
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాధా
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాష్ట్రపార్టీలో పలు నియామకాలు చేశారు. విజయవాడ నగరపార్టీ అధ్యక్షునిగా ఉన్న వంగవీటి రాధాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించారు. రాధా స్థానంలో విజయవాడ నగర అధ్యక్షునిగా వెల్లంపల్లి శ్రీనివాస్‌ను నియమించారు.
శ్రీనివాస్‌కు విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం సింగిల్ కో ఆర్డినేటర్‌గా కూడా పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఇదే నియోజకవర్గం సమన్వయకర్త షేక్ ఆసిఫ్‌ను రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించారు. తూర్పుగోదావరి జిల్లా గ్రేటర్ రాజమండ్రి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగా శాసనమండలి మాజీ సభ్యుడు కందుల దుర్గేష్‌ను నియమించారు.