వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడు రోజుల జలదీక్షకు మద్దతుగా మంగళవారం అలంకార్ సెంటర్లో యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా రిలే దీక్ష చేపట్టారు.
విజయవాడ: వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మూడు రోజుల జలదీక్షకు మద్దతుగా మంగళవారం అలంకార్ సెంటర్లో యూత్ రాష్ట్ర అధ్యక్షుడు వంగవీటి రాధా రిలే దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వంగవీటి విలేకరులతో మాట్లాడుతూ.. ఓటుకు కోట్లు కేసు భయంతోనే తెలంగాణ ప్రాజెక్టులపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని మండిపడ్డారు.
చంద్రబాబు విధానాలతో ఏపీ రాష్ట్రం ఎడారిగా మారే ప్రమాదం ఉందని అన్నారు. ప్రాజెక్టులపై నోరు మెదపని చంద్రబాబు.. ప్రజలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వంగవీటి రాధా విమర్శించారు.