చంద్రబాబు ప్రభుత్వంపై రాధా ఫైర్
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విజయవాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు వంగవీటి రాధా గురువారం నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానని చంద్రబాబు చెబుతున్నారు... మరి సింగపూర్లోని ఆసుపత్రిలో కూడా పిల్లలను ఎత్తుకుపోతారా ? అని ప్రశ్నించారు. విజయవాడ పాత ఆసుపత్రిలో శిశువు అదృశ్యంపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, కలెక్టర్ ఏ బాబుదే బాధ్యత అని వంగవీటి రాధా ఆరోపించారు. సీఎం విజయవాడలోనే ఉంటున్నా ప్రభుత్వాస్పత్రుల్లో భద్రత లేదని మండిపడ్డారు.