సాక్షి, పశ్చిమగోదావరి: పోలవరం నియోజకవర్గంలో 60 గ్రామాలు వరదలో చిక్కుకున్నాయని ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మంగళవారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. వేలేరుపాడులో పునరావాస కేంద్రాలను పరిశీలించిన ఎమ్మెల్యే.. గర్భిణీల ఆరోగ్యం అడిగి తెలుసుకున్నారు. పునరావాస కేంద్రాల్లో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదువేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని పేర్కొన్నారు. ముంపు బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. మూడు నెలలకు సరిపడ నిత్యావసర వస్తువులు సిద్ధంగా ఉంచామని ఎమ్మెల్యే బాలరాజు వెల్లడించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎమ్మెల్యే బాలరాజు పర్యటన
Published Tue, Aug 18 2020 11:01 AM | Last Updated on Tue, Aug 18 2020 11:14 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment