Live Updates
వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. దీనిలో భాగంగా శుక‍్రవారం నెల్లూరు జిల్లాలో పర్యటన ముగిసిన అనంతరం సీఎం జగన్ తిరుగు పయనమయ్యారు.
నెల్లూరు జిల్లా:
వరద ప్రభావిత ప్రాంతాలు దామరపాలెం, జొన్నవాడ, పెనుబల్లి, భగత్ సింగ్ కాలనీల్లో పర్యటించిన సీఎం జగన్ ముంపు బాధితులకు అందిన సహాయక చర్యలపై అరాతీశారు. నష్టపోయిన ప్రతీ కుటుంబానికీ అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు. రైతులకు అన్ని విధాలా అండగా ఉంటామని హామీఇచ్చారు. వరద సహాయక చర్యలపై ముంపువాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.
వేళాంగిణి అనే మహిళ ఆవేదన విన్న సీఎం జగన్ చలించిపోయారు. ఆమె కొడుక్కి ఉద్యోగం కల్పించి అదుకొంటానని మహిళకు సీఎం హామీఇచ్చారు. బీఎంఆర్ ట్రస్ట్ తరఫున వరద సహాయం కోసం రూ.కోటి చెక్కును బీదా మస్తాన్ రావు సీఎంకు అందజేశారు. ఢీసీఎంఎస్ నిధుల నుంచి రూ. 25 లక్షల వరద సహాయం చెక్కున్ ఛైర్మెన్ వీరి చలపతి సీఎం వైఎస్ జగన్‌కు అందచేశారు.
నెల్లూరు జిల్లా:
నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వరద పరిస్థితిపై అధికారులతో పూర్తిగా మాట్లాడినట్లు తెలిపారు. వరద బాధితులకు ఇంటికి రూ. 2వేలతో పాటు రేషన్ కూడా అందినట్టు అందరూ చెబుతున్నారని తెలిపారు. రానివాళ్లు 5వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పెన్నానది నుంచి వరద నివారణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు.
కరకట్ట బండ్ నిర్మాణానికి రూ.100 కోట్లు మంజూరు చేస్తున్నామని ఆ పనులకు శంకుస్థాపన తానే చేస్తానని చెప్పారు. కొట్టుకుపోయిన సోమశిల డ్యామ్ అఫ్రాన్ నిర్మాణం కోసం రూ.120కోట్లు మంజూరు చేస్తున్నామని తెలిపారు. వరద సహాయం అందని వారు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వరదల్లో బాధితులను ఆదుకోవడంలో జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నగర కమినర్ దినేష్ పని తీరును ప్రశంసించారు.
నెల్లూరు జిల్లా:
భగత్‌సింగ్ నగర్ కాలనీలో కోతకు గురైన పెన్నా నదిని సీఎం జగన్ పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్ బాధితులకు భరోసా ఇచ్చారు.
నెల్లూరు జిల్లా:
పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు.
నెల్లూరు జిల్లా
► జొన్నవాడ వద్ద తెగిపోయిన పెన్నా నది పొర్లు కట్టని సీఎం జగన్ పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కోతకు గురైన కరట్టను పరిశీలించిన సీఎం జగన్..
► నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం వైఎస్ జగన్ పర్యటన కొనసాగుతోంది. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం.. అక్కడ నుంచి రోడ్డు మార్గాన నెల్లూరు రూరల్ మండలంలోని దేవరపాలెనికి వెళ్లి వరదలు కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరట్టను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వరద నష్టంపై ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వరద నష్టాన్ని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రజాప్రతినిధుల నుంచి వినతి ప్రతాలను సీఎం స్వీకరించారు. వరద బీభత్సంపై ప్రజా ప్రతినిధులను సీఎం అడిగి తెలుసుకున్నారు.
►నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించనున్నారు. సహాయక చర్యలను సమీక్షించడంతో పాటు, నష్టపోయిన బాధితులతో నేరుగా మాట్లాడి భరోసా కల్పించనున్నారు.
చిత్తూరు జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
►ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటన ముగించుకుని రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరు జిల్లా వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనకు హెలికాప్టర్‌లో బయలుదేరి వెళ్లారు. సీఎం వెంట జిల్లా ఇంచార్జి మంత్రి గౌతమ్ రెడ్డి ఉన్నారు.
నదీ ప్రవాహానికి కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించిన సీఎం..
►కృష్టానగర్‌లో 3 గంటల పాటు పర్యటించిన సీఎం వైఎస్ జగన్.. తిరుచానూరులో పర్యటించారు. తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు-పాడీపేట వద్ద స్వర్ణముఖి నదిపై వరద ఉధృతికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరిశీలించారు. ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీసు కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురు పౌరులను సీఎం అభినందించి.. మెమొంటోలు అందజేశారు.
చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయం, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి
వరద నష్టంపై అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు.
కృష్ణానగర్‌లో వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్
►వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండో రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటిస్తున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సీఎం పరిశీలించారు. వరద బాధితులను పరామర్శించి.. వరదలకు దెబ్బతిన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తిరుపతిలో కృష్ణా నగర్ సీఎం వైఎస్ జగన్ పర్యటించారు. వరద బాధితులను సీఎం జగన్ పరమర్శించారు. స్థానికులు తమ సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు.
సమస్యలు పరిష్కరించడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లు కోల్పోయిన వారికి గృహాలు మంజూరు చేయ్యాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తక్షణ సహాయం కింద రూ.189 కోట్లు మంజూరు చేశారు. కృష్ణా నగర్‌లో కిడ్నీ బాధిత మహిళకి వైద్యం అందిస్తామని సీఎం హామి ఇచ్చారు. ఆ కుటుంబం సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడిన సీఎం జగన్ పాఠశాల ఆవరణలో పరిస్థితి, రోడ్లు సరిగా ఉన్నాయా అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలపై ఫోటో గ్యాలరీని సీఎం తిలకించారు.
సాక్షి, తిరుపతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు పర్యటనలో భాగంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం నేడు పర్యటించనున్నారు. తిరుపతి, తిరుచానూరులో ముంపు ప్రాంతాలను సీఎం పరిశీలించనున్నారు. తిరుపతిలోని కృష్ణానగర్‌ను సందర్శించనున్నారు. వరద బాధితులతో సీఎం మాట్లాడనున్నారు. అనంతరం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి నెల్లూరు జిల్లా పర్యటనకు సీఎం వెళ్లనున్నారు.
గురువారం ఆయన వరద ప్రభావిత ప్రాంతాలైన వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం పులపత్తూరు, ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో, చిత్తూరు జిల్లా వెదళ్లచెరువు ఎస్టీ కాలనీలో పర్యటించారు. ధ్వంసమైన ఇళ్లు, వంతెనలను పరిశీలించారు. తొలుత పులపత్తూరులో కాలినడకన గ్రామం మొత్తం కలియదిరుగుతూ స్వయంగా బాధితులతో మాట్లాడారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భరోసా ఇచ్చారు. బాధితులకు సురక్షిత ప్రదేశంలో ఐదు సెంట్ల స్థలం ఇవ్వడమే కాకుండా, ప్రభుత్వమే బాధ్యత తీసుకుని ఇల్లు కూడా కట్టించి ఇస్తుందని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment