
విజయమ్మకు ఘన స్వాగతం
గన్నవరం, న్యూస్‌లైన్ : వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మకు సోమవారం గన్నవరం విమానాశ్రయంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం జిల్లా ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు ఆమె హైదరాబాద్ నుంచి జెట్ ఎయిర్‌వేస్ విమానంలో సాయంత్రం 3 గంటలకు ఇక్కడికి వచ్చారు.
విమానాశ్రయంలో విజయమ్మకు విజయవాడ, ఏలూరు పార్లమెంట్ అభ్యర్థులు కోనేరు రాజేంద్రప్రసాద్, తోట చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యేలు వంగవీటి రాధ, యేర్నెని రాజరామచంద్రరావు, గన్నవరం, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల సమన్వకర్తలు డాక్టర్ దుట్టా రామచంద్రరావు, పి. గౌతమ్‌రెడ్డి, జిల్లా ప్రచార కన్వీనర్ సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, పార్టీ నాయకులు బేతపూడి రాజేంద్రప్రసాద్, చిన్నాల లక్ష్మీనారాయణ, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. అనంతరం ఆమె ప్రత్యేక వాహనంలో ఖమ్మం జిల్లా మధిర బయలుదేరి వెళ్లారు.