Tejasvi Yadav
-
ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ 8వ సారి ప్రమాణస్వీకారం
-
ద్రౌపది ముర్ముపై తేజస్వీ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక విపక్షలా అభ్యర్థగా యశ్వంత్ సిన్హా పోటీ చేస్తున్నారు. కాగా, ఈ ఎన్నికలకు జూలై 18న ఓటింగ్ నిర్వహిస్తారు. జూలై 21న ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉండగా.. అధికార బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ఎంపిక చేయడంపై ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తేజస్వీ యాదవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి భవనంలో విగ్రహం ఉండాల్సిన అవసరం లేదు. ఎన్డీయే మద్దతున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఇప్పటి వరకు ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా నిర్వహించలేదు. కనీసం అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత కూడా ఆమె మాట్లాడలేదు. అందుకే రాష్ట్రపతి భవన్లో ‘విగ్రహం’ అవసరం లేదంటూ ఆమెపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మాత్రం మాట్లాడటం అందరూ చూసే ఉంటారని వ్యాఖ్యానించారు. కాగా, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తేజస్వీ యాదవ్ ఇప్పటికే.. మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. ఇక, ద్రౌపది ముర్ము ఎంపికపై ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత అజయ్ కుమార్ కూడా విమర్శలు చేశారు. #WATCH | You don't need a 'Murti' (statue) in Rashtrapati Bhawan...You must have heard Yashwant Sinha Ji speaking, but not Centre's Presidential candidate... not a single presser by her since her candidature was announced: Tejashwi Yadav, RJD (16.07) pic.twitter.com/VKn38nNi9r — ANI (@ANI) July 17, 2022 ఇది కూడా చదవండి: వ్యవ'సాయం'పై..అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు -
జహంగీర్‌పురి కూల్చివేతలు.. సారీ చెప్పిన కాంగ్రెస్ నేత
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జహంగీర్‌పురి కూల్చివేతల అంశం దేశ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని బీజేపీ కూల్చివేతలకు పాల్పడుతోందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నాయి. విపక్షాల నిరసన కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రి హర్దీప్ సింగ్ పూరీ నివాసం వద్ద యువజన కాంగ్రెస్ గురువారం నిరసన ప్రదర్శన నిర్వహించింది. యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, ఎంపీ శక్తి సింగ్ గోహిల్, ఢిల్లీ కాంగ్రెస్ చీఫ్ అనిల్ చౌదరి, ఉపాధ్యక్షుడు అభిషేక్ దత్తో సహా 15 మందితో కూడిన బృందం జహంగీర్‌పురి బాధితులను కలిసింది. ‘మేము బాధితులను కలిసేందుకు జహంగీర్‌పురికి వచ్చాము. పోలీసులు సహకరించారు. దీన్ని మతం కోణంలో చూడకూడదని ప్రజలకు చెప్పేందుకు ఇక్కడికి వచ్చామ’ని మీడియాతో అజయ్ మాకెన్ చెప్పారు. కూల్చివేతల సమయంలో అక్కడ లేనందుకు క్షమాపణ చెబుతూ మాకెన్ ట్వీట్ చేశారు. (క్లిక్: ఇంత జరుగుతున్నా కేజ్రీవాల్ ఎక్కడ..) విభజన రాజకీయాలు చేయం: మమత ఇక ఇదే అంశంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ‘మేము బుల్డోజ్ చేయకూడదనుకుంటున్నాము. ప్రజలను విభజించాలని కోరుకోవడం లేదు. ప్రజలను ఏకం చేయాలనుకుంటున్నాం. ఐకమత్యమే మా ప్రధాన బలం. ఐక్యంగా ఉంటేనే సాంస్కృతికంగా ఎంతో దృఢంగా ఉంటా’మని ఏఎన్ఐతో అన్నారు. మతం ఆధారంగా బుల్డోజర్లు: తేజశ్వి యాదవ్ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) అధ్యక్షుడు తేజశ్వి యాదవ్ స్పందిస్తూ... ‘సుప్రీంకోర్టు జోక్యం తర్వాత కూడా జహంగీర్‌పురిలో కూల్చివేతలు కొనసాగాయి. మనదేశంలోకి చైనా చొచ్చుకుని వస్తున్నా చర్యలు శూన్యం. అయితే మతం ఆధారంగా బుల్డోజర్లు నడుపుతున్నార’ని ఆయన వ్యాఖ్యానించారు. (క్లిక్: గుజరాత్ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ అరెస్ట్) ఆ ఆరోపణలు సరికాదు: తుషార్ మెహతా కేంద్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుందనే ఆరోపణ సరికాదని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పేర్కొన్నారు. జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లు జమియత్ ఉలమా-ఐ-హింద్ దాఖలు చేసిందని వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటామని ఉత్తర ఢిల్లీ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ తెలిపారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు జహంగీర్‌పురిలో కూల్చివేతలు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. రెండు వారాల పాటు యథాతథ స్థితి కొనసాగించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. -
బిహార్‌లో విజయం సాధించిన ప్రముఖులు
పట్నా: దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపిన బిహార్ అసెంబ్లీ హోరాహోరీ ఎన్నికల పోరులో అధికార ఎన్డీయో కూటమి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 243 స్థానాల అసెంబ్లీలో మెజారిటీ మార్క్ 122 కాగా, అంతకన్నా కేవలం రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారం చేపట్టనుంది. విపక్ష మహాకూటమి మొత్తంగా 111 స్థానాలకు పరిమితమైంది. బిహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. నియోజకవర్గాల వారిగా ప్రముఖుల ఫలితాలు: తేజస్వి యాదవ్ (రాఘోపూర్ నియోజకవర్గం): మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వి యాదవ్ రాఘోపూర్ నియోకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. సమీప బీజేపీ ప్రత్యర్థి సతీష్ కుమార్‌పై 38,174 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు. 2015లో కూడా తేజస్వి యాదవ్ ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. గతంలో తేజస్వి తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ 1995, 2005 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జితాన్ రామ్ మంజి (ఇమామ్ గంజ్ నియోజకవర్గం): బిహార్ మాజీ సీఎం, హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్ఏఎం) చీఫ్ జితాన్ రామ్ మంజి బిహార్ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 76 ఏళ్ల జితాన్ ఆర్జేడీ అభ్యర్థి ఉదయ్ నరేన్ చైదరిపై 16,034 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా జితాన్ 29,408 ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే. శ్రేయాసి సింగ్ (జముయి నియోజకవర్గం): కామన్ వెల్త్ గేమ్స్-2018 స్వర్ణపతక విజేత, ఎస్ షూటర్ శ్రేయాసి సింగ్ బీజేపీ అభ్యర్థిగా బిహార్ ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. మాజీ కేంద్ర మంత్రి దివంగత దిగ్విజయ్ సింగ్ కుమార్తె అయిన శ్రేయాసి సమీప ఆర్జేడీ అభ్యర్థి విజయ్ ప్రకాష్‌పై 41,049 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె అక్టోబర్ 4న బీజేపీలో చేరి జముయి ఎమ్మెల్యే అభ్యర్థిగా అసెంబ్లీ ఎన్నికల పోటీలో నిలిచారు. అనంత కుమార్ సింగ్ (మోకామా నియోజకవర్గం): బిహార్‌లో ‘బాహుబలి’ నేతగా పిలువబడే అనంత కుమార్ సింగ్ మోకామా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆయన 35,750 ఓట్ల మెజార్టీతో సమీప జేడీయూ అభ్యర్థి రాజీవ్ లోచన్ నారాయణ్ సింగ్‌పై గెలుపొందారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సన్నిహితంగా ఉండే అనంత 2015లో ఆర్జేడీలో చేరారు. ఇక ఆయన జేడీయూలో ఉన్నప్పుడు స్వతంత్య్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించిన విషయం తెలిసిందే. -
బిహార్ పీఠం కొత్త తరానిదేనా?
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి పీఠం యువనేతకు దక్కుతుందా? లేక ప్రస్తుత సీఎం, అధికార జేడీయూ–బీజేపీ కూటమి నేత నితీశ్ కుమార్(69)కే మళ్లీ సొంతమవుతుందా? అనే సందేహం నేడు పటాపంచలు కానుంది. నితీశ్ వయస్సులో సగం కంటే తక్కువగా ఉన్న రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)యువ నేత తేజస్వీయాదవ్(31) నేతృత్వంలోని మహాఘట్ బంధన్‌కు అధికారం ఖాయమని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసిన నేపథ్యంలో ఈ ఫలితాలు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్నాయి. మంగళవారం ఉదయం 8 గంటలకు 38 జిల్లాల వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 55 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. కాగా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎమ్మెల్సీ కావడంతో ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. భారీగా బందోబస్తు ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద 19 కంపెనీల కేంద్రసాయుధ బలగాల తోపాటు, రాష్ట్ర పోలీసులను బందోబస్తుకు ఏర్పాటు చేసినట్లు చీఫ్ ఎలక్టోరల్ అధికారి హెచ్ఆర్ శ్రీవాస్తవ వెల్లడించారు. మంగళవారం ఉదయం పోస్టల్ ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈ స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. కోవిడ్–19 మహ మ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో లెక్కింపు కేంద్రాల వద్ద గుమికూడ వద్దని రాజకీయ పార్టీల శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సీసీటీవీలకు కనెక్ట్ చేసిన డిస్ప్లే స్క్రీన్లను సీనియర్ అధికారులు పరిశీలిస్తూ అవసరమైన ఆదేశాలిస్తారని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జితేంద్ర కుమార్ చెప్పారు. శాంతి భద్రతల పరిరక్షణకు మరో 59 కంపెనీ(వంద మంది చొప్పున)ల బలగాలను రంగంలోకి దించామన్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమి కూడకుండా నిషేధాజ్ఞలు విధించామన్నారు. ఉప ఎన్నికల ఫలితాలు కూడా.. బిహార్‌లోని వాల్మీకినగర్ లోక్‌సభ స్థానం తోపాటు మధ్యప్రదేశ్ అసెంబ్లీలోని 28 స్థానాలు, ఇతర పది రాష్ట్రాల్లోని 30 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు కూడా నేడు వెల్లడి కానున్నాయి. రఘోపూర్‌పైనే అందరి కళ్లూ రాష్ట్రంలోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్ 28వ తేదీ మొదలుకొని నవంబర్ 7వ తేదీ వరకు మూడు దశల్లో ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సీట్లలో తేజస్వీ యాదవ్ మరోసారి ఎన్నికయ్యేందుకు బరిలో నిలిచిన వైశాలి జిల్లాలోని రఘోపూర్‌పైనే అందరి దృష్టీ ఉంది. గతంలో ఈ స్థానం నుంచి తేజస్వీ తల్లిదండ్రులు, మాజీ ముఖ్యమంత్రులు లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవి పోటీ చేశారు. తేజస్వీ సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ సమస్తిపూర్ జిల్లా హసన్పూర్ నుంచి పోటీలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు కేబినెట్ మంత్రుల భవితవ్యం తేలనుంది. వీరిలో ప్రముఖులు నంద్‌కిశోర్ యాదవ్(పట్నా సాహిబ్), ప్రమోద్ కుమార్(మోతిహరి), రాణా రణ్‌ధీర్(మధుబన్), సురేశ్ శర్మ(ముజఫర్‌పూర్), శ్రావణ్ కుమార్(నలందా), జైకుమార్ సింగ్(దినారా), కృష్ణనందన్ ప్రసాద్ వర్మ(జెహనాబాద్) ఉన్నారు. -
తేజస్వీ యాదవ్ పుట్టినరోజుపై విమర్శలు
పాట్న: ఆర్జేడీ అధినేత, మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ పుట్టినరోజు వేడుకను విలాసవంతంగా జరుపుకోవడం వివాదాస్పదంగా మారింది. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్లుగా..తేజస్వీ యాదవ్ ఈ నెల 9న తన 30వ పుట్టిన రోజు వేడుకలను ప్రత్యేకమైన చార్టర్డ్ విమానంలో జరుపుకున్నారు. బర్త్‌డే సెలబ్రేషన్ ఫోటోలను రాంచీలోని రాక్ గార్డెన్ రిసార్ట్ డైరెక్టర్ సిద్ధాంత్ సుమన్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతోపాటు తేజస్వీ యాదవ్ ఫేస్బుక్ ఖాతాకు ట్యాగ్ చేశారు. ఈ ఫోటోల్లో తేజస్వీ బర్త్‌డే కేకును కట్ చేస్తున్నవి, సిద్ధాంత్‌తో కలిసి అల్పాహారం తింటున్నవి, కట్ చేసిన కేకును సిద్ధాంత్‌కు తినిపిస్తున్నవి ఉన్నాయి. తేజస్వీతో పాటు ఆర్జేడీ ఎమ్మెల్యే భోలా యాదవ్ సన్నిహితులు సంజయ్ యాదవ్, మణి యాదవ్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో తేజస్వీ యాదవ్‌ను పలువురు నేతలు విమర్శలు గుప్పించారు. జేడీయూ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ మాట్లాడుతూ.. పేద ప్రజల అభ్యున్నతి గురించి మాట్లాడే.. తేజస్వీ యాదవ్ విలాసవంతంగా చార్టర్డ్ విమానంలో పుట్టినరోజు జరుపుకున్నారు. అలా విమానాల్లో వేడుకలు జరుపుకోవడానికి బిల్లులు ఎవరు చెల్లించారని దుయ్యబట్టారు. కేక్ అందిస్తున్న సిద్ధాంత్ సుమన్ ఎవరని ప్రశ్నించారు. ఆర్జేడీ నేతలు పేదలు, అణచివేతకు గురైన వారిపట్ల మొసలి కన్నీళ్లు పెట్టుకుంటారని ఆయన ఆరోపించారు. ఎప్పుడూ పేదల నుంచి భూమిని లాక్కుని, అవినీతి కేసులకు పాల్పడుతారని విమర్శించారు. ఓ వైపు తండ్రి లాలు ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బాగాలేదనే ఆందోళన కొంచం కూడా లేకుండా తేజస్వీ యాదవ్ తన పుట్టినరోజు వేడుకలు ఆకాశంలో జరుగుపుకోవడానికి సిగ్గుచేటు అని సంజయ్‌సింగ్ తీవ్రంగా విమర్శించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రజా జీవితంలో ఇలాంటి విపరీత జీవనశైలిని నివారించాలని, ఈ సంఘటన పార్టీకి సమస్యలు కలిగించిందని కొందరు ఆర్జేడీ నేతలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అయితే తేజస్వీ యాదవ్ మాత్రం ఇప్పటివరకూ ఈ వివాదంపై పెదవి విప్పలేదు. -
తేజస్వీ యాదవ్‌తో రాహుల్ లంచ్
-
డిప్యూటీ సీఎంకు 44వేల పెళ్లి ఆఫర్లు!
బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఇప్పుడక్కడ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్. ఎందుకంటే, ఎక్కడైనా రోడ్లు బాగోకపోతే ఫిర్యాదుచేయాలని ఆయన ఒక నెంబర్ ఇస్తే.. దానికి బదులు ఆయన్ను పెళ్లి చేసుకుంటామంటూ ఏకంగా 44వేల ప్రపోజల్స్ ఆ నంబరుకు వాట్సప్‌లో వచ్చాయట. ఈ విషయాన్ని అధికారులు తెలిపారు. ప్రియ, అనుపమ, మనీష, కంచన్, దేవిక.. ఇలా మొత్తం 44 వేల మందికి పైగా అమ్మాయిలు ఆయన ఓకే అంటే పెళ్లి చేసుకోడానికి సిద్ధమంటూ ప్రతిపాదనలు పంపారు. ఈ నంబరుకు మొత్తం 47వేల మెసేజిలు వచ్చాయని, వాటిలో 44వేలు ఈ పెళ్లి ప్రతిపాదనలేనని ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. కేవలం 3వేల మెసేజిలు మాత్రమే రోడ్ల గురించి ఉన్నాయి. తమ శరీర కొలతలు, రంగు, ఎత్తు లాంటి వివరాలన్నింటినీ కూడా ఆ మెసేజిలలో ఇచ్చారు. కొన్నాళ్ల పాటు క్రికెట్ ఆడి.. తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తేజస్వి యాదవ్ (26).. ఆర్జేడీ అధినేత లాలుప్రసాద్ చిన్న కొడుకు. చాలామంది అది తేజస్వి యాదవ్ సొంత నెంబరు అనుకుని ఈ మెసేజిలు పెట్టేశారట. ఇప్పటికి తాను ఇంకా బ్రహ్మచారిని కాబట్టి సరిపోయింది గానీ, పెళ్లి అయి ఉంటే తాను పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయి ఉండేవాడినని తేజస్వి సరదాగా అన్నారు. అయితే తాను పెద్దలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటానని స్పష్టం చేశారు. సోషల్ మీడియాను విస్తృతంగా ఉపయోగించే తేజస్వికి గతంలో ఒక విద్యార్థి తనకు రావల్సిన స్కాలర్షిప్ రావట్లేదంటూ ఫేస్బుక్లో ఫిర్యాదుచేయగా, ఆయన సంబంధిత అధికారులకు చెప్పి వెంటనే ఇప్పించారు. -
'తమ్ముడైనా..సోదరైనా ఎన్నికల్లో శత్రువే'
పాట్నా: ఎన్నికల బరిలో రక్త సంబంధాలకు స్థానం లేదని ఆర్జేడి నేత లాలూ ప్రసాద్ యాదవ్ భార్య మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవి స్పష్టం చేశారు. బీహార్ లోని సరన్ లోకసభ నియోజకవర్గంలో తన తమ్ముడు సాధు యాదవ్ ను రబ్రీదేవి ఎదుర్కోనున్నారు. ఈ నేపథ్యంలో రబ్రీదేవి మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో తమ్ముడు, సోదరి అనే సంబధాలు పక్కన పెట్టాల్సిందే అని అన్నారు. తమ్ముడైనా ఎన్నికల్లో శత్రువేనని ఆమె వ్యాఖ్యానించారు. ఎన్నికల బరిలో తమ్ముడైనా, సోదరైనా ప్రత్యర్ధిగానే పరిగణిస్తానని ఆమె ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. ప్రత్యర్ధులతో ఎలాంటి ఒప్పందాలు ఉండవని, సరన్ ప్రజలు సాధుకు గుణపాఠం చెబుతారని రబ్రీదేవి అన్నారు. వివాదస్పద సిట్టింగ్ ఎంపీ సాధుయాదవ్ సరన్ స్థానం నుంచి పోటి చేయనున్నట్టు ప్రకటన చేశారు. ఆర్జేడి ప్రచారంలో ఆకర్షణీయమైన నేతగా మారిన కుమారుడు తేజస్వి యాదవ్ తో కలిసి రబ్రీదేవి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. తన తల్లికి వ్యతిరేకంగా పోటిలో నిలిచి మామ పెద్ద తప్పు చేశారని తేజస్వీ అన్నారు. బావమరిది పోటీలో ఉన్నా గెలుపు రబ్రీదేవిదే అని లాలూ ప్రసాద్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.