
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: ‘కాకినాడ శాసనసభ్యుడు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి రాజకీయ ప్రస్థానం దివంగత వంగవీటి మోహన్ రంగారావుతోనే మొదలైంది. ఆయన అభిమానం అప్పటి నుంచి ఇప్పటికీ ఏమాత్రం చెక్కుచెదరలేదు. చంద్రశేఖరరెడ్డి కాపు వ్యతిరేకి అనడం పచ్చి అబద్ధం. తప్పుడు ఆరోపణలు చేయడం ఏమాత్రం సరికాదు.’ అని వంగవీటి రంగా బావమరిది చెన్నుపాటి శ్రీనివాస్ స్పష్టంచేశారు. వారాహి యాత్రలో భాగంగా కాకినాడ బహిరంగ సభలో ద్వారంపూడిపై జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చెన్నుపాటి శ్రీనివాస్ స్వచ్ఛందంగా స్పందించారు. ఆయన మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే..
కాకినాడలో రంగా తొలి సభ పెట్టింది ద్వారంపూడి నాకు 1985, 86ల నుంచే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితో పరిచయం ఉంది. అప్పటికే వాళ్ల ఫ్యామిలీ చాలా రిచ్. రైస్ మిల్లులు, సినిమా థియేటర్స్ ఇవన్నీ ఉండేవి. అప్పటికే రంగాకు ఆయన స్ట్రాంగ్ ఫాలోయర్. రంగా అభిమానిగా తిరిగిన ద్వారంపూడి ఆయన ద్వారానే రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 1988లో ఎవరూ ధైర్యం చేయని రోజున కాకినాడ ప్రాంతంలో భారీ స్థాయిలో ర్యాలీ పెట్టి వంగవీటిని తీసుకెళ్లి అతిపెద్ద బహిరంగ సభ నిర్వహించారు. బహుశా అప్పటి నుంచి ఇప్పటివరకు అంతపెద్ద బహిరంగ సభ ఎప్పుడూ జరిగి ఉండదు. అంతటి వీరాభిమాని చంద్రశేఖరరెడ్ది.
వంగవీటి తదనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఫాలో కావడం, రాజకీయంగా ఎదగడం జరిగింది. మూడున్నర దశాబ్దాలుగా పరిచయమున్న చంద్రశేఖరరెడ్డి గురించి, వాళ్ల కుటుంబం గురించి పూర్తిగా తెలుసు. ఆయనపై ఆరోపణలన్నీ రాజకీయపరమైనవి, పొంతనలేనివిగానే కనిపిస్తున్నాయి. వాటిలో ఏమాత్రం వాస్తవం లేదు. ఏదైనా తెలుసుకుని మాట్లాడితే మంచిదని నా అభిప్రాయం. ఎవరో చెబితే విని ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. రాజకీయంగా పూర్తిగా దూరంగా ఉన్నాను కాబట్టి నేను రాజకీయంగా వాటి గురించి కామెంట్ చేయలేను.
కానీ, చంద్రశేఖరరెడ్డి విషయం గురించి వస్తే మాత్రం నాకు ఆయన విషయాలు పూర్తిగా తెలుసు. కాబట్టి ఆ ఆరోపణలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా. రంగా అభిమానిగా మొదలైన ద్వారంపూడి రాజకీయ ప్రస్థానంలో కాపు వ్యతిరేకి అనేది పూర్తిగా అవాస్తవం. అలాంటి ఉద్దేశాలు ఉన్న రాజకీయ నాయకుడు కూడా కాదు. వెరీ ఫెయిర్ పొలిటీషియన్ 1985 నుంచి ఈ రోజు వరకు వంగవీటి అభిమానిగానే కొనసాగుతున్నాడు. మా బావగారు చనిపోయి ఇప్పటికి 33 సంవత్సరాలు అవుతున్నా... ఇంకా మా ఫ్యామిలీతో సన్నిహితంగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: గడప గడపకు.., జగనన్న సురక్షపై సీఎం జగన్ సమీక్ష
Comments
Please login to add a commentAdd a comment