రాధా Vs ఉమ కోల్డ్‌ వార్‌: విజయవాడలో హీట్‌ పాలిటిక్స్‌ | Political Cold War Between TDP Leaders At Vijayawada | Sakshi
Sakshi News home page

రాధా Vs ఉమ కోల్డ్‌ వార్‌: విజయవాడలో హీట్‌ పాలిటిక్స్‌

Published Wed, Jan 24 2024 8:12 AM | Last Updated on Sat, Feb 3 2024 9:37 PM

Political Cold War Between TDP Leaders At Vijayawada - Sakshi

సాక్షి, విజయవాడ: ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య పొలిటికల్‌ కోల్డ్‌ వార్‌ గట్టిగానే నడుస్తోంది. సోషల్‌ మీడియా వేదికగా టీడీపీ నేతలు ఒకరిపై మరొకరు పోస్టుల దాడులు చేసుకుంటున్నారు. దీంతో, పచ్చ బ్యాచ్‌ రాజకీయం రచ్చగా మారింది. తాజాగా విజయవాడ సెంట్రల్‌ టీడీపీలో వార్‌ మొదలైంది. 

వివరాల ప్రకారం.. విజయవాడలో వంగవీటి రాధా, బోండా ఉమా వర్గాల మధ్య సోషల్‌ మీడియా వార్‌ నడుస్తోంది. టీడీపీ సెంట్రల్‌ సీటు విషయంలో ఇరు వర్గీయుల మధ్య పొలిటికల్‌ ఆధిపత్య పోరు ముదురుతోంది. ఈ క్రమంలో సోషల్‌ మీడియాలో ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా వ్యతిరేక పోస్టులు చేసుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా వంగవీటి రాధను టీడీపీ నమ్మడం లేదంటూ మూడు రోజుల కిందటే పోస్టులు ప్రత్యక్షమయ్యాయి. 

అయితే, ఈ పోస్టుల వెనుక ఉమా వర్గీయులే ఉన్నారంటూ రాధా వర్గం సంచలన ఆరోపణలు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా బోండా ఉమా వర్గానికి టార్గెట్‌గా కౌంటర్‌ పోస్టులు పెట్టింది. నమ్మాలంటే ఏం చేయాలంటూ ఉమాకు వ్యతిరేకంగా కౌంటర్‌ పోస్టులు సోషల్‌ మీడియా కనిపించాయి. కాగా, రాధా వర్గమే ఇలా చేసినట్లు బోండా ఉమా వర్గం భావిస్తున్నట్టు సమాచారం. ఇక​, ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉమా, రాధా వర్గాల కోల్డ్‌ వార్‌తో రాజకీయం రసవత్తరంగా మారినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement