tellam balaraju
-
టీడీపీ, జనసేన నాయకులకు బాలరాజు వార్నింగ్
-
టీడీపీ దాడులపై బాలరాజు సంచలన వ్యాఖ్యలు
-
పోలవరం ఎమ్మెల్యే బాలరాజుకు తీవ్ర అస్వస్థత
బుట్టాయగూడెం(ఏలూరు జిల్లా): పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. నీరసంగా ఉన్న బాలరాజు జంగారెడ్డిగూడెంలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. అక్కడ పరీక్షలు చేసిన వైద్యులు బాలరాజుకు మెరుగైన వైద్యం కోసం రాజమండ్రికి రిఫర్ చేశారు. కుటుంబ సభ్యులు ఆయన్ను రాజమండ్రిలోని సాయి ఆస్పత్రికి తరలించగా, అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు గుండెకు స్టంట్ అమర్చారు. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలరాజును లోక్‌సభలో వైఎస్సార్సీపీ చీఫ్ విప్, రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ తదితరులు పరామర్శించారు. చదవండి: టీడీపీ నేత గోడి అరుణకు పార్టీలో లైంగిక వేధింపులు.. రాజీనామా ప్రకటన -
అసెంబ్లీలో మారని టీడీపీ సభ్యుల తీరు
-
జల దిగ్బంధంలో 60 గ్రామాలు..
సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేలేరుపాడులో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. గర్భిణీల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు. -
అత్యవసరమైతే తప్ప గ్రామాల నుంచి బయటకు రావొద్దు
-
‘అలా మాట్లాడింది చంద్రబాబే’
సాక్షి, అమరావతి: ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరు కమిషన్లపై చర్చ జరుగుతుంటే టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని మడకశిర వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తిప్పేస్వామి మండిపడ్డారు. సోమవారం ఆయన శాసనసభలో మాట్లాడుతూ.. 70 ఏళ్ల తర్వాత ఆశించిన రీతిలో దళితుల అభివృద్ధి జరగలేదన్నారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోపే వేర్వేరు కమిషన్లను ఏర్పాటు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. దళితులకు కేబినెట్లో పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు నామినేటేడ్ పదవులు, పనుల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించడం హర్ష ణీయన్నారు. అందుకే గట్టిగా బుద్ధి చెప్పారు.. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీలను ఏవిధంగానూ అభివృద్ధి చేయలేదని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. అందుకే ఎన్నికల్లో ఆయనకు గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. టీడీపీ పాలనలో దళితులను నిర్లక్ష్యం చేశారని నిప్పులు చెరిగారు. టీడీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను తుంగలో తొక్కారన్నారు. ఎస్సీ, ఎస్టీలను ఉద్దరించానని ప్రతిపక్ష నేత చంద్రబాబు చెబుతున్నారని, ఎలాంటి అన్యాయం జరిగిందో అందరికి తెలుసునన్నారు. ఆ ఘనత వైఎస్ జగన్‌కే దక్కుతుంది.. ఎస్సీ,ఎస్టీలను ఉద్ధరించామని టీడీపీ వాళ్లు చెబుతున్నారని.. దళితులుగా ఎవరైనా పుట్టాలని అనుకుంటారా అని మాట్లాడింది చంద్రబాబేనని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. ఎస్టీ లేని కేబినెట్ ఏదైనా ఉందంటే..చంద్రబాబు హయాంలోనేనన్నారు. దళితులు పడుతున్న బాధలు చూసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చట్టాలు చేస్తున్నారని తెలిపారు. వెనుకబడిన వర్గాలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని ఆయన పేర్కొన్నారు. దాడులు జరిగితే ఆయన మాట్లాడలేదు.. దళితులపై దాడులు జరిగితే చంద్రబాబు మాట్లాడలేదని ఎమ్మెల్యే కంబాల జోగులు అన్నారు. ఎస్సీ,ఎస్టీలకు వేర్వేరు కమిషన్లను స్వాగతిస్తున్నామన్నారు. టీడీపీ పాలనలో దళితులపై ఎన్నో దాడులు జరిగాయన్నారు. ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం.. ఎస్సీ,ఎస్టీ, కమిషన్ విభజన ఏపీ చరిత్రలో నూతన అధ్యాయం అని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూ అన్నారు. ఎస్సీ,ఎస్టీ కమిషన్ విభజన వల్ల న్యాయం వేగంగా జరుగుతుందన్నారు. టీడీపీ పాలనలో ఎస్సీ,ఎస్టీలు ఎన్నో అవమానాలకు గురయ్యారన్నారు. వైఎస్సార్ హయాంలో దళితులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. దళితుల కోసం సీఎం జగన్ అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులను హీనంగా చూశారన్నారు. -
‘ఆ వ్యాఖ్యలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం’
సాక్షి, జంగారెడ్డిగూడెం: చింతమనేని ప్రభాకర్ లాంటి రౌడీషీటర్‌ను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించడం దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మండిపడ్డారు. మంగళవారం ఆయన పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలను తప్పుదోవ పట్టించడానికే ప్రతిపక్ష నేత చంద్రబాబు జిల్లాలో పర్యటించారని దుయ్యబట్టారు. అధికారులు, దళితులు, గిరిజనులపై దాడులకు పాల్పడ్డ చింతమనేనికి చంద్రబాబు అండదండలు అందించడం సిగ్గుచేటు అని విమర్శించారు. చంద్రబాబు తీరును ఖండిస్తున్నానని, ఆయన ప్రతిపక్ష హోదాని వదులుకోవాలన్నారు. పత్తి రైతులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా ఉంటుందని, మార్కెట్ యార్డులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బాలరాజు కోరారు. -
‘వైఎస్సార్ గిరిజనుల గుండెల్లో ఉంటారు’
-
‘వైఎస్సార్ గిరిజనుల గుండెల్లో ఉంటారు’
సాక్షి, విజయవాడ : ‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాకు అటవీ భూములపై హక్కులు కల్పించారు. ఆయన ఎప్పటికి గిరిజనుల గుండెల్లో ఉంటార’ని వైఎస్సార్ సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 30 లక్షల గిరిజనులు అత్యంత పేదరికం, దుర్భరమైన జీవితం గడుపుతున్నారని వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గిరిజనులను కించపరిచే వ్యాఖ్యలు చేశారని, ఆయన గిరిజనుల పట్ల కక్షపూరితంగా వ్యవహరించారన్నారు. చంద్రబాబు గిరిజనులకి చేసింది ఏమీ లేదని చెప్పారు. తాము గిరిజనుల అభివృద్ధి, సంక్షేమం కోసం ఏం చేయాలో చర్చించామని, తమ పార్టీ మ్యానిఫెస్టో కమిటీకి అందజేస్తామని తెలిపారు. చంద్రబాబు గిరిజన ద్రోహిగా మిగిలిపోతారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న ఏడు ఎస్టీ సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘బాబుని గద్దె దించటమే మా లక్ష్యం’ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని గద్దె దించటమే తమ లక్ష్యమని వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మ్యానిఫెస్టోలో గిరిజనుల సమస్యల ప్రస్తావిస్తామని చెప్పారు. చంద్రబాబు పాలన నికృష్ట పాలనని, గిరిజనులు మరోసారి మోసపోరన్నారు. చివరివరకు ఒక్క గిరిజనుడికైనా మంత్రి పదవి ఇచ్చావా అని ప్రశ్నించారు. గిరిజన ఎమ్మెల్యే చనిపోతేగానీ ఇవ్వలేదంటూ మండిపడ్డారు. కిశోర్ చంద్రదేవ్ వ్యాఖ్యలు బాధ కలిగించాయన్నారు. బాక్సైట్ జీవో ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. ట్రైబల్ ఎకానమీ, ఎడ్యుకేషన్, ఎంప్లాయిమెంట్, హెల్త్ ఈ 4 అంశాలు తమ మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఉంటాయని వెల్లడించారు. -
ఒక్క సర్వే రాయి వేసినా ఊరుకోం
కొయ్యలగూడెం: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ సర్వే పనుల్లో ఒక్క సర్వే రాయి పడినా సహించేది లేదని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం రాజవరం స మీపంలో చేపట్టిన గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే సర్వే పనుల వద్ద నిరవధిక ఆందోళన చేస్తున్న రైతులకు ఆయన మద్దతు తెలిపి వారి సాధక బాధలు అడిగి తెలుసుకున్నారు. వందల ఎకరాల్లోని పచ్చని పంటలు కోల్పోతున్న రైతులకు న్యాయపరమైన మద్దతు ధరను ఇవ్వమనడం కూడా ప్రభుత్వానికి తప్పుగా కనిపిస్తోందని, రైతుల కడుపుకొట్టి చంద్రబాబు సర్కార్ కడుతున్న కట్టడాలు కూల్చివేస్తామని బాలరాజు పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ విలువ ప్రకారం ప్రస్తుత మార్కెట్ విలువను అమలు చేసి దానికి రైతులు కోరుతున్న విధంగా నష్టపరిహారాన్ని అందజేయడానికి ప్రభుత్వానికి ఎందుకు అంత బాధ కలుగుతుందని ప్రశ్నించారు. సన్న, చిన్నకారు రైతులు అధికంగా జీవనాధారమైన భూములు కోల్పోతే వారి బతుకులు, కుటుంబాలు అధోగతిపాలవుతాయని బాలరాజు ఆందోళన వ్య క్తం చేశారు. ఈ సందర్భంగా మహిళా రైతులు సైతం తమ బాధలను బాలరాజు వద్ద మొరపెట్టుకున్నారు. అనంతరం బాలరాజు జాయింట్ కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసేందుకు రావాల్సిందిగా కోరారు. దీంతో ఈనెల 16న రాజవరానికి వచ్చి బాధిత రైతులతో బహిరంగ చర్చావేదికను నిర్వహిస్తామని జేసీ పేర్కొన్నారు. మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మట్టా శ్రీను, దాసరి విష్ణు, మైనార్టీసెల్ జిల్లా కార్యదర్శి ఎస్కే బాజీ, మాజీ సర్పంచ్ పాముల నాగ మునిస్వామి, వైఎస్సార్సీపీ నాయకులు కె.సూరిబాబు, బల్లె నరేష్, చింతలపూడి కిషోర్, గద్దే సురేష్, తదితరులు పాల్గొన్నారు. -
మోకాళ్లపై గుడి మెట్లెక్కిన బాలరాజు
సాక్షి, బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కి మొక్కు చెల్లించుకున్నారు. ఇటీవల హత్యాయత్నంలో గాయపడిన వైఎస్.జగన్ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని ప్రజలు అఖండ ఆధిక్యంతో గెలిపిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కుంజా భూమయ్య, జోడి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ కోర్సా కన్నపరాజు, పెద్దిరెడ్డి మూర్తి, బొల్లిగిరి, మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ నక్తర్, తెల్లం స్వామి, తెల్లం వెంకయ్య, మడివి బుచ్చయ్య, పట్ల గంగాదేవి, పసుపులేటి మధు పాల్గొన్నారు. -
‘దుర్గారావు మృతి.. ప్రభుత్వానిదే బాధ్యత’
సాక్షి, ఏలూరు : ఏపీకి ప్రత్యేక హోదా సాధనలో సీఎం చంద్రబాబు నాయుడు మోసాలు, కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు తీరును వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బంద్‌లో విషాదం చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లా బుట్టాయిగూడెంలో బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కాకి దుర్గారావు మృతి చెందారు. టీడీపీ ప్రభుత్వం కుట్ర వల్లే దుర్గారావ్ మృతి చెందాడని కుటుంబసభ్యులు, బంధువులు, పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దుర్గారావు మృతితో ఆయన స్వస్థలం బుట్టాయిగూడెం మండలం కృష్ణాపురంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మీడియాతో మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. చంద్రబాబు ఏ రోజు నిజం మాట్లాడలేదని ఎద్దేవా చేశారు. హోదా కోసం శాంతియుతంగా బంద్‌లో పాల్గొన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని మండిపడ్డారు. పోలీసుల తోపులాట వల్లే వైఎస్సార్సీపీ కార్యకర్త దుర్గారావు మరణించారని తెలిపారు. ఈ ఘటన చూస్తుంటే ఇది ప్రభుత్వ హత్యలా అనిపిస్తోందన్నారు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దుర్గారావు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇలాంటి ఎన్ని ప్రాణాలు పోతే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దుర్గారావు మృతదేహానికి వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి నివాళులు ఆర్పించారు. -
టీడీపీ ప్రజలను విభజించి పాలిస్తోంది
టి.నరసాపురం: తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలను విభజించి పాలిస్తోందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు, పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. టి.నరసాపురం మండలం రాజుపోతేపల్లి గ్రామంలో వైఎస్సార్ విగ్రహం వద్ద సోమవారం రాత్రి రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలరాజు మాడ్లాడుతూ తెలుగుదేశం పార్టీ నాయకులతో జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి వాటి సిఫార్సుతో పచ్చచొక్కా వారికే ప్రభుత్వ పథకాలను కట్టబెడుతున్నారని ఆరోపించారు. వైఎస్సార్ ప్రభుత్వంలో పింఛన్ తీసుకునే వందలాది మంది పింఛన్‌దారులను టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించారని ధ్వజమెత్తారు. వైఎస్సార్ హయాంలో ఉచితంగా ఇసుక లభించేదని, ఇప్పుడు ఇసుక బంగారమైందని, నిరుపేదలు ఇళ్ళు కట్టుకోవడం ఆర్థికభారమై ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో భూములను సస్యశ్యామలం చేయడానికి బోర్లు మంజూరు చేశారని, ఇందిరమ్మ పథకంలో ఇళ్లస్థలాలు, ఇళ్ళు ఇచ్చారని గుర్తుచేశారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ అరాచకాలను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు. నిరుపేదలకు భరోసాగా నిలబడేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి సూచనలు మేరకు రాష్ట్రమంతటా గ్రామాల్లో నాయకులు రచ్చబండ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వివరించారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ శ్రీను రాజు, నాయకులు దేవరపల్లి ముత్తయ్య, నల్లూరి వెంకటేశ్వరరావు, పిన్నమనేని చక్రవర్తి, కాల్నీడి సుబ్బారావు, మక్కినశ్రీను, బొంతు అంజిబాబు, బేతిన సత్యనారాయణ, బొల్లిన నాగభూషణం, పొగరెడ్డి ప్రవీణ్, దాసరి శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
రచ్చబండ, పల్లెనిద్ర
ప్రజా సమస్యలు తెలుసుకోవడం కోసం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో శనివారం పలు నియోజకవర్గాలలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభించింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం మండలం కోండ్రు కోట గ్రామంలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీసెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు పాల్గొన్నారు. చాగల్లు మండలం ఊనగట్ల గ్రామంలో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత రచ్చబండ కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు గ్రామంలో శనివారం పల్లెనిద్ర కార్యక్రమాన్ని నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు ప్రారంభించారు. దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి పాదయాత్రతో చేబ్రోలులోని పిట్టవారి వీధిలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. దెందులూరు మండలం కొమరేపల్లిలో రచ్చబండ, పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్ కొఠారు రామచంద్రరావు పాల్గొన్నారు. గోపాలపురం మండలం హుకుంపేటలో పల్లెనిద్ర కార్యక్రమంలో కన్వీనర్ తలారి వెంకట్రావు, మండల కన్వీనర్ పడమటి సుభాష్‌చంద్రబోస్ పాల్గొన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పల్లె నిద్ర చేపట్టారు. ఉండి నియోజకవర్గ సమన్వయకర్త పీవీఎల్ నర్సింహరాజు నేతృత్వంలో ఆకివీడు మండలంలో పెదకాపవరం వరకు మోటారుసైకిల్ ర్యాలీ నిర్వహించారు. పెదకాపవరంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పల్లెనిద్ర నిర్వహించారు. -
చంద్రబాబు తొత్తులకు స్థానమా?
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లకు పైగా నాన్చి కంటితుడుపు చర్యగా ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి గిరిజన సలహా మండలి నియామకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాజ్యాంగాన్ని అపహాస్యం పాలు చేశారని, గిరిజనులను దారుణంగా మోసగించారని వైఎస్సార్సీపీ ఎస్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. ఆయన మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ గిరిజన సలహా మండలిని 2014లోనే ఏర్పాటు చేయాల్సి ఉన్నా చంద్రబాబు ఉద్దేశ్యపూర్వకంగా నియమించ లేదన్నారు. రాజ్యాంగం ప్రకారం మండలిలో 20 మంది సభ్యులు ఉండాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా సీఎం తన కుట్రలను, కుతంత్రాలను అమలు చేసుకునేందుకు తొత్తులను నియమించుకున్నారని దుయ్యబట్టారు. కోర్టు జోక్యంతో ఏర్పాటు చేసిన ఈ మండలిలో ఎమ్మెల్యేలు కాని 8 మందిని నియమించడం రాజ్యాంగానికి తూట్లు పొడవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని అపహాస్యం చేసే ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జీఓ నెంబర్ 87 ప్రకారం అప్పట్లో కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఐ, సీపీఎంకు కూడా గిరిజన సలహా మండలిలో చోటు కల్పించారని తెలిపారు. కానీ చంద్రబాబు ఏకపక్షంగా ఏర్పాటు చేశారన్నారు. గిరిజన సలహా మండలి నియామకంపై కోర్టుకు వెళతారా? అని ప్రశ్నించగా పార్టీ అధ్యక్షుడుతో చర్చించాక ఒక నిర్ణయం తీసుకుంటామని సమాధానమిచ్చారు. 50 ఏళ్లు నిండిన గిరిజనులకు పింఛన్లు ఇస్తామని టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ ఏమైందని బాలరాజు ప్రశ్నించారు. -
‘రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం’
-
‘రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం’
గుంటూరు: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పరిపాలన ఒక సువర్ణయుగమని వైఎఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసి ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ అని కొనియాడారు. ఎ్రరటి మండుటెండల్లో చేవెళ్ల నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేపట్టారని... గుడిసెల్లో నివసించే పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టించి, గుడిసెలేని గ్రామం ఉండాలని కృషి చేసిన వ్యక్తి వైఎస్ఆర్ అని తెలిపారు. చంద్రబాబు పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటైనా జరిగాయా అని ప్రజలను అడిగారు. రాజన్న పరిపాలన రావాలంటే వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్ఆర్ సీపీ జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ తీర్మానాన్ని బాలరాజు బలపరిచారు. వైఎస్ఆర్ చిరస్మరణీయుడు అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి కొనియాడారు. ప్లీనరీలో ఆయన బీసీ సంక్షేమంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించారని అన్నారు. అన్ని వర్గాలకు సమ న్యాయం చేసిన మహానుభావుడు వైఎస్ఆర్ అని ప్రశంసించారు. విద్యా, వైద్యం మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు అందేలా చూశారని చెప్పారు. పేదలకు విద్యాదాత వైఎస్ఆర్ అన్నారు. మహానేత ఆశయ బాటలో నడుస్తున్న వైఎస్ జగన్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేద్దామని, జగన్ సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. వైఎస్ఆర్ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సంబంధిత కథనాలు: ఏపీని బజారున పడేసింది టీడీపీనే: నాగిరెడ్డి భగవంతుడు పంపిన దూత వైఎస్ జగన్: రెడ్డి శాంతి వైఎస్ జగన్ సీఎం అయితేనే పోలవరం పూర్తి -
పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు
-
పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు
టీడీపీ నాయకులు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని, ఇసుక, మట్టి, చివరకు భూములు కూడా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లాం బాలరాజు మండిపడ్డారు. ఈ రాజ్యంలో ఏదీ ఉంచేలా లేరని ఆయన విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. నాలుగు రోజుల నుంచి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. మీ అందరి తరఫున జగనన్నకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకొంటున్నా. ఈ దీక్షతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ అంటే చంద్రబాబుకు దడ. ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తుంటే ఎలా అడ్డంకులు కల్పిస్తున్నారో, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో మీరంతా చూస్తున్నారు. అయినా వాటిని జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు పోలవరం ప్రాజెక్టు దివంగత రాజశేఖర రెడ్డి కల ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు శాశ్వతంగా పోతుంది ప్రత్యేక హోదా గురించి అందరూ ఇంతలా ఘోష పెడుతుంటే చంద్రబాబుకు వినిపించడం లేదు, కనిపించడం లేదు. ఆయన ధ్యాసంతా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అన్నదే. ఆయనకు ఎంతసేపూ చైనా, జపాన్ లాంటి దేశాలు తిరగడానికి తీరిక ఉంటుంది తప్ప ప్రజాసేవకు తీరిక లేదు. ఈ 18 నెలల్లో ఆయన కల్లిబొల్లి మాటలతో దోపిడి రాజ్యం నడిపిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఎలా ఎడారి అయ్యిందో చూస్తున్నాం పంటలు పండట్లేదు, ఏ రైతూ సుఖంగా లేరు చంద్రబాబు పాలనలో విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు ప్రజలే ఆయనను తిప్పికొడతారు.. ఇది ఖాయం -
బాబు తీరుతో ప్రజాస్వామ్యం ఖూనీ
వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజం కన్నాపురం (కొయ్యలగూడెం): ఓటుకు నోటు వ్యవహారంలో నిందితునిగా నిలబడ్డ ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి వెంటనే రాజీనామా చేయూలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. సోమవారం కన్నాపురంలో పార్టీ నిర్వహించిన ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యేను కొనే విషయంలో సీఎం చంద్రబాబు ఏసీబీకి రెడ్‌హేండెడ్‌గా చిక్కడం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ అన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని గవర్నర్ కలుగజేసుకుని రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయూలని కోరారు. పట్టిసీమ ఎత్తిపోతల టెండర్లలో జరిగిన అవినీతి సొమ్ముల్ని టీడీపీ ప్రజాస్వామ్యాన్ని పాతరేసేందుకు వినియోగిస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ తనమిత్ర పక్షమైన టీడీపీ చేసిన అవినీతి వ్యవహారానికి ఏవిధంగా స్పందిస్తుందోనని దేశవ్యాప్తంగా ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు గాడిచర్ల సోమేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు ఎండీ హాజీబాషా ఆధ్వర్యంలో మెయిన్‌రోడ్‌పై చంద్రబాబు దిష్టిబొమ్మని ఊరేగించి దహనం చేశారు. నాయకులు విప్పే మోహన్, ఉపసర్పంచ్ ఉప్పలకృష్ణ, కోసూరి గోపాలరాజు, వల్లూరి మాధవరావు, పలిమి ప్రమీల, మీసాల సీతామహాలక్ష్మి, ఆవుల సురేంద్ర, షేక్ రహమాన్, దయ్యాల సత్యనారాయణ పాల్గొన్నారు. -
రైతులకు అండగా ఉంటాం
పోలవరం :పోలవరం మండలంలోని పట్టిసీమ ఎత్తిపోతల పథకం వల్ల నష్టపోయే ఉభయగోదావరి జిల్లాల రైతాంగానికి వైఎస్సార్ సీపీ అం డగా ఉంటుందని ఆ పార్టీ ఎస్టీసెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నా రు. మండలంలోని కన్నాపురం అడ్డరోడ్డు వద్ద మంగళవారం రైతులు పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలరాజు మాట్లాడుతూ అవసరమైతే పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇక్కడకు తీసుకువస్తామన్నారు. ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉన్న పథకాలను పూర్తి చేయకుండా సొమ్ము చేసుకునేందుకే రూ.1300 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. ఈ ప్రాంత రైతులు పోలవరం ప్రాజెక్టుకు, కొవ్వాడ స్లూయిస్‌కు భూములు ఇచ్చి కష్టాల్లో ఉన్నారన్నారు. పుష్కర, తాడిపూడి ఎత్తిపోతల పథకాల ద్వారా ఇప్పటికీ పూర్తిస్థాయిలో సాగునీరు అందటంలేదన్నారు. పోలవరం ప్రాజెక్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ చిరకాలవాంఛ అని, ఇది త్వరగా పూర్తి చేస్తే వైఎస్సార్‌కు పేరు వస్తుందనే దురుద్దేశంతో జాప్యం చేస్తున్నారన్నారు. మహాధర్నా విజయవంతం పట్టిసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ కన్నాపురం అడ్డరోడ్డు వద్ద రైతులు మంగళవారం చేపట్టిన మహాధర్నా విజయవంతం అయింది. రైతులు రోడుపై సుమారు 2 గంటల సేపు బైఠాయించి ఎత్తిపోతలు వద్దు, పోలవరం ముద్దు అంటూ నినదించారు.ఈ ధర్నాతో ఏటిగట్టుపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిది పోల్నాటి బాబ్జి, మండల కన్వీనర్ సుంకర వెంకటరెడ్డి, ఎంపీటీసీ సభ్యులు ఆకుల సత్యనారాయణ, బుగ్గా మురళి, వలవల సత్యనారాయణ, తైలం శ్రీరామచంద్రమూర్తి, షేక్ ఫాతిమున్నిసా, దేవిశెట్టిరమేష్, కాంగ్రెస్ నాయకులు కొణతాల ప్రసాద్, మొగళ్ళహరిబాబు అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. -
రైతును ముంచడమే టీడీపీ లక్ష్యం
కొయ్యలగూడెం : రైతును భూస్థాపితం చేయడమే టీడీపీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు కనపడుతోందని, ఇందుకు రైతుల భూములను బలిపెట్టి వారి జీవితాలను పణంగా పెడుతోందని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ తెల్లం బాలరాజు విమర్శించారు. సోమవారం కొయ్యలగూడెంలో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన ఆయన పార్టీ జిల్లా నాయకులు తాడికొండ మురళికృష్ణ, జిల్లా సర్పంచ్ల ఛాంబర్ ఉపాధ్యక్షురాలు దేవి గంజిమాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా కల్పించటానికి కృషి చేయలేని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దానిని మరుగునపరిచే ఉద్దేశంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం అంటూ కొత్త వివాదాన్ని సృష్టించారన్నారు. ఇప్పటికే ఏజెన్సీ, మెట్టప్రాంతంలో చింతలపూడి, కొవ్వాడ ఎత్తిపోతల పథకాలు, పోలవరం ప్రాజెక్ట్ కుడికాలువ నిర్మాణం వలన వేలాది ఎకరాల భూములను రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు పట్టిసం ఎత్తిపోతల పథకం పేరుతో మరికొన్ని వందలాది ఎకరాలు భూములను రైతులు వదులుకోవాల్సి పరిస్థితి నెలకొందన్నారు. ఏ మాత్రం ఉపయోగం లేని వివాదాలను సృష్టించి ప్రజల దృష్టిని దారిని మళ్లించడం చంద్రబాబునాయుడు ఎత్తుగడలలో భాగమేనన్నారు. రైతు రుణమాఫీని మర్చిపోవటానికి, రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కనుమరుగు చేయటానికి చంద్రబాబు చేస్తున్న కుయుక్తులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికప్పుడు ఎండగట్టి ప్రజలతో ఉద్యమాలు నిర్వహిస్తుదన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి వచ్చే నెల 6, 7 తేదీల్లో చేపట్టే నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెంలోని వైఎస్సార్ ఉద్యాన యూరివర్సిటీ పేరును మార్పు చేయాలని చూస్తే తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొనాల్సి వస్తుందని మురళి, గంజిమాల ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జిల్లా, మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఉద్యాన వర్సిటీ పేరు మారిస్తే ప్రజలు తరిమికొడతారు జంగారెడ్డిగూడెం : తాడేపల్లిగూడెం మండలం వెంకట్రాయన్నగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీ పేరును మార్చాలనే ఆలోచనను టీడీపీ నాయకులు విరమించుకోకపోతే ప్రజలు వారిని తరిమికొడతారని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ఎస్టీ సెల్ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. సోమవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. తక్కువ సాగు నీటితో వాణిజ్యపు విలువలున్న పంటలను రైతులు పండించాలంటే ఉద్యాన అధికారుల సహాయ సహకారాలు అవసరమని వైఎస్ రాజశేఖరరెడ్డి వెంకటరామన్నగూడెం ప్రాంతంలో ఉద్యాన వర్సిటీని ఏర్పాటు చేశారన్నారు. అలాగే వర్సిటీ అభివృద్ధికి అత్యధిక నిధులు కేటాయించి రైతులకు ఎంతో మేలు జరిగేలా కృషి చేయడం జరిగిందన్నారు. తరువాత వైఎస్సార్ అకాల మృతి, అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి యూనివర్సిటీకి వైఎస్సార్ ఉద్యాన యూనివర్సిటీగా పేరుపెట్టారన్నారు. ఆయన పేరును తొలగించే అర్హత టీడీపీ నాయకులకు ఎక్కడిదని బాలరాజు ప్రశ్నించారు. అబద్దపు వాగ్ధానాలతో రైతులను, ప్రజలను ఘోరంగా మోసంచేసి అధికారంలోకి వచ్చిన టీడీపీ నాయకులు ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజలను అయోమయంలో, గందరగోళంలోకి నెట్టివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. టీడీపీ అధికారంలోకి రావడానికి గోదావరి జిల్లాలే కారణమన్నారు. అటువంటి గోదావరి జిల్లాల ప్రజలను ఆందోళన పరిచేవిధంగా టీడీపీ పాలన సాగుతోందని విమర్శించారు. వర్సిటీ పేరు తొలగించే ప్రయత్నం మానుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
రైతులను దొంగలతో పోలుస్తారా!
- అన్నదాతల ఓట్లతోనే అధికారం పొందారని మరవొద్దు - సీఎం చంద్రబాబుపై బాలరాజు ధ్వజం బుట్టాయగూడెం : ప్రకాశం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను దొంగలతో పోల్చడంపై వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు మండిపడ్డారు. రైతుల ఓట్లతో గద్దెనెక్కిన చంద్రబాబు అధికారం ఉందన్న అహం కారంతో రుణమాఫీని పూర్తిస్థాయిలో అమలు చేయాలని కోరిన అన్నదాతలను దొంగలుగా పోల్చడం దారుణమన్నారు. బుట్టాయగూడెంలో బాలరాజు శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రైతులను మోసం చేసిన చంద్రబాబు చరిత్రపుటల్లో నిలిచిపోతారని ఎద్దేవా చేశారు. బాబుకు రైతులే బుద్ధిచెప్పి కాలగర్భంలో కలుపుతారని బాలరాజు చెప్పారు. రూ.50 వేల లోపు రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పి కొందరు రైతులకే మాఫీని వర్తింప చేసి మోసం చేశారని విమర్శించారు. రైతులు తిరగబడే రోజులు త్వరలోనే రానున్నాయని బాలరాజు తెలిపారు. దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలన రైతులకు స్వర్ణయుగమని పేర్కొన్నారు. వైఎస్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి రైతుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. రైతుల రుణాలన్నీ మాఫీ చేశారని గుర్తు చేశారు. బీడు భూములను సాగు భూములుగా చేశారని, లక్షల ఎకరాలకు సాగు నీరు అందించారని చెప్పారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు రైతులతో పాటు డ్వాక్రా మహిళలను కూడా దగా చేశారని మండిపడ్డారు. నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం ఎక్కడని ప్రశ్నించారు. పార్టీ జిల్లా నాయకుడు ఆరేటి సత్యనారాయణ, మండల కన్వీనర్ సయ్యద్ బాజీ, రేపాకుల చంద్రం, పొడియం శ్రీనివాస్, గె ద్దె వీరకృష్ణ, తెల్లం చిన్నారావు, కుక్కల లక్ష్మణరావు, కొదం కడియ్య పాల్గొన్నారు. -
సమరమే
సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో అధర్మ యుద్ధం చేసిన తస్మదీయులను గెలుపు వరించింది. ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. అదే సమయంలో అధికార మదంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడ్డారు. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత సమర్థవంతమైన నాయకత్వం కోసం.. తమ పక్షాన నిలబడే నాయకుడి కోసం కార్యకర్తలు ఎదురుచూశారు. అదే సందర్భంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పార్టీ పగ్గాలను చేపట్టాల్సిందిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీని వాస్ (నాని)ని ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన నాని ఆరోజు నుంచే కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిం చడం మొదలుపెట్టారు. పదవీ ప్రమా ణ స్వీకరోత్సవం రోజున కార్యకర్తలెవరూ ఏలూరు రావద్దని, తానే నియోజకవర్గాలకు వచ్చి ప్రతి ఒక్కరినీ కలుస్తానని చెప్పిన ఆళ్ల నాని కార్యకర్తల మధ్యకు వెళ్లే కార్యక్రమం చేపట్టారు. ఈ నెల 18న పోలవరం నియోజకవర్గం నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టా రు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు సొంత నియోజకవర్గంలో తొలి సదస్సు నిర్వహించారు. బుట్టాయగూడెంలో నిర్వహించిన ఆ సదస్సు జిల్లాలో పార్టీ పునఃప్రతిష్టకు బీజం వేసింది. రెండో రోజు చింతల పూడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జంగారెడ్డిగూడెంలో జరిగింది. రుణమాఫీ చేయకుండా కమిటీలతో కాలయూపన చేయడమేంటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఈ సభ నుంచి సూటిగా నిలదీశారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను నట్టేట ముంచిన చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. మూడవ రోజు గోపాలపురంలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. పదవి కోసం హామీలు గుప్పించి.. అధికారం వచ్చాక వాటిని తుంగలో తొక్కిన పాలకుల కళ్లు తెరిపించేలా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నాలుగో రోజు దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం పెదవేగి మండలం కూచింపూడిలో ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార మదంతో దాడులకు తెగబడుతున్న వారికి సభా వేదిక నుంచే హెచ్చరికలు జారీచేశారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ అండగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నారని ధైర్యం చెప్పారు. ఐదో రోజు కొవ్వూరు వెళ్లారు. హామీల అమలు నుంచి చంద్రబాబు తప్పించుకోకుండా నిలదీ యాలని తీర్మానించారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆరవ రోజు నిడదవోలు గర్జించారు. తనిఖీల పేరిట పేదోళ్లకిచ్చే పింఛన్లను రద్దుచేస్తే వారి తరఫున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలా ప్రతి చోట ప్రభుత్వ తీరును ఎండగడుతూ, కార్యకర్తలకు భరోసా ఇస్తూ, ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కమ్మని పిలుపునిస్తూ ఆళ్ల నాని విజయవంతంగా సదస్సులు నిర్వహించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీల కులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు పార్టీ కేంద్ర పాల క మండలి సభ్యులు జీఎస్‌రావు, వంక రవీంద్ర, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శులు కారుమూరి నాగేశ్వరావు, ఎస్.రాజీవ్‌కృష్ణ, కార్యదర్శి తానేటి వనిత, ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ వంటి మహామహులు సమావేశాలకు హాజరయ్యారు. తమ అనుభవాలను, పార్టీ ప్రస్తుత, భవిష్యత్ పరి స్థితులను కార్యకర్తలకు సవివరంగా తెలియజేశారు. త్వరలో ఏర్పాటు చేసే కమిటీల్లో పార్టీ కోసం, ప్రజల కోసం త్యాగాలు, పోరాటాలు చేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆళ్ల నాని నమ్మకాన్ని కలిగించారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం అనుసరిస్తు న్న ప్రజావ్యతిరేక విధానాలపై సమర శంఖారావం పూరించారు.