93 కేసుల రికార్డుతో చింతమనేని రాష్ట్రంలో నంబర్‌వన్
పేకాట, ఫోర్జరీ కేసుల్లో బడేటి చంటి
విదేశీ నగదు మారి్పడి కేసులో కొలుసు పార్థసారథి
పుట్టా మహేష్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
పొత్తుల నేతలపై కేసులు ఘనం
ఏలూరు టీడీపీ అభ్యర్థిపై పేకాట, ఫోర్జరీ, చీటింగ్ కేసులు.. నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై విదేశీ నగదు మార్పిడి ఘటనలో ఫెమా చట్టం కింద కేసు నమోదు.. ఇక ఏలూరు ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు.. ఫైనల్‌గా దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేనిపై లెక్కకు మించి రికార్డు స్థాయిలో కేసులు.. రాష్ట్రంలోనే అత్యధిక కేసులు ఉన్న అభ్యర్థిగా చింతమనేని సరికొత్త రికార్డు. వీరంతా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కూటమి పారీ్టల నుంచి పోటీ చేస్తున్న నేతలు. ఎన్నికల అఫిడవిట్‌లో ప్రతిఒక్కరూ కేసుల చిట్టాను సమర్పించారు.
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఏలూరు పార్లమెంట్ నియో జకవర్గంలో టీడీపీ, బీజేపీ అభ్యర్థులపై కేసులు కోకొల్లలుగా ఉన్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు వివాదరహితులు, సచీ్చలురుగా ఉండాలనదే ప్రజల ఆకాంక్ష. ఇక కూటమి అభ్యర్థులు ఇదే రీతిలో విస్తృతంగా ఆటోలు పెట్టి, ఇంటింటికి తిరిగి మరీ మేం చాలా మంచివాళ్లం.. మాకే ఓటు వేయండి అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతిఒక్కరూ సమరి్పంచే అఫిడవిట్‌లో కేసుల చిట్టాను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఇవేమీ ప్రభుత్వ కక్ష సాధింపుతో గడిచిన ఐదేళ్లల్లో పెట్టిన కేసులు కూడా కాదు. అన్నీ అంతకుముందే వారి వ్యాపార, క్రిమినల్, స్వభావాల రీత్యా నమోదైన కేసులు.
కేసుల్లో చింతమనేని టాప్
దెందులూరు టీడీపీ అభ్యర్థి చింతమనేనిపై 93 కేసులు నమోదయ్యాయి. బహుశా రాష్ట్రంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదైన అభ్యర్థులు ఎవరూ లేకపోవడంతో అత్యధిక కేసులతో పాటు రౌడీషీట్ ఉన్నఅభ్యర్థిగా చింతమనేని రికార్డుకెక్కారు.
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్‌పై దాడి కేసులో రెండేళ్లు జైలు శిక్ష కూడా పడింది. అప్పీలుకు వెళ్లి ప్రస్తుతం కోర్టులో కొనసాగుతుండటంతో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కొల్లేరులో అటవీ శాఖాధికారులు, ముసునూరులో తహసీల్దార్ వనజాక్షి, దెందులూరు నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అడ్డుకున్నారని మైనింగ్ ఉద్యోగులు, ట్రాఫిక్ పోలీసులు, సిటీ పోలీసులు, సాధారణ పౌరులు ఇలా లెక్కకు మించి చింతమనేని బాధితులు ఉండటంతో అదే సంఖ్యలో కేసులు కూడా నమోదయ్యాయి.
అట్రాసిటీ కేసులో పుట్టా మహేష్
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో ఏలూరు టీడీపీ అభ్యర్థి పుట్టా మహేష్ ఉన్నారు. వైఎస్సార్ కడప జిల్లా చాపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో చిన్నగురివిగాల ఎల్లయ్యను కులం పేరుతో దూషించి తీవ్ర స్థాయిలో బెదిరించారు. ఇది 2014లో జరిగిన ఘటన, 103/2014 నంబరుతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఎల్లయ్యను బెదిరించిన ఆడియో తీవ్రస్థాయిలో వైరల్ అయింది. అసభ్యపదజాలంతో దూషిస్తూ మాట్లాడటం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
పేకాట కేసుల్లో బడేటి చంటి
ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి బడేటి చంటి పేకాటలో ప్రముఖ వ్యక్తి. ఏలూరు చుట్టుపక్కల జిల్లాలే కాకుండా విశాఖ వెళ్లి ఆడుతుంటారు. ఈ క్రమంలోనే భీమిలిలో రెండేళ్ల క్రితం పేకాడుతూ పట్టుపడ్డారు. 66/2022 నంబరుతో కేసు నమోదైంది. అలాగే ఏలూరులో సీసీ 254/2022 నంబరుతో ప్రైవేటు కేసు నమోదైంది. ఫోర్జరీ, చీటింగ్
సెక్షన్లు నమోదు చేసిన కేసు కోర్టులో విచారణ
కొనసాగుతుంది.
విదేశీ నగదు మార్పిడి కేసులో పార్థసారథి
మాజీ మంత్రి, నూజివీడు టీడీపీ అభ్యర్థి కొలుసు పార్థసారథిపై మూడు కేసులు ఉన్నాయి. ఘంటసాల, విజయవాడ పోలీస్‌స్టేషన్లల్లో రెండు చిన్నపాటి కేసులు నమోదయ్యాయి. ఇక విదేశీ నగదు మార్పిడి కేసులో ఫెమా చట్టం కింద కేసు నమోదైంది. అది కూడా 22 ఏళ్ల క్రితం నమోదైన కేసు. హై దరాబాద్‌లోని స్పెషల్ ఎకానమీ అఫెన్స్ కోర్టులో సీసీ 69/2002, సీసీ 99/2002 నంబర్లతో కేసు నమోదైంది. 69/2002 కేసులో రూ.5 వేలు జరిమానా విధించగా, 99/2002లో రెండు నెలల సాధారణ జైలు శిక్ష, రూ.10 వేలు జైలు శిక్ష విధించారు. దీనిపై సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకుని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment