
సాక్షి, విజయవాడ: ఈ ఏడాదే వంగవీటి రంగా మొదటి వర్ధంతి అని బీజేపీ నేత వంగవీటి నరేంద్ర అన్నారు. తన తండ్రిని చంపిన తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధ ఎప్పుడైతే చేరారో.. అప్పుడే వంగవీటి రంగా నిజంగా చనిపోయారని ఉద్వేగానికి గురయ్యారు. గురువారం రాష్ట్రవ్యాప్తంగా వంగవీటి మోహన రంగా వర్ధంతి వేడుకలు నిర్వహిస్తున్నామని వంగవీటి నరేంద్ర అన్నారు. రంగాను చంపింది మనుషులు కానీ.. పార్టీ కాదు రాధా బాబు అనడం.. రంగ-రాధా అభిమానులు జీర్ణించుకోలేక పోయారన్నారు. టీడీపీ తరఫున ప్రచారానికి వెళ్లిన వంగవీటి రాధాను మండపేటలో రంగా అభిమాన సంఘాలు వ్యతిరేకించాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇప్పటికైనా వంగవీటి రంగాను చంపింది టీడీపీ నాయకులేనని రాధా తెలుసుకోవాలని నరేంద్ర విఙ్ఞప్తి చేశారు. కాగా వంగవీటి రంగా 31వ వర్ధంతి సందర్భంగా ఆయన అభిమానులు ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment