
పందికొక్కుల్లా దోచుకు తింటున్నారు
టీడీపీ నాయకులు పందికొక్కుల్లా దోచుకుతింటున్నారని, ఇసుక, మట్టి, చివరకు భూములు కూడా దోచుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లాం బాలరాజు మండిపడ్డారు. ఈ రాజ్యంలో ఏదీ ఉంచేలా లేరని ఆయన విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
- నాలుగు రోజుల నుంచి ఆరోగ్యం కూడా లెక్కచేయకుండా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు.
- మీ అందరి తరఫున జగనన్నకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకొంటున్నా.
- ఈ దీక్షతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. జగన్ అంటే చంద్రబాబుకు దడ.
- ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తుంటే ఎలా అడ్డంకులు కల్పిస్తున్నారో, ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారో మీరంతా చూస్తున్నారు.
- అయినా వాటిని జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు
- పోలవరం ప్రాజెక్టు దివంగత రాజశేఖర రెడ్డి కల
- ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు శాశ్వతంగా పోతుంది
- ప్రత్యేక హోదా గురించి అందరూ ఇంతలా ఘోష పెడుతుంటే చంద్రబాబుకు వినిపించడం లేదు, కనిపించడం లేదు.
- ఆయన ధ్యాసంతా రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలా అన్నదే.
- ఆయనకు ఎంతసేపూ చైనా, జపాన్ లాంటి దేశాలు తిరగడానికి తీరిక ఉంటుంది తప్ప ప్రజాసేవకు తీరిక లేదు.
- ఈ 18 నెలల్లో ఆయన కల్లిబొల్లి మాటలతో దోపిడి రాజ్యం నడిపిస్తున్నాడు.
- ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం ఎలా ఎడారి అయ్యిందో చూస్తున్నాం
- పంటలు పండట్లేదు, ఏ రైతూ సుఖంగా లేరు
- చంద్రబాబు పాలనలో విద్యార్థులు, రైతులు, ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారు
- వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు డిపాజిట్లు కూడా దక్కవు
- ప్రజలే ఆయనను తిప్పికొడతారు.. ఇది ఖాయం