సాక్షి, ఏలూరు : ఎన్నికల్లో అధర్మ యుద్ధం చేసిన తస్మదీయులను గెలుపు వరించింది. ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలను నిరాశ, నిస్పృహలు ఆవహించాయి. అదే సమయంలో అధికార మదంతో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు తెగబడ్డారు. వైఎస్సా ర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కక్షసాధింపు చర్యలకు పూనుకున్నారు. ఈ పరిస్థితుల్లో మరింత సమర్థవంతమైన నాయకత్వం కోసం.. తమ పక్షాన నిలబడే నాయకుడి కోసం కార్యకర్తలు ఎదురుచూశారు. అదే సందర్భంలో పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పార్టీ పగ్గాలను చేపట్టాల్సిందిగా ఆళ్ల కాళీకృష్ణ శ్రీని వాస్ (నాని)ని ఆదేశించారు. బాధ్యతలు చేపట్టిన నాని ఆరోజు నుంచే కార్యకర్తల సంక్షేమం గురించి ఆలోచిం చడం మొదలుపెట్టారు. పదవీ ప్రమా ణ స్వీకరోత్సవం రోజున కార్యకర్తలెవరూ ఏలూరు రావద్దని, తానే నియోజకవర్గాలకు వచ్చి ప్రతి ఒక్కరినీ కలుస్తానని చెప్పిన ఆళ్ల నాని కార్యకర్తల మధ్యకు వెళ్లే కార్యక్రమం చేపట్టారు.
ఈ నెల 18న పోలవరం నియోజకవర్గం నుంచి పర్యటనకు శ్రీకారం చుట్టా రు. పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు సొంత నియోజకవర్గంలో తొలి సదస్సు నిర్వహించారు. బుట్టాయగూడెంలో నిర్వహించిన ఆ సదస్సు జిల్లాలో పార్టీ పునఃప్రతిష్టకు బీజం వేసింది. రెండో రోజు చింతల పూడి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జంగారెడ్డిగూడెంలో జరిగింది. రుణమాఫీ చేయకుండా కమిటీలతో కాలయూపన చేయడమేంటని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఈ సభ నుంచి సూటిగా నిలదీశారు. అధికారం కట్టబెట్టిన ప్రజలను నట్టేట ముంచిన చంద్రబాబు తీరుపై ధ్వజమెత్తారు. మూడవ రోజు గోపాలపురంలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. పదవి కోసం హామీలు గుప్పించి.. అధికారం వచ్చాక వాటిని తుంగలో తొక్కిన పాలకుల కళ్లు తెరిపించేలా పోరాటాలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
నాలుగో రోజు దెందులూరు నియోజకవర్గ స్థాయి సమావేశం పెదవేగి మండలం కూచింపూడిలో ఏర్పాటు చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార మదంతో దాడులకు తెగబడుతున్న వారికి సభా వేదిక నుంచే హెచ్చరికలు జారీచేశారు. పార్టీలో ప్రతి ఒక్కరికీ అండగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని ధైర్యం చెప్పారు. ఐదో రోజు కొవ్వూరు వెళ్లారు. హామీల అమలు నుంచి చంద్రబాబు తప్పించుకోకుండా నిలదీ యాలని తీర్మానించారు. కార్యకర్తలపై అక్రమ కేసులు పెడితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. ఆరవ రోజు నిడదవోలు గర్జించారు. తనిఖీల పేరిట పేదోళ్లకిచ్చే పింఛన్లను రద్దుచేస్తే వారి తరఫున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలా ప్రతి చోట ప్రభుత్వ తీరును ఎండగడుతూ, కార్యకర్తలకు భరోసా ఇస్తూ, ప్రజా సమస్యలపై పోరాటానికి సిద్ధం కమ్మని పిలుపునిస్తూ ఆళ్ల నాని విజయవంతంగా సదస్సులు నిర్వహించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీల కులు, మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు పార్టీ కేంద్ర పాల క మండలి సభ్యులు జీఎస్‌రావు, వంక రవీంద్ర, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు బొడ్డు అనంత వెంకటరమణ చౌదరి, ప్రధాన కార్యదర్శులు కారుమూరి నాగేశ్వరావు, ఎస్.రాజీవ్‌కృష్ణ, కార్యదర్శి తానేటి వనిత, ఎస్టీ సెల్ అధ్యక్షుడు తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ వంటి మహామహులు సమావేశాలకు హాజరయ్యారు. తమ అనుభవాలను, పార్టీ ప్రస్తుత, భవిష్యత్ పరి స్థితులను కార్యకర్తలకు సవివరంగా తెలియజేశారు. త్వరలో ఏర్పాటు చేసే కమిటీల్లో పార్టీ కోసం, ప్రజల కోసం త్యాగాలు, పోరాటాలు చేసే ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం కల్పిస్తామని ఆళ్ల నాని నమ్మకాన్ని కలిగించారు. ఇదే సందర్భంలో ప్రభుత్వం అనుసరిస్తు న్న ప్రజావ్యతిరేక విధానాలపై సమర శంఖారావం పూరించారు.
సమరమే
Published Fri, Sep 26 2014 1:32 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM
Advertisement