
వైఎస్ఆర్ యూత్ అధ్యక్షుడిగా వంగవీటి రాధ
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఆర్ కే రోజా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పలు నియామకాలు జరిగాయి. ఎస్సీ సెల్ కు మేరుగ నాగార్జున, బీసీ సెల్ కు ధర్మాన కృష్ణదాస్, లీగల్ సెల్ కు పొన్నవేలు సుధాకర్ రెడ్డి, మైనారిటీ సెల్ కు అంజాద్ బాషా, ఎస్టీ సెల్ కు తెల్లం బాలరాజు అధ్యక్షులుగా నియమితులయ్యారు.
వైఎస్ఆర్ యూత్ రాష్ట్ర అధ్యక్షుడిగా వంగవీటి రాధను నియమించారు. రైతు విభాగానికి ఎంవీఎస్ నాగిరెడ్డి, ట్రేడ్ యూనియన్ ను గౌతంరెడ్డి అధ్యక్షులుగా నియమితులయ్యారు.