
తనపై వచ్చిన ఆరోపణలు ఖండించిన కోడెల
గుంటూరు: తనపై వచ్చిన ఆరోపణలను స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఖండించారు. వంగవీటి రంగా హత్య ఘటన విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా బాధించాయన్నారువంగవీటి రంగా హత్య జరిగిన సమయంలో తాను హోంమంత్రిగా ఉన్నానని, ఆ తర్వాత పలుచోట్ల అల్లర్లు జరిగాయని ఆయన సోమవారమిక్కడ అన్నారు. ఆ సంఘటనలు తనను కలిచివేయడంతో పదవి నుంచి తప్పుకున్నట్లు కోడెల తెలిపారు. రంగాతో తనకు స్నేహం కానీ, అలా అని శత్రుత్వంగానీ లేదని ఆయన అన్నారు.