వంగపండు ఉష బృందంపై చింతమనేని అనుచరుల దౌర్జన్యం
రాయన్నపాలెం: వంగపండు ఉష బృందంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల దౌర్జన్యం చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి రాయన్నపాలెంలో చోటుచేసుకుంది. వైఎస్‌ఆర్ సీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.
మహిళలపై అసభ్యపదజాలంతో దూషించారు. అయితే చింతమనేని అనుచరుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉష బృందంపై దాడికి ప్రయత్నించారు.