సాక్షి, గన్నవరం (కృష్ణా జిల్లా) : తెలంగాణ రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటన యావత్ దేశాన్ని కదిలించిందని ఈస్ట్ జోన్ ఏసీపీ సురేంద్రనాథ్‌రెడ్డి అన్నారు. గన్నవరం పోలీసు స్టేషన్‌లో ఆదివారం సీఐ శ్రీనివాసరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆపద సమయంలో పోలీస్ సహాయం కోసం ఏర్పాటు చేసిన డయల్ 100ను ప్రతిఒక్కరూ వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. డయల్ 100కి కాల్ చేస్తే 4 నిమిషాల్లో ప్రమాద స్థలానికి పోలీసులు చేరుకుంటారని, మొబైల్ ఫోన్‌లో పవర్ బటన్‌ను మూడుసార్లు నొక్కితే కమాండ్ కంట్రోల్ రూంకి సమాచారం వెళుతుందని, మొబైల్ కీపాడ్‌లో 5 లేక 9 నంబర్లను నొక్కి పట్టుకుంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ప్రమాద స్థలాన్ని పోలీసులు గుర్తిస్తారని తెలిపారు.
బ్లూకోట్,రక్షక్ పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని సురేంద్రనాథ్‌రెడ్డి వివరించారు. స్త్రీలకు పోలీసులు ఎప్పుడూ రక్షణగా ఉంటారని, మహిళలకు ప్రత్యేక రక్షణ కోసం సీపీ ద్వారకాతిరుమలరావు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment