మోకాళ్లపై గుడి మెట్లెక్కిన బాలరాజు | Tellam Balaraju Offer Special Prayers For YS Jagan | Sakshi
Sakshi News home page

Published Wed, Nov 7 2018 8:57 AM | Last Updated on Wed, Nov 7 2018 9:02 AM

Tellam Balaraju Offer Special Prayers For YS Jagan - Sakshi

మోకాళ్లపై నడిచి గుడి మెట్లెక్కుతున్న బాలరాజు

సాక్షి, బుట్టాయగూడెం: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ పార్టీ ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కి మొక్కు చెల్లించుకున్నారు. ఇటీవల హత్యాయత్నంలో గాయపడిన వైఎస్‌.జగన్‌ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు బాలరాజు చెప్పారు.

ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్‌ జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ని ప్రజలు అఖండ ఆధిక్యంతో గెలిపిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్‌ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కుంజా భూమయ్య, జోడి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్‌ కోర్సా కన్నపరాజు, పెద్దిరెడ్డి మూర్తి, బొల్లిగిరి, మహమ్మద్‌ ఇక్బాల్, మహమ్మద్‌ నక్తర్, తెల్లం స్వామి, తెల్లం వెంకయ్య, మడివి బుచ్చయ్య, పట్ల గంగాదేవి, పసుపులేటి మధు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement