నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ | ramgopal varma next film is Vangaveeti | Sakshi
Sakshi News home page

నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ

Published Sat, Jan 2 2016 7:22 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ - Sakshi

నా నెక్స్ట్ సినిమా 'వంగవీటి': వర్మ

'కిల్లింగ్ వీరప్పన్‌' సినిమాతో మళ్లీ తన సత్తా చాటిన డైరెక్టర్‌ రాంగోపాల్‌ వర్మ తన తదుపరి సినిమా పేరును ప్రకటించారు. 'వంగవీటి' పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టు తెలిపారు. వంగవీటి రంగా హత్య, రాజకీయ జీవితం నేపథ్యంతో ఈ సినిమా రూపొందించనున్నట్టు ఆయన శనివారం ట్విట్టర్‌లో వెల్లడించారు.

'కిల్లింగ్‌ వీరప్పన్‌'తో మళ్లీ మంచి సినిమాలు తీసి ప్రేక్షకుల మెప్పు పొందగలనని రాంగోపాల్‌ వర్మ నిరూపించకున్నారు. ఇప్పటికే కన్నడంలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుతోంది. ఈ నెల 7న 'కిల్లింగ్ వీరప్పన్' తెలుగులో విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement