సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మహిళ భద్రతా విభాగం ఆధ్వర్యంలో పనిచేస్తున్న భరోసా కేంద్రాల్లో బాధితులకు భరోసా మరింత పెంచడంపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి పెట్టారు. భరోసా కేంద్రాలకు సాయం కోసం వచ్చిన బాధితుల నుంచి ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నారు.
లైంగికదాడులు, అత్యాచార కేసుల్లో బాధిత మహిళలు, చిన్నారులకు ఒకే వేదికలో పోలీస్, న్యాయ, వైద్య సాయం అందించేందుకు రూపొందించిన ఈ కేంద్రాల్లో.. సిబ్బంది పనితీరు ఎలా ఉంటోంది? సకాలంలో స్పందిస్తున్నారా? ఎఫ్‌ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారు? భరోసా సెంటర్‌కు అదే రోజు తీసుకెళ్లారా? మీతో లేడీ కానిస్టేబుల్ వచ్చారా? పోలీసులు వారి వాహనంలోనే తీసుకెళ్లారా? భరోసా సెంటర్‌లో సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంది? కేసుల ఫాలోఅప్ సక్రమంగా ఉంటోందా? లైంగిక దాడులకు గురైన చిన్నారుల విషయంలో కేంద్రాల సిబ్బంది సరైన రీతిలో స్పందిస్తున్నారా? సేవల్లో ఇంకేమైనా లోపాలున్నాయా? వంటి ప్రశ్నలు అడుగుతున్నారు.
అంతేకాదు.. బాధిత మహిళలకు మరింత అండగా నిలిచేందుకు ఇంకా ఏయే చర్యలు తీసుకోవాలని సలహాలు, సూచనలు కూడా కోరుతున్నట్లు అధికారులు తెలిపారు. బాధితుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా క్షేత్రస్థాయిలో మార్పులు చేయనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment