టీడీపీ, జనసేన టికెట్ల కేటాయింపు ప్రకటనతో ఆగ్రహ జ్వాలలు రగులుకున్నాయి. భుజాలు కందేలా టీడీపీ జెండాలు మోసిన తమను కాదని పారాచూట్ నాయకులకు టికెట్లు కేటాయించడంతో పలువురు నాయకులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ తమ ఇమేజ్‌ను వాడుకుని టికెట్ల వద్దకొచ్చేసరికి మొండి చేయి చూపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం తాము కష్టపడితే బలంలేని జనసేనకు టికెట్లు ఇవ్వడం ఏమిటని ప్రశి్నస్తున్నారు. జనసేన టికెట్లపై ఆశలు పెట్టుకున్నవారు సైతం అధ్యక్షా అని పిలిచే అవకాశం లేకపోయిందని నిర్వేదంలో తల్లడిల్లుతున్నారు. తమను కాదని టికెట్లు ఇచ్చారుగా.. వారు ఎలా గెలుస్తారో చూస్తామంటూ రెండు పారీ్టల నాయకులు సవాళ్లు విసురుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఎమ్మెల్యే అభ్యర్థుల తొలిజాబితా ప్రకటన ఉమ్మడి కృష్ణా జిల్లాలో టీడీపీ, జనసేన పారీ్టలను కకావికలం చేస్తోంది. ఇప్పటికే రగులుకొంటున్న పొత్తుల మంటలపై టికెట్ల కేటాయింపు మరింత అసంతృప్తికి ఆజ్యం పోసింది. దీర్ఘకాలికంగా పారీ్టకి సేవ చేస్తున్న వారితో పాటు ఇటీవల పారీ్టలో చేరి టికెట్లపై ఆశలు పెట్టుకున్న వారికి మొండి చెయ్యే మిగిలింది.
తిరువూరులో టీడీపీకి షాక్
తిరువూరులో టీడీపీకి షాక్ తగిలింది. టికెట్ ఆశించి భంగపడిన ఇన్‌చార్జి శావల దేవదత్తు పారీ్టకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకుని అధినేతతో తాడోపేడో తేల్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. కె. శ్రీనివాసరావు టికెట్ల ప్రకటన అనంతరం దేవదత్తును కలి సేందుకు ప్రయతి్నంచగా ఆయన ముఖంచాటేయడం టీడీపీ శ్రేణుల్లో చర్చకు దారితీసింది. ఎన్నికల సమయానికి పారాచూట్ నాయకులను తీసుకొచ్చి తమ నియోజకవర్గంపై రుద్దడం ఏమిటని తిరు వూరు తెలుగుతమ్ముళ్లు మండిపడుతున్నారు.
కుప్పకూలిన బూరగడ్డ వేదవ్యాస్
పెడన టీడీపీ టికెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ హతాశుడయ్యాడు. తనకు టికెట్ లేదని తెలియడంతో కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలో ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటన జిల్లా టీడీపీలో అసంతృప్తి ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తోంది.
ఆ రెండు సీట్లపై పీటముడి
మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, బోడే ప్రసాద్, కేశినేని చిన్ని మధ్య కుర్చీలాట కొనసాగుతోంది. నలుగురికీ ఆశపెడుతూ వస్తున్న చంద్రబాబు చివరికి తమను నట్టేట ముంచుతారని టీడీపీ తమ్ముళ్లు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మైలవరం, పెనమలూరు సీట్లను ప్రస్తుతానికి ఎవరికీ కేటాయించకపోవడంతో ఆ నలుగురిలో టెన్షన్ కొనసాగుతోంది. చివరికి బాబుగాని, ఆయన కుటుంబ సభ్యులకు గాని సీటు కేటాయించుకుని ఆశావహులందరికీ హ్యాండ్ ఇస్తారేమోనని వారంతా లోలోన మ«థన పడుతున్నారు.
ఆ రెండూ జనసేనకేనా?
విజయవాడ వెస్ట్, అవనిగడ్డ సీట్లు జనసేనకు కేటాయిస్తారనేది స్పష్టమైంది. దీంతో విజయవాడ వెస్ట్‌లో రక్తంతో చంద్రబాబుపై అభిమానం చాటిన బుద్దా వెంకన్నతోపాటు జలీల్‌ఖాన్, ఎంకే బేగ్, నాగుల్ మీరా వర్గాలు అసంతృప్తితో రగిలిపోతున్నాయి. జనసేనకు టికెట్ కేటాయిస్తే పారీ్టపై తిరుగుబాటు చేసేందుకు వారంతా సిద్ధమవుతున్నారు. అవనిగడ్డలో పార్టీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ అయోమయంలో పడ్డారు. చంద్రబాబును నమ్ముకొని తమ కుటుంబ రాజకీయ భవిష్యత్‌ను నాశనం చేసుకున్నానని ఆయన వాపోతున్నట్లు సమాచారం. రాజకీయాలు కళ్ల ముందే మారిపోయాయని, డబ్బు కీలకంగా మారిందని, తొలి జాబితాలో తన పేరు లేకపోవడంతో పంజరంలో నుంచి బయటకు వచ్చిన పక్షిలా స్వేచ్ఛా స్వాతంత్రాలు పొందినట్లు ఉందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.
వంగవీటి రాధాకు తలుపులు క్లోజ్
విజయవాడ సెంట్రల్ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న వంగవీటి రాధాకు చంద్రబాబు ముఖం చాటేశారు. ఇటీవల లోకేష్ పాదయాత్రలో రాధా ఇమేజ్‌ను వాడుకున్న ఆయన టికెట్ల కేటాయింపునకు వచ్చేసరికి చెయ్యిచ్చారు. చంద్రబాబు తీరుతో రాధా వర్గం రగిలిపోతోంది. కనీసం విజయవాడ తూర్పులో తమకు అవకాశం ఇస్తారని భావించినా అక్కడ కూడా ఆశలు ఫలించలేదు. దీంతో రాధాకు టీడీపీలో తలుపులు మూసేసినట్టే అన్నది స్పష్టమైంది. విజయవాడలో మంచి పట్టు ఉన్న వంగవీటి కుటుంబాన్ని చంద్రబాబు కూరలో కరివేపాకులా తీసిపడేశారని ఆయన అనుచరులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ తూర్పులో అంబశెట్టి వాసు, బత్తిన రాములు జనసేన తరఫున టికెట్ ఆశించారు. టికెట్ల ప్రకటన వారి ఆశలపై నీళ్లు చల్లింది. మరో సారి చంద్రబాబు కాపులను మోసం చేశారని వారు మండిపడుతున్నారు. ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరిస్తున్నారు.
టికెట్ల కేటాయింపు ఇలా... ఎనీ్టఆర్ జిల్లాలో...
విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, విజయవాడ ఈస్ట్‌లో గద్దె రామ్మోహన్, నందిగామలో తంగిరాల సౌమ్య, జగ్గయ్యపేటలో శ్రీరాం రాజగోపాల్(తాతయ్య), తిరువూరులో కె. శ్రీనివాసరావుకు సీట్లు కేటాయించారు. మైలవరం, విజయవాడ వెస్ట్ సీట్లను ఎవరికీ కేటాయించలేదు.
కృష్ణా జిల్లాలో...
మచిలీపట్నంలో కొల్లురవీంద్ర, గుడివాడలో వెనిగండ్ల రాము, గన్నవరంలో యార్లగడ్డ వెంకట్రావు, పెడనలో కాగిత కృష్ణప్రసాద్, పామర్రులో వర్ల కుమారరాజాకు టికెట్లు కేటాయించారు. అవనిగడ్డ, పెనమలూరు టికెట్లను పెండింగ్‌లో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment