buttayagudem
-
‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఇక నుంచి ఇలాంటివే జరుగుతాయి’
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం పులిరామన్నగూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో దారుణం జరిగింది. హాస్టల్లో నిద్రపోతున్న నాలుగో తరగతి విద్యార్థి గోగుల అఖిల్‌వర్ధన్‌రెడ్డి (9) దారుణహత్యకు గురయ్యాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అటవీ ప్రాంతంలో గల శివారు గ్రామం ఒర్రింకకు చెందిన గోగుల శ్రీనివాసరెడ్డికి ఇద్దరు భార్యలు. వారిద్దరు అక్కచెల్లెళ్లు. మొదటి భార్య లక్ష్మికి ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య రామలక్ష్మికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. రామలక్ష్మి రెండో కుమారుడైన అఖిల్‌వర్ధన్‌రెడ్డి గత ఏడాది ఈ ఆశ్రమ పాఠశాలలో మూడో తరగతిలో చేరాడు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్నాడు. సోమవారం రాత్రి 10 గంటలకు తోటి విద్యార్థులతో కలిసి వసతిగృహంలో నిద్రపోయాడు. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వసతిగృహం పక్కవైపు కిటికీలో నుంచి లోపలికి ప్రవేశించి టార్చ్లైట్తో అఖిల్‌వర్ధన్‌రెడ్డిని గుర్తించి మరీ బయటకు తీసుకువెళ్లారు. దుండగులు తీసుకెళ్లిన అఖిల్‌వర్ధన్‌రెడ్డి తెల్లవారేసరికి పాఠశాల ఆవరణ సమీపంలో శవమై కనిపించాడు. మృతుడి చేతిలో ఒక లెటర్ ఉంది. దాన్లో ‘బతకాలని ఉన్నవారు వెళ్లిపోండి.. ఎందుకంటే ఇకనుంచి ఇలాంటి సంఘటనలే జరుగుతాయి..’ అని రాసి ఉంది. అఖిల్‌వర్ధన్‌రెడ్డి మెడ నల్లగా కమిలిపోయి ఉంది. కాలితో తొక్కి చంపి ఉండవచ్చని భావిస్తున్నారు. మర్మాంగాలు చితికిపోయి ఉన్నాయని, వీపుపై గాయాలున్నాయని వైద్యులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఎస్పీ మేరీ ప్రశాంతి.. ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్నట్లు తెలిపారు. ఏలూరు నుంచి తీసుకొచ్చిన పోలీస్ జాగిలం సహాయంతో గాలించారు. -
గోదారి గట్టున సినిమా తీస్తే హిట్టే: ఆ చెట్టు కింద 300 సినిమాల షూటింగ్..
సాక్షి, పోలవరం రూరల్/ బుట్టాయగూడెం: గోదారి గట్టున సినిమా తీస్తే హిట్ అనేది తెలుగు సినిమా సెంటిమెంట్.. అందుకే ఎన్నెన్నో సుందర దృశ్యాలతో కనువిందు చేసే జిల్లాలోని గోదావరి తీరం సినీ షూటింగ్‌లకు ప్రసిద్ధి పొందింది. ప్రకృతి అందాల నడుము శోభాయమానంగా వెలిగిపోయే గోదావరి చుట్టుపక్కల ప్రాంతాల్లో నిత్యం ఏదోక సినిమా షూటింగ్ జరుగుతూనే ఉండేది. ఈ ప్రాంత అందాలు కూడా సినీ వీక్షకులకు కొత్త అనుభూతి పంచేవి. గత కొన్నేళ్లుగా అవుట్డోర్ షూటింగ్‌లు తగ్గడం, విదేశాల్లోని లొకేషన్లకు క్రేజ్ పెరగడంతో గోదావరి తీర ప్రాంతంలో సినీ సందడి తగ్గింది. అయితే ఇటీవల మళ్లీ గోదావరి తీరంలో షూటింగ్‌ల సందడి మొదలైంది. రంగస్థలం, పుష్ప వంటి సినిమాలు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకోవడంతో ఈ ప్రాంతానికి కొత్త కళ వచ్చింది. జిల్లాలోని ఫలానా లొకేషన్లో సినిమా తీస్తే సూపర్ హిట్ అవుతుందని గతంలో పలువురు డైరెక్టర్లు, నిర్మాతలు నమ్మేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, లెజెండరీ డైరెక్టర్ బాపు, కె.విశ్వనాథ్, కృష్ణవంశీ, సుకుమార్ వంటి అగ్ర దర్శకులు అనేక సినిమాలు జిల్లాలోని పలు లోకేషన్లలో తీసి సూపర్‌హిట్ కొట్టారు. మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, సూపర్‌స్టార్ కృష్ట, రజనీకాంత్, మహేష్ బాబు, బాలకృష్ట, రవితేజ తదితర అగ్ర హీరోలు ఈ ప్రాంతంలో షూటింగ్‌లంటే ఇష్టపడేవారు. గోదావరి తీరంలో కొవ్వూరు నుంచి కుమారదేవం, పట్టిసీమ, పోలవరం, పాపికొండలు ఇలా అనేక ప్రదేశాలు సినిమా షూటింగ్‌లకు ప్రసిద్ధి చెందాయి. గోదావరి తీరంలో రూపొందిన రంగస్థలం షూటింగ్ తనివితీరని పట్టిసీమ అందాలు ఒకపక్క ఆధ్యాత్మిక సొబగులు, మరోవైపు ప్రకృతి సోయగాలు పట్టిసీమ ప్రత్యేకం. కనుచూపు మేర కనువిందు చేసే ఎత్తైన కొండలు కట్టిపడేస్తాయి. ఈ ప్రాంత సౌందర్యానికి ముగ్ధులైన పలువురు సినీ ప్రముఖులు ప్రకృతి రమణీయ దృశ్యాల్ని తమ కెమెరాల్లో బంధించేందుకు ఇష్టపడేవారు. వందల సంఖ్యలో ఈ ప్రాంతంలో సినిమా షూటింగ్‌లు జరిగాయి. ‘గోదారి గట్టుంది... గట్టు మీద చెట్టుంది.. చెట్టుకొమ్మన పిట్టుంది.. పిట్ట మనసులో ఏముంది’ అంటూ మూగమనసుల్లోని పాట ఇక్కడ చిత్రీకరించిందే. 1964లో వచ్చిన ఈ సినిమా దాదాపు గోదావరి చుట్టు పక్కల ప్రాంతంలో చిత్రీకరించారు. 1975లో బాపు దర్శకత్వంలో భక్తకన్నప్ప షూటింగ్ కూడా ఇక్కడే తీశారు. ‘శివ శివ శంకర.. భక్తవ శంకర.. శంభో హరహర నమో నమో’ పాటను పట్టిసం వీరభద్రస్వామి ఆలయంలో తీశారు. 1985లో కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వాతిముత్యం సినిమాలో అనేక సన్నివేశాలు కూడా ఇక్కడ చిత్రీకరించారు. అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలో 1982లో రూపొందిన మేఘసందేశం చిత్ర షూటింగ్ ఇక్కడ జరిగింది. నిద్రగన్నేరు చెట్టు కింద ఎన్నో షూటింగ్‌లు కొవ్వూరు మండలం కుమారదేవం సమీపంలో గోదావరి ఒడ్డున నిద్రగన్నేరు చెట్టుంది. ఈ చెట్టు కింద షూటింగ్ జరుపుకున్న సినిమాలెన్నో.. అందుకే దీనిని సినిమా చెట్టుగా పిలుస్తుంటారు. కృష్ణ నటించిన పాడిపంటలు, చిరంజీవి నటించిన చట్టంతో పోరాటం, తదితర సుమారు 300 చిత్రాలు ఈ చెట్టు దగ్గర షూటింగ్ జరుపుకున్నాయని స్థానికులు చెబుతారు. జిల్లాలోని ఏలూరు, కొల్లేరు, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొవ్వూరు, పెద్దేము, భీమవరం పరిసర ప్రాంతాలు, పాలకొల్లు, నిడదవోలు, చాగల్లుతో పాటు పలు ప్రాంతాల్లో షూటింగ్ ప్రదేశాలు ఉన్నాయి. అక్కడ కూడా పలు విజయవంతమైన చిత్రాలు తీశారు. గోదావరి తీరాన.. ఇసుక తిన్నెలపై చిరంజీవి ఆపద్భాందవుడు, కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన మురారీ చిత్రంలో కొన్ని సన్నివేశాలు గోదారి తీరంలో రూపొందినవే. మురారిలోని ‘డుమ్ డుమ్ డుమ్ నటరాజు ఆడాలి... దుమ్మురేపాలిరా’ పాట గోదావరి ఇసుక తిన్నెలపై తీసిందే.. హిందీ, తమిళ సినిమాలు కూడా.. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్ నటించిన రంగస్థలంలోని పలు సన్నివేశాలు గోదావరి తీర ప్రాంతంలో తీసినవే. రాజేశ్వరి కళ్యాణం, సీతారామయ్య గారి మనవరాలు, సూత్రధారులు, త్రిశూలం, పాడిపంటలు, మొరటోడు నా మొగుడు, ప్రెసిడెంట్‌గారి పెళ్లాం, జానకిరాముడు, భద్రాచలం, అధిపతి, గోదావరి, నువ్వులేక నేను లేను, చట్టంతో పోరాటం ఇలా వందల సినిమా షూటింగ్‌లు పట్టిసీమ, పోలవరం, కోండ్రుకోట, సింగన్నపల్లి, పాపికొండలు తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నవే. హిందీ సినిమా హిమ్మత్వాలా, తమిళ సినిమా సూర్య చిత్రాల్ని గోదావరి తీరంలో చిత్రీకరించారు. పూర్తి స్థాయి గోదావరి నేపథ్యంలో సినిమాలు రూపొందడం విశేషం. అక్కినేని నాగేశ్వరరావు నటించిన అందాల రాముడు, సుమంత్ గోదావరి చిత్రం రాజమండ్రి నుంచి భద్రాచలం వరకు పూర్తిగా గోదావరిపైనే చిత్రీకరించారు. -
ఒకప్పుడు అష్టైశ్వర్యాలు.. కలరా దెబ్బతో నిర్మానుష్యమైన గ్రామం
బుట్టాయగూడెం: అనగనగా ఓ ఊరు. కాకతీయుల నుంచి రెడ్డి రాజుల వరకు పాలించిన గడ్డ. ఆనాటి చారిత్రక ఆనవాళ్లు నేటికీ ఆ గ్రామంలో పదిలంగా ఉన్నాయి. రెడ్డి రాజుల సామ్రాజ్యంగా ఉన్న ఆ ఊరు రత్నాలు, రాసులతో అలరారినది. అటువంటి ఊరు నేడు నిర్మానుశ్యంగా మారింది. ఇలా చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలిచి ఘనతకెక్కింది రెడ్డిగణపవరం. నాడు రెడ్డి రాజుల సామ్రాజ్య పాలనలో అష్టైశ్వర్యాలతో అలరారిన గ్రామం నేడు నిర్మానుష్యంగా మారడం వెనుక ఉన్న కథను ఒక్క సారి పరిశీలిద్దాం... పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం ఎంతో చారిత్రక నేపథ్యం గలది. ఈ గ్రామం 11వ శతాబ్దంలో ఏర్పడింది. ఓరుగల్లు కాకతీయుల పాలనలో రుద్రమదేవి ఆధీనంలోనే ఈ ప్రాంతమంతా ఉండేదని పూర్వీకులు చెప్తున్నారు. ఆ తర్వాత రెడ్డి రాజులు వంశానికి చెందిన గణపతి రెడ్డి ఆధీనంలోకి వచ్చి ప్రత్యేక సామ్రాజ్యంగా ఏర్పడింది. గణపతి రెడ్డి పాలనలో ఈ ప్రాంతం అభివృద్ధిలో ఉచ్ఛ స్థితికి చేరుకోవడంతో పాటు అష్టైశ్వర్యాలతో అలలారినట్లు చరిత్ర చెప్తుంది. ఈ ప్రాంతంలో తవ్వకాలు చేస్తున్న వారికి నాటి కాలానికి సంబంధించిన గుర్తులు నేటికీ లభిస్తున్నాయి. రెడ్డి రాజులు, సుల్తాన్లు కాలం నాటి నాణాలు, బంగారపు వస్తువులు తవ్వకాల్లో లభించగా ఈ వస్తువులను తూర్పుగోదావరి జిల్లా కాకినాడ పునరావస్తు శాఖకు అప్పగించడం జరిగింది. గణపతి రెడ్డి పాలన: రెడ్డి రాజులు పాలన రెడ్డి గణపవరం కేంద్రంగా బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం తదితర ప్రాంతాలను సుమారు 65 కిలోమీటర్లు పరిధిలో సాగిందని చరిత్ర తెలిసిన పూర్వీకులు చెపుతున్నారు. రెడ్డి రాజులు పాలనలో ఇక్కడ రెడ్లు, వైశ్యులు, బ్రాహ్మణులు అధికంగా అండగా, ఇతర కులాల వారు తక్కువుగా ఉండేవారని చెప్తున్నారు. సుమారు రెండు వందల సంవత్సరాల పాటు సుభిక్షంగా అలరారుతున్న, ప్రశాంతంగా ఉన్న రెడ్డి గణపవరం గ్రామంపై 13వ శతాబ్దంలో ముస్లింలు పలుసార్లు దండయాత్రలు చేశారు. ఈ దండయాత్రలో గణపతి రెడ్డి కట్టించిన ఆలయాలు, మండపాలు ధ్వంసం అయ్యాయి. ముస్లింల దండయాత్రలో విజయం సాధించిన గణపతి రెడ్డి విజయానికి గుర్తుగా రెడ్డి గణపవరంలో కనక దుర్గమ్మ తల్లి గుడి కట్టించారు. కలరా సోకి ఖాళీ అయిన గ్రామం: 13వ దశాబ్ద కాలంలో ముస్లిం దండయాత్ర తర్వాత రెడ్డిగణపవరం గ్రామంలో కలరాసోకి ఒక్కొక్కరిగా మృత్యువాతన పడుతూవచ్చారు. దీనితో భయబ్రాంతులకు గురైన గ్రామస్తులు ఒక్కొక్కరిగా గ్రామం విడిచి బయటగ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇక్కడి నుంచి వెళ్ళినవారిలో ఎక్కువ మంది వైశ్యులు లక్కవరంలోనే స్థిరపడినట్లు పూర్వీకులు చెప్తున్నారు. -
వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!
బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత్రులు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆ అడవి నుంచే అన్నీ పొందుతుంటారు. అలాగే వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం. సంప్రదాయ వంటకం కొమ్ముల కూర ఎంతో రుచికరమైన వెదురు కొమ్ముల కూర అడవి పుత్రుల సంప్రదాయ వంట. మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా వండుకుని తింటారు. అడవిలో వెదురు మొక్కల పక్కన మొలకెత్తే లేత పిలకల్ని కొమ్ములుగా పిలుస్తారు. వర్షాకాలంలో గిరిజన మహిళలు అడవికి వెళ్లి వాటిని సేకరిస్తారు. వెదురు కొమ్ముల తొక్కలు తీసి సన్నగా తరగాలి. అనంతరం నీళ్లలో తరుగును ఉడకపెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేయాలి. ఉప్పు వేసి కొంతసేపు ఉడికించాక.. ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టి కూరను సిద్ధం చేస్తారు. వెదురు కొమ్ముల కూరలో ఇంకా రుచి రావాలంటే అందులో చింతచిగురు లేదా గోంగూర వేస్తుంటారు. ఈ కొమ్ముల కూరలో కారం వేస్తే కూర చేదు వస్తుంది. వర్షాకాలంలో ప్రత్యేకం వర్షాకాలంలో కొమ్ములు దొరికినంత కాలం గిరిజనులు ఈ కూరే తింటారు. ప్రతి ఇంట గ్రామాల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు అదిరిపోతుంటాయి. జూన్‌లో తొలకరి వర్షాలతో వెదురు చెట్లు చిగురిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వెదురు కొమ్ములు దొరుకుతాయి. ఆ సమయంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర ఉండాల్సిందే. వెదురు కొమ్ముల సేకరణ అంత సులువేం కాదు. వాటి కోసం గిరిజన మహిళలకు అనేక ఇబ్బందులు తప్పవు. వెదురు కూపులో పిలకలు (కొమ్ములు) కోసే సమయంలో పొదల్లో విష సర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వెదురు ముళ్లు విపరీతంగా గుచ్చుకుంటాయి. అయినా వాటి కోసం వెదుకులాట మానరు. 1. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు. 2. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు ఎక్కువగా తింటారు. ►వెదురు కొమ్ముల కూర ఎంతో ఇష్టం కావడంతో కష్టమైనా జాగ్రత్తగా సేకరిస్తామని గిరిజన మహిళలు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా.. అటవీప్రాంతానికి వెళ్ళి సేకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి దొరికే వెదురు బియ్యంతోనూ ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. ఎర్ర చీమలతో చారు... అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లకు చీమలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గూళ్ళను దులిపి దొరికే గుడ్లను నూరి ఆ చూర్ణంతో చారు కాసుకుంటారు. ఈ వర్షాకాలంలో ఈ చారు గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇది మా సంప్రదాయ వంటకం అడవి వెదురు కొమ్ముల కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వంటకం. కొమ్ముల కూరలో ఎండు చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చెట్లకు పట్టే ఎర్ర చీమల పుట్టను తెచ్చుకుని దాని గుడ్లతో చారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. – మాల్చి కోటంరెడ్డి, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం వెదురు కూరలో ఎన్నో పోషకాలు వానలు కురిసే సమయంలో ఎక్కువగా పప్పు కొమ్ముల కూరం తింటాం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ కూర తినేవారు మంచి ఆరోగ్యం ఉంటారు. – మాల్చి పాపాయమ్మ, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం -
ప్రకృతి ఆరాధన: చెట్టు మానులే దేవతామూర్తులు..
బుట్టాయగూడెం: చెట్టును, పుట్టను దేవుళ్లగా కొలవడం హిందూ సంస్కృతిలో భాగం. ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతితో మమేకం కావడం దీనిలోని ఉద్దేశం. ప్రత్యేకించి గిరిజన సంప్రదాయాలు వినూత్నంగా ఉంటాయి. తరతరాలుగా తాతముత్తాతల నుంచి వచ్చిన ఆనవాయితీలను కొనసాగిస్తూ భావితరాలకు అందిస్తున్న గిరిజన తెగలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో నాయక్‌పోడు గిరిజనులు ఒకరు. చెట్టు మానులను కొయ్య రూపాలుగా మార్చి ఏటా శ్రీరామనవమికి పూజలు చేయడం బుట్టాయగూడెం మండలంలోని లక్ష్మీపురం నాయక్‌పోడు గిరిజనుల ప్రత్యేకం. గ్రామంలో 50 నాయక్‌పోడు గిరిజన కుటుంబాలు ఉన్నాయి. గ్రామ దేవతగా గంగానమ్మవారు పూజలందుకుంటున్నారు. అయినా గ్రామస్తులంతా సీతారాములను ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. ఏటా శ్రీరామనవమి సందర్భంగా అడవిలోని నాలుగురకాల చెట్ల మానులను సేకరించి వాటిని ప్రత్యేక రూపంలో మలిచి ఘనంగా పూజలు చేస్తుంటారు. తరాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు వీరంతా. గ్రామంలో రామాలయం ఉన్నా తామంతా ఇలానే దేవుళ్లకు పూజలు చేస్తామని శ్రీరామనవమి ఉత్సవ కమిటీ సభ్యులు వనుము వీర్రాజు, కుసినే మణికుమార్, కుసినే వెంకటేశ్వరరావు తెలిపారు. నాలుగు రకాల మానుల నుంచి.. శ్రీరామనవమికి ముందు ఉత్సవ కమిటీ సభ్యులు అడవికి వెళ్లి చెండ్ర, పాల, ఊడిగ, రావిచెట్ల మానులు సేకరిస్తారు. చెండ్ర చెట్టు మానును రాముడిగా, పాలచెట్టు మానును సీతాదేవిగా, ఊడిగ చెట్టు మానును లక్ష్మణుడిగా, రావిచెట్టు మానును ఆంజనేయుడిగా చెక్కించి గ్రామ మధ్యలో ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఇలా ఏటా శ్రీరామనవమి రోజు సీతారాముల కల్యాణాన్ని ఘనంగా జరిపిస్తామని వీరు చెబుతున్నారు. ఏజెన్సీ మారుమూల గ్రామంలో వినూత్న ఆచారంతో సీతారాముల కల్యాణం జరగడం ఇక్కడ ప్రత్యేకతను సంతరించుకుంది. అదే మాకు జయం అడవిలోని చెట్ల మానులు తీసుకువచ్చి విగ్రహాలుగా మలిచి పూజలు చేస్తాం. ఇది మా ఆనవాయితీ. ఇదే మాకు జయం, శ్రీరామరక్ష. పూర్వీకుల నుంచి వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నాం. –గురువింద రామయ్య, లక్ష్మీపురం చదవండి: అపురూప దృశ్యం.. ఆవిష్కృతం గట్టిగా కేకలు వేయడంతో గుట్టుచప్పుడు కాకుండా.. -
మర్మమెరుగని కర్మయోగి
సాక్షి, పశ్చిమగోదావరి : ఆయనో గాంధేయ వాది.. బాపూజీపై ఎనలేని అభిమానం.. 12 ఏళ్ల వయసులో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు.. ఉపాధ్యాయ వృత్తిని వదిలి గిరిజన సేవా సంఘం స్థాపించి సేవే పరమావధిగా జీవించారు.. దాతలు, విదేశీయులు, ప్రభుత్వం నుంచి విరాళాలు సేకరించి పెద్దెత్తున సేవా కార్యక్రమాలు నిర్వహించారు.. గతమెంతో వైభవం కాగా.. ప్రస్తుతం దుర్భర స్థితిలో బతుకుతున్నారు. కొల్లాయి గుడ్డ, చేతికర్ర ధరించి గాంధీజీ స్ఫూర్తితో జీవనం సాగిస్తున్న ఆయన పేరు స్వామి సత్యానంద. అభినవ గాంధీగా, కర్మయోగిగా అడవిబిడ్డలు ఆయన్ను అభివర్ణిస్తుంటారు. గాంధీజీ స్ఫూర్తితో.. పోలవరం మండలం గూటాలకు చెందిన అచ్చన్న, చంద్రమ్మ దంపతుల నాల్గో కుమారుడు సత్యానంద 1930లో జన్మించారు. చిన్నతనం నుంచి గాం«దీజీపై ఇష్టం పెంచుకున్న ఆయన బాపూజీ పుస్తకాలు చదువుతూ పెరిగారు. 12వ ఏట క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని గాంధీజీని దగ్గరగా చూశారు. 1944లో 8వ తరగతి చదువుతూ ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశారు. 1946లో గోపాలపురం మండలంలోని రాజంపాలెంలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి అదే ఏడాది బుట్టాయగూడెం మండలంలోని రామన్నగూడెం పాఠశాలకు బదిలీపై వచ్చారు. 1948లో ఉపాధ్యాయుల హక్కుల కోసం 32 రోజులపాటు నిరాహార దీక్ష చేసి, సమస్యలపై అప్పటి ప్రధాని నెహ్రూకు లేఖ రాశారు. శిథిలావస్థకు చేరుకున్న సత్యానంద భవనం ఆయన పేరుతో గ్రామం బుట్టాయగూడెం మండలం రామన్నగూడెం సమీపంలోని చిన్న భవనంలో ఆయన సేవా సంఘాన్ని ఏర్పాటుచేశారు. అనంతర కాలంలో ఆ ప్రాంతంలో మరికొన్ని ఇళ్ల నిర్మాణం జరిగింది. స్వామి సత్యానంద సేవలను గుర్తించి ఆ గ్రామానికి ‘నందాపురం’ అని స్థానికులు పేరుపెట్టారు. ప్రస్తుతం ఈ గ్రామంలో 200 కుటుంబాలకు పైగా ఉన్నాయి. 79 ఏళ్లుగా బాపూజీ బాటలో.. స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సమకూర్చిన ఆస్తులు దానధర్మాల నేపథ్యంలో కనుమరుగయ్యాయి. నాడు సిబ్బందితో కళకళలాడిన భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. విలువైన పుస్తకాలు చెదలు పట్టి పాడైపోయాయి. నా అనే వాళ్లు లేక శిథిల భవనంలో ఆయన జీవనం సాగిస్తున్నారు. 91 ఏళ్ల వయసున్న ఆయన క్విట్ ఇండియా ఉద్యమం నాటి నుంచి 79 ఏళ్లుగా గాంధీజీ వేషధారణలో బతుకుతూ కూరగాయలు, పండ్లు, రొట్టెలే ఆహారంగా తీసుకుంటున్నారు. శి«థిల భవనంలో విషసర్పాలు సంచరించే ప్రాంతంలో ఒంటరిగా జీవనం సాగిస్తున్నారు. చెదలు పట్టిన విలువైన పుస్తకాలు ఔదార్యం.. అమోఘం దీనస్థితిలోనూ సత్యానంద తన ఔదర్యాన్ని వీడలేదు. ప్రభుత్వం అందిస్తున్న రూ.2,250 పింఛన్‌ను పేదల కోసమే ఖర్చు చేస్తున్నారు. ఎవరైనా ఆయన్ను సన్మానించి నూతన వ్రస్తాలు అందిస్తే వాటినీ పేదలకు ఇచ్చేస్తున్నారు. తనకు వివాహమైనప్పటికీ కుటుంబానికి దూరంగా ఉంటున్నట్టు సత్యానంద చెబుతున్నారు. ఉద్యోగాన్ని వదులుకుని.. 1954లో గిరిజనులకు సేవ చేయాలనే తలంపుతో ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలి గిరిజన సేవా సంఘం అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. దాతలు, ప్రభుత్వం, విదేశీయుల సహకారంతో విరాళాలు సేకరించి పెద్ద స్థాయిలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. సంస్థకు భవనాలు, భూమిని కూడా సమకూర్చారు. సుమారు 30 మందికి పైగా ఉద్యోగులతో సంస్థ ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో అక్షరాస్యత శాతం పెంపు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవకు కృషిచేశారు. -
నీళ్లు వేడెక్కాయో లేదోనని..
సాక్షి, బుట్టాయగూడెం: హీటర్ పెట్టిన బకెట్లో నీళ్లు వేడెక్కాయో లేదోనని చెయ్యి పెట్టి చూసిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో గురువారం నూనే జ్యోతి (38) అనే మహిళ ఉదయం స్నానానికి వేడినీళ్ల కోసం బకెట్లో నీళ్లు పోసి హీటర్ పెట్టింది. అయితే ఆ నీళ్లు వేడెక్కాయో లేదో అని చెయ్యి పెట్టి చూడగా, ఒక్కసారిగా విద్యుత్‌షాక్ తగిలింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతురాలి భర్త చంద్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..) -
మోకాళ్లపై గుడి మెట్లెక్కిన బాలరాజు
సాక్షి, బుట్టాయగూడెం: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోగ్యం మెరుగుపడి త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ పార్టీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ తల్లి గుడి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. మోకాళ్లపై నడుస్తూ మెట్లెక్కి మొక్కు చెల్లించుకున్నారు. ఇటీవల హత్యాయత్నంలో గాయపడిన వైఎస్.జగన్ త్వరగా కోలుకోవాలని ఈ పూజలు చేసినట్లు బాలరాజు చెప్పారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వైఎస్ జగన్‌ని ఎవరూ ఏమీ చేయలేరని అన్నారు. కోట్లాది మంది అభిమానులు ఆయన వెంట ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌ని ప్రజలు అఖండ ఆధిక్యంతో గెలిపిస్తారని చెప్పారు. రాబోయే రోజుల్లో జగన్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు కుంజా భూమయ్య, జోడి దుర్గాప్రసాద్, మాజీ సర్పంచ్ కోర్సా కన్నపరాజు, పెద్దిరెడ్డి మూర్తి, బొల్లిగిరి, మహమ్మద్ ఇక్బాల్, మహమ్మద్ నక్తర్, తెల్లం స్వామి, తెల్లం వెంకయ్య, మడివి బుచ్చయ్య, పట్ల గంగాదేవి, పసుపులేటి మధు పాల్గొన్నారు. -
మభ్యపెట్టి మాయ చేశారు
► గడప గడపకూ వైఎస్సార్‌లో గిరిజనుల ఆవేదన బుట్టాయగూడెం: ఎన్నికల సందర్భంగా రుణాలు మాఫీ చేస్తామని, బ్యాంకుల్లో పెట్టిన బంగారం తీసుకువస్తామని చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు మభ్యపెట్టారు. మండలంలోని చిన్నజీడిపూడి, డ్యామ్ కాలనీకి చెందిన ప్రజలు మంగళవారం జరిగిన గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బాబు ఎన్నికల్లో చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని ఆశపడ్డామని చెప్పారు. అయితే మూడేళ్లు గడచినా అవి అమలు కాకపోవడంతో ఎన్నికల్లో బాబు ఇచ్చిన హామీలన్నీ మాయే అంటూ ఇప్పుడు తెలుసుకుని బాధ పడుతున్నామంటూ మొడియం దుర్గారావు, ఎస్. సత్యవతి, కె. లింగయ్య తెలిపారు. డ్వాక్రా సంఘాల రుణాలు కట్టవద్దని చెపితే ఆగామని ఇప్పుడు అసలు, వడ్డీ కోసం బ్యాంకుల వారు తమను ఇబ్బంది పెడుతున్నారంటూ మహిళలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తమ దగ్గరకు వచ్చి టీడీపీ నాయకులు ఎలా ఓట్లు అడుగుతారో చూస్తామంటూ గిరిజన మహిళలు తీవ్రంగా హెచ్చరించారు. అలాగే ఇల్లు మంజూరు కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం లేకుండా పోతుందని కాకడ వెంకటేశ్వరరావు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆరేటి సత్యనారాయణ, మద్దిపాటి సూరిబాబు, ఎంపీటీసీలు తెల్లం రమణ, కూరం ముత్యాలమ్మ, వెట్టి పెంటమ్మ, నాయకులు శంకారపు శ్రీను, సోయం వెంకట్రామయ్య, తెల్లం రాముడు, మడకం చలపతిరావు, సోదెం వెంకటేశ్వరరావు, కూరం రాంబాబు, తెల్లం గంగరాజు తదితరులు పాల్గొన్నారు. -
బుట్టాయగూడెం ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు
జంగారెడ్డిగూడెం : బుట్టాయగూడెం ఎస్సై డి.రవికుమార్‌పై ఎస్పీ భాస్కర్‌భూషణ్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎస్పీ భాస్కర్‌భూషణ్ బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో స్టేషన్ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ఎస్సై పనితీరు బాగోకపోవడాన్ని గుర్తించిన ఎస్పీ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఏఎస్సై వ్యవహరిస్తున్నారు. -
బుట్టాయగూడెం ఎస్సైపై క్రమశిక్షణ చర్యలు
జంగారెడ్డిగూడెం : బుట్టాయగూడెం ఎస్సై డి.రవికుమార్‌పై ఎస్పీ భాస్కర్‌భూషణ్ క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. ఎస్పీ కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆయనకు ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల ఎస్పీ భాస్కర్‌భూషణ్ బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో స్టేషన్ రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం, ఎస్సై పనితీరు బాగోకపోవడాన్ని గుర్తించిన ఎస్పీ ఆయనపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలోనే ఎస్సైపై చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం బుట్టాయగూడెం పోలీస్‌స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా ఏఎస్సై వ్యవహరిస్తున్నారు. -
పోలీసులపై తిరగబడిన ఎంపీ వర్గీయులు!
బుట్టాయగూడెం : అటవీప్రాంతంలో ఉన్న గుబ్బల మంగమ్మ గుడి వద్ద అధికారపార్టీకి చెందిన ఓ ఎంపీ వర్గీయులు ఆదివారం మద్యం తాగి హడావుడి సృష్టించారు. పోలీసులపై తిరగబడ్డారు. అదేమని అడిగిన ఆలయ కమిటీ సభ్యులతోనూ వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనపై స్థానికులు, భక్తులు చెప్పిన వివరాల ప్రకారం.. గుబ్బల మంగమ్మ గుడికి కైకలూరు నుంచి వచ్చిన ఎంపీ వర్గీయులు 50 మంది ఆలయ ప్రాంగణంలో మద్యం సేవించి గొడవ చేస్తుండగా, ఇద్దరు పోలీసులు వెళ్లి ఇలా చేయడం తప్పని చెప్పారు. దీంతో మద్యం మత్తులో ఉన్న ఎంపీ వర్గీయులు పోలీసులపై తిరగబడ్డారు. వారితో వాదనకు దిగారు. దీంతో పోలీసులు ఆలయ కమిటీ సభ్యులకు, సర్పంచ్ కోర్స కన్నప్పరాజుకు విషయం చెప్పారు. వారు వెళ్లి ఎంపీ వర్గీయులతో మాట్లాడారు. ఈ సమయంలో ఎంపీ వర్గీయులు వారిపైనా వాదనకు దిగారు. ఇది ఇరువర్గాల మధ్య తోపులాటకు దారితీసింది. ఈ ఘటనలో ఎంపీ వర్గీయులతోపాటు ఆలయ కమిటీ సభ్యులకు గాయాలైనట్టు సమాచారం. దీంతో విషయం తెలుసుకున్న బుట్టాయగూడెం పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి ఎంపీ వర్గీయుల్లో కొందరిని బుట్టాయగూడెం పోలీసుస్టేషన్‌కి తీసుకువచ్చారు. కేసు నమోదు చేయకుండా ఆలయ కమిటీ సభ్యులకు, ఎంపీ వర్గీయులకు మధ్య పోలీసులు రాజీ చేసి వివాదాన్ని సద్దుమణిగేటట్టు చేసినట్టు తెలుస్తోంది. దీనిపై పోలీసులను వివరణ అడిగితే గుడివద్ద ఎటువంటి గొడవ జరగలేదని, యాత్రికులకు, ఆలయ కమిటీ సభ్యులకు మధ్య స్వల్ప వాదన చోటుచేసుకుందని చెబుతున్నారు. -
అంగడి వస్తువుల్లా ఎమ్మెల్యేల కొనుగోలు
చంద్రబాబుపై ధ్వజమెత్తిన బాలరాజు బుట్టాయగూడెం : విపక్ష ఎమ్మెల్యేలను అంగడి వస్తువుల్లా ముఖ్యమంత్రి చంద్రబాబు కొనుగోలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తెల్లం బాలరాజు ధ్వజమెత్తారు. చంద్రబాబు జీవితం మోసాలు, అబద్ధాలతోనే కొనసాగుతోందని విమర్శించారు. మంగళవారం బాలరాజు విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు, డబ్బు, ఇళ్ల స్థలాలు ఇస్తామంటూ చంద్రబాబు నీచ రాజకీయలకు పాల్పడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజాదారణ పొందలేక సీఎం కుళ్లు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణలో ఒక మాట, ఆంధ్రలో మరోమాట మాట్లాడుతూ బాబు తన రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపెట్టారని మండిపడ్డారు. ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధిచెబుతారన్నారు. -
కామవరం వాగు ప్రమాదం; ఆరుకు పెరిగిన మృతులు
బుట్టాయగూడెం : పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెం సమీపంలోని కామవరం వాగులో కొట్టుకుపోయి ఆరుగురు మృతి చెందారు. మరో ఇద్దరిని స్థానికులు రక్షించారు. ఆదివారం ఉదయం కామవరం వాగు అవతల ఉన్న గుబ్బాల మంగమ్మ గుడిలో పూజలు చేసి వాగు దాటుతుండగా ఒక్కసారిగా నీళ్లు ఉధృతంగా వచ్చాయి. దాంతో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు. మృతులు విజయవాడకు చెందిన వేముల ఉమాదేవి(32), వేముల మాధవి(23), నక్కల గొల్లగూడెంకు చెందిన ఆకుల కల్యాణి(38), మరీదు సరస్వతి(60), సాయి(15), వేముల లోకేష్(13) లుగా గుర్తించారు. అయితే గల్లంతయిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. -
గుబ్బల మంగమ్మ గుడి మనదే
బుట్టాయగూడెం/అశ్వారావుపేట : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన గుబ్బలమంగమ్మ ఆలయం భౌగోళికంగా పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉందని తేలింది. కొండరెడ్ల ఆరాధ్య దైవం గుబ్బల మంగమ్మ ఆలయం వివాదంపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్ అధికారులు, డీఎఫ్‌వోలు, ఆర్డీవోలు గురువారం ఉమ్మడిగా విచారణ నిర్వహించారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని గోగులపూడి అటవీ ప్రాంతం, ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లాకు సరిహద్దులో ఉన్న గుబ్బల మంగమ్మ ఆలయం నిర్వహణపై రెండు నెలలుగా వివాదం కొనసాగుతోంది. దీనిపై ఇప్పటికే రెండుసార్లు భద్రాచలం ఐటీడీఏ పీవో దివ్య విచారణ చేపట్టి వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నించారు. తాజాగా రెండు రాష్ట్రాలకు చెందిన అధికారులు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ఆలయ పరిసరాలు, సరిహద్దులను గురువారం పరిశీలించారు. ఇప్పటివరకు ఆలయాన్ని ఏ ప్రాంతానికి చెందిన వారు నిర్వహించారో.. వస్తున్న ఆదాయాన్ని ఏ విధంగా తీసుకుంటున్నారో తదితర విషయాలను ఆరా తీశారు. అన ంతరం అటవీ శాఖ వద్ద ఉన్న సరిహద్దు మ్యాప్‌లను, ఆలయం పరిసరాల్లోని హద్దు రాళ్లను పరిశీలించారు. కొండరెడ్లు, గిరిజనులకు మాత్రమే అడవిపై హక్కులు ఉండగా కొంతమంది మాజీ ప్రజాప్రతినిధులు, గిరిజనేతరులు వారి స్వలాభాల కోసం వివాదాలు సృష్టించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కొండరెడ్లను రెచ్చగొట్టడం వల్లే వివాదం ఏర్పడిందనే అంచనాకు వచ్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలోని కొండరెడ్లు, గిరిజనులతో మాట్లాడి పరిస్థితులను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసేందుకు పది రోజుల సమయం కావాలని పశ్చిమగోదావరి జిల్లా కేఆర్‌పురం ఐటీడీఏ పీవో ఆర్.వి.సత్యనారాయణ కోరడంతో విచారణ వాయిదా పడింది. ఏలూరు డీఎఫ్‌వో రామ్మోహన్రావు, జంగారెడ్డిగూడెం ఆర్డీవో మురళీ మోహన్‌రావు, ఏడీ పీవీ సత్యనారాయణ, డీఈఈ రాంగోపాల్‌రావు, బుట్టాయిగూడెం తహసిల్దార్ ఆసీఫా తదితరులు పాల్గొన్నారు. నిగ్గు తేల్చిన సర్వే ఈ సందర్భంగా ఖమ్మం, పశ్చిమ గోదావరి జల్లాలకు చెందిన అధికారులు ఉమ్మడి సర్వే నిర్వహించారు. ఆలయం చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు. సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వేసిన రాళ్లను గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ (జీపీఎస్) ద్వారా పరిశీలించారు. ఈ సర్వేలో సరిహద్దు ప్రాంతం నుంచి 15 మీటర్ల లోపలికి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోనే ఉందని సర్వే అధికారులు నిర్ధారించారు. పశ్చిమగోదావరి జిల్లాకే చెందుతుందని పేర్కొ న్నారు. ఆలయానికి వెళ్లే రహదారిలో కొంత భాగం ఆంధ్రప్రదేశ్ పరిధిలోను, మరికొంత భాగం తెలంగాణ పరిధిలోను ఉందని నిర్ధారించారు. గిరిజనుల ధర్నా ఆలయూనికి వచ్చే భక్తుల నుంచి ఖమ్మం జిల్లా అటవీ శాఖ సిబ్బంది టోల్‌గేటు ఫీజు వసూలు చేస్తున్నారని, వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఎంఎల్ (న్యూ డెమోక్రసీ) పార్టీకి చెందిన నాయకులు ఉద్దండ ఏసుబాబు, కారం వాసు, కోర్స కన్నప్పరాజు ఆధ్వర్యంలో గిరిజనులు అధికారులను అడ్డుకుని ధరా్నా నిర్వహించారు. ఈ అంశంపై ఖమ్మం జిల్లా భద్రాచలం ఐటీడీఏ పీవో డి.దివ్య , పాల్వంచ డీఎఫ్‌వో శ్రీనివాస్, పశ్చిమగోదావరి ఐటీడీఏ పీవో సూర్యనారాయణ చర్చలు జరిపి టోల్‌గేట్‌ను తొలగించారు. -
చంద్రబాబును తరిమికొట్టడం ఖాయం
బుట్టాయగూడెం : రైతులను, డ్వాక్రా మహిళలను మోసం చేస్తున్న చంద్రబాబును ప్రజలు ఆరు నెలల్లో తరిమికొట్టి చంద్రగిరి పంపేయటం ఖాయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద శనివారం సీపీఎం భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభకు మధు అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు పాలన ఎక్కువ రోజులు సాగదన్నారు. ప్రజావ్యతిరేక విధానాలు అవలంభించిన నైజాం సర్కారునే ప్రజలు తరమికొట్టారన్న విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందన్న అహంకారంతో టీడీపీ నాయకులు ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. రుణమాఫీపై తొలి సంతకమన్న చంద్రబాబు అధికారం చేపట్టి ఐదు నెలలనైనా ఒక్కరి రుణాన్ని కూడా రద్దు చేయలేకపోయారని మధు ఎద్దేవా చేశారు. సర్వేల పేరుతో అర్హులైన పింఛన్‌దారులను కూడా జాబితాల తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ బలంగా ఉందని చంద్రబాబు అనుకుంటున్నారని ప్రజల్లో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఉందని మధు విమర్శించారు. పార్టీలు వేరైనా బీజేపీ, టీడీపీ విధానాలు ఒక్కటేనని ఆరోపించారు. పేద ప్రజలకు ఉపయోగపడే ఉపాధి హామీ పథకాన్ని ఎత్తివేస్తుండడం దారుణమని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు భూమికి భూమి ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ చేశారు. అనాదిగా గిరిజనులు సాగు చేస్తున్న భూముల్లోకి గిరిజనేతరులు అక్రమంగా ప్రవేశించినా అధికారులు పట్టించుకోవడం లేదని, ప్రశ్నించిన వారిపై పోలీసులు తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి మంతెన సీతారాం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో శాంతికి భంగం కలిగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. డివిజన్ కార్యదర్శి ఎ.రవి, గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు తెల్లం రామకృష్ణ, కార్యదర్శి పోలోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అత్యాచారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు
బుట్టాయగూడెం : జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఓ హాస్టల్లో చదువుతున్న అమాయక విద్యార్థినులపై అత్యాచార ఘటనపై దర్యాప్తు నిమిత్తం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్టు జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఏవీ సుబ్బరాజు చెప్పారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. వీరికి సహకరించిన వంట మనిషిని అరెస్ట్ చేశామన్నారు. డివిజన్ పరిధిలోని ఒక మండలంలో ఉన్న హాస్టల్లోని విద్యార్థినులతో ఆసాంఘిక కార్యకలాపాలు చేయిస్తున్న కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న వంట మనిషి గుడికందుల శ్యామల, అత్యాచారానికి పాల్పడిన గండ్రోతు రామకృష్ణ, బందెల మధు, కనిపాటి సునీల్‌కుమార్ (సుందరం)లపై నిర్భయ్, ఫోక్స్ యాక్ట్, ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ, పీసా చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. అత్యాచారానికి సంబంధించి సాక్షాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించిన హాస్టల్వార్డెన్పై కూడా కేసు నమోదు చేసినట్టు తెలిపారు. వీరిని జంగారెడ్డిగూడెం ఫస్ట్‌క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామన్నారు. అలాగే అత్యాచారం చేసిన ముగ్గురిపై రౌడీషీట్లు తెరుస్తున్నట్టు వెల్లడించారు. కలెక్టర్ కాటమనేని భాస్కర్, ఎస్పీ రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో కేసు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. డీటీసీ కేజీవీ సరిత, జంగారెడ్డిగూడెం సీఐ అంబికాప్రసాద్, ఎస్సై సైదానాయక్, ఎస్సై కాంతి ప్రియ దర్యాప్తు టీమ్‌లో ఉన్నట్లు డీఎస్పీ వివరించారు. -
ఆధార్ నమోదులో బుట్టాయగూడెం ఫస్ట్
బుట్టాయగూడెం : ఆధార్ నమోదులో జిల్లాలోని బుట్టాయగూడెం మండలం ప్రథమ స్థానంలో నిలిచిందని జేసీ బాబురావు నాయుడు చెప్పారు. మంగళవారం స్థానిక మీ-సేవా కేంద్రాన్ని ఆయన అకస్మికంగా సందర్శించి ఆధార్ నమోదు తీరును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 39 లక్షల 35 వేల మంది జనాభా ఉండగా 37 లక్షల 94 వేల మంది ఆధార్ నమోదు చేయించుకున్నారని, ఇంకా 75 వేల మంది నమోదు చేయించుకోవాల్సి ఉందన్నారు. అయితే 97వేల 897 మంది వివరాలు రిజక్ట్ అవుతున్నాయని తెలిపారు. కొత్తగా పెళ్లయిన వారు పుట్టింటి వద్ద, అత్తంటి ప్రాంతంలో నమోదు చేయించుకోవడం వల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, వీరు మళ్లీ నమోదు చేయించుకోవాలని సూచించారు. రేషన్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్ అన్ని రకాల కలిపి 26 లక్షలు సీడింగ్ అయ్యాయని తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో 80 శాతం ఆధార్ సీడింగ్ జరిగిందన్నారు. ఆధార్ నమోదులో బుట్టాయగూడెం మండలం 94 శాతం పూర్తి చేసిందని మిగతా ఆరు శాతం 10వ తేదీలోగా పూర్తి చేయాలని తహసిల్దార్ గంగరాజుని ఆదేశించినట్లు చెప్పారు. కొండరెడ్డి గిరిజన గ్రామాలకు మొబైల్ కేంద్రం మండలంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాలకు వె ళ్లి ఆధార్ నమోదు చేసేందుకు ప్రత్యేక మొబైల్ కేంద్రం ఏర్పాటు చే స్తామని జేసీ చెప్పారు. వీఆర్వోలు, పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో ఆధార్ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చే సి నూరు శాతం సాధించాలని సూచించామన్నారు. ఆయన వెంట తహసిల్దార్ గంగరాజు, ఎంపీడీవో పి.వెంకటలక్ష్మి, ఆర్ఐ పాయం రమేష్, మండల కోఆప్షన్ సభ్యులు దార శిఖామణి, మీ-సేవా నిర్వాహకులు ఉడత లక్ష్మణరావు ఉన్నారు. -
పేద విద్యార్థుల భవిష్యత్ కోసం ‘అమ్మఒడి’
బుట్టాయగూడెం, న్యూస్‌లైన్ : అమ్మఒడి పేద విద్యార్థుల భవిష్యత్‌కి ఆనందాల ఒడి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాన్ని శనివారం ఆయన సందర్శించి విద్యార్థులతో మమేకమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందించేందుకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట పథకాన్ని ప్రవేశపెట్టారని చెప్పారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ఫీజురీయంబర్స్‌మెంట్ పథకాన్ని సక్రమంగా అమలు చేయకపోవడంతో పేద విద్యార్థుల చదువు మధ్యలో ఆగిపోయే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్ కోసం అమ్మఒడి పథకంతోపాటు మరిన్ని పథకాలు అమలు చేస్తారని చెప్పారు. పార్టీ శ్రేణులు రేపాకుల చంద్రం, ఆరేటి సత్యనారాయణ, కోరం దుర్గారావు, అన్నవరం, కడియ్య పాల్గొన్నారు. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలని కోరుతూ మండలంలోని వెలుతురువారిగూడెం గ్రామానికి చెందిన గిరిజనులు బాలరాజును కోరారు. -
విద్యార్థిని గర్భవతి చేసిన ఉపాధ్యాయుడు
ఏలూరు : సభ్య సమాజం సిగ్గుపడేలా విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులే కీచకులుగా మారిపోతున్నారు. పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఓ ప్రబుద్ధుడు .... ఓ విద్యార్థినిని గర్భవతిని చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయగుడెం మండలం నూతిరామన్నపాలెం గిరిజన సంక్షేమ హాస్టల్లో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని .... ఉపాధ్యాయుడు మాయమాటలు చెప్పి లొంగదీసుకున్నాడు. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భవతి. నిందితుడికి ఇప్పటికై వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ విషయం బయటకు పొక్కటంతో గ్రామంలోని పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రేపటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
బుట్టాయగూడెం (జంగారెడ్డిగూడెం), న్యూస్‌లైన్ : తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడాన్ని నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమైక్య ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆ పార్టీ జిల్లా కన్వీనర్ తెల్లం బాలరాజు తెలిపారు. 10వ తేదీన విద్యార్థులు, యువకులతో ర్యాలీ, 11న రైతులతో ట్రాక్టర్ల ర్యాలీ, 12న రహదారులు, హైవేల దిగ్బంధనం, వంటావార్పు, 14 నుంచి జిల్లాలోని ఒకొక్క నియోజకవర్గంలో ఒకొక్కరోజు చొప్పున భారీ ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహిస్తామని చెప్పారు. పార్టీ శ్రేణులు, సమైక్యవాదులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు.