Chitamaneni Prabhakar
-
కేసులతో చింతమనేని సరికొత్త రికార్డు
ఏలూరు టీడీపీ అభ్యర్థిపై పేకాట, ఫోర్జరీ, చీటింగ్ కేసులు.. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై విదేశీ నగదు మార్పిడి ఘటనలో ఫెమా చట్టం కింద కేసు నమోదు.. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఫైనల్‌గా దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేనిపై లెక్కకు మించి రికార్డు స్థాయిలో కేసులు.. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా చింతమనేని సరికొత్త రికార్డు. వీరంతా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి పారీ్టల నుంచి పోటీ చేస్తున్న నేతలు. ఎన్నికల అఫిడవిట్లో ప్రతిఒక్కరూ కేసుల చిట్టాను సమర్పించారు. సాక్షిప్రతినిధి, ఏలూరు: ఏలూరు పార్లమెంట్ నియో జకవర్గంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వివాదరహితులు, సచీ్చలురుగా ఉండాలనదే ప్రజల ఆకాంక్ష. ఇక కూటమి అభ్యర్థులు ఇదే రీతిలో విస్తృతంగా ఆటోలు పెట్టి, ఇంటింటికి తిరిగి మరీ మేం చాలా మంచివాళ్లం.. మాకే ఓటు వేయండి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతిఒక్కరూ సమరి్పంచే అఫిడవిట్లో కేసుల చిట్టాను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇవేమీ ప్రభుత్వ కక్ష సాధింపుతో గడిచిన ఐదేళ్లల్లో పెట్టిన కేసులు కూడా కాదు. అన్నీ అంతకుముందే వారి వ్యాపార, క్రిమినల్, స్వభావాల రీత్యా నమోదైన కేసులు. కేసుల్లో చింతమనేని టాప్ దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేనిపై 93 కేసులు నమోదయ్యాయి. బహుశా రాష్ట్రంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదైన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో అత్యధిక కేసులతో పాటు రౌడీషీట్ ఉన్నఅభ్యర్థిగా చింతమనేని రికార్డుకెక్కారు. మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా పడింది. అప్పీలుకు వెళ్లి ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొల్లేరులో అటవీ శాఖాధికారులు, ముసునూరులో తహసీల్దార్ వనజాక్షి, దెందులూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అడ్డుకున్నారని మైనింగ్ ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, సిటీ పోలీసులు, సాధారణ పౌరులు ఇలా లెక్కకు మించి చింతమనేని బాధితులు ఉండటంతో అదే సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి. అట్రాసిటీ కేసులో పుట్టా మహేష్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏలూరు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లా చాపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చిన్నగురివిగాల ఎల్లయ్యను కులం పేరుతో దూషించి తీవ్ర స్థాయిలో బెదిరించారు. ఇది 2014లో జరిగిన ఘటన, 103/2014 నంబరుతో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎల్లయ్యను బెదిరించిన ఆడియో తీవ్రస్థాయిలో వైరల్ అయింది. అసభ్యపదజాలంతో దూషిస్తూ మాట్లాడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పేకాట కేసుల్లో బడేటి చంటి ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటి పేకాటలో ప్రముఖ వ్యక్తి. ఏలూరు చుట్టుపక్కల జిల్లాలే కాకుండా విశాఖ వెళ్లి ఆడుతుంటారు. ఈ క్రమంలోనే భీమిలిలో రెండేళ్ల క్రితం పేకాడుతూ పట్టుపడ్డారు. 66/2022 నంబరుతో కేసు నమోదైంది. అలాగే ఏలూరులో సీసీ 254/2022 నంబరుతో ప్రైవేటు కేసు నమోదైంది. ఫోర్జరీ, చీటింగ్ సెక్షన్లు నమోదు చేసిన కేసు కోర్టులో విచారణ కొనసాగుతుంది. విదేశీ నగదు మార్పిడి కేసులో పార్థసారథి మాజీ మంత్రి, నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై మూడు కేసులు ఉన్నాయి. ఘంటసాల, విజయవాడ పోలీస్స్టేషన్లల్లో రెండు చిన్నపాటి కేసులు నమోదయ్యాయి. ఇక విదేశీ నగదు మార్పిడి కేసులో ఫెమా చట్టం కింద కేసు నమోదైంది. అది కూడా 22 ఏళ్ల క్రితం నమోదైన కేసు. హై దరాబాద్‌లోని స్పెషల్ ఎకానమీ అఫెన్స్ కోర్టులో సీసీ 69/2002, సీసీ 99/2002 నంబర్లతో కేసు నమోదైంది. 69/2002 కేసులో రూ.5 వేలు జరిమానా విధించగా, 99/2002లో రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేలు జైలు శిక్ష విధించారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారు. -
‘ఆ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’
సాక్షి, జంగారెడ్డిగూడెం: చింతమనేని ప్రభాకర్ లాంటి రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారని దుయ్యబట్టారు. అధికారులు, దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడ్డ చింతమనేనికి చంద్రబాబు అండదండలు అందించడం సిగ్గుచేటు అని విమర్శించారు. చంద్రబాబు తీరును ఖండిస్తున్నానని, ఆయన ప్రతిపక్ష హోదాని వదులుకోవాలన్నారు. పత్తి రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, మార్కెట్ యార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. -
ప్రశాంతత ఇప్పుడు గుర్తొచ్చిందా బాబూ !
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ‘‘ఎంతో ప్రశాంతమైన జిల్లాలో అరాచకాలు సృష్టిస్తూ అధికార పార్టీ నాయకులు, పోలీసులు నిత్యం ప్రజల కోసం కష్టపడి పని చేసే చింతమనేని ప్రభాకర్‌పై కేసులు పెట్టి జైల్లో పెడతారా? పోలీసు యాక్ట్ 30 అమల్లో ఉందని కనీసం ర్యాలీ చేయకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ జిల్లాలో పోలీసు యాక్ట్ 30 అవసరమా? జిల్లాలో ముఠా నాయకులు, దోపిడీదారులు ఉన్నారా?’’ ఇది జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడి నోటి వెంట వచ్చిన వ్యాఖ్యలు. తుందుర్రు ఆక్వాపార్కు వల్ల కాలుష్యం వస్తుందని ఆందోళన చేసిన తుందుర్రు, జొన్నలగరువు, కంసాలిబేతపూడి గ్రామస్తులపై చేసిన నిర్బంధకాండను, తప్పుడు కేసులను చంద్రబాబునాయుడు మర్చిపోయారా అని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. ఆ ఫ్యాక్టరీ నిర్మిస్తున్న మూడు గ్రామాల్లో నెలల తరబడి 144 సెక్షన్‌తో పాటు సెక్షన్ 30 అమలు చేశారు. గ్రామంలోకి ఎవరు వెళ్లినా, బయటకు ఎవరు వచ్చినా ఆధార్‌కార్డు, లేదా ఏదో ఒక గుర్తింపు కార్డు ఉండాల్సిందే. ఆరువేల జనాభా ఉన్న తుందుర్రలో ఆందోళనలను అడ్డుకోవడం కోసం ఆరువందల మంది పోలీసులను ఉపయోగించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఫ్యాక్టరీ నిర్మాణానికి ఒప్పుకుంటూ సంతకం పెట్టకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు జారీ చేశారు. ఆందోళనకారులపై హత్యాయత్నం కేసులు పెట్టారు. ఫ్యాక్టరీలో పనులు చేస్తున్న వారిని చంపడానికి ప్రయత్నిస్తున్నారనే అభియోగంపై ఏడుగురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. ఫ్యాక్టరీ వద్ద జరిగిన గొడవలో, పోలీసులను కొట్టారనే అభియోగంపై 37 మందిపై 307 సెక్షన్ కింద కేసులు కట్టారు, ఇందులో ఇతరులు అని ఎఫ్ఐఆర్లో చేర్చారు. మహిళలను కూడా చూడకుండా నెలలతరబడి జైలులో పెట్టారు. తుందుర్రు ఆక్వాపార్కు ఉద్యమకారులపై ఇప్పటివరకూ 33 కేసులు పెట్టారు. ఈ కేసులన్నీ పోలీసులు పెట్టినవే. ప్రజలు పెట్టినవి కాదు. ఆఖరికి భీమవరం సీఐతో సీఐని చంపడానికి వెళ్లారంటూ హత్యయత్నం కేసులు పెట్టించారు. అప్పుడు ఈ ఉద్యమాన్ని అణగదొక్కడానికి పోలీసులను ఇష్టారాజ్యంగా వాడారు. ప్రజలను కాపలా కాయడానికి ఉన్న పోలీసు వ్యవస్థను వాడుకొని వారిపైనే కేసులు పెట్టించిన ఘనత చంద్రబాబునాయుడిదే. ఆ రోజు చట్టాలు ఏమయ్యాయని ఆ ప్రాంతవాసులు ప్రశ్నిస్తున్నారు. వారు ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఒక రౌడీషీటర్‌ను దౌర్జన్యం కేసులో అరెస్టు చేసి జైలులో పెడితే ఏదో అన్యాయం జరిగిపోయినట్లు బాధపడిపోతున్నారు. చింతమనేనిని ఆదర్శంగా తీసుకోవాలని సూచిస్తున్నారు. రౌడీ షీట్, 62 కేసులు ఉన్న వ్యక్తిని రాజకీయాలకు స్పూర్తి అని చెప్పడం ద్వారా తన వైఖరి ఏంటో చంద్రబాబునాయుడు స్పష్టం చేసినట్లు అయ్యింది. చింతమనేనిపై ఉన్న కేసులు, రౌడీషీటు అన్ని తెలుగుదేశం పార్టీ హయాంలో తెరిచినవే కావడం గమనార్హం. -
బెదిరిస్తే బెదిరేది లేదు: అబ్బయ్య చౌదరి
సాక్షి, పశ్చిమ గోదావరి: చింతమనేని ప్రభాకర్ తనకు స్ఫూర్తి అని చంద్రబాబు వ్యాఖ్యానించడం పట్ల దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు..చింతమనేని లాంటి రౌడీషీటర్ స్ఫూర్తి అని చెప్పడం ద్వారా ఈ సమాజానికి ఏ సందేశాన్ని ఇస్తున్నట్లు అని ప్రశ్నించారు. చింతమనేని ప్రభాకర్ ఇసుక,మట్టి అమ్ముకుని లోకేష్‌కు ముడుపులు పంపారు కాబట్టే మీకు స్ఫూర్తా అని విమర్శించారు. ఏపీలో నేడు ప్రశాంత వాతావరణం ఉందంటే.. చట్టం తన పని తాను చేయటం వల్లనేనన్నారు. దెందులూరు లో రివ్యూ మీటింగ్ పెడితే.. చింతమనేని బాధితులను మీ దగ్గరకు పంపిస్తామని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మడమ తిప్పని సింహం అని పేర్కొన్నారు. పోలీసులపై ప్రైవేటు కేసులు వేస్తామంటూ బెదిరిస్తే బెదిరేది లేదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి తెలిపారు. -
చింతమనేని..గతాన్ని మరిచిపోయావా..?
సాక్షి, పశ్చిమగోదావరి: జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మీడియాపై చేసిన దాడులు గుర్తుకు రాలేదా అని నిప్పులు చెరిగారు. ‘నియోజకవర్గంలో దళితులపై దాడులు చేయలేదా..? ఎంత మంది పేదల ఇళ్లు కూల్చారో మారిచిపోయావా.. నీపై అక్రమ కేసులు పెట్టానని అంటున్నావ్ వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ సవాల్ విసిరారు. చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో నమోదు అయినవేనని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై మాట్లాడే అర్హత చింతమనేనికి లేదన్నారు. రాష్ట్రంలోనే దెందులూరును మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకున్నారు.. సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి చింతమనేనికి లేదని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ధ్వజమెత్తారు. నీ తండ్రికి మూడున్నర ఎకరాలు మాత్రమే ఉందని.. నేడు నీకు వేల కోట్లు ఎలా వచ్చాయని చింతమనేనిని ప్రశ్నించారు. అధికారులు, మహిళలపై దాడులకు దిగడంతో పాటు, సమావేశంలో వట్టి వసంతకుమార్‌పై కూడా దాడి చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాపై 13 తప్పుడు కేసులు పెట్టారన్నారు. -
చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ
సాక్షి, ఏలూరు (టూటౌన్): దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై శనివారం ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాధితులు ఎస్పీ నవదీప్ సింగ్ గ్రేవల్‌ను కలిసి నేరుగా ఫిర్యాదులు చేశారు. జగన్నాథపురం, సోమవరప్పాడు, భోగాపురం, శ్రీరామవరం గ్రామాల్లో ఫిర్యాదుదారుల పొలాలను ఆక్రమించి వారిపై చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులు దళితుల భూములను ఆక్రమణలు చేసి చంపుతామని బెదిరించినట్లు పలువురు బాధితులు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. చింతమనేనిపై కేసులు పెట్టినా రాజకీయ పలుకుబడి ఉపయోగించి సదరు కేసుల్లో ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అడ్డుపడినట్లు బాధితులు తెలిపారు. దెందులూరు మండలం శ్రీరామవరంలో గతేడాది నవంబరు 15 రాత్రి బహిరంగ ప్రదేశంలో దళితులను ఉద్దేశించి అసభ్యకరంగా, అవమానకరంగా మాట్లాడిన విషయం గురించి శనివారం కొత్తపల్లి సురేష్, కొంతమంది ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ ఇచ్చిన ఫిర్యాదులను పూర్వాపరాలు విచారించిన అనంతరం కేసుల్లో చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కామిరెడ్డి నాని ఇంట విషాదం
పెదవేగి రూరల్/దెందులూరు/సాక్షి, అమరావతి బ్యూరో: దళితులపై పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలకు సంబంధించిన ఉదంతంలో ఓవరాక్షన్ చేసిన పోలీసుల వైఖరి కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. చింతమనేని ప్రసంగాన్ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారన్న అక్కసుతో జిల్లాలోని శ్రీరామవరం గ్రామానికి చెందిన నూతన వరుడు కామిరెడ్డి నానిని శనివారం పోలీసులు అరెస్టుచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేషన్లో ఉన్న అన్నకు తోడుగా చిన్నాన్న కుమారుడు కామిరెడ్డి ఆదిత్య (26) రాత్రంతా స్టేషన్ వద్దే నిద్రలేకుండా గడిపాడు. ఆదివారం ఉదయం ఆలయ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటం ఆ కుటుంబంలో తీరని విషాదం నింపింది. అంతకుముందు.. తెల్లవారుజామున నాలుగు గంటలకు మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా నాని బెయిల్‌పై బయటకు వచ్చాడు. అనంతరం ఇద్దరూ శ్రీరామవరం చేరుకున్నాడు. ఆ తర్వాత ఆదిత్య, తన నానమ్మ దేవికారాణితో కలిసి తడికలపూడి గ్రామంలో జరుగుతున్న ఆలయ ప్రతిష్ట కార్యక్రమానికి కారులో బయల్దేరాడు. పెదవేగి మండలం వేగివాడ గ్రామం దాటిన తరువాత జంగారెడ్డిగూడెం వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సును ఆదిత్య కారు ఢీకొట్టి తిరగబడింది. దీంతో అక్కడే ఉన్న స్థానికులు కారులో ఉన్న ఆదిత్య, దేవికారాణిలను కాపాడే ప్రయత్నం చేశారు. అయితే, ఆదిత్య అక్కడికక్కడే మృతిచెందగా నానమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. అమెను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతిచెందిన ఆదిత్య ఏలూరులో ‘మిత్సుబిషి’ కంపెనీ డీలర్. ఇంకా వివాహం కాలేదు. చింతమనేని ప్రభాకర్వల్లే తమ కుటుంబం ఆదిత్యను కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పెళ్లై 24 గంటలు కూడా కాకుండానే కామిరెడ్డి నానిని పోలీసులు అరెస్టుచేయడం, స్టేషన్ బెయిల్ ఇచ్చే కేసులో కూడా రాత్రంతా స్టేషన్లోనే ఉంచడం వంటి పరిణామాలతో కుటుంబ సభ్యులందరూ ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలోనే రాత్రంతా నిద్రలేక ఉదయం డ్రైవింగ్ చేస్తూ ఆదిత్య మృతిచెందడంతో శ్రీరామవరంలో విషాదఛాయలు అలముకున్నాయి. నానికి వైద్యపరీక్షలు ఇదిలా ఉంటే.. ఆదివారం తెల్లవారుజాము నాలుగు గంటల వరకు నానీని పలు కారణాలతో స్టేషన్లోనే ఉంచడంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు పి.సుధాకర్‌రెడ్డి, శరత్‌రెడ్డి, లక్ష్మీకుమార్, ధనుంజయలతో పాటు ఎమ్మెల్సీ ఆళ్ళ నాని, కోటగిరి శ్రీధర్, అబ్బయ్య చౌదరి నాని బెయిల్ విషయమై ఏలూరు డీఎస్పీతో మాట్లాడారు. దాంతో ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో నానికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా ఆయన బెయిల్ మంజూరు చేశారు. చింతమనేని క్షమాపణ ‘సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో నా వ్యాఖ్యలతో దళితులు బాధపడి ఉంటే వారికి క్షమాపణలు చెబుతున్నా’.. అని చింతమనేని ప్రభాకర్ తెలిపారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆదివారం విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా తనను అప్రతిష్ట పాల్జేయటానికే కొన్ని మీడియాల సంస్థలు ఆ వీడియోని ప్రసారం చేస్తున్నాయన్నారు. -
చింతమనేనిపై వైఎస్ఆర్ సీపీ ఫిర్యాదు
సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చింతమనేనిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొటారు రామచంద్రరావు తదితరులు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కాగా టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన విషయం విదితమే. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు జైలుశిక్ష పడ్డవారిని చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రవర్తన అందరికీ తెలిసిందే అని, స్పీకర్ ఈ విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేల అనర్హతలపై ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్న ఆందోళన ప్రజల్లో ఉందని, కనీసం ఎమ్మెల్యే చింతమనేనిపైన అయినా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని, అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు జడ్జిమెంట్ కాపీలను కూడా అందచేసినట్లు తెలిపారు. అప్పీల్‌తో సంబంధం లేకుండా చింతమనేనిపై అనర్హత వేటు వేయాలని అన్నారు. -
వంగపండు ఉష బృందంపై చింతమనేని అనుచరుల దౌర్జన్యం
రాయన్నపాలెం: వంగపండు ఉష బృందంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల దౌర్జన్యం చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి రాయన్నపాలెంలో చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. మహిళలపై అసభ్యపదజాలంతో దూషించారు. అయితే చింతమనేని అనుచరుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉష బృందంపై దాడికి ప్రయత్నించారు.