సాక్షి, కృష్ణా: పదేళ్ళ వయస్సులో తండ్రిని కోల్పోయానని, ముప్పైఏళ్ళ క్రితం అభిమానులు ఓ నేతను కోల్పోయారని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ అన్నారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో వంగవీటి రాధా, రంగా స్మారక భూమికి రాధాకృష్ణా బుధవారం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రంగా చనిపోయి మూడు దశాబ్ధాలు అవుతున్నా నేటికీ ఆయన అభిమానులు స్మరించుకుంటున్నారని, వాడవాడలా వర్థంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
రంగాను నమ్ముకున్న వారిని ఆదుకోవాల్సిన అవసరముందని, ఆయన స్మారకార్ధం సేవా కార్యక్రమాలు చేపడతామని రాధా వెల్లడించారు. ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నేత రంగా అని, కొందరికి అడ్డుగా ఉన్నారని ఆయనను హతమార్చారని వైఎస్సార్‌సీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గుర్తుచేశారు.
రంగా కార్యకర్తలు, అభిమానుల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు యలమంచిలి రవి, యార్లగడ్డ వెంకట్రావు, తుమ్మల చంద్రశేఖర్, రంగా-రాధా మిత్రమండలి సభ్యులు పాల్గొని రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment