abbaya chowdary
-
మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నం
సాక్షి, ఏలూరు జిల్లా: దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి ఇంటిపై దాడికి యత్నించారు. చింతమనేని అనుచరులను వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకున్నారు. చింతమనేని అనుచరులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు.పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామంలో అబ్బయ్య చౌదరి ఇంటి వద్ద రెండో రోజు ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ రోజు(శనివారం) ఇంటి ముందు వంటా వార్పు పేరుతో చింతమనేని అనురులు డ్రామాకు దిగారు. దీంతో చింతమనేని అనుచరులు, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చింతమనేని అనుచరులకు వత్తాసు పలుకుతూ పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. -
జగన్ 2.0.. 4వ తేదీన రాష్ట్రంలో ఫ్యాన్ సునామీ
-
టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్
-
నువ్వా నన్ను విమర్శిస్తావ్.. దేవినేని ఉమాకు అబ్బయ్య చౌదరి కౌంటర్
-
చింతమనేని దాష్టీకంపై భగ్గుమంటున్న దెందులూరు
ఏలూరు, సాక్షి: ఎన్నికల వేళ.. దెందులూరు నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్ ప్రచారంలో వీరంగం సృష్టించారు. వైఎస్సార్సీపీ సంక్షేమ ప్రభుత్వం గురించి మాట్లాడిన దళితులపై తన అనుచరులతో దాడి చేయించారు. ఈ ఘటనపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. క్షతగాత్రులను పరామర్శించిన స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, చింతమనేని తీరును తీవ్రంగా ఖండిస్తున్నారు. శుక్రవారం పెదవేగి మండలం లక్ష్మీపురం కూచిపూడి రామసింగవరం గ్రామాల్లో చింతమనేని, తన అనుచరులతో ప్రచారానికి వెళ్లారు. ఆ సమయంలో యర్ర చంటిబాబు అనే యువకుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంచి జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. దీంతో కోపోద్రిక్తులైన చింతమనేని అనుచరులు అతనిపై దాడికి దిగారు. అడ్డుకోబోయిన మరికొందరు యువకులపైనా దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ ఐదుగురు యువకుల్ని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానిక ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరిలు, ఏలూరు ఎంపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ ఆస్పత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు. చింతమనేనిపై దెందులూరు ప్రజానీకం, దళిత సంఘాలు ఆగ్రహం వెల్లగక్కుతున్నాయి. నియోజకవర్గం వ్యాప్తంగా నిరసనలకు పిలుపు ఇచ్చాయి. మరోవైపు ఈ ఉదయం దాడి ఘటనపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మీడియాతో మాట్లాడారు. ‘‘చింతమనేని ఏమాత్రం విలువల్లేని నాయకుడు. చింతమనేని తన హయాంలో చేసిన అరాచకాలు అన్నీఇన్నీ కావు. 93 కేసులు ఉన్న ఓ రౌడీ షీటర్. ఎన్నికల ప్రచారంలోనూ తన ప్రవర్తన ఏమాత్రం మార్చుకోలేదు. దెందులూరులో గొడవలతో ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.... ప్రచారంలో భాగంగా దళితవాడలోకి వెళ్లి మరీ దాడి చేయడాన్ని ఖండిస్తున్నాం. సీఎం జగన్ హయాంలోనే తనకు మంచి జరిగింది అన్నందుకు ఓ దళిత యువకుడిపై బూతులు తిడుతూ దాడి చేయించాడు. అతని కన్నతల్లిని దుర్భాషలాడారు. ఆ యువకుల్ని చంపే ప్రయత్నం చేశారు. ఇలాంటి వ్యక్తికి బీఫామ్ ఇచ్చారు చంద్రబాబు. చంద్రబాబు ఇలాంటి వ్యక్తికి టికెట్ ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం కాదా?. దళిత యువకులపై దాడి హేయనీయం. చింతమనేని అరాచకాన్ని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకువెళ్తాం. చింతమనేని పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి. దళితులకు చంద్రబాబు క్షమాపణలు చెప్పాలి. ‘చింతమనేని.. ఎవరి పేగులు లాగేస్తావ్?. ఇలాంటి ప్రవర్తనను కొనసాగిస్తే నువ్వు ప్రచారం చేయలేవ్. ప్రజలపై విశ్వాసం లేని మూర్ఖుడివి నువ్వు. చంద్రబాబూ.. చింతమనేనిని ఎన్నికల ప్రచారానికి పంపావా? లేదంటే దళితులపై దాడిచేయమని పంపవా?.. చింతమనేని.. ఇక నుంచి దెందులూరులోని ప్రజలు గ్రామాల్లోకి రానియకుండా నిన్ను కట్టడి చేస్తారు. జాగ్రత్త.. చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి.. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయి అని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాద బాధితుడు మరణించాడని ఎల్లో మీడియా తప్పుడు వార్తలు..
-
దెందులూరులో టీడీపీ ఖాళీ..
-
YSRCP చేసిన అభివృద్ధిపై బాబుతో చర్చకు సిద్ధం: MLA
-
కష్టాల నుంచి పుట్టిన పార్టీ వైఎస్సార్సీపీ : అబ్బయ్య చౌదరీ
-
బాలకృష్ణ వెళ్లి కూర్చో ఇది సినిమా కాదు ... అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
‘ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయి’
ఏలూరు: దెందులూరులో శనివారం జరిగిన వైఎస్సార్సీపీ ‘సిద్ధం సభ’కు గోదావరి, కృష్ణ నదులు ఉప్పొంగినట్టుగా ప్రజలు తరలివచ్చారని వైఎస్సార్సీసీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు. తామంతా జగనన్నను సీఎం చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్న సంకేతాన్ని రాష్ట్రవ్యాప్తంగా పంపించిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. పాత్రికేయులకు జరిగిన చిన్న అసౌకర్యానికి మన్నించాలని కోరుతున్నామన్నారు. దెందులూరులో జరిగిన ‘సిద్ధం సభ’ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చినీయాంశంగా మారిందని తెలిపారు. భీమిలి సభ ట్రైలర్ అయితే నిన్న(శనివారం) దెందులూరు సభతో ప్రతిపక్షాలు సూట్ కేసులు సర్దుకుంటున్నాయని ఎద్దేవా చేశారు. జగనన్న ప్రభుత్వం వచ్చాక ఏ కుటుంబానికి అయితే లబ్ధి చేకూరిందో వారే తమ స్టార్ క్యాంపెనర్లలని సీఎం జగన్ సూచించారని అన్నారు. వై నాట్ 175 అనేది.. నిన్నటి సభతో ప్రతిపక్షాలకు అర్థమై ఉంటుందని అన్నారు. సీఎం జగన్మోహన్రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామనే నినాదం సభలో ప్రజల నోట వినబడిందని తెలిపారు. ఈ 60 రోజులు ప్రతి కార్యకర్త కష్టపడదామని సీఎం జగనన్నను మళ్లీ సీఎం చేసుకుందామని అనేక కుటుంబాలు ఎదురుచూస్తున్నాయని అన్నారు. ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు నేతలు సూట్ కేసులు సర్దుకుని హైదరాబాద్ వెళతాయని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇప్పటికే హైదరాబాదులో ఉంటున్నారని మండిపడ్డారు. కుప్పం టూ ఇచ్చాపురం మా అభ్యర్థులు ఎవరో చెప్పాం.. మా ఎజెండా ఏంటి.. మా జెండా ఏంటి.. అనేది స్పష్టం చేశామని పేర్కొన్నారు. అభ్యర్థులు కరువై.. ప్రతిపక్షాలు పొత్తులకు వెళుతున్నాయని ఎద్దేవా చేశారు. -
అబ్బయ్య చౌదరి స్పీచ్ కు దద్దరిల్లిన సభ
-
జగనన్న జనసంద్రం చూస్తే సునామీనైనా ఆపొచ్చు అనిపిస్తుంది
-
టీడీపీ-జనసేన కూటమిపై అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
పేదల పక్షపాతి సీఎం వైఎస్ జగన్
-
పవన్, భువనేశ్వరిపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సెటైర్లు
-
చంద్రబాబువన్నీ డ్రామాలే..
సాక్షి, అమరావతి/ఏలూరు: టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కారుమూరి నాగేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, మంత్రి కారుమూరి శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షం కారణంగా రైతులను ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. అందులో భాగంగానే మేము ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా ధాన్యం సేకరిస్తున్నాం. చంద్రబాబు తణుకులో అడుగుపెట్టడంతో భారీ వర్షం పడింది. చంద్రబాబు పర్యటనలో కార్యకర్తలే తప్ప రైతులు లేరు. రైతుకు వ్యవసాయం దండగ అన్న నీచుడు చంద్రబాబు అని సీరియస్ అయ్యారు. మరోవైపు ఏలూరులో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ.. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు. ఆయనకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు. చంద్రబాబు హయాంలో రైతులను పట్టించుకోలేదు. చంద్రబాబు ఐదేళల్లో సేకరించిన ధాన్యం జగనన్న ప్రభుత్వం మూడేళ్లలోనే సేకరించింది. దెందులూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఇప్పటికే ధాన్యం సేకరించాం. 29,074 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి డబ్బు కూడా చెల్లించాం. ఏ సీజన్లో నష్టం జరిగితే అదే సీజన్లో సాయం చేసిన ఘనత మాది. మాది రైతుకు అండగా ఉండే ప్రభుత్వం. కొనుగోలు చేసిన ధాన్యానికి 21 రోజుల్లోపే డబ్బులు చెల్లిస్తున్నాం. ఎమ్మెల్యే వాసుబాబు మాట్లాడుతూ.. ‘ఈ-క్రాప్ ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతోంది. చంద్రబాబువన్నీ డ్రామాలే. రైతులకు మద్దతు ధర ఇవ్వడంలో ఏపీ నెంబర్ వన్‌గా ఉంది. డ్రామా ఆర్టిస్టులతో చంద్రబాబు నాటకాలు ఆడిస్తున్నారు’ అంటూ సీరియస్ అయ్యారు. చదవండి: రైతన్నకు అండగా ప్రభుత్వం.. తడిసినా ధాన్యం తీసుకుంటాం -
చంద్రబాబుకు వాస్తవాలు మాట్లాడే అలవాటు లేదు
-
దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో " స్ట్రెయిట్ టాక్ "
-
దెందులూరును అభివృద్ధి చేయాలనే నేను లండన్ నుంచి వచ్చా : అబ్బయ్య చౌదరి
-
చంద్రబాబు ఫ్రస్ట్రేషన్పై పవర్ఫుల్ పంచ్‌లు
సాక్షి, ఏలూరు: తమ్మిలేరులో తాను ఇసుక తవ్వినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తానని టీడీపీ అధినేత, శాసన సభా ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడికి దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సవాల్ విసిరారు. నియోజకవర్గంలో కార్యక్రమం నిర్వహించి తనపై చంద్రబాబు వ్యక్తిగత విమర్శలు చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. దెందులూరును అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే లండన్ నుంచి వచ్చా. నిజయోకవర్గానికి చెందిన యువతకు వేలాది ఉద్యోగాలు ఇప్పించా. అయినా చంద్రబాబు నాపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.కానీ, చంద్రబాబు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. దెందులూరులో రూ.1,700 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. ప్రగతి యాత్రలో(మంగళవారం) అదే విషయం మేం చెప్పాం. కానీ, ప్రతిపక్ష పార్టీ మితిమీరి విమర్శలు చేస్తోంది. అయినా మీ హయాంలో చేసిన ఒక్క మంచిపని చెప్పండి అంటూ బాబుకు సవాల్ విసిరారు అబ్బయ్య చౌదరి. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేది వైఎస్ జగన్మోహన్రెడ్డినే అని అబ్బయ్య చౌదరి స్పష్టం చేశారు. ‘‘ఈ మూడున్నరేళ్లలో మేనిఫెస్టోలో ఇచ్చిన తొంభై శాతం హామీలను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నేరవేర్చారు. కానీ, మేనిఫెస్టోనే మాయం చేసిన ఘనత చంద్రబాబుది. సీఎంగా వైఎస్ జగన్.. ఎన్నో అభివృద్ధి .. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని, ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించారని, సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామాల రూపురేఖలను మార్చేశార’’ని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. అలాగే చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి.. కనీసం నాలుగు లక్షల ఇళ్లు కూడా ఇవ్వలేదన్నారు. అదే సీఎం జగన్.. ఈ మూడున్నరేళ్లలో 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారని తెలిపారు. ఏపీలో రైతులు పండించిన ప్రతీ గింజను కొనేలా చేసిన వ్యక్తి వైఎస్ జగన్. మరి 44 ఏళ్ల రాజకీయ జీవితంలో రైతులను పట్టించుకున్నావా? అంటూ చంద్రబాబును నిలదీశారు. డ్వాక్రా రుణాల మాఫీ అని మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు. కానీ, డ్వాక్రా మహిళలకు అండగా నిలిచిన వ్యక్తి సీఎం జగన్ అని తెలిపారు. ఎల్లో మీడియా దుష్ట చతుష్టయం మా ప్రభుత్వం పై బురద చల్లాలనీ చూస్తున్నాయి. అది చూసి రాష్ట్ర ప్రజలు అంతా ‘బాబూ.. మాకు ఈ కర్మ ఏమిట’ని అనుకుంటున్నారు. రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందని.. అర్హులకు సంక్షేమం అందుతోంది గనుకే ధైర్యంగా ఓటేయమని అడుగుతున్నామని అబ్బయ్య చౌదరి తెలిపారు. ఓటమి భయం తో చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి. ఇసుక మాఫియాకు పాల్పడింది చింతమనేని కాదా? అని నిలదీసిన అబ్బయ్య చౌదరి.. వచ్చే ఎన్నికల్లో ఫలితంతో చింతమనేనిని కూడా తన వెంట హైదరాబాద్‌కు చంద్రబాబు తీసుకెళ్లడం ఖాయమని జోస్యం చెప్పారు. -
ఏలూరు పెదవేగి మండలంలో దెందులూరు ప్రగతి యాత్ర
-
విక్రమ్‌రెడ్డి మెజార్టీ చరిత్రలో నిలవాలి: ఆర్కే రోజా
చేజర్ల–నెల్లూరు(దర్గామిట్ట): దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అకాల మరణంతో జరుగుతున్న ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఆయన సోదరుడు, వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి విక్రమ్‌రెడ్డి సాధించే మెజార్టీ చరిత్రలో నిలిచిపోయేలా ప్రజలు తీర్పు వెలువరించాలని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ఆర్కే రోజా పిలుపునిచ్చారు. ఆదివారం చేజర్ల మండలంలోని పాతపాడు, ఓబులాయపల్లి, కొండలరాయుడు కండ్రిక, గొల్లపల్లి గ్రామాల్లో ఆమె మేకపాటి విక్రమ్‌రెడ్డికి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యకర్తలు, అభిమానులు, మహిళలు, ప్రజలు ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ మంచి నాయకుడు మేకపాటి గౌతమ్‌రెడ్డిని కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందుతున్నాయన్నారు. రాష్ట్రంలో రూ.1.40 లక్షల కోట్లు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు ఖర్చు చేసిన ఘనత మన సీఎందేనన్నారు. ప్రతిపక్షనేతలు చేసే కువిమర్శలను తాము పట్టించుకోబోమని, అభివృద్ధే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకుసాగుతోందని తెలిపారు. గతంలో అ«ధికారంలో ఉండి ప్రజలకు ఏమీ చెయ్యని వాళ్లు, నామమాత్రంగా పార్టీ నడుపుతున్న వాళ్లు కూడా ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి) గత టీడీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, ప్రస్తుతం వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూస్తే, ఎవరు ప్రజల కష్టాలను దూరం చేశారో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను దేశంలో ప్రతి రాష్ట్రం ఆదర్శంగా తీసుకుందని తెలిపారు. ఆత్మకూరు నియోజకవర్గంలో దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి ఎన్నో సమస్యలను పరిష్కరించారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో అందరూ ప్యాన్ గుర్తుకు ఓటేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బలపరిచిన మేకపాటి విక్రమ్‌రెడ్డిని లక్ష ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. -
ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం: అబ్బయ్యచౌదరి
దెందులూరు: పినకడిమి, ప్రత్తికోళ్లలంకలో హత్యలు చేయించింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. 18 నెలలు ప్రత్తికోళ్లలంకలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడానికి సూత్రధారి, పాత్రధారి ఎవరో కూడా అందరికీ తెలుసని చెప్పారు. పినకడిమిలో బలవంతంగా బంగారం లాక్కోవడం, దౌర్జన్యాలు ఇలా చెప్పుకొంటూపోతే తాను ప్రతీదీ చెప్పగలనని ఆయన తెలిపారు. గురువారం వైఎస్సార్సీపీ దెందులూరు మండల కన్వీనర్ కామిరెడ్డి నాని నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే సీఎంగా చంద్రబాబునాయుడు ఉండగానే చింతమనేనిపై రౌడీషీట్ తెరిచారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 84 కేసులు అన్ని పోలీస్స్టేషన్లలో నమోదయ్యాయని, 24 కేసులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. చింతమనేని హయాం అంతా ప్రజలు, ఉద్యోగులు, పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, దూషణలు లాంటి ఘటనలే అధికమన్నారు. పూర్తి నేర చరిత్ర కలిగిన చింతమనేని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. చదవండి: (Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్) మూడేళ్ల పాటు ప్రశాంత వాతావరణంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రూ.470 కోట్ల మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టినట్టు చెప్పారు. సంక్షేమ పథకాలు కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందించామన్నారు. తాము మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తుంటే 10 రోజుల్లో నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ, గ్రామగ్రామానా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలకే నియోజకవర్గంలో ప్రశాంతతను భగ్నం చేసేందుకు చింతమనేని కుట్రకు తెరలేపారన్నారు. చంద్రబాబు స్క్రీన్‌ప్లే చేస్తుంటే.. పప్పు లోకేష్ ప్రోత్సహిస్తున్నాడని, చింతమనేని ఈ కుట్రలన్నీ అమలు చేస్తున్నాడని చెప్పారు. ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం... ఏ నియోజకవర్గంలోనూ, ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా ఆడకూతుళ్లను సైతం సోషల్ మీడియాలో ప్రచారసాధనాల్లో లాగి కించపరిచేలా పోస్టులు పెడితే ఇకపై తమ తడఖా చూపిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చింతమనేని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే, భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పక్క నియోజకవర్గం వెతుక్కుంటున్న చింతమనేని నాకు పోటీయా.. గత ఎన్నికల్లో 18 వేల ఓట్ల తేడాతో తన చేతిలో ఓడిపోయి పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపి, ఓటమి భయం పట్టుకుని మూడేళ్లుగా ఇంటికే పరిమితమై పక్క నియోజకవర్గాల్లో ఏదోకచోట కర్ఛీఫ్ వేద్దామని, ప్రతి నియోజకవర్గానికీ తిరుగుతున్న చింతమనేని నాకు పోటీయా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంపై ఏ గ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనా ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు తేరా ఆనంద్, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
-
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నేతల దాడి
దెందులూరు: ఏలూరు జిల్లా దెందులూరు పోలీస్ స్టేషన్ ఎదుట వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలతోపాటు ఎస్ఐ ఐ.వీర్రాజు సైతం తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. దెందులూరు మండలం శ్రీరామవరానికి చెందిన టీడీపీ కార్యకర్త మోర్ల వరకృష్ణ, చోడవరపు సాయి అజయ్ కలిసి ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని తదితరులపై 15 రోజులుగా సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. దీనిపై పార్టీ మండల కన్వీనర్ కామిరెడ్డి నాని మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. విచారణ నిమిత్తం మోర్ల వరకృష్ణను సాయంత్రం 4.30 గంటలకు పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతనికి మద్దతుగా దాదాపు వందమంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు దెందులూరు స్టేషన్‌కు వచ్చారు. ఈ విషయం తెలిసి శ్రీరామవరం నుంచి వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, కార్యకర్తలు స్టేషన్‌కు వచ్చారు. కాగా, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నట్టుండి వైఎస్సార్సీపీ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడి చేసి.. కళ్లల్లో కారం చల్లారు. ఘటనలో శ్రీరామవరానికి చెందిన కామిరెడ్డి నాగభూషణం, కామిరెడ్డి రాజేష్ తీవ్రంగా గాయపడ్డారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. దాడిలో ఎస్ఐ వీర్రాజు సైతం గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఏలూరు డీఎస్పీ పైడేశ్వరరావు నియోజకవర్గంలోని ఎస్ఐలు, ఏలూరు నగరంలోని సీఐలతో దెందులూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. గాయపడిన వారు ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చీఫ్ విప్ ప్రసాదరాజుకు ఎమ్మెల్యే కొఠారి సత్కారం
దెందులూరు(పశ్చిమగోదావరి): ఆంధ్రప్రదేశ్ నూతన చీఫ్‌విప్‌గా ముదునూరి ప్రసాదరాజును ఎంపిక చేయడం వ్యక్తిగతంగా, పార్టీపరంగా ఎంతో సంతోషాన్నిచ్చిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్యచౌదరి అన్నారు. సోమవారం తాడేపల్లిలో ఏపీ చీఫ్‌విప్ చాంబర్లో ప్రసాదరాజును కలిశారు. శాలువా, బొకేతో సత్కరించి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయన వెంట వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి జానంపేట బాబు, దెందులూరు మండల పార్టీ కన్వీనర్ కామిరెడ్డి నాని, పోతునూరు మాజీ సొసైటీ చైర్మన్ గూడపాటి పవన్‌కుమార్ ఉన్నారు. చదవండి: తిరుమలకు పోటెత్తిన భక్తులు.. టీటీడీ కీలక నిర్ణయం -
వీళ్లా దుర్మార్గానికి ఇప్పటికి అక్కడ నెట్ కనెక్షన్ లేదు
-
పెగాసస్‌తో ఎవరి ఫోన్‌నైనా టాప్ చేయవచ్చు: అబ్బయ్య చౌదరి
సాక్షి, ఏలూరు: ఏపీలో పెగాసన్ దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు హయంలో పెగాసస్ వాడకంపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా పెగాసస్ అంశంపై వైఎస్ఆర్సీపీ దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి స్పందించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ పెగాసస్ ద్వారా ఎవరి ఫోన్‌నైనా టాప్ చేయవచ్చు. మన ఫోన్లో డేటాను పూర్తిగా పరిశీలించవచ్చు.. ఈ శాతాబ్దంలోనే అతి పెద్ద స్కామ్ ఇది.. మా ఫోన్లు హ్యాక్ చేస్తున్నారని గతంలోనే గ్రహించాం. పెగాసస్ స్పైవేర్‌తో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారు.. అధికార దాహంతోనే ఎలాంటి కుట్రకైనా పాల్పడే వ్యక్తి చంద్రబాబు.. ప్రత్యర్థి పార్టీల్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకే పెగాసస్ కొన్నారు.. గతంలో చంద్రబాబుతో రాజకీయంగా జతకట్టిన మమతా బెనర్జీనే పెగాసస్ గురించి చెప్పారు’’. అని అన్నారు. -
రాష్ట్రం బంగారంలాంటి మనిషిని కోల్పోయింది
-
భోగి పండుగ ఆచరణలో అనేక విశేషాలు
-
ఏలూరు : ఉత్సాహంగా ఎడ్ల బండ్ల పోటీలు
-
వంగవీటి రాధా వర్గీయుల దాడి
సాక్షి, గన్నవరం: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా అనుచరులు హనుమాన్‌జంక్షన్‌లో దౌర్జన్యానికి పాల్పడ్డారు. హైవేపై అడ్డగోలుగా ఓవర్ టేక్ చేసినందుకు ప్రశ్నించిన వైఎస్సార్ సీపీ దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్‌పై రాధా అనుచరులు దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారుడ్రైవర్ తలకు తీవ్ర గాయమై రక్తస్రావం కావటంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చదవండి: (టీడీపీకి మాజీ ఎమ్మెల్యే ఫిలిప్ సి తోచర్ రాజీనామా) ఒకే కారులో బయలుదేరి వెళుతున్న అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధా వివరాల్లోకి వెళితే.. వేర్వేరు వాహనాల్లో ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా విజయవాడ వైపు వెళుతున్నారు. హనుమాన్‌జంక్షన్ సెంటర్ దాటిన తర్వాత ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరికి చెందిన వాహనాలను వంగవీటి రాధా అనుచరులు ఓవర్ టేక్ చేసి ముందుకు దూసుకెళ్లారు. కొద్ది దూరం వెళ్లిన తర్వాత వేలేరు క్రాస్‌రోడ్ వద్ద అడ్డగోలుగా కారు నడపటంపై ప్రశ్నించినందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్, ఆయన అనుచరులపై వంగవీటి రాధా వర్గీయులు వాగ్వివాదానికి దిగారు. ఇరుపక్షాలను శాంతింపజేసేందుకు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి, వంగవీటి రాధాలకు సీఐ డి.వెంకటరమణ నచ్చజెప్పి అక్కడ నుంచి ఇద్దరిని ఒకేకారులో పంపించారు. ఇంతలోనే ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ చల్లారి గోపీకృష్ణపై వంగవీటి రాధా వర్గీయులు దాడి చేయటంతో తలకు తీవ్ర గాయమైంది. ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్ గోపీకృష్ణ వీరవల్లి పోలీస్‌స్టేషన్‌లో వంగవీటి రాధా అనుచరులపై ఫిర్యాదు చేశారు. -
సీఎం జగన్ రైతులకు పెద్దపీట వేస్తున్నారు
సాక్షి, పశ్చిమ గోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... పాదయాత్ర సమయంలో పామాయిల్ రైతులు పడుతున్న కష్టాలను చూసి సీఎం వైఎస్ జగన్ చలించిపోయారని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చాక పామాయిల్‌కు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు రవాణా ఖర్చులు కూడా చెల్లించాలని నిర్ణయం తీసుకోవడం హర్షనీయం అన్నారు. నివర్ తుఫాన్ సమయంలో నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ పరిహారం అందించామని ఆయన చెప్పారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమా షూటింగ్ అంటూ ఒక జిల్లా తర్వాత మరో జిల్లా పర్యటిస్తున్నారని, హైదరాబాద్‌లో వరదలు వచ్చినపుడు పవన్ కల్యాణ్ ఎందుకు బయటకు రాలేదన్నారు. గతంలో చంద్రబాబును ప్రశ్నించలేదు కానీ ఇప్పుడు తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. గతంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకున్నప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లొకేష్‌లు ఏమయ్యారని ఎమ్మెల్యే మండిపడ్డారు. -
‘ఆగస్టు 15న ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతాం’
సాక్షి, పశ్చిమ గోదావరి: ఇచ్చిన హామీ మేరకు పేద ప్రజలకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇస్తుంటే టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే అబ్బయ చౌదరి విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాద్యయాత్రలో పేద కుటుంబాలకు ఇళ్లు కట్టి ఇస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన హామీకి కట్టుబడి సీఎం జగన్ 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని, కానీ టీడీపీ నేతలు కోర్టులో పిటిషన్లు వేయించి అడ్డుకున్నారని ఎమ్మెల్యే మండిపడ్డారు. చదవండి:ఏపీ సోషల్ రిఫార్మర్ సీఎం వైఎస్ జగన్ ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని, ఆగస్టు 15వ తేదీన ఇళ్ల పట్టాలు ఇచ్చి తీరుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పేద ప్రజలు తమ స్వంతింటి కల నేరవేరుతోందని ఎంత ఆశగా చూశారో కానీ సమయానికి టీడీపీ నేతలు అడ్డుకున్నారన్నారు. ద్రవ్యోల్బణ బిల్లును సైతం అడ్డుకుని ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. చింతమనేని ప్రభాకర్.. గాలాయాగూడెం గ్రామం నుంచి ఉద్దేశపూర్వకంగా కొంతమందిని పంపి ధర్నా చేయించాడన్నారు. ధర్నా చేసిన మహిళలకు ఇప్పటికే ఇళ్ల స్థలాలు పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. ప్రభుత్వంపై విమర్శలు ఆపకపోతే సహించేది లేదని దెందులూరు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీపై చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. -
ఏపీ సోషల్ రిఫార్మర్ సీఎం వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జీవం పోశారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంఎస్ఎంఈల ద్వారా10 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. సింగిల్ విండో విధానాన్ని కూడా సీఎం జగన్ తీసుకొచ్చారని తెలిపారు. రీస్టార్ట్ ప్యాకేజీ రూపంలో ఎంఎస్ఎంఈలకు మొదటి విడతలో రూ. 450 కోట్లు రెండో విడతలో రూ.512 కోట్లు సీఎం వైఎస్ జగన్ విడుదల చేశారని చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు రీస్టార్ట్ ప్యాకేజీని ప్రకటించారని చెప్పారు. (ధ్రువీకరణ పత్రం అందుకున్న మాణిక్య వరప్రసాద్) ఆంధ్రప్రదేశ్‌కు సోషల్ రిఫార్మర్ సీఎం జగన్ అని అబ్బయ్య చౌదరి కొనియాడారు. ఎల్లో మీడియా కీయా మోటార్స్ తరలిపోతుందని తప్పుడు ప్రచారం చేసిందని మండిపడ్డారు. కీయా మోటార్స్ తమ ప్లాంట్‌ను మరింత విస్తరిస్తామని ప్రకటించిందని గుర్తుచేశారు. సౌత్ ఇండియాకు పారిశ్రామిక ముఖద్వారంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలని సీఎం భావిస్తున్నారని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజన్ ఉన్న నేత అని అన్నారు. చంద్రబాబు ఎన్ని ఇండస్ట్రీల్ సమ్మిట్లు పెట్టినా రాష్ట్రానికి ఎటువంటి పెట్టుబడులు రాలేదని ఎద్దేవా చేశారు.చంద్రబాబులా మాయ మాటలు చెప్పడం సీఎం జగన్‌కు తెలియదన్నారు. ఎంఎస్ఎంఈలకు చంద్రబాబు ప్రభుత్వం 4 వేలకోట్లు బకాయిలు పెట్టిందని అబ్బయ్య చౌదరి మండిపడడ్డారు. ఎంఎస్ఎంఈలు పెట్టిన వాళ్లలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారు అధికంగా ఉన్నారని తెలిపారు. వాటికి మేలు చేసే విధంగా రూ.182 కోట్లు విద్యుత్ బకాయిలు సీఎం వైఎస్ జగన్ రద్దు చేశారని గుర్తు చేశారు. ఎంఎస్ఎంఈల ద్వారా గ్రామ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. త్వరలో 47 సెజ్‌లను ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. -
ఏపీకి సోషల్ రిఫార్మర్ సీఎం జగన్
-
కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ ఏం చేశాడో..
సాక్షి, పశ్చిమ గోదావరి : రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ ఎక్కడా వెనుకాడకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని ఎమ్మెల్యేలు పుప్పాల వాసుబాబు, అబ్బాయ చౌదరి అన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాపు సామాజిక వర్గ మహిళలకు ఆర్థికంగా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘వైఎస్సార్ కాపు నేస్తం’ పథకాన్ని బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు ఏలూరులో మాట్లాడుతూ.. పాదయాత్రలో కాపు కార్పొరేషన్‌కు ఏటా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట కంటే ఎక్కువ ఇచ్చారని పేర్కొన్నారు. మాట ఇస్తే మడం తిప్పం అనే మాటను మరోసారి ముఖ్యమంత్రి నిరూపించారని ప్రశంసించారు. ('వైఎస్సార్ కాపు నేస్తం' ప్రారంభం ) ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సృజన చౌదరి, కామినేని శ్రీ నివాసరావు భేటి పై ఉంగుటూరు, దెందులూరు ఎమ్మెల్యేలు వాసుబాబు,అబ్బాయ చౌదరి స్పందింస్తూ.. ఈ కలయిక వెనక టీడీపీ హస్తం ఉదని తాము మొదటి నుంచి ఆరోపిస్తున్నామన్నారు. ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎల్లో మీడియాలో తాము చేసిన ఆరోపణలపై ప్రచారం చేశాయని, నేడు ఆ ఎల్లో మీడియా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఈ కలకయికలో ముగ్గురే కనిపించారని, కనిపించని నాలుగో వ్యక్తి ‘జూమ్ యాప్’ఎటువంటి సూచనలు చేశారో అని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్‌న ఎంతో గౌరవిస్తామని, నేడు ఇలాంటి కలయికను ఏమని చెప్పాలో తెలియడం లేదన్నారు. వారి కలయికలో ఎటువంటి చీకటి ఒప్పందాలు చేసుకున్నారో, రాష్ట్రాన్ని ఎటు తీసుకెళ్తున్నారో అర్థం అవ్వడం లేదన్నారు. ఇప్పటికైనా భారతదేశ ఎలక్షన్ కమిషన్ స్పందించి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని వాసుబాబు, అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. (ఆ ముగ్గురి వ్యాపార లావాదేవీలు ఏమై ఉంటాయబ్బా?) -
'ఆ విషయం వైఎస్ జగన్ ముందే చెప్పారు'
సాక్షి, పశ్చిమ గోదావరి : కరోనా కట్టడి అయ్యేవరకు కరోనాతో కలిసి జీవించాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెబితే కొందరు అవహేళన చేశారు.. కానీ నేడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అదే చెబుతుందంటూ రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత తెలిపారు. ఎమ్మెల్యే అబ్బాయ చౌదరితో కలిసి సుచరిత శుక్రవారం దెందులూరు జాతీయ రహదారిపై వలస కులీలకు ఉచితంగా భోజన ప్యాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడి నేపధ్యంలో లాక్డౌన్ విధించినప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లు, మంత్రులు ప్రజలకు అండగా నిలిచారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో వలస కులీలను అన్ని విధాలా ఆదుకునేందుకు ఇప్పటికే ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని తరలించామని తెలిపారు. (కందిపప్పు.. ఇక్కడ నచ్చకుంటే అమరావతికి వెళ్లు!) కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటునే రైతులను అన్ని విధాల ఆదుకునేందుకు చర్యలు చేపట్టారన్నారు. దేశంలోనే కరోనా వైద్య పరీక్షలు అత్యధికంగా ఆంద్రప్రదేశ్‌లో జరిగాయన్నారు. కరోనా నివారణపై వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతి రెండు గంటలకు సమీక్ష లు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో రాష్ట్రంలో నాలుగు విడతల రేషన్‌తో పాటు వెయ్యి రుపాయలు పంపిణీ చేశామని పేర్కొన్నారు. ఇంత కఠిన పరిస్థితిలోనూ సీఎం జగన్ సంక్షేమ పధకాలు కొనసాగించడం పట్ల ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో వలంటీర్ల వ్యవస్ద చాలా చక్కగా పనిచేస్తుందని వెల్లడించారు. రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించి రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకున్నట్లు సుచరిత పేర్కొన్నారు. ('సొంత పార్టీకి చెందినవాడే దొంగదీక్ష అన్నాడు') -
చింతమనేని ప్రభాకర్‌కు పితృవియోగం
పశ్చిమ గోదావరి ,పెదవేగి: దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు పితృవియోగం కలిగింది. మండలంలోని దుగ్గిరాల్లోని ప్రభాకర్స్వగృహంలో ఆయన తండ్రి చింతమనేని కేశవరావు(86) మంగళవారం ఉదయం మృతిచెందారు. ఆయన పార్థీవ దేహాన్ని సందర్శించి దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, సొసైటీ అధ్యక్షుడు వడ్లపట్ల శ్రీనివాసరావు తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం చింతమనేనిని పరామర్శించారు. -
టీడీపీకి మాట్లాడే హక్కు లేదు..
సాక్షి, దెందులూరు: రాష్ట్రంలో తెలుగు డ్రామా పార్టీ మరోసారి డ్రామా మొదలు పెట్టిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా దెందులూరులో ఆయన గురువారం మీడియాతో సమావేశంలో మాట్లాడుతూ.. కుల, మతాలను అడ్డంపెట్టుకుని టీడీపీ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. అన్ని కుల,మతాల మద్దతు ఉండబట్టే వైఎస్సార్సీపీ 151 సీట్లు గెలిచిందన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు తన కులాన్ని పేటేంట్ కులంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అన్ని కులాలు ఓట్లు వేస్తేనే దెందులూరులో వైస్సార్సీపీ ఘన సాధించిందని పేర్కొన్నారు. ‘‘ముఖ్యమంత్రి వెనుక ఉన్న రఘురాం ఏ కులమో తెలియదా.. తాను లండన్‌లో ఉద్యోగం చేసుకునేవాడిని.. తనకు రాజకీయాల్లో అవకాశం కల్పించారు. తాన కులం ఏమిటో తెలియదా’ అంటూ టీడీపీ నేతలను అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. (అంపశయ్యపై ఉన్నా ఆరాటమేనా?) మద్యం రేట్లపై బాపిరాజు మాట్లాడటం హాస్యస్పదంగా ఉందన్నారు. మద్యం రేట్లను ‘అమ్మ ఒడి’తో పోల్చుతున్నారని దుయ్యబట్టారు. గొప్ప ఆశయంతో ‘అమ్మ ఒడి’ పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని తాగుబోతులతో పోల్చడం సిగ్గుచేటని నిప్పులు చెరిగారు. ఎంతసేపు టీడీపీ మద్యం బాబుల గురించి మాట్లాడుతుందని.. తాము చిన్నారుల భవిషత్తు గురించి ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు. దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా 2,250 రూపాయల పింఛన్ ఇస్తున్నామని.. పింఛన్లపై మాట్లాడే నైతిక హక్కు టీడీపీకి లేదని ధ్వజమెత్తారు. అధిక శాతం కమ్మ సామాజిక వర్గం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెన్నంటే ఉన్నారన్నారు. 2024లో టీడీపీకి కెప్టెన్ ఎవరో టీడీపీ నేతలు చెప్పగలరా అని ప్రశ్నించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తుందని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. జిల్లాకు చెందిన టీడీపీ నేతలు పదేపదే మీడియాకు ముందుకు వచ్చి సీఎం వైఎస్ జగన్‌పై చేస్తున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. జిల్లాలో మెడికల్ కళాశాల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపన చేశారని.. త్వరలోనే జిల్లా ప్రజల కలను సాకారం చేస్తామని పేర్కొన్నారు. కొల్లేరు ప్రాంత ప్రజలకు న్యాయం చేసేది ఒక వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనని అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. -
దీక్ష దేనికోసమో పవన్ కల్యాణ్ చెప్పాలి
సాక్షి, దెందులూరు: జనసేన అధినేత పవన్ కల్యాణ్ రైతు దీక్ష దేనికోసం చేశారో అందరికీ తెలిసిందేనని, కేవలం ముఖ్యమంత్రిపై విమర్శలు చేసి ఆయన తన అక్కసు వెళ్లగక్కుక్కునే వేదికగా రైతు సౌభాగ్య దీక్ష చేశారని, దీక్ష దేనికోసమో పవన్ కల్యాణ్ చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి డిమాండ్ చేశారు. శుక్రవారం దెందులూరు నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లాల్లో అలజడులు సృష్టించటం ద్వారా తెరవెనుక ఒప్పందం చేసుకున్న రాజకీయ నాయకులకు సహాయ పడదామన్న అత్యాసతో ఉన్నట్లు పవన్ కల్యాణ్ తీరు కనబడుతోందన్నారు. రైతుల గురించి నిర్మాణాత్మకమైన సూచనలు చేస్తే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉండగా, జనహృదయ నేత ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిపై విమర్శలు చేయటంలో పవన్ కల్యాణ్ లక్ష్యం ఏమిటనేది నేరుగా ప్రకటించాలని అబ్బయ్య చౌదరి ప్రశ్నించారు. పరిష్కారమైన సమస్యలపై ప్రశ్నలు వేస్తే ప్రజలకు జనసేన దేనికోసం పనిచేస్తుందో అర్థమవుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వం సమయంలో కాలువలు ఆధురికీకరణ చేయకపోయినా, గత ఐదేళ్లూ పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదన్నారు. ధాన్యం అమ్మిన సొమ్ము టీడీపీ ప్రభుత్వం రైతులకు చెల్లించకపోయినా ఎందుకు పన్నెత్తి మాట అనలేదన్నారు. ప్రజల్లో పరువు తీసుకోవద్దని పవన్ కల్యాణ్‌కు అబ్బయ్య చౌదరి హితవు పలికారు. -
చింతమనేని ఆదర్శప్రాయుడా.. సిగ్గుపడాలి
మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని తమ కార్యకర్తలకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉద్బోధించడంపై సొంత పార్టీ నాయకులే ఆశ్చర్యపోతున్నారు. రౌడీషీట్‌తో పాటు 62 కేసులున్న చింతమనేనిని స్ఫూర్తిగా తీసుకోవాలని అధినేత చెప్పడంతో తెలుగు తమ్ముళ్లు ముక్కున వేలేసుకుంటున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటని, చింతమనేని బాధితులకు ఆవేదన ఎందుకు వినడం లేదని వైఎస్సార్సీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. చింతమనేనిని ఆదర్శంగా తీసుకోండి.. టీడీపీ కార్యకర్తలతో ఆ పార్టీ అధినేత చంద్రబాబు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను కార్యకర్తలందరూ ఆదర్శంగా తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా దుగ్గిరాలలో చింతమనేనిని పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతలు, కార్యకర్తలపై వైఎస్సార్సీపీ నేతలు అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. సీఎం వైఎస్ జగన్‌ది దుర్మార్గ పాలన అని, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరయ్యే పరిస్థితి టీడీపీకి లేదన్నారు. జగన్ టాక్సు పేరుతో ప్రజలపై భారాలు మోపుతున్నారని చెప్పారు. ఇంగ్లిష్ మాధ్యమం, ఇసుక కొరతపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. పవన్‌కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తణుకులో జిల్లా విస్తృతస్థాయి సమావేశం నిర్వహించారు. అమ్మ ఒడి, రైతు భరోసా పథకాలు కొందరికే వర్తింపజేస్తున్నారని ఆరోపించారు. తన దగ్గరకు వస్తే వర్షాకాలంలో సైతం ఇసుక తీసే సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్పిస్తానన్నారు. రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలా? చంద్రబాబుపై ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం దెందులూరు: రౌడీషీట్‌తో పాటు 62 కేసులున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ రాజకీయాలకు స్ఫూర్తి అని, ఆయనను ఆదర్శంగా తీసుకోవాలంటూ చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. దెందులూరులో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. చింతమనేనిపై అక్రమ కేసులు బనాయించారని చంద్రబాబు అంటున్నారని.. ఆయనపై కేసులు టీడీపీ ప్రభుత్వ హయాంలో నమోదు చేసినవే అని చెప్పారు. ఇసుక, మట్టి కొల్లగొట్టిన డబ్బును చింతమనేని అప్పజెప్పటం వల్లే ఆయనకు టీడీపీ నేతలు మద్దతు పలుకుతున్నారని ఆరోపించారు. చింతమనేని బాధితులనూ చంద్రబాబు కలుసుకుని ఆవేదన వినాలని సూచించారు. -
బెదిరిస్తే బెదిరేది లేదు: అబ్బయ్య చౌదరి
సాక్షి, పశ్చిమ గోదావరి: చింతమనేని ప్రభాకర్ తనకు స్ఫూర్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు..చింతమనేని లాంటి రౌడీషీటర్ స్ఫూర్తి అని చెప్పడం ద్వారా ఈ సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ ఇసుక,మట్టి అమ్ముకుని లోకేష్‌కు ముడుపులు పంపారు కాబట్టే మీకు స్ఫూర్తా అని విమర్శించారు. ఏపీలో నేడు ప్రశాంత వాతావరణం ఉందంటే.. చట్టం తన పని తాను చేయటం వల్లనేనన్నారు. దెందులూరు లో రివ్యూ మీటింగ్ పెడితే.. చింతమనేని బాధితులను మీ దగ్గరకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పని సింహం అని పేర్కొన్నారు. పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామంటూ బెదిరిస్తే బెదిరేది లేదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు.