
పాట్నా:సీఎం నితీశ్ కుమార్ కొడుకు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి వస్తే సంతోషమేనని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. నిషాంత్‌కుమార్ జేడీయూను బీజేపీ నుంచి కాపాడగలుగుతారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తన తండ్రి ఇప్పటికీ 100 శాతం ఫిట్ అని,వచ్చే బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లతో అందరూ జేడీయూను బలపరిచాలని నిషాంత్ ఇచ్చిన పిలుపుపై తేజస్వియాదవ్ స్పందించారు.
‘నితీష్‌కుమార్ కంటే మా నాన్న లాలూయే ఫిట్‌గా ఉన్నారు. బిహార్‌లో బలహీనవర్గాల వారికి లాలూ చేసినంత మంచి ఎవరు చేయలేదు. లాలూ హయంలోనే బిహార్‌లో మండల్ కమిషన్ సిఫారసులను అమలు చేశారు. నితీష్‌కుమార్ కొడుకు నిషాంత్ రాజకీయాల్లోకి వస్తానంటే స్వాగతిస్తా.అతడు రాజకీయాల్లోకి రావడాని కంటే ముందు పెళ్లిచోసుకోవాలని కోరుకుంటున్నా’అని తేజస్వి వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment