సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై అసెంబ్లీ కార్యదర్శికి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం చింతమనేనిని అనర్హుడిగా ప్రకటించాలని వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే ఎమ‍్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్, కొటారు రామచంద్రరావు తదితరులు అసెంబ్లీ కార్యదర్శిని కలిసి ఫిర్యాదు చేశారు. కాగా టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్కు భీమడోలు కోర్టు జైలుశిక్ష విధించిన విషయం విదితమే.
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై తక్షణమే అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. రెండేళ్లు జైలుశిక్ష పడ్డవారిని చట్ట ప్రకారం అనర్హుడిగా ప్రకటించాలని అన్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రవర్తన అందరికీ తెలిసిందే అని, స్పీకర్ ఈ విషయంలో తక్షణమే నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యేల అనర్హతలపై ప్రజాస్వామ్యం ఉందా లేదా అన‍్న ఆందోళన ప్రజల్లో ఉందని, కనీసం ఎమ్మెల్యే చింతమనేనిపైన అయినా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉందని, అసెంబ్లీ కార్యదర్శికి కోర్టు జడ్జిమెంట్ కాపీలను కూడా అందచేసినట్లు తెలిపారు. అప్పీల్‌తో సంబంధం లేకుండా చింతమనేనిపై అనర్హత వేటు వేయాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment