
సాక్షి, పశ్చిమ గోదావరి: చింతమనేని ప్రభాకర్ తనకు స్ఫూర్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు..చింతమనేని లాంటి రౌడీషీటర్ స్ఫూర్తి అని చెప్పడం ద్వారా ఈ సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ ఇసుక,మట్టి అమ్ముకుని లోకేష్‌కు ముడుపులు పంపారు కాబట్టే మీకు స్ఫూర్తా అని విమర్శించారు. ఏపీలో నేడు ప్రశాంత వాతావరణం ఉందంటే.. చట్టం తన పని తాను చేయటం వల్లనేనన్నారు. దెందులూరు లో రివ్యూ మీటింగ్ పెడితే.. చింతమనేని బాధితులను మీ దగ్గరకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మడమ తిప్పని సింహం అని పేర్కొన్నారు. పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామంటూ బెదిరిస్తే బెదిరేది లేదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment