బుట్టాయగూడెం : ఆధార్ నమోదులో జిల్లాలోని బుట్టాయగూడెం మండలం ప్రథమ స్థానంలో నిలిచిందని జేసీ బాబురావు నాయుడు చెప్పారు. మంగళవారం స్థానిక మీ-సేవా కేంద్రాన్ని ఆయన అకస్మికంగా సందర్శించి ఆధార్ నమోదు తీరును పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో 39 లక్షల 35 వేల మంది జనాభా ఉండగా 37 లక్షల 94 వేల మంది ఆధార్ నమోదు చేయించుకున్నారని, ఇంకా 75 వేల మంది నమోదు చేయించుకోవాల్సి ఉందన్నారు.
అయితే 97వేల 897 మంది వివరాలు రిజక్ట్ అవుతున్నాయని తెలిపారు. కొత్తగా పెళ్లయిన వారు పుట్టింటి వద్ద, అత్తంటి ప్రాంతంలో నమోదు చేయించుకోవడం వల్ల సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని, వీరు మళ్లీ నమోదు చేయించుకోవాలని సూచించారు. రేషన్ కార్డు, బ్యాంక్ ఎకౌంట్ అన్ని రకాల కలిపి 26 లక్షలు సీడింగ్ అయ్యాయని తెలిపారు. జిల్లాలోని 25 మండలాల్లో 80 శాతం ఆధార్ సీడింగ్ జరిగిందన్నారు. ఆధార్ నమోదులో బుట్టాయగూడెం మండలం 94 శాతం పూర్తి చేసిందని మిగతా ఆరు శాతం 10వ తేదీలోగా పూర్తి చేయాలని తహసిల్దార్ గంగరాజుని ఆదేశించినట్లు చెప్పారు.
కొండరెడ్డి గిరిజన గ్రామాలకు మొబైల్ కేంద్రం
మండలంలోని మారుమూల కొండరెడ్డి గిరిజన గ్రామాలకు వె ళ్లి ఆధార్ నమోదు చేసేందుకు ప్రత్యేక మొబైల్ కేంద్రం ఏర్పాటు చే స్తామని జేసీ చెప్పారు. వీఆర్వోలు, పంచాయితీ కార్యదర్శులు గ్రామాల్లో ఆధార్ నమోదుపై అవగాహన కల్పించాలని సూచించారు. అన్ని శాఖలు కలిసి సమన్వయంతో పని చే సి నూరు శాతం సాధించాలని సూచించామన్నారు. ఆయన వెంట తహసిల్దార్ గంగరాజు, ఎంపీడీవో పి.వెంకటలక్ష్మి, ఆర్‌ఐ పాయం రమేష్, మండల కోఆప్షన్ సభ్యులు దార శిఖామణి, మీ-సేవా నిర్వాహకులు ఉడత లక్ష్మణరావు ఉన్నారు.
ఆధార్ నమోదులో బుట్టాయగూడెం ఫస్ట్
Published Wed, Aug 6 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM
Advertisement
Advertisement