై వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీలోని వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలిరేటర్ (విబా) సీఈఓ ఎంకే కౌశిక్ వీడియో రూపొందించి ట్విట్టర్లో పోస్టు చేశారు. అదేవిధంగా కొందరు చిన్నారులకు అవగాహన కల్పిస్తున్న వీడియోను కూడా జత చేశారు. దీనిపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్ స్పందించారు. ఈ ఆలోచన స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ.. సంస్కార్‌ను మరింత అభివృద్ధి పరచాల్సిందిగా తెలంగాణ స్టేట్ ఇన్నోవేవేషన్ సెల్‌కు సూచించారు. దీంతో టీఎస్ఐసీ అధికారులు సంస్కార్ రూపకర్తలతో భేటీ కానున్నారు. ప్రత్యక్షంగా చూస్తే వేగంగా అవగాహన చిన్నారుల్లో లైంగిక వేధింపుల విషయమై థియరీ పద్ధతిలో కాకుండా ప్రాక్టికల్‌గా అవగాహన కల్పించాలనే ఆలోచన ఫలితమే ఈ ‘సంస్కార్’. ఇన్నోవేటర్ యాకర గణేశ్, నేను చర్చించుకుని ఈ బొమ్మను తయారు చేశాం. ఈ బొమ్మ స్పందించే తీరును ప్రత్యక్షంగా చూస్తే పిల్లలకు వేగంగా అవగాహన కలుగుతుంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు దీనిద్వారా అవగాహన కల్పిస్తే బాగుంటుందనేది నా అభిప్రాయం. - భరద్వాజ్ గుండు, యాకర గణేశ్, వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజీ, వరంగల్ స్కూళ్లలో ప్రయోగాత్మక అవగాహన సంస్కార్ బొమ్మను ముందుగా నాలుగైదు స్కూళ్లలోకి తీసుకెళ్లి ప్రయోగాత్మకంగా అవగాహన కల్పిస్తాం. ఆ తర్వాత అక్కడ్నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్ తీసుకుని మరింత అభివృద్ధి చేస్తాం. భరద్వాజ్, గణేశ్ ఆలోచనను దీనికే పరిమితం చేయకుండా ప్రత్యేకంగా ఒక టాయ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ఇందుకు ప్రభుత్వ సహకారం కూడా తీసుకుంటాం. - ఎంకే కౌశిక్, వాగ్దేవి ఇంక్యుబేషన్ అండ్ బిజినెస్ యాక్సిలిరేటర్ (విబా) సీఈఓ -
రైతన్నకు రక్షణగా 'పోలీస్' వ్యవస్థ
తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి చాలా మంది రైతులు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్తారు. అక్కడ వారికి ఏవైనా ఇబ్బందులు వస్తే, మోసానికి గురైతే.. చట్టపరంగా, ఇతరత్రా రక్షణగా ఈ కొత్త వ్యవస్థ వారికి అండగా నిలవాలి. ఎంత త్వరగా స్పందించి, వారికి అండగా నిలబడుతున్నామన్నదే ప్రధాన లక్ష్యం. ఇందుకు రైతు భరోసా కేంద్రాలు, పోలీసులు పరస్పర అవగాహన, అనుసంధానంతో పని చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రతి రోజూ 2 గంటల పాటు కచ్చితంగా స్పందన కార్యక్రమం నిర్వహించాలి. ఇక్కడ పని చేస్తున్న సిబ్బందికి ప్రత్యేకంగా యూనిఫామ్స్ నిర్దేశించాలి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు ఇబ్బందులు, మోసాలకు గురికాకుండా రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని, ఇందు కోసం జిల్లాకు ఒక రైతు భరోసా పోలీస్ స్టేషన్ ఏర్పాటుపై ఆలోచన చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే వారికి అండగా నిలిచి, వారికి న్యాయం చేసేలా ఈ వ్యవస్థ ఏర్పాటు గురించి ఆలోచిస్తున్నామని తెలిపారు. బయటి ప్రాంతాల్లో వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా వారికి భద్రత కల్పించడమే దీని ఉద్దేశమని స్పష్టం చేశారు. దిశ చట్టం అమలు, సైబర్ కియోస్క్ లు, జిల్లాకొక రైతు భరోసా పోలీస్ స్టేషన్ ఏర్పాటు, సచివాలయ సిబ్బందికి యూనిఫాం, స్పందన నిర్వహణ అంశాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి పోలీస్ స్టేషన్లో దిశ హెల్ప్ డెస్క్ మాదిరిగా రైతుల కోసం ఒక డెస్క్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ డెస్‌్కలు అన్నీ జిల్లా స్థాయి పోలీస్ స్టేషన్ కింద ఉండాలన్నది ప్రాథమిక ఆలోచనని తెలిపారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలనే దానిపై మేధోమథనం చేసి, పూర్తి స్థాయిలో ఆలోచించి.. కార్యాచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే.. సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో హోంమంత్రి సుచరిత తదితరులు మహిళలు, బాలలపై నేరాల్లో 7 రోజుల్లో చార్జిషీటు మహిళలు, బాలలపై నేరాలకు సంబంధించి 7 రోజుల్లోగా చార్జిషీటు దాఖలు చేసే దిశగా అడుగులు ముందుకు వేయాలి. దర్యాప్తునకు అనుసరించే ప్రక్రియలో మౌలిక సదుపాయాల పరంగా సమస్యలు ఏమైనా ఉంటే దానిపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. దిశ కేసుల విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపైనా దృష్టి పెట్టడంతో పాటు అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళా హెల్ప్ డెస్‌్కలు ఏర్పాటు చేయాలి. – మొబైల్ ఫోన్ల సెక్యూరిటీ కోసం ప్రారంభించిన సైబర్ కియోస్క్ మంచి ఫలితాలను ఇస్తున్నందున, దాన్ని ఎలా వినియోగించుకోవాలన్న దానిపై పలు సూచనలు కియోస్క్ వద్ద పెట్టాలి. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్దే కాకుండా విద్యా సంస్థల వద్ద కూడా సైబర్ కియోస్క్‌లు ఏర్పాటు చేయాలి. వీటికి ‘దిశ కియోస్క్’ అని పేరు పెట్టాలి. తిరుపతి, విశాఖపట్నంలో ఫోరెన్సిక్ ల్యాబ్‌ల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. దిశ యాప్‌పై విస్తృత ప్రచారం – దిశ పోలీస్ స్టేషన్ల వద్ద, కాలేజీల వద్ద దిశ కార్యక్రమం కింద అందే సేవలు, రక్షణ, భద్రత అంశాలను పొందుపరుస్తూ హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులతో అనుసంధానం కావాలి. – గ్రామ, వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు దిశ కార్యక్రమం పట్ల అవగాహన కల్పించాలి. గ్రామాల్లో ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, ఏఎన్ఎంలకు కూడా దిశ యాప్‌పై అవగాహన కల్పించాలి. గ్రామ సచివాలయాల్లో దిశ యాప్ సహా.. దాని కింద చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పోస్టర్లు, హోర్డింగ్స్ ఏర్పాటు చేయాలి. – దిశ ఎస్ఓఎస్ నుంచి కాల్ వచ్చిన వెంటనే నిర్దేశిత సమయంలోగా పోలీసులు అక్కడ ఉంటున్నారా? లేదా? (సగటున 6 నిమిషాల్లోగా చేరుకుంటున్నామని, కొన్ని ఘటనల విషయంలో కౌన్సిలింగ్ చేస్తున్నామని అధికారులు తెలిపారు) ఇలాంటి ఘటనల్లో ఫిర్యాదులు చేసిన మహిళలకు క్రమం తప్పకుండా కాల్స్ వెళ్లాలి. వారి సమస్య తీరిందా? లేదా? అన్న దానిపై వారి నుంచి తప్పనిసరిగా ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. ఈ ఫాలో అప్ క్రమం తప్పకుండా చేయాలి. మహిళలపై 7.5 శాతం తగ్గిన నేరాలు – ‘దిశ’ అమలు, మహిళల భద్రత, రక్షణపై ప్రత్యేక దృష్టి కారణంగా 2019తో పోలిస్తే 2020లో మహిళలపై 7.5 శాతం నేరాలు తగ్గాయని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1,080 కేసుల్లో 15 రోజుల్లో చార్జిషీటు దాఖలు చేశామని, 103 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయని చెప్పారు. – సైబర్ బుల్లీయింగ్‌పై 1,531 కేసులు, లైంగిక వేధింపులకు సంబంధించి 823 కేసులు పెట్టామన్నారు. గతంలో లైంగిక వేధింపులకు పాల్పడ్డ 1,40,415 మంది డేటాను క్రోడీకరించామని, సైబర్ మిత్ర ద్వారా 2,750 పిటిషన్లు స్వీకరించామని, 374 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని తెలిపారు. – ఇప్పటి వరకు 12 లక్షల మంది దిశ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకున్నారని, యాప్‌ను ఉపయోగించి రిపోర్టు చేసిన 799 ఘటనల్లో చర్యలు తీసుకున్నామని, ఇందుకు సంబంధించి 154 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేశామని అధికారులు వెల్లడించారు. – మహారాష్ట్ర, రాజస్థాన్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు దిశ తరహా కార్యక్రమాలను చేపట్టాయని, దిశ దర్యాప్తు (పెట్రోలింగ్) వాహనంపై ప్రధాని నుంచి ప్రశంసలు లభించాయని తెలిపారు. – ఈ సమీక్షలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, దిశ స్పెషల్ ఆఫీసర్లు కృతికా శుక్లా, దీపికా పాటిల్, మహిళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏ ఆర్ అనురాధ, స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు నీలం సాహ్ని, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చాయ్‌వాలా ఫీట్లు : పోలీసు ఉన్నతాధికారి ఫిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి మహిళలు, చిన్నారుల భద్రతపైన, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలపై ఎంత చురుగ్గా ఉంటారో.. సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్ గా ఉంటారు. తమ శాఖ అందిస్తున్న సేవలపై నిరంతరం ట్విటర్లో అప్డేట్ చేస్తూ, అనేక సలహాలను ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో విధి నిర్వహణలో నిరంతరం తలమునకలై ఉండే ఆమె తాజాగా ఒక ఫన్నీ వీడియోను ట్విటర్లో షేర్ చేయడం విశేషం. ఛాయ్ వాలా నైపుణ్యాన్ని చూసి ముచ్చటపడుతూ నవ్వుకుంటున్న సుమతి వీడియో ప్రస్తుతం పలువురిని ఆకట్టుకుంటోంది. హైదరాబాద్‌లో ఇరానీ చాయ్అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అలాగే డీఐజీ సుమతి కూడా ఒక షాపులో ఇరానీ టీ తాగేందుకు ఆగారు. ఆమె టీ కప్ తీసుకోవటానికి యత్నిస్తున్నపుడే అసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఆ చాయ్ వాలా ఆ కప్పును ఆమెకు దొరక్కుండా చేస్తూ..ఫన్నీ ఫీట్లతో అలరించారు. సాక్షాత్తూ పోలీసు ఉన్నతాధికారినే ఫిదా చేసిన ఈ ఫీట్లు చూస్తే మీరు కూడా వావ్ అంటారు. -
మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్ డ్రెస్
సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు ఇకపై పోలీసు యూనిఫాంలో విధుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగులను అధికారికంగా మహిళా పోలీసు అని పిలుస్తారు. ఇందుకు సంబంధించి వారం పది రోజుల్లో అధికారిక ఉత్తర్వులు వెలువరించేందుకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 11,162 గ్రామ సచివాలయాలు, 3,786 వార్డు సచివాలయాల్లో ఒక్కో దాంట్లో ఒకరు చొప్పున మహిళా సంరక్షణ కార్యదర్శి ఉన్నారు. మొత్తం 14,948 పోస్టులకు గాను 13,677 పోస్టులను ఈ ఏడాది జనవరి నాటికే భర్తీ చేశారు. మిగతా పోస్టుల భర్తీ ప్రక్రియ (రెండో విడత నోటిఫికేషన్లో) ప్రస్తుతం జిల్లాల్లో కొనసాగుతోంది. ఇప్పటికే దాదాపు 1,100 మందికి నియామక పత్రాలు జారీ చేశారు. కాగా, ఇప్పటికే పలు సచివాలయాల్లో పనిచేసే మహిళా సంరక్షణ కార్యదర్శులు.. ఆయా సచివాలయాల పరిధిలో పాఠశాలలు, కాలేజీల్లో మహిళల రక్షణ, సైబర్ క్రైం, రోడ్డు సేప్టీ తదితర అంశాలపై పని చేస్తున్నారు. వరకట్న, లైంగిక వేధింపుల నియంత్రణతో పాటు మద్యపాన నియంత్రణ చర్యలలో భాగంగా బెల్ట్‌షాపులు, నాటుసారాను అరికట్టడం వంటి చర్యలలో పాలుపంచుకుంటున్నారు. అక్రమార్కుల్లో భయం పెరుగుతుంది.. మూడు రోజుల క్రితం గ్రామ, వార్డు సచివాలయాల శాఖపై జరిగిన సమీక్ష సమావేశంలో సీఎం వైఎస్ జగన్.. మహిళా సంరక్షణ కార్యదర్శులకు పోలీసు యూనిఫాం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. వారు పోలీసు యూనిఫాం ధరించి విధులు నిర్వర్తించడం ద్వారా స్థానికంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిలో కొంత భయం ఏర్పడుతుందని చెప్పారు. తద్వారా ఉద్యోగులు మరింత సమర్థవంతంగా విధులు నిర్వహించే అవకాశం ఉంటుందని అధికారులకు స్పష్టం చేశారు. ఇప్పటి దాకా మహిళా సంరక్షణ కార్యదర్శి పేరుతో పిలిచే ఈ ఉద్యోగులందరినీ ఇక నుంచి అధికారికంగానే ‘మహిళా పోలీసు’ అని పిలవాలని సీఎం ఆదేశించారు. ఇందుకు అనుగుణంగా గ్రామ, వార్డు సచివాలయ శాఖ చర్యలకు ఉపక్రమించింది. మిగిలిన ఉద్యోగులకూ వేర్వేరు యూనిఫాం గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 రకాల ఉద్యోగులు పని చేస్తున్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీసు యూనిఫాం కేటాయించిన మాదిరే మిగిలిన ఉద్యోగులందరికీ వారి వారి విధుల ఆధారంగా వేర్వేరుగా యూనిఫాం కేటాయించే విషయం పరిశీలించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. అయితే, మిగిలిన ఉద్యోగులలో ఎవరికి ఏ రకమైన యూనిఫాం కేటాయించాలన్న దానిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కమిషనర్ నవీన్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. -
మహిళల భద్రతకు సీఎం ప్రత్యేక శ్రద్ధ
సాక్షి, యాదాద్రి : రాష్ట్రంలోని ప్రతి మహిళ భద్రతతో ఉండేందుకు సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఐఏఎస్, ఐపీఎస్‌లతో కూడిన కోర్ గ్రూపు కమిటీ సమావేశంలో ఆమె మహిళా భద్రత చర్యలను సమీక్షించారు. డయల్ 100, 181 తదితర హెల్ప్‌లైన్ వ్యవస్థల పనితీరు గురించి కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు లైంగిక వేధింపులపై ఫిర్యాదులు చేస్తే కలెక్టర్లు తక్షణమే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఫిర్యాదులపై మహిళా రక్షణ కమిటీలు తక్షణం స్పందించినప్పుడే న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్యా దేవరాజన్, సీఎంఓ హరితహారం ప్రత్యేక అధికారి ప్రియాంక వర్గీస్, ఐఏఎస్ అధికారి యోగితా రాణా, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖా కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్, నల్లగొండ, యాదాద్రి కలెక్టర్లు శ్వేతా మహంతి, ప్రశాంత్ జీవన్ పాటిల్, అనితా రామచంద్రన్, హైదరాబాద్ షీ టీం ఇన్చార్జి అనసూయ పాల్గొన్నారు. -
ఆలోచింపజేసే చిత్రం
‘‘తెరవెనుక’ సినిమా ట్రైలర్ బాగుంది. ఒక ఆడపిల్ల తండ్రి తన కూతురికి జరిగిన అన్యాయం గురించి ఫిర్యాదు ఇవ్వడానికి పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పుడు, ఓ లేడీ పోలీస్ వివరించే విధానం బాగుంది. మహిళలపై జరుగుతున్న అంశాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలుస్తోంది’’ అని తెలంగాణ పోలీసు ఉన్నతాధికారిణి సుమతి (డీఐజీ – ఉమెన్ సేఫ్టీ వింగ్) అన్నారు. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ కథానాయకుడిగా, విశాఖ ధిమాన్, దీపికా రెడ్డి కథానాయికలుగా తెరకెక్కిన చిత్రం ‘తెర వెనుక’. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర దర్శకత్వంలో జయలక్ష్మి మురళి మచ్చ సమర్పణలో మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మించారు. ఈ సినిమా ఆడియోను డీఐజీ సుమతి విడుదల చేయగా, దర్శకుడు ఎన్.శంకర్, సుచిర్ ఇండియా లయన్ కిరణ్, నిర్మాత గురురాజ్, సంఘసేవకుడు రేగొండ నరేష్, నటుడు శివారెడ్డి తదితరులు పాటలను విడుదల చేశారు. ఈ నెల 25న ఈ చిత్రం థియేటర్స్‌లో విడుదల కానుంది. నెల్లుట్ల ప్రవీణ్ చంద్ర మాట్లాడుతూ– ‘‘సమాజంలో జరుగుతున్న సంఘటనలను తీసుకొని ఈ సినిమా చేశాను. సామాజిక స్పృహ కలిగిన క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందించాం’’ అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అన్నారు మురళీ జగన్నాథ్ మచ్చ. -
అబలకు అభయం
సాక్షి, అమరావతి: అక్క చెల్లెమ్మల ఆర్థిక, రాజకీయ స్వావలంబనే లక్ష్యంగా కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి రక్షణ, భద్రతకు ఎంతో ప్రాధాన్యం ఇస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. మహిళల అభ్యున్నతికి సువర్ణాక్షరాలతో లిఖించదగే కార్యక్రమాలను గత 17 నెలల కాలంలో చేపట్టామన్నారు. ఆటోలు, ట్యాక్సీలలో ఒంటరిగా ప్రయాణించే పిల్లలు, మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా రూపొందించిన ‘అభయం ప్రాజెక్టు’ (యాప్)ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. తొలుత విశాఖలో పైలట్ ప్రాజెక్టుగా 1,000 ఆటోలలో ట్రాకింగ్ పరికరాలను ఏర్పాటు చేసి దీన్ని అమలు చేయనున్నారు. వచ్చే ఏడాది నవంబర్ నాటికి విజయవాడ, తిరుపతిలో కూడా అమలులోకి తెచ్చి లక్ష వాహనాల్లో ట్రాకింగ్ డివైజ్‌లు అమర్చాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఏమన్నారో ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ‘అభయం’ ప్రారంభ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్, హోంమంత్రి సుచరిత, అధికారులు నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం.. ‘‘రాష్ట్రంలో అక్క చెల్లెమ్మలకు అండగా మన ప్రభుత్వం ఎన్నో అడుగులు ముందుకు వేసింది. నిస్సందేహంగా మహిళా పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునేలా పనిచేస్తున్నాం. అమ్మ ఒడి పథకం, ఆసరా, చేయూత, ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్, విద్యా దీవెన, వసతి దీవెన.. ఇలా ఏ పథకాన్ని తీసుకున్నా నేరుగా అక్క చెల్లెమ్మల ఖాతాల్లో సాయాన్ని జమ చేయడం ద్వారా ఆర్థిక స్వావలంబన చేకూర్చి చరిత్రలో నిలిచే ఘట్టం ఆవిష్కృతమవుతోంది. సగం మహిళలకు కేటాయిస్తూ చట్టాలు.. నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనుల్లో 50 శాతం మహిళలకు ఇచ్చేలా ఏకంగా చట్టాలు చేసిన ప్రభుత్వం మనది. రాజకీయంగా అక్క చెల్లెమ్మలను అన్ని రకాలుగా పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాం. హోంమంత్రిగా నా చెల్లెమ్మ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రిగా మరొక చెల్లెమ్మ ఉండడం మహిళల రాజకీయ సాధికారతకు నిదర్శనం. ఆ మాటలను మరువలేదు.. రక్షణ, భద్రత విషయంలో రాజీ పడొద్దు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్లు, ఎస్పీలతో నా మొట్టమొదటి కాన్ఫరెన్సులో చెప్పిన మాటలు గుర్తున్నాయి. దేశంలో తొలిసారిగా దిశ బిల్లు ప్రవేశపెట్టి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాం. ఈరోజు ప్రతి జిల్లాలో దిశ ప్రత్యేక పోలీసు స్టేషన్లు కనిపిస్తున్నాయి. దిశ కోర్టుల్లో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉండే విధంగా ప్రభుత్వం నామినేట్ చేసింది. దిశ యాప్ బటన్ నొక్కిన 10 నిమిషాల వ్యవధిలోనే పోలీసులు వచ్చి తోడుగా నిలబడే విధంగా చర్యలు తీసుకున్నాం. సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించాం. మహిళా పోలీసు మిత్రలను కూడా తయారు చేస్తున్నాం. మరో అడుగు ముందుకు.. ఇవాళ మహిళల కోసం ‘అభయం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇది ఒక యాప్ లేదా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) ప్రాజెక్టు అనుకోవచ్చు. దిశ యాప్‌ను పోలీసు శాఖ నిర్వహిస్తుండగా అభయం యాప్ (ప్రాజెక్టు) రవాణా శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. అక్క చెల్లెమ్మలు, చిన్నారులు ఆటోలు, టాక్సీలలో నిర్భయంగా ప్రయాణించేందుకు, ప్రయాణ సమయంలో ఏ ఆపద రాకుండా చూసేలా అభయం ఐవోటీ ఉపకరణాన్ని ఆటో, టాక్సీల్లో అమరుస్తాం. ఆటోలు, టాక్సీలు నడిపే సోదరుల మీద నమ్మకం లేక ఇదంతా చేయడం లేదు. వారిపై ప్రయాణికులకు మరింత నమ్మకం కల్పించి నిశ్చింతంగా ఉండేందుకే ఈ ఏర్పాటు. ఏమిటీ ‘అభయం’?.. ఆటోలు, టాక్సీల్లో ఐవోటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) ఉపకరణాన్ని అమరుస్తారు. ఆటో / టాక్సీ ఎక్కిన వెంటనే అక్క చెల్లెమ్మలు స్మార్ట్ ఫోన్ ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకుంటే వెంటనే పూర్తి వివరాలు నమోదవుతాయి. ఏదైనా ఆపద సమయంలో వారివద్ద స్మార్ట్ ఫోన్ లేకుంటే రెడ్ బటన్ నొక్కితే పోలీసులు తక్షణమే అక్కడకు చేరుకుని ఆదుకుంటారు. క్యాబ్‌లకు ధీటుగా భద్రత... వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వతేదీ నాటికి 5 వేల వాహనాల్లో, జూలై 1 నాటికి 50 వేల వాహనాల్లో, నవంబరు నాటికి లక్ష వాహనాల్లో అభయం ఐవోటీ ఉపకరణాలను ఏర్పాటు చేస్తాం. తద్వారా ఉబెర్, ఓలా లాంటి బహుళ జాతి సంస్థల క్యాబ్‌లకు ధీటుగా ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నారనే విశ్వాసం కలుగుతుంది. ఇలా అందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నా’’ సోదరుడిలా అండగా సీఎం – మేకతోటి సుచరిత, హోంమంత్రి ‘మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాలలు, మహిళల భద్రత కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నో చర్యలు చేపట్టారు. దిశ చట్టం, సైబర్ మిత్ర, మహిళా మిత్రల ద్వారా భద్రత కల్పిస్తున్నారు. ఇప్పుడు అభయం ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ఆంధ్రప్రదేశ్ అంటే మహిళలకు ఒక అభయ హస్తం మాదిరిగా, ఒక సోదరుడిలా అండగా నిలిచిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’ ఎర్ర బటన్ నొక్కగానే ఇంధనం బంద్ అభయం ఐఓటీ ఉపకరణంలో రెడ్ బటన్ నొక్కగానే అలారమ్ మోగడంతోపాటు వాహనానికి ఇంధన సరఫరా నిల్చిపోతుందని రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వివరించారు. అభయం ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమంలో రవాణా శాఖ కమిషనర్ పీఎస్ఆర్ ఆంజనేయులు, పోలీసు, రవాణా శాఖలకు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొనగా జిల్లాల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. భద్రతపై నిశ్చింత.. అభయం పానిక్ బటన్‌పై మా కాలేజీలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇది చూసిన తర్వాత మాకు భద్రత ఉంటుందనే నమ్మకం కలిగింది. యాప్‌ను ఇప్పటికే సెల్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నాం. – గమ్య, డిగ్రీ విద్యార్థిని, విశాఖపట్నం అలా చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు.. కార్యనిర్వాహక రాజధానిగా ఎంపికైన విశాఖ నుంచి అభయం ప్రాజెక్టు మొదలైంది. ఆర్నెల్లుగా పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశాం. దీనిద్వారా మహిళలు, బాలికలకు మరింత భద్రత ఉంటుంది. అభయం డివైజ్‌ను ఎవరైనా డ్రైవర్లు ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేస్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేస్తాం’ – జీసీ రాజారత్నం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, విశాఖపట్నం -
మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్: సీఎం జగన్
-
ఆ విషయంలో ఏమాత్రం రాజీపడం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి : రాష్ట్రంలో మహిళలు, చిన్నారుల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న అభయ్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. రవాణాశాఖ పర్యవేక్షణలో అమలయ్యే ఈ ప్రాజెక్టును సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. మహిళల భద్రత కోసం అభయం ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామన్నారు. మహిళల కోసం ఇప్పటికే అమ్మ ఒడి, చేయూత పథకాలు ప్రవేశపెట్టామని గుర్తుచేశారు. ఇళ్ల పట్టాలు కూడా మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్ చేస్తున్నామన్నారు. నామినేటెడ్ పదవులు,పనుల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్ కల్పించామని పేర్కొన్నారు. హోంమంత్రి, డిప్యూటీ సీఎం పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించిట్లు స్పష్టం చేశారు. మహిళలకు ఆర్థిక, రాజకీయ స్వాలంబన కల్పించేలా అడుగులు వేస్తున్నామన్నారు. మహిళల రక్షణ, భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడటంలేదని అన్నారు. (అవినీతిపై తిరుగులేని అస్త్రం) అక్కాచెల్లెమ్మలకు అండగా తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం కల్పించాలని ఆదేశాలు ఇచ్చాం. దేశంలోనే తొలిసారిగా దిశా బిల్లును ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచాం. ప్రతి జిల్లాలో దిశా పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశాం. దిశా ప్రత్యేక కోర్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. దిశా యాప్ ద్వారా అక్కాచెల్లెమ్మలకు అండగా నిలబడ్డాం. ప్రతి గ్రామ/వార్డు సచివాలయాల్లో మహిళా పోలీస్‌ను కూడా నియమించాం. రవాణా శాఖ ఆధ్వర్యంలో అభయం యాప్‌ను అందుబాటులోకి తెచ్చాం. ఆటోలు, క్యాబ్‌ల్లో నిర్భయంగా ప్రయాణించేందుకు యాప్ ఉపయోగపడుతుంది. రాష్ట్రంలోని ప్రతి ఆటో, క్యాబ్‌లో అభయం యాప్ డివైజ్ ఏర్పాటు చేస్తాం. తొలిసారిగా వెయ్యి వాహనాల్లో డివైజ్ ఏర్పాటు చేస్తున్నాం. వచ్చే నవంబర్ నాటికి లక్ష వాహనాలకు డివైజ్ ఏర్పాటు చేస్తాం’ అని పేర్కొన్నారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138.48 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం నిర్భయ స్కీం కింద 2015లో రాష్ట్రానికి రూ.80.09 కోట్లు కేటాయించింది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ.55.39 కోట్లు కేటాయించాల్సి ఉంది. దశలవారీగా రాష్ట్రంలో లక్షరవాణా వాహనాలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి వచ్చే ఏడాది నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అమలు చేయాలని రవాణాశాఖ లక్ష్యం పెట్టుకుంది. తొలిదశలో విశాఖపట్టణంలో వెయ్యి ఆటోల్లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ) పరికరాలు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత తిరుపతిలో అమలు చేస్తారు. ‘అభయం’ అమలు ఇలా.. ► రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. ► రవాణా వాహనాలకు దశలవారీగా ఐవోటీ బాక్సులు అమర్చాలి. ► తొలుత వెయ్యి ఆటోల్లో సోమవారం ఈ పరికరాలు ఏర్పాటు చేస్తారు. వచ్చే ఫిబ్రవరి 1 నాటికి ఐదువేల వాహనాలు, జూలై 1కి 50 వేల వాహనాలు, వచ్చే ఏడాది నవంబరు 31కి లక్ష వాహనాల్లో ఈ పరికరాలు అమరుస్తారు. ప్రాజెక్టు నిర్వహణ 2025 వరకు ఉంటుంది. ► ఆటోలు, క్యాబ్‌ల్లో ప్రయాణించే వారు తమ మొబైల్లో ‘అభయం’ మొబైల్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. వాహనంఎక్కేముందు వాహనానికి అంటించిన క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయాలి. ► స్కాన్ చేయగానే డ్రైవరు ఫోటో, వాహనం వివరాలు మొబైల్‌కు వస్తాయి. ► స్మార్ట్ ఫోన్ వినియోగించే మహిళలు తమ ప్రయాణంలో ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబరు పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. ► స్మార్ట్ ఫోన్ లేని ప్రయాణికులు వాహనానికి బిగించిన ఐవోటీ పరికరంలోని ప్యానిక్ బటన్ నొక్కితే సమాచారం కమాండ్ కంట్రోల్ సెంటరుకు చేరుతుంది. క్యాబ్/ఆటో వెంటనే ఆగిపోతుంది. ఆ వెంటనే సమీపంలోని పోలీస్ అధికారులకు సమాచారం పంపి పట్టుకుంటారు. ► ఐవోటీ ఆధారిత బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. ► ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐవోటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. -
కాల్ చేస్తే చాలు.. కదిలొస్తారు!
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో మహిళా ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు ఇక నుంచి ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు. ప్రయాణికులతో పాటే రైళ్లలో ప్రయాణం చేస్తారు. సహాయం కోరితే వెంటనే వచ్చి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రస్తుతం 8 రైళ్లలో ప్రారంభించారు. దశల వారీగా మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. రైళ్లలో దొంగలు, అసాంఘిక శక్తులు, పోకిరీల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఒంటరి మహిళా ప్రయాణికులు సెక్యూరిటీ సహాయ నంబర్ 182కు ఫోన్ చేస్తే చాలు.. పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ‘మేరీ సహేలీ’తోడుగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ట్రైన్ ఎక్కినప్పట్నుంచి దిగే వరకు.. ఈ ‘మేరీ సహేలీ’లో భాగంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయంలోనే ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా రైల్వే భద్రతా దళం సిబ్బంది మహిళా ప్రయాణికులతో మాట్లాడుతారు. వారి భద్రతకు భరోసా ఇస్తారు. ప్రయాణ సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 182 నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తారు. అలాగే ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు మహిళలు ప్రయాణించే సీట్ల నంబర్లను, వివరాలను సేకరించి అవసరమైన భద్రతా చర్యలను చేపడతారు. మార్గమధ్యలో రైళ్లు ఆగే స్టేషన్లలో విధులు నిర్వహించే ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సదరు మహిళలు ప్రయాణం చేసే బోగీలపైనా ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు. అవసరమైతే వారితో మాట్లాడుతారు. ఎలాంటి సహాయం కావాలో తెలుసుకుంటారు. ప్రయాణ సమయంలో ట్రైన్లో విధి నిర్వహణలో ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు, స్టేషన్ సిబ్బంది కూడా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. మహిళా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆర్పీఎఫ్ సిబ్బంది వారితో మరోసారి మాట్లాడుతారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే వివరాలను సేకరిస్తారు. కాగా సుమారు 500 మంది మహిళా కానిస్టేబుళ్ల సేవలను ‘ఆపరేషన్ మేరీ సహేలీ’ కోసం వినియోగించుకుంటారు. ప్రతి ట్రైన్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ నిరంతరం నిఘా కొనసాగిస్తారు. ఆ 8 రైళ్లు ఏవంటే.. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రాకపోకలు సాగించే గోల్కొండ (07202) ఎక్స్‌ప్రెస్ నాంపల్లి నుంచి విశాఖపట్నం వరకు నడిచే గోదావరి (02778) ఎక్స్‌ప్రెస్ తిరుపతి-రాయలసీమ (02793) రాయలసీమ ఎక్స్‌ప్రెస్ నాందేడ్-అమృత్సర్ సచ్‌ఖండ్ (02715) ఎక్స్‌ప్రెస్ కిన్వత్-ముంబై, నందిగ్రామ్ (01142) ఎక్స్‌ప్రెస్ గుంటూరు-సికింద్రాబాద్ గోల్కొండ (07201) ఎక్స్‌ప్రెస్ విజయవాడ-హుబ్బళి (హుబ్లీ) అమరావతి (07225) ఎక్స్‌ప్రెస్ కాచిగూడ-మైసూరు మధ్య నడిచే మైసూర్ (02785) ఎక్స్‌ప్రెస్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరీ సహేలీ కార్యక్రమంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆర్పీఎఫ్ సేవలను ప్రశంసించారు. మహిళా ప్రయాణికుల భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు. మహిళలు ఫోన్ చేస్తే వెంటనే చేరుకోని తగిన భద్రత కల్పించాలని సూచించారు. -
కాల్ చేస్తే.. కదిలొస్తారు!
సాక్షి, హైదరాబాద్: రైళ్లలో మహిళా ప్రయాణికులకు మరింత భద్రతను కల్పించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక పథకానికి శ్రీకారం చుట్టింది. ఒంటరిగా ప్రయాణం చేసే మహిళలకు ఇక నుంచి ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు తోడుగా ఉంటారు. ప్రయాణికులతో పాటే రైళ్లలోప్రయాణం చేస్తారు. సహాయం కోరితే వెంటనే వచ్చి భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. ‘ఆపరేషన్ మేరీ సహేలీ’పేరుతో చేపట్టిన ఈ పథకాన్ని ప్రస్తుతం 8 రైళ్లలో ప్రారంభించారు. దశల వారీగా మరిన్ని రైళ్లకు విస్తరించనున్నారు. రైళ్లలో దొంగలు, అసాంఘిక శక్తులు, పోకిరీల వల్ల ఇబ్బందులకు గురయ్యే ఒంటరి మహిళా ప్రయాణికులు సెక్యూరిటీ సహాయ నంబర్ 182కు ఫోన్ చేస్తే చాలు.. పోలీసులు క్షణాల్లో చేరుకుంటారు. మహిళా ప్రయాణికులకు సురక్షితమైన రవాణా సదుపాయం కల్పించేందుకు ‘మేరీ సహేలీ’తోడుగా ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే భద్రతా అధికారి ఒకరు తెలిపారు. ట్రైన్ ఎక్కినప్పట్నుంచి దిగే వరకు.. ఈ ‘మేరీ సహేలీ’లో భాగంగా అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలో రైళ్లు బయలుదేరే సమయంలోనే ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్లు, మహిళా రైల్వే భద్రతా దళం సిబ్బంది మహిళా ప్రయాణికులతో మాట్లాడుతారు. వారి భద్రతకు భరోసా ఇస్తారు. ప్రయాణ సమయంలో తీసుకోవాలసిన జాగ్రత్తలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో 182 నంబరుకు ఫోన్ చేయాల్సిందిగా సూచిస్తారు. అలాగే ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు మహిళలు ప్రయాణించే సీట్ల నంబర్లను, వివరాలను సేకరించి అవసరమైన భద్రతా చర్యలను చేపడతారు. మార్గమధ్యలో రైళ్లు ఆగే స్టేషన్లలో విధులు నిర్వహించే ఆర్పీఎఫ్ సిబ్బంది కూడా సదరు మహిళలు ప్రయాణం చేసే బోగీలపైనా ప్రత్యేకంగా దృష్టి సారి స్తారు. అవసరమైతే వారితో మాట్లాడుతారు. ఎలాంటి సహాయం కావాలో తెలుసుకుంటారు. ప్రయాణ సమయంలో ట్రైన్లో విధి నిర్వహణలో ఉండే ఆర్పీఎఫ్ సిబ్బందితో పాటు, స్టేషన్ సిబ్బంది కూడా మహిళల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. మహిళా ప్రయాణికులు తమ గమ్యస్థానానికి చేరిన తర్వాత ఆర్పీఎఫ్ సిబ్బంది వారితో మరోసారి మాట్లాడుతారు. మహిళా ప్రయాణికుల భద్రత కోసం ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే వివరాలను సేకరిస్తారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలి.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేరీ సహేలీ కార్యక్రమంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆర్పీఎఫ్ సేవలను ప్రశంసిం చారు. మహిళా ప్రయాణికుల భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు చెప్పారు. మహిళలు ఫోన్ చేస్తే వెంటనే చేరుకోని తగిన భద్రత కల్పించాలని సూచించారు. ఆ 8 రైళ్లు ఏవంటే.. సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు రాకపోకలు సాగించే గోల్కొండ (07202) ఎక్స్‌ప్రెస్, నాంపల్లి నుంచి విశాఖపట్నం వరకు నడిచే గోదావరి (02778) ఎక్స్‌ప్రెస్, తిరుపతి–రాయలసీమ (02793) రాయలసీమ ఎక్స్‌ప్రెస్, నాందేడ్–అమృత్సర్ సచ్‌ఖండ్ (02715) ఎక్స్‌ప్రెస్, కిన్వత్–ముంబై, నందిగ్రామ్ (01142) ఎక్స్‌ప్రెస్, గుంటూరు– సికింద్రాబాద్ గోల్కొండ (07201) ఎక్స్‌ప్రెస్, విజయవాడ–హుబ్బళి (హుబ్లీ) అమరావతి (07225) ఎక్స్‌ప్రెస్, కాచిగూడ–మైసూరు మధ్య నడిచే మైసూర్ (02785) ఎక్స్‌ప్రెస్ రైళ్లలో మేరీ సహేలీ పథకం ప్రారంభించారు. సుమారు 500 మంది మహిళా కానిస్టేబుళ్ల సేవలను ఇందుకోసం వినియోగించుకుంటారు. ప్రతి ట్రైన్లో ఇద్దరు లేదా ముగ్గురు మహిళా ఆర్పీఎఫ్ సిబ్బంది విధులు నిర్వహిస్తూ నిరంతరం నిఘా కొనసాగిస్తారు. -
‘మేరీ సహేలీ’తో మహిళా ప్రయాణికులకు రక్ష
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైళ్లలో ప్రయాణించే మహిళల భద్రతే ముఖ్య ఉద్దేశంగా మేరీ సహేలీ(మై ఫ్రెండ్) అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) అందుబాటులోకి తీసుకొచ్చింది. శనివారం విశాఖ రైల్వే స్టేషన్లో సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ జితేంద్ర శ్రీవాస్తవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. గోదావరి స్పెషల్ ఎక్స్‌ప్రెస్, ఏపీ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ తదితర రైళ్ల వద్ద మహిళా ప్రయాణికులకు ఆర్పీఎఫ్ సిబ్బంది అవగాహన కల్పించారు. భద్రత ఇలా: ఆర్పీఎఫ్ సిబ్బంది ముందుగా మహిళా ప్రయాణికుల సీటు, బెర్త్, కోచ్ నంబర్లు తదితర సమాచారం సేకరించి వారిని అప్రమత్తం చేస్తారు. ఇదే సమాచారాన్ని ఆ రైలు ప్రయాణించే అన్ని స్టేషన్లలోని ఆర్పీఎఫ్ సిబ్బందికి ఆందజేస్తారు. ఆ రైలు ఆ స్టేషన్‌కు వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఆర్పీఎఫ్ సిబ్బంది ప్రయాణికుల వద్దకు వెళ్తారు. వారి స్థితిని తెలుసుకుంటారు. ఇలా ఆ రైలు గమ్యం చేరే వరకు ప్రతి స్టేషన్లో ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అనుసరిస్తుంటారు. అత్యవసరమైతే ఉచిత హెల్ప్‌లైన్ 182 నంబర్లో సంప్రదించాలని ప్రయాణికులకు చెబుతున్నారు. -
కీచకుల్ని ఇట్టే పట్టేస్తారు
సాక్షి, అమరావతి: ఆటోలు, ట్యాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలోనే ఓ ప్రాజెక్ట్ అమల్లోకి రానుంది. పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రయోగాత్మకంగా విశాఖలో తొలుత వెయ్యి ఆటోలకు ట్రాకింగ్ డివైస్‌లు బిగించి.. ఆటోల్లో ప్యానిక్ బటన్లు అమరుస్తారు. ఈ నెలాఖరున రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఈ ప్రాజెక్ట్‌ను ప్రారంభిస్తారు. అనంతరం ఇందులో సాంకేతిక లోపాలు, ఇబ్బందులు ఏమైనా ఎదురైతే వాటిని సరిచేసి రాష్ట్రమంతటా ఈ విధానాన్ని అమల్లోకి తెస్తారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు రూ.138 కోట్లు అవసరమవుతాయని అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వం 2015లోనే రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే.. అప్పటి చంద్రబాబు సర్కారు ఈ ప్రాజెక్ట్ అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌పై ప్రత్యేక దృష్టి సారించడంతో త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ఇలా పని చేస్తుంది రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్స్‌లు అమరుస్తారు. తద్వారా ఆ వాహనాలన్నీ రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూమ్‌లతో అనుసంధానం అవుతాయి. ఐఓటీ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. ఆ కార్డులను వాహనం ఇంజన్ వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే సదరు వాహనం స్టార్ట్ అవుతుంది. ప్రయాణంలో మహిళలు ఎవరైనా ఆపదలో చిక్కుకుంటే.. ప్యానిక్ బటన్ నొక్కితే సరిపోతుంది. సదరు వాహనం ఎక్కడ ఉందో తెలుసుకుని పోలీసులు ఇట్టే పట్టేస్తారు. వెనువెంటనే వాహనం వద్దకు చేరుకుని ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు క్షణాల్లోనే భద్రత కల్పించి అకృత్యాలకు అడ్డుకట్ట వేస్తారు. ప్రాజెక్ట్ అమలు ఇలా.. ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్‌ను రూపొందించింది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. వాటిని అనుసంధానిస్తూ ప్రతి ఆటో, క్యాబ్‌లో ప్యానిక్ బటన్లు అమరుస్తారు. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ఆ వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో తెలుసుకునే వీలు కలుగుతుంది. వాటిలో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ప్యానిక్ బటన్ నొక్కితే.. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా రవాణా శాఖ కమిషనరేట్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం వెళుతుంది. ఆ తర్వాత మహిళలు, చిన్నారుల రక్షణకు ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 112కు ఫిర్యాదు వెళుతుంది. ట్రాకింగ్ డివైస్‌లను ఆటో, క్యాబ్ ఇంధన ట్యాంకులతో అనుసంధానించడం వల్ల ఆపదలో అవి ఎక్కువ దూరం ప్రయాణించలేవు. -
అత్యాచార కేసుల్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు
సాక్షి, అమరావతి: మహిళలు, ఆడపిల్లలపై రోజురోజుకీ పెరిగిపోతున్న దారుణాలపై కేంద్ర హోం శాఖ స్పందించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన హాథ్రస్ హత్యాచార ఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై అన్ని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చట్టాలను అనుసరించి కేంద్ర హోం శాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.. ► మహిళలపై నేరాలు.. ప్రధానంగా అత్యాచారం వంటి కేసుల్లో పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి. లైంగిక దాడి వంటి ఘటనల్లో తప్పనిసరిగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. ఒకవేళ నేరం బాధితురాలుండే పోలీస్‌స్టేషన్ పరిధి వెలుపల జరిగితే.. ఎక్కడైనా సరే ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేయాల్సిందే. లేకపోతే సదరు పోలీస్ అధికారి శిక్షార్హుడు. ► లైంగిక దాడి గురించి సమాచారం అందిన 24 గంటల్లోగా బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించాలి. న్యాయాధికారి ముందు రికార్డు చేయనప్పటికీ.. బాధితురాలి మరణ వాంగ్మూలం పరిగణనలోకి తీసుకోవాలి. ► లైంగిక దాడుల కేసుల్లో సాక్ష్యాలను సేకరించేందుకు సెక్సువల్ అసెల్ట్ ఎవిడెన్స్ కలెక్షన్ కిట్లను ఉపయోగించాలి. అత్యాచార కేసుల్లో పోలీసుల దర్యాప్తు 60 రోజుల్లో పూర్తి చేయాలి. ► దర్యాప్తులో రాష్ట్ర పోలీసులకు సహకారం అందించేందుకు ‘ఇన్వెస్టిగేషన్ ట్రాకింగ్ సిస్టమ్ ఫర్ సెక్సువల్ అఫెన్సెస్’ ఆన్లైన్ పోర్టల్‌ను కేంద్ర హోం శాఖ అందుబాటులోకి తెచ్చింది. ఈ మార్గదర్శకాలు పాటించని పోలీసులపైనా కఠిన చర్యలు ఉంటాయి. ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ మహిళలు, ఆడపిల్లల రక్షణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలిచింది. తెలంగాణలో జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో.. ఏపీలోని ఆడబిడ్డలెవరికీ అలాంటి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. మహిళలు, బాలికల రక్షణకు ప్రత్యేకంగా ‘దిశ’ యాక్ట్ తెచ్చింది. దిశ పోలీస్ స్టేషన్లు, సైంటిఫిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసింది. ఫలితంగా మహిళలు, చిన్నారులపై అత్యాచారానికి, లైంగిక వేధింపులకు పాల్పడిన దుర్మార్గులకు 21 రోజుల్లోనే శిక్షలు పడేలా కృషి చేస్తోంది. ఏపీలోని దిశ యాక్ట్ తరహాలోనే ప్రత్యేక చట్టం తెచ్చేందుకు మహారాష్ట్ర, తదితర రాష్ట్రాలు ఏపీలో అధ్యయనం కూడా చేశాయి. అన్యాయానికి గురైన మహిళలు ఎక్కడైనా ఫిర్యాదు చేసేలా 2019 డిసెంబర్ 5 నుంచే రాష్ట్రంలో జీరో ఎఫ్ఐఆర్ను అమలులోకి తెచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 341 జీరో ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రంలో తీసుకొచ్చిన దిశ యాక్ట్, జీరో ఎఫ్ఐఆర్ తదితరాలు మహిళలు, చిన్నారుల రక్షణలో సత్ఫలితాలను ఇస్తున్నాయని ఏపీ పోలీస్ శాఖ టెక్నికల్ చీఫ్ పాల్‌రాజ్ ‘సాక్షి’కి తెలిపారు. -
సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయి : సీపీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా సమయంలో సైబర్ వేధింపులు ఎక్కువయ్యాయని సీపీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగాల్లో కొత్తగా చేరిన మహిళల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై సదస్సు కార్యక్రమంలో సీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు కోసం కంపెనీలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. సైబరాబాద్ పోలీస్ ఎస్సీఎస్సీ ద్వారా మహిళా ఉద్యోగుల కోసం రక్షణ ఏర్పాట్లు చేశామని సజ్జనార్ పేర్కొన్నారు. ఈ లెర్నిగ్ మాడ్యూల్ ద్వారా మహిళ ఉద్యోగుల రక్షణ కోసం ఇది పనిచేస్తుందన్నారు. (జీతం కోసం జీవితం అంతం చేసుకున్నాడు) కోవిడ్ కారణంగా సోషల్ మీడియా ద్వారా వేధింపులు ఎక్కువయ్యయని వీటి కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. సుమారు 65వేల మంది మహిళా ఉద్యోగులు ఐటీ సంస్థలో పనిచేస్తున్నారని, వీరి భద్రతకు ఆయా సంస్థలు విమెన్ సేఫ్టీ వింగ్స్‌ను ఏర్పాటు చేశాయని అన్నారు. వర్క్ ఫ్రం హోం చేసే ఉద్యోగులకు సైతం తగిన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉమెన్ ఫోరమ్ సభ్యుల కృషితో ఐటీ కారిడార్‌లో నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. (శ్రీశైలం ఘటనపై ఫోరెన్సిక్ నివేదిక సిద్ధం!) -
మరింత కట్టుదిట్టంగా ‘దిశ’
సాక్షి, అమరావతి: ‘దిశ’ చట్టాన్ని మరింత సమర్ధవంతంగా అమలు చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ క్రిమినల్ లా సవరణ బిల్లుకు త్వరగా ఆమోదం లభించేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. వీలైనంత త్వరగా ప్రత్యేకకోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ప్రయత్నించాలన్నారు. దిశ చట్టం అమలుపై సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ... ప్రత్యేకంగా ప్రాసిక్యూటర్లు... ► మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టుల ఏర్పాటు ప్రక్రియపై సీఎం ఆరాతీశారు. కేంద్ర హోంశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్న ఫైల్‌కు వీలైనంత త్వరగా ఆమోదం లభించేలా చూడాలని సూచించారు. ► దిశ చట్టం కింద నమోదైన కేసుల విచారణకు 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోక్సో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలని సీఎం ఆదేశించారు. పోస్టర్లతో చైతన్యం చేయాలి... ► దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు ప్రజలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సీఎం సూచించారు. ఫోరెన్సిక్ ల్యాబ్‌లు కూడా త్వరగా ఏర్పాటు కావాలన్నారు. ► దిశ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రతి నెలా తీసుకోవాల్సిన చర్యల గురించి సమీక్ష చేయాలని సీఎం పేర్కొన్నారు. దిశ యాప్ ద్వారా అందే ఫిర్యాదులపై మెరుగైన సేవలు అందించాలన్నారు. ‘దిశ’ పెట్రోలింగ్.. హెల్ప్ డెస్క్‌లు ► మహిళల రక్షణ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో దిశ పెట్రోలింగ్ కోసం 900 స్కూటర్లను ప్రభుత్వం త్వరలో సమకూర్చనుంది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్ డెస్క్‌లను ఏర్పాటు చేసి ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్ నంబర్ సదుపాయం కల్పిస్తారు. బాధితులకు సైకాలజిస్ట్, స్వచ్ఛంద సంస్థల నుంచి న్యాయ సహాయం కూడా లభిస్తుంది. ► సైబర్ సేఫ్టీ కోసం ఏర్పాటయ్యే కియోస్క్‌ల §ద్వారా ఫోన్, ల్యాప్‌టాప్‌ల భద్రతనుపరీక్షించుకోవచ్చని అధికారులు తెలిపారు. దిశ యాప్ 11 లక్షల డౌన్ లోడ్స్ ► దిశ యాప్ ద్వారా ఇప్పటివరకు 502 కాల్స్, 107 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. దిశ చట్టం కింద ఇప్పటి వరకూ 390 కేసులు నమోదు కాగా 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు చేశారు. 74 కేసుల్లో శిక్షలు ఖరారు అయ్యాయి. 1,130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు కాగా కేసు నంబర్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. దిశ యాప్¯ను 11 లక్షలమంది డౌన్లోడ్ చేసుకున్నారు. దిశ ఒన్ స్టాఫ్ సెంటర్లు అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయిలో పని చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. జనవరి నుంచి ఆగస్టు వరకూ 2,285 కేసులు ఒన్‌స్టాప్ సెంటర్లకు వచ్చాయని వెల్లడించారు. వాట్సాప్‌కు భారీగా ఫిర్యాదులు... ► సైబర్ మిత్ర ద్వారా 265 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. సామాజిక మాథ్యమాల ద్వారా వేధింపుల నివారణకు ఏర్పాటైన సైబర్‌బుల్లీ వాట్సాప్ నంబర్‌కు ఇప్పటివరకు 27 వేల ఫిర్యాదులు వచ్చాయి.తరచూ చట్టాన్ని ఉల్లంఘిస్తున్న 780 మందిపై కేసులు నమోదు చేశారు. ► సీఎం సమీక్షలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, అధికారులు పాల్గొన్నారు. -
‘దిశ’ చట్టం అమలుపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
దిశ: ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలి
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులపై నేరాలకు సంబంధించి విచారణకు ప్రత్యేక కోర్టులు త్వరగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అయితే దీనికి సంబంధించిన ఫైలు కేంద్ర హోం శాఖ వద్ద పెండింగులో ఉందని అధికారులు చెప్పగా.. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకోవాలని సీఎం సూచించారు. క్రిమినల్ లాలో సవరణలు చేస్తూ పంపిన బిల్లుకు ఆమోదం వచ్చేలా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం సీఎం జగన్ 'దిశ' చట్టం అమలుపై సమీక్ష నిర్వహించారు. దిశ చట్టాన్ని సమర్థవంతగా అమలు చేయాలని పేర్కొన్నారు. దిశ యాప్ కింద వచ్చే ఫిర్యాదులకు క్వాలిటీ సేవలు అందాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్ సహా పలువురు అధికారులు హాజరయ్యారు. వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయాలి ఈ సందర్భంగా ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకంపైనా సీఎం జగన్ ఆరా తీశారు. దిశ చట్టం కింద కేసుల విచారణకు 13 జిల్లాల్లో 11 మంది ప్రాసిక్యూటర్లు, పోక్సో కేసుల విచారణకు 8 మంది ప్రాసిక్యూటర్లను ప్రత్యేకంగా నియమించామని అధికారులు తెలియజేశారు. దీంతో మిగిలిన చోట్ల కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్లను త్వరగా నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. దిశ చట్టం, యాప్, నంబర్లకు సంబంధించిన వివరాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు, ప్రజలు ఎక్కువగా వచ్చి పోయే ప్రాంతాలు, వారు సమావేశమయ్యే చోట్ల పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలని సూచించారు. అలాగే వీలైనంత త్వరగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాలు చేయాలని ఆదేశించారు. (యువతిని కాపాడిన 'దిశ' యాప్) త్వరలో దిశ పెట్రోల్స్ ప్రారంభం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఏపీ ప్రభుత్వం దిశ పెట్రోల్‌ను ప్రారంభించనుంది. అందులో భాగంగా 900 స్కూటర్లను ఏర్పాటు చేసింది. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ మహిళా హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేకంగా కంప్యూటర్, ఫోన్ నంబర్ ఏర్పాటు కానుంది. ఇక్కడ సైకాలజిస్ట్, ఎన్జీఓ సహా న్యాయ సహాయం కూడా లభిస్తుంది. (మహిళల రక్షణ కోసం ఈ–రక్షాబంధన్‌కు శ్రీకారం) దిశ చట్టం కింద ఇప్పటివరకు ముగ్గురికి మరణశిక్ష మరోవైపు దిశ యాప్ 11 లక్షల డౌన్లోడ్లు పూర్తి చేసుకుంది. ఈ యాప్ ద్వారా ఇప్పటివరకు 502 కాల్స్, 107 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. దిశ చట్టం కింద మొత్తం 390 కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో 7 రోజుల్లోపు ఛార్జి షీటు దాఖలు కాగా 74 కేసుల్లో శిక్షలు ఖరారయ్యాయి. ఇందులో మరణ శిక్షలు 3, జీవితఖైదు 5, 20 సంవత్సరాల శిక్ష 2, 10 సంవత్సరాల శిక్ష 5, ఏడేళ్లపైన 10, 5 సంవత్సరాలలోపు శిక్షలు మిగతా కేసుల్లో విధించారు. మరో 1130 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేసినప్పటికీ, ఇంకా కేసు నంబర్లు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. కోవిడ్ కారణంగా కోర్టుల కార్యకలాపాలపై ప్రభావం చూపిందదన్నారు. సైబర్ మిత్ర ద్వారా 265 ఎఫ్ఐఆర్లు దాఖలయ్యాయి. ('వైఎస్సార్ చేయూత' పథకాన్ని ప్రారంభించిన సీఎం జగన్) 27 వేల సైబర్ ఫిర్యాదులు సామాజిక మాధ్యమాల ద్వారా వేధింపులు ఆపడానికి సైబర్ బుల్లీ వాట్సాప్ నంబర్ అందుబాటులో ఉంది. ఇందులో ఇప్పటి వరకూ 27 వేల ఫిర్యాదులు వచ్చాయి. 780 మంది తరచుగా చట్ట ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని గుర్తించగా వీరందరిపైనా కేసులు నమోదు చేశారు. సైబర్ నేరాలు, సైబర్ చట్టాలపైనా అవగాహన కల్పించే ఈ-రక్షా బంధన్‌లోని ప్రత్యేక కార్యక్రమంలో 3.5 లక్షల మంది పాల్గొన్నారు. దిశ వన్ స్టాఫ్ సెంటర్లు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయని అధికారులు తెలిపారు. ఈ సెంటర్లు 13 జిల్లా హెడ్ క్వార్టర్స్‌లో పెట్టామన్నారు. జనవరి నుంచి ఆగస్టు వరకూ 2285 కేసులు వన్‌స్టాప్ సెంటర్లకు వచ్చాయని అధికారులు వివరించారు. -
ఫోన్ వస్తే చాలు పోలీసులు ఎత్తుకుపోతారు
సాక్షి, అమరావతి : మీరు ఒక మహిళ కావచ్చు మిమ్మల్ని తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తి వేధించే ప్రయత్నం కూడా జరగొచ్చు. ఎవరికైనా చెబితే పరువు పోతుందని భయం కూడా ఉండొచ్చు. అలాంటి అనుమానాలు అవసరం లేదు చిన్న ఫోన్ కాల్ చేస్తే చాలు మీ పేరు రహస్యంగా ఉంచి వేధించే వ్యక్తి భరతం పట్టే పరిస్థితి ఇప్పుడు విశాఖ లో ఏర్పడింది. ఈ మధ్యకాలంలో విశాఖలో ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య ఆఫీస్‌కి హడావిడిగా వెళ్లే మహిళలను బైక్ పై ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించి కొంత దూరం వెళ్లి ఆమె ముఖాన్ని తిరిగి చూసే ఘటనలు పెరిగాయి. ఇంటి నుంచి ఆఫీస్ కి ఎలా చేరాలి అన్న ఆలోచనతో వడివడిగా వెళ్తున్న దశలో ఊహించని ఈ పరిణామాలతో చాలా మంది మహిళలు షాక్‌కు గురయ్యారు. కొందరు ఇంట్లో వాళ్లకు చెప్పుకున్నారు మరికొందరు చెప్పుకోలేక కుమిలిపోయారు. కానీ బీచ్ లో ఇద్దరు మహిళలు మాత్రం జరిగిన ఘటనతో కోపంతో రగిలిపోయారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు మహిళలు సహకారంతో పోలీసులు ఆ అపరిచిత వ్యక్తిని అరెస్టు చేశారు. విశాఖలోని అఫీషియల్ కాలనీకి చెందిన రాంబాబు అనే ఈ వివాహితుడు గత కొన్నేళ్లుగా ఇలా ఒంటరి మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందుతున్న ట్టు పోలీసులు గుర్తించారు. దిశ చట్టం పై అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. అయితే ఇక్కడ చెప్పుకునే విషయం ఏమంటే జరిగిన అన్యాయంపై ధైర్యంగా ముందుకు రావడమే కాకుండా నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులకు సహకరించిన మహిళల గురించి..ఇలా ముందుకు వచ్చిన ఆ మహిళలను విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా అభినందించారు. Brave women అని కొనియాడారు. ఇలా మహిళలు ముందుకు రావడం మంచి పరిణామమని మాజీ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి ఉషశ్రీ పేర్కొన్నారు -
‘పిల్లల ఇంటర్నెట్’పై కన్నేయాలి
సాక్షి, హైదరాబాద్: సైబర్‌నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో పిల్లలు వినియోగించే సోషల్ మీడియాపై పేరెంట్స్ ప్రత్యేకదృష్టి సారించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. కోవిడ్ పరిస్థితుల్లో ఇంటర్నెట్ వినియోగం నాలుగింతలు పెరిగిందని, ఆన్లైన్ మోసాలు కూడా ఆందోళనకరస్థాయిలో నమోదవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. విమెన్‌సేఫ్టీ వింగ్ చేపట్టిన ‘సైబ్హర్’ప్రాజెక్టులో భాగంగా ‘ఆన్లైన్ పోస్టింగుల్లో వాస్తవాలు–అవాస్తవాలు, వేటిని నమ్మాలి‘అనే అంశంపై తెలంగాణ పోలీస్ శాఖ మహిళాభద్రతావిభాగం నిర్వహించిన వెబ్ ఆధారిత చర్చగోష్టిలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కామారెడ్డి ఎస్పీ ఎం.శ్వేత, యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ నిపుణులు జార్జ్, సి–డాక్ అసోసియేట్ డైరెక్టర్ సీఏఎస్ మూర్తి తదితరులు ఈ చర్చలో పాల్గొన్నారు. ఎస్పీ శ్వేత మాట్లాడుతూ భౌతిక ప్రపంచానికి, వర్చువల్ ప్రపంచానికి చాలా వ్యత్యాసముందని, సోషల్ మీడియాలో వచ్చే అంశాలను వాస్తవాలతో బేరీజు వేసుకోకపోతే పిల్లలు, యువత సులువుగా నమ్మి మోసపోయే ప్రమాదముందని అన్నారు. ఇంటర్నెట్ వినియోగం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించిన నేపథ్యంలో కొత్తరకాల నేరాలు వెలుగుచూస్తున్నాయని చెప్పారు. యూనిసెఫ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్పెషలిస్ట్ జార్జ్ మాట్లాడుతూ మహిళలు, పిల్లలపై జరిగే సైబర్ నేరాలను అరికట్టేందుకు యూనిసెఫ్ ఆధ్వర్యంలో బాలసురక్ష, శ్రీ సురక్ష అనే ప్రత్యేక యాప్‌లను రూపొందించామని చెప్పారు. సీఏఎస్ మూర్తి మాట్లాడుతూ సైబర్ నేరాలు అన్నివర్గాలను బాధితులుగా చేస్తున్నాయని, మహిళలు, పిల్లలు వీటి బారిన పడేవారిలో అధికశాతమున్నారని తెలిపారు. మహిళాభద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతిæ లక్రా, డీఐజీ సుమతి ఈ కార్యక్రమాన్ని సైబ్‌హర్‌లో భాగంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ సెల్ తొలి వార్షికోత్సవం! విదేశీ భర్తల వేధింపుల నుంచి మహిళలను రక్షించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎన్ఆర్ఐ సెల్ తొలి వార్షికోత్సవం పూర్తి చేసుకుంది. ఎన్ఆర్ఐ సెల్‌కు ఇప్పటిదాకా 101 ఫిర్యాదులు రాగా అందు లో ఆరుగురి పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఎనిమిది కేసుల్లో లుకవుట్ నోటీసులు జారీ చేశారు. 44 కేసుల్లో నిందితులను ఇండియాకు రప్పించేలా వారు పనిచేసే కం పెనీలకు లేఖలు రాశారు. కరోనా కాలంలో గృహహింసను తగ్గించేందుకు పలు భాషల్లో ఆన్లైన్ కౌన్సెలింగ్ ఇచ్చారు. తాజాగా పిల్లలు, మహిళలకు ఆరోగ్యకరమైన సైబర్ ప్రపంచాన్ని అందించేందుకు నెలపాటు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. -
మీకు సైబర్ సేఫ్టీ తెలుసా?
సాక్షి, హైదరాబాద్: మీరు ఎలాంటి పాస్వర్డ్స్ వాడుతున్నారు? ఆన్లైన్లో మీరు ఎంతమేరకు సురక్షితంగా ఉన్నారు? మీరు వ్యవహరించే తీరుతో మీకు ఎంతమేరకు భద్రత ఉంది? తదితర అంశాలపై విద్యార్థులు, మహిళల కోసం ‘విమెన్‌సేఫ్టీ వింగ్’ప్రత్యేక క్విజ్ చేపట్టింది. ఆన్లైన్ వినియోగం పెరిగిన నేపథ్యంలో సురక్షిత సైబర్ వాతావరణం కోసం, వేధింపుల నివారణ కోసం మహిళా రక్షణ విభాగం ఆధ్వర్యంలో ‘సైబ్హర్’(సైబర్ సేఫ్టీ ఫర్ హర్) అవగాహన ప్రాజెక్టులో భాగంగా గురువారం విద్యార్థులు, మహిళల కోసం క్విజ్ నిర్వహించారు. ఇందులో పాల్గొనే వారు ముందుగా సైబ్హర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తరువాత మీకో ఐడీ ఇస్తారు. తరువాత 15 అంశాల ప్రశ్నావళికి జవాబులివ్వాలి. వీటికి విజయవంతంగా సమాధానం చెప్పిన వెంటనే మీకు ఆన్లైన్లో విజ్ఞానం ఉంది? ఏయే అంశాల్లో మీరు మెరుగుపడాలో అని వాటిని చూపిస్తుంది. వెంటనే మిమ్మల్ని అభినందిస్తూ డిజిటల్ సర్టిఫికెట్ కూడా అందజేస్తారు. దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకసారి ఇందు లో ఐడీ క్రియేట్ చేసుకున్నాక.. ఈ నెల మొత్తం ఆన్లైన్లో నిర్వహించే ప్రతీ పోటీలోనూ పాల్గొనవచ్చు. ఇందులో భాగంగా గురువారం రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల నిర్వాహకులు, టీచర్లు, ఎన్జీవోలు, విద్యావేత్తలకు ఈ క్విజ్ పోటీ రిక్వెస్టులు పంపారు. తొలిరోజు సాయంత్రానికి దాదాపు 6వేలమందికిపైగా ఈ సర్టిఫికెట్ కోర్సులో పాల్గొనడం విశేషం. -
'ఆయన తప్పించుకున్నా.. న్యాయం జరుగుతుంది'
సాక్షి, విజయవాడ : మహిళా కమిషన్‌కు ప్రభుత్వం వెన్నుదన్నుగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చినట్లు మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు. మహిళల రక్షణకు సంబంధించిన అంశాలు బుధవారం ముఖ్యమంత్రితో చర్చించినట్లు ఆమె పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులపై లైంగిక దాడులు జరగడంపై సీఎం దృష్టికి తీసుకొచ్చామన్నారు. ఇంటర్ నుంచి డిగ్రీ వరకూ విద్యార్థులకు నిరంతర కౌన్సిలింగ్ అవసరమని ముఖ్యమంత్రికి చెప్పినట్లు తెలిపారు. దీనిపై సీఎం వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారని, ఈ ప్రభుత్వం మహిళలకు భద్రత, అభివృద్ధికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి తెలిపినట్లు వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు.(యూజీ, పీజీ పరీక్షలపై మంత్రి సురేష్ స్పష్టత ) చిన్నపిల్లలు, మైనర్ బాలికలపై అఘాయిత్యం, అత్యాచార ప్రయత్నాలపై చర్చ జరిగిందన్నారు. సచివాలయాల్లో ఈ అంశంపై కొన్ని చర్యలు చేపట్టాలని చెప్పినట్లు తెలిపారు. మహిళా సంక్షమానికి స్వచ్చంద సంస్థల సేవలు వినియోగించుకునే రీతిలో ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మహిళలకు పెద్ద పీట వేస్తున్నారని ప్రశంసించారు. మహిళల సాధికారతకు కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేయాలని సీఎం సూచించినట్లు వాసిరెడ్డి పద్మ తెలిపారు. (తెలుగు ప్రజలకు ఫ్లిప్‌కార్ట్ శుభవార్త) అయ్యన్నపాత్రుడు ఓ మహిళా ఉద్యోగిని దూషించిన సంఘటన అందరినీ అభద్రతకి గురి చేసిందన్నారు. అయ్యన్నపాత్రుడు తప్పించుకున్నప్పటికీ న్యాయం మాత్రం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలో నిర్భయ వంటి తీవ్రమైన చట్టం పెట్టినప్పుడు, చర్యలు ఉండవా అని మహిళా లోకం ప్రశ్నిస్తోందన్నారు. మహిళలను కించపరిచి మాట్లాడే వాళ్ళు భయపడే విధంగా చర్యలు కఠినంగా ఉండాలని వాసిరెడ్డి పద్మ డిమాండ్ చేశారు. (గుడ్‌న్యూస్: మరింత పెరిగిన రికవరీ రేటు) -
ఆ చిన్నారుల మోములో చిరునవ్వు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో తప్పిపోయిన పిల్లలను, బాలకార్మికులు, యాచకులు, వెట్టి చాకిరీలో మగ్గుతున్న పిల్లలను రక్షించి తల్లిదండ్రులకు అప్పగించేందుకు తెలంగాణ పోలీస్ శాఖ చేపట్టిన ఆరవ విడత ‘ఆపరేషన్ స్మైల్’పూర్తయింది. మహిళా భద్రతా విభాగం ఐజీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో 3,600 మంది చిన్నారులను పోలీసులు రక్షించి వారి తల్లిదండ్రులకు అప్పగించగా.. మిగిలిన వారిని రెస్క్యూ హోంలలో ఉంచారు. రక్షించిన వారిలో 1,292 మంది పిల్లలు ఇతర రాష్ట్రాలు, దేశాలకు చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. ఈసారి నిర్వహించిన ఆపరేషన్ స్మైల్‌లో మొదటిసారిగా చైల్డ్ ట్రాక్ పోర్టల్, ముఖాలు గుర్తించే ఫేషియల్ రికగ్నేషన్ యాప్, దర్పణ్లను ఉపయోగించడం కూడా సత్ఫలితాలనిచ్చింది. రాష్ట్రంలో ప్రధానంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, మతపరమైన స్థలాలు, ట్రాఫిక్ కూడళ్లు, మెకానిక్ షాపులు, ఇటుక బట్టీలు, టీస్టాళ్లు, దుకాణాలపై ప్రత్యేక దృష్టి సారించి ఈ ఆరవ ఆపరేషన్ స్మైల్‌ను మహిళా రక్షణ విభాగం నిర్వహించింది. మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని శిశు గృహాల్లో ఉన్న పిల్లల డేటాను డిజిటలైజ్ చేయడంతో తప్పిపోయిన, దొరికిన, రక్షించిన పిల్లల ఫొటోలను పోల్చిచూడడానికి సులభంగా మారింది. దర్పణ్ యాప్ ద్వారా కల్వకుర్తి పోలీస్ స్టేషన్, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో తప్పిపోయిన ఇద్దరు పిల్లలను గుర్తించారు. -
తెలిస్తే చాలు తాట తీసేస్తారు..
సాక్షి, సిటీబ్యూరో : దిశ ఉదంతం తర్వాత మహిళలపై జరిగే నేరాలను హైదరాబాద్ పోలీసులు సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొన్ని ఉదంతాలపై ఫిర్యాదు అందకపోయినా సమాచారం ఉంటేచాలు స్పందిస్తున్నారు. సుమోటోగా చర్య లు చేపట్టి బాధ్యుల్ని కటకటాల్లోకి నెడుతున్నా రు. ఈ మేరకు హైదరాబాద్ సిటీ పోలీసు కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో సిబ్బంది అమలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన తాజా ఉదాహరణ నగరంలోని తూర్పు మండలంలో ఉన్న ఉస్మానియా వర్సిటీ ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. సోమవారం ఓ నేరంపై సమాచారం అందుకున్న ఈ అధికారులు మంగళవారం బాధ్యుడిని పట్టుకుని కేసు నమోదు చేశారు. సీసీ కెమెరాల ఫీడ్ ఆధారంగా నిందితుడి గుర్తింపు.. సోమవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో హబ్సిగూడ స్ట్రీట్ నంబర్.8లోని రవీంద్రనగర్‌లో ఓ ఉదంతం చోటు చేసుకుంది. మార్నింగ్ వాకింగ్‌కు వచ్చిన ఓ మహిళ పట్ల గుర్తుతెలియని వ్యక్తి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. అయితే బాధితురాలు ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. ఆ సమయంలో వాకింగ్ చేస్తున్న మరికొందరు జరిగిన అంశాన్ని గమనించారు. ఇది కాస్తా ఆ వీధిలో చర్చనీయాంశంగా మారింది. అలా ఆ నోటా, ఈ నోటా విషయం సోమవారం మధ్యాహ్నం ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌కు చెందిన గస్తీ సిబ్బందికి తెలిసింది. వారి ద్వారా విషయం తెలుసుకున్న ఇన్స్పెక్టర్ ఎస్.రాజశేఖర్‌రెడ్డి సీరియస్‌గా స్పందించారు. రవీంద్రనగర్‌కు సిబ్బందిని పంపి విషయం ఆరా తీయించారు. దీంతో స్థానికులు ఫలానా చోట జరిగిందంటూ ఓ ప్రాంతాన్ని చూపించారు. ఆ చుట్టుపక్కల ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయిన ఫీడ్‌ను సేకరించిన పోలీసులు క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. ఈ నేపథ్యంలోనే తెల్లవారుజామున ఓ గుర్తు తెలియని వ్యక్తి స్కూటర్‌పై రావడం.. అక్కడ పార్క్ చేసి ఓ మహిళ వెనుక నడుచుకుంటూ వెళ్ళడం.. కాసేపటికి వాహనం వదిలి పారిపోవడం రికార్డయ్యాయి. ఈ ఫీడ్‌లో రికార్డయిన స్కూటర్ రిజిస్ట్రేషన్ నంబర్ గుర్తించిన పోలీసులు ఆర్టీఏ డేటా ఆధారంగా దాని చిరునామా తెలుసుకున్నారు. మంగళవారం రాత్రి ఓయూ పోలీసులు గౌలిపుర ప్రాంతానికి చెందిన బీరప్పను అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి వలస వచ్చిన ఇతగాడు ఉప్పల్–సికింద్రాబాద్ రహదారిలో టిఫిన్ సెంటర్ నిర్వహిస్తుంటాడని గుర్తించారు. విచారణ నేపథ్యంలో తాను ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించానని అంగీకరించాడు. అయితే బాధితురాలి ఆచూకీ లభించలేదు. దీంతో ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులే స్వయంగా సిటీ పోలీసు చట్టంతో పాటు ఇతర సెక్షన్ల కింద సుమోటో కేసు నమోదు చేశారు. -
మహిళల రక్షణ
మన మీద జరగుతున్న, జరిగే అవకాశమున్న దాడుల గురించి తెలుసుకోవడం, అవగాహన పెంచుకోవడం కూడా మనం తీసుకునే భద్రతాచర్యల్లో భాగమే. మహిళలు తమకు తామే చైతన్యవంతులు కావాలి! మనం ఉన్న పరిసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తుల ఉనికిని గమనిస్తే సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేయాలి. చీకటి ప్రదేశాల్లో, జనసంచారం అంతగాలేని చోట ఉండకూడదు. ►టాక్సీలో, ఆటోలో వెళ్లాల్సి వస్తే వాటిని ఎక్కేముందు ఆ వాహనాల నంబర్‌ను నోట్ చేసుకొని ఇంట్లో వాళ్లకు కానీ, సన్నిహితులకు కానీ మెసేజ్ చేయాలి. అలాగే గమ్యస్థానం చేరుకునే వరకు కావాల్సిన వాళ్లతో ఫోన్లో మాట్లాడుతూ ఉండాలి. అంటే వాహనం వెళ్తున్న దారిని ఎప్పటికప్పుడు వాళ్లకు తెలియచేస్తూ ఉండాలి. ఒకవేళ అంతసేపు మనతో మాట్లాడే తీరికలో ఎవరూలేకపోయినా.. మాట్లాడుతున్నట్లు నటిస్తూ డ్రైవర్‌ను నమ్మించాలి. ప్రయాణిస్తున్న దారినీ పరిశీలిస్తూ ఉండాలి. ►నడుస్తూ వెళ్తున్నప్పుడు సాధ్యమైనంత వరకు రద్దీ ప్రదేశాల్లో నడిచే ప్రయత్నం చేయాలి. ఒకవేళ దాడి జరిగితే కేకలు వేస్తే స్పందించే వాళ్లుంటారు. ►బయటకు వెళ్లేటప్పుడు సాధ్యమైనంత వరకు బంగారు నగలను ధరించకపోవడమే మంచిది. ఒకవేళ ఆకతాయిలు మన మీద దాడి చేసినప్పుడు వాళ్లు మన నుంచి ఏం లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారో గమనించాలి. పర్స్‌లాంటివి అయితే వాటిని ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి బయటపడడం ఉత్తమం. ►హ్యాండ్‌బ్యాగ్‌లో విధిగా పెప్పర్‌స్ప్రే, చెంప పిన్నులు వంటివి పెట్టుకోవాలి. ►సాధ్యమైనంత వరకు ఆకతాయిలు వెనుక నుంచి దాడి చేయడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి నడిచేటప్పుడు అయిదడుగుల కంటే తక్కువ దూరంలో ఎవరైనా మన వెంట వస్తుంటే అప్రమత్తం కావాలి. ►మన మీద దాడి జరగగానే గాబరా పడకుండా ముందు దాడిచేసిన వ్యక్తుల కళ్లలో పొడవడానికి ప్రయత్నించాలి. కుదరకపోతే రెండు తొడల మధ్య తన్నడానికి యత్నించాలి. ఈ రెండూ కూడా ది బెస్ట్ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అని మరచిపోవద్దు. ►అలాగే మొబైల్ ఫోన్స్‌లో సేఫ్టీ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. ప్రమాదం పొంచి ఉంది అని గ్రహించగానే వాటిని ఉపయోగించాలి. అంతేకాదు మహిళల భద్రత కోసం ప్రభుత్వాలు, ఇతర సంస్థల టోల్‌ఫ్రీ నంబర్లనూ ఫీడ్ చేసుకోవాలి. ప్రమాదపు సంకేతాలు కనిపించగానే ఆ నంబర్లకు ఫోన్ చేయాలి. ►భౌతిక దాడుల సంగతి సరే.. ఇంటర్నెట్ జీవితంలో భాగమైన ఈ కాలంలో సైబర్ నేరాల సంఖ్యా తక్కువేం లేదు. కాబట్టి సోషల్ నెట్‌వర్క్‌లో విరివిగా పాలుపంచుకునేవారు తమ వ్యక్తిగత సమాచారాన్ని అసలు పంచుకోకుండా ఉంటేనే మంచిది. ఇంటి చిరునామా, ఫోన్‌నంబర్, ఫోటోలు పెట్టకూడదు. అలాగే ఈ–మెయిల్లో కూడా ఎలాంటి పర్సనల్ డాక్యుమెంట్స్‌ని, వాటికి సంబంధించిన సమాచారాన్ని పొందుపరచకూడదు. బ్యాంక్ సిబ్బంది ఎవరూ ఫోన్లో ఆధార్ నంబరు, కార్డు నంబరు, సీవీవీ, ఓటీపీ అడగరు. ఈ విషయాన్ని ఆడ, మగ తేడాలేకుండా అందరూ గ్రహించాలి, గుర్తుపెట్టుకోవాలి. ►మొత్తం కొత్త వాతావరణంలో కొత్తవాళ్లు ఇచ్చే తినుబండారాలు, పానీయాలను స్వీకరించకూడదు. ఈ విషయంలో ఎలాంటి మొహమాటాలకు తావివ్వకూడదు. ►చివరిదైనా ముఖ్యమైన సూచన, జాగ్రత్త.. మన సిక్స్›్తసెన్స్ను నమ్మడం. బయటకు వెళ్లినప్పుడో.. టాక్సీ ఎక్కినప్పుడో.. ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అని అనిపిస్తే మెదడు ఇచ్చే ఆ సంకేతాలను కొట్టిపారేయాక శ్రద్ధ పెట్టి అక్కడి నుంచి వీలైనంత త్వరగా తప్పుకోవాలి. ►క్యాబ్‌లో ప్రయాణిస్తున్నప్పుడెప్పుడూ డ్రైవర్ వెనక సీట్లోనే కూర్చోవాలి. డ్రైవర్ దాడికి దిగితే చున్నీతో అతని మెడకు చుట్టేసి అతణ్ణి నిలువరించే వీలుంటుంది. అందుకే హ్యాండ్‌బ్యాగ్‌లో పెప్పర్స్ప్రేతోపాటు విధిగా చున్నీనీ పెట్టుకోవాలి ఆత్మరక్షణాయుధంలా. ►అలాగే క్యాబ్ ఎక్కగానే చైల్డ్ లాక్ ఓపెన్ చేసుకోవాలి. దీనివల్ల డ్రైవర్ తన దగ్గర్నుంచి తర్వాత క్లోజ్ చేసే వీలుండదు. ఇలా చైల్డ్ లాక్‌ను ఓపెన్ చేసుకోవడం వల్ల డ్రైవర్ ఏదైనా అఘాయిత్యం తలపెట్టతలిచినా మన వైపు ఉన్న డోర్‌ను తీసుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ హింసను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ►ముందు జీవితభాగస్వామి ఇష్టాఇష్టాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దానికనుగుణంగా మలచుకునే ప్రయత్నం చేయాలి. చిన్నచిన్న త్యాగాలకూ సిద్ధపడాలి. వీటి ప్రయోజనం తప్పకుండా ఉంటుందనే విషయం మరిచిపోవద్దు. దీనివల్ల భార్యాభర్తల మధ్య సఖ్యత పెరుగుతుంది. ►జీవితభాగస్వామికి కుటుంబంలో ఇష్టమైన వ్యక్తులెవరో తెలుసుకొని వారిని గౌరవించాలి. వారిపట్ల శ్రద్ధ చూపించాలి. ►వాదోపవాదాలు, వాగ్వివాదాలు వచ్చినప్పుడు మౌనం వహించడం కన్నా మంచి పద్ధతి లేదు. పరిస్థితి సద్దుమణిగాక మీరు చెప్పాలనుకున్నది నిదానంగా చెప్పొచ్చు. ►వివాహం అయిన కొత్తల్లోనే ఆర్థికవనరుల నిర్వహణలో కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. సమాన భాగస్వామ్యం నిర్వర్తించాలి. ఎవరి ఏటీఎమ్ కార్డులు వాళ్ల దగ్గరే ఉంచుకోవాలి. జాయింట్ ఎకౌంట్స్ జోలికి పోవద్దు. జాయింట్ లాకర్స్కీ పోవద్దు. అయితే స్థిరాస్తుల కొనుగోలు విషయంలో మాత్రం జాయింట్ రిజిస్ట్రేషన్‌కే ప్రాధాన్యమివ్వాలి. అలాగే ఒకరి క్రెడిట్ కార్డ్స్ ఒకరు ఉపయోగించుకోకుండా ఉంటేనే మంచిది. అలాగే మీ పాస్‌పోర్ట్, పర్సనల్ డాక్యుమెంట్స్ వంటివి మీకు సంబంధించిన భద్రమైన చోటులో దాచుకోండి. ►పుట్టినరోజులు, పెళ్లిరోజులు గుర్తుపెట్టుకుని బాధ్యతగా కాకుండా ఇష్టంగా విష్ చేయాలి. ఓ చిన్న బహుమతి ఇవ్వాలి. ►మంచి పనుల పట్ల పరస్పర పొగడ్తలు, ప్రోత్సాహం, అభినందనలు అవసరం. ►ఇతరులతో పోల్చడం చాలా ప్రమాదం. అలాగే జీవితభాగస్వామి బలహీనతలనూ ఒప్పుకునే పెద్దమనసును అలవర్చుకోవాలి. ►జీవితభాగస్వామికి చాడీలు చెప్పే అలవాటు మానుకోవాలి. ►సంసారంలో సమస్యలు వచ్చినప్పుడు కలిసి కూర్చుని చర్చించుకునే వాతావరణాన్ని ఏర్పరచుకోవాలి. చర్చల ద్వారా సమస్యలు పరిష్కారం కాకపోతే సైకాలజిస్ట్ దగ్గరకు వెళ్లి కౌన్సెలింగ్ తీసుకోడానికి వెనుకాడవద్దు. ►మీరు ఇంత ఒద్దికగా, ఓపికగా ఉంటున్నా అత్తగారింట్లో అవాంఛనీయ పరిస్థితులు, మనస్తాపం కలిగించే సంఘటనలు ఎదురవుతున్నట్లయితే సన్నిహితులతో, తల్లిదండ్రులతో వాటిని పంచుకోవడం మంచిది. ►హెల్ప్‌లైన్, ఫ్యామిలీ కౌన్సెలర్స్, సైకాలజిస్ట్‌ల నంబర్లు దగ్గరపెట్టుకోవాలి. పరిస్థితి చేయిదాటుతుందనిపిస్తే వాళ్లను సంప్రదించాలి. అలాగే మహిళల రక్షణకు, భద్రత కోసం ఏర్పడ్డ చట్టాల మీద ప్రాథమిక అవగాహనను ఏర్పరచుకోవాలి. మీకు ఆ అవగాహన ఉన్నట్టు ఏదో ఒక సందర్భంలో మీ జీవిత భాగస్వామికీ తెలియచేయాలి. ఇవన్నీ చేస్తే జీవిత భాగస్వామి వద్ద మీరు తలవంచినట్టు భావించకండి.. మీ సంసార విజయానికి ఇవి మెట్లు అని గ్రహించండి. – ఇ. పార్వతి, అడ్వొకేట్ అండ్ ఫ్యామిలీ కౌన్సెలర్ -
ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్
ఎన్ఆర్ఐని పెళ్లిచేసుకున్న మహిళల భద్రత కోసం అంటే ఎన్ఆర్ భర్త పెట్టే హింస, ఇబ్బందుల నుంచి సంబంధిత స్త్రీలకు రక్షణ, న్యాయ సహాయం అందించడానికి ఏర్పడిందే ఎన్ఆర్ఐ సెల్. తెలంగాణ విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో నడుస్తోంది. స్వచ్ఛంద సంస్థలు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, హోమ్ శాఖ, జాతీయ మహిళా కమిషన్ , భారతీయ రాయబార కార్యాలయాల సహాయం, సహకారంతో ఎన్ఆర్ఐ వివాహితల సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పడుతోందీ ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్. ఏం చేస్తుంది? ►బాధిత మహిళల నుంచి ఫిర్యాదులను స్వీకరిస్తుంది. ఒకవేళ ఏ పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదు నమోదు కాకపోతే.. నమోదు అయ్యేలా, స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేసేలా, ఆ ఎన్ఆర్ఐ భర్త మీద లుక్ అవుట్ సర్క్యూలర్ జారీ చేసేలా, నాన్ బెయిలబుల్ వారెంట్ అందేలా చేస్తుంది ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్. ►దాంతో సదరు నిందితుడు ఎప్పుడూ దేశంలో అడుగుపెట్టినా ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే అతణ్ణి స్థానిక పోలీసులకు అప్పగిస్తారు. ►నిందితుడు కోర్టుకు హాజరుకానట్లయితే అతని పాస్‌పోర్ట్‌ను సీజ్ చేయాల్సిందిగా ప్రాంతీయ పాస్‌పోర్ట్ ఆఫీసర్‌ను కోర్టు ఆదేశించవచ్చు. ►బాధితులకు న్యాయసలహాలు ఇవ్వడానికి, మార్గదర్శకం చేయడానికి ఈ సెల్లో నలుగురు న్యాయనిపుణులతో కూడిన ప్యానెల్ ఒకటి ఉంటుంది. ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను సంప్రదించాల్సిన నంబర్లు.. 040– 27852246, వాట్సప్: 9440700906, ఇ– మెయిల్.. tswomensafety@gmail.com FACEBOOK and TWITTER :@ts_womensafety ఎన్ఆర్ఐ పెళ్ళిళ్లలో తీసుకోవల్సిన జాగ్రత్తలు ►అబ్బాయి వివాహ స్థితి అంటే... ఒంటరివాడు, విడాకులు తీసుకున్న వ్యక్తి, విడిపోయి జీవిస్తూ, న్యాయపరమైన పోరాటం సాగిస్తున్న వ్యక్తా అనే వివరాలు తెలుసుకోవాలి. ►వృత్తిపరమైన అంశాలు.. విద్యార్హతలు, ఏ వృత్తిలో ఉన్నాడు, జీతం ఎంత, ఏ ఆఫీసు, అడ్రసు, యాజమాన్యపు వివరాలు, వారి నిబద్ధత మొదలైనవి తెలుసుకోవాలి. ►విదేశ నివాస అర్హతలు..అక్కడ అతని స్థితిగతులు, విదేశీ నివాసం ఏ విధంగా పొందాడు, వీసా వివరాలు, వివాహమయ్యాక భార్యను తీసుకెళ్లడానికి అర్హత ఉందా? వంటి వివరాలు . ►ఆర్థిక స్థితిగతులు.. భారతదేశంలో అతడి నివాసం, చిరునామా, కుటుంబ వివరాలు, ఆస్తి వివరాలు, పాస్‌పోర్ట్ నంబరు, గడువు, వీసా నంబరు, గడువు, ఆధార్ కార్డు నెంబరు, విదేశీ రిజిస్ట్రేషను కార్డు, సోషల్ సెక్యూరిటీ నెంబరు. ►ఇండియాలోనే వివాహం జరగాలని, ఇక్కడి వివాహ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా చేయించుకోవాలని తెలియపర్చాలి. వివాహంలో ఫొటోలు తీయించుకోవాలి. ►స్థానికంగా ఉన్న వరుడి స్నేహితుల వివరాలు, వరుడు ఉంటున్న దేశంలో స్థిరపడిన కామన్ ఫ్రెండ్స్, బంధువుల సమాచారం, ఫోన్ నంబర్లు, ఈ– మెయిల్ వివరాలు తెలుసుకొని ఆ కాపీలను పెట్టుకోవాలి. ►మన న్యాయ చట్టాలతోపాటు పెళ్లయ్యాక భర్తతో ఏ దేశం వెళుతుందో ఆ దేశపు న్యాయ చట్టాలపై, తన హక్కులపై వధువుకి తప్పకుండా అవగాహన ఉండాలి. భర్త నుంచి హింస ఎదురైతే అక్కడి అధికారులను సంప్రదించాలి. ►వధువుకి సంబంధించిన హితులు, బంధువులు విదేశంలో ఉంటే వారి ఫోన్ నంబర్లు, తన భర్త పనిచేసే యజమాని వివరాలు, పోలీస్, అంబులెన్స్, ఇండియన్ ఎంబసీ వివరాలు, హై కమిషన్ వివరాలు తెలుసుకొని వారిని సంప్రదించాలి. పెళ్లయ్యాక విదేశం వెళ్తున్నప్పుడు ఇంటికి దగ్గర్లో ఉన్న బ్యాంక్‌లో వధువు పేర అకౌంట్ తెరిచి అందులో కొంత డబ్బు ఉంచాలి. ►వధువు తన పాస్‌పోర్ట్, వీసా, బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆస్తి పత్రాలు, మ్యారేజి సర్టిఫికెట్, తన విద్యార్హతల సర్టిఫికెట్లు, ఇతర ముఖ్యమైన వివరాలను మూడు కాపీలుగా చేసి ఒకటి తన దగ్గర, ఇంకో కాపీ తల్లిదండ్రుల దగ్గర, మరొక కాపి విదేశంలో తను నమ్మదగ్గ స్నేహితుల దగ్గర పెట్టుకోవాలి. అలాగే భర్త వివరాలు, పాస్‌పోర్ట్, వీసా, ఆస్తి వివరాలు, డ్రైవింగ్ లైసెన్స్ నంబరు, సోషల్ సెక్యూరిటీ నంబరు, ఓటరు కార్డ్, ఎలీన్ రిజిస్ట్రేషన్ కార్డ్ మొదలైనవి ఫొటో కాపీ తీసి తన దగ్గర ఒకటి, తల్లిదండ్రుల దగ్గర ఒక కాపీ పెట్టాలి. ►పెళ్లి ద్వారా విదేశం వెళ్లి అక్కడ తను ఏదైనా ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత చదువులు చదువుకోవచ్చనే ఆలోచన, ఊహ, ఆశను మానుకోండి. అక్కడి వ్యవస్థలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలపై పూర్తి అవగాహన లేకుండా తొందరపడి ఎన్ఆర్ఐతో పెళ్లికి ఒప్పుకోరాదు. ►తల్లిదండ్రులు సహా ఎవరి ఒత్తిడితోనూ ఎన్ఆర్ఐతో పెళ్లికి అంగీకరించకూడదు. ఎందుకంటే పెళ్లి పేరుతో అమ్మాయిలను తీసుకెళ్లి వ్యభిచార గృహాలకు, వెట్టి చాకిరీకి తరలిస్తున్న వ్యక్తులు మన కళ్లముందే ఉన్నారన్న సత్యాన్ని మరువద్దు. ఏ కొంచెం అనుమానం వచ్చినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలి. ►మ్యారేజ్ బ్యూరోలు, ఏజెంట్లు, మధ్యవర్తులను గుడ్డిగా నమ్మి మోసపోవద్దు. అవతలి వ్యక్తుల, కుటుంబ వివరాలను, మంచిచెడ్డలను స్వయంగా వాకబు చేసుకోవాలి. (తెలంగాణ ఎన్ఆర్ఐ సెల్) తెలంగాణ మైనారిటీస్ కమిషన్ చొరవ విదేశాల్లో గృహహింసను ఎదుర్కొంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళలకోసం తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ కమిషన్ హైదరబాద్‌లో కేసులు నమోదు చేసుకునే వెసులుబాటును కల్పిస్తోంది. బాధితులుగా స్వదేశానికి తిరిగి వచ్చిన మహిళలు తాము ఎదుర్కొన్న గృహహింసకు సంబంధించి నిందితుల మీద హైదరాబాద్ నుంచే కేసు ఫైల్ చేయొచ్చు. ఇక్కడి నుంచే కేసు దర్యాప్తు జరుగుతుంది. -
కొనసాగుతున్న దురాచారం
నాగరిక సమాజాన్ని కూడా పట్టి పీడిస్తున్న దురాచారం జోగిని. ఇప్పుడు దీన్ని నేరంగా పరిగణిస్తున్నా మహబూబ్‌నగర్, నిజామాబాద్ వంటి చోట్ల ఇంకా ఈ అనాచారం కొనసాగుతూనే ఉంది. ఈ నేరానికి ఆయువుపట్టు పేదరికం, సాంఘిక నిమ్నతలే. వయసొచ్చిన ఆడపిల్లను దేవుడికి అంకితం చేయడం పేరుతో ఆమెను లైసెన్స్డ్ వేశ్యగా మార్చడం అన్నమాట. పల్లెల్లో ఈ నేరంబారిన పడి చాలామంది ఆడపిల్లల జీవితాలు నాశనమవుతన్నాయి. దీన్ని రూపుమాపడానికి ప్రభుత్వాలు చట్టాలు తెచ్చిన యథేచ్చగా రాజ్యమేలుతూనే ఉంది. ట్రాఫికింగ్.. ప్రాస్టిట్యూషన్ ‘పట్నంలో నీ బిడ్డకు మంచి పని ఉంది.. నెలకు పదిహేనే వేలరూపాయల దాకా సంపాదించుకోవచ్చు... ఉండడానికి ఇల్లు, తిండి అన్నీ వాళ్లే ఇస్తారు’ అంటూ పట్నం పోయి బాగా డబ్బు సంపాదించుకున్న ఊరి కుర్రాడో, లేక ఆ ఊరి నడివయసు మహిళో పేదరికంలో మగ్గుతున్న కుటుంబాల్లో ఆశను రేకెత్తిస్తారు. అమ్మానాన్నలు ఆ ఇంటి ఆడపడచును వీళ్లతో పట్నం బస్ ఎక్కిస్తారు. ఆ పిల్ల పుణె రెడ్‌లైట్ ఏరియాలోనో, ముంబై కామటిపురాలోనో.. కోల్కత్తా సోనాగంచ్లోనో తేలుతుంది. ఇవే ట్రాఫికింగ్, వ్యభిచార నేరాలు. రెండూ ఒకదానికొకటి అనుసంధానమైన భూతాలు. రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు యావత్ భారతాన్ని పట్టిపీడిస్తున్న పిశాచాలు. వీటిని అరికట్టడానికి మన దగ్గరున్న చట్టాలకు కొదవలేదు. కాని అమలు చేసే చిత్తశుద్ధికి కొరత. అందుకే యేటా వేలమంది ఆడపిల్లలు ఈ నేరం కొరలకు చిక్కి చీకటికూపాల్లో మగ్గుతున్నారు. కనిపించని నేరాలు...ఇంట్లోనే చాలా కనపడతాయి.. ►చిన్నపిల్లలను సెక్సువల్ అబ్యూజ్కి గురిచేయడం దగ్గర్నుంచి డొమెస్టిక్ లేబర్‌ను వేధించడం వరకు. అయితే ఇవి ఇప్పుడు చట్టం పరిధిలోకి వచ్చాయి. ►భవన నిర్మాణాలు, ఫ్యాక్టరీలు, ఇటుక బట్టీలు, బీడీ కంపెనీలు,పొలాలు వంటి చోట్ల దగ్గర మహిళా కార్మికులు, మహిళా శ్రామికులను శారీరకంగా, మానసికంగా వేధించడం (కులం పేరుతో, శారీరక రంగు, రూపు గురించి తులనాడడం, తిట్టడం, చేయి చేసుకోవడం, కోరిక తీర్చమని అడగడం) నేరమే. ►పబ్లిక్టాయ్లెట్స్ లేకపోవడం, ఉన్నా వాటిలో సరైన వసతులు అంటే వాటికి తలుపులు లేకపోవడం, ఉన్నా బోల్టులు లేకపోవడం, కింద నేల కనిపించేలా తలుపులు ఉండడం, కంతలు, సందులు ఉండడం, టాయ్లెట్లలో నీటి వసతి, మగ్గులు, బకేట్లు లేకపోవడం, నిర్వహణ (పరిశుభ్రత వగైరా) సరిగా లేకపోవడం వంటివన్నీ నేరాలే. ►అంతేకాదు పబ్లిక్ టాయ్లెట్లలో గోడల మీద స్త్రీల ప్రైవేట్ పార్ట్ బొమ్మలు వేయడం, పిచ్చి రాతలు రాయడం, అసభ్యకరమైన గీతలు గీయడం వంటివి అన్నీ నేరాలే. ►అలాగే ఇలాంటి పబ్లిక్ టాయ్‌లెట్స్ దగ్గర కాపలాదారు లేకపోవడం వంటివి. ఇవన్నీ కూడా 354సి నిర్భయ చట్టం కింద వర్తించే నేరాలు ►పాఠశాలలు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టాండులు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో మహిళలకు సరైన మరుగుదొడ్ల వసతి లేకపోవడం నేరమే. ►అలాగే మహిళలకు నాప్కిన్స్(నెలసరి ప్యాడ్స్) అందుబాటులో లేకపోవడం కూడా నేరమే. ►షాపింగ్‌మాల్స్‌లోని ట్రయల్‌రూమ్స్‌లో, టాయ్‌లెట్స్‌లలో అలాగే సినిమాహాల్స్ వంటి పబ్లిక్ ప్రదేశాల్లోని టాయ్‌లెట్స్‌లలో రహస్య కెమెరాలు పెట్టడం నేరం. దీన్ని వాయొరిజం కింద పరిగణిస్తారు. ►బస్సుల్లో, ఇతర రద్దీ ప్రదేశాల్లో స్త్రీలను తాకడం, అసభ్యకరంగా మాట్టాడడం, అసభ్యకర సైగలు చేయడం, స్త్రీలకు పురుషులు తమ ప్రైవేట్ పార్ట్స్ చూపించడం, అలాగే కార్యాలయాల్లో ఉద్యోగినుల పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వారిని తూలనాడడం, వేధించడం, సెక్సువల్‌గా అబ్యూజ్ చేయడం, వారిని అవమానించడం వంటివన్నీ నేరాలే. 354, 509 విమెన్ ఇన్సల్టింగ్ సెక్షన్ల కింద వీటికి శిక్ష ఉంటుంది. ►ఇక పబ్లిక్ ప్రదేశాల్లో అమ్మాయిల మీద కన్నేయడం, వెంబడించడం, ఈవ్‌టీజింగ్, వంటివన్నీ నేరాలన్న సంగతి విదితమే. ►అంతేకాదు ఇంట్లో కూడా స్త్రీలను, ఈడు వచ్చిన అమ్మాయిలను తాత మొదలుకొని తండ్రి, అన్న, బాబాయ్, పెద్దనాన్న, మేనమామ ఇలాంటి వాళ్లెవరైనా పరుషపదజాలంతో తిట్టడం, వ్యక్తిగత స్వేచ్ఛ హరించేలా తీవ్రమైన నిఘా పెట్టడం, శీలరక్షణ పేరుతో వాళ్లను కట్టడి చేయడం, శీలంపేరుతో వాళ్ల ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడడం వంటివన్నీ నేరాలే గృహహింస చట్టం కింద. అలాగే ఇంట్లో ఆడపిల్లలను అబ్బాయిలతో పోల్చి తిట్టడం, చులకన చేయడం, వివక్ష చూపించడం వంటివీ నేరాలే. మ్యారిటల్ రేప్ దీన్ని జస్టీస్ వర్మ కమిటీ 376(బి) నిర్భయ చట్టం కింద నేరంగా పరిగణించాలని సూచించింది. కానీ దీనివల్ల భారతీయ వివాహ, కుటుంబ వ్యవస్థలు బీటలు వారుతాయని రాజకీయ పక్షాలు ఆమోదించలేదు. కాని విడాకులు తీసుకున్న భార్యను, లేదా భర్త నుంచి విడిగా ఉంటున్న ఇల్లాలిని భర్త బలవంతం చేస్తే రేప్‌గా పరిగణించాలని మాత్రం నిర్ణయించారు. ∙ వివాహబంధంలో ఉన్న భర్త ..భార్య మానసిక, శారీరక పరిస్థితి తెలుసుకోకుండా ఆమెను ఇబ్బంది పెట్టడం, బలవంతం చేయడం క్రూయల్టీ కింద పరిగణించే నేరమే. గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళా భద్రత గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రస్తుతం మూడు పోలీసు కమిషనరేట్లు ఉన్నాయి. అవి: హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ. ‘గ్రేటర్’ జనాభా 1.17 కోట్లు. హైదరాబాద్ మహానగరంలో మహిళల రక్షణ కోసం మూడు కమిషనరేట్లూ చొరవ తీసుకుంటూ పలు చర్యలు చేపడుతున్నా, నగరంలో మహిళల పట్ల నేరాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం 2014లో అడిషనల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా నేతృత్వంలో ప్రత్యేకంగా ‘షీ టీమ్స్’ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లోను మొత్తం 300 షీ టీమ్స్ పనిచేస్తున్నాయి. షీ టీమ్స్‌లో 1500 మంది మహిళా పోలీసులు పనిచేస్తున్నారు. మహిళలకు మరింత భద్రత కోసం తెలంగాణ ప్రభుత్వం 2019లో ‘విమెన్ సేఫ్టీ వింగ్’ను కూడా ఏర్పాటు చేసింది. అదే ఏడాది ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలను అరికట్టేందుకు ‘ఎన్ఆర్ఐ సెల్’ను ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మూడు కమిషనరేట్లలోనూ కలుపుకొని 2015–19 సంవత్సరాల మధ్య కాలంలో మహిళలకు సంబంధించిన నేరాలపై 19,270 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ షీ టీమ్ వాట్సప్ 9490616555, సైబరాబాద్ షీ టీమ్ వాట్సప్ 9490617444, రాచకొండ షీ టీమ్ వాట్సప్ 9490617111 బాలల భద్రత కోసం ‘బాలమిత్ర’ బాలల భద్రత కోసం సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ 2019లో ‘బాలమిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించింది. పాఠశాలలకు వెళ్లే బాలబాలికలకు చిన్నప్పటి నుంచి ఎవరితో ఎలా మెలగాలో చెబితే ఆదిలోనే చెడు పోకడలను అరికట్టవచ్చనే ఉద్దేశంతో దీనిని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పిల్లలకు, షీ టీమ్స్‌కు మధ్య వారధిగా పనిచేస్తోంది. ‘బాలమిత్ర’ కార్యక్రమం ప్రారంభమైన తర్వాత దీని ద్వారా బాలలపై వేధింపులకు సంబంధించి 42 కేసులు నమోదయ్యాయి. ‘బాలమిత్ర’ హెల్ప్‌లైన్: 9490617444 షీ ఫర్ హర్‌తో ఈవ్ టీజింగ్‌కు చెక్ ఈవ్ టీజింగ్‌ను, కళాశాలల్లో విద్యార్థినులపై ర్యాగింగ్ వేధింపులను అరికట్టడానికి రాచకొండ పోలీసు కమిషనరేట్ 2017లో ‘షీ ఫర్ హెర్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం కింద ప్రతి కాలేజీ నుంచి ఇద్దరు చొప్పున సీనియర్ విద్యార్థినులను వాలంటీర్లుగా ఎంపిక చేసి, విద్యార్థుల్లో మహిళల చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. వేధింపుల బారిన పడ్డ విద్యార్థినులు ఈ కార్యక్రమం ద్వారా తమ పేర్లు గోప్యంగా ఉండేలా ఫిర్యాదు చేసే వెసులుబాటును కూడా కల్పిస్తున్నారు. ‘షీ ఫర్ హెర్’ ద్వారా గత మూడేళ్లలో 24 కేసులు నమోదయ్యాయి. ఐటీ కారిడార్‌లో ‘సేఫ్ స్టే’ గ్రేటర్ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో హాస్టళ్లలో ఉంటున్న మహిళా ఉద్యోగినులు, విద్యార్థినుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు 2015లో ‘సేఫ్ స్టే’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. హాస్టళ్లన్నీ తప్పనిసరిగా నిబంధనలను పాటించేలా ఐటీ కారిడార్‌లోని హాస్టళ్లను పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తూ వస్తున్నారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి, హాస్టళ్లన్నీ తప్పనిసరిగా పోలీసు అనుమతి పొందేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా, ప్రతి మూడు నెలలకోసారి హాస్టళ్లన్నీ నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నదీ లేనిదీ పర్యవేక్షిస్తున్నారు. ఈ చర్యల వల్ల హాస్టళ్లలో భద్రత మెరుగుపడింది. టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్లు వివిధ జిల్లాల్లో పోలీసులు, మహిళా భద్రత కేంద్రాల ఫోన్నంబర్లతో పాటు ఆపదలో చిక్కుకున్న మహిళలు, బాలల కోసం నిరంతరం పనిచేసే టోల్ ఫ్రీ నంబర్లు ఇవి. వీటి ద్వారా కూడా బాధితులు తమ సమస్యలను తెలిపి పోలీసుల సహాయం కోరవచ్చు. డయల్ 100, చైల్డ్ లైన్ 1098 రక్షణ కోసం పోరాట శిక్షణ ►పెద్దపల్లి జిల్లా కలెక్టర్ శ్రీదేవసేన ‘శక్తి’ పేరుతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కేరళ రాష్ట్రానికి చెందిన ‘కలరిపయట్టు’, కరాటే మెటీరియల్ ఆర్ట్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారు. ‘స్పృహ’ పేరుతో జెండర్ ఈక్వాలిటీ మీద బాలురకు అవగాహనా కార్యక్రమాలను చేపట్టారు. ►కామారెడ్డి జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమం ప్రారంభమైంది. దీనిద్వారా జిల్లాలోని విద్యార్థినులకు ఆత్మరక్షణా విద్యలో శిక్షణను ఇప్పించడంతోపాటు, గ్రామస్థాయిలో జెండర్ ఈక్వాలిటీ మీద అవగాహనా సదస్సులనూ నిర్వహిస్తున్నారు. మహిళలకు ‘మార్గదర్శకంగా’ సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఇంటా, బయట వేధింపులు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, గృహహింస, ఒత్తిడికి సంబంధించి కుటుంబసభ్యులు, మిత్రులు, పోలీసులకు చెప్పుకోని విషయాలను మార్గదర్శక్‌ల దృష్టికి తీసుకొస్తే మార్గనిర్దేశం చేస్తారు. అది ఏ రకమైనా సమస్య అయినా ఓపికతో వింటారు. వారికి న్యాయ సహాయమా, పోలీసుల సహాయమా, సైకలాజిల్ సహాయమా...ఇలా వారికి ఏది అవసరమో గుర్తించి ఆయా నిపుణుల వద్దకు పంపిస్తారు. వేధింపులైతే బాధితురాలి పేరును బహిర్గతం చేయకుండా పోలీసుల ద్వారా చర్యలు తీసుకునేలా సహాయం అందిస్తారు. సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) సహకారంతో 2016 జనవరిలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో, అదే ఏడాది అక్టోబర్‌లో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో దీన్ని ప్రారంభించారు. రెండు కమిషనరేట్లలో ఇప్పటికి 585 మంది మార్గదర్శక్‌ల ద్వారా 185 కేసులు పరిష్కరించారు. ‘సేఫ్టీ’ జర్నీ.... ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్న మహిళల సురక్షిత ప్రయాణం కోసం షీ షటిల్ సేవలను ఎస్సీఎస్సీ సహాకారంతో సైబరాబాద్ పోలీసులు 2015 జూన్ 30న ప్రారంభించారు. తొలుత రెండు బస్సులతో ప్రారంభమైన ఈ సేవలు ఇప్పుడూ ఏడుకు చేరాయి. ఈ బస్సు జీపీఎస్‌కు అనుసంధానం కావడంతో ఎక్కడ ఏ సమస్య వచ్చినా సైబరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి సంబంధిత ఠాణా పోలీసులను అప్రమత్తం చేస్తారు. అలాగే రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో ఎస్సీఎస్సీ సహాకారంతో ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళల భద్రత కోసం 2017 ఆగస్టు 16న షీ షటిల్ సేవలు ప్రారంభించారు. ప్రస్తుతం రెండు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అందిస్తున్నారు. ఇలా ఈ రెండు కమిషనరేట్లలో కలిపి తొమ్మిది బస్సుల ద్వారా దాదాపు 80,000 మందికి పైగా మహిళలు ప్రయాణిస్తున్నారు. షార్ట్‌ఫిల్మ్‌తో స్మార్ట్‌గా గుడ్ టచ్, బ్యాడ్ టచ్, లైంగిక విద్య గురించి లఘు చిత్రాలతో అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు వరంగల్ రూరల్ జిల్లా కలెక్టర్ ముండ్రాతి హరిత... బాల్యానికి భరోసా పేరుతో. ఆరవతగరతి నుంచి ఇంటర్ చదువుతున్న విద్యార్థులందరికీ పాఠాలుంటాయి. లఘు చిత్రాల రూపంలో కౌమారదశలో పిల్లల్లో మొదలయ్యే శారీరక మార్పులతోపాటు పాటించాల్సిన శుభ్రత (నెలసరి మొదలయ్యాక అమ్మాయిలు పాటించాల్సిన శుభ్రతతోపాటు), పాటించకపోతే ఎదురయ్యే అనారోగ్య సమస్యలు, పిల్లలకు ఎవరి నుంచి ఎలాంటి హాని ఎదురవుతుందో ఉదాహరణలతో సహా ఈ లఘుచిత్రంలో చూపిస్తున్నారు.. చెబుతున్నారు. తాతయ్య బాలికపై అఘాయిత్యానికి పాల్పడవచ్చు. వరుసకు అన్నయ్య అయ్యే వ్యక్తి ఎలాంటి మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు? అసలు అప్యాయతతో కూడిన స్పర్శ ఎలా ఉంటుంది? దురుద్దేశంతో కూడిన స్పర్శను ఎలా గుర్తించాలి వంటివన్నీ ఈ లఘుచిత్రాల్లో చూపిస్తున్నారు. ‘కోమల్’ అనే లఘు చిత్ర ప్రదర్శన ద్వారా ఇంటాబయటా స్నేహితులు, అపరిచితుల పట్ల పిల్లలు (ప్రధానంగా బాలికలు) ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తున్నారు. ‘కోమల్’ పది నిమిషాల నిడివి గల హిందీ చిత్రం. ఈ షార్ట్‌ఫిల్మ్ ప్రదర్శన తర్వాత అందులోని విషయాల గురించి బాలల పరిరక్షణ విభాగం సభ్యులు, వైద్యుడు.. పిల్లలకు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికి పదివేల మందికి పైగా విద్యార్థులకు ఈ కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లో.. జిల్లాలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. జిల్లాలోని బాలల సంరక్షణ విభాగం రెండు బృందాలుగా ఏర్పడి ప్రతి మంగళ, శుక్రవారాల్లో పాఠశాలలు, జూనియర్ కళాశాల్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిబృందంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుంచి ముగ్గురు అధికారులతోపాటు ఒక ప్రభుత్వ వైద్యుడు.. మొత్తం సభ్యులుంటారు. ప్రజ్వల విమెన్ ట్రాఫికింగ్‌ను అరికట్టడానికి ప్రజ్వల అనే స్వచ్ఛంద సంస్థ పనిచేస్తోంది. లైంగికదాడికి గురైన మహిళలు, సెక్స్ ట్రేడ్‌లో పట్టుబడ్డ మహిళలకు పునరావాసం కల్పిస్తోంది.. ఆమన్‌గల్ మునిసిపాలిటీ పరిధిలోని ప్రజ్వల పునరావాస కేంద్రంలో. దాదాపు పదేళ్లుగా వందల మందికి ఇక్కడ ఆశ్రయం ఇవ్వడంతోపాటు వారిలో మానసిక స్థయిర్యాన్నీ పెంపొందిస్తోంది . స్వయం ఉపాధిలోనూ శిక్షణనిస్తున్న ఈ ప్రజ్వల సంస్థాపకురాలు, నిర్వాహకురాలు సునీతా కృష్ణన్. -
క్షేమంగా...రక్షణగా...
అవసరం కోసం మోసపు మాటలతో... క్రూరపు ఆలోచనలతో అరణ్యాలను తలపిస్తున్న ఈ చీకటి కీచక పర్వంలో.. స్త్రీకి ఎప్పుడు? ఏ సమస్య..? ఎలా? వస్తుందో ఊహించడం చాలా కష్టం. ‘అన్ని వేళలా ఎవరో ఒకరు ఆసరాగా, రక్షణగా ఉంటారులే’నన్న అతినమ్మకం ఎంత మాత్రం మంచిది కాదు. వేళ కానీ వేళ, తెలిసిన మనిషైనా.. తెలియని మనిషైనా.. తెలిసిన చోటైనా.. తెలియని చోటైనా.. ఆత్మరక్షణకు ఆయుధాలను వెంట పెట్టుకోవడం తప్పనిసరి. ఆయుధాలంటే కత్తులు, తుపాకీలు కాదు. ఆపద నుంచి తప్పించుకోవడానికి, కుట్రదారుడ్ని బురిడీ కొట్టించడానికి సరిపడే ఆయుధాలుంటే చాలు. వాటి గురించి ఇప్పుడు చూద్దాం! స్మార్ట్ లాకెట్! ఈ లాకెట్ స్టెయిలిష్ లుక్‌తో పాటూ సేఫ్టీని కూడా ఇస్తుంది. అదెలా అంటే.. ఈ లాకెట్లో ఓ ప్రత్యేకమైన పరికరం అమర్చి ఉంటుంది. దానికి సంబంధించిన యాప్‌ని మన ఫోన్లో వేసుకుంటే.. ఆపద తలెత్తినప్పుడు.. లాకెట్ వెనుక వైపు ఉండే బటన్ని గట్టిగా ప్రెస్ చెయ్యాలి. దానిలోని బ్లూటూత్ ఆన్ అయ్యి.. ప్రమాదాన్ని మన ఆప్తులకు చేరవేస్తుంది ఈ గాడ్జెట్. దీన్ని మెడలో లాకెట్‌లా అయినా వేసుకోవచ్చు. లేదా వెనుక ఉన్న పరికరాన్ని లాకెట్ నుంచి వేరు చేసుకుని కీచైన్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. దీని ధర సుమారుగా 2 వేలు ఉంటుంది. ఈ లాకెట్స్ చాలా కలర్స్‌లో లభిస్తున్నాయి. విజిల్ విజిల్ కట్టుకున్న చెయిన్‌ను ఎప్పుడూ మెడలో వేసుకోవాలి. ప్రమాదం వాటిల్లే పరిస్థితి ఎదురైనప్పుడు వెంటనే విజిల్ ఊదాలి. దాని వల్ల పరిసరాల్లో ఉన్న వ్యక్తుల దృష్టి మీ మీద పడి, మిమ్మల్ని ఆపద నుంచి రక్షించేందుకు వీలుంటుంది. పెప్పర్ స్ప్రే! మహిళల ఆత్మరక్షణకు ‘పెప్పర్ స్ప్రే’ అనేది ఆత్మరక్షణా ఆయుధాల్లో ఒకటి. దీన్ని ప్రయోగించగానే.. దుండగుల కళ్లను, చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దాంతో తప్పించుకోవడం సులభం. ఇది మార్కెట్లో దొరుకుతుంది. లిప్‌స్టిక్ షేప్డ్ స్టన్ గన్! చిత్రంలోని లిప్‌స్టిక్‌ని చూడండి. ఇది నిజంగా లిప్‌స్టిక్ కాదు. ఆత్మరక్షణ ఆయుధం. దీన్ని ఉపయోగించి.. మిమ్మల్ని మీరు రక్షించుకోచ్చు. దీనిలో స్టన్ గన్ బటన్, ఫ్లాష్ లైట్ బటన్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్టన్ గన్ బటన్ ఆన్ చేయగానే వైబ్రేషన్ షాక్ వస్తుంది. దాని నుంచి దుండగుడు కోలుకునే లోపు మనం సురక్షితంగా బయటపడొచ్చు. ఇక ఫ్లాష్ లైట్ బటన్ ఆన్ చేసుకుంటే టార్చ్‌లైట్ వెలుగుతుంది. తప్పించుకునే సమయంలో.. చీకటి ప్రదేశాల్లో.. దారి కనిపిస్తుంది. ఇది కీచైన్ కావడంతో సాధ్యమైనంత వరకూ మన వెంటే ఉంటుంది. దీని ధర సుమారు 13 వందల రూపాయలు. దీనిలోని బ్యాటరీ.. చార్జబుల్ బ్యాటరీ కావడంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు చార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది. సేఫ్‌లెట్! సేఫ్‌లెట్ అనే గాడ్జెట్‌ని అమ్మాయిలు ఎక్కడికి వెళ్లినా వెంట తీసుకుని వెళ్లొచ్చు. దీన్ని ఫోన్లో యాప్ ద్వారా కనెక్ట్ చేసుకోవచ్చు. గాడ్జెట్ బటన్ ప్రెస్ చేయగానే.. ఆడియో రికార్డింగ్ ఓపెన్ అయ్యి ఫోన్ ద్వారా సమస్యను మన ఆప్తులకు చేరవేస్తుంది. ప్రమాదాన్ని ఊహించిన వెంటనే దీన్ని యాక్టివేట్ చేస్తే.. మనం ఆపదలో ఉన్నామన్న విషయం.. మన స్నేహితులకు, ఇంట్లో వాళ్లకు తెలుస్తుంది. మనం ఎక్కడ ఏ లొకేషన్లో ఉన్నామనేది కూడా తెలుస్తుంది. దాంతో సమాచారం అందుకున్న వ్యక్తులు ఎమెర్జెన్సీ నంబర్ని కాంటాక్ట్ చెయ్యొచ్చు. దీని ధర సుమారు రూ.9,900 కాగా.. దీన్ని ఆన్ లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. సేఫ్టీ రాడ్! ఆపద నుంచి తప్పించుకోవడానికి కొన్ని సార్లు పెనుగులాట తప్పదు. అలాంటి సమయంలో ఇలాంటి రాడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి చాలా చిన్నదిగా జానెడు పొడవు ఉంటుంది. ఆపద సమయంలో దీన్ని పెద్దగా మార్చుకుని(చిత్రాన్ని గమనించండి) ఉపయోగించుకోవచ్చు. హైక్వాలిటీతో రూపొందిన ఈ రాడ్‌ని యూజ్ చేసుకోవడం చాలా సులభం. దీని ధర సుమారు 6వందల రూపాయలు. దీన్ని హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుని వెంట తీసుకెళ్లొచ్చు. -
విశాఖ మార్గదర్శకాలు
పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి ఒక కీలకమైన కేసుపై తీర్పునిస్తూ సుప్రీంకోర్టు 1997లో ‘విశాఖ’ మార్గదర్శకాలను వెలువరించింది. దరిమిలా కేంద్ర ప్రభుత్వం 2013లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించి ‘సెక్సువల్ హెరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ (ప్రివెన్షన్, ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్) యాక్ట్’ను అమలులోకి తెచ్చింది. సుప్రీంకోర్టు సూచించిన ‘విశాఖ’ మార్గదర్శకాలను యథాతథంగా ఆమోదిస్తూ రూపొందించిన ఈ చట్టంలోని నిబంధనలు ఇవీ... ►పని ప్రదేశంలో సంస్థ యజమాని గాని లేదా బాధ్యతగల వ్యక్తి గాని సంబంధిత సంస్థలో లైంగిక వేధింపుల నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలి. ►సుప్రీంకోర్టు తన మార్గదర్శకాల్లో నిర్దేశించిన ప్రకారం లైంగిక వేధింపులంటే ఏమిటనే అంశాన్ని సంస్థలో అందరికీ తెలిసేలా చేయాలి. దీనికి సంబంధించి మార్గదర్శకాల ప్రతులను ఉద్యోగులందరికీ పంపాలి. ►లైంగిక వేధింపులను నిషేధిస్తూ క్రమశిక్షణకు సంబంధించిన నియమ నిబంధనలను సంస్థ రూపొందించుకోవాలి. ►క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి. ►మహిళా ఉద్యోగులు ప్రశాంతంగా పనిచేసుకునేందుకు అనువైన వాతావరణం కల్పించాలి. ►వారి పని గురించి, విరామం గురించి, ఆరోగ్య పరిస్థితుల గురించి యాజమాన్యం పట్టించుకోవాలి. ►సంస్థలో ప్రతికూల వాతావరణం లేకుండా చూడాలి. ►పదిమందికి పైగా ఉద్యోగులు పనిచేసే ప్రతి సంస్థలోనూ తప్పనిసరిగా లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి సంస్థ యాజమాన్యమే ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. చట్టం ప్రకారం లైంగిక వేధింపులేవంటే.. ►మహిళల పట్ల లైంగిక దాడికి పాల్పడినా, లైంగిక దాడికి ప్రయత్నించినా, శారీరక సంబంధం పెట్టుకోవాలంటూ బలవంత పెట్టినా లేదా అందుకోసం అదేపనిగా బతిమాలుతూ విసిగిస్తూ ఉన్నా, వారి పట్ల అశ్లీల పదజాలం ప్రయోగించినా, అసభ్యకరమైన సైగలు చేసినా, అదేపనిగా కన్నార్పకుండా చూస్తూ ఇబ్బంది కలిగించినా, అనవసరంగా తాకుతూ ఇబ్బంది పెట్టినా, లైంగికపరమైన చేష్టలతో శారీరకంగా, మానసికంగా ఎలాంటి ఇబ్బంది కలిగించినా.. అలాంటి చర్యలన్నింటినీ చట్టం లైంగిక వేధింపులుగానే పరిగణిస్తుంది. ►రాజ్యాంగంలోని 14, 15 అధికరణాల ప్రకారం పురుషులతో పాటు మహిళలకూ సమాన హక్కులు ఉన్నాయి. మహిళలపై ఎలాంటి వేధింపులు జరిగినా రాజ్యాంగం వారికి కల్పించిన సమానత్వ హక్కును ఉల్లంఘించడంగానే చట్టం పరిగణిస్తుంది. అలాగే రాజ్యాంగంలోని 21వ అధికరణం ఎటువంటి వేధింపులు లేని సురక్షితమైన వాతావరణంలో తమకు నచ్చిన వృత్తి వ్యాపారాలు చేసుకునే హక్కు కూడా మహిళలకు ఉంది. విశాఖ మార్గదర్శకాల నేపథ్యం రాజస్థాన్‌లో జరిగిన ఒక అత్యాచార సంఘటన ‘విశాఖ’ మార్గదర్శకాలకు, దాని ఫలితంగా పని ప్రదేశాల్లో మహిళల పట్ల లైంగిక వేధింపుల (నిషేధ, నిరోధక, పరిష్కార) చట్టం అమలుకు దారితీసింది. రాజస్థాన్‌లో 1990వ దశాబ్దంలో భన్వరీదేవి అనే ప్రభుత్వ ఉద్యోగి తన పరిధిలో గల ఒక గ్రామంలో తలపెట్టిన బాల్య వివాహాన్ని అడ్డుకుంది. దీనిపై ఆగ్రహించిన గ్రామ పెత్తందార్లు ఆమెకు ఎలాగైనా గుణపాఠం చెప్పాలనే కక్షతో ఆమెపై సామూహికంగా లైంగికదాడికి తెగబడ్డారు. ఈ కేసులో రాజస్థాన్ హైకోర్టులో బాధితురాలికి న్యాయం జరగలేదు. దీనిపై దేశవ్యాప్తంగా మహిళా సంఘాలన్నీ ఏకమై రాజస్థాన్ హైకోర్టు తీర్పును ప్రశ్నించాయి. ‘విశాఖ’ అనే మహిళా హక్కుల సంస్థ మరికొందరిని కలుపుకొని బాధితురాలికి బాసటగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాధితురాలికి అనుకూలంగా తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు ఈ సందర్భంగా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. చివరకు ప్రభుత్వం ఈ మార్గదర్శకాల ఆధారంగా ప్రత్యేక చట్టాన్ని అమలులోకి తెచ్చింది. -
మహిళల భద్రత కోసం మొబైల్ యాప్స్
మహిళల భద్రత కోసం తెలంగాణ పోలీసులు ‘హాక్ ఐ’ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ముఖ్యంగా ఒంటరి ప్రయాణాల్లో మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే పోలీసులను అప్రమత్తం చేసేలా దీన్ని తీర్చిదిద్దారు. ఎస్ఓఎస్... ‘హాక్–ఐ’లో ఎస్ఓఎస్ (టౌట)విభాగం ఉంటుంది. ప్రాథమిక సమాచారాన్ని ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. హెల్ప్, డేంజర్ వంటి అంశాలను పొందుపరచడంతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులకు చెందిన ఐదు ఫోన్ నంబర్లను ఫీడ్ చేయాలి. అత్యవసర సమయాల్లో ఈ ‘ఎస్ఓఎస్’ను నొక్కితే చాలు... కంట్రోల్ రూమ్, జోనల్ డీసీపీ, డివిజనల్ ఏసీపీలతో పాటు సమీపంలో ఉన్న పెట్రోలింగ్ వాహనాలకు సెల్‌ఫోన్ వినియోగదారుల లోకేషన్ జీపీఎస్ వివరాలతో సహా చేరుతుంది. వినియోగదారులు పొందుపరచిన ఐదు నంబర్లకూ సమాచారం వెళ్తుంది. ‘ఎస్ఓఎస్’ను నొక్కిన 9 సెకండ్లకే అధికారులు రంగంలోకి దిగి జీపీఎస్ ద్వారా బాధితురాలు ఉన్న ప్రాంతానికి చేరుకుంటారు. నెట్ లేకున్నా ఎస్ఓఎస్... మొబైల్ డేటా అందుబాటులో లేకపోయినా లేదా మొబైల్ డేటా ఆన్‌లో లేకపోయినా ఎస్ఓఎస్ను డయల్–100కు అనుసంధానిస్తూ కొత్త వెర్షన్నూ రూపొందించారు. బాధితులు ఎస్ఓఎస్ బటన్ నొక్కగానే ఆటోమేటిక్‌గా అది ఫోన్ కాల్‌గా మారిపోయి ‘డయల్–100’కు చేరుతుంది. సిబ్బంది అలర్ట్ అవుతారు. ‘వందకూ’ వర్తింపు... హాక్–ఐ మొబైల్ యాప్ ద్వారా ‘డయల్–100’కు సైతం ఫోన్ చేసే ఏర్పాటు చేశారు. ఫిర్యాదుదారులు, బాధితులు ఎవరైనా నేరుగా ‘100’ డయల్ చేయకుండా ఈ యాప్ ద్వారా కూడా సంప్రదించే అవకాశం అందుతోంది. విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్ మహిళల భద్రమైన ప్రయాణం కోసం ‘హాక్–ఐ’లో ఏర్పాటు చేసిన మరో విభాగమే ‘విమెన్ ట్రావెల్ మేడ్ సేఫ్’. వాహనం ఎక్కేముందు సదరు ప్రయాణికురాలు ‘హాక్ – ఐ’ యాప్‌లోని ‘ట్రావెల్ మేడ్ సేఫ్’ విభాగంలోని ‘డెస్టినేషన్’ను ఫీడ్ చేయాల్సి ఉంటుంది. వారు ఎక్కుతున్న బస్సు, ఆటో, క్యాబ్ నెంబర్లను ఫొటో లేదా మాన్యువల్‌గా నమోదు చేయాలి. కమిషనరేట్‌లోని ఐటీ సెల్ ఆ ప్రయాణాన్ని పర్యవేక్షిస్తూ ఉంటుంది గమ్యం చేరేవరకు. ప్రయాణికురాలు సురక్షితంగా గమ్యం చేరిన తర్వాత సమాచారం ఇచ్చే వరకు పర్యవేక్షణ కొనసాగుతూ ఉంటుంది. ఈ మధ్యలో ఎప్పుడు అవసరమైనా నిమిషాల్లో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుంటారు. -
ఇవీ మహిళల హక్కులు
పని ప్రదేశాల్లో పురుషులతో సమానంగా వేతనం పొందే హక్కు మహిళలకు చట్టబద్ధంగా ఉంది. చాలాచోట్ల పని ప్రదేశాలలో మహిళలకు ఇప్పటికీ తక్కువ వేతనాలు చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి. అసంఘటిత రంగంలో పనిచేసే మహిళలు దీనివల్ల చాలా నష్టపోతున్నారు. సమాన వేతన చట్టం ప్రకారం సమానమైన పనికి సమానమైన వేతనం పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది. ►గౌరవ మర్యాదలు పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా కేసులో మహిళ నిందితురాలైనప్పటికీ, కోర్టుకు అప్పగించడానికి ముందు ఆమెకు నిర్వహించే వైద్యపరీక్షలను మరో మహిళ సమక్షంలోనే నిర్వహించాలి. ►ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కార్యాలయాలు, కర్మాగారాలు వంటి పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నుంచి రక్షణ పొందే హక్కు ఉంది. తోటి ఉద్యోగుల నుంచి లేదా పై అధికారుల నుంచి వేధింపులు ఎదురైతే, వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై పని చేస్తున్న సంస్థకు చెందిన అంతర్గత ఫిర్యాదుల కమిటీకి మూడు నెలల్లోగా ఫిర్యాదు చేయవచ్చు. ►గృహహింస నుంచి రక్షణ పొందే హక్కు ప్రతి మహిళకూ ఉంది. భార్య, సహజీవన భాగస్వామి, తల్లి, సోదరి.. ఇలా కుటుంబంలో ఉండే ఏ మహిళ అయినా గృహహింసకు గురైతే, తమ పట్ల హింసకు పాల్పడే వారిపై గృహహింస నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేయవచ్చు. గృహహింస ఫిర్యాదులు రుజువైతే నిందితునికి మూడేళ్ల వరకు కారాగార శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి. ►అత్యాచార బాధితులైన మహిళలకు, బాలికలకు తమ పేరును గోప్యంగా ఉంచుకునే హక్కు ఉంది. తన పట్ల జరిగిన నేరానికి సంబంధించి బాధితురాలు నేరుగా మేజిస్ట్రేట్ ఎదుట గాని లేదా ఒక మహిళా పోలీసు అధికారి ఎదుట గాని తన వాంగ్మూలాన్ని ఇవ్వవచ్చు. ►న్యాయ సేవల ప్రాధికార చట్టం ప్రకారం మహిళలకు ఉచితంగా న్యాయ సేవలను పొందే హక్కు ఉంది. ఉచిత న్యాయ సేవలను కోరే మహిళల తరఫున కోర్టులో వాదనలను వినిపించడానికి న్యాయ సేవల ప్రాధికార సంస్థ ప్రత్యేకంగా న్యాయవాదిని ఏర్పాటు చేస్తుంది. ►మహిళలకు రాత్రివేళ అరెస్టు కాకుండా ఉండే హక్కు ఉంది. ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలు లేకుండా మహిళలను సూర్యాస్తమయం తర్వాతి నుంచి సూర్యోదయం లోపు అరెస్టు చేయరాదు. ఒకవేళ ప్రత్యేకమైన కేసుల్లో అరెస్టు చేయాల్సి వస్తే, పోలీసులు తప్పనిసరిగా ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ఆదేశాలను పొందాల్సి ఉంటుంది. ►పోలీస్ స్టేషన్‌కు నేరుగా వెళ్లలేని పరిస్థితుల్లో ఈ–మెయిల్ ద్వారా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా కూడా మహిళలు తమ ఫిర్యాదులను దాఖలు చేసుకోవచ్చు. అలాంటి ఫిర్యాదులు అందిన తర్వాత సంబంధిత పోలీస్‌స్టేషన్ అధికారి ఒక కానిస్టేబుల్‌ను ఫిర్యాదు చేసిన మహిళ వద్దకు పంపి, నేరుగా ఫిర్యాదు నమోదు చేసుకుంటారు. ►మహిళలకు అశ్లీల ప్రదర్శనలకు వ్యతిరేకంగా న్యాయం పొందే హక్కు ఉంది. మహిళల ఫొటోలను అశ్లీలంగా చిత్రించడం, వాటిని సామాజిక మాధ్యమాల ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా ప్రదర్శించడం శిక్షార్హమైన నేరాలు. తమ పట్ల ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై ఫిర్యాదు చేసి రక్షణ, న్యాయం పొందే హక్కు మహిళలందరికీ ఉంది. ►వెంటాడి వేధించడం, ఈ–మెయిల్స్, స్మార్ట్ఫోన్లపై నిఘా వేయడం వంటి చర్యలకు పాల్పడే వారి నుంచి రక్షణ పొందే హక్కు మహిళలకు ఉంది. ఇలాంటి నేరాలకు పాల్పడే వారికి జైలు శిక్ష, జరిమానా పడే అవకాశాలు ఉంటాయి. ►మహిళలకు జీరో ఎఫ్ఐఆర్ దాఖలు చేసుకునే హక్కు ఉంది. బాధితురాలైన మహిళ పట్ల నేరం ఎక్కడ జరిగినా, ఆమె తన ఫిర్యాదును తనకు అందుబాటులో ఉన్న చోట దాఖలు చేసుకోవచ్చు. ఆమె ఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా, నేరస్థలం ఆ పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రాకున్నా, పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవాల్సిందే. అత్యాచారాలపై ప్రభుత్వ గణాంకాలు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) వెల్లడించిన లెక్కల ప్రకారం 2001 నుంచి 2017 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా అత్యాచారాల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ పదిహేడేళ్ల కాలంలో కొద్ది రాష్ట్రాల్లో మాత్రమే అత్యాచారాల సంఖ్య కొంత తగ్గుముఖం పట్టింది. 2001–17 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 4,15,786 అత్యాచార సంఘటనలపై కేసులు నమోదయ్యాయి. ఈ లెక్కల ప్రకారం చూసుకుంటే దేశవ్యాప్తంగా ప్రతిరోజూ సగటున 67 అత్యాచారాలు జరుగుతున్నాయి. అంటే దేశంలో సగటున ప్రతి గంటకూ ముగ్గురు మహిళలు అత్యాచారాల బారిన పడుతున్నారు. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం 2017లో నమోదైన నేరాల సంఖ్య 3,59,849. మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి చట్టాలు మహిళలపై అఘాయిత్యాల నిరోధానికి ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సహా చాలా చట్టాలు ఉన్నాయి. పిల్లలపై లైంగిక అఘాయిత్యాలను అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు రక్షణ చట్టం (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఎగైనెస్ట్ సెక్సువల్ అఫెన్సెస్–పోక్సో యాక్ట్), గృహహింస నిరోధక చట్టం, బాల్య వివాహాల నిషేధ చట్టం, సతి నిషేధ చట్టం, ‘నిర్భయ’ చట్టం, ఆంధ్రప్రదేశ్‌లో ‘దిశ’ చట్టం మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ అమలులో ఉన్నా.. చాలామంది మహిళలకు చట్టపరంగా తమకున్న హక్కులపై అవగాహన లేదు. దీని కారణంగా ఎంతోమంది స్త్రీలు రకరకాల హింసను మౌనంగా భరిస్తూ వస్తున్నారు. -
బాలలకు భరోసా
పిల్లలు అంటే బాలురు, బాలికలు (పోక్సో), మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాలు జరిగితే కేసు నమోదు చేయడంలో సహాయపడ్డం నుంచి తీర్పు వరకు సమస్తం ఒకే చోట అందించడానికి ఏర్పడిందే ‘భరోసా’. లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన పిల్లలు.. పోలీసులు, కేసులు, కోర్టులు, నిందితుల గుర్తింపు మొదలైన ప్రక్రియలో మానసికంగా మరింత నలిగిపోయే ప్రమాదం ఉంది. అలాంటి ఇబ్బందులను తప్పించడానికి.. పోలీస్ యూనిఫామ్, గంభీరమైన కోర్టు హాలు, తికమక పెట్టే డిఫెన్స్ వాదన, నిందితుడి కసి చూపులు, ఆసుపత్రికి వెళ్లడాలు వంటివన్నీ లేకుండా.. ఇంటిలాంటి వాతావరణంలో సమస్తం సమకూరుస్తోంది భరోసా. మెడికల్ ఎగ్జామినేషన్ కోసం క్లినిక్ కూడా ఉంది మెడికల్ ఎగ్జామినేషన్ అక్కడే జరిగేలా. ఇందుకోసం హెల్త్ డిపార్ట్మెంట్ తరపున ఒక డాక్టర్‌ను కూడా ఏర్పాటు చేశారు. అంతేకాదు సంఘటన తాలూకు ట్రామా నుంచి బయటపడి, న్యాయవిచారణలో సహకరించేలా సైకలాజికల్ కౌన్సెలింగ్ కూడా ఉంటుంది. అన్నిటికన్నా ముఖ్యం.. కోర్టు విచారణ జరుగుతున్నప్పుడు పిల్లలకు నిందితుడు కనిపించనివిధంగా ఏర్పాటు ఉంటుంది. కోర్టు కూడా పెద్ద హాలులా కాకుండా.. డ్రాయింగ్ రూమ్‌లా కట్టారు. అవసరమైన పిల్లలకు పునరావాసాన్నీ కల్పిస్తారిక్కడ. ఈ భరోసా సెంటర్లు ప్రస్తుతం హైదరాబాద్, వికారాబాద్‌లో ఉన్నాయి. త్వరలోనే హైదరాబాద్ కమిషనరేట్‌లో మరొకటి, సైబరాబాద్ కమిషనరేట్‌లో రెండు, రాచకొండ కమిషనరేట్‌లో, ఖమ్మం,నల్గొండ, సూర్యాపేట, వరంగల్, సంగారెడ్డిలో ఏర్పాటు చేయనున్నారు. ఇంకో ముఖ్య విషయం.. ఈ భరోసా సెంటర్లోని కోర్టుకు రెండు ప్రవేశ ద్వారాలు ఉంటాయి. ఒక ద్వారం కేవలం జడ్జి, బాధిత పిల్లలకు మాత్రమే. ఇంకో ద్వారం మిగిలిన అందరికోసం. అంటే పిల్లలు ఎక్కడా నిందితుల కంటపడకుండా అన్నమాట. పోర్న్ వలలో పిల్లలు ►ప్రపంచంలో అత్యధిక పిల్లల జనాభా కలిగిన దేశం మనదే. ప్రపంచవ్యాప్తంగా పోర్న్ సైట్స్‌కు సరుకుగా మారుతున్నదీ మన పిల్లలే! ►ఒడిశా వంటి వెనుకబడిన రాష్ట్రాల్లో తల్లిదండ్రులు తెలిసే తమ పిల్లలను పోర్న్‌కు ముడిసరుకుగా మారుస్తున్నారనేది కఠోర వాస్తవం. ఆ రాష్ట్రాల్లోని కొన్ని ఊళ్లల్లో పూరిగుడిసెల్లో సైతం కెమెరాలుంటాయి. విదేశాల నుంచి క్లయింట్స్ ఎప్పుడు పింగ్ చేస్తే అప్పుడు ఆ కెమెరాల ముందుకు వచ్చి.. క్లయింట్స్ ఎలా కావాలంటే అలా యాక్ట్ చేస్తూంటారు పిల్లలు. ►లైంగిక వేధింపులు, లైంగిక దాడికి గురైన బాలికలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు కాగానే 25 వేలు, చార్జిషీట్ వేశాక 50 వేలు, తీర్పు వెలువడ్డాక 25 వేలు.. ఇలా మొత్తం లక్ష రూపాయల వరకు నష్టపరిహారం ఉంటుంది. బాలికలు ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారైనా లేదా దారుణమై పరిస్థితిల్లో ఉంటే ఆయా పరిస్థితులను బట్టి ఈ నష్టపరిహారం 3 నుంచి 8 లక్షల రూపాయాల దాకా కూడా ఉండొచ్చు. ►ఈ చట్టం ప్రకారం.. నేరాన్ని రుజువు చేసుకోవాల్సిన బాధ్యత నిందితుడిదే. ఇదివరకు తమకు అన్యాయం జరిగిందని నిరూపించుకోవాల్సిన బాధ్యత బాధితులపైనే ఉండేది. ►అలాగే పద్దెనిమిది ఏళ్ల లోపు పిల్లల మీద అఘాయిత్యం జరిగినా, లేదా వాళ్లే ఏదైనా నేరం చేసినా.. వాళ్ల పేర్లు, వ్యక్తిగత వివరాలేవీ కూడా పోలీస్ రికార్డుల్లో, కోర్ట్ రికార్డుల్లో నమోదు చేయకూడదు. కోడ్ నంబర్స్ ఉండాలి. అలాగే మూడేళ్ల వరకు మాత్రమే ఆ నేరం గురించి రికార్డుల్లో ఉండాలి. తర్వాత ఆ వివరాలను తొలగించాలి. తెలంగాణ పోలీస్ ‘విమెన్ సేఫ్టీ వింగ్’ ఆధ్వర్యంలో నడుస్తున్న భరోసా సెంటర్లు హైదరాబాద్‌లో ఒకటి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో కొండాపూర్‌లో ఒకటి, అల్వాల్‌లో ఒకటి ఉన్నాయి. ఈ ఏడాదిలో జీడిమెట్ల, పేట్ బషీరాబాద్, శంషాబాద్, షాద్‌నగర్, రాజేంద్రనగర్‌లలోనూ భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఎలాంటి నేర బాధితులకు భరోసా? లైంగికదాడి, లైంగిక వేధింపులు, గృహహింస, పోక్సో కేసులకు సంబంధించి న్యాయ, వైద్య సహాయాలు అందిస్తుంది. భరోసాను సంప్రదించు నంబర్లు: 040 – 29882977, వాట్సప్ నం: 9490617124 -
మహిళా హాస్టళ్లకు మరింత భద్రత
సాక్షి, హైదరాబాద్: నగరంలో కుప్పలు తెప్పలుగా లేడీస్ హాస్టళ్లు వెలుస్తున్నాయి. వీటిలో అధికశాతం హాస్టళ్లకు సరైన అనుమతులు ఉండవు. ఎలాంటి భద్రతా ప్రమాణాలూ పాటించవు. పార్కింగ్, ఫైర్‌సేఫ్టీ, ఫుడ్ విషయంలోనూ మెజారిటీ యాజ మాన్యాలు నిబంధనలను అమలు చేయడం లేదు. చాలామంది యాజమాన్యాలకు తమ హాస్టళ్లలో ఉండే మహిళలు, విద్యార్థినుల సంఖ్య, వారి చిరు నామాలు కూడా తెలియవు. ఇలాంటి హాస్టళ్లలో ఉండే వారికి భద్రత పెంచాలన్న సంకల్పంతో తెలంగాణ విమెన్‌సేఫ్టీ వింగ్ సరికొత్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని లేడీస్ హాస్టళ్లపైనా దృష్టి సారించింది. అన్ని జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో కలిపి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలకుపైగానే ఈ లేడీస్ హాస్టళ్లు ఉంటాయని పోలీసులు అంచనా వేస్తున్నారు. కేసులైనప్పుడు ఇబ్బందులు.. లేడీస్ హాస్టళ్లలో వర్కింగ్ విమెన్స్, విద్యార్థినులు అదృశ్యమైనా, ఆత్మహత్యలకు పాల్పడినా.. వారిని ఎవరైనా వేధించినా, ఆ విషయం పోలీసుల దృష్టికి రావడంలో తీవ్రజాప్యం నెలకొంటోంది. నగలు, స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్టు వంటివి చోరీ అయినా.. చాలామంది తమ ఊరు కాదు కాబట్టి అస్సలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడంలేదు. ఇంట్లో వారి సంరక్షణ నుంచి హాస్టల్లోకి వచ్చాక సహజంగానే వారి సంరక్షణ యాజమాన్యాలు తీసుకోవాలి. కానీ చాలా తక్కువ హాస్టళ్లు మాత్రమే అలా చేస్తున్నాయి. చాలా హాస్టళ్లు డబ్బులు తీసుకున్నాక విద్యార్థుల బాగోగులు పట్టించుకోవడం లేదు. అందుకే ఇకపై అన్ని హాస్టల్ యాజమాన్యాలతో కలిపి ఓ రిజిస్టర్‌ను రూపొందించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. ఇందుకోసం కార్యాచరణ సిద్ధం చేసి, స్థానిక పోలీసుల సాయంతో దశలవారీగా ఈ రిజిస్టర్ రూపొందిస్తారు. అందులో హాస్టల్ యజమాని పేరు, అనుమతులున్నాయా? ఫైర్‌సేఫ్టీ నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థుల చిరునామాలు సేకరించారా? సీసీ కెమెరాలు, పార్కింగ్ తదితర విషయాల్లో ప్రమాణాలకు లోబడి ఉన్నారా? లేదా? ఎలాంటి ఆహారం పెడుతున్నారు? అన్న విషయాలు పొందుపరుస్తారు. అంతేగాకుండా ఈ అన్ని హాస్టళ్ల విద్యార్థులకు ఆపదలు ఎదురైనపుడు ఎలా ఎదుర్కోవాలి? ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి? పోకిరీ వేధింపులు, సైబర్ వేధింపులు ఎదురైనపుడు ఎలా వ్యవహరించాలి? తదితర విషయాలపై షీటీమ్స్ ఆధ్వర్యంలో పూర్తి అవగాహన కల్పిస్తారు. ముందుగా భాగ్యనగరంలోనే.. ఈ రిజిస్టర్ అమలు తొలుత హైదరాబాద్ కమిషనరేట్‌లోనే మొదలుకానుంది. ముందుగా అమీర్‌పేట, ఎస్సార్ నగర్ ఏరియాల్లో ప్రారంభించనున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనే దాదాపు 3 వేల హాస్టళ్లు ఉంటాయని పోలీసుల అంచనా. ఇక హైదరాబాద్ కమిషనరేట్, సైబరాబాద్, రాచకొండ ఏరియాలు కలిపితే 10 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని సమాచారం. ఇక రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మరో 5 వేలు అంటే మొత్తం 15 వేల వరకు హాస్టళ్లు ఉంటాయని, అన్నింటి పూర్తి వివరాలు సేకరించాలని విమెన్‌సేఫ్టీ వింగ్ నిర్ణయించింది. దర్యాప్తులో ఇబ్బందులు తొలగించేందుకే: సుమతి, ఎస్పీ, విమెన్‌సేఫ్టీ వింగ్ చాలామంది హాస్టల్ నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. తమ హాస్టల్లో ఉండేవారి వివరాలు కూడా సరిగా నమోదు చేయడం లేదు. ఇలాంటి కారణాల వల్ల మిస్సింగ్ కేసులు, చోరీ కేసుల దర్యాప్తులో పోలీసులకు అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉన్న చాలామంది తమకు వేధింపులు ఎదురైనా మౌనంగా భరిస్తున్నారు. ఇకపై ఇలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే మా లక్ష్యం. హాస్టల్లో ఉండే ఆడవారి రక్షణ మా ధ్యేయం: స్వాతి లక్రా, ఐజీ, విమెన్‌సేఫ్టీ వింగ్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్న ఆడవారి భద్రతే మా ధ్యేయం. ఇలా హాస్టళ్లలో ఉండే చాలామంది వేధింపులు ఎదుర్కొంటున్నా.. వాటిని అటు ఇంట్లోనూ, ఇటు పోలీసులకూ తెలియపరచడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని పోకిరీలు మరింత చెలరేగుతున్నారు. అందుకే ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా షీటీమ్స్‌ని ఆశ్రయించేలా వారికి చట్టాలపై అవగాహన కల్పిస్తాం. అందుకే ఈ రిజిస్టర్ రూపొందించే ప్రయత్నాలు మొదలుపెట్టాం. -
అమలు దిశగా..
-
‘దిశ’ నిర్దేశం
దిశ చట్టం అమలుకు ఏం కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రత్యేకంగా ఒక ఐపీఎస్ అధికారిని నియమించి, రాష్ట్రంలోని 18 మహిళా పోలీసుస్టేషన్లను ఈ అధికారి కిందకు తీసుకువచ్చేలా చూడండి. ఈ చట్టం అమలుకు వ్యవస్థలన్నీ పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలి. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ తయారు చేయాలి. వీలైనంత త్వరలో ఇవి పూర్తి కావాలి.– సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడే వారికి మరణ దండన విధించేలా తాజాగా తీసుకొచ్చిన ‘దిశ’ చట్టం అమలుకు రాష్ట్ర పరిధిలో అన్ని చర్యలూ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, అడ్వొకేట్ జనరల్ శ్రీరాం, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులతో ఈ విషయమై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. న్యాయపరంగా, పోలీసుపరంగా ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్నదానిపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేసేందుకు జిల్లాకు ఒకటి చొప్పున 13 ప్రత్యేకకోర్టులకు అవసరమైన బడ్జెట్‌ను వెంటనే కేటాయించాలని సీఎం ఆదేశించారు. ప్రతి కోర్టుకూ సుమారు రూ.2 కోట్లు అవసరం అవుతాయని అధికారులు పేర్కొనగా వారం రోజుల్లోగా డబ్బును డిపాజిట్ చేయాలని చెప్పారు. 13 మంది పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకాన్ని వీలైనంత త్వరలో పూర్తి చేయాలని సూచించారు. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు రాష్ట్ర పోలీసు విభాగంలో ఉన్న ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యాన్ని నాలుగు రెట్లు పెంచేందుకు అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఇందులో భాగంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో ప్రస్తుతం ఉన్న ఫోరెన్సిక్ విభాగాన్ని రెట్టింపు చేయడం.. వైజాగ్, తిరుపతిలో కొత్తగా ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారు. ఈ ఫోరెన్సిక్ ల్యాబుల్లో 176 పోస్టులను భర్తీ చేయాల్సి ఉందని డీజీపీ పేర్కొనగా.. ఇందుకోసం జనవరి 1న నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం స్పష్టం చేశారు. జిల్లాల్లోని మహిళా పోలీస్స్టేషన్లను అప్‌గ్రేడ్ చేయడానికి సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీ.. ముఖ్యమంత్రి జగన్‌కు వివరించారు. రాష్ట్రంలోని 18 మహిళా పోలీస్స్టేషన్లలో ఒక డీఎస్పీ, ముగ్గురు ఎస్ఐలు, నలుగురు సపోర్టు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్న డీజీపీ ప్రతిపాదనలకు సీఎం వెంటనే అంగీకారం తెలిపారు. ఈ పోలీసుస్టేషన్లలో మౌలిక సదుపాయలు, ఇతరత్రా అవసరాల కోసం నిధుల మంజూరుకు ఆమోదం తెలిపారు. వన్ స్టాప్ సెంటర్లలో మహిళా ఎస్ఐ నియామకం ప్రతి జిల్లాలో ఉన్న వన్ స్టాప్ సెంటర్ల (హింస, లైంగిక దాడులకు గురైన మహిళలను ఆదుకునేందుకు)ను మరింత బలోపేతం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఈ సెంటర్లలో ఇప్పుడున్న సిబ్బందితోపాటు ఒక మహిళా ఎస్ఐని నియమించడానికి ఆమోదం తెలిపారు. వేధింపులకు గురవుతున్న మహిళలు కాల్ చేయాల్సిన కాల్ సెంటర్, యాప్, వెబ్సైట్ల పనితీరును సమీక్షించారు. సురక్ష స్పందన యాప్ తయారు చేశామని, మొత్తం 86 రకాల సేవలు అందుతాయని, దీనిని త్వరలోనే ప్రారంభిస్తామని డీజీపీ వివరించారు. 100, 112 నంబర్లను ఇంటిగ్రేట్ చేయాలని, దీంతో పాటు దిశ యాప్ కూడా పెట్టాలని, ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి సూచించారు. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న చర్యలపై దుష్ప్రచారం ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదన్న ఏకైక అజెండాతో చాలా మంది పని చేస్తున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కేవలం టీడీపీతోనే కాకుండా టీడీపీ అనుకూల మీడియాతో, చంద్రబాబుకు మద్దతిస్తున్న వారితో మనం పోరాటం చేస్తున్నామన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘పేదల కోసం ఇంగ్లిష్ మీడియం స్కూళ్లు ప్రవేశ పెడుతున్నాం.. మద్యం మహమ్మారిని పారదోలాలనే ఉద్దేశంతో తొలిదశలో పలు చర్యలు తీసుకున్నాం.. మద్యం నియంత్రణలో భాగంగా మద్యం దుకాణాలను తగ్గించాం.. పర్మిట్ రూమ్‌లను నిషేధించాం.. బెల్టుషాపులను ఏరివేశాం.. బార్ల సంఖ్యనూ తగ్గించాం.. ప్రజా ప్రయోజనాల కోసం తీసుకున్న ఈ చర్యలపై కూడా ఎలాంటి ప్రచారం చేస్తున్నారో మనం చూస్తూనే ఉన్నాం..’ అని సీఎం అన్నారు. -
‘అశ్లీల’ వీక్షణలో మహిళలు
సాక్షి, చెన్నై : అశ్లీల వీడియోలను అదే పనిగా వీక్షించే వారిలో మహిళలు కూడా ఉన్నట్టుగా వెలువడ్డ సమాచారం సర్వత్రా విస్మయానికి గురిచేస్తున్నాయి. చెన్నైలో 30 మందిని గుర్తించి ఉన్నట్టు ఏకంగా ఏడీజీపీ రవి ప్రకటించారు. ఇలాంటి వీడియోలను వీక్షించ వద్దు అని యువతులు, మహిళలకు పిలుపునిచ్చారు. పోర్న్ వీడియోలను వీక్షించే వారి సంఖ్య భారత్‌లో అత్యధికంగా ఉన్నట్టు ఓ సర్వేలో తేలి ఉన్న విషయం తెలిసిందే. ఈ వీడియోలకు తగ్గట్టుగానే, ఇటీవల కాలంగా మహిళలు, యువతులు, పిల్లలపై లైంగిక దాడులు, ఉన్మాద చర్యలు పెరిగి ఉన్నాయి. దీంతో మహిళలకు, పిల్లలకు భద్రత కల్పించే రీతిలో దూకుడు పెంచి ఉన్న పోలీసుల యంత్రాంగం అశ్లీల వీడియోలను అదే పనిగా గంటల కొద్ది వీక్షించే వారి భరతం పట్టే రీతిలో చర్యలు చేపట్టారు. చిన్న పిల్లల్ని, మైనర్లను అశ్లీలంగా చిత్రీకరించి తీసిన వీడియోలే కాదు. అశ్లీల సైట్స్‌ల్లో గంటల కొద్ది గడిపే వారిని గురి పెట్టి భరతం పట్టే విధంగా పోలీసులు దూకుడు పెంచే పనిలో పడ్డారు. రాష్ట్రంలో మూడు వేల మంది అదే పనిగా పోర్న్ వీడియోల్ని వీక్షిస్తూ, గంటల కొద్ది ఆన్లైన్లో గడుపుతున్నట్టుగా తేలింది. ఇందులో మహిళలు కూడా ఉన్నట్టు ప్రస్తుతం సంకేతాలు వెలువడ్డాయి. వీరు చెన్నైలో ఉండడం గమనార్హం. ఈ విషయాన్ని స్వయంగా ఏడీజీపీ రవి పేర్కొనడం సర్వత్రా విస్మయానికి గురి చేసింది. అశ్లీల చిత్రాలను వీక్షించ వద్దు.. కోడంబాక్కంలోని ఓ మహిళా కళాశాలలో గురువారం పోలీస్ యాప్ అవగాహన కార్యక్రమం జరిగింది. ఇందులో ఏడీజీపీ రవి మాట్లాడుతూ, మహిళలు, పిల్లల మీద దాడుల్ని అరి కట్టడం లక్ష్యంగా తాము చర్యల్ని వేగవంతం చేశామన్నారు. 7.30 కోట్ల మంది జనాభా కల్గిన ఈ తమిళనాడులో ఇప్పటి వరకు పోలీసు యాప్‌ను పది లక్షల మంది మాత్రమే డౌన్లోడ్ చేసుకుని ఉన్నారని, వీరిలోనూ కేవలం నాలుగు లక్షల మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు పేర్కొన్నారు. మిగిలిన వారు ఎందుకు ఈ యాప్ మీద దృష్టి పెట్టడం లేదని విచారం వ్యక్తం చేశారు. మహిళలు, పిల్లలకు భద్రత కల్పించే విధంగా రూపకల్పన చేసిన ఈ యాప్‌లో స్వల్ప మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇటీవల కాలంగా అశ్లీల చిత్రాల్ని వీక్షించే వారి సంఖ్య పెరిగి ఉండడం విచారకరంగా పేర్కొన్నారు. ఇందులో మహిళలు కూడా ఉండడం, చెన్నైలో 30 మందిని గుర్తించామని పేర్కొంటూ, ఇకపై దయ చేసి అశ్లీల వీడియోలను వీక్షించ వద్దు అని పిలుపు నిచ్చారు. పిల్లలకు వ్యతిరేకంగా సాగుతున్న ఈ వ్యవహారాల్ని అడ్డుకుందామని విద్యార్థినులకు పిలుపు నిచ్చారు. -
శక్తి సేన
అధికారులు గట్టిగా సంకల్పిస్తే మంచి పనులు మొదలవుతాయి. దిశ, సమత ఘటనలు చట్టాలతో మాత్రమే కట్టడి కావు. అధికారులు కూడా పూనుకోవాలి. ప్రజలలోకి వెళ్లాలి. ప్రజలతో మాట్లాడాలి. తెలంగాణలోని కొందరు కలెక్టర్లు, పోలీసు అధికారులు అమ్మాయిల భద్రత కోసం స్వచ్ఛందంగా పని చేస్తున్నారు. వారిలో పెద్దపల్లి కలెక్టర్ శ్రీదేవసేన ఒకరు. ఆమె ఏం చేస్తున్నారో ఆమె మాటల్లోనే... ‘‘మూడేళ్ల క్రితం నేను జనగామ కలెక్టర్‌గా పనిచేస్తున్నప్పుడు అక్కడ విద్యార్థినిలకు కరాటేలో శిక్షణ మొదలుపెట్టించాను. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయితే ఓ మూడు నెలల కిందట.. మీనాక్షమ్మ అనే డెబ్బై అయిదేళ్లావిడ చురుగ్గా కలరిపయట్టు యుద్ధవిన్యాసాలు చేస్తున్న వీడియో ఒకటి యూట్యూబ్‌లో చూశాను. అంత పెద్దావిడ అంత ఎనర్జిటిక్‌గా కదలడం ఆశ్చర్యమనిపించింది. అప్పుడు వచ్చింది ఆలోచన.. స్కూల్లోని అమ్మాయిలకు కూడా ఆత్మరక్షణ కోసం ఈ విద్యను నేర్పించాలని. ఇందుకోసం పకడ్బందీగా ప్లాన్‌చేయాలని అనుకున్నా. ఈలోపే దిశ ఘటన జరగడంతో ఇక ఏమాత్రం ఆలస్యం పనికిరాదని వెంటనే కేరళలోని కలరిపయట్టు నేర్పించే బృందాన్ని పిలిపించాం. ఈ నెల (డిసెంబర్) 22 నుంచి జిల్లాలోని అన్ని స్కూళ్లలో శిక్షణను ప్రారంభించనున్నాం. శారీరకంగా, మానసికంగా అమ్మాయిలు దృఢంగా ఉండాలని ‘శక్తి’ పేరుతో మా జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లోని విద్యార్థినులకు కలరిపయట్టు విద్యలో శిక్షణను ఇప్పించబోతున్నాం. ముందు విడతలో వాళ్లు విద్యార్థినులతోపాటు అదనపు సమయం కేటాయించి పీఈటీలకూ ట్రైనింగ్ ఇస్తారు. పరీక్షల కోసం ఫిబ్రవరి, మార్చిలో శిక్షణను ఆపేసి.. పరీక్షల తర్వాత మళ్లీ ‘శక్తి శిక్షణ’ మొదలవుతుంది. దీన్నొక కోర్స్‌గా పెట్టాలనుకుంటున్నాం. అ కావలసిన నిధుల కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశాం. వస్తాయి కూడా. ప్రస్తుతానికైతే అందుబాటులో ఉన్న నిర్భయ నిధులు వంటివి వాడుతున్నాం. అమ్మాయిలకు శిక్షణ.. అబ్బాయిలకు చైతన్యం అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్యలు నేర్పించి వాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం ఎంత అవసరమో జెండర్ ఈక్వాలిటీ విషయంలో అబ్బాయిలను చైతన్యపర్చడమూ అంతే అవసరం. అందుకే ‘శక్తి’ కోర్సు ద్వారా శిక్షణను అమ్మాయిల మీద ఫోకస్ చేస్తూ ‘స్పృహ’ ద్వారా అబ్బాయిల మీద అవగాహన కోసం దృష్టి పెడ్తున్నాం. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులనూ భాగస్వామ్యం చేస్తున్నాం. మగపిల్లలతోపాటు తల్లిదండ్రులకూ లింగ వివక్ష నేరమనే అవగాహన కల్పించాలనుకుంటున్నాం. కొడుకు, కూతురు ఇద్దరూ సమానమనే ఎరుక తల్లిదండ్రులకు వచ్చి అది పెంపకంలో కనిపిస్తేనే ఆ ప్రభావం మగపిల్లల మీద ఉంటుంది. అలాగే అమ్మాయిలూ తమతో సమానమేనని.. వాళ్లను తోటి పౌరులుగా గౌరవించాలనీ చెప్పిస్తున్నాం. ఈ ‘స్పృహ’ కార్యక్రమానికి సమాచార శాఖ, ఐసిడిఎస్ ప్రధానంగా పనిచేస్తున్నా.. అన్ని శాఖల సహకారాన్నీ తీసుకుంటున్నాం. ‘స్పృహ’కు సంబంధించి గ్రామాల్లో అధికారులే స్వయంగా తల్లిదండ్రులను సంప్రదించి, వాళ్లతో ఇంటరాక్ట్ అవుతారు. డ్రాప్ అవుట్స్కూ దారి.. దిశ నేరానికి పాల్పడిన నలుగురిలో ఇద్దరు ఏమీ చదువుకోనివాళ్లు. అందులో ఒకరు డ్రాప్ అవుట్. ఇలా మధ్యలో చదువు మానేసిన వారిని గుర్తించేందుకు జిల్లాలో సర్వే చేపట్టాం. వారికి బ్యాంకు రుణాలు ఇప్పించి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్‌తో వాళ్లను ఓ దారిలో పెట్టే చర్యలనూ ప్రారంభించాం. చదువు మానేసిన వారితో పాటు చదువుకుని ఏ ఉపాధి లేకుండా ఉన్నవారినీ గుర్తించి వారికీ రుణసహాయం అందించి స్వయం ఉపాధి పొందేలా చూస్తాం. వీటన్నిటితోపాటు అబ్బాయిల పెంపకంపై తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుంది. కంటి తుడుపు మాటలు వద్దు.. దిశ సంఘటన తరువాత చాలా మంది సినీనటులు నిరసన వ్యక్తం చేశారు. మంచిదే. కాని వాళ్లు నటించిన సినిమాల్లో హీరోయిన్ల పట్ల వ్యవహరించిన తీరు కూడా గమనించాలి. సమాజం మీద ప్రభావం చూపే సినిమా మాధ్యమం బాధ్యతగా ఉండాలి. ఇక నుంచైనా అమ్మాయిలను బొమ్మల్లా చూపించే సంస్కృతి విడనాడాలని ఆశిస్తున్నా. దుస్తుల మీద కామెంట్ ఎందుకు? అత్యాచారం జరిగింది అనగానే ముందు కామెంట్ చేసేది ఆడవాళ్ల వస్త్రధారణ మీదే. ఈ పద్ధతి మారాలి. పసిపిల్ల ఎలాంటి డ్రెస్ వేసుకుందని రేప్ చేశారు? మారుతున్న సమాజానికి అనుగుణంగా మహిళలు దుస్తులు ధరిస్తున్నారు. మహిళలనూ తమ తోటి పౌరులుగా చూసే రోజు రావాలి’’ అంటూ ముగించారు కలెక్టర్ శ్రీదేవసేన. – కట్ట నరేంద్రచారి, సాక్షి, పెద్దపల్లి, – సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి ఫోటోలు: మర్రి సతీష్‌రెడ్డి డైనమిక్ కలెక్టర్ పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా శ్రీదేవసేన చేస్తున్న పనులు రాష్ట్రంలో జిల్లాకు ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నాయి. స్వచ్ఛభారత్ లక్ష్యసాధనలో పెద్దపల్లిని ముందు వరుసలో నిలిపారు. ఆమె కార్య నిబద్ధతకు అందిన స్వచ్ఛ్ సర్వేక్షణ్, దీన్‌దయాల్ గ్రామీణ వంటి పురస్కారాలే నిదర్శనం. ఏపీ దిశ– 2019 దిశ సంఘటన నేపథ్యంలో మహిళల భద్రతకు సంబంధించి నిర్మాణాత్మకమైన ఆలోచన చేసింది ఆంధ్రప్రదేశ్. పౌరుల్లో హింసాత్మక ప్రవృత్తిని తగ్గించేందుకు చట్టంతో పరిష్కారాన్ని సూచించింది ‘‘ఏపీ దిశ –2019’’ చట్టాన్ని రూపొందించి. దీనికి సంబంధించి దేశంలో సర్వత్రా ఆనందం వ్యక్తమయింది. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే.. ఈ చట్టం కేంద్రానికీ స్ఫూర్తిదాయకమని.. కేంద్రమూ ఆ దిశలో ఆలోచించి సత్వర న్యాయం అందేలా మార్పులు తేవాలని అన్నారు. సురక్షిత కామారెడ్డి కామారెడ్డి జిల్లాలో మహిళలపై ఎలాంటి అఘాయిత్యాలూ జరుగకుండా నిరోధించేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో ‘సురక్షిత కామారెడ్డి’ అనే కార్యక్రమాన్ని చేపట్టాం. జిల్లాలోని అన్ని ఊళ్లలో చైతన్య కార్యక్రమాలను ఆరంభించాం. ఇందులో అన్ని శాఖల అధికారులను, స్వచ్ఛంద సంస్థలను, మహిళలను, మొత్తం సమాజాన్నే భాగస్వాములను చేస్తున్నాం. వచ్చే మార్చి నెలాఖరులోపు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులకు స్వీయరక్షణతో పాటు చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రణాళిక సిద్ధమైంది. మహిళా పోలీసు సిబ్బందికి పురుషులతో సమానంగా డ్రైవింగ్ నేర్పించాం. మహిళలపై జరిగే దాడులను తిప్పికొట్టడంలో విద్యార్థినులకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. ఆత్మరక్షణ పద్ధతులను నేర్పించాం. ఇది నిరంతరం కొనసాగేలా ప్రణాళిక రూపొందించాం. – ఎన్.శ్వేత, కామారెడ్డి జిల్లా ఎస్పీ -
మహిళా లోకానికి సీఎం వైఎస్ జగన్ అన్నలా అండగా నిలిచారు
-
ఏపీ మహిళలకు సీఎం జగన్ రక్ష
-
‘దిశ ఘటన విని సీఎం జగన్ చలించిపోయారు’
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన చారిత్రత్మక ‘దిశ’ బిల్లును హోంమంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం దిశ బిల్లును తీసుకోచ్చిందని తెలిపారు. ఇటీవలి కాలంలో మహిళలపై దాడులు పెరిగాయని.. దిశ ఘటనతో ఆడపిల్లల తల్లిదండ్రులు భయపడుతున్నారని చెప్పారు. దిశ ఘటన విని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించిపోయారని చెప్పారు. మహిళల రక్షణ కోసమే సీఎం వైఎస్ జగన్ దిశ చట్టాన్ని తీసుకోచ్చారని వెల్లడించారు. మహిళలపై దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఏపీ మహిళలకు సీఎం జగన్ రక్ష : తానేటి వనిత స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలందరికీ సీఎం వైఎస్ జగన్ రక్ష అని తెలిపారు. ఎవరైనా మహిళపై దాడి చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో మద్యం ఏరులై పారిందని గుర్తుచేశారు. మద్యాన్ని హెల్త్ డ్రింక్‌గా ప్రమోట్ చేసిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో జరిగిన కాల్‌మనీ వ్యవహారంపై దర్యాప్తు జరిపించాలని కోరారు. ఏపీ దిశ యాక్ట్-2019లోని ముఖ్యంశాలు.. ► మహిళలు, బాలికలపై అత్యాచారం లాంటి క్రూరమైన నేరాలకు పాల్పడితే ఉరిశిక్ష ► నేరాన్ని నిర్దారించే ఆధారాలున్నప్పుడు(కన్‌క్లూజివ్ ఎవిడెన్స్) 21 రోజుల్లోనే తీర్పు ► వారం రోజుల్లో దర్యాప్తు.. 14 రోజుల్లో విచారణ పూర్తి ► ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదింపు ► మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ► ప్రత్యేక కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం ► ఐపీసీలో 354(ఇ), 354(ఎఫ్) సెక్షన్ల చేర్పునకు గ్రీన్‌సిగ్నల్ ► సోషల్ మీడియాలో మహిళల్ని కించపరిస్తే 2 నుంచి 4 ఏళ్ల జైలు ► మొదటిసారి తప్పుడు పోస్టింగ్‌కు రెండేళ్ల జైలు శిక్ష ► రెండోసారి తప్పుడు పోస్టింగ్‌కు నాలుగేళ్ల జైలు శిక్ష ► పిల్లలపై లైంగిక నేరాలకు 10 నుంచి 14 ఏళ్ల వరకూ శిక్ష, నేరం తీవ్రతను బట్టి జీవిత ఖైదు ► పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ ఉన్న కనీస శిక్ష అయిదేళ్లకు పెంపు -
ఏపీ దిశ యాక్ట్‌పై సర్వత్రా హర్షం
-
సీఎం వైఎస్ జగన్‌కు రాఖీ కట్టిన మహిళా ఎమ్మెల్యేలు
-
సీఎం జగన్‌కు రాఖీ కట్టిన మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు
సాక్షి, అమరావతి: మహిళల భద్రత కోసం ఏపీ దిశ యాక్ట్ పేరిట చరిత్రాత్మక చట్టాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు ధన్యవాదాలు తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎం చాంబర్లో వైఎస్ జగన్‌ను డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, హోంమంత్రి సుచరిత, మంత్రి తానేటి వనిత, ఏపీఐఐసీ చైర్మన్ రోజాతోపాటు మహిళా ఎమ్మెల్యేలు కలిశారు. ఈ సందర్భంగా వారు సీఎం జగన్‌కు రాఖీ కట్టి.. ధన్యవాదాలు తెలిపారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలు వంటి అఘాయిత్యాలకు పాల్పడితే ఉరిశిక్ష విధించేలా.. నిర్ధారించే ఆధారాలున్నప్పుడు 21 రోజుల్లోనే తీర్పు ఇచ్చేలా చారిత్రాత్మక ముసాయిదా బిల్లుకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. మహిళలు, బాలికలపై క్రూరమైన నేరాలకు పాల్పడే వారికి ఇక జీవితం ఉండదనే రీతిలో స్పష్టమైన సంకేతాలు ఇచ్చేలా ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ) చట్టం–2019 (ఆంధ్రప్రదేశ్ దిశ యాక్ట్)ను తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. ఈ చట్టంలో భాగంగా మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు ప్రతి జిల్లాకు ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తారు. మహిళలు, బాలికలపై అత్యాచారాలకు పాల్పడాలంటే హడలెత్తేలా కొత్త చట్టం తీసుకొస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీకి అనుగుణంగా ‘ఏపీ దిశ’ చట్టాన్ని రూపొందించారు. సీఎం సమక్షంలో కేక్ కట్ చేసిన బాలినేని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు సచివాలయంలోని సీఎం చాంబర్లో జరిగాయి. సీఎం వైఎస్ జగన్, మంత్రులు, ఎమ్మెల్యేల సమక్షంలో మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయనకు నేతలందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. -
చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
-
దిశ యాక్ట్: చరిత్రాత్మక బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం
సాక్షి, అమరావతి : మహిళలకు అండగా మరో చరిత్రాత్మక బిల్లుకు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణశిక్ష విధించేలా ఏపీ క్రిమినల్ లా చట్టం (సవరణ) 2019కి కేబినెట్ అనుమతి తెలిపింది. ఏపీ దిశ యాక్ట్‌గా ఈ చట్టానికి నామకరణం చేశారు. ఇందులో భాగంగా భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 354కు సవరణలు చేసి కొత్తగా 354-ఈ చేర్చింది. ఈ చట్టం ద్వారా అత్యాచారానికి పాల్పడిన ఆధారాలు ఉన్నప్పుడు 21 రోజుల్లో తీర్పు వెలువడనుంది. వారం రోజుల్లోగా విచారణ పూర్తిచేసి ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి రెండు వారాల్లోగా ట్రయల్ పూర్తి చేసి శిక్ష పడేలా చేయడం ఈ చట్టం ఉద్దేశం. రెడ్ హ్యాండెడ్‌గా ఆధారాలుంటే నిందితులకు మూడు వారాల్లోగా ఉరిశిక్ష విధించడానికి ఈ చట్టం దోహదం చేస్తుంది. ప్రస్తుతం ఉన్న నాలుగు నెలల విచారణ సమయాన్ని 21 రోజులకు కుదిస్తూ బిల్లు రూపొందింది. అత్యాచారం, సామూహిక అత్యాచారం, యాసిడ్ దాడులు, వేధింపులు, లైంగిక వేధింపులు తదితర నేరాలకు సత్వరమే విచారణ చేసేందుకు ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేయనుంది. సోషల్ మీడియాలో మహిళలను కించపరిచేలా పోస్టింగ్‌లు పెడితే సెక్షన్ 354-ఈ కింద చర్యలు తీసుకునేలా ఈ బిల్లును ప్రతిపాదించారు. ఇక, సోషల్ మీడియాలో మహిళలను కించపరిస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. మహిళలను కించపరుస్తూ మొదటిసారి పోస్టు చేస్తే రెండేళ్లు, రెండోసారికూడా అదేవిధంగా పోస్టులు చేస్తే నాలుగేళ్లు జైలుశిక్ష విధించనున్నారు. చిన్నారులను లైంగికంగా వేధిస్తే 14 ఏళ్ల వరకూ జైలుశిక్ష, అలాగే చిన్నారులపై లైంగిక వేధింపుల కేసుల్లో తీవ్రత ఉంటే జీవిత ఖైదు పడనుంది. ఇక పోక్సో చట్టం కింద ఇప్పటివరకూ ఉన్న కనీస శిక్షను అయిదేళ్లకు పెంచుతూ ఈ బిల్లులోని అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. -
అమెకు అభయం
-
సీఎం జగన్‌కు విజయశాంతి అభినందనలు
సాక్షి, హైదరాబాద్: యావత్ దేశాన్ని కదిలించిన దిశ ఘటన నేపథ్యంలో అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం అందించేందుకు కొత్త చట్టం తీసుకురావాలని నిర్ణయించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్, సినీ నటి విజయశాంతి అభినందించారు. ‘వెటర్నరీ డాక్టర్ దిశపై జరిగిన అమానుష దాడితో యావత్ దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడి పడింది. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా ఉండాలన్న లక్ష్యంతో బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగేవిధంగా కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్టు పేర్కొన్న సీఎం వైఎస్ జగన్‌ను అభినందిస్తున్నాను. ఈ కొత్త చట్టం గురించి అసెంబ్లీలో జరిగిన చర్చలో సీఎం జగన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా ద్వారా మహిళలపై అసభ్య సందేశాలు పంపే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం హర్షనీయం. మహిళల భద్రత కోసం ఏపీతోపాటు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇదే తరహా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నాను’ అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మహిళలు, చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడిన కేసుల్లో నిందితులకు సత్వరమే శిక్ష పడేలా చట్టాల్లో మార్పు తీసుకు రావాల్సిన అవసరం ఉందని సీఎం వైఎస్ జగన్ సోమవారం ఏపీ అసెంబ్లీలో పేర్కొన్న సంగతి తెలిసిందే. ‘మహిళా భద్రతపై స్వల్పకాలిక చర్చ’లో భాగంగా ముఖ్యమంత్రి సోమవారం అసెంబ్లీలో ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. రాష్ట్రంలో చిన్నపిల్లలపై జరుగుతున్న సంఘటనలతో పాటు హైదరాబాద్‌లో జరిగిన ‘దిశ’ ఉదంతం తన మనసును ఎంతో కలిచివేసిందని, తనకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారని, ఓ తండ్రిగా ఆ బాధను తాను అర్థం చేసుకోగలనని అన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చట్టాలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతి ఆడపిల్ల, తల్లి, చెల్లి సురక్షితంగా ఉండాలన్న ముఖ్యమంత్రి అఘాయిత్యాలకు పాల్పడిన వారికి మూడు వారాల్లో శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. వారంలో విచారణ, రెండో వారంలో ట్రయిల్, మూడో వారంలో శిక్ష పడేలా చట్టంలో మార్పులు తీసుకు వస్తామని ఆయన స్పష్టం చేశారు. -
రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా...
సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారుల భద్రతపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం పట్ల యావత్ మహిళా లోకం హర్షిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా శాసనసభ్యులు అన్నారు. శాసనసభ సమావేశాలు వాయిదా అనంతరం ఎమ్మెల్యే కళావతి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ...‘రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలకు త్వరలోనే తెరపడనుంది. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మహిళల్లో ధైర్యం వచ్చింది’ అని అన్నారు. ఎమ్మెల్యే శ్రీదేవి మాట్లాడుతూ.. ‘సీఎం జగన్ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల యావత్ మహిళా లోకం సంతోషం వ్యక్తం చేస్తోంది. ఎక్కడా లేని విధంగా జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టారు’ అని తెలిపారు. మహిళల భద్రతపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రతి ఒక్కరు స్వాగతిస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు మహిళల భద్రత గురించి చర్చిచండం రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా ఉందన్నారు. కాగా అత్యాచార బాధిత మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం సభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. బుధవారం ఈ కీలక బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టనున్నారు. -
మహిళల్లో ఆత్మ స్థైర్యం నింపింది: సుచరిత
-
రాష్ట్రంలో ప్రతి మహిళ గర్వపడేలా...
-
సీఎం వైఎస్ జగన్ మహిళల అభ్యున్నతికి కృషి చేస్తున్నారు
-
సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో మహిళల్లో ధైర్యం వచ్చింది
-
మహిళల భద్రతకు సరికొత్త చట్టం
సాక్షి, అమరావతి: మహిళలపై అత్యాచారాలకు పాల్పడితే మరణ శిక్ష విధించేలా సరికొత్త చట్టం తేవడానికి రాష్ట్ర ప్రభుత్వ రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లోనే దీనికి కార్యరూపం ఇవ్వనుంది. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి సాగకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు రోజుల వ్యవధిలోనే శిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోబోతోంది. ఈ కేసుల విచారణకు జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టు, అవసరమైన పక్షంలో ఇంకో కోర్టు కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. మహిళల భద్రతకు సంబంధించి ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాలకు మరింత పదును పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. విప్లవాత్మక చట్టాలు గత బడ్జెట్ సమావేశాల్లో పలు విప్లవాత్మక, చరిత్రాత్మక చట్టాల రూపకల్పనకు వేదికైన అసెంబ్లీ.. మరోమారు ఆ తరహాలో మరికొన్ని చట్టాలను రూపొందించడానికి సిద్ధమైంది. నేటి నుంచి ప్రారంభం కానున్న శాసన సభ, మండలి సమావేశాల్లో పలు ముఖ్యమైన చట్టాలను చేసేందుకు అధికారపక్షం అడుగులు వేస్తోంది. ఈ చట్టాలకు సంబంధించిన ముసాయిదా బిల్లులను ఈ నెల 11వ తేదీన జరిగే మంత్రివర్గ సమావేశాల్లో ఆమోదించాక సభలో ప్రవేశపెట్టనున్నారు. తొలి రోజు సోమవారం మహిళల భద్రతపై చర్చను ఉభయ సభల్లో చేపట్టనున్నారు. ఈ అంశాన్ని అజెండాలో చేర్చారు. గత ఆరు నెలల పాలనలో విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడమే కాకుండా క్షేత్ర స్థాయిలో అమలు చేసి చూపించడాన్ని సభ దృష్టికి తీసుకురానున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటుతో పాటు 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను కొత్తగా సృష్టించి భర్తీ చేయడం, ఇచ్చిన మాట కన్నా ముందుగా, మెరుగ్గా వైఎస్సార్ రైతు భరోసా అమలు, నవరత్నాల్లోని ఇతర పథకాలు, కార్యక్రమాల అమలుపై అసెంబ్లీ, శాసన మండలి సమావేశాల్లో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు, 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల అనంతరం బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశమై ఎన్ని రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలనే దానితో పాటు అజెండా అంశాలను ఖరారు చేయనుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా ఆర్టీసీ సిబ్బంది ఆర్టీసీ ఉద్యోగుల దశాబ్దాల కలను నిజం చేస్తూ ఈ అసెంబ్లీ సమావేశాల్లో కొత్త చట్టాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ‘అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్–2019’ను తేనుంది. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ చట్టం వీలు కల్పిస్తుంది. ఇందుకోసం ప్రజా రవాణా శాఖను ఏర్పాటు చేస్తారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు ఇకపై ప్రజా రవాణా శాఖ (ప్రభుత్వ) ఉద్యోగులు కానున్నారు. ఈ చారిత్రక చట్టం చేయడం ద్వారా 52 వేల మందికి ఇచ్చిన మాటను నెరవేర్చిన సీఎంగా వైఎస్ జగన్ చరిత్రలో నిలిచిపోతారని ఆర్టీసీ ఉద్యోగులు పేర్కొంటున్నారు. చిరు, పప్పు ధాన్యాల సాగు ప్రోత్సాహానికి ప్రత్యేక బోర్డులు - ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు కలిపి ఒకే కమిషన్ ఉంది. ఇకపై వేర్వేరుగా కమిషన్లు ఏర్పాటు చేస్తూ రెండు బిల్లులను అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించడం ద్వారా చట్టాలను చేయనున్నారు. - చిరు ధాన్యాలు, పప్పు ధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ఆ పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు ప్రత్యేక బోర్డులను ఏర్పాటు చేసేందుకు చట్టాలు చేయనున్నారు. - పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలను ఐదేళ్ల అనంతరం విక్రయించడానికి వీలు కల్పిస్తూ చట్టం చేయనున్నారు. - నూతన బార్ల విధానం, సగానికి పైగా మద్యం షాపుల తగ్గింపు, 40 శాతం మేర బార్ల సంఖ్య తగ్గింపునకు సంబంధిత చట్టాల్లో సవరణలు చేయనున్నారు. - అడ్వకేట్ సంక్షేమ నిధి చట్టంలో సవరణలకు బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ సమావేశాల్లో చర్చకు రానున్న అంశాలు - రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు – ప్రభుత్వ చర్యలు - గ్రామ, వార్డు సచివాలయాలు – వలంటీర్లు – కొత్తగా శాశ్వత ఉద్యోగాల కల్పన - వ్యవసాయ రంగం – రైతు భరోసా, మద్దతు ధర - మద్య నియంత్రణ విధానం – ప్రభుత్వ చర్యలు - ఆంగ్ల విద్య ఆవశ్యకత – అమ్మ ఒడి, నాడు–నేడు - విద్య వైద్య రంగాల్లో సంస్కరణలు - అగ్రిగోల్డ్ బాధితులు – ప్రభుత్వ చర్యలు - సంక్షేమ పథకాలు – ప్రభుత్వ చర్యలు - స్పందన కార్యక్రమం – అవినీతి నిర్మూలన – పారదర్శక పాలన - రాజధాని – గత ప్రభుత్వ చర్యలు – అప్పులు - విద్యుత్ పీపీఏలు – ప్రభుత్వ చర్యలు - పోలవరంతో పాటు ఇతర ప్రాజెక్టులు – వాటర్ గ్రిడ్స్ – రివర్స్ టెండరింగ్ - విభజన హామీలు - పెట్టుబడులు – భూ కేటాయింపులు - గృహ నిర్మాణం – ఇళ్ల స్థలాల పంపిణీ - శాంతి భద్రతలు – ప్రభుత్వ చర్యలు -
అమ్మాయిలూ...ఆదిపరాశక్తిలా మారండి!
ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరో ఒకరు వస్తారు, సహాయం చేస్తారు అని అనుకోవడం కాకుండా..ప్రతీ మహిళ తనను తాను కాపాడుకోవడం నేర్చుకోవాలి. తనకు తానే బాడీగార్డ్‌లా మారాలి. ఎవరైనా తన జోలికి వస్తే ఆదిపరాశక్తిలా మారి వారిని మట్టుబెట్టాలి. ఇలా చేయాలంటే చిన్నప్పటినుంచి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్‌లు తెలిసుండాలి. ఆ టెక్నిక్లేంటో తెలియాలంటే ఇప్పుడు చూద్దాం. -
దిశ కేసు: అలాంటి ఆపద మనకొస్తే?
నెలల పసికందు దగ్గర్నుంచి వయసుపై బడిన వృద్ధుల వరకు కామాంధుల చేతిలో బలవుతున్న మహిళలు ఎందరో. గణాంకాల ప్రకారం మన దేశంలో నిత్యం ప్రతీ గంటకు నలుగురు చొప్పున అత్యాచారానికి గురవుతూనే ఉన్నారు. తాజాగా దిశ హత్యోదంతంతో ఆడపిల్ల అడుగుతీసి బయటికి వెళ్లాలంటేనేవెన్నులో వణుకుపుడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనకే అలాంటి ఆపద పరిస్థితి ఎదురైతే ఏం చేయాలి? మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి? వాచ్ దిస్ స్టోరి.. -
దిశ కేసు: హైదరాబాద్ మెట్రో సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: షాద్‌నగర్‌లో జరిగిన దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో మహిళల భద్రతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. మెట్రో రైలులో ప్రయాణం సందర్భంగా మహిళలు తమ వెంట పెప్పర్ స్పే తీసుకెళ్లేందుకు అనుమతించింది. ఇప్పటికే బెంగళూరు మెట్రో మహిళలు ప్రెప్పెర్ స్ప్రేలతో ప్రయాణించేందుకు అనుమతించగా.. హైదరాబాద్ మెట్రో కూడా అదే దారిలో సాగుతూ నిర్ణయం తీసుకుంది. షాద్‌నగర్ సమీపంలో అత్యంత అమానుషంగా జరిగిన దిశ సామూహిక అత్యాచారం, హత్య ఘటన నేపథ్యంలో మహిళల భద్రతపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఇకనుంచి పెప్పర్ స్ప్రేలను కూడా మెట్రో స్టేషన్లోకి అనుమతిస్తామని బెంగళూరు మెట్రో ప్రకటించగా. తాజాగా హైదరాబాద్ మెట్రో కూడా అదే నిర్ణయం తీసుకుంది. మహిళలపై లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. మెట్రోరైలులో సాంకేతిక కారణాలతో సాధారణంగా పెప్పర్ స్ప్రే, నిప్పు వ్యాప్తి చేసే పదార్థాలను అనుమతించరు. పెప్పర్ స్ప్రేల వల్ల త్వరగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ఎవరైనా వీటిని తీసుకొస్తే చెకింగ్ పాయింట్ల వద్దే వాటిని పడేయాల్సి వచ్చేది. దీన్ని ప్రమాదంగా భావించిన మెట్రో అధికారులు అలాంటివి మహిళల వద్ద అవి దొరికితే సీజ్ చేసేవారు. కానీ ఇకనుంచి మహిళలు తమ వెంట పెప్పర్ స్ప్రే తీసుకెళ్లొచ్చని ఆదేశాలు జారీ చేశారు. మెట్రోలో మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. -
‘మహిళలను ఉచితంగా డ్రాప్ చేస్తాం’
చండీగఢ్ : దేశంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకుని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 గంటల మధ్యలో బయట ఒంటరిగా ఉన్న మహిళలను పోలీసులే ఉచితంగా వారి ఇళ్ల వద్ద దిగబెట్టనున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. ఇందుకోసం మహిళలు 100, 112, 181 నెంబర్లకు ఫోన్ చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉండేలా చూడాలని డీజీపీ దిన్కర్ గుప్తాను సీఎం ఆదేశించారు. మహిళలు చేరుకోవాల్సిన ప్రదేశానికి టాక్సీ గానీ, భద్రతతో కూడిన రవాణా సదుపాయం గానీ లేకపోతే పోలీసులు వారికి సాయం అందిచనున్నారు. వారిని గమ్యస్థానాలకు చేర్చే సమయంలో ఒక మహిళ కానిస్టేబుల్ తోడుగా ఉండనున్నారు. ఇందుకోసం కేటాయించిన వాహనాలు రాష్ట్రంలోని పోలీస్ కమిషనరేట్ కార్యాలయాలతో పాటు, ఇతర ముఖ్య నగరాల్లో అందుబాటులో ఉంఉనున్నాయి. జిల్లా స్థాయిలో డీఎస్పీ గానీ, ఏసీపీ గానీ ఈ పథకానికి నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా, ఇటీవల హైదరాబాద్ నగర శివార్లలో వైద్యురాలిపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన పెను సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
7నిమిషాల్లో.. మీ ముందుంటాం
సాక్షి, హైదరాబాద్ : మూడు నిమిషాలు టైమిస్తే పని ముగించేస్తానంటూ పోలీసాఫీసర్ పాత్రలో ఓ హీరో చెప్పిన పాపులర్ డైలాగ్.. దీన్ని రాష్ట్ర పోలీసులు ఏడే ఏడు నిమిషాలు అంటున్నారు. పోలీసు సాయం అవసరమైన వారికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డయల్ 100కు ఎవరైనా ఫోన్ చేస్తే 7 నిమిషాల్లో చేరుకుంటున్నామంటున్నారు. బాధితులెవరైనా 100కు డయల్ చేస్తే మూడు నిమిషాల్లోనే వారికి తిరిగి కాల్ చేసి రెండే రెండు నిమిషాల్లో పోలీసులు చేరుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. శంషాబాద్‌లో దిశ హత్య ఘటన తర్వాత డయల్ 100కు కాల్స్ పెరిగాయి. సాధారణంగా రోజు వచ్చే కాల్స్ కంటే 2 నుంచి మూడువేల కాల్స్ అదనంగా వస్తున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. పోలీ సులు ఘటనాస్థలానికి వచ్చే సమయంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో పోలీసు ఉన్నతాధికారులు మంగళవారం స్పందించారు. డయల్ 100కు కాల్ వచ్చిన వెంటనే తాము స్పందిస్తున్నామని, దగ్గరలోని గస్తీ (పెట్రోలింగ్) వాహనాన్ని అప్రమత్తం చేస్తున్నామని అన్నారు. కాల్ చేసిన వారి వద్దకు చేరుకునే మార్గంలో ట్రాఫిక్ రద్దీ ఉంటే కాస్త ఆలస్యమవుతోందని చెప్పారు. ఇక జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఈ సమయం 10 నిమిషాలుగా ఉందని వెల్లడించారు. వాస్తవానికి నగరాల్లో పోలీసులు ఘటనాస్థలికి చేరుకుంటున్న సమయం 7 నుంచి 10 నిమిషాలు ఉంటుండగా.. గ్రామాల్లో ఇది 10 నుంచి 12 నిమిషాలు ఉంటుంది. ఎక్కువ ఫోన్‌కాల్స్ వాటివే.. సాధారణంగా డయల్ 100 కంట్రోల్ రూమ్‌కు వచ్చే ఫోన్‌కాల్స్‌లో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలకు సంబంధించినవేనని ఆ తర్వాతి స్థానంలో గొడవలు, అగ్నిప్రమాదాలు, ఈవ్‌టీజింగ్ ఇతర నేరాలు ఉంటున్నాయని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. జిల్లాలో ఈ సగటు 300 నుంచి 500 వరకు ఉండగా..నగరం, పట్టణాల్లో 900 నుంచి 3000 వరకు ఉందని వెల్లడించారు. ఒక రోజుకు వచ్చే మొత్తం కాల్స్‌లో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల నుంచే దాదాపుగా సగభాగం ఉంటున్నట్లు తెలిపారు. జనవరి నుంచి ఇప్పటివరకు డయల్ 100కు 75లక్షలు పైగా కాల్స్ వచ్చినట్లు వెల్లడించారు. ధైర్యం కోల్పోవద్దు ఆపద ఎదురైనపుడు ఆడపిల్లలు, మహిళలు ఎట్టి పరిస్థితుల్లోనూ ధైర్యం కోల్పోవద్దని విమెన్‌సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా విజ్ఞప్తి చేశారు. ఎవరు వేధించినా, బెదిరించినా..వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని ఆమె సూచించారు. ఏదైనా ఉపద్రవం ముంచుకు వస్తుందని అనుమానం వచ్చినా, ఎవరైనా వెంటాడినా సరే వెంటనే హాక్ ఐ యాప్‌లోని ఎమర్జెన్సీ బటన్ని వినియోగించుకోవచ్చ న్నారు. వాట్సాప్, ఫేస్బుక్, ఎస్ఎమ్ఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసులతోపాటు, షీటీమ్స్ సిబ్బంది కూడా నిమిషాల్లో మీకు రక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. – స్వాతి లక్రా, ఐజీ విమెన్‌సేఫ్టీ వింగ్ -
ఆ ఘటన యావత్ దేశాన్ని కదిలించింది!
సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా) : తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించిందని ఈస్ట్ జోన్ ఏసీపీ సురేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గన్నవరం పోలీసు స్టేషన్లో ఆదివారం సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపద సమయంలో పోలీస్ సహాయం కోసం ఏర్పాటు చేసిన డయల్ 100ను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. డయల్ 100కి కాల్ చేస్తే 4 నిమిషాల్లో ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుంటారని, మొబైల్ ఫోన్లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే కమాండ్ కంట్రోల్ రూంకి సమాచారం వెళుతుందని, మొబైల్ కీపాడ్‌లో 5 లేక 9 నంబర్లను నొక్కి పట్టుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రమాద స్థలాన్ని పోలీసులు గుర్తిస్తారని తెలిపారు. బ్లూకోట్,రక్షక్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని సురేంద్రనాథ్‌రెడ్డి వివరించారు. స్త్రీలకు పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారని, మహిళలకు ప్రత్యేక రక్షణ కోసం సీపీ ద్వారకాతిరుమలరావు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు. -
ఆరు దాటితే ఆగమే !
సాక్షి, సిటీ బ్యూరో: వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి బుధవారం రాత్రి సోదరికి ఫోన్ చేసి తన స్కూటీ పంక్చర్ అయిందని చెప్పారు. ఆ వేళలో రోడ్డుపై ఒంటరిగా ఉండొద్దని, సమీపంలోని టోల్గేట్ వద్దకు వెళ్లమని సోదరి సూచించారు. దీనికి సమాధానంగా ప్రియాంక ‘అక్కడుంటే అందరూ చూస్తారంటూ’ జవాబు ఇవ్వడం కాల్ రికార్డింగ్‌లో స్పష్టంగా తెలుస్తోంది. ఆమెకు ఈ భావన కలగడానికి కారణం... చీకటి పడితే ఆ రహదారుల వెంట సాగుతున్న అసాంఘిక కార్యకలాపాలే. ఏ దారీ అతీతం కాదు... చీకటి పడిందంటే చాలు నగర శివార్లలోని అనేక రహదారులు అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ వ్యవహారాలను అడ్డాలుగా మారుతున్నాయి. జనసమ్మర్థం ఉండే అంతర్గత రహదారులను మినహాయిస్తే ప్రధాన రోడ్లు, హైవేలతో పాటు ఔటర్ రింగ్ రోడ్ సైతం వీటికి అతీతం కాదు. కొన్ని ప్రాంతాల్లో వ్యభిచారిణులు, దాదాపు ప్రతిచోటా ఉంటున్న మందుబాబులతో అనునిత్యం భారీ వాహనాలు సంచరించే ఔటర్ రింగ్ రోడ్‌తో పాటు దాని అనుబంధ రహదారుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంటోంది. లారీలను రోడ్డు పక్కన ఆపేసుకుంటున్న డ్రైవర్లు అక్కడే మద్యం తాగుతున్నారు. వీరితో పాటు అనేక మంది ఇతర వాహనచోదకలూ ఓఆర్ఆర్లోని కొన్ని ప్రాంతాలను ఓపెన్ బార్లుగా మార్చేస్తున్నారు. ఇక కొన్ని రహదారుల పక్కన వ్యభిచారం యథేచ్ఛగా సాగుతుండగా.. మరికొన్ని ప్రాంతాలు ప్రేమ జంటలకు నెలవుగా మారిపోతున్నాయి. నిషాలో జరిగే దారుణాలెన్నో... ఆయా ప్రాంతాల్లో నిషాలో జోగుతున్న డ్రైవర్లు అనేక దారుణాలకు ఒడిగడుతున్నారు. ఆ మార్గంలో ప్రయాణిస్తున్న పురుషులకే వీరితో ఇబ్బందులు తప్పట్లేదు. అలాంటి పరిస్థితుల్లో మహిళలు విషయం వేరే చెప్పక్కర్లేదు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్లు బాహాబాహీలకు దిగడం, ఇతరులపై దాడులు చేయడం, ప్రమాదాలకు కారకులుగా మారడం నిత్యకృత్యంగా మారిపోయింది. దాదాపు నిర్మానుష్య ప్రాంతాల మధ్య నుంచి సాగుతున్న ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్)పైనే కాదు అనేక అంతర్గత రోడ్లలోనూ ఈ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రియాంకరెడ్డిపై ఘాతుకం జరగడానికి ఓఆర్ఆర్, దాని సర్వీసు రోడ్లలో నెలకొన్న పరిస్థితులూ ఓ కారణంగానే చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న దురాగతాల్లో అతి తక్కువ మాత్రమే సంచలనంగా మారి పోలీసు రికార్డులకు ఎక్కుతున్నాయి. చిన్నాచితకా వ్యవహారాలను బాధితులు పోలీసుల వరకు తీసుకురాకుండానే సర్దుకుపోతున్నారు. మహా అయితే మరోసారి ఆ మార్గాన్ని అనుసరించకుండా వేరో దారిలో వెళ్తున్నారు. పెట్రోలింగ్‌కు ఇబ్బందులెన్నో... ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్, దాని సర్వీస్ రోడ్‌తో పాటు ఇతర ప్రధాన రహదారులు, నిర్మానుష్య ప్రాంతాల్లో పెట్రోలింగ్ నామమాత్రంగా ఉంటోంది. దీన్ని పరోక్షంగా అంగీకరిస్తున్న పోలీసులు.. ఇందుకు కారణాలు అనేకమని చెబుతున్నారు. నగరం చుట్టూ విస్తరించి ఉన్న ఔటర్ రింగ్ రోడ్ మొత్తం సైబరాబాద్, రాచకొండల్లోని వేర్వేరు శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్ల పరిధిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే ఆ పోలీసులు తమ పరిధిలోని నివాస ప్రాంతాలు, ప్రధాన రహదారులపై గస్తీకి ఇస్తున్న ప్రాధాన్యం ఓఆర్ఆర్, దాని సర్వీసు రోడ్లలో చేయడానికి ఇవ్వలేకపోతున్నారు. జనావాసాల్లో నేరాలు నిరో«ధించడానికి, సున్నిత ప్రాంతాల్లో శాంతిభద్రతల సమస్యలు రాకుండా చూడటానికి, రద్దీగా ఉండే రహదారులపై ఇబ్బందులు ఎదురుకాకుండా చూసేందుకు మాత్రమే ప్రాధాన్యమిస్తూ గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఓఆర్ఆర్, దాని సర్వీసు రోడ్లలో అవసరమైన స్థాయిలో గస్తీ ఉండట్లేదు. ప్రస్తుతమున్న గస్తీ సిబ్బంది, వాహనాలను పెంచడమో.. లేక ప్రత్యేకంగా సిబ్బందిని నియమించడమో చేయాల్సిందేనని, అప్పుడే ఈ సమస్య పరిష్కారమవుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రాథమిక జాగ్రత్తలు అవసరం ప్రస్తుత ప్రపంచంలో మహిళలు సైతం పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగ రంగాల్లో దూసుకుపోతున్నారు. ఈ కారణం వల్లే అనివార్యంగా వేళలతో సంబంధం లేకుండా రహదారుల్లో సంచరించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో దుండగుల బారినపడకుండా కొన్ని కనీస జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హాక్–ఐ, డయల్–100 వంటి వాటిని వాడుకోవడంతో పాటు స్వీయ జాగ్రత్తలు అవసరమని స్పష్టం చేస్తున్నారు. ► ఏదైనా ఇబ్బంది, ముప్పు ఎదురైనప్పుడు భయాందోళనలకు లోనై (ప్యానిక్) ఆలోచనను కోల్పోకూడదు. ఇది ప్రాథమిక సూత్రం. ఇలా జరిగితే అది దుండగులకు అనువుగా మారుతుంది. ► విద్యార్థినులు, ఉద్యోగినులు.. పోకిరీలు, ముష్కరులకు చెక్ చెప్పడం కోసం పెప్పర్ స్ప్రేను తమ వెంట ఉంచుకోవాలి. హ్యాండ్ బ్యాగ్‌లో ఇదే భాగంగా అయిపోవాలి. పెప్పర్ స్ప్రే అందుబాటులో లేకుంటే కనీసం ఘాటైన వాసన గల సెంట్లు, స్ప్రేలు దగ్గర ఉంచుకోవాలి. ► ఎవరైనా దాడి చేసినా, వేధించినా, ఇతర ఘోరాలకు యత్నించినా వీటిని వారి ముఖంపై స్ప్రే చేసి తప్పించుకోవచ్చు. ► రాత్రి వేళల్లో, నిర్జన ప్రదేశాల్లో సాధ్యమైనంత వరకు మహిళలు ఒంటరిగా సంచరించకపోవడం మంచిది. ► అత్యవసరమైన/తప్పనిసరి పరిస్థితుల్లో సంచరించే మహిళలు తమతో పాటు ఓ ఈలను ఉంచుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఊదుతూ చుట్టపక్కల వారి దృష్టిని ఆకర్షించాలి. ► స్థానిక పోలీసుస్టేషన్, కంట్రోల్ రూమ్‌తో పాటు సన్నిహితుల నంబర్లు సెల్‌ఫోన్‌లోని స్పీడ్ డయల్స్ ఆప్షన్లో సేవ్ చేసుకోవాలి. అవసరమైతే వాటిని సేవ్ చేసిన బటన్ నొక్కిన వెంటనే అవతలి వారికి కాల్ వెళ్తుంది. ► ఒంటరిగా వెళ్తున్న వారు ఆటోలు, క్యాబుల్లో ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మహిళా ప్రయాణికులు ఉన్న షేర్ ఆటోలు, క్యాబుల్నే ఎక్కడం ఉత్తమం. ► తప్పనిసరి పరిస్థితుల్లో ఒంటరిగా అద్దె వాటిలో వెళ్లాల్సి వస్తే అది ఎక్కే ముందు దాని నంబర్, డ్రైవర్ పేరు అడిగి తెలుసుకుని వాటిని సన్నిహితులు, స్నేహితులకు సంక్షిప్త సందేశం, ఫోన్‌కాల్ ద్వారా తెలపాలి. ► సన్నిహితులు, స్నేహితులు, కుటుంబీకులు సమీపంలో లేనివారు కనీసం పోలీసు కంట్రోల్ రూమ్ (100)కు ఫోన్ చేసి అయినా విషయం చెప్పాలి. ఇలా చేస్తున్న విషయం ఆ డ్రైవర్‌కు తెలిసేలా చేస్తే అతడు దుస్సాహసాలకు ఒడిగట్టే ధైర్యం చేయడు. ► మహిళలు, యువతులు వ్యక్తిగత పనులపై ఒంటరిగా బయటకు వస్తే ఓ రోజు ఎక్కడెక్కడకు వెళ్లాలనుకుంటున్నారో ముందుగానే సంబంధీకులకు తెలపాలి. -
మహిళల భద్రతపై కేజ్రీవాల్ మరో నిర్ణయం
న్యూఢిల్లీ : ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్(డిటిసి) బస్సులో ప్రయాణం చేసే మహిళలకు మరింత రక్షణ కల్పించేందుకు మంగళవారం నుంచి మరో 13వేల మంది మార్షల్స్ పనిచేస్తారని ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సోమవారం తెలిపారు. ఇప్పటికే మహిళలకు రక్షణగా 3400 మంది మార్షల్స్ పనిచేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా ఎంపిక చేసిన 13 వేలమంది మార్షల్స్ మంగళవారం నుంచే విధుల్లో చేరతారని ఆయన స్పష్టం చేశారు. దేశానికి రాజధానిగా ఉన్న ఢిల్లీలో మహిళలకు కనీస భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో నిర్వహించిన వేడుకలో కేజ్రీవాల్ మాట్లాడుతూ.. మహిళల రక్షణే మా మొదటి ప్రాధాన్యత అని వెల్లడించారు. ఇది మా ప్రభుత్వం సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇప్పటివరకు ప్రపంచంలో ఏ నగరంలో లేని విధంగా మేము మహిళలకు రక్షణగా మార్షల్స్‌ను నియమించామని తెలిపారు. 'ఈ రోజు మీ అందరిముందు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. బస్సులో ప్రయాణం చేస్తున్న ప్రతీ మహిళకు రక్షణ కల్పించడమే మీ బాధ్యత. ఇది చూసి ప్రతీ మహిళ ప్రభుత్వ బస్సును సొంత వాహనంగా భావించేలా విశ్వాసం కల్గిస్తారని ఆశిస్తున్నా' అంటూ కొత్తగా ఎంపిక చేసిన మార్షల్స్‌తో పేర్కొన్నారు. కాగా, ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డిటిసి) బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే పథకాన్ని ప్రభుత్వం రూపొందించడానికి ఒక రోజు ముందు ముఖ్యమంత్రి నుంచి ఈ ప్రకటన రావడం విశేషం. -
చిన్నమెసేజ్‌తో శ్రీరామ రక్ష
సాక్షి, హైదరాబాద్: మహిళల భద్రత కోసం పోలీసులు మరో వినూత్న ఆవిష్కరణకు రూపకల్పన చేశారు. క్యాబ్‌లలో ప్రయాణించే మహిళలు, పౌరుల భద్రతకు ఆ సర్వీసులను పోలీసు ప్యాట్రోల్ వాహనాల తో అనుసంధానించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో ఈ వ్యవస్థను ప్రవేశ పెట్టినట్లు సోమవారం జరిగిన మీడియా భేటీలో డీజీపీ మహేందర్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని నేర రహిత సమాజంగా మార్చే క్రమంలో ఈ ప్రక్రియ చేపట్టినట్లు చెప్పారు. నగరం విస్తరిస్తున్న దరిమిలా మ హిళా ఉద్యోగులు అన్ని వేళల్లోనూ విధులు నిర్వహిస్తున్నారని, వారికి భద్రత కలి్పంచడం మనందరి బాధ్యత అని అన్నారు. ఎలా పని చేస్తుందంటే..? ఆపద ఎదురైనా, ప్రమాదాల్లో చిక్కుకున్నా.. ఓలా, టోరా, రైడో, ఎం–వాలెట్, హాక్ ఐ యాప్‌ల్లో ఉన్న ఎస్ఓఎస్ (ఎమర్జెన్సీ) బటన్‌ను నొక్కితే చాలు సమీపంలోని ప్యాట్రోల్ వాహనాలు, బ్లూకోల్ట్స్, స్థానిక ఏసీపీ, డీసీపీ, స్టేషన్ ఎస్హెచ్ఓ, మహిళ బంధువులకు సమాచారం అందుతుంది. ఫలితంగా సదరు క్యాబ్ డ్రైవర్ వివరాలు ఫోన్ నంబర్, బయోడేటా మొత్తం పోలీసులకు వచ్చేస్తుంది. సమీపంలో ఉన్న గస్తీ వాహనాలు, పోలీసులు జీపీఎస్ ఆధారంగా ఘటనా స్థలానికి చేరుకుంటారు. ఇందుకోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఓ ప్రత్యేకమైన బృందం 24 గంటలు పనిచేస్తుంది. ఈ ప్రక్రియంతా ముగిసిన తరువాత ఎవరు ఎలా పనిచేసారో తెలుసుకునేందుకు థర్డ్ పార్టీ సర్వే ప్రతినిధులు బాధితులకు ఫోన్ చేస్తారు. ప్రస్తుతం ఈ సదుపాయం నగరానికే పరిమితమైనా, క్రమంగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలియజేశారు. మిగిలిన క్యాబ్ సంస్థలూ ముందుకువచ్చి ఈ విధానంలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మహిళలు, పౌరుల్లో హాక్ ఐ మీద అవగాహన పెరుగుతోందన్నారు. ఇప్పటివరకూ 22 లక్షల మంది హాక్ ఐని డౌన్లోడ్ చేసుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. -
‘మార్గదర్శక్’తో ఆమెకు అభయం
సాక్షి, నేరేడ్మెట్: ‘ఉప్పల్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేసే మహిళకు తన తోటి ఉద్యోగి నుంచి వేధింపులు మొదలయ్యాయి. ఆ కంపెనీలో చేరిన సమయంలో ఆమెతో పరిచయం పెంచుకున్న అతగాడు తనస్థాయి ఆమెకు మించి ఎక్కువ కావడంతో సూటిపోటి మాటలతో పని సరిగా చేయడం లేదంటూ కసురుకునేవాడు. పని ఎంత బాగా చేసినా ఏదో వంక పెడుతుండటంతో వేధింపులు తట్టుకోలేక ఆ ఉద్యోగి ఆ కంపెనీలో ఎవరికి చెప్పాలో తెలియక ఉద్యోగం వదిలేసేందుకు సిద్ధమైంది. అదే సమయంలో రాచకొండ పోలీసు కమిషనరేట్‌లో పరిచయం చేసిన మార్గదర్శక్ గురించి తెలుసుకుంది. ఆమె కంపెనీ నుంచి ఇద్దరు మార్గదర్శక్‌లున్నారని తెలుసుకొని వారిని ఆశ్రయించడంతో జరిగిన విషయాన్ని పోలీసులకు చేరవేశారు. ఇటు బాధితురాలి పేరు బయటకురాకుండానే నిందితుడికి శిక్ష పడింది. అంతేకాకుండా బాధితురాలికి మహిళ చట్టాలపై మార్గదర్శక్‌లు అవగాహన కలిగించి మనోధైర్యం కలిగించారు.’ ...ఇలా సరిగ్గా రెండున్నరేళ్ల క్రితం సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ సహాకారంతో రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ప్రారంభించిన ‘మార్గదర్శక్’ ఐటీ కంపెనీలతో పాటు ఇతర కంపెనీల్లో పనిచేసే మహిళలకు అండగా ఉంటోంది. కార్యాలయాల్లో వేధింపులకు గురవుతున్న మహిళలకు మనోధైర్యాన్ని కల్పించి మార్గదర్శనం చేస్తున్నారు. తోటి ఉద్యోగులతో సమస్యలున్నా, వేధింపులు ఎదురైనా, ఉన్నతస్థాయి సిబ్బంది దురుసుగా వ్యవహరించినా, శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నవారికి కౌన్సెలింగ్‌తో పాటు లీగల్ సలహాలు ఇచ్చేందుకు ఆయా కార్యాలయాల్లోని ఇద్దరు మహిళలకు ‘మార్గదర్శక్’ శిక్షణ ఇస్తున్నారు. 2013లో వచ్చిన ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హరస్మెంట్ యాక్ట్ ప్రకారం ప్రతి కంపెనీలో ఇంటర్నెల్ కంప్లయిట్ కమిటీ(ఐసీసీ)లు ఏర్పాటుచేసినా ఆశించిన తీరులో సత్ఫలితాలు రాకపోవడంతో మార్గదర్శక్‌ను పటిష్టం చేస్తున్నారు. ఒక్కో కంపెనీ నుంచి ఇద్దరు... చాలా కంపెనీల్లో ఐసీసీలు సమర్థంగా పనిచేయడం లేదని తేలింది. మహిళా ఉద్యోగిణులకు వేధింపులు జరిగినా, కష్టం ఎదురైనా చెప్పుకునేందుకు తటాపటాయిస్తున్నారు. అందుకే ఐసీసీ కమిటీల్లో తమకు న్యాయం జరుగడంలేదని అనుకున్నా, ఫిర్యాదు చేస్తే నలుగురికి తెలిసి మరో రకంగా అపార్థం చేసుకుంటారని లోలోన కుమిలిపోతున్న వారు తమ భాధలను మనస్ఫూర్తిగా చెప్పేందుకు ‘మార్గదర్శక్’కి శ్రీకారం చుట్టారు. ఒక్కో కంపెనీ నుంచి ఇద్దరు మహిళా ఉద్యోగిణులను ఎంపిక చేసుకుని వారికి మహిళల చట్టాలపైనా, బాధితులకు ఎలా కౌన్సెలింగ్ ఇవ్వాలి, న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లవచ్చ’నే విషయాలపై ఆయా రంగాల్లో అనుభవజ్ఞులతో ఎస్సీఎస్సీ సహాకారంతో రాచకొండ పోలీసులు శిక్షణ ఇప్పిస్తున్నారు. గత రెండున్నరేళ్ల నుంచి ఇప్పటివరకు సుమారు 80 కంపెనీల నుంచి 160 మందికిపైగా శిక్షణ ఇచ్చారు. మూడు నెలల పాటు షీ టీమ్స్, మహిళా పోలీసు స్టేషన్, భరోసా, షెల్టర్ హోమ్స్ ఉద్యోగులచే ఎనిమిదో మార్గదర్శక్ బ్యాచ్‌కు ట్రైనింగ్ చేశారు. ఈ ట్రైనింగ్ పూరై్తన వివిధ కంపెనీలకు చెందిన 27 మందికి నేరేడ్మెట్లోని రాచకొండ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సర్టిఫికెట్లు శనివారం అందజేశారు. మార్గదర్శక్‌లు యూనిఫామ్‌లో లేని పోలీసులు వివిధ కంపెనీలో పనిచేసే మహిళల భద్రత కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే షీ షటిల్ బస్సులు నడుపుతున్నాం. ఐటీ కంపెనీల్లో పనిచేసే మహిళలకు వేధింపులు ఎదురైన సందర్భంగా మార్గదర్శక్‌లు చక్కటి పరిష్కారం చూపిస్తున్నారు. వాళ్లు యూనిఫామలో లేని పోలీసులు. బాధితురాల్లో మనోస్థైర్యాన్ని నింపడంతో పాటు చట్టపరంగా ఎలా ముందుకు వెళ్లాలో అవగాహన కలిగిస్తారు. ఆత్మహత్యలు తగ్గడంలో వీరిది కీలకపాత్ర ఉంటుంది. ఐసీసీలో న్యాయం జరగదని అనుకుంటే మార్గదర్శక్‌లను సంప్రదించడం మేలు. ఈ విధంగా గత రెండున్నరేళ్ల నుంచి మార్గదర్శక్ ద్వారా వచ్చిన చాలామటుకు ఫిర్యాదుల్లో నిందితులను శిక్షించాం. –మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్ -
దొరికిపోతామనే భయం చాలు.. నేరాలు తగ్గడానికి!
సాక్షి, హైదరాబాద్: రక్షణ, స్త్రీల భద్రత, ట్రాఫిక్ నిర్వహణ, సాక్ష్యాలతో కూడిన పోలీసింగ్, ప్రామాణిక సేవలను రాష్ట్రమంతా ఒకేలా అందించడం.. పోలీసుల లక్ష్యమని, రానున్న ఐదేళ్లపాటు ఈ లక్ష్యాల పూర్తిస్థాయి సాధనకు కృషి చేస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. పార్క్ హయత్‌లో శనివారం ఫిక్కీ మహిళా సంస్థ ఏర్పాటు చేసిన ముఖాముఖిలో ఆయన పాల్గొన్నారు. ఉమెన్ సేఫ్టీ విభాగం ఐజీ స్వాతి లక్రా, ఫిక్కీ చైర్పర్సన్ సోనా చత్వానిసహా వంద మంది మహిళలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాష్ట్ర రక్షణ, భద్రత విషయంలో పలు ప్రశ్నలకు డీజీపీ సమాధానాలిచ్చారు. భయపడితే చాలు... ‘ఉరిశిక్షలు వేస్తే నేరాలు తగ్గవు. కానీ నేరానికి కచ్చితంగా శిక్ష పడుతుంది.. తప్పించుకోలేం అనే భయం నేరస్తుల్లో గుబులు పుట్టిస్తుంది. 24 నుంచి 48 గంటల్లోపే చాలా కేసులను ఛేదించాం. వరంగల్‌లో 9 నెలల పాప అత్యాచారం కేసుతో పాటు అనేక సంచలన కేసుల్లో నిందితులకు శిక్షపడేలా చేయడంలో విజయం సాధించాం. అత్యవసర సేవల నిర్వహణలో భాగంగా సమాచారం అందితే నగరంలో 5 నిమిషాల్లో, సెమీ అర్బన్ ప్రాంతాల్లో 10 నిమిషాల్లో, గ్రామాల్లో 15 నిమిషాల్లో స్పందిం చగలుగుతున్నాం. డిజిటల్ వేదికగా నేరాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో, నేరస్తులను పట్టుకునేందుకు తగిన శిక్షణ పోలీసులకు అందిస్తున్నాం.’అని మహేందర్‌రెడ్డి చెప్పారు ప్రతి పౌరుడూ పోలీసే... ‘70 ఏళ్లలో సాధ్యం కానిది.. ఈ ఐదేళ్లలో సాధించాం. పోలీసు విభాగానికి 11,500 వాహనాలు కొనుగోలు చేసిన ఏకైక రాష్ట్రం మనదే కావచ్చు. రెండు శాతం జనాభా మాత్రమే పోలీసు సేవలను వినియోగిస్తోంది. మిగిలిన 98 శాతం మంది కూడా పన్ను కడుతున్నవారే. వాళ్లు మా దగ్గరికి రారు. అందుకే మేమే వాళ్ల దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. చిన్న చిన్న సమావేశాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యే కార్యక్రమాలను చేపడుతున్నాం. ప్రతి పౌరుడూ పోలీసే.. ప్రతి పోలీసూ పౌరుడే. ప్రజలతో కలసి పనిచేయకపోతే, వాళ్లకు ఉపయోగపడకపోతే మా సేవలకు అర్థం ఉండదు.’అని బదులిచ్చారు. బలప్రయోగం చివరియత్నం.. ‘నేరం జరిగిన తర్వాత కంటే ముందు దాన్ని నిలువరించడమే పోలీసుల సమర్థత. బలప్రయోగం అనేది ఏ ప్రయత్నాలు ఫలించనప్పుడు చివరగా చేసేది. సంతకాల వెరిఫికేషన్ ప్రక్రియలో ఇబ్బందులతో ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ప్రక్రియ సాధ్యం కావటం లేదు. అయితే మన దగ్గర ఫిర్యాదు ఆన్లైన్ ద్వారా తీసుకుని సంతకాలు మాత్రం స్వయంగా వెళ్లి ఇచ్చినప్పుడు కేసు రిజిస్టర్ చేసుకుంటారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలను రెగ్యులరైజ్ చేస్తున్నాం. నగరంలో 4 వేల సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా, అందులో 200 ఏజెన్సీలకే పీఏఎస్‌ఏఆర్‌ఏ లైసెన్స్ ఉన్నాయి. స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు ఇచ్చిన తర్వాత ఏం జరిగిందనేది మూడవ పార్టీ మానిటర్ చేస్తుంటుంది. ఫీడ్ మెకానిజం ఏర్పాటు చేయటంతో సత్ఫలితాలు వస్తున్నాయి. లింగ వివక్ష లేకుండా, సున్నితంగా వ్యవహరించేలా సిబ్బందికి శిక్షణ అందిస్తున్నాం. – స్వాతి లక్రా ముఖాముఖి కార్యక్రమం 10 ఏళ్లుగా నిర్వహిస్తున్నాం. దేశ వ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఏకకాలంలో ఫిక్కీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ఆ రిపోర్ట్‌ను ఆయా ప్రభుత్వాలకు అందజేస్తాం. – సోనా చత్వాని -
‘వాహనాలకు జీపీఎస్,సీసీ కెమెరాలు తప్పనిసరి’
సాక్షి, హైదరాబాద్: త్వరలో హైదరాబాద్‌లోని అన్ని రవాణా వాహనాలకు జీపీఎస్ పరికరాలు తప్పనిసరి చేయనున్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో సేఫ్ సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా మహిళల భద్రతపై డీజీపీ కార్యాలయంలో కీలక సమావేశం జరిగింది. డీజీపీ మహేందర్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పోలీసు అధికారులతోపాటు విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ (ఎల్ అండ్ వో) స్వాతి లక్రా, రవాణ శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మహిళల భద్రత గురించి తీసుకోవాల్సిన అంశాలే కేంద్రంగా ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో అనుమతి ఉన్న కార్లు, ఆటోలు తదితర రవాణా వాహనాలకు జీపీఎస్ సౌకర్యం ఉండాలని రవాణా అధికారులు సూచించారు. నగరంలో సీసీ కెమెరాల సంఖ్యను మరింత పెంచాలని, పలు ప్రజా రవాణా వాహనాల్లోనూ సీసీ కెమెరాలను అమర్చాలని సమావేశం అభిప్రాయపడింది. -
ప్రతి పోలీస్‌స్టేషన్‌లో మహిళా మిత్రలు
సాక్షి, విశాఖపట్నం : ఇకపై రాష్ట్రంలో మహిళలెవ్వరూ పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లకుండానే భద్రత కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. గురువారం విశాఖ ఏయూ కన్వెన్షన్ హాల్లో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా ‘మహిళా మిత్ర’ సేవలను డీజీపీ గౌతమ్ సవాంగ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనితతో కలసి ఆమె ప్రారంభించారు. అనంతరం ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అవగాహన సదస్సులో మాట్లాడారు. వేధింపులకు గురవుతున్న మహిళలు పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేయడానికి భయపడుతున్నారన్నారు. అలాంటి వారు తమ సమస్యలను విన్నవించుకోవడానికి ప్రతి పోలీస్‌స్టేషన్‌లో ఒకరిద్దరు ‘మహిళా మిత్ర’ పోలీసులను నియమిస్తున్నట్లు తెలిపారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఎలాంటి సమస్య ఉన్నా.. మహిళా మిత్రలకు చెప్పిన క్షణం నుంచి దోషులకు శిక్ష పడే వరకు వారు మీకు రక్షణగా ఉంటారని పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో సైబర్ మిత్ర పేరుతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు ఎలాంటి సైబర్ సమస్యలున్నా 9121211100కు వాట్సాప్ చేయాలని సూచించారు. మెసేజ్ చేసిన కొన్ని నిమిషాల్లోనే సైబర్ పోలీసులు ఫోన్ చేసి సమస్య తెలుసుకుంటారన్నారు. త్వరలో సైబర్ నేరాలను నియంత్రించడానికి ‘సైబర్ మిత్ర’ యాప్ కూడా రూపొందిస్తామని, ఒక క్లిక్‌తోనే నేరుగా డీజీపీకి సమాచారం వెళ్తుందని తెలిపారు. సైబర్ నేరగాళ్లను నిరోధించాలి.. సోషల్ మీడియాలో లైంగిక వేధింపులను ఎదుర్కోవడానికి సైబర్ వారియర్స్‌లా పనిచేయాలని మహిళలకు డీజీపీ గౌతమ్ సవాంగ్ పిలుపునిచ్చారు. వలంటీర్‌గా బాధ్యతలు తీసుకుని అందరికీ అవగాహన కల్పించాలని ఏయూ కళాశాల విద్యార్థినులను కోరారు. భయంతో, పిరకితనంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని, కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి వ్యక్తిగత సమాచారాన్ని దోచుకుంటున్న సైబర్ నేరగాళ్లను పూర్తిగా నిరోధించాలన్నారు. రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. మహిళలంతా స్వేచ్ఛగా పోలీసుస్టేషన్‌కి వెళ్లి తమ సమస్యలను చెప్పుకునే విధంగా పోలీస్ మిత్రలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఏయూ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్‌రెడ్డి, డీఐజీ రంగారావు, జిల్లా ఎస్పీ అట్టాడ బాబూజీ, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వాసవి మిత్ర గ్రూప్ కీర్తి, ప్రొఫెసర్ వల్లి కుమారి, ఏయూ విద్యార్థినులు పాల్గొన్నారు. దాడి ఘటనపై విచారణకు ఆదేశించాం: హోం మంత్రి ఎన్ఎమ్సీ బిల్లుకు వ్యతిరేకంగా బుధవారం విజయవాడలో జరిగిన ధర్నాలో జూనియర్ డాక్టర్లపై పోలీసులు చేయిచేసుకోవడంపై విచారణకు ఆదేశించామని హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ‘మహిళా మిత్ర’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ధర్నాలు, ర్యాలీలు చేయదలుచుకుంటే ముందుగా అనుమతి తీసుకోవాలని, శాంతియుతంగా చేపట్టే నిరసనలకు ప్రభుత్వం అనుమతిస్తుందని చెప్పారు. హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. -
ఆధునిక టెక్నాలజీతో బాడీగార్డ్ యాప్స్..
-
బాడీగార్డ్ యాప్స్
నిత్యం మన చుట్టూ ఎన్నో ఊహించని సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్నప్పటికీ వారికి రక్షణ మాత్రం కరువు అవుతోంది. పసి పిల్లల నుంచి వృద్ధురాలి వరకూ దాడులు, అఘాయిత్యాలు నిత్యకృత్యాలయ్యాయి. అలాంటి దారుణ సంఘటనలు వింటుంటేనే విలవిల్లాడిపోతాం. అలాంటి పరిస్థితే మనకు ఎదురైనప్పుడు... ఆ ఆపదలోంచి ఎలా బయటపడాలి? ఆ సమయంలో మన వాళ్లకు ఎలా సమాచారం ఇవ్వాలో తెలియక కంగారుపడిపోతుంటాం. అయితే ఇప్పుడున్న ఆధునిక టెక్నాలజీ సహకారంతో మనం ఎక్కడున్నా, ఎలాంటి ఆపదలో ఉన్నా.. ఆ సమాచారాన్ని మన వాళ్లకు చేరవేసే యాప్స్ చాలా వచ్చేశాయి. ఆ యాప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియోని చూడండి. -
ఆడపిల్లల్ని వేదిస్తే తాట తీస్తారు!
ఆడపిల్ల కనిపిస్తే చాలు వెకిలి చేష్టలు మొదలెడతారు. వెంటపడతారు. వేధిస్తారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు ఎవర్నీ వదలరు. ఒంటరిగా కనిపిస్తే చాలు అఘాయిత్యాలకు పాల్పడతారు.. ఇకపై వారి ఆటలు సాగవు. కన్నెత్తి చూస్తే కుళ్లబొడుస్తారు. మాట జారితే తాట తీస్తారు. ఆడపిల్లల్ని వేధించే వారిపై అపర కాళికలవుతారు. వారే శక్తి టీమ్ సభ్యులు. మహిళల రక్షణ కోసం ఎస్పీ రాజకుమారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా శిక్షణ పొందిన బృందమే ఈ శక్తి టీమ్. ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనగలిగేలా ఈ టీమ్‌ను తయారుచేసి రంగంలోకి దింపారు. ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో ఆకట్టుకుంటూ బైక్‌పై రయ్ మంటూ దూసుకుపోతూ.. విద్యార్థినులు, మహిళలకు అవగాహన కలిగిస్తూ.. తామున్నామనే భరోసా కల్పిస్తున్నారు. సాక్షి, విజయనగరం: ప్రస్తుతం మహిళలపై ఇంటా.. బయటా అఘాయిత్యాలు, దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. ఇంట్లో భర్త రోజూ వేధిస్తున్నా.. బయటి ప్రపంచానికి చెప్పుకోలేని మహిళలెందరో ఉన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో సహ విద్యార్థో.. ఉపాధ్యాయుడో.. అక్కడ పనిచేసే సిబ్బందో శారీరకంగా, మానసికంగా నరకయాతన చూపిస్తున్నా బయటికి చెప్పుకోలేని దుస్థితి. రోడ్లపై వెళ్తుంటే అసభ్యకరంగా ప్రవర్తించే ఆకతాయిలు.. కార్యాలయాల్లో ఇబ్బంది పెట్టే తోటి ఉద్యోగులు ఇలా పురుషుల ద్వారా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరువు పోతుందనో.. సమాజం ఏమనుకుంటుందనో భావంతో బాధిత మహిళలు మౌనంగా ఉండిపోతున్నారు. అలాంటి వారికి అండగా నిలుస్తున్నారు శక్తి టీమ్ సభ్యులు. చట్టాలపై అవగాహన కలిగించి చైతన్యపరుస్తున్నారు. ఫలితంగా.. జిల్లా వ్యాప్తంగా బాధితురాళ్లు తమకు జరిగిన అన్యాయాలపై శక్తి టీమ్‌కు ఫోన్లో సమాచారమందిస్తున్నారు. 24 మందితో టీమ్‌ల ఏర్పాటు ఎస్పీ బి.రాజకుమారి ఈ ఏడాది జూన్ నెలలో శక్తి టీమ్‌లను ప్రారంభించారు. మహిళలపై దాడులను నిరోధించాలనే లక్ష్యంగా శక్తి బృందాలు పనిచేస్తాయి. ఇందుకోసం 24 మంది మహిళా కానిస్టేబుళ్లను పది శక్తి టీమ్‌లుగా ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి సబ్ డివిజన్, డివిజన్ పరిధిలో ఈ టీమ్‌లు పనిచేస్తాయి. స్టేషన్ విధులతో సంబంధం లేకుండా మహిళా చట్టాలపై అవగాహన కల్పించేందుకు.. మహిళలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈవ్ టీజింగ్‌ను అదుపు చేసేందుకు పనిచేస్తాయి. కళాశాలలు, పాఠశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి మహిళా చట్టాలపై అవగాహన కలిగిస్తాయి. శక్తి బృందాలకు మహిళా పీఎస్ డిఎస్పీ పెంటారావు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. కంట్రోల్ రూమ్ సీఐ సుభద్రమ్మ బృందాల పనితీరును పర్యవేక్షిస్తారు. శక్తి బృందాల పనితీరు రోజూ పర్యవేక్షించి, ఎస్పీకీ నివేదికను అదనపు ఎస్పీ ఎం.నరసింహారావు అందజేస్తారు. శక్తి బృందాలకు ప్రత్యేక శిక్షణ కానిస్టేబుళ్లుగా శిక్షణ ఇచ్చే సమయంలోనే శక్తి బృందాల్లో చేరేందుకు ఆసక్తి ఉన్న వారందరూ ముందుకు రావాలని సూచించారు. ముందుకొచ్చిన వారందరికీ ప్రత్యేక శిక్షణ అందజేశారు. వీరికి ప్రత్యేకంగా స్కూటర్, కారు డ్రైవింగ్, ఈత, కరాటే, కుంగ్‌పూ, మహిళలు, చిన్న పిల్లల నేరాలకు సంబంధించిన చట్టాలు, పలు సామాజిక కోణాల్లో సమస్యను పరిష్కరించే విధానాలపై శిక్షణ ఇచ్చారు. దీంతో శక్తి టీమ్ శక్తిమంతమై రంగంలోకి దిగింది. మహిళలు, విద్యార్థినుల ఆనందం శక్తి టీమ్‌లు ప్రారంభమై రెండు నెలలైనప్పటికీ మహిళలు, విద్యార్థినుల మనసులో స్థానం పొందాయి. శక్తి టీమ్‌ల పుణ్యమా అని కళాశాల వద్ద అల్లరిమూకలు కనిపించకపోవడంతో విద్యార్థినులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆయా టీమ్‌ల పరిధిలో ఎక్కడికక్కడ శక్తిటీమ్ డయల్ 100, 121, 1090 లేక వాట్సాప్ నంబర్ 6309898989కి కాల్ చేయమని సూచిస్తున్నారు. సంఘటన స్థలం చెబితే సెకెన్లలో అందుబాటులో ఉండి సమస్యను పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తుండటంతో బాధితుల్లో ధైర్యం పెరిగింది. ఇక సమస్య తీవ్రతను బట్టి ఆ ప్రాంత పోలీస్ స్టేషన్ అధికారి వద్ద సమస్యలను వివరించి, వాటికి కూడా పరిష్కారం చూపించడంతో ఎంతో మంది మహిళలు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు శక్తి టీమ్‌ను అభినందిస్తున్నారు. ఇళ్లల్లో ఎదుర్కొంటున్న సమస్యలను సైతం శక్తి టీమ్‌ల దృష్టికి తీసుకొస్తుండటంతో భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్య పరిష్కరిస్తున్నారు. ఇలా విద్యార్థినులు, మహిళల మనసులో శక్తి టీమ్‌లు చెరగని ముద్ర వేసుకుంటున్నాయి. ఆకట్టుకుంటున్న డ్రస్ కోడ్ ఖాకీ ప్యాంట్, నీలం రంగు షర్ట్, టోపీ, బూట్లతో శక్తి టీమ్ సభ్యులు విదేశీ పోలీసుల్లా ఆకట్టుకుంటున్నారు. వీరు ప్రయాణించే ద్విచక్ర వాహనం ముందు భాగాన పోలీస్ చిహ్నం, ఏపీ పోలీస్, మరో వైపు శక్తి.. మహిళలకు చేరువ.. అనే నినాదాలు ఆకర్షిస్తున్నాయి. మహిళలు ఎక్కువగా ఉండే కూడళ్లు, కళాశాలల జంక్షన్లు, షాపింగ్ మాల్స్, బస్టాండ్ల వద్ద వీరు వారికిచ్చిన షెడ్యూల్ ప్రకారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఎక్కువగా కనిపిస్తారు. శక్తి బృందాల స్వరూపం శక్తి బృందాలు 10 మహిళా కానిస్టేబుళ్ల సంఖ్య 24 శక్తి టీమ్ నంబర్లు 100, 121, 1090 శక్తి వాట్సాప్ నంబర్ 6309898989 విజయనగరం 3 బృందాలు పార్వతీపురం 2 బృందాలు గజపతినగరం 1 బృందం బొబ్బిలి 1 బృందం సాలూరు 1 బృందం కొత్తవలస 1 బృందం గరివిడి 1 బృందం వేటాడుతున్నాం ఆడపిల్లలను కాపాడుకునే అవకాశం మాకు దక్కడం ఆనందంగా ఉంది. బయటి ప్రపంచంలో ఆడపిల్లల విషయంలో ఏం జరుగుతోందనేది పూర్తి అవగాహన ఉంది. సమస్య ఉన్న ప్రతి చోటా అడుగడుగునా వేటాడుతున్నాం. చాలా మంది ప్రత్యేక యూనిఫాంలో మమ్మల్ని చూసి దగ్గరికొచ్చి సమస్య చెబుతున్నారు. – కంది శాంతి, కానిస్టేబుల్, గుర్ల పోలీస్ స్టేషన్ ముందుకొస్తున్నారు శక్తిటీమ్లో పనిచేస్తున్న మమ్మల్ని మహిళలు, విద్యార్థినులు సొంత మనుషుల్లా భావిస్తున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను మా దృష్టికి తీసుకొస్తున్నారు. సమస్య పరిష్కారమైతే ఎంతో కృతజ్ఞత చూపుతున్నారు. రోడ్లపై మా యూనిఫాంలు చూసి వారి సమస్యలను చెప్పుకొనేందుకు ముందుకొస్తున్నారు. – వైఎం లెనీనా, కానిస్టేబుల్, భోగాపురం పోలీస్ స్టేషన్ ధైర్యంగా చెబుతున్నారు ఉద్యోగినులు, కళాశాల విద్యార్థినులు ధైర్యంగా వచ్చి తమ సమస్యలు చెప్పుకొంటున్నారు. తమ ఇబ్బందులను ఇంట్లో వారికి చెబితే చదువులు ఆపేస్తారనే భయంతో విద్యార్థినులు మాకు చెప్పుకొంటున్నారు. దీంతో అధికారుల సహకారంతో వారి సమస్యల్ని పరిష్కరిస్తూ భరోసా కల్పిస్తున్నాం. – పి.అచ్చియమ్మ, కానిస్టేబుల్, జామి పోలీస్ స్టేషన్ ఆనందంగా ఉంది శక్తి టీమ్ ద్వారా విద్యార్థినులకు ఓ నమ్మకం కలిగించాం. వారికి అండగా నిలవడం మాకు ఆనందంగా ఉంది. మా విధుల్లో కొత్తదనం ఉంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కొంతవరకూ అరికడుతున్నామనే సంతృప్తి ఉంది. – ఆర్.దేవి, టూ టౌన్ కానిస్టేబుల్, విజయనగరం నమ్మకం కలిగించాం సహజంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను భర్తలతో సైతం చెప్పుకొనేందుకు ముందుకు రారు. ఇక పోలీసుల దృష్టికి వెళ్తే పరువు పోతుందని భావిస్తారు. కానీ మమ్మల్ని పూర్తిగా నమ్ముతున్నారు. మా యూనిఫాం వేరుగా ఉండటం, పోలీసుల్లా కాకుండా, కుటుంబ సభ్యుల్లా వారితో కలిసిపోతుండటంతో మా వద్దకు వచ్చి సమస్యలు చెబుతున్నారు. వాటి పరిష్కారానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తున్నాం. – టి.యమున, కానిస్టేబుల్, గంట్యాడ పోలీస్ స్టేషన్ ఆత్మ స్థయిర్యం నింపేందుకే.. ఆడపిల్లలు తమ కాళ్లమీద తాము నిలబడాలంటే చదువే ముఖ్యం. ఆ చదువును ఆకతాయి చేష్టల వల్ల మధ్యలో ఆపేయకూడదు. అందుకే వారికి ఆత్మ స్థయిర్యం కల్పించేందుకు శక్తి టీమ్‌ను ఏర్పాటు చేశాం. తొమ్మిది సర్కిల్స్‌లో ఈ టీమ్ పనిచేస్తుంది. అన్ని పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి అవగాహన కల్పిస్తారు. నిఘా వేస్తారు. బస్టాండ్, ఆటో స్టాండ్లలో మహిళలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ వారికి భరోసా కల్పించేందుకు పెట్రోలింగ్ నిర్వహిస్తారు. మగపిల్లలు ఇలాంటి నేరాలకు పాల్పడితే వారి భవిష్యత్తు ఏంటనేది వివరిస్తున్నారు. ఒకసారి కేసు నమోదైతే వారి జీవితం నాశనమైనట్టే. తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. – బి.రాజకుమారి, ఎస్పీ, విజయనగరం -
ఎన్ఆర్ఐ మహిళలు మరింత సేఫ్
సాక్షి, హైదరాబాద్ : విదేశాల్లో వైవాహిక సమస్యలు ఎదుర్కొంటున్న మహిళలకు అన్ని రకాల సాయం అందించేందుకు విమెన్ సేఫ్టీ వింగ్ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్ విభాగం సిద్ధంగా ఉంటుందని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు. బుధవారం లక్డీకాపూల్‌లోని విమెన్ సేఫ్టీ వింగ్‌లో ఎన్ఆర్ఐ విమెన్ సేఫ్టీ సెల్‌ను ఆయన ప్రారంభించారు. ఎన్ఆర్ఐ మహిళలకు ఎదురయ్యే కుటుంబ వేధింపుల పరిష్కారానికి ఎన్జీవోలు కూడా కలిసిరావాలని పిలుపునిచ్చారు. బాధితులకు న్యాయపరంగా సలహాలు, కౌన్సెలింగ్‌తోపాటు చట్టపరంగా ఈ విభాగం అన్ని రకాల సాయం అందిస్తుందని చెప్పారు. నిందితులకు శిక్షపడేలా, బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని వివరించారు. విమెన్ సేఫ్టీ వింగ్ చీఫ్, ఐజీ స్వాతి లక్రా మాట్లాడుతూ.. ఈ విభాగం ఎన్ఆర్ఐ బాధిత మహిళల కేసులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్యాప్తు అధికారులకు తగిన ఆదేశాలు, సూచనలు ఇస్తుందని తెలిపారు. ఎన్ఆర్ఐ వివాహాల్లో ఎదురయ్యే సమస్యల పరిష్కారం, భారతీయులుగా వారికి ఉన్న హక్కులు, చట్టాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. దీనికోసం 14 దేశాల ఎంబసీలు, విదేశాంగ వ్యవహారాల శాఖతో అవగాహన కుదుర్చుకున్నామని వెల్లడించారు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ వైజయంతి మాట్లాడుతూ.. కేసుల నమోదులో డాక్యుమెంటేషన్ చాలా కీలకమైనదని, ఈ విషయంలో తమ ప్రాసిక్యూటర్లు న్యాయసలహాలు అందజేస్తారని తెలిపారు. విమెన్ ప్రొటెక్షన్ సెల్, ఎస్పీ (సీఐడీ) సుమతి మాట్లాడుతూ.. ఈ విభాగం న్యాయనిపుణులతో బాధితులకు పూర్తి న్యాయం చేసేలా పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ పాస్‌పోర్ట్ అధికారి విష్ణువర్ధన్‌రెడ్డి, నీలా ఎన్జీవో ప్రతినిధి మమతా రఘువీర్, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ త్రిపురాన వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీ వాసులకు కేజ్రీవాల్ ప్రభుత్వం భారీ తాయిలాం
-
‘పచ్చ’ పాలనలో.. రెచ్చిన మృగాళ్లు
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా: మహిళా సాధికారత గురించి నిత్యం నీతులు వల్లె వేసే చంద్రబాబు పాలనలో.. మునుపెన్నడూ లేని రీతిలో అతివలపై అకృత్యాలు పెరిగిపోయాయి. రౌడీయిజం చేస్తూ.. తరచూ వార్తల్లోకి ఎక్కే టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారన్న అక్కసుతో.. అధికార దురహంకారంతో.. మహిళా తహసీల్దార్ వనజాక్షి జుట్టు పట్టి ఈడ్చినా చంద్రబాబు పట్టించుకోలేదు. పైగా తప్పంతా అధికారిదేనన్నట్టుగా మాట్లాడారు. విశాఖ జిల్లాలో ఓ స్థల వివాదానికి సంబంధించి దళిత మహిళపై టీడీపీ నేతలు పరమ నీచంగా దాడికి దిగినా ముఖ్యమంత్రి కనీసంగా కూడా స్పందించలేదు. యథా రాజా తథా ప్రజా అన్నట్టు.. ఇదే అదునుగా ఐదేళ్ల టీడీపీ పాలనలో కామాంధులు కూడా అడ్డూ అదుపూ లేకుండా చెలరేగిపోయారు. కామాంధులకు ప్రభుత్వ పెద్దలు అండగా నిలవడంతో.. ఈ ఐదేళ్లలో మహిళలపై అకృత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. నిర్భయ తదితర కఠిన చట్టాలున్నా మృగాళ్లు వెనక్కి తగ్గడం లేదు. కామంతో కళ్లు మూసుకుపోయి మహిళలపై లైంగిక దాడులకు తెగబడ్డారు. దివ్యాంగులు, చిన్నారులు, వృద్ధులన్న కనికరం కూడా లేకుండా పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. ఫలితంగా అమాయక ఆడబిడ్డలు అన్యాయంగా బలైపోతున్నారు. రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లాలో మహిళలపై పెరుగుతున్న లైంగిక దాడులను, దారుణాలను కాగ్ నివేదిక స్పష్టంగా పేర్కొంది. భయాందోళన వ్యక్తం చేసింది. దీనికంతటికీ ప్రభుత్వ నిర్లిప్తత, వారి అవకాశవాద రాజకీయమే కారణమన్నది సుస్పష్టం. ఈ పరిస్థితుల్లో టీడీపీ హయాంలో తమకు రక్షణ ఉందా? బయటకెళ్లిన ఆడపిల్ల క్షేమంగా వస్తుందనే భరోసా ఉందా? రక్షించాల్సిన వాళ్లే భక్షిస్తే అతివలకు భద్రత ఉన్నట్టా? మానప్రాణాలను హరిస్తున్న ఈ పాలకులకా మనం పట్టం కట్టాం? అని మహిళలు భావిస్తున్నారు. చెప్పేదొకటి, చేసేదొకటి టీడీపీ నైజమని మండిపడుతున్నారు. జిల్లాలో మహిళలపై దాడుల కేసులు 2015 : 1,032 2016 : 994 2017 : 1,332 2018 : 1,090 2019 : సుమారు 500 జిల్లాలో దాడులు జరిగాయిలా.. టీడీపీ అధికారంలోకి వచ్చాక జిల్లాలో మహిళలపై దాడులు ఎక్కువైపోయాయి. పలుచోట్ల లైంగిక వేధింపులు చోటు చేసుకున్నాయి. కొన్నింటిలో టీడీపీ నేతల ప్రమేయం కూడా ఉన్న విషయం వెలుగు చూసింది. మహిళా అధికారుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. చెప్పినట్టు వినకపోతే వారిని సరెండర్ చేయడం, బదిలీ చేయడం చేస్తున్నారు. కొందరైతే మహిళా అధికారులని కూడా చూడకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఆమధ్య కత్తిపూడికి చెందిన టీడీపీ నేత, ఎంపీటీసీ సభ్యురాలి భర్త శ్రీనివాస్, మరో ముగ్గురు వ్యక్తులు తొండంగి మండలం తమ్మయ్యపేట వద్ద జాతీయ రహదారిపై ఒక అద్దె ఇంట్లో టీ దుకాణం నడుపుతున్న మహిళపై లైంగికదాడికి యత్నించారు. అడ్డు వచ్చిన ఇద్దరు వ్యక్తులను చితకబాదారు. గ్రామస్తులు గుమిగూడటంతో అక్కడి నుంచి వుడాయించారు. దీనిపై కేసు కూడా నమోదైంది. కొన్ని నెలల క్రితం గొల్లప్రోలు నగర పంచాయతీలో పని చేసిన మహిళా శానిటరీ ఇన్స్పెక్టర్ బి.శివలక్ష్మితో.. మురికి కాలువల్లో చెత్త చెదారాన్ని చేతితో ఎమ్మెల్యే వర్మ ఎత్తించారు. ఆమెను తీవ్రంగా వేధించారు. అంతటితో ఆగలేదు. ఆమెను అక్కడి నుంచి పంపించేశారు. సామర్లకోట వైఆర్ఎల్ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం విద్యార్థినిని రోజూ చాటింగ్ చేయాలని, కోర్కెలు తీర్చాలని, లేకుంటే పరీక్షలో మార్కులు వేయనని అదే కళాశాల అధ్యాపకుడు పితాని నూకరాజు బెదిరించాడు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. 2016లో పిఠాపురం మండలం నరసింగపురంలో మానసిక వికలాంగురాలైన 19 సంవత్సరాల యువతిపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగికదాడికి యత్నించాడు. 2016 ఆగస్టు 19న కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన వృద్ధుడు మూడేళ్ల బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. 2017 జూన్ 23న కిర్లంపూడి మండలం బూరుగుపూడికి చెందిన 14 ఏళ్ల బాలికపై 19 ఏళ్ల యువకుడు లైంగికదాడికి పాల్పడ్డాడు. 2017 డిసెంబర్ 6న చింతూరు మండలం విద్యానగరం ఆశ్రమ పాఠశాల వార్డెన్ లక్ష్మయ్య అదే పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైంది. రాజమహేంద్రవరంలో నలుగురు యువకులు ఓ బాలికను ఆటోలో శివారు ప్రాంతానికి తీసుకెళ్లి, ఓ ఇంటిలో నిర్బంధించి లైంగికదాడికి ఒడిగట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగినిని పరిచయం చేసుకున్న రాజమహేంద్రవరం యువకుడు నమ్మించి, మోసగించి బొమ్మూరు తీసుకువెళ్లి.. స్నేహితులతో కలిసి సామూహిక లైంగికదాడికి పాల్పడ్డాడు. సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారం చేశారు. బాధితులు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందారు. ఇలా చెప్పుకుంటూ పోతే గత ఐదేళ్లలో అనేకమందిపై లైంగిక వేధింపులు, దాడులు జరిగాయి. జిల్లావ్యాప్తంగా గత ఐదేళ్లలో 7 వేలకు పైగా దాడుల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇందులో ఒక్క గ్రామీణ జిల్లాలోనే 5 వేల వరకూ కేసులు నమోదయ్యాయి. వీటిలో 500 వరకూ లైంగికదాడులు ఉన్నాయి. ఆధారాలు లేక నిరూపితం కాని కేసులు వేలల్లో ఉన్నాయి. -
గ్రేటర్.. కాస్త బెటర్!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో మహిళలపై వేధింపుల కేసులు ఏటా పెరుగుతున్నప్పటికీ.. వారి సామాజిక భద్రత విషయంలో దేశంలో పలు మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్ నగరంలో పరిస్థితి కాస్త మెరుగేనని తాజా సర్వేలో వెల్లడైంది. ఐటీ, బీపీఓ, కేపీఓ రంగాల్లో పనిచేసే మహిళల విషయానికి వస్తే సిటీలో జీవన వ్యయం కూడా వారికి భారంగా పరిణమించడంలేదని.. అన్ని వర్గాల వారికీ అందుబాటులోనే ఉందని నెస్ట్అవే అనే రెంటల్ సంస్థ ఆన్లైన్ మాధ్యమంలో నిర్వహించిన తాజా సర్వేలో తేల్చింది. ఈ సంస్థ ప్రధానంగా హైదరాబాద్, పుణే, బెంగళూరు, ఢిల్లీ నగరాలపై మహిళా నెటిజన్ల అభిప్రాయాలు సేకరించి ఈ సర్వే నిర్వహించింది. ఇందులో విద్య, వ్యాపార, వాణిజ్య, సేవా రంగాల్లో పనిచేస్తున్న మహిళల భద్రత విషయంలో హైదరాబాద్ నగరం 4.2 పాయింట్లు సాధించి అత్యంత మెరుగైన స్థానంలో ఉన్నట్లు తెలిపింది. ఆ తర్వాత 4 పాయింట్లు సాధించిన పుణే రెండోస్థానంలో నిలిచిందని పేర్కొంది. మూడోస్థానంలో ఉన్న బెంగళూరు స్కోరు 3.9 పాయింట్లు కాగా.. నాలుగో స్థానంలో నిలిచిన దేశ రాజధాని ఢిల్లీ కేవలం 3.4 పాయింట్లు మాత్రమే సాధించిందని ప్రకటించింది. నగరాల్లో జీవన వ్యయాలు ఇలా.. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లోని హాస్టళ్లలో నివాస వసతి పొందేందుకు ఒక మహిళ సగటున సుమారు రూ.6 నుంచి ఏడు వేలు ఖర్చు చేస్తున్నట్లు ఈ సర్వే తెలిపింది. పుణే నగరంలోలో సగటున రూ.8–9 వేలు, బెంగళూరులో సగటున రూ.9 వేలనుంచి రూ.10వేలు, ఢిల్లీలో రూ.10 వేల నుంచి రూ.12 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు సర్వే పేర్కొంది. -
మహిళల భద్రతకు 3వేల కోట్లు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ, హైదరాబాద్‌తోపాటు 8 మహానగరాల్లో మహిళల భద్రత కోసం కేంద్రం ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటించింది. దీన్లో భాగంగా వివిధ సౌకర్యాల కల్పనకు ‘నిర్భయ’ నిధుల నుంచి రూ.3,000 కోట్లను వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఆపదలో ఉన్నట్లు బాధితులు సమాచారం పంపే ప్యానిక్ బటన్స్, మహిళా పోలీస్ గస్తీ బృందాలతోపాటు ఫోరెన్సిక్, సైబర్ క్రైం నిపుణులతో కూడిన పోలీస్స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. దీంతోపాటు చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాలు, స్మార్ట్ ఎల్ఈడీ వీధి దీపాలను అందుబాటులోకి తేనున్నట్లు హోం శాఖ పేర్కొంది. దేశవ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్న దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. ప్రతిపాదిత చర్యలివీ.. ► మహిళలకు సమగ్ర భద్రతే లక్ష్యంగా ప్రకటించిన ఈ పథకంలో షీ–టీమ్స్ తరహాలో మహిళా పోలీసు గస్తీ బృందాలు, అత్యవసర సమయాల్లో సత్వరమే స్పందించేందుకు ‘అభయం’ పేరుతో పోలీస్ వ్యాన్ల ఏర్పాటు. ► బహిరంగ ప్రదేశాల్లో మహిళలు, చిన్నారులకు భద్రతను కల్పించేందుకు, వారిలో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు నేరాలకు అవకాశమున్న చోట్ల ‘రక్షిత’ ప్రాంతాల అభివృద్ధి, ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటు, సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానిస్తారు. ► ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతా చర్యలు, ఆపదలో ఉన్నప్పుడు పోలీసులను అప్రమత్తం చేసే ప్యానిక్ బటన్లను అమర్చడం, సురక్షిత ప్రాంతాల్లో టాయిలెట్లు, చిన్నారులు, మహిళల కోసం సంచార విశ్రాంతి గృహాల(డార్మిటరీలు)ను అందుబాటులోకి తెస్తారు. ► బాధితులు నిర్భయంగా పోలీస్ స్టేషన్లకు వచ్చి ఫిర్యాదులు ఇవ్వటానికి, తక్షణ సాయం పొందటానికి వీలుగా మహిళా హెల్ప్ డెస్క్‌లు, మహిళా కౌన్సిలర్లు, సైబర్ క్రైం, ఫోరెన్సిక్ నిపుణుల నియామకం. ఏ నగరానికి ఎంత? దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ‘నిర్భయ’ ఘటన నేపథ్యంలో 2013లో కేంద్రం నిర్భయ నిధిని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ప్రకటించిన కార్యక్రమానికి ‘నిర్భయ’ నిధి నుంచి రూ.2,919.55 కోట్లను కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. 2018–19, 2020–21 సంవత్సరాల్లో అమలయ్యే ఈ పథకానికి గాను ఢిల్లీకి రూ.663.67 కోట్లు, ముంబైకి రూ.252 కోట్లు, చెన్నైకి రూ.425.06 కోట్లు, అహ్మదాబాద్‌కు రూ.253 కోట్లు, కోల్‌కతా రూ.181.32 కోట్లు, బెంగళూరుకు రూ.667 కోట్లు , హైదరాబాద్‌కు రూ.282.50 కోట్లు, లక్నోకు రూ.195 కోట్లు కేటాయించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60: 40 నిష్పత్తిలో నిధులు కేటాయిస్తాయి. నేషనల్ క్రైం రికార్డ్స్’ బ్యూరో గణాంకాల ప్రకారం.. 2015లో మహిళలపై దేశవ్యాప్తంగా 3,29,243 నేరాలు జరగ్గా 2016 నాటికి 3,38,954కు పెరిగాయి. -
సేఫ్టీ బటన్
ఓ విద్యార్థిని బస్టాపు వద్ద బస్ కోసం వేచి చూస్తోంది. ఇంతలో కొందరు పోకిరీలు ఆమెను వేధించసాగారు. బాధితురాలు సేఫ్టీ ఐల్యాండ్‌లోని బటన్ నొక్కగానే నిమిషాల్లోనే పోలీసులు వచ్చి ఆకతాయిలను పట్టుకున్నారు. త్వరలో ఇలాంటి వ్యవస్థ ఐటీ సిటీలో మహిళల భద్రతకు ఉపయోగపడనుంది. బనశంకరి: మహిళలకు ఆపద ఎదురైనప్పుడు తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వడానికి కొత్త వ్యవస్థ ఉద్యాననగరిలో రాబోతోంది. కేవలం ఒక టచ్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ‘సేఫ్టీ ఐల్యాండ్’లను నగరంలో అమర్చనున్నారు. దేశంలో మెట్రో నగరాల్లోనే మొదటిసారిగా బెంగళూరులో ఈ ఐల్యాండ్లను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన ప్రాంతాల్లో ఐల్యాండ్‌ను అమరుస్తారు. కేంద్ర ప్రభుత్వ నిర్భయ నిధి కింద 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 40 శాతం నిధులతో ఈ పథకాన్ని అమల్లోకి తీసుకువస్తారు. ఎలా పనిచేస్తుందంటే ♦ ఎంపిక చేసిన ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లో జీపీఎస్ ఆధారిత టచ్, ట్యాప్ ద్వారా పోలీసులకు సమాచారం అందించే ఎలక్ట్రానిక్ పరికరాలను అమర్చుతారు. ♦ మహిళలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలు, అధికంగా ఉన్న కాలేజీలతో పాటు విద్యా సంస్థలు, గార్మెంట్స్, ఐటీ బీటీ కంపెనీలు, ప్రైవేటు కంపెనీల వద్ద ఐల్యాండ్‌ను ఏర్పాటు చేస్తారు. ♦ దీనిని పోలీస్ ప్రధాన కంట్రోల్ రూంతో అనుసంధానిస్తారు. మహిళలపై దాడులతో పాటు ఎలాంటి నేర కార్యకలాపాలు జరుగుతున్నా బాధితులు, ప్రజలు ఐల్యాండ్పై తడితే కంట్రోల్ రూంలో సిగ్నల్ మోగుతుంది. పోలీసులు 2 నుంచి 5 నిమిషాల్లోగా ఘటనాస్ధలానికి చేరుకుంటారు. ♦ పింక్, హోయ్సళతో పాటు గస్తీ వాహనాలను ఈ వ్యవస్థకు కేటాయిస్తారు. ♦ ఎలక్ట్రానిక్ పరికరాన్ని పోకిరీలు దుర్వినియోగం చేయకుండా అక్కడ నాణ్యమైన సీసీ కెమెరాలను బిగిస్తారు. నగర పోలీసుల పథకమే నగరంలో సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో కూడా అధిక సంఖ్యలో సీసీ కెమెరాలను అమర్చి నేర కార్యకలాపాలపై ప్రత్యే నిఘా ఉంచనున్నట్లు అదనపు పోలీస్‌కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. ఎన్నోసార్లు ప్రజల వద్ద మొబైల్, ఇంటర్నెట్ సౌకర్యం ఉండదు, అలాంటి వారికి ఐల్యాండ్ట్యాప్ పరికరం ఎంతో అనుకూలం కానుంది. ఐటీ సిటీలో మహిళల భద్రతకు కోసం ఐల్యాండ్ పథకాన్ని బెంగళూరు పోలీసులు రూపొందించగా, కేంద్రప్రభుత్వం దీనికి ఆమోదం తెలిపిందని సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. బెంగళూరులో ఫలితాలను బట్టి ఇతర నగరాల్లోనూ అమలు చేసే అవకాశముంది. ఆ ఎమ్మెల్సీ జీతం పేదలకే బొమ్మనహళ్లి: ఎమ్మెల్సీలలో తాను అత్యంత శ్రీమంతుడిని అని, అందువల్ల తనకు వచ్చే నెలజీతంతో పాటు ఇతర భత్యాలను అనాథలకు, క్యాన్సర్ రోగులకు అందజేస్తామని జేడీఎస్ ఎమ్మెల్సీ బీఎం ఫారూక్ చెప్పారు. మంగళూరు ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త అయిన ఫారూక్ ఆస్తులు వందల కోట్లలో ఉన్నాయి. ఎమ్మెల్సీగా నెలకు రూ. 1 లక్ష వేతనం, ఇతర ఖర్చుల కింద మరో రూ.లక్ష వస్తుందని చెప్పారు. ఆ నగదును అనాథలకు, క్యాన్సర్ రోగులకు అందజేస్తానని చెప్పారు. -
ప్రియాంక గాంధీకీ ఆ వేధింపులు తప్పలేదు..
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో మహిళలకు భద్రత కరవైందన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ట్వీట్‌కు బీజేపీ దీటుగా బదులిచ్చింది. కథువా ఘటనకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో స్వయంగా ప్రియాంక గాంధీనే వేధింపులకు గురిచేశారని బీజేపీ ప్రతినిధి మీనాక్షి లేఖి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త తనను లైంగికంగా వేధించారన్న మహిళ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆమె ఢిల్లీ పోలీసులను కోరారు. కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగంలో గతంలో పనిచేసిన ఓ మహిళ స్వయంగా తన సహచరుడే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని పోలీసుకు ఫిర్యాదు చేశారని, ఆమె ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆమెకు భద్రత కల్పించాలని మీనాక్షి లేఖి ఢిల్లీ పోలీసులను కోరారు. కాగా మహిళల భద్రత విషయంలో భారత్ అత్యంత ప్రమాదకర దేశాల జాబితాలో ముందుందన్న రాయ్‌టర్స్ సర్వేను ఉటంకిస్తూ రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని తన గార్డెన్లో యోగా వీడియోలు రూపొందిస్తుంటే మహిళలపై లైంగిక దాడులు, హింస విషయంలో దేశం సిరియా, ఆప్ఘనిస్తాన్, సౌదీ అరేబియాలను మించిపోతోందని రాహుల్ ట్వీట్ చేయడం రాజకీయంగా దుమారం రేపింది. -
దేశంలో మహిళలకు రక్షణ కరువు
జహీరాబాద్ టౌన్ : మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలం చెందాయని, మహిళలను పూజించే భారత దేశంలో అత్యాచారాలు, లైంగిక వేధింపుల విషయంలో అగ్రస్థానంలో ఉందని ఎమ్మెల్యే గీతారెడ్డి, పీఏసీ చైర్మన్ గీతారెడ్డి ఆరోపించారు. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో గల ఆమె నివాసగృహంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యుద్దవాతావరణం ఉన్న అప్ఘనిస్తాన్, సిరియా దేశంలో సైతం మహిళలపై అఘాయిత్యాలు జరగడం లేదన్నారు. శాంతి దేశమైన భారత్‌లో మహిళలకు రక్షణ కరువైందని, హత్యచారాలు, వివక్ష, లైంగిక దాడుల్లో అగ్రస్థానంలో నిలవడం శోచనీయమన్నారు. ఈ విషయం ఎన్‌ఆర్‌పీసీ సర్వే ద్వారా వెల్లడైందన్నారు. ఎన్‌ఆర్‌పీసీ నివేదిక ప్రకారం 2016 సంవత్సంలో 15 వేలు, 2017 సంవత్సరంలో 14 వేల నేరాలు జరిగాయన్నారు. నేషనల్ క్రైమ్స్ రిసర్చ్ బ్యూరో వారు ఇచ్చిన గణాంకల ప్రకారం మహిళల వేదింపుల్లో తెలంగాణ రాష్ట్రం దేశంలో రెండవ స్థానంలో నిలిచిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల పట్ల వివక్షత చూపుతుందన్నారు. రాష్ట్ర క్యాబినేట్లో ఒక్క మహిళ కూడా లేరని, మహిళా కమిషన్ కూడా లేదని ఆమె ఆరోపించారు. ఆర్థికాభివృద్ధిలో రాష్ట్ర నంబర్ వన్ స్థానంలో ఉంటే మహిళల వివిక్షలో కూడా రెండవ స్థానంలో నిలవడం విచారకమన్నారు. రాష్ట్రంలోని దళిత గిరిజన ఐఏఎస్ అధికారుల పట్ల ప్రభుత్వం వివక్షత చూపుతుందని ఆమె ఆరోపించారు. సినియర్ ఐఏఎస్ అధికారులను కాదని జూనియర్స్‌కు పదొన్నతులు కల్పిస్తుందన్నారు. టీఎస్ఐపాస్ పాలసిని రూపొందించిన ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్రను ప్రిన్సిపల్ సెక్రటరీగా పొడగించలేక పొయిందన్నారు. ప్రభుత్వ విధానం వల్లే పంచాయతీ ఎన్నికలకు బ్రేక్ పండిదని ఎమ్మెల్యే ఆరోపించారు. బీసీలోని అన్ని ఉపకులాలకు న్యాయం జరిగిలా రిజర్వేషన్ కల్పించి ఎన్నికలకు వెళ్లాలని ఆమె కోరారు. విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మంకాల్ సుభాశ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కండెం నర్సింలు, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల అధ్యక్షులు హన్మంత్‌రావు, పాల్గొన్నారు. -
ఆ సర్వేను తోసిపుచ్చిన మోదీ సర్కార్..
సాక్షి, న్యూఢిల్లీ : మహిళల భద్రతలో భారత్ అత్యంత ప్రమాదకర దేశాల్లో ఒకటని రాయ్‌టర్స్ సర్వే వెల్లడించడాన్ని ప్రభుత్వం తోసిపుచ్చింది. సర్వేలో వెల్లడించిన అంశాలు కేవలం ఒపీనియన్ పోల్ ఆధారంగా చెప్పినవేనని, ఎలాంటి గణాంకాలు, నివేదిక ఆధారంగా వెల్లడించినవి కాదని మహిళా శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆక్షేపించింది. కేవలం 548 మందిని ఆరు ప్రశ్నలు అడగటం ద్వారా ర్యాంకింగ్‌లు ఇచ్చారని, మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి సమాచారం, అభిప్రాయం కోరలేదని పేర్కొంది. జాతీయ మహిళా కమిసన్ (ఎన్సీడబ్ల్యూ) సైతం ఈ సర్వేను తోసిపుచ్చింది. 130 కోట్ల మంది ప్రజలున్న దేశంలో కేవలం కొద్దిమంది అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా వాస్తవ పరిస్థితి ప్రతిబింబించదని పేర్కొంది. మహిళా హక్కుల విషయంలో చాలా దేశాల కంటే భారత్ మెరుగైన స్ధానంలో ఉందని స్పష్టం చేసింది. మరోవైపు మహిళల భద్రతపై రాయ్‌టర్స్ నివేదికను కాంగ్రెస్ సహా విపక్షాలు ప్రస్తావిస్తూ మోదీ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. మోదీ ఖరీదైన మైదానాల్లో యోగాసనాలు వేస్తుంటే దేశ మహిళల భద్రత ఆందోళనకరంగా మారిందన్న సర్వేలు సిగ్గుచేటని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఆరోపించారు. -
మహిళల భద్రత : రాహుల్ విమర్శలు
సాక్షి,న్యూఢిల్లీ: మహిళల భద్రత విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర దేశంగా తయారైందన్న రాయిటర్స్ నివేదికపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో మహిళలకు భద్రత పూర్తిగా కరువైందనీ, హింసాకాండలో అఫ్గనిస్తాన్, సిరియా, సౌదీ అరేబియాలను మించి మరింత ప్రమాదకరంగా మారిందన్న రాయిటర్స్ నివేదికపై ఆయన స్పందించారు. ఈ సందర్బంగా మోదీ ఫిట్నెస్ వీడియోను టార్గెట్ చేసిన రాహుల్ ఈ మేరకు ట్విటర్లో ఒక పోస్ట్ పెట్టారు. మహిళలపై హింస, అత్యాచారాల విషయంలో దేశం ప్రథమస్థానంలో నిలవడం సిగ్గు చేటైన విషయంటూ ప్రధానమంత్రి నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. ప్రధాని అందమైన, సురక్షితమైన పచ్చటి మైదానాల్లో ప్రధాని యోగా వీడియోలను తీసుకుంటోంటే, మహిళలపై అత్యాచారాలు, హింసాకాండలో దేశం ఇతర దేశాలను అధిగమించి పోతోందంటూ మండిపడ్డారు. ఇది దేశానికి ఎంత అవమానకరమంటూ రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు. కాగా భారతదేశంలోలోని మహిళలు ఎక్కువగా లైంగిక హింసకు గురవుతున్నట్టు, మహిళలకు భద్రత లేకుండా పోతోందని థామ్సన్ రాయిటర్స్ ఫౌండేషన్ నిర్వహించిన అంతర్జాతీయ సర్వేలో వెల్లడైంది. అమ్మాయిలను కిడ్నాప్ అయ్యే అవకాశాలు ఎక్కువని తేల్చింది.అంతేకాదు వీటిని నిరోధించడంలో చట్టాలు, న్యాయ వ్యవస్థ విఫలం అయ్యాయని కూడా పేర్కొంది. ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకోవడం, సెక్స్ బానిసలుగా మార్చేయడం, వ్యభిచార కూపంలోకి దింపడం లాంటి కార్యకలాపాలు ఎక్కువని సర్వే తేల్చింది. దేశంలో స్త్రీల భద్రత గతంలో ఎన్నడూ లేని రీతిలో అట్టడుగు స్థాయికి చేరిందని రాయిటర్స్ తెలిపింది. ఏడేళ్ల క్రితం నిర్వహించిన సర్వేలో (2011) భారత్ నాలుగో స్థానంలో ఉంది. 2030 నాటికి మహిళలు, బాలికలు ఎదుర్కొంటున్న హింసను పూర్తిగా అరికట్టాలని స్వేచ్ఛగా బతికేలా వారికి అవకాశం కల్పించాలని మూడేళ్ల క్రితం ప్రపంచ దేశాల నేతలు ప్రతిన బూనారు. కానీ ప్రపంచంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు తమ జీవితంలో ఏదో ఒక సందర్భంలో లైంగిక వేధింపులకు గురవుతున్నారని రాయిటర్స్ అధ్యయనం తేల్చింది. మహిళల భద్రతపై సర్వే తేల్చిన అంశాలపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. -
‘మెట్రో’ల్లో మహిళల భద్రతకు సమగ్ర ప్రణాళిక
న్యూఢిల్లీ: ముంబై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ సహా 8 మెట్రోపాలిటన్ నగరాల్లో మహిళల భద్రతను కట్టుదిట్టం చేసేలా త్వరలోనే సమగ్ర ప్రణాళికను అమలు చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. అత్యవసర ప్రతిస్పందన బృందాలు, పోలీసు ధ్రువీకరణ పొందిన ప్రజారవాణా వ్యవస్థల ఏర్పాటు, పోలీస్‌శాఖలో 33% మహిళా రిజర్వేషన్లు, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, సైబర్ నేరాల నియంత్రణ, మౌలిక వసతుల కల్పన వంటి అంశాలు ఈ ప్రణాళికలో భాగంగా ఉంటాయని వెల్లడించింది. మున్సిపల్ కమిషనర్లు, పోలీస్ కమిషనర్లు, పౌర సమాజం ప్రతినిధులతో పాటు వివిధ రాష్ట్రాల ఉన్నతాధికారులతో బుధవారం నాడిక్కడ సమావేశమైన కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా.. హైదరాబాద్, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, లక్నో నగరాల్లో మహిళల రక్షణకు అనుసరిస్తున్న విధానాలపై సమీక్ష నిర్వహించారు. ఈ భేటీలో ఢిల్లీ పోలీసులు ప్రవేశపెట్టిన ‘హిమ్మత్’ యాప్, హైదరాబాద్ పోలీసులు ప్రారంభించిన ‘హ్యాక్ఐ’, భరోసా కార్యక్రమం, బెంగళూరు పోలీసులు తెచ్చిన ‘సురక్షా’ యాప్, యూపీ పోలీసులు ప్రారంభించిన ‘పవర్ ఏంజిల్స్’ కార్యక్రమంపై చర్చించారు. తొలుత ఈ 8 నగరాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు మహిళల భద్రతపై ప్రణాళికల్ని రూపొందించి ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నేతృత్వంలోని కమిటీలకు పంపుతాయని రాజీవ్ గౌబా మీడియాకు తెలిపారు. వారు పంపిన ప్రణాళికల్ని కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ పరిశీలించి తగిన సూచనలు చేస్తుందన్నారు. -
మహిళల భద్రతపై ఎంపీ సర్కార్ చర్యలు
సాక్షి,భోపాల్: మధ్యప్రదేశ్ ప్రభుత్వం మహిళల భద్రతపై పలు చర్యలు చేపట్టింది. ప్రతి సోమవారం మహిళల భద్రతకు సంబంధించిన అంశాలను సమీక్షించాలని రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. మహిళల భద్రతపై జరిగిన ఉన్నతస్ధాయి భేటీ అనంతరం సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. మహిళలు అర్ధరాత్రి సైతం రోడ్లపై ధైర్యంగా సంచరించే వాతావరణం నెలకొనాలని దీనికి పోలీసులు పూర్తి బాధ్యత తీసుకోవాలని చౌహాన్ ఆదేశించారు. మహిళల భద్రతను పెంచేందుకు అన్ని బస్సుల్లో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ పోలీస్ పెట్రోలింగ్‌ను పెంచాలని సీఎం సూచించారు.దీనికి తోడు బాలికల పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతాల్లో మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. స్కూల్ బస్సుల డ్రైవర్లు, ఆపరేటర్ల పోలీస్ వెరిఫికేషన్‌ను పూర్తిచేయాలని కోరారు.మహిళా రక్షణ చట్టాలపై విరివిగా ప్రచారం చేయాలని అధికారులను కోరారు. -
ఆలయంలో అపచారం
నిర్భయ వంటి చట్టాలు వచ్చినా మహిళల భద్రతకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. నిత్యం ఎక్కడో ఒక చోట మృగాళ్లు రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా ఎంతో ప్రసిద్ధి చెందిన కదిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలోనే ఓ మహిళతో ఓ ఉద్యోగి అసభ్యకరంగా ప్రవర్తించడం కలకలం రేపుతోంది. కదిరి: ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అపచారం జరిగింది. అక్కడ పనిచేసే మహిళా స్వీపర్‌పై అక్కడే పనిచేసే ఓ ఉద్యోగి ఆలయ ప్రాంగణంలోనే అసభ్యకరంగా ప్రవర్తించాడు. కాస్త ఆలస్యంగా వెలుగుచూసిన ఈ సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వారం రోజుల క్రితం ఆలయంలో పని చేసే స్వీపర్ రామలక్ష్మి (పేరు మార్చాము) రోజూ లాగానే ఆలయ ప్రాంగణాన్ని శుభ్రపరచిన అనంతరం అద్దె గదుల్లో చెత్త ఊడుస్తోంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లిన ఆలయ అటెండర్ వెంకటరమణ ఎవరూ లేనిది గమనించి ఆ గదిలోకెళ్లి తలుపునకు గొళ్లెం పెట్టి ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. తనకు జరిగిన అన్యాయాన్ని వెంటనే ఆమె ఆలయ సహాయ కమిషనర్ వెంకటేశ్వరరెడ్డితో పాటు ఆలయ కమిటీ చైర్మన్ నరేంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. అక్కడి ఉద్యోగులకు కూడా విషయాన్ని చెప్పింది. కానీ వారి నుండి పెద్దగా స్పందన రాకపోవడంతో జరిగిన ఘోరాన్ని తన భర్తకు చెప్పి ఆవేదన చెందింది. అన్యాయానికి ఖరీదు కట్టిన టీడీపీ నేత రామలక్ష్మి తనకు జరిగిన అన్యాయాన్ని తన భర్తతో కలిసి స్థానికంగా ఓ టీడీపీ నేత వద్దకు వెళ్లి చెబుతూ కన్నీరు మున్నీరుగా విలపించింది. అయితే అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి కూడా అంతకు ముందే సదరు నేతను కలవడంతో చేసేది లేక అన్యాయానికి వెల కట్టే ప్రయత్నం చేశారు. బాధిత మహిళ ఇక లాభం లేదని నేరుగా పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు జరిగిన అన్యాయాన్ని ఫిర్యాదు రూపంలో ఇచ్చింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ శ్రీలక్ష్మి వెంటనే స్పందిస్తూ నిందితుడిపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. దీంతో నిందితుడు వెంకటరమణపై పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 376, 506, 342 కింద కేసు (క్రైం.నెం314/2017) నమోదు చేశారు. సీఐ శ్రీధర్ ఈ కేసును విచారిస్తున్నారు. అటెండర్‌ను సస్పెండ్ చేశాం ఆలయంలో మద్యం సేవించి స్వీపర్ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఆలయ అటెండర్ వెంకటరమణను అధికారుల ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వరరెడ్డి, ఆలయ సహాయ కమిషనర్ -
కోడై కూసిన మీడియా
మహిళల భద్రతపై ఏపీ స్పీకర్ కోడెల వ్యాఖ్యలను సాక్షి మీడియా వక్రీకరించిందని ఏపీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు కానీ అంత కంటే మిన్నగా జాతీయ, అంతర్జాతీయ మీడియా రిపోర్టు చేయలేదా? ‘ఆడది తిరిగి చెడింది–మగాడు తిరగక చెడ్డాడు’.. ఇది స్త్రీలను ఇళ్లకి కట్టిపడేసేందుకు సమాజం ప్రచారంలో పెట్టిన నానుడి. దురదృష్టవశాత్తూ దీన్ని బలపర్చేవిధంగానేlరాజకీయ నాయకుల వ్యాఖ్యలు ఉంటున్నాయి. ‘మహిళా పార్లమెంట్’ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేసిన వ్యాఖ్యలు దీన్నే నిరూ పించాయి. వాహనాలు బయటకొచ్చినప్పుడు యాక్సిడెంట్లు జరిగే అవకాశాలున్నట్టే స్త్రీలు బయటకొచ్చినప్పుడు అత్యాచారాలూ వేధింపులూ జరుగుతాయనడం, ఇంటి పట్టునుంటే ఆడవాళ్లపై ఎలాంటి అఘాయిత్యాలూ జరగవనడం పై నాను డినే గుర్తు చేస్తున్నాయి. ఓవైపు స్త్రీ సాధికార తను వల్లె వేస్తూ మరోవైపు వాళ్ల సామాజిక జీవితాన్ని వ్యతి రేకించడం ఏలికల నిజస్వరూపాన్ని వెల్లడిస్తోంది. సాధికార స్ఫూర్తిని మింగేసిన ఈ వ్యాఖ్యలపై మీడియా సీరియస్‌గానే స్పందించింది. ‘సాక్షి’ సహా ప్రాంతీయ–జాతీయ పత్రికలూ చానళ్లూ స్పీకర్ వ్యాఖ్యల్ని శీర్షికలు చేశాయి. వాహనంతో ముడిపెట్టి ఆయన ప్రవచించిన మహిళా భద్రతా సిద్ధాంతాన్ని పాఠకుల ముందుంచాయి. స్త్రీల హక్కుల అంశం ఎంతో కొంత చర్చనీయాంశమవుతున్న సామాజిక సందర్భంలో ఈ తరహా కవరేజీ అభినందనీయం. స్త్రీ పురుష సమానత్వం సాకారమయ్యేందుకు మరో 170 ఏళ్లు వేచి ఉండక తప్పదన్న సర్వేలపై తీవ్రంగా స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరగా సమానత్వం వచ్చేందుకు పోరాడాలని ప్రవచించడమే కాకుండా, కోడెల మాటల్లో తప్పు లేదని తేల్చేశారు! ఆయన వ్యాఖ్యల్ని లోకానికి చాటిన మీడియాపై అప్పట్లో బాబు కోపగించు కున్నారు. లక్షలాది కుటుంబాలతో ముడివడిన ‘అగ్రిగోల్డ్’ అంశాల్ని పక్కదారి పట్టించేందుకు గురు వారం అసెంబ్లీలో మళ్లీ కోడెల వ్యాఖ్యల్ని ముందుకు తెచ్చారు. స్పీకర్ మహిళా వ్యతిరేక వ్యాఖ్యల్ని ఉన్నవి ఉన్నట్టుగా అందించిన ‘సాక్షి’ మీడియాపై నిప్పులు కక్కారు. నిజానికి, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ‘ఇండియా టుడే’ ‘దక్కన్ క్రానికల్’ ‘డీఎన్ఏ’ సహా వివిధ పత్రికలూ వెబ్సైట్లూ సైతం స్పీకర్ వ్యాఖ్యల్ని హైలెట్ చేశాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరున్న ‘హఫింగ్టన్ పోస్టు’ సైతం దాన్ని లోకల్వార్తగా కొట్టేపడేసి వదిలేయలేదు. కానీ సీఎం మాత్రం యథాప్రకారం ‘సాక్షి’పై ఎటాక్ చేశారు. కోడెల వ్యాఖ్యలు ‘మహిళా పార్లమెంటు’లో ప్రస్తావనకే రాకపోవడాన్ని తన కథనంలో తొలి వాక్యం చేసుకున్నారు ‘హిందూ’ ప్రతినిధి (తేదీ : 12.2.17). రేపిస్టుల్ని జైళ్లలో పెట్టాల్సిన వాళ్లు ఆడ వాళ్లను కట్టడి చేయడంపై ‘ఆప్’ ఎమ్మెల్యే అల్కా లంబా ఆగ్రహించడం, మంత్రి వ్యాఖ్యల్ని యువ తులు ఖండించడం వంటి విషయాల్ని ఆమె తన కథనంలో వివరించారు. సోషల్ మీడియాలో తీవ్రంగా ఖండన మండనలకు గురైన ఆయన వ్యాఖ్యలు ఆ వేదికపై ప్రస్తావనకే రాకపోవడంలో ఎలాంటి విడ్డూరమూ లేదు. ఏలికలు తమకోసం తాము ఏర్పాటు చేసుకున్న ఇలాంటి కూటముల్లో ప్రశ్నలకూ ప్రస్తావనలకూ చోటివ్వరు. సాధికారత సంగతి అటుంచి, స్త్రీలు ఎదుర్కొంటున్న వేధిం పులపై అవగాహన లేని ‘సర్కారీ పార్లమెంట్’పై వెలువడిన విమర్శనాత్మక వ్యాఖ్యలతో వాళ్లకి పని లేదు. తమ ‘ఖ్యాతి’ని లోకానికి చాటే మీడియా సంస్థ వాళ్లకు ఉండనే ఉంది. అది కోడెల వ్యాఖ్యల్ని కత్తిరించేసి, సాధికార రంగుల స్వపాన్ని కంటికి కట్టే ప్రయత్నం చేసింది. ఆ విధంగా ‘పాజిటివ్’గా ఉండాలంటున్నారు ముఖ్యమంత్రి. అదే జరిగితే మీడియా తన మౌలిక విలువల్ని పూర్తిగా విస్మ రించినట్టే. మహిళల భద్రత గురించి కోడెల శివప్రసాద రావు వ్యాఖ్యలపై సాక్షి మీడియా ఏమని నివేదిం చిందో సరిగ్గా దాన్నే జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, వెబ్ సైట్లు నివేదించాయి. ఇంకా చెప్పా లంటే ఇంతకన్నా ఎక్కువగానే అవి టైటిల్స్‌లో కూడా వ్యంగ్యంగా తీసుకొచ్చాయి. ఆడపిల్లలు గతంలోలాగే హౌస్వై‹ఫ్లా ఉంటే వాళ్ల మీద ఏమీ జరగవు. మహిళలు పని కోసం, చదువుల కోసం బయటకు వెళ్లినప్పుడే వారు ఈవ్‌టీజింగ్, వేధింపు, అత్యాచారం, కిడ్నాప్ వంటివాటికి గురవుతు న్నారు’’ అని కోడెల అన్నట్లు హఫింగ్టన్ పోస్ట్ పేర్కొంది. ఇక thequint.com వెబ్సైట్ అయితే 'How to Avoid Rape? Stay Home Like Parked Car, Says Sexist Minister' అని ఈ వార్తకు టైటిల్ కూడా పెట్టేసింది. (https://goo. gl/YnQfbl). నానా రకాల అణచివేతలు ఎదుర్కొంటూ, అవకాశాల కోసం పెనుగులాడుతూ ఈ స్థాయికి వచ్చిన స్త్రీలు ఇప్పడున్న సవాళ్లనూ అధిగమిస్తారు. ఇంటా బయటా ఎదురవుతున్న యాతనల్ని ఎదు ర్కొంటూ ముందుకే సాగుతారు. (మన స్పీకర్‌కి ఇంట్లో జరిగే అఘాయిత్యాలపై బొత్తిగా అవగాహన లేనట్టుంది) జీవితమంటే ఎదుర్కోవడమే. ఈ క్రమంలో వాళ్లు పడిలేచే కడలి తరంగాలవుతారు. తమ జీవితాలపై పట్టు సాధించుకుంటారు. మనం పరిశీలించదలిస్తే వర్తమాన సమాజంలో ఎటు చూస్తే అటు ఇలాంటి దృశ్యాలే అగుపిస్తాయి. ఏలి కలూ.. మచ్చుకి తుందుర్రు వైపు చూడండి. – వి.ఉదయలక్ష్మి -
మహిళలూ.. కత్తులు తీసుకెళ్లచ్చు!