టీడీపీకి పుట్టగతులుండవ్ | tellam balaraju condemns tdp attack on ysrcp | Sakshi
Sakshi News home page

టీడీపీకి పుట్టగతులుండవ్

Published Sun, Sep 22 2013 11:55 PM | Last Updated on Fri, Aug 10 2018 7:58 PM

టీడీపీకి పుట్టగతులుండవ్ - Sakshi

టీడీపీకి పుట్టగతులుండవ్

ఉండ్రాజవరం(పశ్చిమగోదావరి), న్యూస్‌లైన్ : టీడీపీకి పుట్టగతులు ఉండవని వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. నిడదవోలు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ సమన్వయకర్త ఎస్.రాజీవ్‌కృష్ణపై నిడదవోలు ఎమ్మెల్యే శేషారావు వర్గీయుల దాడికి నిరసనగా ఉండ్రాజవరంలో ఆదివారం వైఎస్సార్‌సీపీ నాయకులు ధర్నా చేసి, దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం జరిగిన సభలో బాలరాజు మాట్లాడుతూ గణేష్ నిమజ్జన ఊరేగింపులో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం జైలులో చేపట్టిన దీక్షను ప్రతిబింబించేలా సెట్టింగ్ ఏర్పాటు చేయటం ఓర్వలేక శేషారావు వర్గీయులు దాడి చేయటం దారుణమన్నారు.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఎమ్మెల్యే, అతని అనుచరులను అరెస్టయ్యేవరకు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు నిద్రపోరని హెచ్చరించారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర కమిటీ సభ్యులు కొయ్యే మోషేన్‌రాజు, ఏలూరు మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త బొడ్డు వెంకటరమణచౌదరి, రాజీవ్‌కృష్ణ  ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్యేలు తానేటి వనిత, పెండ్యాల కృష్ణబాబు, జొన్నకూటి బాబాజీరావు, నియోజవర్గ కన్వీనర్లు, మండల కన్వీనర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement