
సాక్షి, బుట్టాయగూడెం: హీటర్ పెట్టిన బకెట్‌లో నీళ్లు వేడెక్కాయో లేదోనని చెయ్యి పెట్టి చూసిన ఓ మహిళ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాలిలా ఉన్నాయి. జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో గురువారం నూనే జ్యోతి (38) అనే మహిళ ఉదయం స్నానానికి వేడినీళ్ల కోసం బకెట్‌లో నీళ్లు పోసి హీటర్ పెట్టింది.
అయితే ఆ నీళ్లు వేడెక్కాయో లేదో అని చెయ్యి పెట్టి చూడగా, ఒక్కసారిగా విద్యుత్‌షాక్ తగిలింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను వెంటనే కుటుంబ సభ్యులు జంగారెడ్డిగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే జ్యోతి మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. మృతురాలి భర్త చంద్రరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్..)
Comments
Please login to add a commentAdd a comment