వంగవీటి మోహన రంగా 69వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధా సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు.
విజయవాడ: వంగవీటి మోహన రంగా 69వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత వంగవీటి రాధా సోమవారం ఘనంగా నివాళులు అర్పించారు. బందర్ రోడ్డులోని రంగా విగ్రహానికి వంగవీటి రాధా పూలమాల వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రాధా మాట్లాడుతూ రంగా ఆశయసాధనకు కృషి చేస్తానని తెలిపారు. తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న అభిమానులు కార్యకర్తలకు తానెంతో రుణపడి ఉన్నానని చెప్పారు. మరోవైపు కృష్ణాజిల్లా జగ్గయ్యపేటలోనూ కాపు నేతలు వంగవీటి రంగా జయంతి వేడుకలు నిర్వహించారు.