
తాడేపల్లి : స్థానిక సంస్థల ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై ఈసీ కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సీపీ నేత, మాజీ మంత్రి మేరుగ నాగార్జున డిమాండ్ చేశారు. వీడియోల రూపంలో సాక్ష్యాలు ఉన్నా ఈసీ ఎందుకు మౌనం పాటిస్తుందని ప్రశ్నించారు మేరుగ. ఈరోజు(శనివారం) తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయం నుంచి ప్రెస్ మీట్ లో మాట్లాడిన మేరుగ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలకు వంతపాడిన అధికారులపై కఠిన చర్యలకు తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. ‘
స్థానిక సంస్థల్లో జరిగిన అక్రమాల్లో ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనం వహిస్తోంది. ఈసీ మౌనం ప్రజాస్వామ్యానికి చేటు. మున్సిపల్ ఉప ఎన్నికల సమయంలో కూడా అక్రమాలు జరిగాయి. అక్రమాలు చేసిన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం దారుణం. దాడులు, దౌర్జన్యాలు చేసినా ఈసీ ప్రేక్షక పాత్ర వహించడం సరిదాదు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి’ అని మేరుగ కోరారు.