రాజకీయ దురదృష్టవంతుడు రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి రాధాకృష్ణ మాత్రమే.. అయన ఎప్పుడూ అవకాశానికి ఆమడ దూరంలో.. దురదృష్టానికి అంగుళం దగ్గరలో ఉంటూ వస్తున్నారు. అప్పుడెప్పుడో ఇరవయ్యేళ్ళ క్రితం విజయవాడ సెంట్రల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధా కృష్ణ మళ్ళీ ఈ ఇరవయ్యేళ్లలో ఎన్నడూ గెలుపు ముఖం చూడలేదు.
2004 వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయంలో అయన విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. ఆ తరువాత గెలుపు అనేది ఆయనకు దూరమైంది. ఆ తరువాత జగన్ మోహన్ రెడ్డి వెంట నడిచారు. అప్పట్లో వైఎస్ జగన్ ఎంపీ స్థానం ఆఫర్ చేస్తే కాదని.. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు రాధా వైఎస్సార్‌సీపీని కాదని టీడీపీలో చేరారు.
అక్కడ చేరేవరకూ అబ్బో.. బ్రహ్మాండం.. వీరుడు.. సూరుడు అంటూ బాజాలు మోగించిన తెలుగుదేశం నాయకులూ.. క్యాడర్ .. ఆఖరుకు టీడీపీకి వత్తాసు పలికే మీడియా సైతం ఆయన చివరకు టీడీపీలో చేరాక ప్లేటు ఫిరాయించారు. అయన గెలవలేదని, క్యాడర్ లేదని.. సమర్థత.. సత్తా సరిపోదని చెప్పి టికెట్ ఇవ్వకుండా తప్పించుకున్నారు. చేరేవరకు ఓడ మల్లయ్య అని పిలిచి గట్టు ఎక్కాక బోడి మల్లయ్య అనడం టీడీపీకి, చంద్రబాబుకు వెన్నతోపెట్టిన విద్య. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బోండా ఉమాకు టిక్కెట్ ఇచ్చారు.. అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లాది విష్ణు గెలవడంతో ..ఇక రాధా కూడా చేసేదేం లేక ఊరుకున్నారు.
చదవండి: అసలు చిత్తూరు టీడీపీలో ఏం జరుగుతోంది!
అప్పట్నుంచీ అసంతృప్తితో టీడీపీలో సైలెంట్‌గా ఉన్నా ఉన్నా మళ్ళీ ఎన్నికలు సమీపిస్తుండడంతో రాధా మళ్ళీ యాక్టివేట్ అయ్యారు. తన పాత కాంటాక్ట్స్, క్యాడర్ ను సమీకరించి తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్నారు. దీంతోబాటు ఆయనకు సెంట్రల్ టికెట్ కూడా ఇస్తామని చంద్రబాబు, లోకేష్ సైతం హామీ ఇచ్చినట్లు రాధా అనుచరులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో ఆయనకు టిక్కెటి వస్తుందన్న భయంతో బోండా ఉమా చేస్తున్నారో.. లేక లోకేష్.. చంద్రబాబు సహకారంతో టీడీపీ క్యాడర్ చేస్తున్నారో ఏమో కానీ రాధకు స్థిరం లేదని. పార్టీలు మారుతుంటారని.. ఇలా అయన వ్యక్తిత్వాన్ని, ప్రతిష్టను దెబ్బ తీస్తూ టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు.
రాధకు రాజకీయ స్థిరత్వం లేదని, అయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదని, ఇంకా అయనకు సొంత క్యాడర్ లేదని, అంతా డైల్యూట్ అయిపోయిందని, ఆయనకు టిక్కెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయం అని.. అందుకే టీడీపీ వేరే అభ్యర్థిని ఆంటే అంతిమంగా బోండా ఉమకు టిక్కెట్ ఇవ్వాలన్నట్లుగా వాట్సాప్ గ్రూపుల్లో మెసేజులు సర్క్యులేట్ చేస్తున్నారు. ఇదంతా కేవలం బోండా చేస్తున్నదే అని వంగవీటి రాధా అనుచరులు గుర్రుమంటున్నారు. లేదని .. చంద్రబాబు మద్దతుతోనే బోండా ఇలా రెచ్చిపోతున్నాడని కొందరు అంటున్నారు. కొంగ నక్క ఒకరినిఒకరు మోసం చేసుకున్న రీతిన చంద్రబాబు ఇలా రాధాలో అసలు కల్పించి చివరకు వట్టి చెయ్యి చూపడం అలవాటేనని రాధా అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment