వంగవీటి రాధా వర్గీయుల దాడి  | Vangaveeti Radha Follwers Attack On MLA Abbayya Chowdary Car Driver | Sakshi

వంగవీటి రాధా వర్గీయుల దాడి 

Jan 10 2021 10:17 AM | Updated on Jan 10 2021 1:03 PM

Vangaveeti Radha Follwers Attack On MLA Abbayya Chowdary Car Driver - Sakshi

జాతీయ రహదారిపై మోహరించిన అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా వర్గీయులు

సాక్షి, గన్నవరం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హనుమాన్‌జంక్షన్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. హైవేపై అడ్డగోలుగా ఓవర్‌ టేక్‌ చేసినందుకు ప్రశ్నించిన వైఎస్సార్‌ సీపీ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై రాధా అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారుడ్రైవర్‌ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చదవండి: (టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్‌ సి తోచర్‌ రాజీనామా) 


ఒకే కారులో బయలుదేరి వెళుతున్న అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా

వివరాల్లోకి వెళితే.. వేర్వేరు వాహనాల్లో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విజయవాడ వైపు వెళుతున్నారు. హనుమాన్‌జంక్షన్‌ సెంటర్‌ దాటిన తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి చెందిన వాహనాలను వంగవీటి రాధా అనుచరులు ఓవర్‌ టేక్‌ చేసి ముందుకు దూసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వేలేరు క్రాస్‌రోడ్‌ వద్ద అడ్డగోలుగా కారు నడపటంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్, ఆయన అనుచరులపై వంగవీటి రాధా వర్గీయులు వాగ్వివాదానికి దిగారు.

ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధాలకు సీఐ డి.వెంకటరమణ నచ్చజెప్పి అక్కడ నుంచి ఇద్దరిని ఒకేకారులో పంపించారు. ఇంతలోనే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌ చల్లారి గోపీకృష్ణపై వంగవీటి రాధా వర్గీయులు దాడి చేయటంతో తలకు తీవ్ర గాయమైంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌ గోపీకృష్ణ వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో వంగవీటి రాధా అనుచరులపై ఫిర్యాదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement