హెలెన్ తుపాను ప్రభావానికి గురైన నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటిస్తారని
ఏలూరు, న్యూస్‌లైన్ : హెలెన్ తుపాను ప్రభావానికి గురైన నరసాపురం, పాలకొల్లు, ఆచంట నియోజకవర్గాల్లో వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం పర్యటిస్తారని ఆ పార్టీ జిల్లా కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం, నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సోమవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన ముగించుకుని మంగళవారం రాత్రి ఆయన నరసాపురం చేరుకుని బస చేస్తారని తెలిపారు. మూడు నియోజకవర్గాల్లో తీవ్రంగా దెబ్బతిన్న వరి పొలాలు, ఉప్పు మడులు, కొబ్బరి, అరటి తోటలను బుధవారం పరిశీలించి, బాధిత రైతులను పరామర్శిస్తారని వివరించారు. ఆ రోజు సాయంత్రం హైదరాబాద్ పయనమై వెళతారని చెప్పారు.