
కన్నీటి పర్యంతమైన వంగవీటి రాధా
విజయవాడ : విజయవాడలో వంగవీటి మోహనరంగా 25వ వర్థంతి కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ రోడ్డులోని రంగా విగ్రహానికి ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్తూ..కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పలుచోట్ల ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.