
సాక్షి, ఢిల్లీ: పోలవరం ముంపు రాష్ట్రాల అధికారులతో కేంద్ర జలశక్తిశాఖ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన భేటీ ముగిసింది. ఈ భేటీకి ఏపీ, టీఎస్, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో జలశక్తిశాఖ సమావేశమైంది. ఈ భేటీకి ఏపీ నుంచి ఇరిగేషన్ శాఖ అధికారులు హాజరయ్యారు.
ఈ క్రమంలోనే పీపీఏ ఛైర్మన్ ఆర్కేగుప్తా.. గోదావరి ట్రిబ్యునల్‌కు కట్టుబడే పోలవరం కడుతున్నట్టు తెలిపారు. కేంద్రం ఆమోదించిన డిజైన్ల మేరకే పోలవరం నిర్మిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఛత్తీస్‌గఢ్, ఒడిశాలను సంయుక్త సర్వేకు సహకరించాలని కోరాము. కాగా, సంయుక్త సర్వేకు ఒడిషా అంగికరించలేదని ఆయన వెల్లడించారు. పోలవరం కట్టినా గోదావరి వరద ముంపులో తేడా ఉండదు. పోలవరం బ్యాక్ వాటర్ ప్రభావంపై అధ్యయనం చేయించామన్నారు.
దీంతో, అక్టోబర్ 7వ తేదీన నాలుగు రాష్ట్రాల సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించాలని కేంద్ర జలశక్తి శాఖ ఆదేశించింది. వారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని జలశక్తిశాఖ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment