vangaveeti ranga
-
ఏ ఎండకు ఆ గొడుగు.. బాబు ‘సానుభూతి’ రాజకీయం
ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీకి ఒక విశిష్టత ఉందని ఎవరైనా ఒప్పుకోవాలి. అదేమిటంటే చంద్రబాబు ఎవరినైతే తీవ్రంగా విమర్శిస్తారో, తన పార్టీకి ఒకప్పుడు ఎవరు ప్రబల శత్రువో వారితో రాజీ పడడంలోను, వారి విషయంలో అవకాశ వాదం ప్రదర్శించడంలోను ఆయన తర్వాతే ఎవరైనా.. ఇటీవలి జరుగుతున్న పరిణామాలు చూడండి. దివంగత కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం నేతలు చేసిన హడావుడి చూస్తే ఆయన ఏదో టీడీపీలో పుట్టి పెరిగిన నేతేమో అనుకోవాల్సిందే. రంగా హత్యకు గురైన ముప్పై నాలుగేళ్ల తర్వాత కూడా ఆయన ఏపీ రాజకీయాలలో ప్రముఖ స్థానంలో ఉండడం గొప్ప విషయమే. అందులోను రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆయన ప్రాధాన్యత పెరిగిందని చెప్పాలి. కొంతకాలం క్రితం స్వయంగా టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ ఆయన విగ్రహానికి పూలదండ వేయడం కాని, రంగా కుమారుడు రాధాను చంద్రబాబు ఆకర్షించడం కాని ఇందులో భాగమే. బలహీనవర్గాల నేతగా, ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి హీరోగా గుర్తింపు పొందిన రంగా అప్పట్లో టీడీపీ హయాంలో చాలా కేసులు ఎదుర్కొన్నారు. పోలీస్ స్టేషన్లో ఎలాంటి అవమానాలు భరించారో ఆయన సన్నిహితులకు తెలుసు. ఆయన సోదరుడు వంగవీటి రాధాకృష్ణ అంతకుముందు హత్యకు గురయ్యారు. అప్పట్లో విజయవాడలో గ్రూపు కలహాలు ఎక్కువగా ఉండేవి. కొంతకాలం సీపీఐకి, సీనియర్ రాధాకు మధ్య తగాదా ఉండేది. ఆ తర్వాత కాలంలో అవి సామాజికవర్గ విభేదాలుగా మారాయి. రాధాకృష్ణను నగరంలోని ఒక సామాజికవర్గ ప్రముఖుడి ఆఫీస్‌లో హత్య చేశారు. తదనంతరం రంగా ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి సన్నద్దమయ్యారు. ఆ క్రమంలో అతను కొన్ని వర్గాల ప్రజలను ఆకర్షించగలిగారు. చిన్న, చిన్న తగాదాలను తీర్చడం మొదలు,పెద్ద,పెద్ద పంచాయతీలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అదే తరుణంలో పోలీసులకు పోటీ వ్యవస్థను నడిపారన్న అభిప్రాయం ఉండేది. కొంతమందికి తమ సమస్య పరిష్కారం కావాలంటే రంగాను ఆశ్రయిస్తే చాలనే దశ వచ్చింది. ఇది కొంతమందికి కంటగింపుగా ఉండేది. దాంతో ఆయనకు శత్రువులు కూడా బలంగానే తయారయ్యారు. అప్పట్లో దేవినేని గాంధీ అనే మరో యువనేత రంగాకు పోటీగా మారారు. దాంతో రెండు వర్గాల మద్య రణరంగంగా పరిస్థితి ఉండేది. కొన్ని హత్యలు కూడా జరిగేవి. కాలేజీ యూనియన్ ఎన్నికలలో చెరో సంస్థను ఏర్పాటు చేసుకుని విద్యార్దులను ఆకర్షించేవారు. క్రమేపి అవి కులగొడవలుగా రూపాంతరం చెందాయి. ఒక దశలో విజయవాడలో స్వేచ్చగా తిరగాలంటే భయపడేవారు. దేవినేని గాంధీ హత్య తర్వాత ఆయన సోదరుడు నెహ్రూ బాధ్యతలు తీసుకున్నారు. ఇక ఈ రెండు వర్గాలు రాజకీయాల వైపు కూడా దృష్టి పెట్టారు. రంగా కాంగ్రెస్ వైపు ఉంటే, నెహ్రూ టీడీపీవైపు చేరారు. రంగా తొలుత కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. అనంతరం 1985లో ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకుని కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ ఎన్నికలలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డితో ఈయనకు సత్సంబంధాలు ఉండేవి. దేవినేని నెహ్రూ 1983లో ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశంలో చేరి ఎమ్మెల్యే అయ్యారు. వీరిద్దరి మధ్య గొడవలు విజయవాడ, పరిసరాలలో కమ్మ, కాపు తగాదాలుగా మారాయి. అది సమాజానికి నష్టం చేసిందనే చెప్పాలి. ఎమ్మెల్యేగా రంగా పలు ఆందోళనలు చేపట్టేవారు. కాంగ్రెస్‌లో వర్గ కలహాలను తట్టుకుని ఆయన నిలబడ్డారు. ఒక వైపు రాజకీయం, మరో వైపు కులం కలగలిసిపోయి విజయవాడలో వాతావరణం అప్పట్లో బాగా కలుషితం అయింది. ఆ రోజుల్లో ఈనాడు అధినేత రామోజీరావు ప్రతిఘటన అనే సినిమా తీశారు. అది రంగాను పరోక్షంగా ఉద్దేశించి తీసిందేనని అప్పట్లో అనుకునేవారు. తెలుగుదేశం వారు ప్రస్తుతం రంగా వారసత్వాన్ని రాజకీయంగా వాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. అలాగే అప్పట్లో ఆయనను తీవ్రంగా వ్యతిరేకించిన ఈనాడు మీడియా కాని, టీడీపీకి మద్దతు ఇచ్చే ఇతర మీడియా కాని రంగాను చాలా గొప్ప వ్యక్తిగా ప్రొజెక్టు చేసి టీడీపీకి రాజకీయంగా లబ్ది చేకూర్చాలని వ్యూహరచన చేయడం మారిన పరిస్థితులకు దర్పణం పడుతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును కుట్రపూరితంగా పదవి నుంచి దించేయడమే కాకుండా, ఆయన వద్ద నుంచి పార్టీని కూడా చంద్రబాబు లాగేసుకున్న సన్నివేశాన్ని గుర్తుకు తెచ్చుకోండి. ఎన్టీఆర్ పదవి పోగొట్టుకుని కుములుతున్న రోజులలో చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు ఆయనను అవమానించడానికి వెనుకాడలేదు. ఆ బాధతో ఎన్టీఆర్ కన్నుమూశాక వెంటనే ఎన్టీఆర్ వారసులం తామే అంటూ ఆయన విగ్రహానికి ముందుగా దండలు వేసిందీ వారే. ఆ ఘట్టాలను గమనించినవారికి ఇప్పుడు రంగా వారసత్వం ద్వారా కాపు సామాజికవర్గ ఓట్లను పొందాలన్న టీడీపీ వ్యూహాలను అర్దం చేసుకోవడం కష్టం కాదు. 1988 డిసెంబర్లో రంగా తన ఇంటికి సమీపంలో రాఘవయ్య పార్కు వద్ద పేవ్‌మెంట్‌పై దీక్షకు దిగారు. ఆయన కూడా తనను టీడీపీ వారు బతకనివ్వరమోనని అనుమానిస్తుండేవారట. రోడ్డుపై దీక్షలో ఉన్న రంగాను ఇంతకన్నా మంచి అవకాశం రాదని భావించిన ప్రత్యర్ది టీడీపీ వర్గం తెల్లవారు జామున దారుణంగా హత్య చేసింది. ఆ వార్త ఏపీలో ముఖ్యంగా కోస్తా జిల్లాల అంతటా దావానలంలా వ్యాపించింది. ఎక్కడకక్కడ హింస చెలరేగింది. ఇది రాజకీయ తగాదానో, కుల తగాదానో తెలియనంతగా దాడులు జరిగాయి. ఈనాడు పత్రిక ఆఫీస్‌తో సహా అనేక సంస్థలు, వ్యాపారాలు, వ్యక్తులు, ఇళ్లు టార్గెట్ అయ్యాయి. దోపిడీలు జరిగాయి. ఈ గొడవల్లో సంఘ విద్రోహ శక్తులు కూడా ప్రవేశించాయి. అమాయకులైన వారిని హత్య చేశారు. ఒక ప్రముఖ డాక్టర్ కూడా ఇలా బలైపోయారు. ఆ దశలో అప్పుడు జరిగిన హింస గురించి ఈనాడు పత్రిక ప్రముఖంగా వార్తలు ఇచ్చింది. దాంతో రంగా హత్య ద్వారా ప్రజలలో ఏర్పడిన సానుభూతి పోయి, వ్యతిరేకత వస్తుందేమోనని కాంగ్రెస్ నేతలు భయపడ్డారు. అప్పట్లో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న నేదురుమల్లి జనార్దనరెడ్డి ఈ హింసవార్తలు ప్రచారం చేయవద్దని కూడా అభ్యర్దించారు.అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్.టి.రామారావు స్వయంగా విజయవాడ వచ్చి రంగా ఇంటికి వెళ్లారు. ఆయన రోడ్డు మీద నిలబడి ఇంటిలోకి వెళ్లి పరామర్శించాలని అనుకోగా, రంగా సతీమణి రత్నకుమారి నిరాకరించారు. 1989లో వచ్చిన లోక్ సభ, శాసనసభ ఎన్నికలలో ఈ హత్య, తదనంతర పరిణామాలలో తెలుగుదేశం ఘోరంగా ఓటమిచెందింది. కోస్తా జిల్లాలలో రంగా ఎంతగా కాపు సామాజికవర్గాన్ని ప్రభావితం చేసింది అప్పుడు చాలామందికి అర్దం అయింది. ఆ సమయంలోనే టీడీపీలో ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన కాపు ప్రముఖుడు చేగొండి హరిరామజోగయ్య పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరిపోయారు. ఆయనే ఆ తర్వాతకాలంలో ఒక పుస్తకం రాసి, రంగాను హత్య చేయాలన్న ప్లాన్ చంద్రబాబుకు తెలిసే జరిగిందని సంచలన విషయం చెప్పారు. దానిని ఇంతవరకు టీడీపీ నేతలు ఖండించినట్లు వార్తలు రాలేదు. 1989 , 1994 ఎన్నికలలో కాంగ్రెస్ పక్షాన రత్నకుమారి గెలవడానికి రంగా వారసత్వం బాగా ఉపకరించిందని చెప్పాలి. మొదటిసారి ఎన్నికయ్యాక ఆమె శాసనసభలో ఎన్.టి.ఆర్.ను అంతకన్నా చంద్రబాబు నాయుడును ఎన్ని శాపనార్దాలు పెట్టింది గుర్తుకు తెచ్చుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే ఆ తదుపరి కాలంలో ఆమె టీడీపీకి దగ్గరవడమేనని చెప్పనవసరం లేదు. 2004 ఎన్నికలనాటికి రంగా, రత్నకుమారిల కుమారుడు రాధా కాంగ్రెస్‌లో చేరి రాజశేఖరరెడ్డి ఆశిస్సులతో ఎమ్మెల్యే అయ్యారు. కాని ఆ తర్వాత పరిణామాలలో ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లారు. 2014 లో వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఆయనకు మంచి గుర్తింపే వచ్చింది. కాని ఆ పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 2019 నాటికి రంగా అప్పటి అధికార తెలుగుదేశం పార్టీలో చేరడం మరో సంచలనం. అప్పట్లో పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఇందుకు రాయబారం చేశారని అంటారు. తన తండ్రిని ఏ పార్టీవారైతే హత్య చేశారో, అదే పార్టీలో ఆయన కుమారుడిగా రాధా చేరతారని ఎవరు ఊహిస్తారు? దీంతో రంగా అభిమానులు హతాశులయ్యారు. ఇప్పుడు రాధాను అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు రంగా కూడా తమ పార్టీవారే అన్నట్లుగా విగ్రహాలకు దండలు, వర్దంతి, జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తుండడం, రాజకీయ వైచిత్రి కాక మరేమిటి? వైసీపీలో ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని , ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే వంశి వంటివారు తొలినుంచి రాధాతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా వారు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. మరో వైపు గుడివాడలో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వర్దంతి నిర్వహించడానికి యత్నించగా వైసీపీవారు అడ్డుకున్నారని ఈనాడు పత్రిక తెగరాసేసింది. అయితే వైసీపీ వారు గొడవపడలేదని , రంగా మద్దతుదారులతో రావి గొడవపడ్డారని కొడాలి నాని చెప్పారు. ఈ సందర్భంగా 1988లో రంగా హత్య తర్వాత గుడివాడలో ఆనాటి ఎమ్మెల్యే అయిన రావి శోభనాద్రి వస్త్రాల దుకాణం, ఇతర షాపులను ఆందోళనకారులు తగులపెట్టడం, రావి కుటుంబం గుడివాడ నుంచి పారిపోవడం వంటి ఘట్టాలను నాని గుర్తు చేశారు. నిజంగానే ఆ రోజుల్లో టీడీపీ నేతలు బయటకు రావడానికే భయపడ్డారంటే అతిశయోక్తి కాదు. కాని ఇప్పుడు రంగా కుటుంబీకులవల్లే ఆయన స్మృతికి అప్రతిష్ట కలుగుతోందని చెప్పక తప్పదు. వారు రంగా ఏ రాజకీయం అయితే చేశారో, ఏ టీడీపీని ఓడించాలని కృషి చేశారో, అందుకు కట్టుబడి ఉండక, టీడీపీతోనే కలవడం అంటే ఇంతకంటే దారుణం ఏమి ఉంటుందని అనుకుంటాం. కాకపోతే పార్టీలకు అతీతంగా రంగా అభిమానులంతా మద్దతు ఇస్తున్నారని రంగా కుటుంబీకులు చెప్పుకుంటున్నా, అది ఆత్మవంచనే అవుతుందేమో! ఒకప్పుడు జూనియర్ రాధాను కలిస్తేనే చంద్రబాబు తనను తిట్టారని కొడాలి నాని వెల్లడించారు. అప్పటికి పరిస్థితి అంతే. చంద్రబాబు ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో దిట్ట కనుక రంగా ద్వారా రాజకీయంగా ఓట్లు పొందడానికి ఇప్పుడు రంగాపై ఆయన అభిమానులలో ఉన్న సానుభూతిని వాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఆనాటి పరిస్థితులు తెలిసిన రంగా మద్దతుదారులు ఎవరైనా ప్రతిపక్ష టీడీపీకి మద్దతు ఇవ్వగలుగుతారా! ఈ పరిణామాలను జీర్ణించుకోగలుగుతారా? -హితైషి -
బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన లీడర్ వంగవీటి
-
ప్రజలకోసం పాటుపడిన వ్యక్తి వంగవీటి రంగా
-
నున్నలో వంగవీటి రంగా విగ్రహావిష్కరణ
-
పవన్ రాజకీయం కోసం రంగా హత్యను వాడుకోవడం దుర్మార్గం : కాపు నాయకులు
-
ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు
నందమూరి తారకరత్న హీరోగా నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్ లైన్. వంగవీటి రాధా పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, కేఎస్ వ్యాస్ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ సి. కల్యాణ్ మాట్లాడుతూ–‘‘తెరవెనుక కష్టాలున్న ప్రాజెక్ట్స్‌లో క్వాలిటీగా చేసిన సినిమాల్నీ హిట్ అయ్యాయి. అలాంటి కోవలో వస్తున్న ‘దేవినేని’ కూడా విజయం సాధించాలి. ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టర్స్‌తో సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. శివనాగేశ్వర రావు మాట్లాడుతూ–‘‘నేను తీసిన ఈ ‘దేవినేని’ బయోపిక్ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా తీశా. ఈ రెండు కుటుంబాల్లో ఎవర్నీ తక్కువగా చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు. చిన్న నిర్మాతలైనా ఈ సినిమాను ఎంతో కష్టపడి నిర్మించారు. దయచేసి ఈ గొడవలను ఆపి, పాజిటివ్‌గా ఆలోచించి సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రియలిస్టిక్‌గా ఉంటుంది’’ అన్నారు నిర్మాత రాము. ఈ కార్యక్రమంలో సురేష్ కొండేటి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. చదవండి: శృతి ప్రియుడికి థాంక్స్ చెప్పిన కమల్! ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్ హీరో హెచ్చరిక! -
రంగాను చంపింది వాళ్లే: వంగవీటి నరేంద్ర
సాక్షి, విజయవాడ: ఈ ఏడాదే వంగవీటి రంగా మొదటి వర్ధంతి అని బీజేపీ నేత వంగవీటి నరేంద్ర అన్నారు. తన తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధ ఎప్పుడైతే చేరారో.. అప్పుడే వంగవీటి రంగా నిజంగా చనిపోయారని ఉద్వేగానికి గురయ్యారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని వంగవీటి నరేంద్ర అన్నారు. రంగాను చంపింది మనుషులు కానీ.. పార్టీ కాదు రాధా బాబు అనడం.. రంగ-రాధా అభిమానులు జీర్ణించుకోలేక పోయారన్నారు. టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లిన వంగవీటి రాధాను మండపేటలో రంగా అభిమాన సంఘాలు వ్యతిరేకించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా వంగవీటి రంగాను చంపింది టీడీపీ నాయకులేనని రాధా తెలుసుకోవాలని నరేంద్ర విఙ్ఞప్తి చేశారు. కాగా వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. -
రంగా అభిమానుల నిరసన.. ఉద్రిక్తత
-
వంగవీటి రాధా చేరికను వ్యతిరేకిస్తూ..
సాక్షి, విజయవాడ : వంగవీటి రాధా కృష్ణ టీడీపీలో చేరడాన్ని వ్యతిరేకిస్తూ దివంగత నేత వంగవీటి రంగా అభిమానులు, ఆయన సోదరుడు నారాయణరావు కుమారుడైన వంగవీటి నరేంద్ర.. రంగా విగ్రహం వద్ద దీక్షకు దిగారు. ఈ దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో రాఘవయ్య పార్క్‌లోని రంగా విగ్రహం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రంగా హత్యకు కారణమైన తెలుగుదేశంలో రాధాకృష్ణ చేరడం చాలా బాధకరమని, రాధాకృష్ణ నిర్ణయం వల్ల రంగా మరోసారి హత్యకు గురయ్యారని ఈ సందర్భంగా నరేంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాధా నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాధా-రంగా మిత్రమండలి సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. గతంలో రంగా సతీమణి చేసిన తప్పే నేడు రాధా కూడా చేస్తున్నారని, తన రాజకీయ ప్రయోజనాల కోసం తండ్రి ఆశయాలను వదులుకుంటున్నారని మండిపడ్డారు. ఈ నిర్ణయంతో రంగా అభిమానులంతా క్షోభకు గురువుతున్నారన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వంగవీటి రాధా టీడీపీలో చేరిన విషయం తెలిసిందే. రంగా హత్యకు కారణమైన పార్టీలోకి ఎలా చేరుతారని ఆయన అభిమానులు రాధాను నిలదీస్తున్నారు. -
బాలీ హామీలు
రాజకీయం ప్రజల కోసం ఉండాలి. ప్రజల కోసం.. ప్రజలచేత.. ప్రజల వలన సాగాలి. రాజకీయం ప్రజలను ఒక్కటి చేయాలి. రాజకీయం ప్రేమను, శాంతిని పెంపొందించాలి. ఇవన్నీ రాజకీయాలకైతే ఓకే. కానీ బాలీవుడ్ రాజకీయాన్ని బ్లాక్‌బస్టర్‌గా మార్చడానికి వాడుకుంటుంది. ఎలా అయితేనేమి ఎలా చెబితేనేమి ప్రజలకు అర్థమయ్యేలా చెబితే చాలు. సినిమాను మించిన మెస్సేజ్ ఉండదేమో! ప్రస్తుత రాజకీయాలను, రాబోతున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బాలీవుడ్ తెచ్చిన కొన్ని చిత్రాలపై విశ్లేషణ రాజకీయాలు, సినిమాలు ఆర్ ది మోస్ట్ సేలబుల్ సబ్జెక్ట్స్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్లో. ఈ రెండూ కలిస్తే చెప్పేదేముంది బంపర్ బొనాంన్జే! 2018 సంవత్సరాంతంలో అయిదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ సందర్భంగా సినిమాతో రాజకీయాన్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో కావల్సినంత వినోదాన్ని పంచారు. క్రియేటివిటీకి ఓ న్యూవేవ్ వేశారు ఉత్సాహవంతులు. హిట్ అయిన తెలుగు, హిందీ సినిమాల్లోని హీరో, విలన్లకు అధికార పార్టీ, ప్రత్యర్థి పార్టీ నేతల మొహాలను పెట్టి సృజన తృష్ణతోపాటు విజయకాంక్షనూ తీర్చుకున్నారు. ఇటు సోషల్ మీడియా ఆడియెన్సూ వాటికి విపరీతంగా వ్యూస్ ఇచ్చి, షేర్స్ పెంచి బ్లాక్‌బస్టర్స్‌ను చేశారు. ఆ ట్రెండ్ ఈ యేడు జరగబోయే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకూ స్ట్రెచ్ అయ్యే దృశ్యం కనపడుతోంది. అయితే ఒకరినొకరు తిట్టుకోవడం..మార్ఫింగ్ చేసుకోవడం నేలబారు పోకడ. కొత్త ప్లాన్ ఏంటంటే.. కొన్ని బాలీవుడ్ సినిమాల థీమ్‌ను ఎన్నికల ప్రచార అస్త్రాలుగా.. వాగ్దానాలుగా మలచుకోవడం! మల్టీప్లెక్స్, సింగిల్, స్మాల్, వెబ్ స్క్రీన్(అన్ని వర్గాల) ఓటర్లనూ ఆకర్షించి కమర్షియల్ హిట్ లాంటి ఆల్ టైమ్ ఫేవరేట్ గవర్నమెంట్‌ను ఏర్పాటు చేయడం. అలాంటి సినిమాల ప్రస్తావనతో ఓ చిన్న పొలిటికల్ మూవీ క్రియేటివ్ ఎక్సర్సైజ్... పీప్లీ లైవ్.. ఇది రైతు కథ. కాలంలేక, పంటలు పండక, పెట్టిన పెట్టుబడి రాక ఆత్మహత్యా ప్రయత్నం చేస్తాడు పీప్లీ ఊళ్లోని ఓ రైతు. రైతు ఆత్మహత్య చేసుకుంటే ఎక్స్‌గ్రేషియా ప్రకటిస్తుంది ప్రభుత్వం. అందుకని ఆ డబ్బుకోసం ఈ రైతు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటాడు. ఎజెండా: ఇప్పటికే దేశంలో చాలా చోట్ల రైతులకు రుణమాఫీ, మద్దతు ధర వంటి పథకాలను అందచేస్తున్నాయి ప్రభుత్వాలు. అయినా రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల రైతుల ఇటీవలి ర్యాలీనీ విస్మరించకూడదు. అన్నం పెట్టే రైతు రుణాల్లో మునగకుండా చూడాలి. టాయ్‌లెట్.. మహిళల బహిర్భూమి సమస్యతో తెరకెక్కిన సినిమా. కనీస అవసరాల్లో ఇంట్లో టాయ్‌లెట్ ముఖ్యమైనది. దాని కోసం పోరాటం చేసి, సాధించిన ఓ కోడలి కథ. ఎజెండా: స్వచ్ఛభారత్ కింద కేంద్ర ప్రభుత్వం ఇంటింటికీ టాయ్‌లెట్ అనే నినాదంతో ఇప్పటికే వీటి నిర్మాణాన్ని చేపట్టింది. అయినా తెలుగు రాష్ట్రాల్లో ఇళ్లే లేవు ఇక టాయ్లెట్లు ఎక్కడ ఉంటాయి? చెరువులు, కాల్వల గట్లే ప్రత్యక్ష ఉదాహరణలు. టాయ్‌లెట్ ఉన్న ఇల్లు అంటే ఆడపడచుకి గౌరవమిచ్చే ఇల్లు అని. ఆ క్రెడిట్ ప్రాంతీయ పార్టీల ఖాతాలోనూ చేరాలి. ఓ మై గాడ్.. దేవుడికి, నాస్తికుడికి మధ్య ఉన్న భక్తివిశ్వాసాల సారం ఈ చిత్రం. విశ్వంలో జరిగే ప్రతి కర్మ, క్రియకు కర్త ఆ భగవంతుడే. సర్వమత సారాంశం ఇదే. ఈ సినిమా చర్చా దీని మీదే. ఎజెండా: దేవుడు ఉంటే అందరికీ ఉంటాడు. లేకపోతే ఎవరికీ లేడు. ఉన్నాడనేదే మెజారిటీ నమ్మకం. కనుక ఆడ,మగ, కుల,వర్గ భేదం లేకుండా ఏ గుడిలోకైనా అందరికీ ప్రవేశం కావాలి. దేవుడితో రాజకీయాలు వద్దు. దేవుడి జన్మస్థానం పేరుతో మత యుద్ధాలు వద్దు. హేతుబద్దమైన ఆలోచనాతీరును పెంపొందించే విద్యావిధానానికి శ్రీకారం చుట్టాలి. అత్యున్నత న్యాయస్థానాల తీర్పును గౌరవించే వాతావరణాన్ని కల్పించాలి. రాజ్‌నీతి మహాభారత కథకు ఆధునిక రూపం ఈ సినిమా. కుటుంబ పాలన, అధికారం కోసం రక్తసంబంధీకుల మధ్య కలహాలు, మైనారిటీ ఓట్లకోసం ఆరాటం, ఆధిపత్య పోరాటమే ఈ మూవీ స్టోరీ. ఎజెండా: ప్రజాస్వామ్యం అంటే అధికారం ప్రజలకు బంటు అనే కదా! ఈ నమూనా కుటుంబ పాలనకు ఫక్తు వ్యతిరేకం. మైనారిటీ సంక్షేమం వాళ్ల ఓటు బ్యాంకులో మురగొద్దు. వాళ్ల అభివృదై్ధ కనపడాలి. మసాన్.. సమాజంలో అన్ని రకాల దోపిడీకి గురవుతున్న వర్గాల కథ. బడుగు, బలహీనుల మీద దాడులు కూడదని చూపించే చిత్రం. ఎజెండా: కులాల మధ్య అంతరాలు పోవాలని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలూ సమాజంలో గౌరవ మర్యాదలు అందుకోవాలనే రిజర్వేషన్స్ కల్పించింది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను తెచ్చింది. కాని పురోగమించాల్సిన మనం తిరోగమనానికి సిద్ధపడ్డాం. దేశంలో దళితులపై దమనకాండలు పరువు హత్యల పేరుతో రూపం మార్చుకున్నాయి. చట్టాలను కాలరాస్తున్నాం. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించాలి. బడుగు, బలహీనులకు అండగా ఉన్న చట్టాలను పరిరక్షించే ప్రయత్నం చేయాలి. అయ్యారీ.. రక్షణశాఖలో జరిగిన కుంభకోణానికి సంబంధించిన సినిమా ఇది. దేశానికి కంచెగా ఉన్న డిఫెన్స్ మినిస్ట్రేయే డబ్బుకి ఆశపడి ప్రజల రక్షణను లంచానికి పణంగా పెట్టే కహానీ అయ్యారీ. ఎజెండా: ఓటు అంటే నమ్మకం. గెలుపు అంటే బాధ్యత. ఈ రెండిటినీ సమన్వయం చేసుకునేదే అధికారం. ప్రజల మంచిచెడులకు బాధ్యత వహించడానికి ముందుకు వస్తున్న పార్టీలు ఈ అంశాన్ని విస్మరించకూడదు. దేశ రక్షణకు సంబంధించి గతంలో జరిగినవి, ఇప్పుడు దుమారంలో ఉన్న డిఫెన్స్ డీల్స్ కుంభకోణాలు కావనే విశ్వాసాన్ని ప్రజలకు కల్పించాలి. వారి భద్రతకు తామే కాపలా అన్న భరోసానివ్వాలి. రాజీ.. ‘అయ్యారీ’కి విరుద్ధమైన కథే రాజీ. దేశం కోసం సొంత కూతురి జీవితాన్నే బలిగా పెట్టిన ఓ గూఢచారి కథ. ఎజెండా: జాతీయవాదం అంటే మతం పేరుతో దేశంలోని ప్రజలను విడగొట్టడంకాదు. మతానికి అతీతంగా దేశం కోసం నిలబడ్డం. ప్రజల మధ్య ఐకమత్యాన్ని చాటడం. అంతర్గత భద్రత లేకుండా సరిహద్దు రక్షణ ఎలా సాధ్యం? ‘రాజీ’ని ఇలా స్ఫూర్తిగా తీసుకొని ఐక్యతను ఎజెండాలో భాగం చేసుకోవాలి. కార్యాచరణకు అడుగులు వేయాలి. పింక్.. ‘‘అవునంటే కాదనిలే.. కాదంటే అవుననిలే.. ఆడవారి మాటలకే అర్థాలే వేరులే’’ అన్న ఈ పాదం తప్పు. ‘నో’ అంటే ‘నో’ అనే. దానికి ఇంకా వేరే అర్థాలేం లేవు. ‘వద్దు’ అనే స్ట్రయిట్ మీనింగే. పింక్ సినిమా చెప్పేదీ ఇదే. స్త్రీలను గౌరవించమని. ఇష్టంలేదు అని ఆమె అంటే వినమని. ఆ మాటకు విలువివ్వమని. ఎజెండా: ఆకాశంలో సగం మాట దేవుడెరుగు దేశంలో సగం జనాభా ఉన్న మహిళలకు ఎక్కడా సమాన హక్కులు లేవు. అవకాశాలు అంతకన్నా లేవు. రాజకీయాల్లో 33 శాతం రిజర్వేషన్ చర్చల్లో వినిపిస్తోంది తప్ప బిల్లుగా కనిపించట్లేదు. ఉద్యోగాల్లో అన్నిరకాల వేధింపులే బోనస్. కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిస్తే చాలు పుట్టకుండా కుట్రలు నూరుతున్నారు. భూమ్మీదున్న వాళ్లనైతే రకరకాల అవమానాలతో చంపేస్తున్నారు. చట్టాలు చేసి ఊరుకోవడం కాదు.. అమలు జరిగేలా, అతిక్రమణ లేకుండా చూడాలి. ప్రతి పార్టీ ప్రాక్టికల్ ఎజెండాలో మహిళ భాగం కావాలి. అప్పుడే ఆమె అభివృద్ధిలో అర్ధభాగంగా, ఉత్పాదక శక్తిగా సముచిత స్థానం పొందుతుంది. రోటీ.. కపడా.. ఔర్ మకాన్.. ఎప్పటిదో ఈ సినిమా. ఇప్పటికీ ఈ మూడు ఉన్న జనాభా చాలా తక్కువ మన దేశంలో. ఎజెండా: ఎన్నిటినో సాధిస్తున్నారు. అంతరిక్షంలోకి వెళ్లడానికీ బడ్జెట్‌ను కూడబెడ్తున్నారు. కాని కూడు, గుడ్డ, గూడుకే కరువు చూపిస్తున్నారు. ఈ కనీస అవసరాలను సమకూర్చుకోలేకపోతున్నాం. ఈసారైనా వీటిని సంపూర్ణంగా సాధిస్తే మిగిలిన పురోభివృద్ధిలో ప్రజలూ పార్ట్నర్స్ అవుతారు. న్యూటన్.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎన్నికలు సజావుగా జరిగేలా చూసే ఓ ప్రభుత్వ ఉద్యోగి కథ ఇది. ఎజెండా: పైనవన్నీ సాధించాలన్నా ప్రజాస్వామ్య స్ఫూర్తి సజావుగా సాగాలన్నా ఎన్నికలు సక్రమంగా జరగాలి. బ్యాలెట్ బాక్స్‌లు ఉంటే రిగ్గింగు జరిగే అవకాశం ఎక్కువని ఈవీఎంలకు వెళ్లాం. ఈవీఎంలనూ ట్యాంపర్ చేయొచ్చనే వాదనా వినపడుతోంది. అందుకని ప్రతి పార్టీ తమ ఎజెండాల్లో ముందుగా పోలింగ్‌లో అవినీతికి పాల్పడమనే స్వీయవాగ్దానం చేసుకోవాలి. – సరస్వతి రమ(ది ఎకనమిక్ టైమ్స్ సౌజన్యంతో..) బయోపిక్స్ సినిమాల్లోంచి రాజకీయాల్లోకి వచ్చి నేతలుగా మారిన వాళ్ల లైఫ్ బయోపిక్స్‌గా వస్తున్నాయి . అలాగే జన నేతలుగా పేరుగాంచిన నాయకుల జీవితాలుకూడా సినిమాలుగా తెరకెక్కాయి. అవన్నీ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మన్ మోహన్ సింగ్, ఎన్.టి.ఆర్, వై.ఎస్.రాజశేఖరరెడ్డి బయోపిక్స్ ఇందుకు ఉదాహరణ. -
‘అడ్డుగా ఉన్నారనే రంగాని హతమార్చారు’
సాక్షి, కృష్ణా: పదేళ్ళ వయస్సులో తండ్రిని కోల్పోయానని, ముప్పైఏళ్ళ క్రితం అభిమానులు ఓ నేతను కోల్పోయారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో వంగవీటి రాధా, రంగా స్మారక భూమికి రాధాకృష్ణా బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా చనిపోయి మూడు దశాబ్ధాలు అవుతున్నా నేటికీ ఆయన అభిమానులు స్మరించుకుంటున్నారని, వాడవాడలా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. రంగాను నమ్ముకున్న వారిని ఆదుకోవాల్సిన అవసరముందని, ఆయన స్మారకార్ధం సేవా కార్యక్రమాలు చేపడతామని రాధా వెల్లడించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత రంగా అని, కొందరికి అడ్డుగా ఉన్నారని ఆయనను హతమార్చారని వైఎస్సార్సీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తుచేశారు. రంగా కార్యకర్తలు, అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేతలు యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, తుమ్మల చంద్రశేఖర్, రంగా-రాధా మిత్రమండలి సభ్యులు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. -
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్
-
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్: జీవీ
సాక్షి, విజయవాడ: వంగవీటి రంగాపై ఉన్న అభిమానాన్ని చాటుకునేందుకు టెలీ సీరియల్ నిర్మించనున్నట్లు సినీ నటుడు జి.వి.సుధాకర్‌నాయుడు ప్రకటించారు. ప్రజల గుండెల్లో ఉన్న ఆయన గురించే ఈ సీరియల్ ఉంటుందన్నారు. రంగా వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలోని రాఘవయ్య పార్కులో గల ఆయన విగ్రహానికి జీవీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సీరియల్లో అన్నీ వాస్తవాలే ఉంటాయన్నారు. ఇందుకు దేవినేని అనుమతి అవసరం లేదని, అభ్యంతరాలు చెబితే వారిని కూడా కలుస్తానని చెప్పారు. వర్మ తనకున్న మేథాశక్తి మేరకే వంగవీటి సినిమా తీశారని, అందులో కొన్ని తీశారు.. కొన్ని దాచారని అన్నారు. వర్మ దగ్గర మరో సినిమా ఉందంటూ అది ఎందుకు బయటకు రాలేదని ప్రశ్నించారు. వాస్తవాలు కటువుగా ఉంటాయి.. అందరి పేర్లు పెట్టే సీరియల్ చేస్తాను.. ఎవరైనా భుజాలు తడుముకుంటే నేనేం చేయలేనని వ్యాఖ్యానించారు. దాసరి నారాయణరావు నా గురువు.. వంగవీటి రంగాపై సినిమా తీయాలని ఆయన చివరి దశలో నన్ను కోరారని చెప్పారు. రంగా చరిత్ర మొత్తం ఆరున్నర గంటలపాటు చిత్రీకరించాల్సి ఉందని, అందుకే సినిమాగా కాక టెలీ సీరియల్‌గా తీస్తున్నామని, 150 ఎపిసోడ్ల వరకు ఉంటుందని జీవీ వివరించారు. -
వంగవీటి రంగాకు వైఎస్ జగన్ నివాళి
సాక్షి, అనంతపురం: కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వర్ధంతి కార్యక్రమం అనంతపురంలో జరిగింది. జిల్లాలో 44వ రోజు ప్రజాసంకల్ప యాత్రలో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కదిరి నియోజకవర్గంలోని గాండ్లపెంటలో జరిగిన వంగవీటి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. మా స్ఫూర్తి, ఆదర్శం రంగా: రాధా విజయవాడ నగరంలో వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. నగరంలోని బందరు రోడ్డులో గల రాఘవయ్య పార్కులోని రంగా విగ్రహానికి పూల మాలలు వేసి ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ ఇన్చార్జి వంగవీటి రాధాకృష్ణ ఘనంగా నివాళులర్పించారు. ఆయన చనిపోయి ఇన్ని ఏళ్లు అయినా వాడవాడలా అభిమానులు ఆయన వర్థంతిని జరుపుతున్నారని అన్నారు. రంగా ఒక కులం.. ఒక మతం.. ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాదన్నారు. దేశవిధేశాలలో ఆయనకు అభిమానులున్నారని చెప్పారు. రానున్న రోజుల్లో రంగా అభిమానులు ప్రతి విషయంలో కలిసికట్టుగా ఉండాలలని ఉద్బోధించారు. కాగా, నగరంలోని వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యాలయంలో వంగవీటి వర్ధంతి జరిగింది. పార్టీ నేతలు కొలుసు పార్థసారథి, మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, ఆసిఫ్, సోమినాయుడు, తోట శ్రీనివాస్, అడపా శేషు, పలువురు కార్పొరేటర్లు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల గుండెల్లో రంగా చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రంగా ఆశయాలను ఆయన అభిమానులు ముందుకు తీసుకు వెళ్లాలని కోరారు. అలాగే స్థానిక రాఘవయ్య పార్కు వద్ద రంగా విగ్రహానికి ఆయన కుమారుడు రాధా నివాళులు అర్పించారు. ఆయనతోపాటు సినీ నటుడు జివి నాయుడు కూడా ఉన్నారు. అనంతరం రంగాపై మెగా సీరియల్ తీస్తున్నట్టు జీవీ ప్రకటించి పోస్టర్ ఆవిష్కరించారు. చిలకలూరిపేటలో.. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో రంగా వర్ధంతి సందర్భంగా విశ్వనాథ్ ధియేటర్ వద్ద గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మర్రి రాజశేఖర్, నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. -
వంగవీటి హత్యపై పవన్ స్పందన
-
జుట్టు ఎక్కువై నేనే గుండు కొట్టించుకున్నాను
-
‘గుండు’ ప్రచారం చేయించింది టీడీపీ వాళ్లే: పవన్
సాక్షి, విజయవాడ : గతంలో తనకు పరిటాల రవి గుండు చేయించారన్న ప్రచారంపై ప్రముఖ హీరో, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శుక్రవారం ఆయన విజయవాడలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ...‘ పరిటాల రవి నాకు గుండు కొట్టించింది అనేది ప్రచారం మాత్రమే. అది పచ్చి అబద్ధం. ఆ ప్రచారం చేయించింది కూడా టీడీపీ వాళ్లే. టీడీపీ వాళ్లు అప్పుడు నాకు చాలా ద్రోహం చేశారు. అయినా అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు. అన్ని చేసిన టీడీపీకి గత ఎన్నికల్లో ఎందుకు మద్దతు ఇచ్చానంటే కులాల ఐక్యత కోసమే. సినిమాలపై చిరాకు వచ్చే నేను గుండు చేయించుకున్నా. ఈ ప్రచారం మొదలు అయినప్పుడు పరిటాల రవి ఎవరో కూడా నాకు తెలియదు’ అని అన్నారు. గతంలో ఒక వివాదం విషయంలో పరిటాల రవి స్వయంగా బెదిరించి పవన్ కల్యాణ్‌కు గుండు చేయించారని ప్రచారం బాగా జరిగింది. సుదీర్ఘ కాలం తర్వాత పవన్ స్వయంగా ఆ విషయాన్ని ప్రస్తావించడం పలువురిని విస్మయపరుస్తోంది. అలాగే వంగవీటి రంగా హత్యపై కూడా పవన్ ప్రస్తావించారు. వంగవీటి రంగాను చంపడం తప్పు. విజయవాడలో ఇంకా కులాల వ్యవస్థ నుంచి మారలేదు. నగర ప్రజలు కులం ఉచ్చు నుంచి ఇంకా బయటకు రాలేదని ఆయన వ్యాఖ్యలు చేశారు. పనిలో పనిగా తెలంగాణలో కులాభిమానం తక్కువ.. తెలంగాణ అభిమానం ఎక్కువ అంటూ పవన్ పేర్కొన్నారు. అంతేకాకుండా త్వరలో సినిమాలు కూడా పూర్తిగా వదిలేస్తానని తెలిపారు. -
వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోం: రాధా
విజయవాడ: దివంగత నేత వంగవీటి రంగాను విమర్శిస్తే ఊరుకోబోమని ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధాకృష్ణ హెచ్చరించారు. వంగవీటి రంగాపై గౌతమ్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆయన అభిమానులు బాధపడ్డారని తెలిపారు. రంగాను అభిమానించే వారు అన్ని పార్టీల్లోనూ ఉన్నారని, ఆయనను విమర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయన్నారు. సోమవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గౌతం రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో రంగా అభిమానులు ఎవరూ బాధపడొద్దని, ధైర్యంగా ఉండాలని ఆయన సూచించారు. రెండు హత్య కేసులతో గౌతంరెడ్డికి సంబంధాలు ఉన్నాయని, ల్యాండ్ మాఫియాతోనూ ఆయనకు ప్రమేయముందని రాధా ఆరోపించారు. గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండించడానికి నిన్న (ఆదివారం) ప్రెస్‌మీట్ పెట్టేందుకు ప్రయత్నిస్తే.. కొంతమంది పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని మండిపడ్డారు. మహిళ, మాజీ ఎమ్మెల్యే అని చూడకుండా రత్నకూమారిని పోలీసులు రోడ్డుపై ఈడ్చుకెళ్లారని, ఈ ఘటనపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. కొంతమంది పోలీసుల అతివల్లే నిన్న ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. గౌతంరెడ్డిని సస్పెండ్ చేస్తూ మా పార్టీ సరైన నిర్ణయం తీసుకుందని రాధా సంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడ నగరంలో అన్ని వర్గాల కోసం వంగావీటి రంగా పనిచేశారని అన్నారు. చనిపోయిన వారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన సూచించారు. -
ఆగ్రహావేశాలు
♦ వంగవీటి రంగాపై గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు ♦ రాధా, రత్నకుమారి తదితరుల తీవ్ర నిరసన ♦ అడ్డుకున్న పోలీసులు... ఉద్రిక్తత ♦ రంగా కుటుంబానికి బాసటగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ♦ వైఎస్సార్ సీపీ నుంచి గౌతంరెడ్డి సస్పెన్షన్ ♦ పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు దివంగత నేత వంగవీటి రంగా, ఆయన సోదరుడు రాధాకృష్ణలపై పూనూరి గౌతంరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు ఆగ్రహావేశాలకు దారితీశాయి. గౌతంరెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ పార్టీ కార్యా లయంలో విలేకరుల సమావేశం నిర్వహించేం దుకు వెళ్తున్న వంగవీటి రాధా, ఆయన తల్లిరత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ ఆదివారం అట్టుడికింది. పోలీసుల అత్యుత్సాహం విమర్శలకు దారి తీసింది. 1. మొగల్రాజపురంలోని తన నివాసం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి బయలుదేరుతున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిని అడ్డుకున్న పోలీసులు 2. వంగవీటి రాధాకృష్ణను బలవంతంగా అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు సాక్షి, అమరావతి బ్యూరో : వంగవీటి రంగా, రాధాపై పూనూరి గౌతంరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రంగా కుటుంబానికి బాసటగా నిలిచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌతంరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారితో పాటు పార్టీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం బందరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు వస్తున్న వంగవీటి రంగా తనయుడు రాధాను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రికత్త నెలకొంది. ముందస్తు చర్యల్లో భాగంగా రాధా, రత్నకుమారిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో విజయవాడ నగరం అట్టుడికింది. పోలీసుల అత్యుత్సాహంపై విమర్శలు వెల్లువెత్తాయి. గౌతంరెడ్డిపై పెల్లుబికిన ఆగ్రహం వంగవీటి రంగా, రాధాలపై ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గౌతంరెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆగ్రహం పెల్లుబికింది. గౌతంరెడ్డిపై వంగవీటి రాధాకృష్ణ, రత్నకుమారి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేశారు. మొగల్రాజపురం వీధుల్లో వైఎస్సార్ సీపీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అప్రమత్తమైన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, అభిమానులు గౌతంరెడ్డి ఇంటి ముట్టడికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. రంగా కుటుంబానికి అండగా వైఎస్సార్ సీపీ గౌతంరెడ్డి వ్యాఖ్యలను వైఎస్సార్ సీపీ తీవ్రంగా పరిగణించింది. ఆయన వ్యాఖ్యలపై పార్టీ అధి ష్టానం ఆగ్రహం వ్యక్తం చేసింది. పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ తప్పితే ఉపేక్షించేది లేదంటూ తేల్చిచెబుతూ.. గౌతంరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. గౌతంరెడ్డి వ్యవహారశైలిని తప్పుబడుతూ.. రంగా కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చింది. రెండు రోజులుగా టీవీ చానల్లో గౌతంరెడ్డి ఇంటర్వ్యూలోని కొన్ని అంశాలు ప్రసారం కావడం.. ఆదివారం ఉదయం సోషల్ మీడియాలో ఆయన వ్యాఖ్యలకు సంబం «ధించిన వీడియో వైరల్ కావడంతో తీవ్రంగా పరిగణించిన అధిష్టానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసుల ఓవరాక్షన్.. గౌతంరెడ్డి వ్యాఖ్యలపై స్పందించేందుకు బందరురోడ్డులోని పార్టీ కార్యాలయంలో వంగవీటి రాధా విలేకరులు సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా ఇందుకు అనుమతిచ్చారు. ఆ తర్వాత పార్టీ కార్యాలయానికి బయల్దేరి వెళ్తున్న రాధాను పోలీసులు అడ్డుకోవడంతో వారి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. తన కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలుసుకున్న రాధా తల్లి రత్నకుమారి ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులతో తీవ్రస్థాయిలో వాగ్వావాదానికి దిగారు. తన కుమారుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ నిలదీశారు. ఈ నేపథ్యంలో పోలీసులు, రాధా, రత్నకుమారి, పార్టీ నేతల మధ్య తోపులాట జరగడంతో రత్నకుమారి సొమ్మసిల్లి పడిపోయారు. దీంతో పోలీసుల తీరుపై కార్యకర్తలు, అభిమానులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల ఓవరాక్షన్‌పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. హైడ్రామా... వంగవీటి రా«ధ, రత్నకుమారిని అదపులోకి తీసుకున్న పోలీసులు నగరంలోని పలు స్టేషన్ల చుట్టూ తిప్పుతూ హైడ్రామా నడిపించారు. సాయంత్రం అదుపులోకి తీసుకున్నప్పటికీ రాత్రి వరకు నగరమంతా తిప్పి, చివరకు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రాధ, రత్నకుమారి స్టేషన్లో నేలపైనే కూర్చుని పోలీసుల తీరుకు నిరసన తెలిపారు. పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్, పార్టీ విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు స్టేషన్‌కు వెళ్లి వారిని పరామర్శించారు. మరికొంత మంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని మాచవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనుచిత వ్యాఖ్యలు సరికాదు : కొలనుకొండ విజయవాడ సెంట్రల్ : దివంగత ఎమ్మెల్యే వంగవీటి రంగాపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని పీసీసీ అధికార ప్రతినిధి కొలనుకొండ శివాజీ ఆదివారం ప్రకటన్లో సూచిం చారు. గౌతమ్‌రెడ్డి వ్యాఖ్యలు రంగా అభిమానుల మనో భావాలను దెబ్బతీశాయని పేర్కొన్నారు. బడుగు, బలహీన వర్గాలకు రంగా ఆరాధ్యదైవమని గుర్తుచేశారు. ప్రజా సమస్యలపై నిరాహార దీక్ష చేస్తుండగా ప్రత్యర్థుల చేతిలో రంగా హత్యకు గురవడం, తదనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలు అందరికీ తెలు సని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఉన్న విజయవాడలో కొన్ని వర్గాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు. వంగవీటి రాధా, రత్నకుమారి అక్రమ నిర్బంధం ఇబ్రహీంపట్నం(మైలవరం) : వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగవీటి రాధాకృష్ణ, ఆయన తల్లి రత్నకుమారిని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు ఆదివారం రాత్రి అక్రమంగా నిర్బంధించారు. విజయవాడలో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు వైఎ స్సార్ సీపీ కార్యాలయానికి వెళ్తున్న రాధాను, ఆయన తల్లిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలిం చారు. చిరిగిన చొక్కాతో స్టేషన్లో ఉన్న రాధా పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ నిర్బంధానికి నిరసనగా తల్లీకుమారులు పోలీస్ స్టేషన్లో నేలపై కూర్చున్నారు. రాధా, రత్నకుమారిని పోలీసులు నిర్బంధించిన విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు భారీగా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. వంగవీటి మోహనరంగా జోహార్ అంటూ నినాదాలు చేశారు. విజయవాడ డీసీపీ రాణా, ఏసీపీ రామకృష్ణ కార్యకర్తలను అదుపుచేయలేకపోయారు. 144 సెక్షన్ విధించి పోలీస్‌స్టేషన్ రోడ్డును మూసివేయించాల్సిన పరిస్థితి వచ్చింది. వైఎస్సార్ సీపీ నేతల బాసట వంగవీటి రాధాను అక్రమంగా నిర్బంధించారనే విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ హుటాహుటిన పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. రాధాకృష్ణ, రత్నకుమారిని పరామర్శించి, వారికి బాసటగా నిలిచారు. ఈలోపు విజయవాడ నుంచి పార్టీ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లాది విష్ణు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త బొప్పన భవకుమార్ కూడా అక్కడి చేరుకున్నారు. మీడియాను లోపలకు అనుమతించకపోవటంతో కార్యకర్తలు గేటు ఎదుట కొద్దిసేపు నినాదాలు చేశారు. పార్టీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, జి.కొండూరు జెడ్పీటీసీ సభ్యుడు కాజా బ్రహ్మయ్య, నాయకులు మేడపాటి నాగిరెడ్డి, జోగి రాము, అక్కల గాంధీ, నల్లమోతు మధుబాబు, రవి, పలువురు ఎంపీటీసీ సభ్యులు, కార్యకర్తలు రాధాకు బాసటగా నిలిచారు. -
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం.
-
వంగవీటి రంగా విగ్రహం ధ్వంసం
విజయవాడ : నగరంలోని సింగ్ నగర్లో వంగవీటి రంగా విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడంతో ఆ ప్రాంతంలో ఆదివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సింగ్ నగర్ నడిబొడ్డున ఏర్పాటు చేసిన వంగవీటి రంగా విగ్రహం ధ్వంసమై ఉండడాన్ని స్థానికులు ఈ రోజు ఉదయం కనుగొన్నారు. ఈ వార్త దావానలంలా వ్యాపించడంతో రంగా అభిమానులు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని ధర్నాకు దిగారు. రంగా విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని, రంగా విగ్రహాన్ని యథావిధిగా ప్రతిష్టించాలని వారు డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళవకారులకు నచ్చచెప్పారు. విగ్రహాన్ని కూల్చిన దుండగులను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. -
'నేనే దేవుడ్ని...నేను దేవుడ్ని నమ్మను'
గుంటూరు : మహాభారతంలో హింస కన్నా బెజవాడలోనే ఎక్కువగా హింస జరిగిందని ప్రముఖ దర్శక,నిర్మాత రాంగోపాల్ వర్మ వ్యాఖ్యానించారు. శనివారం కేఎల్ యూనివర్సిటీలో విద్యార్థులతో...వర్మ చర్చావేదిక జరిగింది. ఈ సందర్భంగా రాంగోపాల్ వర్మ మాట్లాడుతూ...'నేనే దేవుడ్ని...నేను దేవుడ్ని నమ్మను. యముడు వచ్చి గొంతుమీద కత్తి పెట్టినా భక్తి సినిమా తీయను' అని వ్యాఖ్యానించారు. మరోవైపు వంగవీటి సినిమా తీయడానికి ఆ కథకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకునేందుకు వర్మ శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడలో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ)తో ఆయన ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. అలాగే నగరంలోని పలువురి ప్రముఖుల నుంచి వివరాలను ఆయన సేకరిస్తున్నారు. గతరాత్రి వంగవీటి రంగా అనుచరులు, సన్నిహితులతో వర్మ భేటీ అయ్యారు. కాగా వంగవీటి రంగా సతీమణి రత్నకుమారి...వర్మన కలిసేందుకు నిరాకరించినట్లు సమాచారం. ఇక తన స్నేహితుడు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను ఇవాళ ఆయన కలవనున్నారు. -
నేను నమ్మిన నిజాలే వంగవీటి సినిమా: వర్మ
విజయవాడ సిటీ:తాను నమ్మిన, తనకు తెలిసిన నిజాలు ‘వంగవీటి’ సినిమాలో ఉంటాయని సంచలన వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ చెప్పారు. మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ), ప్రముఖ న్యాయవాది కర్నాటి రామ్మోహన్సహా పలువురిని కలవనున్నట్టు తెలిపారు. చిత్రీకరణకు ముందే సంచలనం రేపుతున్న వంగవీటి సినిమా నిర్మాణానికి ముందు అప్పటి పరిస్థితులతో ప్రత్యక్ష సంబంధం ఉన్న, తెలిసిన వారిని కలిసేందుకు శుక్రవారం సాయంత్రం నగరానికి వచ్చారు. ఈ సందర్భంగా ఇక్కడ విలేకరుల సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ చలసాని వెంకటరత్నం హత్య మొదలు వంగవీటి రంగా హత్య వరకు తన చిత్ర కథాంశం ఉంటుందన్నారు. తన సినిమాలో నిజం మాత్రమే ఉంటుందే తప్ప ఏ ఒక్కరినో కించపరచడం, తప్పు చేసినట్టు చూపించడం ఉండదన్నారు. అప్పట్లో చోటుచేసుకున్న ఘటనలు, కారణాలు, పరిస్థితులు తెలుసుకోవాల్సి ఉందన్నారు. ఇందుకోసం పలువురిని కలవాల్సి ఉందని, అయితే, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాధాకష్ణలు తమను కలవవద్దని చెప్పినట్టు తెలిపారు. కలవాలనుకోవడం తన ఇష్టమని, కలవవద్దనుకోవడం వారి ఇష్టమని ఆయన స్పష్టంచేశారు. అప్పటి పరిస్థితులతో ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉన్న వారి నుంచి కొన్ని వివరాలు తెలుసుకోవాల్సి ఉందన్నారు. వారిలో చిన్నపాటి వ్యక్తి మొదలు పేరొందిన నాయకులు, సన్నిహితులు ఉండొచ్చని చెప్పారు. ఎవరిని కలిసి, ఏం మాట్లాడతాననేది ఇప్పుడు చెప్పనన్నారు. మూడు రోజులు ఇక్కడే ఉండి ప్రతి ఒక్కర్నీ కలవనున్నానన్నారు. కలిసిన తర్వాత అవసరమైన పక్షంలో చెపుతానని తెలిపారు. తాను విజయవాడ కాలేజీలో చదివే రోజుల్లో జరిగిన అంశాలు అయినందున సినిమా తీయాలని నిర్ణయించుకున్నానన్నారు. సినిమా తీయాలనుకున్నప్పుడు ఏ ఒక్కరి అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని, రక్తచరిత్ర సమయంలో పరిటాల సునీత అనుమతి కూడా తీసుకోలేదని చెప్పారు. వంగవీటి సినిమా వల్ల కొందరికి, తనకు తప్ప ఆయా వర్గాల మధ్య విభేదాలు ఎందుకొస్తాయని ఆయన ప్రశ్నించారు. అప్పటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ముంబైలోనే సినిమా షూటింగ్ జరుపుతానని అన్నారు. మరో పది రోజుల్లో సినిమా ప్రారంభించి జూన్ మొదటి వారంలో విడుదలకు నిర్ణయించామని చెప్పారు. విలేకరుల సమావేశంలో వంగవీటి సినీ నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. -
తనపై వచ్చిన ఆరోపణలు ఖండించిన కోడెల
గుంటూరు: తనపై వచ్చిన ఆరోపణలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఖండించారు. వంగవీటి రంగా హత్య ఘటన విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా బాధించాయన్నారువంగవీటి రంగా హత్య జరిగిన సమయంలో తాను హోంమంత్రిగా ఉన్నానని, ఆ తర్వాత పలుచోట్ల అల్లర్లు జరిగాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఆ సంఘటనలు తనను కలిచివేయడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు కోడెల తెలిపారు. రంగాతో తనకు స్నేహం కానీ, అలా అని శత్రుత్వంగానీ లేదని ఆయన అన్నారు. -
వంగవీటి రంగా, రాధా హత్యోదంతాలపై సినిమా
కాపు ఐక్య గర్జనకు ముమ్మర ఏర్పాట్లు 31న తునిలో ముద్రగడ ఆధ్వర్యంలో భారీ సభ సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఈనెల 31న తూర్పు గోదావరి జిల్లా తునిలో తలపెట్టిన కాపు ఐక్య గర్జన మహాసభను విజయవంతం చేసేందుకు కాపు రిజర్వేషన్ల పోరాట సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. వారం రోజులుగా రాష్ట్రానికి చెందిన వివిధ కాపు సంఘాలు హైదరాబాద్‌లో వరుస భేటీలు నిర్వహిస్తున్నాయి. కులాలు, మతాలతో సంబంధం లేకుండా రిజర్వేషన్లపై అవగాహన ఉన్న ప్రముఖులు, మేధావులతో సంప్రదింపులు జరుపుతున్నాయి. రిజర్వేషన్లు ఎందుకు అవసరమో, అవెందుకు పోయాయో ప్రముఖ యూనివర్సిటీలు, న్యాయకోవిదులు, మాజీ ఐఏఎస్‌లతో తమ సభ్యులకు తరగతులు చెప్పిస్తున్నాయి. అలాగే 150కి పైగా కాపు సంఘాలు సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాయి. ప్రతి జిల్లా నుంచి కనీసం 50 వేల మంది రావాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. పాలకులను హడలెత్తిస్తాం: తునిలో జరిగే గర్జనతో పాలకులను హడలెత్తిస్తామని, తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగుతుందని రాష్ట్ర కాపు రిజర్వేషన్ నాయకుడు ఆరేటీ ప్రకాశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వంగవీటి రంగా, రాధా హత్యోదంతాలపై సినిమా తాడేపల్లిగూడెం: ‘కాపు కుల సంక్షేమం కోసం పోరు సలుపుతున్న వంగవీటి రాధా, రంగాలను వేరే సామాజిక వర్గానికి చెందిన వారు కుట్రలు, కుతంత్రాలతో ఎలా మట్టుపెట్టారు. ఆ ఇద్దరినీ ఎలా పావులుగా వాడుకున్నారు. పని అయ్యాక పథకం ప్రకారం ఎలా అంతమొందించారు’ అనే కథాంశంతో కాపులను బీసీలలో చేర్చాలని పోరు ఊపందుకుంటున్న తరుణంలో ఒక సినిమా చిత్రీకరణకు సన్నాహాలు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ సినిమాకు ఈ నెల 31న తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరగనున్న కాపు మహాగర్జన సభలో క్లాప్ కొట్టడానికి ఏర్పాట్లు సాగుతున్నట్టు తెలిసింది. -
వంగవీటి చిత్రంపై వర్మ ఇంటర్వ్యూ
హైదరాబాద్: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ తన తర్వాతి చిత్రం 'వంగవీటి' విశేషాలను వెల్లడించనున్నారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు సాక్షి టీవీకి వర్మ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. వంగవీటి చిత్రం గురించి వివరాలను తెలియజేయనున్నట్టు వర్మ ట్వీట్ చేశారు. 'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా పేరును ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. My interview on the details of the film "Vangaveeti" on Sakshi channel at 3.30 pm today — Ram Gopal Varma (@RGVzoomin) January 4, 2016 -
నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి'
-
నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ
'కిల్లింగ్ వీరప్పన్' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్లో వెల్లడించారు. 'కిల్లింగ్ వీరప్పన్'తో మళ్లీ మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందగలనని రాంగోపాల్ వర్మ నిరూపించకున్నారు. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుతోంది. ఈ నెల 7న 'కిల్లింగ్ వీరప్పన్' తెలుగులో విడుదల కానుంది. -
రంగా హత్యకేసులో నిందితుడు వెలగపూడి
టీడీపీది హత్యా రాజకీయాల చరిత్ర వైఎస్సార్సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ధ్వజం విశాఖ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దివంగత వంగవీటి రంగా హత్యకేసులో ప్రధాన సూత్రధారి.. నేటికీ ఆ కేసులో ఏ-5 నిందితునిగా ఉన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అరాచకాల గురించి ఎంత చెప్పినా తక్కువేన్నారు. వంగవీటి రంగాను అత్యంత కిరాతకంగా హతమార్చిన ఘటనను ఇంకా రాష్ర్ట ప్రజలు మర్చిపోలేదన్నారు. టీడీపీ హత్యా రాజకీయాల చరిత్రకు ఎమ్మెల్యే వెలగపూడి ప్రత్యక్ష నిదర్శనమని తీవ్రంగా దుయ్యబట్టారు. తీర్చలేని హామీలు వంద ప్రకటించిన చంద్రబాబు వాటిలో ఒక్కదాన్ని కూడా నూరు శాతం పూర్తిచేయలేదన్నారు. ఏడాదిన్నర చంద్రబాబు పాలనపై ఒక్కసారి మీకు మీరే ఆలోచించించుకోండి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ఏంచేసిందో అని ప్రజలకు సూచించారు. మహిళా సాధికారత అంటే మిహ ళా అధికారిని రోడ్డు మీదా ఈడ్చి కొట్టడమా! అని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో పాలకపక్ష తీరును ఎండగట్టే మహిళా ఎమ్మెల్యే ఆర్కే రోజాను సస్పెండ్ చేయడమా? ఆలోచించండి ఆయన కోరారు. తప్పుడు కేసులతో అప్పటి కేంద్రం ప్రభుత్వం, టీడీపీతో కుమ్మక్కై జైలుకు పంపినప్పటికీ వై.ఎస్.జగన్మోహన్రెడ్డి వెనకడుగు వేయలేదన్నారు. ప్రజాసంక్షేమం కోసం ఆరున్నరేళ్లుగా ప్రభుత్వాలపై ఆయన యుద్ధం చేస్తున్నారని చెప్పారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించడం ద్వారా విశాఖ నగర, రాష్ట్రాభివృద్ధికి దోహదపడాలని విజయసాయిరెడ్డి ప్రజలను కోరారు. -
'జోగయ్య ఇదే మాట గతంలో చెప్పారు'
కాకినాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా హత్య విషయంలో మాజీ మంత్రి హరిరామ జోగయ్య ఇప్పుడు ఏం చెప్పారో.. గతంలో కాకినాడ సమావేశంలోనూ అదే విషయం చెప్పారని ముద్రగడ అన్నారు. హత్యా రాజకీయాలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. రంగా హత్య వెనుక చంద్రబాబు పాత్ర ఉందంటూ హరిరామ జోగయ్య తన 'అరవై వసంతాల నా రాజకీయ ప్రస్థానం' పుస్తకంలో వెల్లడించిన సంగతి తెలిసిందే. పిల్లనిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన చరిత్ర చంద్రబాబుదని ముద్రగడ విమర్శించారు. ఎన్టీఆర్ మానసికంగా చనిపోవడానికి చంద్రబాబే కారణమని ఆరోపించారు. -
వంగవీటి మోహనరంగాకు అంబటి నివాళి
-
ఘనంగా వంగవీటి రంగ 26వ వర్థంతి!
-
రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా సాక్షి, విజయవాడ : దివంగత వంగవీటి రంగా హత్య కేసులో టీడీపీ నేతలే ముద్దాయిలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధాకృష్ణ ఆరోపించారు. 1988లో వంగవీటి రంగా హత్య ఏ ప్రభుత్వ హయాంలో జరిగింది, దానికి ఎవరు బాధ్యులు.. ప్రస్తుత స్పీకర్ కోడెల శివప్రసాదరావు అప్పుడు ఎందుకు రాజీనామా చేశారో అన్ని విషయాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునని ఆయన చెప్పారు. బుధవారం విజయవాడలోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రాధాకృష్ణ మాట్లాడారు. రంగా హత్య కేసు కొట్టేసినంత మాత్రానా దోషులు నిర్దోషులు కారన్నారు. శాసనసభలో చర్చను దారి మళ్లించడానికి తెలుగుదేశం పార్టీ పదేపదే సభలో పరిటాల రవి హత్య కేసును తెరపైకి తీసుకువచ్చి జగన్‌ను ముద్దాయి అనడం సరికాదని ఆయన మండిపడ్డారు. రంగా అభిమానులు అన్ని రాజకీయ పార్టీలో ఉంటారని, ఆయితే.. ఆయనకు గురించి మాట్లాడే నైతిక అర్హత టీడీపీకి లేదన్నారు. పరిటాల హత్య కేసులో ముద్దాయిలుగా టీడీపీ నేతలు ఆరోపించిన జేసీ బ్రదర్స్‌కు క్లీన్చిట్ ఇచ్చి ఎందుకు పార్టీలోకి తీసుకున్నారని ముందుగా మంత్రి పరిటాల సునీత.. చంద్రబాబు ప్రశ్నించాలన్నారు. గతంలో విపక్షంలో ఉన్న టీడీపీ.. జేసీ బ్రదర్స్ దోషులని బల్లగుద్ది మరీ వాదించిందని, ఇప్పుడు ఆ విషయాన్ని ఎందుకు మరిచిపోయిందని రాధా ప్రశ్నించారు. టీడీపీకి నిజంగా హత్యా రాజకీయాలపై మాట్లాడాలని చిత్తశుద్ధి ఉంటే విజయవాడలో జర్నలిస్టు పింగళి దశరథరాం, ఐఎఎస్ అధికారి రాఘవేంద్రరావు హత్యలు మొదలుకొని 1988లో జరిగిన రంగా హత్య వరకు అన్ని కేసులను తిరగదోడి విచారణకు ఆదేశించే సత్తా టీడీపీ ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. విజయవాడ నగర టీడీపీ నేత కాట్రగడ్డ బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం ఎవరు చేశారో.. వారు ఏ పార్టీ వారో, దానికి ఎవరు డబ్బు సమకూర్చారో అందరికీ తెలుసునన్నారు. ప్రస్తుతం వారంతా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని రాధా గుర్తుచేశారు. హత్యా రాజకీయాలపై ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్చకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని, దీనికి అధికార పక్షం సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. అధికార పార్టీ కుల రాజకీయలను ప్రోత్సహించటం సరైన పద్ధతి కాదని హితవు పలికారు. కుల రాజకీయాలను తమ పార్టీ ఏమాత్రం ప్రోత్సహించదని అన్ని వర్గాల ప్రజలను కలుపుకు వెళ్లే పార్టీ వైఎస్ఆర్సీపీ అని రాధా చెప్పారు. పదేపదే టీడీపీ నేతలు జగన్‌ను విమర్శిస్తే ఇకపై సహించేది లేదని హెచ్చరించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో టీడీపీ వ్యక్తులు దోషులు కాదా అని ప్రశ్నించారు. కేవలం అసెంబ్లీలో టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందని.. చర్చ మొదలు కాగానే పరిటాల హత్యను ప్రస్తావించి సభను పక్కదారి పట్టించారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో ఎన్ని రాజకీయ హత్యలు జరిగాయే అందరికీ తెలుసునన్నారు. ప్రతిపక్షంగా తాము నిర్మాణాత్మకంగా ప్రజల పక్షాన పోరాడుతున్నామని ఆయన చెప్పారు. -
కన్నీటి పర్యంతమైన వంగవీటి రాధా
-
కన్నీటి పర్యంతమైన వంగవీటి రాధా
విజయవాడ : విజయవాడలో వంగవీటి మోహనరంగా 25వ వర్థంతి కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ రోడ్డులోని రంగా విగ్రహానికి ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వంగవీటి రాధా పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్తూ..కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం పలుచోట్ల ఏర్పాటు చేసిన వర్థంతి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.