vangaveeti radha
-
టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చిన దద్దమ్మ..
-
వంగవీటి రంగా ఆశయం తెలుగుదేశం పతనం
-
వంగవీటి రాధాకు తలుపులు క్లోజ్
టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపు ప్రకటనతో ఆగ్రహ జ్వాలలు రగులుకున్నాయి. భుజాలు కందేలా టీడీపీ జెండాలు మోసిన తమను కాదని పారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించడంతో పలువురు నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ తమ ఇమేజ్ను వాడుకుని టికెట్ల వద్దకొచ్చేసరికి మొండి చేయి చూపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాము కష్టపడితే బలంలేని జనసేనకు టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జనసేన టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు సైతం అధ్యక్షా అని పిలిచే అవకాశం లేకపోయిందని నిర్వేదంలో తల్లడిల్లుతున్నారు. తమను కాదని టికెట్లు ఇచ్చారుగా.. వారు ఎలా గెలుస్తారో చూస్తామంటూ రెండు పారీ్టల నాయకులు సవాళ్లు విసురుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితా ప్రకటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన పారీ్టలను కకావికలం చేస్తోంది. ఇప్పటికే రగులుకొంటున్న పొత్తుల మంటలపై టికెట్ల కేటాయింపు మరింత అసంతృప్తికి ఆజ్యం పోసింది. దీర్ఘకాలికంగా పారీ్టకి సేవ చేస్తున్న వారితో పాటు ఇటీవల పారీ్టలో చేరి టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారికి మొండి చెయ్యే మిగిలింది. తిరువూరులో టీడీపీకి షాక్ తిరువూరులో టీడీపీకి షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన ఇన్చార్జి శావల దేవదత్తు పారీ్టకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని అధినేతతో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. కె. శ్రీనివాసరావు టికెట్ల ప్రకటన అనంతరం దేవదత్తును కలి సేందుకు ప్రయతి్నంచగా ఆయన ముఖంచాటేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఎన్నికల సమయానికి పారాచూట్ నాయకులను తీసుకొచ్చి తమ నియోజకవర్గంపై రుద్దడం ఏమిటని తిరు వూరు తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు. కుప్పకూలిన బూరగడ్డ వేదవ్యాస్ పెడన టీడీపీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ హతాశుడయ్యాడు. తనకు టికెట్ లేదని తెలియడంతో కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జిల్లా టీడీపీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది. ఆ రెండు సీట్లపై పీటముడి మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, కేశినేని చిన్ని మధ్య కుర్చీలాట కొనసాగుతోంది. నలుగురికీ ఆశపెడుతూ వస్తున్న చంద్రబాబు చివరికి తమను నట్టేట ముంచుతారని టీడీపీ తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మైలవరం, పెనమలూరు సీట్లను ప్రస్తుతానికి ఎవరికీ కేటాయించకపోవడంతో ఆ నలుగురిలో టెన్షన్ కొనసాగుతోంది. చివరికి బాబుగాని, ఆయన కుటుంబ సభ్యులకు గాని సీటు కేటాయించుకుని ఆశావహులందరికీ హ్యాండ్ ఇస్తారేమోనని వారంతా లోలోన మ«థన పడుతున్నారు. ఆ రెండూ జనసేనకేనా? విజయవాడ వెస్ట్, అవనిగడ్డ సీట్లు జనసేనకు కేటాయిస్తారనేది స్పష్టమైంది. దీంతో విజయవాడ వెస్ట్‌లో రక్తంతో చంద్రబాబుపై అభిమానం చాటిన బుద్దా వెంకన్నతోపాటు జలీల్‌ఖాన్, ఎంకే బేగ్, నాగుల్ మీరా వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. జనసేనకు టికెట్ కేటాయిస్తే పారీ్టపై తిరుగుబాటు చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. అవనిగడ్డలో పార్టీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అయోమయంలో పడ్డారు. చంద్రబాబును నమ్ముకొని తమ కుటుంబ రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసుకున్నానని ఆయన వాపోతున్నట్లు సమాచారం. రాజకీయాలు కళ్ల ముందే మారిపోయాయని, డబ్బు కీలకంగా మారిందని, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందినట్లు ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వంగవీటి రాధాకు తలుపులు క్లోజ్ విజయవాడ సెంట్రల్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు చంద్రబాబు ముఖం చాటేశారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో రాధా ఇమేజ్ను వాడుకున్న ఆయన టికెట్ల కేటాయింపునకు వచ్చేసరికి చెయ్యిచ్చారు. చంద్రబాబు తీరుతో రాధా వర్గం రగిలిపోతోంది. కనీసం విజయవాడ తూర్పులో తమకు అవకాశం ఇస్తారని భావించినా అక్కడ కూడా ఆశలు ఫలించలేదు. దీంతో రాధాకు టీడీపీలో తలుపులు మూసేసినట్టే అన్నది స్పష్టమైంది. విజయవాడలో మంచి పట్టు ఉన్న వంగవీటి కుటుంబాన్ని చంద్రబాబు కూరలో కరివేపాకులా తీసిపడేశారని ఆయన అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పులో అంబశెట్టి వాసు, బత్తిన రాములు జనసేన తరఫున టికెట్ ఆశించారు. టికెట్ల ప్రకటన వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరో సారి చంద్రబాబు కాపులను మోసం చేశారని వారు మండిపడుతున్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు. టికెట్ల కేటాయింపు ఇలా... ఎనీ్టఆర్ జిల్లాలో... విజయవాడ సెంట్రల్లో బొండా ఉమా, విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), తిరువూరులో కె. శ్రీనివాసరావుకు సీట్లు కేటాయించారు. మైలవరం, విజయవాడ వెస్ట్ సీట్లను ఎవరికీ కేటాయించలేదు. కృష్ణా జిల్లాలో... మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గుడివాడలో వెనిగండ్ల రాము, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పామర్రులో వర్ల కుమారరాజాకు టికెట్లు కేటాయించారు. అవనిగడ్డ, పెనమలూరు టికెట్లను పెండింగ్‌లో ఉంచారు. -
రాధా Vs ఉమ కోల్డ్ వార్: విజయవాడలో హీట్ పాలిటిక్స్
సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పొలిటికల్ కోల్డ్ వార్ గట్టిగానే నడుస్తోంది. సోషల్ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోస్టుల దాడులు చేసుకుంటున్నారు. దీంతో, పచ్చ బ్యాచ్ రాజకీయం రచ్చగా మారింది. తాజాగా విజయవాడ సెంట్రల్ టీడీపీలో వార్ మొదలైంది. వివరాల ప్రకారం.. విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ సెంట్రల్ సీటు విషయంలో ఇరు వర్గీయుల మధ్య పొలిటికల్ ఆధిపత్య పోరు ముదురుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు చేసుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల కిందటే పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. అయితే, ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బోండా ఉమా వర్గానికి టార్గెట్‌గా కౌంటర్ పోస్టులు పెట్టింది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్ పోస్టులు సోషల్ మీడియా కనిపించాయి. కాగా, రాధా వర్గమే ఇలా చేసినట్లు బోండా ఉమా వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఇక, ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమా, రాధా వర్గాల కోల్డ్ వార్తో రాజకీయం రసవత్తరంగా మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. -
సెంట్రల్లో వంగవీటి రాధకు దెబ్బేస్తారా ?
రాజకీయ దురదృష్టవంతుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి రాధాకృష్ణ మాత్రమే.. అయన ఎప్పుడూ అవకాశానికి ఆమడ దూరంలో.. దురదృష్టానికి అంగుళం దగ్గరలో ఉంటూ వస్తున్నారు. అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా కృష్ణ మళ్ళీ ఈ ఇరవయ్యేళ్లలో ఎన్నడూ గెలుపు ముఖం చూడలేదు. 2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తరువాత గెలుపు అనేది ఆయనకు దూరమైంది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. అప్పట్లో వైఎస్ జగన్ ఎంపీ స్థానం ఆఫర్ చేస్తే కాదని.. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు రాధా వైఎస్సార్సీపీని కాదని టీడీపీలో చేరారు. అక్కడ చేరేవరకూ అబ్బో.. బ్రహ్మాండం.. వీరుడు.. సూరుడు అంటూ బాజాలు మోగించిన తెలుగుదేశం నాయకులూ.. క్యాడర్ .. ఆఖరుకు టీడీపీకి వత్తాసు పలికే మీడియా సైతం ఆయన చివరకు టీడీపీలో చేరాక ప్లేటు ఫిరాయించారు. అయన గెలవలేదని, క్యాడర్ లేదని.. సమర్థత.. సత్తా సరిపోదని చెప్పి టికెట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు. చేరేవరకు ఓడ మల్లయ్య అని పిలిచి గట్టు ఎక్కాక బోడి మల్లయ్య అనడం టీడీపీకి, చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమాకు టిక్కెట్ ఇచ్చారు.. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు గెలవడంతో ..ఇక రాధా కూడా చేసేదేం లేక ఊరుకున్నారు. చదవండి: అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది! అప్పట్నుంచీ అసంతృప్తితో టీడీపీలో సైలెంట్‌గా ఉన్నా ఉన్నా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాధా మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. తన పాత కాంటాక్ట్స్, క్యాడర్ ను సమీకరించి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతోబాటు ఆయనకు సెంట్రల్ టికెట్ కూడా ఇస్తామని చంద్రబాబు, లోకేష్ సైతం హామీ ఇచ్చినట్లు రాధా అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయనకు టిక్కెటి వస్తుందన్న భయంతో బోండా ఉమా చేస్తున్నారో.. లేక లోకేష్.. చంద్రబాబు సహకారంతో టీడీపీ క్యాడర్ చేస్తున్నారో ఏమో కానీ రాధకు స్థిరం లేదని. పార్టీలు మారుతుంటారని.. ఇలా అయన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బ తీస్తూ టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. రాధకు రాజకీయ స్థిరత్వం లేదని, అయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని, ఇంకా అయనకు సొంత క్యాడర్ లేదని, అంతా డైల్యూట్ అయిపోయిందని, ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం అని.. అందుకే టీడీపీ వేరే అభ్యర్థిని ఆంటే అంతిమంగా బోండా ఉమకు టిక్కెట్ ఇవ్వాలన్నట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదంతా కేవలం బోండా చేస్తున్నదే అని వంగవీటి రాధా అనుచరులు గుర్రుమంటున్నారు. లేదని .. చంద్రబాబు మద్దతుతోనే బోండా ఇలా రెచ్చిపోతున్నాడని కొందరు అంటున్నారు. కొంగ నక్క ఒకరినిఒకరు మోసం చేసుకున్న రీతిన చంద్రబాబు ఇలా రాధాలో అసలు కల్పించి చివరకు వట్టి చెయ్యి చూపడం అలవాటేనని రాధా అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. - సిమ్మాదిరప్పన్న -
వంగవీటి వీరాభిమాని ద్వారంపూడి.. రంగా బావమరిది కీలక వ్యాఖ్యలు
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం దివంగత వంగవీటి మోహన్ రంగారావుతోనే మొదలైంది. ఆయన అభిమానం అప్పటి నుంచి ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చంద్రశేఖరరెడ్డి కాపు వ్యతిరేకి అనడం పచ్చి అబద్ధం. తప్పుడు ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదు.’ అని వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ స్పష్టంచేశారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ బహిరంగ సభలో ద్వారంపూడిపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నుపాటి శ్రీనివాస్ స్వచ్ఛందంగా స్పందించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. కాకినాడలో రంగా తొలి సభ పెట్టింది ద్వారంపూడి నాకు 1985, 86ల నుంచే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో పరిచయం ఉంది. అప్పటికే వాళ్ల ఫ్యామిలీ చాలా రిచ్. రైస్ మిల్లులు, సినిమా థియేటర్స్ ఇవన్నీ ఉండేవి. అప్పటికే రంగాకు ఆయన స్ట్రాంగ్ ఫాలోయర్. రంగా అభిమానిగా తిరిగిన ద్వారంపూడి ఆయన ద్వారానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1988లో ఎవరూ ధైర్యం చేయని రోజున కాకినాడ ప్రాంతంలో భారీ స్థాయిలో ర్యాలీ పెట్టి వంగవీటిని తీసుకెళ్లి అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించారు. బహుశా అప్పటి నుంచి ఇప్పటివరకు అంతపెద్ద బహిరంగ సభ ఎప్పుడూ జరిగి ఉండదు. అంతటి వీరాభిమాని చంద్రశేఖరరెడ్ది. వంగవీటి తదనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఫాలో కావడం, రాజకీయంగా ఎదగడం జరిగింది. మూడున్నర దశాబ్దాలుగా పరిచయమున్న చంద్రశేఖరరెడ్డి గురించి, వాళ్ల కుటుంబం గురించి పూర్తిగా తెలుసు. ఆయనపై ఆరోపణలన్నీ రాజకీయపరమైనవి, పొంతనలేనివిగానే కనిపిస్తున్నాయి. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఏదైనా తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఎవరో చెబితే విని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా పూర్తిగా దూరంగా ఉన్నాను కాబట్టి నేను రాజకీయంగా వాటి గురించి కామెంట్ చేయలేను. కానీ, చంద్రశేఖరరెడ్డి విషయం గురించి వస్తే మాత్రం నాకు ఆయన విషయాలు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. రంగా అభిమానిగా మొదలైన ద్వారంపూడి రాజకీయ ప్రస్థానంలో కాపు వ్యతిరేకి అనేది పూర్తిగా అవాస్తవం. అలాంటి ఉద్దేశాలు ఉన్న రాజకీయ నాయకుడు కూడా కాదు. వెరీ ఫెయిర్ పొలిటీషియన్ 1985 నుంచి ఈ రోజు వరకు వంగవీటి అభిమానిగానే కొనసాగుతున్నాడు. మా బావగారు చనిపోయి ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతున్నా... ఇంకా మా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నాడు. ఇది కూడా చదవండి: గడప గడపకు.., జగనన్న సురక్షపై సీఎం జగన్ సమీక్ష -
కృష్ణా జిల్లాలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
విజయవాడ సీపీ కాంతి రాణా టాటా: రాధా భద్రతపై ఎలాంటి ఆందోళన అవసరం లేదు
-
ఒక్కసారి పునరాలోచించు రాధా!
-
నా హత్యకు కుట్ర.. వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కృష్ణా జిల్లా: తన హత్యకు కుట్ర పన్నారంటూ వంగవీటి రాధా సంచలన ఆరోపణలు చేశారు. హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించారని వ్యాఖ్యనించారు. గుడ్లవల్లేరు మండలం చినగొన్నురు గ్రామంలో దివంగత వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వారిని చూసి భయపడను. ప్రజల్లోనే ఉంటా. నాపై రెక్కీ చేసిన వారి పేర్లు త్వరలోనే బయటకొస్తాయని’’ వంగవీటి రాధా అన్నారు. చదవండి: ఊ అంటావా బాబూ.. ఉఊ అంటావా.. -
వంగవీటి రాధా వర్గీయుల దాడి
సాక్షి, గన్నవరం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హనుమాన్‌జంక్షన్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. హైవేపై అడ్డగోలుగా ఓవర్ టేక్ చేసినందుకు ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై రాధా అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారుడ్రైవర్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చదవండి: (టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ రాజీనామా) ఒకే కారులో బయలుదేరి వెళుతున్న అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా వివరాల్లోకి వెళితే.. వేర్వేరు వాహనాల్లో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విజయవాడ వైపు వెళుతున్నారు. హనుమాన్‌జంక్షన్ సెంటర్ దాటిన తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి చెందిన వాహనాలను వంగవీటి రాధా అనుచరులు ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వేలేరు క్రాస్‌రోడ్ వద్ద అడ్డగోలుగా కారు నడపటంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్, ఆయన అనుచరులపై వంగవీటి రాధా వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధాలకు సీఐ డి.వెంకటరమణ నచ్చజెప్పి అక్కడ నుంచి ఇద్దరిని ఒకేకారులో పంపించారు. ఇంతలోనే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ చల్లారి గోపీకృష్ణపై వంగవీటి రాధా వర్గీయులు దాడి చేయటంతో తలకు తీవ్ర గాయమైంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ గోపీకృష్ణ వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో వంగవీటి రాధా అనుచరులపై ఫిర్యాదు చేశారు. -
రంగాను చంపింది వాళ్లే: వంగవీటి నరేంద్ర
సాక్షి, విజయవాడ: ఈ ఏడాదే వంగవీటి రంగా మొదటి వర్ధంతి అని బీజేపీ నేత వంగవీటి నరేంద్ర అన్నారు. తన తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధ ఎప్పుడైతే చేరారో.. అప్పుడే వంగవీటి రంగా నిజంగా చనిపోయారని ఉద్వేగానికి గురయ్యారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని వంగవీటి నరేంద్ర అన్నారు. రంగాను చంపింది మనుషులు కానీ.. పార్టీ కాదు రాధా బాబు అనడం.. రంగ-రాధా అభిమానులు జీర్ణించుకోలేక పోయారన్నారు. టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లిన వంగవీటి రాధాను మండపేటలో రంగా అభిమాన సంఘాలు వ్యతిరేకించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా వంగవీటి రంగాను చంపింది టీడీపీ నాయకులేనని రాధా తెలుసుకోవాలని నరేంద్ర విఙ్ఞప్తి చేశారు. కాగా వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. -
కేశవరంలో రాధాకు పరాభవం
కేశవరం (మండపేట): విజయవాడ తూర్పు మాజీ ఎమ్మెల్యే, కాపు నేత స్వర్గీయ వంగవీటి రంగా తనయుడు రాధాకు మండపేట మండలం కేశవరంలో ఘోరపరాభవం ఎదురైంది. బుధవారం రాత్రి మండపేట టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు మద్దతుగా కేశవరం వచ్చిన ఆయనను స్థానికులు అడ్డుకున్నారు. ‘రాధాకృష్ణ గో బ్యాక్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. పరిసితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా సిట్టింగ్ ఎమ్మెల్యే వేగుళ్లకు మద్దతుగా బుధవారం రాధా నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కపిలేశ్వరపురం మండలంలో ప్రచారం ముగించుకుని రాత్రి సమయంలో కేశవరం వచ్చారు. కేశవరంలో రాధా రాకను వ్యతిరేకిస్తున్న ఆందోళనకారులు అప్పటికే రాధా వస్తున్న విషయం తెలుసుకున్న స్థానిక కాపు సామాజిక వర్గీయులు అధిక సంఖ్యలో గ్రామంలోని పంచాయతీ కార్యాలయం సమీపంలోకి చేరుకున్నారు. రాధా కాన్వాయి గ్రామంలోకి వస్తున్న సమయంలో అడ్డుకున్నారు. తండ్రిని చంపిన పార్టీలో చేరి, ఆ పార్టీకి మద్దతుగా ఎలా ప్రచారం చేస్తున్నావంటూ మండిపడ్డారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో అనపర్తి, రామచంద్రపురంల నుంచి అదనపు బలగాలను రప్పించారు. మండపేట రూరల్ సీఐ లక్ష్మణరెడ్డి ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీసులతో గ్రామస్తులు తీవ్ర వాగ్వివాదానికి దిగారు. రూరల్ సీఐ లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవడం సరికాదని ఆందోళనకారులకు నచ్చజెప్పారు. రాధాను అక్కడి నుంచి రాజమహేంద్రవరం వైపు పంపించివేశారు. మీరు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదు: రాధామీరు నా మీద ఎంత ద్వేషం పెంచుకున్నా ఫర్వాలేదని, అంతే ప్రేమ, ఆప్యాయత, అనురాగం రంగా మీద చూపించాలని, అది తనకు చాలని రాధా పేర్కొన్నారు. అక్కడి నుంచి ఆయన కాన్వాయిలో ముందుకు వెళ్లిపోయారు. -
నీ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది
చిత్తూరు, పుత్తూరు: ‘నీ తండ్రి ఆత్మ ఘోషిస్తోంది.. టీడీపీ తీర్థం పుచ్చుకుని నీ తండ్రి వంగవీటి రంగా ఆత్మబలిదానాన్ని శాశ్వతంగా చెరిపేశావు.. చరిత్ర హీనుడిగా మిగిలిపోయావు..నీ స్వార్థం కోసం, నీ పదవీకాంక్ష కోసం మొత్తం కాపుజాతినే పణంగా పెట్టావు’ అని విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాపై వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే కళత్తూరు నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన పట్టణంలో విలేకరులతో మాట్లాడుతూ వంగవీటి రంగా తాను నమ్మిన సిద్ధాంతా లు, ఆశయాల కోసం, కాపుజాతి చైతన్యం కోసం టీడీపీపై జీవితమంతా పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలోనే అప్పటి టీడీపీ ఉన్మాదుల చేతిలో బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రిని చంపించిన టీడీపీలో చేరడమే కాకుండా వంగవీటి రంగా హత్యకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏ విధమైన సంబంధం లేదని చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. 30 ఏళ్ల తరువాత వంగవీటి రాధా కళ్లకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భగవంతుడులాగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పదవుల కోసం వంగవీటి రాధా దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.వంగవీటి రాధా టీడీపీలో చేరడంతో కాపుజాతి మొత్తం కన్నీళ్లు పెట్టుకుంటోందన్నారు. ఈ రోజు రెండోసారి వంగవీటి మోహన్‌రంగాని హత్య చేసినట్లు తన మనసు బాధపడుతోందన్నారు. మాయలోడు చంద్రబాబు చంద్రబాబు టక్కుటమారా గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలతో మరోసారి రాష్ట్ర ప్రజానీకాన్ని మోసం చేయడానికి వస్తున్నారని ఎమ్మెల్యే నారాయణస్వామి హెచ్చరించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలను చంద్రబాబునాయుడు అమలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఐదేళ్లు రాష్ట్ర ప్రజలను మోసం చేసి ఇప్పుడు ఓట్లు కొనుగోలు చేసేందుకు నక్క తెలివితేటలు ప్రదర్శిస్తున్నారని విరుచుకుపడ్డారు. పింఛన్ల పెంపు, డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయం ఇన్నేళ్లు ఎందుకు అమలు చేయలేదో రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును నిలదీయాలని పిలుపునిచ్చారు. త్వరలోనే ఇంటికి ఒక కేజీ బంగారం ఫ్రీగా ఇచ్చేస్తానని చంద్రబాబునాయుడు జీవో ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని ఆయన ఎద్దేవా చేశారు. మాయలోడు మాటలు నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బండి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. -
వంగవీటి రాధా చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు
-
‘వంగవీటి రాధా చంద్రబాబు ట్రాప్‌లో పడ్డారు’
సాక్షి, విజయవాడ : మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి ట్రాప్‌లో పడ్డారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి పేర్ని నాని అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాధా మాటలతో లక్షలాది రంగా అభిమానుల కంట నీళ్లు తిరిగాయన్నారు. చంద్రబాబును రాధా నమ్మటం బాధాకరమన్నారు. సింహం కడుపున పుట్టిన రాధా.. చంద్రబాబు అనే నక్కకు కుందేలుగా దొరికారని వ్యాఖ్యానించారు. వంగవీటి రాధాకు వైఎస్సార్ సీపీ సముచిత స్థానం ఇచ్చిందన్నారు. వైఎస్సార్ సీపీ రాధాకు యువజన విభాగం అధ్యక్షుడిగా స్థానం కల్పించిందని తెలిపారు. రంగా విగ్రహావిష్కరణకు వెళ్లొద్దని ఏనాడూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పలేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఎక్కడికెళ్లినా పార్టీ క్యాడర్‌ను కలవాలని, బాబు దుర్మార్గ పాలనను అంతమొందించాలంటే అధికారంలోకి రావాలనే వైఎస్ జగన్ చెప్పారన్నారు. రాధాతో మాట్లాడేందుకు ఆయన ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదని పేర్కొన్నారు. వంగవీటి రంగా హత్యకు టీడీపీనే కారణమని అందరికి తెలుసన్నారు. వంగవీటి రంగా హత్య టీడీపీ గూండాలే చేశారంటూ పాట కూడా ఉందన్నారు. రాధాకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదనటం సరికాదన్నారు. రాధాకు ప్రాధాన్యత ఇచ్చినందుకే దేవినేని నెహ్రూ పార్టీలో చేరలేదని తెలిపారు. ఆనాడు రాధా వద్దన్నారనే దేవినేని నెహ్రూను వైఎస్సార్ సీపీలో చేర్చుకోలేదని చెప్పారు. -
విజ్ఞత లేకుండా మాట్లాడుతున్న చంద్రబాబు
- వైఎస్సార్ సీపీ నేత వంగవీటి రాధా - సీఎం హుందాగా వ్యవహరించాలి - శాంతి భద్రతల అంశంలో పట్టుకోల్పోయారు - ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి సీఎంను తిట్టినా పట్టించుకునే పరిస్థితి లేదు - రాజధానిలో కులమతాల పేరిట కల్లోలం సృష్టించే అవసరం మాకు లేదు సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడలో రంగాపై వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం చంద్రబాబు హుందాగా ఉండాల్సిందిపోయి ఏం జరిగిందో తెలుసుకోకుండా, కనీసం విజ్ఞత కూడా లేకుండా మాట్లాడారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ నిప్పులు చెరిగారు. విజయవాడలోని పార్టీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘శాంతి భద్రతల సమస్యలు, కులమతాల మధ్య చిచ్చు గురించి నిన్నటి రోజు (మంగళవారం) చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు. ఓ మాజీ ఎమ్మెల్యేను పోలీసులు రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారని, దీనికి సంబంధించి అధికారుల తీరుపై సీఎం కనీసం స్పందించకపోవడం దారుణం. శాంతి భద్రతల బాధ్యతలను సీఎం గాలికొదిలేశారు. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై చర్యలు తీసుకోవాలి..’ అని వంగవీటి రాధా డిమాండ్‌చేశారు. అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై కమిషనర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు రాధా చెప్పారు. రంగా అభిమానులు సంయమనం పాటించాలని కోరేందుకు తాను ప్రెస్‌మీట్ పెట్టాలని భావిస్తే.. మొదట అనుమతించిన పోలీసులు తర్వాత వెంటనే అడ్డుకున్నారని, ఎవరి ఆదేశాలతో తమను అడ్డుకున్నారని ప్రశ్నించారు. ఎవరు తప్పుచేసినా మా పార్టీ ఉపేక్షించదు.. తమ పార్టీలో ఎవరు తప్పుచేసినా చర్యలు తీసుకుంటారని, ఒక నేత రంగాను కించపరిచేలా మాట్లాడితే వెంటనే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చర్యలు తీసుకున్నారని తెలిపారు. కానీ టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు ఎన్ని తప్పులుచేసినా చర్యలు తీసుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. ‘ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ముఖ్యమంత్రినే తిడితే పట్టించుకోలేని పరిస్థితి చంద్రబాబుది. అధికారులపై కొందరు ప్రజాప్రతినిధులు దాడులకు దిగినా ఏమీ అనలేని దుస్థితి టీడీపీది. మా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంది. అందుకే శిల్పా చక్రపాణిరెడ్డిని ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించి పార్టీలో చేర్చుకున్నారు. కానీ టీడీపీలో ఆ పరిస్థితి లేదు. అయినా చంద్రబాబు మా పార్టీ గురించి మాట్లాడం హాస్యాస్పదంగా ఉంది’ అని రాధా అన్నారు. దమ్ముంటే విచారణ జరిపించండి.. ‘నేను ప్రెస్‌మీట్ పెట్టడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. ఒక మహిళ, మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా రత్నకుమారిని రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే.. ఆ రోజు ఏం జరిగిందనే విషయంపై విచారణ జరపాలి. అత్యుత్సాహం ప్రదర్శించిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. మాపట్ల దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై త్వరలో మానవ హక్కుల సంఘం, బార్ కౌన్సిల్లో ఫిర్యాదుచేస్తాం. అవసరమైతే న్యాయపోరాటానికి వెనుకాడం’ అని రాధా స్పష్టంచేశారు. కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం మాకు లేదు.. రాజధానిలో శాంతిభద్రతల సమస్య, కులమతాల చిచ్చుపై సీఎం మాట్లాడుతున్నారని.. ఎన్నో ఏళ్లుగా విజయవాడలో ఉంటున్నామని, కుల రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని రాధా చెప్పారు. శాంతిభద్రతలు అదుపు చేయలేని వ్యక్తికి సీఎంగా కొనసాగే అర్హత ఉందా.. అని ప్రశ్నించారు. సమావేశంలో ప్రకాశం జిల్లా పర్చూరు, విజయవాడ తూర్పు నియోజకవర్గాల సమన్వయకర్తలు గొట్టిపాటి భరత్, బొప్పన భవకుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు బి.విజయ్‌కుమార్, చందన్ సురేష్, జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కాజ రాజకుమార్, కార్పొరేటర్లు దామోదర్, ఝూన్సీలక్ష్మి, సుజాత, మాజీ కార్పొరేటర్ అడపా శేషు తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకు కామన్ సెన్స్ లేదు: రాధా
-
వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోం: రాధా
విజయవాడ: దివంగత నేత వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు బాధపడ్డారని తెలిపారు. రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌతం రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రంగా అభిమానులు ఎవరూ బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. రెండు హత్య కేసులతో గౌతంరెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ల్యాండ్ మాఫియాతోనూ ఆయనకు ప్రమేయముందని రాధా ఆరోపించారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికి నిన్న (ఆదివారం) ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మహిళ, మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా రత్నకూమారిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారని, ఈ ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కొంతమంది పోలీసుల అతివల్లే నిన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. గౌతంరెడ్డిని సస్పెండ్ చేస్తూ మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని రాధా సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అన్ని వర్గాల కోసం వంగావీటి రంగా పనిచేశారని అన్నారు. చనిపోయిన వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన సూచించారు. -
వర్మను వెంటాడుతున్న వంగవీటి వివాదం
-
వర్మను వెంటాడుతున్న వంగవీటి వివాదం
వంగవీటి చిత్రంతో విజయవాడ రౌడీయిజాన్ని మరోసారి తెరమీదకు తెచ్చిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై వంగవీటి రాధ విజయవాడ క్రిమినల్ కోర్టులో కేసు వేశారు. వంగవీటి కుటుంబ సభ్యుల అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను తెరకెక్కించారని, సినిమా కారణంగా తమ పరవుపోయిందని వంగవీటి రాధ కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు విజయవాడ క్రిమినల్ కోర్టులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో పాటు నిర్మాత దాసరి కిరణ్‌పై కేసు వేశారు. తమ పేరును సినిమా టైటిల్ గా పెట్టి తమ పరువు తీశారని, సినిమాలో తమ కుటుంబానికి సంబంధం లేని అంశాలను చిత్రీకరించారని పేర్కోన్నారు. సినిమా రిలీజ్‌కు ముందు వంగవీటి, దేవినేని కుటుంబాలను సంప్రదించిన వర్మ వారు చెప్పిన అభ్యంతరాలను పట్టించుకోకుండా సినిమాను రిలీజ్ చేశారు. రిలీజ్ సమయంలోనూ వంగవీటి వివాదాలకు కారణమయ్యింది. వంగవీటి రాధ, రత్నకుమారిలను కలిసిన వర్మ, చర్చలు ఫలించకపోవటంతో.. నన్ను చాలా పద్దతిగా బెదిరించారంటూ ఆరోపించాడు. అదే సమయంలో తను విజయవాడ రౌడీయిజాన్ని చాలా దగ్గరగా చూశానని, రాధ కన్నా అప్పటి పరిస్థితులు తనకే బాగా తెలుసని ట్వీట్లు చేయటం అప్పట్లో వివాదాస్పదమయ్యింది. -
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాధా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రాష్ట్రపార్టీలో పలు నియామకాలు చేశారు. విజయవాడ నగరపార్టీ అధ్యక్షునిగా ఉన్న వంగవీటి రాధాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాధా స్థానంలో విజయవాడ నగర అధ్యక్షునిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించారు. శ్రీనివాస్‌కు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం సింగిల్ కో ఆర్డినేటర్‌గా కూడా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇదే నియోజకవర్గం సమన్వయకర్త షేక్ ఆసిఫ్‌ను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా గ్రేటర్ రాజమండ్రి వైఎస్సార్సీపీ అధ్యక్షుడిగా శాసనమండలి మాజీ సభ్యుడు కందుల దుర్గేష్‌ను నియమించారు. -
బాబు దీనికి పదింతలు నువ్వు అనుభవిస్తావు
-
టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం: రాధా
విజయవాడలో రంగా విగ్రహం ధ్వంసం విజయవాడ(అజిత్‌సింగ్‌నగర్): విజయవాడ నగరమంతా సంక్రాంతి వేడుకల్లో నిమగ్నమవడాన్ని అదునుగా చేసుకొన్న కొంతమంది దుండగులు బరితెగించారు. విజయవాడ సింగ్‌నగర్ పైపులరోడ్డులో ఉన్న వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. ఆదివారం తెల్లవారుజామున విగ్రహం ధ్వంసాన్ని గుర్తించిన వంగవీటి రంగా అభిమానులు పెద్దసంఖ్యలో పైపులరోడ్డుకు చేరుకున్నారు. రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విగ్రహం కూల్చిన దిమ్మెపై రంగా చిత్రపటాన్ని ఉంచి క్షీరాభిషేకం చేశారు. ఘటన స్థలానికి చేరుకున్న రంగా తనయుడు, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ.. ప్రశాంతంగా ఉన్న నగరంలో మళ్లీ అల్లర్లు సృష్టించి, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని 24 గంటల్లోగా అరెస్టు చేయాలని, లేనిపక్షంలో ఇటువంటి చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. -
టీడీపీ హయాంలో విగ్రహాల ధ్వంసం: రాధా
-
'మన అదృష్టం.. దుర్గమ్మ కొండ మీద ఉంది'
విజయవాడ: తొలగించిన దేవాలయాలను వెంటనే నిర్మించాలని డిమాండ్ చేస్తూ.. దీక్ష చేస్తున్న విశ్వ హిందూ పరిషత్ సభ్యులను శుక్రవారం వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధ పరామర్శించారు. దేవాలయాల పునర్నిర్మాణం కోసం వారు చేస్తున్న దీక్షకు ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వంగవీటి రాధ మాట్లాడుతూ.. మన అదృష్టం కొద్ది దుర్గమ్మ కొండ మీద ఉందని లేకుంటే.. అమ్మవారి దేవాలయాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు తొలగించే వారని ఎద్దేవా చేశారు. కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విజయవాడలోని దేవాలయాలను దర్శించుకునే అవకాశం లేకుండా చేశారని విమర్శించారు. తొలగించిన దేవాలయాలను వెంటనే పునర్నిర్మించాలని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని వంగవీటి రాధ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు ప్రభుత్వంపై రాధా ఫైర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా గురువారం నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు... మరి సింగపూర్‌లోని ఆసుపత్రిలో కూడా పిల్లలను ఎత్తుకుపోతారా ? అని ప్రశ్నించారు. విజయవాడ పాత ఆసుపత్రిలో శిశువు అదృశ్యంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్ ఏ బాబుదే బాధ్యత అని వంగవీటి రాధా ఆరోపించారు. సీఎం విజయవాడలోనే ఉంటున్నా ప్రభుత్వాస్పత్రుల్లో భద్రత లేదని మండిపడ్డారు. -
వంగవీటి రంగాకు రాధా ఘన నివాళి
విజయవాడ: వంగవీటి మోహన రంగా 69వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధా సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి వంగవీటి రాధా పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్పారు. మరోవైపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోనూ కాపు నేతలు వంగవీటి రంగా జయంతి వేడుకలు నిర్వహించారు. -
వంగవీటి రాధాకు పలువురి అభినందన
కృష్ణలంక : వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షునిగా నియమితులైన వంగవీటి రాధా కృష్ణను 16వ డివిజన్ రాణిగారితోటకు చెందిన పలువురు నాయకులు రాఘవయ్య పార్కు సమీపంలోని కార్యాలయంలో గురువారం కలుసుకున్నారు. రాధాకృష్ణకు అభినందనలు తెలిపారు. ఆయన నియామకంతో నగరంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రజల పక్షాన ఉంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడాలని నాయకులకు సూచించారు. యువజన విభాగం రాష్ట్ర నాయకులు తంగిరాల రామిరెడ్డి, 16 డివిజన్ నేతలు భిక్షాలరెడ్డి, కుమ్మరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
'ఆ భయంతోనే బాబు నోరు మెదపడం లేదు'
విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడు రోజుల జలదీక్షకు మద్దతుగా మంగళవారం అలంకార్ సెంటర్లో యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వంగవీటి విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసు భయంతోనే తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు. చంద్రబాబు విధానాలతో ఏపీ రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ప్రాజెక్టులపై నోరు మెదపని చంద్రబాబు.. ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వంగవీటి రాధా విమర్శించారు. -
తెలుగులో నా చివరి సినిమా వంగవీటి: వర్మ
వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం మీడియాలో ఉండే ప్రముఖ దర్శక నిర్మాత రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగులో తన చివరి సినిమా 'వంగవీటి' అని ఆయన బుధవారం వెల్లడించారు. వంగవీటి కంటే అద్భుతమైన కథ తనకు దొరకదని... శివ నుంచి ప్రారంభమైన తన ప్రస్థానం వంగవీటితో ఆగిపోతుందని వర్మ పేర్కొన్నారు. వంగవీటిలో రంగా, రాధా, రత్నకుమారి, శిరీష్ రాజు, దాసరి నారాయణరావు, ముద్రగడ పద్మనాభం, ఎన్టీఆర్, దేవినేని నెహ్రు పాత్రలు కూడా ఉంటాయని ఆయన తెలిపారు. ఈ మేరకు వర్మ...ఓ ఆడియోను మీడియాకు విడుదల చేశారు. నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లో అయినా , నేను నిజంగా పుట్టి పెరిగింది విజయవాడలో... ఎందుకంటే నాకు అవగాహన,తెలివి, బంధాలు, స్నేహాలు, ప్రేమించుకోవడాలు,చంపుకోవడాలు వీటన్నింటి గురించి తెలిసింది విజయవాడలోనే నేను అనంతపురం ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తీసిన రక్త చరిత్రకి ఇప్పుడు విజయవాడ రౌడీయిజం బ్యాక్ డ్రాప్ లో తీయబోతున్న “వంగవీటికి” ముఖ్యమైన తేడా పగకి, ఆవేశానికి ఉన్న తేడా. పగతో బుసలు కొట్టే ఫ్యాక్షనిస్ట్,శత్రువే ప్రపంచంగా బతుకుతాడు.. ఆవేశంతో రెచ్చిపోయే రౌడీ,ప్రపంచమే శత్రువుగా బతుకుతాడు. తన చుట్టూ ఉన్న ప్రపంచం తనని ఒక మనిషిగా చూడని పరిస్థితిలోనే ఏ మనిషైనా ఒక రౌడీ అవుతాడు. ఫ్యాక్షనిస్ట్ తను చచ్చైనా శత్రువుని చంపాలనుకుంటాడు ... రౌడీ బతకడానికి మాత్రమే చంపుతాడు. ఈ భూమి మీద మనిషి పుట్టినప్పటినుంచీ ఇప్పటివరకూ సాగుతూ వస్తున్న హింసచరిత్రలో ఫ్యాక్షనిస్ట్ ఒక వారధి అయితే రౌడీ ఒక మలుపు. ఫాక్షనిజం కి బ్యాక్ గ్రౌండ్ వారసత్వం అయితే రౌడీయిజానికి వారసత్వం దమ్ము ఒక దమ్మున్నోడు సింహాసనం మీద కూర్చున్న ఇంకో దమ్మునోడిని పైకి పంపటమే అసలు సిసలైన నిజమైన రౌడీయిజం. అలాంటి రౌడీయిజం రూపాన్ని, దాని ఆంతర్యాన్ని 30 ఏళ్ళ క్రితం నేను విజయవాడ సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్నప్పుడు,బాగా దగ్గరగా స్వయంగా నా కళ్ళతో చూశాను ... అందుకనే విజయవాడ రౌడీయిజం గురించి నాకన్నా ఎక్కువ తెలిసిన వాడు, విజయవాడలో కూడా లేడని బల్ల గుద్దే కాకుండా కత్తితో కూడా పొడిచి చెప్పగలను. 'వంగవీటి' చిత్రం తెలుగులో నా ఆఖరి చిత్రం అవుతుంది. 'శివ' తో మొదలైన నా తెలుగు సినిమా ప్రయాణం “వంగవీటి”తో ముగించాలని నేను తీసుకున్న నిర్ణయానికి కారణం 'వంగవీటి'కన్నా అత్యంత నిజమైన మహా గొప్ప కథ మళ్ళీ నాకు జీవితంలో దొరకదని నాకు ఖచ్చితంగా తెలుసు కాబట్టి. వంగవీటి రాధాగారు,చలసాని వెంకటరత్నంగారిని చంపడంతో ఆరంభమైన విజయవాడ రౌడీయిజం, వంగవీటి రంగాగారిని చంపడంతో ఎలా అంతమయ్యిందో చూపించేదే 'వంగవీటి' చిత్రం. కత్తులు, బరిసెలు, అంబాసిడర్ కార్లు, మెటాడోర్ వాన్లు వుండి,సెల్ ఫోన్లు, తుపాకులు లేని 30 ఏళ్ళ క్రితంనాటి ఆ నాటి విజయవాడ వాతావరణాన్ని పున సృష్టించటానికి ఖర్చుకి ఏ మాత్రం వెనకాడద్దని 'వంగవీటి' నిర్మాత దాసరి కిరణ్ కుమార్ గారు ఇచ్చిన ప్రోత్సాహంతో, విజయవాడ గత చరిత్రని ఇప్పటికి, ఎప్పటికి చరిత్రలో నిలిచిపోయేలా చెయ్యటానికి మా'వంగవీటి' యూనిట్ శరవేగంతో సిద్ధమవుతోంది. వంగవీటి చిత్రంలోని ముఖ్య పాత్రదారులు: వంగవీటి రాధా వంగవీటి మోహన రంగా వంగవీటి రత్నకూమారి దేవినేని నెహ్రు దేవినేని గాంధీ దేవినేని మురళి కర్నాటి రామమోహనరావు సిరిస్ రాజు రాజీవ్ గాంధీ దాసరి నారాయణ రావు ముద్రగడ పద్మనాభం నందమూరి తారక రామారావు కాగా వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో 'వంగవీటి' చిత్రాన్ని వర్మ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను విడుదల చేశారు. -
'నా వంగవీటి రాధ ఇతనే'
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ఇదివరకే తెలిపారు. అయితే ఆ సినిమాలో అత్యంత కీలక పాత్ర అయిన వంగవీటి రాధ క్యారెక్టర్లో నటించే నటుడి ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అసలు వంగవీటి రాధ, నా వంగవీటి రాధ అంటూ రాంగోపాల్ వర్మ ఈ ఫోటోలను వెల్లడించారు. 'వంగవీటి రాధ చాలా తక్కువ సార్లు తన అంతరంగికుల మధ్య సిగరెట్ కాల్చే వాడు' అంటూ సిగరేట్ కాల్చే ఫోటోను.. 'వంగవీటి రాధకి కాఫీ అంటే చాలా ఇష్టమని వంగవీటి రంగగారు నాతో చెప్పారు'.. అని కాఫీ తాగుతున్న ఫోటోను.. కమ్మవాళ్ల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే తెలివున్న వాళ్లే అర్హత ఉన్న నిజమైన కాపులని చెప్పారని మరో ఫోటోను ట్విట్ చేశారు. Kammavaalla manasthatanni ardham chesukune thelivunnavalle arhatha vunna nijamaina kaapulani chepparu pic.twitter.com/FZ8apGoXY7 — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 Vangaveeti Radhagaariki coffee ante chaala ishtamani Vangaveeti Ranga gaaru naatho chepoaru pic.twitter.com/EZD6Uqv28D — Ram Gopal Varma (@RGVzoomin) February 2, 2016 -
వంగవీటి రంగా, రాధా హత్యోదంతాలపై సినిమా
కాపు ఐక్య గర్జనకు ముమ్మర ఏర్పాట్లు 31న తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో భారీ సభ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభను విజయవంతం చేసేందుకు కాపు రిజర్వేషన్ల పోరాట సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన వివిధ కాపు సంఘాలు హైదరాబాద్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లపై అవగాహన ఉన్న ప్రముఖులు, మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, అవెందుకు పోయాయో ప్రముఖ యూనివర్సిటీలు, న్యాయకోవిదులు, మాజీ ఐఏఎస్‌లతో తమ సభ్యులకు తరగతులు చెప్పిస్తున్నాయి. అలాగే 150కి పైగా కాపు సంఘాలు సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి కనీసం 50 వేల మంది రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. పాలకులను హడలెత్తిస్తాం: తునిలో జరిగే గర్జనతో పాలకులను హడలెత్తిస్తామని, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర కాపు రిజర్వేషన్ నాయకుడు ఆరేటీ ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంగవీటి రంగా, రాధా హత్యోదంతాలపై సినిమా తాడేపల్లిగూడెం: ‘కాపు కుల సంక్షేమం కోసం పోరు సలుపుతున్న వంగవీటి రాధా, రంగాలను వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కుట్రలు, కుతంత్రాలతో ఎలా మట్టుపెట్టారు. ఆ ఇద్దరినీ ఎలా పావులుగా వాడుకున్నారు. పని అయ్యాక పథకం ప్రకారం ఎలా అంతమొందించారు’ అనే కథాంశంతో కాపులను బీసీలలో చేర్చాలని పోరు ఊపందుకుంటున్న తరుణంలో ఒక సినిమా చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ఈ నెల 31న తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరగనున్న కాపు మహాగర్జన సభలో క్లాప్ కొట్టడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలిసింది. -
వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ
హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి చిత్రం 'వంగవీటి' విశేషాలను వెల్లడించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సాక్షి టీవీకి వర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. వంగవీటి చిత్రం గురించి వివరాలను తెలియజేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా పేరును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. My interview on the details of the film "Vangaveeti" on Sakshi channel at 3.30 pm today — Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2016 -
నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి'
-
నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. 'కిల్లింగ్ వీరప్పన్'తో మళ్లీ మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందగలనని రాంగోపాల్ వర్మ నిరూపించకున్నారు. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుతోంది. ఈ నెల 7న 'కిల్లింగ్ వీరప్పన్' తెలుగులో విడుదల కానుంది. -
నిర్లక్ష్యమే నిజం!
ఏఎన్‌యూ : ‘యూనివర్సిటీ కళాశాలలు, వసతి గృహాల్లో పరిస్థితులపై పలుమార్లు విద్యార్థినులు ఫిర్యాదు చేసినా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఇదే రిషితేశ్వరి మరణానికి కారణమైంది..’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బృందం ఆరోపించింది. తప్పులు చేసిన కొందరిని రక్షించేందుకు యూనివర్సిటీ, ప్రభుత్వ అధికారులు వర్సిటీ వ్యవస్థను, సమాజాన్ని బదనాం చేస్తున్నారని మండిపడింది. రిషితేశ్వరి మృతి ఘటనలో వాస్తవాలు వెలికి తీసేందుకు ఆ పార్టీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, పార్టీ రాష్ట్రస్థాయి నాయకులతో కూడిన బృందం గురువారం ఏఎన్‌యూలో పర్యటించింది. పరిపాలనా భవన్‌లోని వీసీ కార్యాలయంలో ఇన్చార్జి వీసీ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్‌తో వైఎస్సార్ సీపీ బృందం సమావేశమైంది. ఈ సందర్భంగా నిజనిర్ధారణ కమిటీ సభ్యులు ఆర్కే రోజా, కె.పార్థసారధి మాట్లాడుతూ వర్సిటీలో మహిళల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. మృతురాలు రాసుకున్న డైరీ చదివితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. డైరీ మొత్తాన్ని యూనివర్సిటీ నియమించిన నిజనిర్ధారణ కమిటీ ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. యాంటీ ర్యాగింగ్ చట్టం ప్రకారం ప్రిన్సిపాల్‌ను ఎందుకు అరెస్టు చేయించలేదని మండిపడ్డారు. ప్రిన్సిపాల్‌ను అరెస్టు చేసేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించారు. వర్సిటీ అవకతవకలపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రిషితేశ్వరి ఘటనలో ఆర్కిటెక్చర్ కళాశాల ప్రిన్సిపాల్ తప్పులు ఉన్నాయని ఆయన్నెందుకు ఏ1 ముద్దాయిగా చేర్చలేదని ప్రశ్నించారు. బాపట్ల, మాచర్ల ఎమ్మెల్యేలు కోనరఘపతి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థిని మృతికి కారకులైన వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నిం చటం దురదృష్టకరమన్నారు. నిజనిర్ధారణ కమిటీ సభ్యుడు మేరుగ నాగార్జున మాట్లాడుతూ బాబురావు అరాచకాలను ప్రశ్నించినందుకే దళిత అధ్యాపకుడు డేవిడ్‌రాజును విధుల నుంచి తొలగించారని మండిపడ్డారు. పార్టీ జిల్లా అధ్యక్షులు మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ అధికారులు కులాలవారీగా వివక్ష కనబరచటం సరికాదన్నారు. ఏఎన్‌యూ నిజనిర్ధారణ కమిటీ కన్వీనర్ ఆచార్య సి.రాంబాబును విచారణకు సంబంధించిన పలు అంశాలపై వైఎస్సార్ సీపీ బృందం ప్రశ్నించింది. విద్యార్థులకు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని చూపాలని డిమాండ్ చేశారు. ఆయన ఫీడ్‌బ్యాక్ ఫారాన్ని తెప్పించి వైఎస్సార్ సీపీ బృందానికి ఇచ్చారు. బృందం పట్టు వీడక పోవటంతో రిషితేశ్వరి మృతికి పరోక్షంగా కారణమైన బాబురావుపై యాంటీ ర్యాగింగ్ చట్టం కింద చర్యలు తీసు కోవాలని పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేస్తూ అందరి సమక్షంలో లేఖ రాశారు. అనంతరం రోజా, వైఎస్సార్ సీపీ మహిళా ఎమ్మెల్యేలు యూనివర్సిటీలోని బాలికల వసతి గృహాలను సందర్శించి విద్యార్థినులతో చర్చించారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకున్న గదిని పరిశీలించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు షేక్ మహ్మద్ ముస్తఫా, ఉప్పలేటి కల్పన, జలీల్‌ఖాన్, మేకా ప్రతాప అప్పారావు, గొట్టిపాటి రవికుమార్, ఆదిమూలపు సురేష్, గిడ్డి ఈశ్వరి, గౌరు చరిత, కళావతి, పుష్పశ్రీవాణి, రక్షణ నిధి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, నిజనిర్ధారణ కమిటీ సభ్యులు వంగవీటి రాధా, లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, గురజాల నియోకవర్గ సమన్వయకర్త జంగా కృష్ణమూర్తి, వినుకొండ నియోజకవర్గ సమన్వయకర్త బొల్లా బ్రహ్మనాయుడు, వైఎస్సార్ సీపీ యువజన, మహిళా, విద్యార్థి, మైనార్టీ, ఎస్టీ విభాగాల జిల్లా అధ్యక్షులు కావటి మనోహర్ నాయుడు, యేళ్ల జయలక్ష్మి, పానుగంటి చైతన్య, సయ్యద్‌మాబు, మొగిలి మధు, వైఎస్సార్ సీపీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ దేవెళ్ల రేవతి, తాడికొండ నియోజకవర్గ ఇన్చార్జ్ కత్తెర సురేష్ పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై ధ్వజం.. సాక్షి, గుంటూరు : అనంతరం రోజా విలేకరులతో మాట్లాడుతూ ఎంఎల్ఏ ధూళిపాళ్ల నరేంద్రకుమార్ కనీసం వర్సిటీకి వచ్చి రిషితేశ్వరి వ్యవహారంపై ఆరా తీయలేదంటే టీడీపీ నేతలకు మహిళలపై ఎంత గౌరవం ఉందో అర్థమవుతుందన్నారు. హోం శాఖ నిద్ర పోతోందని ఆరోపించారు. బాబు పవర్ తన వద్ద పెట్టుకుని పదవి చిన్నరాజప్పకు ఇచ్చారనారు. కఠినంగా శిక్షించాలి.. ప్రిన్సిపాల్ బాబురావు లాంటి వ్యక్తుల వల్ల విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడంతోపాటు యూనివర్సిటీ విలువలు దిగజారుతున్నాయి. ప్రెషర్స్‌డే పార్టీని యూనివర్సిటీలో కాకుండా హాయ్‌ల్యాండ్‌లో ఏర్పాటు చేసి మందేసి, చిందు వేయించిన ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోకపోవడం వల్లనే రిషితేశ్వరి మృతి చెందింది. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపి దోషులను శిక్షించాలి. - కొలుసు పార్థసారధి, మాజీమంత్రి ప్రిన్సిపాల్‌పై చర్యలేవీ.. కళాశాల ప్రారంభమైన నెల రోజుల్లో ప్రెషర్స్ డే ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఐదు నెలల తర్వాత ఎక్కడో బయట ఏర్పాటు చేసి చిందులు వేస్తున్నా యూనివర్సిటీ అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. - ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు , ఎమ్మెల్సీ నివేదిక దారుణం.. రిషితేశ్వరి డైరీలోని పేజీలన్నీ మీడియాలో ప్రదర్శించినప్పటికీ వర్సిటీ నిజనిర్ధారణ కమిటీ దాన్ని చూడకుండా నివేదిక ఇవ్వడం దారుణం. - వంగవీటి రాధా, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు అనుమానాలున్నాయి.. బాబురావు తప్పు చేశాడని నిర్ధారించినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం అనుమానాలు కలుగుతున్నాయి. - గొట్టిపాటి రవికుమార్, అద్దంకి ఎంఎల్ఏ -
ఘనంగా వంగవీటి రంగ 26వ వర్థంతి!
-
ఎన్నాళ్ళీ హత్యా రాజకీయాలు ?
-
వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడిగా వంగవీటి రాధ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆర్ కే రోజా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి. ఎస్సీ సెల్ కు మేరుగ నాగార్జున, బీసీ సెల్ కు ధర్మాన కృష్ణదాస్, లీగల్ సెల్ కు పొన్నవేలు సుధాకర్ రెడ్డి, మైనారిటీ సెల్ కు అంజాద్ బాషా, ఎస్టీ సెల్ కు తెల్లం బాలరాజు అధ్యక్షులుగా నియమితులయ్యారు. వైఎస్ఆర్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా వంగవీటి రాధను నియమించారు. రైతు విభాగానికి ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ ను గౌతంరెడ్డి అధ్యక్షులుగా నియమితులయ్యారు. -
'నా తండ్రి తర్వాత జగన్ నాకు స్ఫూర్తి'
-
విజయమ్మకు ఘన స్వాగతం
గన్నవరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మకు సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ఆమె హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్వేస్ విమానంలో సాయంత్రం 3 గంటలకు ఇక్కడికి వచ్చారు. విమానాశ్రయంలో విజయమ్మకు విజయవాడ, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు కోనేరు రాజేంద్రప్రసాద్, తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, యేర్నెని రాజరామచంద్రరావు, గన్నవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల సమన్వకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పి. గౌతమ్‌రెడ్డి, జిల్లా ప్రచార కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు బేతపూడి రాజేంద్రప్రసాద్, చిన్నాల లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక వాహనంలో ఖమ్మం జిల్లా మధిర బయలుదేరి వెళ్లారు. -
కన్నీటి పర్యంతమైన వంగవీటి రాధా
-
కన్నీటి పర్యంతమైన వంగవీటి రాధా
విజయవాడ : విజయవాడలో వంగవీటి మోహనరంగా 25వ వర్థంతి కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ రోడ్డులోని రంగా విగ్రహానికి ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్తూ..కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పలుచోట్ల ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. -
వంగవీటి రాధా దీక్షను భగ్నం చేసిన పోలీసులు