Wife cheating
-
మరో వ్యక్తితో భార్య చనువు, వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా..
సాక్షి, పశ్చిమగోదావరి: భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడం భరించలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏలూరు టూటౌన్ సీఐ డీవీ రమణ నిందితుల్ని అరెస్టు చేశారు. సీఐ వివరాలు వెల్లడిస్తూ.. ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ 1వ రోడ్డు ప్రాంతానికి చెందిన పెరుమాళ్ళ సంతోష్(30)కు రామకుమారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సంతోష్ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రామకుమారి పీ.రూపగోవింద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త సంతోష్ భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా భర్త ఇంట్లో ఉండగానే గోవింద్‌తో చనువుగా ఉండేది. ఈ క్రమంలో గత నెల మార్చి 29న భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సరికి రామకుమారి గోవిందుతో ఏకాంతంగా ఉండటాన్ని గుర్తించాడు. నిందితుల్ని అరెస్టు చేసిన టూటౌన్ సీఐ రమణ దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్.. తన మరణానికి భార్య, ప్రియుడు గోవిందు కారణమని తల్లిదండ్రులకు చెప్పి, అదేరోజు సాయంత్రం ఇంటివద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామకుమారి, గోవింద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: యువకుడితో భార్య టిక్‌టాక్.. సహించలేకపోయిన భర్త.. చివరికి.. -
భార్య మోసం చేసిందని భర్త ఆత్మహత్యాయత్నం
సాక్షి, తిమ్మాపూర్(కరీంనగర్): భార్య వేధింపులు భరించలేక ఓ వ్యక్తి దిగువ మానేరు జలాశయం కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యకు యత్నించిన సంఘటన సోమవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధి అల్గునూర్ శివారులో జరిగింది. నీటిలో కొట్టుకుపోతున్న యువకుడిని స్థానిక చేపలకాలనీకి చెందిన జాలర్లు ప్రాణాలు తెగించి కాపాడారు. బాధితుడు, జాలర్ల కథనం ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడకు చెందిన వెంకటేశ్ భార్య వేధింపులు భరించలేక ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. కొన్ని రోజులుగా బయటే తిరుగుతూ సోమవారం ఉదయం అల్గునూర్ శివారులోని కాకతీయ కాలువ వద్దకు చేరుకొని అందులో దూకాడు. ఇదే సమయంలో చేపల కాలనీకి చెందిన బాలరాజు కరీంనగర్ మార్కెట్లో చేపలు విక్రయించి ఇంటికి వస్తున్నాడు. కాలువ వద్దకు రాగానే వెంకటేశ్ నీటిలో కొట్టుకుపోతూ కనిపించాడు. వెంటనే అప్రమత్తమైన బాలరాజు అక్కడే ఉన్న చిందం శ్రీను, అమర్ సాయంతో తన బండికి ఉన్న తాడును కాలువలోకి వేసి యువకుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే యువకుడు తాడు పట్టుకోకపోవడంతో బాలరాజు తాడుసాయంతో కాలువలోకి దిగి వెంకటేశ్‌ను ఒడ్డుకు చేర్చాడు. ఈ సందర్భంగా బాధితుడిని వివవరాలు అడగ్గా, తనది ఆదిలాబాద్ జిల్లా కొత్తవాడ అని చెప్పాడు. తనను భార్య మోసం చేసిందని, వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుందామని కాలువలో దూకానని వెల్లడించాడు. యువకుడిని కాపాడినవారు ఎల్ఎండీ పోలీసులకు సమాచారం అందించగా, అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రాణాలకు తెగించి వెంటకేశ్‌ను కాపాడిన బాలరాజు, శ్రీను, అమర్‌ను ఎస్సై కృష్ణారెడ్డి అభినందించారు. -
భర్తకు టోపీ పెట్టి..నగలు, నగదుతో..
బనశంకరి : వయసు మీద పడిన శ్రీమంతులను టార్గెట్ చేసుకుని పెళ్లి పేరుతో ఓ కిలాడీ లేడీ భర్త కన్నుగప్పి నగలు, నగదుతో ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... శ్రీరాంపుర నివాసి సయ్యద్ కరీం అనే వ్యక్తి మొదటి భార్య మృతి చెందడంతో జబీదాబానును రెండో వివాహం చేసుకున్నాడు. వివాహమైన కొత్తలో భర్తతో అన్యోన్యంగా ఉంది. అయితే ఈనెల 17న జబీదా ఇంటిలో ఉన్న రూ. 7 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించింది. 2015లో కూడా రాజాజీనగరలో జబీదాబా మొదటి భర్త చాంద్‌బాషా ఇంట్లో కూడా తన తడాకా చూపడంతో పోలీసులకు పట్టుబడింది. అనంతరం మొదటి భర్త చాంద్‌పాషాను వదిలిపెట్టిన జబీదా రెండో వివాహం సయ్యద్ కరీంను చేసుకుంది. వివాహం అయిన వెంటనే ఆస్తి మొత్తం తన పేరుతో రాసివ్వాలని పీడించేది. దీంతో జబీదా పేరుతో సయ్యద్ రూ. 30 లక్షలు పెట్టి ఓ స్థలం కొనుగోలు చేశాడు. ఇంటిలో ఉంటూనే చోరీ చేస్తూ పట్టుబడింది. దీంతో పలుమార్లు కరీం భార్యను మందలించాడు. ఏరోజైతే భార్య పేరుతో స్థలం కొనుగోలు చేశాడో అదే రోజు బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు, నగదుతో ఉడాయించింది. బాధితుడు సయ్యద్ శ్రీరాంపుర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిలాడీ లేడి కోసం గాలిస్తున్నారు. -
భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం
ఎన్నారై అరెస్టు హయత్‌నగర్: భార్యను మోసగించి మరో మహిళతో సహజీవనం చేస్తూ ఇద్దరు పిల్లలను కన్న ఓ ఎన్నారైపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన సంఘటన శనివారం హయత్‌నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పసుమాములకు చెందిన అనంత రఘునా«థ్‌రెడ్డి కుమార్తె స్వప్న వివాహం 2003లో సింగాపూర్‌లో ఉద్యోగం చేస్తున్న సూర్యపేట్‌కు చెందిన అనుగ లింగారెడ్డితో జరిగింది. వివాహం అనంతరం వారు సింగపూర్ వెళ్లారు. అనంతరం కెనడా వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారు. 2012లో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవ జరగడంతో లింగారెడ్డి స్వప్నను చితకబాదడంతో ఆమె అసుపత్రి పాలైంది. ఈ విషయమై మాసాచూసెట్‌లోని శ్రూయిస్‌బరి పోలీస్టేషన్లో కేసు నమోదయ్యింది. అదే సంవత్సరం భార్యను అక్కడే వదిలి ఇండియాకు వచ్చిన రంగారెడ్డి విడాకుల కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో దరఖాస్తు దరఖాస్తు దాఖలు చేశాడు. అయితే విడాకులు మంజూరు కాకుండానే æమహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన దివ్యతో సహజీవనం చేస్తూ ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న తల్లి రిమేశ్వరీదేవి గత డిసెంబర్ 19న హయత్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.