మరో వ్యక్తితో భార్య చనువు, వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా.. | Husband Commits Suicide Over Wife Extramarital Affair In Eluru | Sakshi
Sakshi News home page

మరో వ్యక్తితో భార్య చనువు, వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా..

Published Sat, Apr 2 2022 7:40 PM | Last Updated on Sat, Apr 2 2022 8:05 PM

Husband Commits Suicide Over Wife Extramarital Affair In Eluru - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, పశ్చిమగోదావరి: భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడం భరించలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏలూరు టూటౌన్‌ సీఐ డీవీ రమణ నిందితుల్ని అరెస్టు చేశారు. సీఐ వివరాలు వెల్లడిస్తూ.. ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ 1వ రోడ్డు ప్రాంతానికి చెందిన పెరుమాళ్ళ సంతోష్‌(30)కు రామకుమారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సంతోష్‌ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు.

అయితే రామకుమారి పీ.రూపగోవింద్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త సంతోష్‌ భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా భర్త ఇంట్లో ఉండగానే గోవింద్‌తో చనువుగా ఉండేది. ఈ క్రమంలో గత నెల మార్చి 29న భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సరికి రామకుమారి గోవిందుతో ఏకాంతంగా ఉండటాన్ని గుర్తించాడు.


నిందితుల్ని అరెస్టు చేసిన టూటౌన్‌ సీఐ రమణ

దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్‌.. తన మరణానికి భార్య, ప్రియుడు గోవిందు కారణమని తల్లిదండ్రులకు చెప్పి, అదేరోజు సాయంత్రం ఇంటివద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామకుమారి, గోవింద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్‌ విధించారు.   
చదవండి: యువకుడితో భార్య టిక్‌టాక్‌.. సహించలేకపోయిన భర్త.. చివరికి..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement