
సాక్షి, జంగారెడ్డిగూడెం: చింతమనేని ప్రభాకర్ లాంటి రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారని దుయ్యబట్టారు. అధికారులు, దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడ్డ చింతమనేనికి చంద్రబాబు అండదండలు అందించడం సిగ్గుచేటు అని విమర్శించారు. చంద్రబాబు తీరును ఖండిస్తున్నానని, ఆయన ప్రతిపక్ష హోదాని వదులుకోవాలన్నారు. పత్తి రైతులకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, మార్కెట్ యార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు.