భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం | Wife alleges cheating, dowry harassment; NRI husband arrested | Sakshi
Sakshi News home page

భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం

Published Sun, Feb 5 2017 2:03 AM | Last Updated on Tue, Sep 5 2017 2:54 AM

భార్య ఉండగానే  మరో మహిళతో సహజీవనం

భార్య ఉండగానే మరో మహిళతో సహజీవనం

ఎన్నారై అరెస్టు
హయత్‌నగర్‌: భార్యను మోసగించి మరో మహిళతో సహజీవనం చేస్తూ ఇద్దరు పిల్లలను కన్న ఓ ఎన్నారైపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన సంఘటన శనివారం హయత్‌నగర్‌ పోలీస్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పసుమాములకు చెందిన అనంత రఘునా«థ్‌రెడ్డి కుమార్తె స్వప్న వివాహం 2003లో సింగాపూర్‌లో ఉద్యోగం చేస్తున్న సూర్యపేట్‌కు చెందిన అనుగ లింగారెడ్డితో జరిగింది. వివాహం అనంతరం వారు సింగపూర్‌ వెళ్లారు. అనంతరం కెనడా వెళ్లి అక్కడి నుంచి అమెరికాకు వెళ్ళి స్థిరపడ్డారు. 2012లో వారిద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవ జరగడంతో లింగారెడ్డి స్వప్నను చితకబాదడంతో ఆమె అసుపత్రి పాలైంది.

ఈ విషయమై మాసాచూసెట్‌లోని శ్రూయిస్‌బరి పోలీస్టేషన్‌లో కేసు నమోదయ్యింది. అదే సంవత్సరం భార్యను అక్కడే వదిలి ఇండియాకు వచ్చిన రంగారెడ్డి విడాకుల కోరుతూ రంగారెడ్డి జిల్లా కోర్టులో దరఖాస్తు దరఖాస్తు దాఖలు చేశాడు. అయితే విడాకులు మంజూరు కాకుండానే æమహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన  దివ్యతో సహజీవనం చేస్తూ ఇద్దరు పిల్లలకు తండ్రయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న స్వప్న తల్లి రిమేశ్వరీదేవి గత డిసెంబర్‌ 19న హయత్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement