husband suicide
-
కిడ్నీ మార్పిడి చేయించడం లేదని.. భార్యను చంపి భర్త ఆత్మహత్య
సిరిసిల్లక్రైం: డయాలసిస్‌తో బాధప డుతున్న ఓ భర్త తన భార్యను క్షణి కావేశంలో హత్యచేసి..ఆపై తను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసు లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజన్నసిరిసిల్ల జిల్లాకేంద్రంలోని శాంతి నగర్‌కు చెందిన దూస రాజేశం(62) రెండు కిడ్నీలు కొద్దినెలల క్రితం పాడయ్యాయి. దీంతో డయాలసిస్ చేయించుకుంటున్నాడు. తనకు కిడ్నీ మార్పిడి చేయించాలని కొన్నాళ్లుగా కుటుంబ సభ్యులతో గొడవ పడు తున్నాడు.కిడ్నీ దొరకగానే శస్త్రచికిత్స చేయిద్దామని, అప్పటి వరకు ఆగాలని కుటుంబసభ్యులు సముదాయించారు. ఈ క్రమంలోనే డయాలసిస్‌తో కాలం వెళ్లదీయలేనని మనస్తా పానికి గురైన రాజేశం ఆదివారం రాత్రి ఇంట్లో ఎవరూలేని సమయంలో తన భార్య లక్ష్మి(50)ని బలమైన ఆయుధంతో తలపై కొట్టి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాజేశం పవర్‌లూమ్స్ నడిపించేవాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో..రాజేశంకు ఇద్దరు కుమారులు. చిన్నకొడుకు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్‌లో ఉండగా, పెద్ద కుమారుడు ఆదివారం తన అత్తగారింట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన రాజేశం తన భార్యను హత్య చేసి తను ఆత్మహత్యకు పాల్పడినట్టు కుమారుడు వేణు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. -
భర్తను వదిలేసి ప్రియుడితో కాపురం.. తమతో కలిసి ఉండాలని షరతు
సాక్షి, ఖమ్మం: కట్టుకున్న భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టడమేకాక.. భర్తనూ తమతోపాటు కలిసి ఉండాలని షరతు విధించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గుండాల వంశీ (29)కి ఐదేళ్ల క్రితం మండలంలోని గోకినేపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాక, సదరు మహిళ ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరుగా ఉంటోంది. పలుమార్లు హెచ్చరించినా ప్రియుడిని విడిచిపెట్టలేనని చెప్పిన ఆమె, భర్తనూ తమతో కలిసి ఉండాలని సూచించింది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియోను వాట్సాప్‌లో పంపించడంతో విషయం ఆదివారం బయటపడింది. మృతుడి తండ్రి గుండాల శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ముదిగొండ ఎస్ఐ నరేశ్ తెలిపారు. చదవండి: కాటేసిన కరెంటు తీగ -
నువ్వంటే ప్రాణం ప్రియాంక.. లెటర్ రాసి భర్త బలవన్మరణం
ఏలూరు: భార్యాభర్తల మధ్య వివాదాలు ఒక మనిషి ప్రాణాన్ని బలితీసుకున్నాయి. భార్య తరఫు బంధువులు, పోలీసుల వేధింపులు భరించలేక మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి తల్లి, బంధువులు ఆరోపించారు. దెందులూరు గ్రామానికి చెందిన చెక్క రామ్‌ప్రసాద్ కుమారుడు చెక్క తేజ మూర్తి (26) సోమవారం తెల్లవారుజామున దెందులూరులో రైల్వే పట్టాలపై ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద సూసైడ్ నోట్‌ను రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే పోలీసులతో పాటు స్థానిక పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు తేజమూర్తి తల్లి ధర్మ రత్నమాల, పెదనాన్నలు మానేపల్లి ఉదయ్‌భాస్కర్, మానేపల్లి మురళీ, బావమరిది చలంచెర్ల సత్యకిషోర్ సోమవారం మధ్యాహ్నం దెందులూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పలు ఆరోపణలు చేశారు. మూడు నెలల క్రితం ఏలూరుకు చెందిన ప్రియాంకతో తేజమూర్తికి వివాహం జరిగిందని, వారిద్దరూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారని తెలిపారు. భార్యభర్తల మధ్య మనస్పర్ధలు రావడంతో గత నెల 26న ప్రియాంక ఏలూరు వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో భర్త తేజమూర్తిపై ఫిర్యాదు చేసింది. పెద్దలు మాట్లాడినా, నచ్చచెప్పే ప్రయత్నం చేసినా ప్రియాంక అంగీకరించలేదని తెలిపారు. విచారణ పేరుతో సీఐ రాజశేఖర్ వేధించారని ఆరోపించారు. కేసు పరిష్కారానికి నెల గడువు ఇవ్వమని అడిగినా తమ మాట వినలేదని వాపోయారు. ఈ మానసిక ఒత్తిడితోనే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని తేజ తల్లి, బంధువులు ఆరోపించారు. సూసైడ్ నోట్లో నిన్ను ప్రేమించానని.. జరగనిది జరిగినటు్ల్ నిందలు వేయడాన్ని తట్టుకోలేకపోతున్నానని భార్యనుద్దేశించి తేజమూర్తి పేర్కొన్నాడు. తన మృతికి ప్రియాంక తండ్రి తవ్వ సత్యనారాయణ, అక్క సౌజన్య, మావయ్య సురేష్ కారణమని రాశాడు. తనకు తగిన న్యాయం చేసే వరకు పోరాడాలని బంధువులను కోరాడు. తల్లిని జాగ్రత్తగా చూసుకోవాలని సూచించాడు. ఈ సంఘటనలో తేజ కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు, ఆర్యవైశ్య సంఘ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తేజమూర్తి మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి పంపించారు. కేసును రైల్వే ఎస్సై డీ.నర్సింహరావు దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నాం ఏలూరు టౌన్: తేజ మూర్తి ఆత్మహత్య ఘటనలో వన్‌టౌన్ సీఐపై ఆరోపణలు వచ్చాయని.. వాస్తవాలపై శాఖాపరమైన విచారణ చేస్తున్నామని, అసత్య ప్రచారాలు చేయవద్దని ఏలూరు డీఎస్పీ ఈ.శ్రీనివాసులు తెలిపారు. తేజమూర్తి భార్య ఫిర్యాదు మేరకు సీఐ ఇరు పక్షాల కుటుంబ సభ్యులు, పెద్దల సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారని తెలిపారు. సూసైడ్ నోట్లో మృతుడు సీఐ తనను వేధించినట్లు చెప్పలేదన్నారు. చట్టం మేరకే సీఐ విచారణ చేశారని, బాధితులకు న్యాయం చేస్తామన్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
బ్యాంకు ఉద్యోగంపై బదిలీ.. ఇద్దరు పిల్లలున్నా అక్కడ మరో వ్యక్తితో..
చైతన్యపురి: కట్టుకున్న భార్య పరాయి వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో మనస్తాపానికి లోనైన ఆమె భర్త పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దిల్సుఖ్నగర్ పీఅండ్‌టీ కాలనీకి చెందిన శేఖర్ (36)కు మల్కాజ్‌గిరికి చెందిన నాగాంజలితో 2014లో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. హైదరాబాద్‌లోని కేంద్ర సహకార బ్యాంకు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న నాగాంజలి ఏడాది క్రితం డీజీఎంగా ఆదిలాబాద్‌కు బదిలీపై వెళ్లింది. అప్పటి నుంచి ఇద్దరు పిల్లలతో అక్కడే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు నాబార్డ్‌లో పనిచేసే తేజ స్వరూపరెడ్డితో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. తరచూ ఫోన్లో వీడియోకాల్‌తో మాట్లాడుతుండటాన్ని గుర్తించిన ఆమె భర్త శేఖర్ నిలదీయగా తప్పు ఒప్పుకుని మరోసారి తప్పుచేయనని పెద్దల సమక్షంలో హామీ ఇచ్చింది. అయితే, అందుకు భిన్నంగా ఆదిలాబాద్‌లో నాగాంజలి, స్వరూపారెడ్డి సహజీవనం చేస్తున్నారు. ఆదిలాబాద్ వెళ్లినప్పటి నుంచి తనను పట్టించుకోవటం లేదని, పిల్లలను కూడా చూపించటం లేదని భర్త శేఖర్ మనస్తాపానికి లోనయ్యాడు. ఫోన్ చేస్తే నీచంగా మాట్లాడింది. అంతేకాక ఆదిలాబాద్‌లో శేఖర్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. బయటకు వచ్చిన తర్వాత భర్తను దుర్భాషలాడటంతో మనస్తాపానికి లోనైన అతను ఈనెల 8న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. కాగా,అంతకు ముందుకు అతను భార్య ప్రవర్తనపై సెల్ఫీ వీడియో తీసుకున్నట్లు గుర్తించారు. శనివారం రాత్రి మృతుడి తండ్రి శరభయ్య ఫిర్యాదు మేరకు సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. తమ కుమారుడు ఆత్మహత్యకు కారణమైన కోడలు నాగాంజలి, ఆమె తల్లిదండ్రులు, ప్రియుడు స్వరూపరెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరాడు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఆదిలాబాద్ పంపించినట్లు పోలీసులు తెలిపారు. -
ఇంటి నుంచి వెళ్లిపోయి ప్రియుడితో పెళ్లి.. ఆ ఫోటోలను భర్తకు పంపి
సాక్షి, మైసూరు: కట్టుకున్న భార్య ఇల్లు విడిచి వెళ్లి ప్రియుడిని పెళ్లి చేసుకుందని మనోవేదనకు గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హుణసూరు తాలూకా కొయమత్తూరు కాలనీ గ్రామంలో జరిగింది. దీంతో ఓ కుటుంబం వీధినపడింది. పరారై ప్రియునితో పెళ్లి గ్రామానికి చెందిన కృష్ణేగౌడ కుమారుడు సురేశ్ కుమార్ (37), భార్య నేత్ర. వీరికి ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. సురేశ్ కుమార్ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. నేత్ర హుణసూరులోని స్పిన్నింగ్ ఫ్యాక్టరీలో పనికి వెళుతోంది. ఇటీవల నేత్రా కనిపించకుండా పోవడంతో దీంతో భర్త హణసూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణ చేపట్టిన పోలీసులు శివమొగ్గలో ఉన్న నేత్రను గుర్తించారు. భర్తతో ఉండడం ఇష్టం లేక వచ్చేశానని ఆమె తెలిపింది. శివమొగ్గ జిల్లా సొరబ తాలూకా హోళెజోళ గ్రామంలోని గోమంతేశ్వర దేవస్థానంలో ప్రియున్ని పెళ్లి కూడా చేసుకున్నట్లు చెప్పింది. ఇందుకు రుజువుగా తమ వివాహ ఫోటోలను భర్త మొబైల్‌కు కూడా నేత్ర పంపించింది. ఆ ఫోటోలను చూసిన సురేశ్ జీవితం మీద విరక్తి చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వారి ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. చదవండి: (పోలీసు కస్టడీకి హనీట్రాప్ ముఠా.. మరింత మంది స్వాములకు యువతి వల?) -
మరో వ్యక్తితో భార్య చనువు, వివాహేతర సంబంధం.. భర్త హెచ్చరించినా..
సాక్షి, పశ్చిమగోదావరి: భార్య మరో వ్యక్తితో చనువుగా ఉంటూ వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తుండడం భరించలేని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన ఏలూరు టూటౌన్ సీఐ డీవీ రమణ నిందితుల్ని అరెస్టు చేశారు. సీఐ వివరాలు వెల్లడిస్తూ.. ఏలూరు నగరంలోని చాణక్యపురి కాలనీ 1వ రోడ్డు ప్రాంతానికి చెందిన పెరుమాళ్ళ సంతోష్(30)కు రామకుమారితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. సంతోష్ కూలి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే రామకుమారి పీ.రూపగోవింద్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగించేది. ఈ విషయం తెలుసుకున్న భర్త సంతోష్ భార్యను అనేకసార్లు హెచ్చరించాడు. అయినా ప్రవర్తన మార్చుకోకుండా భర్త ఇంట్లో ఉండగానే గోవింద్‌తో చనువుగా ఉండేది. ఈ క్రమంలో గత నెల మార్చి 29న భర్త బయటకు వెళ్ళి ఇంటికి వచ్చే సరికి రామకుమారి గోవిందుతో ఏకాంతంగా ఉండటాన్ని గుర్తించాడు. నిందితుల్ని అరెస్టు చేసిన టూటౌన్ సీఐ రమణ దీంతో తీవ్ర మనోవేదనకు గురైన సంతోష్.. తన మరణానికి భార్య, ప్రియుడు గోవిందు కారణమని తల్లిదండ్రులకు చెప్పి, అదేరోజు సాయంత్రం ఇంటివద్ద ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. టూటౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రామకుమారి, గోవింద్‌ను అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చగా 14 రోజులు రిమాండ్ విధించారు. చదవండి: యువకుడితో భార్య టిక్‌టాక్.. సహించలేకపోయిన భర్త.. చివరికి.. -
ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్.. భర్తపై అనుమానంతో..
సాక్షి, చిలకలగూడ: భర్తపై అనుమానంతో భార్య ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. సీఐ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం.. వారాసిగూడకు చెందిన శ్రీకాంత్, సరిత భార్యాభర్తలు. వాటర్ ఫ్యూరిఫైర్ బిజినెస్ చేస్తున్న శ్రీకాంత్ తన ఫోన్లో కాల్ రికార్డింగ్ ఆప్షన్‌ను ఎప్పుడు యాక్టివేట్‌లోనే ఉంచుతాడు. శ్రీకాంత్ కాల్ రికార్డింగ్‌లను విన్న సరిత భర్తపై అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. ఇదే విషయమై శుక్రవారం ఉదయం ఇరువురి మధ్య తగాదా జరిగింది. బిజినెస్ పనిమీద శ్రీకాంత్ బయటకు వెళ్లగా సరిత ఇంట్లోని ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చిన శ్రీకాంత్ ఎంత కొట్టిన తలుపు తీయకపోవడంతో స్థానికుల సాయంతో తలుపులు బద్దలు కొట్టి చూడగా సరిత ఉరికి వేలాడుతూ కనిపించింది. మృతురాలి సోదరుడు ముప్పిడి ప్రశాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ నరేష్ తెలిపారు. చదవండి: బాలికను వంచించి.. గర్భవతిని చేసిన ఆటో డ్రైవర్.. -
రెండో పెళ్లి.. భార్య విలాసాలు తీర్చలేక..
యశవంతపుర (కర్ణాటక): భార్య విలాసాలు తీర్చలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెంగళూరు బసవేశ్వర పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్న బాషా(31) ఉస్నా అనే మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమె గర్భిణి. పట్టుచీరెలు, నగలు కొనివ్వాలని పదే పదే కోరేది. ఇదే విషయంపై ఇద్దరి మధ్య గొడవ జరిగేది. మానసిక ఒత్తిడితో బాషా ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. చదవండి: (బుద్ది తెలుసుకొని ఉన్న ఉద్యోగం పీకేశారు.. మళ్లీ నగ్నఫొటోలు, వీడియోలు..) -
భార్య కాపురానికి రాకపోవడంతో...
-
నా చావుకు భార్య, అత్తింటివారే కారణం..
సాక్షి, దుగ్గొండి(వరంగల్): నన్ను నిత్యం అత్తింటివారు వేధిస్తున్నారు.. భార్య సహా ఆమె కుటుంబ సభ్యులంతా మానసికంగా హింసిస్తున్నారు. వారి హింస భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నా.. నా చావుకు నా భార్య, ఆమె కుటుంబ సభ్యులే కారణమంటూ ఓ యువకుడు వాయిస్ రికార్డు చేసి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం దేశాయిపల్లిలో శనివారం జరిగింది. దేశాయిపల్లికి చెందిన తుత్తూరు ప్రదీప్(25)కు భార్యతో, ఆమె కుటుంబ సభ్యులతో నిత్యం గొడవలు జరుగుతున్నాయి. వారి వేధింపులు భరించలేక ఈ నెల 19న బంధంపల్లికి చేరుకున్న ప్రదీప్.. తన చావుకు భార్యతో పాటు ఆమె తరుఫు బంధువులే కారణమని వాయిస్ రికార్డు చేసి తండ్రి నగేష్‌కు పంపి గడ్డిమందు తాగాడు. అక్కడికి చేరుకున్న కుటుంబ సభ్యులు హన్మకొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రదీప్ శనివారం మృతి చెందాడు. మృతుని తండ్రి నగేష్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ట్రెయినీ ఎస్సై మహేందర్ తెలిపారు. చదవండి: ఏడేళ్ల విడాకుల కొట్లాట: ఇగోతో బిలియన్ల కోసం..! ఇది వీళ్ల కథ.. -
అత్తింటి వేధింపులు: యువకుడి ఆత్మహత్య
సాక్షి, సంగెం: అత్తింటి వేధింపులు భరించలేక ఓ యువకుడు మనస్తాపం చెంది పెట్రోల్‌పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ ఆటోనగర్ తుమ్మలకుంటకు చెందిన పిండి దేవేందర్ (25)కు సంగెం మండలం కోట వెంకటాపూర్‌కు చెందిన న్యాల అనూష అలియాస్ లావణ్యతో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. గత కొంత కాలం నుంచి అత్తగారి తరఫున గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 9వ తేదీన అత్త న్యాల రాజమ్మ, బావమరిది అనిల్, భార్య అనూష వారి బంధువులు న్యాల బుచ్చయ్య, రవి, ప్రసాద్‌లు చెట్టుకు కట్టేసి దేవేందర్‌ను బూతులు తిట్టుతూ కొట్టారు. అప్పటి నుంచి మనస్తాపం చెందిన దేవేందర్ 16వ తేదీన పిల్లలను చూసి వస్తానని అత్తగారింటికి వెళ్లాడు. అత్తింటి వారు పిల్లలను చూపించకుండా ఏ ముఖం పెట్టుకుని వచ్చావని అవమానపరిచారు. దీంతో మనస్తాపం చెందిన దేవేందర్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని తల్లికి ఫోన్ చేశాడు. వెంటనే వచ్చి 108లో ఎంజీఎంకు తరలించి చికిత్స చేయిస్తుండగా సోమవారం మృతి చెందాడు. మృతుడి తల్లి పిండి కమలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సురేష్ తెలిపారు. -
బుల్లితెర నటి భర్త ఆత్మహత్య
చెన్నై ,పెరంబూరు: బుల్లితెర నటి భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన పెరంబూరు ప్రాంతంలో కలకలానికి దారి తీసింది. ఈ వివరాలు చూస్తే స్థానిక పెరంబూరు, నటరాజన్ కోవిల్ వీధికి చెందిన గోపీనాథ్ (39) అనే వ్యక్తి స్థానిక అన్నానగర్, టీవీఎస్ కాలనీలోని ఒక ప్రైవేట్ ప్రచార సంస్థలో కార్యనిర్వాహకుడిగా పనిచేస్తున్నాడు. అతని భార్య రేఖ. ఆమె బుల్లితెర నటి, వ్యాఖ్యత కూడా. కాగా గురువారం ఉదయం గోపీనాథ్ పనిచేస్తున్న కార్యాలయాన్ని తెరవడానికి కార్మికులు వచ్చారు. వారు లోనికి వెళుతుండగా గోపీనాథ్ గదిలో ఉరి వేసుకుని వేలాడుతున్న దృశ్యం కంటపడింది. జేజే.నగర్ పోలీసులు మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వ ఆస్పత్రికి పోస్ట్‌మార్టానికి పంపారు. కాగా భార్య రేఖతో గొడవ కారణంగానే గోపీనాథ్ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. గోపీనాథ్ పదేళ్ల క్రితం రేఖను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. ప్రస్తుతం రేఖ ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో పని చేస్తోంది. గత ఆరు నెలల క్రితమే గోపీనాథ్ జేజే.నగర్‌లోని ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగానికి చేరినట్లు, అదే సంస్థలో పని చేస్తున్న ఓ యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలిసింది. ఈ విషయమై గోపీనాథ్‌కు రేఖకు మధ్య తరచూ గొడవలు జరిగేవని, గురువారం కూడా భార్యతో గొడవ పడి తన కార్యాలయానికి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు విచారణలో తెలిసింది. అప్పుల బాధ కూడా ఉన్నట్లు తెలిసింది. -
భర్త ఆత్మహత్య : ముగ్గురు పెళ్లాల ఘర్షణ
సాక్షి ప్రతినిధి, చెన్నై: నిండా ముప్పై ఏళ్లు కూడా రాకమునుపే ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురిని పెళ్లాడాడు. ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడిగా ఒకేచోట కాపురం చేస్తూ అకస్మాత్తుగా ఆత్మహత్య చేసుకోవడం, భర్త శవం కోసం ముగ్గురు పెళ్లాలు పోరాటానికి దిగిన సంఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాలు... పుదుచ్చేరి కేంద్రపాలిత రాష్ట్రం రెడ్డియార్‌పాళంకు చెందిన సింగారవేలు(30) అనే యువకుడు సత్య అనే యువతిని వివాహమాడాడు. అయినా పెళ్లిపై మోజు తీరక ధనలక్ష్మి, కావ్య అనే మరో ఇద్దరిని వరుసగా పెళ్లి చేసుకున్నాడు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముగ్గురు భార్యలతో కలిసి కాపురం చేసేవాడని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, కుటుంబసమస్యల కారణంగా సింగారవేలు సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి శవాన్ని పుదుచ్చేరీలోని ఇందిరాగాంధీ వైద్యకళాశాల, ఆసుపత్రికి తరలించారు. ఇంతలో ఆసుపత్రికి చేరుకున్న ముగ్గురు భార్యలు భర్త శవాన్ని తమకే అప్పగించాలంటూ ఎవరికి వారు పోటీపడ్డారు. ఒక దశలో వివాదం ముదిరిపోగా ముగ్గురు ఘర్షణకు దిగారు. దీంతో పోలీసులు కలుగజేసుకుని మంగళవారం పంచాయితీ చేసి పెద్దభార్య సత్యకు సింగారవేలు శవాన్ని అప్పగించారు. -
పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగిరాలేదని..
సాక్షి, మర్పల్లి(రంగారెడ్డి) : పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి కాపురానికి రాలేదని మనస్తాపానికి గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మర్పల్లి మండల పరిధిలోని షాపూర్ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. మర్పల్లి ఎస్ఐ వెంకటనారాయణ, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. షాపూర్ గ్రామానికి చెందిన బానోతు తుకారాం (30) సంగారెడ్డి జిల్లా మెగడంపల్లి మండలం పగిడాలతండాకు చెందిన తుకారాం కూతురు సక్కీబాయితో 2006లో వివాహం జరిగింది. కొన్నాళ్లు షాపూర్‌లోని ఇంటివద్దనే ఉన్న దంపతులు బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. తుకారాం ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో రెండు నెలల క్రితం కుటుంబ విషయమై భార్యభర్తలు గొడవపడ్డారు. మనస్తాపం చెందిన సక్కీబాయి హైదరాబాద్ నుంచి పుట్టింటికి చేరింది. దీంతో తుకారాం షాపూర్‌కు వచ్చాడు. జరిగిన గొడవ విషయమై ఇరువురు వారి కుటుంబ సభ్యులకు తెలిపారు. భార్యను కాపురానికి తీసుకువచ్చేందుకు తుకారాం పగిలాడతండాకు నాలుగు సార్లు వెళ్లాడు. ప్రతీ సారి సక్కిబాయి తల్లిదండ్రులు, బావమరిది దుర్భాషలాడి పంపేవారు. మూడు రోజుల క్రితం తన భార్య సక్కీబాయిని కాపురానికి పంపాలని అత్తామామలకు ఫోన్ చేశాడు. సక్కీబాయి తల్లి తమ కూతురును పంపించేది లేదని, మరొకరికి ఇచ్చి వివాహం చేస్తానని చెప్పింది. మనస్తాపానికి గురైన తుకారాం షాపూర్‌లోని తన ఇంట్లో సోమవారం పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం సోమవారం సాయంత్రం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. ఈ విషయమై మృతుడి తల్లి మంగళవారం మర్పల్లి పోలీసులకు ఫిర్యాదు మేరకు ఎస్ఐ వెంకటనారాయణ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మర్పల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. -
పరాయి పురుషుడితో భార్య పరారీ
కర్ణాటక ,దొడ్డబళ్లాపురం : భార్య పరాయి వ్యక్తితో వెళ్లిపోవడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా హొసహళ్లి గ్రామంలో చోటుచేసుకుంది. కాంతరాజు (40) పదేళ్ల క్రితం భాగ్యమ్మను వివాహం చేసుకున్నాడు. దంపతులకు 9 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భాగ్యమ్మ మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కాంతరాజు తరచూ మందలించేవాడు. దీంతో భాగ్యమ్మ పరాయి వ్యక్తితో ఇల్లు వదిలి వెళ్లిపోయింది. దీంతో కాంతరాజు కలతచెంది తన కష్టం గురించి మొబైల్లో వీడియో తీసి చెప్పుకుని స్వంత స్థలంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనకు సంబంధించి కుదూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మందలించిందని భర్త..
తమిళనాడు, తిరువళ్లూరు: భార్య మందలించిందనే మనస్తాపంతో భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన కవరపేటలో జరిగింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా పంచెట్టి గ్రామానికి చెందిన సత్య, ఏలుమలైకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కొద్ది సంవత్సరాల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో మద్యం భూతం చిచ్చురేపింది. తరచూ మద్యం సేవించి వచ్చే ఏలుమలై భార్యను వేధించేవాడని తెలుస్తుంది. గత శనివారం రాత్రి ఇరువురి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో సత్య తన పుట్టింటికి వెళ్లిపోయింది. మనస్తాపంతో ఉన్న ఏలుమలై తన అక్క మనోన్మణికి ఫోన్ చేసి మద్యం సేవించి వచ్చానని అందరి ముందు సత్య మందలించిందని వాపోయాడు. ఆత్మహత్య చేసుకోవాలని పురుగుల మందు తాగినట్టు తెలిపాడు. వెంటనే అక్కడికి చేరుకున్న మనోన్మణి అపస్మారక స్థితిలో ఉన్న ఏలుమలైను పొన్నేరి వైద్యశాలకు తరలించింది. అక్కడ చిక్సిత పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. కవరపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కొట్టిందని భర్త ఆత్మహత్య
కర్ణాటక, యశవంతపుర: భార్య కొట్టడంతో అవమానంతో భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన దాసరహళ్లి కోకోనట్ గార్డెన్లో జరిగింది. కోకోనట్ గార్డెన్లో కార్మికుడిగా పనిచేస్తున్న దొడ్డయ్యకు (45) పదేళ్ల క్రితం లతతో వివాహం జరిగింది. కుటుంబ కలహాల కారణంగా భార్య లత కుమారుడి ముందే దొడ్డయ్యను కొట్టింది. దీనిని అవమానంగా భావించిన దొడ్డయ్య ఆదివారం ఇంటిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మేమిలాగే ఉంటాం.. చస్తే చావు..
సాక్షి, కరీంనగర్ క్రైం: కొత్తపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివసించే బానోతు శ్రీనివాస్ అవమానభారంతో ఈనెల 14న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నం చేసుకోగా బుధవారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామానికి చెందిన బానోతు శ్రీనివాస్(35) అనే వ్యక్తి 9 ఏళ్ల క్రితం సునిత అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. 5 ఏళ్ల క్రితం జీవనోపాధి కోసం కరీంనగర్‌కు వచ్చి కొత్తపల్లిలోని ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్నాడు. శ్రీనివాస్ ప్రస్తుతం కరీంనగర్ మున్సిపాలిటిలో కాంట్రాక్ట్ లేబర్‌గా పని చేస్తున్నాడు. అయితే శ్రీనివాస్ భార్య సునిత బాషా అనే వ్యక్తితో చనువుగా ఉండడం గమనించిన శ్రీనివాస్ పద్దతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. దీంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. ఈనెల 14న చనువుగా ఉన్న బాషా, సునీతను శ్రీనివాస్ పట్టుకున్నాడు. దీంతో వారిద్దరు శ్రీనివాస్‌పై దాడి చేసి ‘మేము ఇలాగే ఉంటాం నువ్వు సర్దుకుని ఉంటే ఉండు లేకుంటే చచ్చిపో’ అని చెప్పడంతో తీవ్ర మనస్తాపానికి గురైన శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లి రేకుర్తి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శ్రీనివాస్ బుధవారం మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కొత్తపల్లి ఎస్ఐ స్వరూప్‌రాజ్ తెలిపారు. -
ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య
నెల్లూరు,సంగం: ఐదు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చిన భార్యాభర్తల మధ్య చిన్న ఘర్షణ జరగడంతో మనస్థాపానికి గురైన భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈఘటన సంగం–కావలి కాలువ సమీపంలో గురువారం తెల్ల వారుజామున జరి గింది. పోలీసుల సమాచారం మేరకు.. వెంకటాచలం మండలం గొలగమూడికి చెందిన కరేటి సురేంద్ర(38) స్థానికంగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి 15 ఏళ్ల క్రితం వింజ మూరు మండలం గుండెమడగల గ్రామానికి చెందిన శివరావమ్మతో వివాహం అయింది. వీరికి గోవర్ధన్, లాస్యప్రియ పిల్లలు ఉన్నారు. సురేంద్ర అన్ని రకాల వ్యాపారాలు చేసి అప్పుల ఊబిలో కూరుకుపోయాడు. ఇటీవల ఓ ఆటో కొనుక్కుని బతుకుబండిని లాగిస్తున్నాడు. అయితే ఐదు రోజుల క్రితం సురేంద్ర అత్తగారి ఊరు గుండెమడగలకు భార్య, పిల్లలతో వెళ్లాడు. అక్కడే ఉన్న సురేంద్ర బుధవారం రాత్రి ఏదో విషయంలో భార్యతో చిన్న గొడవ పడ్డాడు. మనస్థాపానికి గురైన తాను గొలగమూడికి వెళ్లి చనిపోతానని ఇంట్లో చెప్పి వచ్చేశాడు. గురువారం తెల్లవారు జామున కావలి కాలువ సమీ పంలో డాబా వెనుక వైపునున్న నేరుడు చెట్టుకు ఉరేసుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారుమున బహిర్భూమికి వెళ్లిన స్థానికులు గమనించి ఎస్సై నాగార్జునరెడ్డికి సమాచారం ఇచ్చారు. ఎస్సై ఘటనా స్థలా న్ని పరిశీలించి, మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం చేసి బ«ంధువులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఒక తప్పిదం..రెండు కుటుంబాల్లో విషాదం
యాచారం : వివాహేతర సంబంధం ఘటన రెం డు కుటుంబాల్లో విషాదం యాచారం మం డలం నక్కర్తమేడిపల్లి గ్రామానికి చెందిన లలిత అదే గ్రా మానికి చెందిన ఓ వ్యక్తితో అక్రమ సంబంధంపై మనస్తాపంచెందిన ఆమె భర్త లింగం శనివారం రాత్రి ఇంట్లో ఊరేసుకుని ఆత్మహత్యకు పా ల్పడ్డాడు. అయితే లింగం మరణానికి ఆయన భార్య లలిత అక్రమ సంబంధమే కారణమంటు గ్రామస్తులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆదివారం రాత్రి లలితను పోలీసులు అరెస్టు చేశారు. భార్య లలిత లేకుండా సోమ వా రం నక్కర్తమేడిపల్లిలో లింగం అంత్యక్రియలు పూర్తి చేశా రు. సోమవారం జరిగిన లింగం అంత్యక్రియల్లో బంధువులు, గ్రామస్తులు.. నీ బిడ్డ వివాహేతర సంబంధమే లింగం ప్రాణతీసిందని లలిత తండ్రి బీరయ్యను మందలించారు. గ్రామస్తుల సూటిపోటి మాటలతో మనస్తాపం చెందిన బీరయ్య సోమవారం రాత్రి కొత్తపల్లి గ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రి మార్చురికి తరలించి పోస్టుమార్టం అనంతరం మంగళవారం మృతదేహన్ని కొత్తపల్లికి తరలించారు. భర్త మృతికి కారణమైన లలితను మంగళవారం పోలీసులు రిమాండ్‌కు పంపించారు. వివాహేతర సంబంధం వల్ల భర్త ఆత్మహత్య చేసుకోవడం.. ఆమె జైలు పాలు కావడం, ముగ్గురు చిన్నారులు అనాథలుగా మారడం.. తండ్రి ఆత్మహత్య చేసుకోవడంతో నక్కర్తమేడిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లోని రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. -
వివాహేతర సంబంధం బయటపడిందని..
మేడ్చల్: పక్కింటి మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ఓ వ్యక్తి భార్యకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోవడంతో అవమానం భరించలేక ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అక్బార్జాపే ట్ గ్రామానికి చెందిన పద్మారావు ఆదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబం ధం కొనసాగిస్తున్నాడు. ఈనెల 20న అతను సదరు మహిళతో కలిసి తుర్కపల్లి బస్‌స్టాండ్‌లో నిలిచి ఉండగా అదే సమయంలో అక్కడికి వచ్చిన పద్మారావు భార్య శిరీష వారిని నిలదీసింది. అనంతరం పద్మారావు భార్య, ఆ మె స్నేహితురాలిని కారులో ఘనాపూర్ క్షేత్రగి రి వెంకటేశ్వర గుడి వద్ద దించి ఇంటికి వచ్చా డు. శుక్రవారం గ్రామ సమీపంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.మేడ్చల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కాపురానికి రాలేదని..
మదనపల్లె క్రైం : భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోవడంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు గురువారం రాత్రి జనం చూస్తుండగానే మదనపల్లె బస్టాండులో ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రం గా గాయపడి చావుబతుకుల మధ్య ఉన్న అతన్ని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఒకటో పట్టణ పోలీసులు, బాధితుని కుటుంబ సభ్యుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం పోతులప్ప వీధిలో కాపురం ఉంటున్న కె.వెంకటరమణ కుమారుడు విజయ్‌కుమార్(35) కూరగాయల వ్యాపారంతో భార్య, పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐదు నెలల క్రితం విజయ్‌కుమార్ భార్య అలిగి తన బిడ్డను తీసుకుని పుట్టినిల్లు వైఎస్సార్ జిల్లాకు వెళ్లిపోయింది. కాపురానికి రావాలని పలుమార్లు కోరినా ఆమె వినలేదు. భార్య, బిడ్డ లేకపోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. గురువారం రాత్రి స్థానిక బెంగళూరు బస్టాండులో జనం చూస్తుండగానే శరీరంపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని ఆటో డ్రైవర్లు, స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఒకటో పట్టణ ఎస్ఐ సుమన్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడితో ఉంటానని భార్య చెప్పడంతో..
అన్నానగర్: భార్య మరొకరితో వివాహేతర సంబంధం కొనసాగించడాన్ని భరించలేక ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యకు కారణమైన భార్య, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తాంబరంలో చోటుచేసుకుంది. చెన్నై, తాంబరం సమీపంలోని సంతోషపురం పార్కు వీధికి చెందిన రాజన్ (31) విజయనగర్ ప్రాంతంలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో వ్యాన్ డ్రైవర్ గా పనిచేస్తుండేవాడు. ఇతని భార్య సీతాలక్ష్మి. వీరికి శృతి (6), వినీష్ (5) సంతానం. ఈ క్రమంలో గత శనివారం ఉదయం రాజన్ తల్లిదండ్రులు గది తలుపుకొట్టగా అతడు తలుపు తెరవలేదు. తల్లిదండ్రులు స్థానికుల సహాయంతో తలుపు పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా ఫ్యాన్‌కి రాజన్ ఉరి వేసుకుని శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న సేలైయూర్ పోలీసులు ఘటన స్థలానికి వచ్చి రాజన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం క్రోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తన చావుకు భార్య, ఆమె ప్రియుడు ఐవర్‌రాజ్ కారణమని రాజన్ రాసిన సూసైట్‌నోట్ పోలీసులకు లభ్యమైంది. సంతోషపురం ప్రాంతంలో జిరాక్స్ షాపు నడుపుతున్న ఐవర్‌రాజ్‌తో గత మూడేళ్లుగా వివాహేతర సంబంధం ఉన్నట్టు పోలీసుల విచారణలో సీతాలక్ష్మి అంగీకరించింది. ఈ విషయం తెలిసి భర్త తనను మందలించగా.. తాను పిల్లలను రాజన్ వద్ద వదలి పుట్టింటికి వెళ్లినట్లు చెప్పింది. తప్పు సరిదిద్దుకునే అవకాశమిస్తూ కాపురానికి రావాలని భార్యకు ఫోన్ చేశాడని పోలీసులు చెప్పారు. ప్రియుడు ఐవర్‌రాజ్‌తో కలిసి జీవిస్తానని, కాపురానికి రానని చెప్పడంతో మనస్తాపం చెందిన రాజన్ ఆత్మహత్య చేసుకున్నాడు. రాజన్ ఆత్మహత్యకి కారణమైన సీతాలక్ష్మిని, ఐవర్‌రాజ్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచి జైలుకు తరలించారు. -
భార్య మరొకరితో వెళ్లిపోయిందని..
ఉప్పల్(హైదరాబాద్ సిటీ): భార్య మరొకరితో వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేని భర్త మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. చిలుకానగర్ కుమ్మరికుంట ప్రాంతానికి చెందిన కనికటి యాకయ్య(31)కు రవళి(22)తో నెల క్రితం వివాహం జరిగింది. కుమ్మరికుంటలో కాపురం పెట్టారు. కొద్దిరోజులు సాఫీగానే జరిగిన వీరి సంసారంలో చిచ్చు మొదలైంది. ఈ నెల 21వ తేదీన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పిన రవళి నగలను సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన భర్త ఈ నెల 22వ తేదీన ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ మధ్యలో భర్తకు ఫోన్ చేసిన భార్య రవళి తాను మరొకరితో వెళ్లిపోతున్నానని చెప్పడంతో జీర్ణించుకోలేక మనస్తాపం చెంది విషం తాగి ఉప్పల్ పోలీస్‌స్టేషన్ వైపు నడుచుకుంటూ వెళ్లున్నాడు. మార్గమధ్యంలోనే నోట్లో నుంచి నురగలు కక్కుతూ రోడ్డు మీద పడిపోయాడు. స్థానికులు ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యాకయ్య మృతిచెందాడు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రేమ వివాహం.. అంతలోనే ఆత్మహత్య
మాలూరు (బెంగళూరు) : నెల రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్న యువకుడు అంతలోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మాలూరులోని మారుతీ కాలనీలో చోటు చేసుకుంది. నల్లాండహళ్లి గ్రామానికి చెందిన సుధాకర్ (28) స్థానిక మాడ్రన్ పాఠశాల వద్ద అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. సమీపంలోని పారిశ్రామిక వాడలో ఓ ఫ్యాక్టరీలో పని చేసేవాడు. మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన యశోద అనే యువతిని సుధాకర్ ప్రేమించాడు. నెల రోజుల క్రితం ఆమెను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం పనికి వెళ్లిన సుధాకర్ సాయంత్రం ఇంటికి చేరుకొని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణ పోలీసులు మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు భావిస్తున్నారు. -
భార్యాబిడ్డల కిడ్నాప్‌తో ఓ భర్త అఘాయిత్యం!
శివాజీనగర (హావేరి): అప్పు తిరిగి చెల్లించలేదనే కారణంతో వ్యక్తి తన భార్య, బిడ్డలను కిడ్నాప్ చేయటంతో ఈ అవమానాన్ని తట్టుకోలేక భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కర్ణాటకలోని హావేరిలో చోటు చేసుకుంది. హుబ్లీలో నివాసముంటున్న ఉదయ్ తన వ్యక్తిగత అవసరం నిమిత్తం పవన్ అనే వ్యక్తి నుంచి రూ.లక్ష అప్పు తీసుకున్నాడు. అయితే ఉదయ్ అప్పు తిరిగి ఇవ్వలేదు. అప్పులవారి వేధింపులను తట్టుకోలేక ఉదయ్ తన భార్య, పిల్లలతో హుబ్లీని విడిచి హావేరికి చేరుకున్నాడు. హావేరికి తన అనుచరులతో వచ్చిన పవన్, ఉదయ్ భార్య, బిడ్డలను బలవంతంగా తీసుకుని వెళ్లాడు. దీంతో ఆవేదన గురైన ఉదయ్ ఇంటిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై స్థానికులు పవన్, అతని అనుచరులపై దాడి చేశారు. పోలీసులు పవన్, అతని అనుచరులు అదుపులోకి తీసుకున్నారు. -
మద్యం తాగొద్దని భార్య మందలించడంతో!
నెల్లూరు(క్రైమ్): మద్యం తాగొద్దని భార్య మందలించడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నెల్లూరు నగరంలోని నవాబుపేట ఎన్సీ బాలయ్యనగర్‌కు చెందిన పీ. చెంచయ్య(32), లావణ్య భార్యాభర్తలు. వారికి 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. చెంచయ్య అదే ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఇటీవల ఆయనకు వైద్యులు అపెండిసైటిస్ శస్త్ర చికిత్స కూడా చేశారు. మద్యం సేవిస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు. అయినా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు. పలుమార్లు మద్యం సేవించి రావడంతో లావణ్య అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసింది. అయినా అతను పట్టించుకోలేదు. ఈ నెల ఒకటిన చెంచయ్య ఫూటుగా మద్యం సేవించాడు. మరోసారి తాగితే ఊరుకోనని లావణ్య అతనిని మందలించింది. దీంతో మనస్తాపం చెందిన చెంచయ్య చెదలు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అప్పటినుంచి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించి రెండో నగర ఎస్ఐ తిరుపతయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘శృతి’ మించిన కోర్కెలు
భర్తను బెదిరించిన భార్య వేధింపులు తాళలేక భర్త ఆత్మహత్య మైసూరు : కారు కొనివ్వడంతోపాటు తన చెల్లెలి ఉద్యోం కోసం లక్షల రూపాయల నగదు ఇవ్వాలని భార్య వేధించడంతో భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఆదివారం కర్ణాటకలోని మైసూరు నగరంలో ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. నగరంలోని విద్యాశంకర లేఅవుట్‌కు చెందిన మిథున్(28)కు మైసూరు నగరానికి చెందిన శృతి అనే యువతితో ఏడాది క్రితం వివాహమైంది. కొద్ది రోజుల తర్వాత భార్య వేధింపులు మొదలు పెట్టింది. తనకు కారు కొనివ్వాలని, తన చెల్లెలికి ఉద్యోగం ఇప్పించడానికి రూ.25 లక్షల డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేసేది. మొదట్లో శృతి కోరికలను మిథున్ తేలిగ్గా తీసుకున్నాడు. అయితే రోజురోజుకు శృతి కోరికల జాబితా పెరిగిపోయింది. వాటిని తీర్చడం తనవల్ల కాదని మిథున్ చెప్పేవాడు. తనకు కారుతో పాటు చెల్లెలి ఉద్యోగానికి డబ్బు ఇవ్వకుంటే మీతోపాటు మీ కుటుంబంపై కూడా అదనపు కట్నం వేధింపులు కేసు పెడతానంటూ బెదిరించడం ప్రారంభించింది. శృతి బెదిరింపులు తాళలేక మిథున్ ఈనెల 18న తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా కోడలు శృతి బెదిరింపులు, మానసికంగా వేధించడంతోనే తన కుమారుడు ఆత్మహత్యకు పాల్పడినట్లు మిథున్ తండ్రి వెంకటేశ్‌గౌడ ఆదివారం ఉదయగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
కంబదురు: భార్య మృతిని తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కంబదురు మండలం నూతిమడుగులో శుక్రవారం వెలుగు చూసింది. గ్రామానికి చెందిన వడ్డె హనుమంతు, జయమ్మ దంపతులు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం జయమ్మ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన హనుమంతు(38) ఈ రోజు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భార్య అదృశ్యం.. భర్త ఆత్మహత్య
దండేపల్లి: భార్య కనిపించకుండా పోవటంతో మనస్తాపం చెందిన భర్త బలవన్మరణం చెందాడు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చుంచు రమేష్(35) భార్య సునీత రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయింది. భార్య కోసం ఎంత వెతికినా జాడ దొరకలేదు. దీనిపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రమేష్ శుక్రవారం రాత్రి తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలికి చేరుకున్నారు. -
భార్య అలా అన్నందుకు...
నార్సింగి (మహబూబ్‌నగర్): మద్యం మానేయమని భార్య చెప్పిందనే కోపంతో ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్‌పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన ఎల్లప్ప(35), పద్మ దంపతులు జీవనోపాధి కోసం వచ్చి పీరంచెరువు ప్రాంతంలో నివసిస్తున్నారు. పద్మ స్థానికంగా ఇళ్లలో పని చేస్తుండగా ఎల్లప్ప ఎలక్ట్రీషియన్ పనులు చేసేవాడు. మద్యానికి బానిసగా మారిన ఎల్లప్పను పద్మ తాగవద్దంటూ హెచ్చరిస్తోంది. ఈ విషయమై శుక్రవారం రాత్రి వారి మధ్య గొడవ జరిగింది. శనివారం ఉదయం పద్మ కుమారుడిని తీసుకోని ఇళ్లలో పని చేసేందుకు వెళ్ళింది. మధ్యాహ్నం ఇంటికి రాగా ఎల్లప్ప ఉరికి వేలాడుతూ కనిపించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య తిట్టిందని..
దొరవారిసత్రం: భార్య తిట్టిందని మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ సంఘటన నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం మీజూరు గ్రామంలో బుధవారం అర్ధరాత్రి దాటాక చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మునిరామయ్య(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన మునిరామయ్యను మద్యం మానేయమని భార్య పలుమార్లు చెప్పింది. బుధవారం రాత్రి మద్యం సేవించి రావడంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో మద్యం మత్తులో ఉన్న మునిరామయ్య ఒంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటిచుకోవడంతో తీవ్ర గాయాలై మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
మానవపాడు: సెల్‌ఫోన్ కోసం తీసుకెళ్లిన డబ్బులు ఏమి చేశావని భార్య అడిగినందుకు అడిగినందుకు క్షణికావేశంలో భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా మానవపాడులో వెలుగులోకి వచ్చింది. చిన్నఅముదాలపాడుకు చెందిన నరసింహ, అతని భార్య జంగాల మహేశ్వరమ్మ రోజువారీ కూలీలు. పనిచేసుకుంటూ కొంత డబ్బు జమ చేసుకున్నారు. ఆ డబ్బుతో కొత్తసెల్‌ఫోన్ కొనాలని భావించిన నరసింహ.. గత నెల 24న భార్యతో గొడవ పడి ఇంట్లో ఉన్న రూ.6 వేలు తీసుకెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి ఇంటికి వచ్చిన నరసింహను సెల్‌ఫోన్ కొన్నావా.. డబ్బులు ఎక్కడ పెట్టావని భార్య మహేశ్వరమ్మ అడిగింది. క్షణికావేశానికి గురైన నర్సింహ ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. -
భార్య ఎడబాటుతో.. భర్త ఆత్మహత్య
పగిడ్యాల(కర్నూలు జిల్లా): భార్య ఎడబాటును జీర్ణించుకోలేని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. నెహ్రూనగర్ గామానికి చెందిన రమేష్(32)కు మిడుతూరు గ్రామానికి చెందిన అరుణ అనే యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్యభర్తలు రెండేళ్లపాటు అన్యోన్యంగా సంసారం సాగించాక విభేదాలు తలెత్తాయి. పెద్దలతో పంచాయతీ నిర్వహించి రమేష్ భార్యను కాపురానికి పిలిపించుకున్నాడు. అయితే మళ్లీ ఏడాది పాటు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో భార్య అరుణ పుట్టింటికి వెళ్లిపోయింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ఒంటరిగా జీవించలేక మనోవేదనకు గురై బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
భువనగిరి అర్బన్: భార్య మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లాలోని భువనగిరి-పగిడిపల్లి రైల్వే స్టేషన్ల మధ్యలో రైలు పట్టాలపై శుక్రవారం ఓ వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతుడు రాళ్లజనగాం గ్రామానికి చెందిన కందుకూరి రాజారామ్(45)గా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. వడ్రంగి పని చేసే రాజారామ్ మద్యానికి బానిస కావడంతో భార్య వినోద మందిలించింది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని భర్తకు సూచించింది. దీంతో మనస్తాపం చెందిన రాజారామ్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. -
దంపతుల ఆత్మహత్యాయత్నం: భర్త మృతి
భువనగిరి (నల్లగొండ): భర్త ఆత్మహత్య చేసుకోవడం చూసి మనస్తాపం చెందిన భార్య ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా భువనగిరిలోని తాతానగర్‌లో జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన జట్కా పూర్ణచందర్ (27) స్థానిక ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఈ మధ్యనే పట్టణానికి చెందిన కీర్తి (22) తో వివాహమైంది. పూర్ణచందర్‌కు ఆదివారం సెలవు కావడంతో ఇంట్లోనే ఉన్నాడు. ఈ క్రమంలో భార్య పక్క గదిలో ఉన్న సమయంలో బెడ్రూంలోని ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బెడ్రూంలోకి వెళ్లిన భర్త ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో.. కిటికి తెరచి చూసిన భార్య భర్త ఫ్యాన్‌కు వేలాడుతుండటంతో.. ఆవేదనకు గురై ఒంటిమీద కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న స్థానికులు నిప్పంటించుకోకుండా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికే కీర్తి కిరోసిన్ తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. -
‘చికెన్’ లొల్లి.. భర్త ఆత్మహత్య
జగద్గిరిగుట్ట: భార్యతో గొడవ పడి భర్త ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం కూకట్పల్లి రామకృష్ణానగర్‌లో నివాసం ఉండే కారు డ్రైవర్ మధు(27) ఆదివారం సినిమాకు వెళ్లి వచ్చాడు. సాయంత్రం చికెన్ తీసుకురమ్మని భార్య జ్యోతితో గొడవ పడ్డాడు. ఆమె డబ్బులు లేవని చెప్పడంతో ఇరువురి మధ్య వాగ్వాదం నెలకుంది. అనంతరం చికెన్ తెచ్చేందుకు జ్యోతి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి మధు ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. దీంతో స్థానికులు సహాయంతో మధును ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్య కాపురానికి మనస్తాపంతో భర్త ఆత్మహత్య
మహబూబ్‌నగర్: జిల్లాలోని వీపనగండ్ల మండలపరిధిలోని మియాపూర్ గ్రామానికి చెందిన సీతాపురం రాముడు(40) అనే వ్యక్తి భార్య కాపురానికి రాలేదని శనివారం రాత్రి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. నిప్పంటించుకున్న అతన్ని చికిత్స నిమిత్తం వనపర్తి ఏరియా ఆస్పత్రికి వాహనంలో తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 18 ఏళ్ల క్రితం కొల్లాపూర్‌కు చెందిన శ్యామల అనే మహిళతో రాముడుకు వివాహం జరిగింది. ఏడేళ్లుగా భార్య కాపురానికి రాకుండా తన స్వగ్రామంలో ఉండటంతో శనివారం ఉదయం భర్త కొల్లాపూర్ వెళ్లి గొడవ పడినట్లు, అదే క్రమంలో మనస్తాపానికి గురైన అతను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న ఎస్సై జి.రవిబాబు ఆస్పత్రికి వెళ్లి ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
టీపొడి విషయంలో గొడవ.. భర్త ఆత్మహత్య
రంగారెడ్డి(తుర్కయంజాల్): టీపొడి విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త ఆత్మహత్యకు దారితీసింది. వనస్థలిపురం పోలీసుల కథనం ప్రకారం... రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గున్గల్ గ్రామానికి చెందిన దేవోజి రవి(40), భార్య చందన, ఇద్దరు పిల్లలతో కలిసి బీఎన్‌రెడ్డినగర్ పరిధిలోని చైతన్యనగర్‌లో ఉంటున్నాడు. ఆదివారం ఉదయం 10 గంటలకు టీపొడి విషయమై భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో రవి తన భార్యాపిల్లలను బయటకు పంపి గది తలుపు వేసుకున్నాడు. వారు ఎంత పిలిచినా తలుపు తీయలేదు. లోపలి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో ఆందోళనకు గురై భార్యాబిడ్డలు ఇంటి యజమానిని, ఇరుగు పొరుగు వారిని పిలిచారు. వారు గడ్డపారతో తలుపు గడియ బద్దలుకొట్టి చూడగా రవి సీలింగ్ ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని మృతి చెంది ఉన్నాడు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య పుట్టింటికి వెళ్లిందని..
శామీర్‌పేట్ (రంగారెడ్డి జిల్లా) : భార్య పుట్టింటికి వెళ్లిందని తీవ్ర మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శామీర్‌పేటకు చెందిన కోవూరి సుదర్శన్(35), అనిత దంపతులు. సుదర్శన్ కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే గత కొంతకాలంగా దంపతులు గొడవపడుతున్నారు. ఈక్రమంలో ఈ నెల 23న భర్తతో గొడవపడిన అనిత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో సుదర్శన్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కాగా అదే రోజున సుదర్శన్ కూడా ఇంట్లో నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఇదిలా ఉండగా శామీర్‌పేట్ పరిధిలోని సెయింట్ పాల్స్ స్కూల్ సమీపంలోని ఓ పాడుబడిన గదిలో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు శనివారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గది తలుపులు తెరిచి చూడగా ఓ వ్యక్తి గదిలో ఉరివేసుకొని విగతజీవిగా వేలాడుతూ కనిపించాడు. మృతుడిని శామీర్‌పేట్‌కు చెందిన కోవూరి సుదర్శన్‌గా గుర్తించారు. భార్య పుట్టింటికి వెళ్లడంతో మనస్తాపం చెందిన అతడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈమేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య మృతితో మనస్తాపం చెంది.. భర్త ఆత్మహత్య
చిత్తూరు (సోదం): భార్య మృతి చెందడంతో మనస్తాపం చెంది ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా సోదం మండలంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని జోగివారిపల్లిలో వెంకటేశ్వరరెడ్డి (70) వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే భార్య యశోదమ్మ(63) మూడేళ్లుగా తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతోంది. ఆమెను వారం కిందట తిరుపతిలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే యశోదమ్మ గురువారం ఉదయం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో భార్యకు ఖరీదైన వైద్యం చేయించలేక పోతున్నానని వెంకటేశ్వరరెడ్డి స్థానికుల దగ్గర తరచూ ఆవేదన చెందుతుండేవారు. ఈ నేపథ్యంలో భార్య మృతి వార్త తెలియగానే ఇంట్లోనే పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంకటేశ్వరరెడ్డికి ఇద్దరు కుమారులు కాగా, వారు గతంలోనే మృతి చెందినట్లు సమాచారం. -
భార్య కాపురానికి రాలేదని....
శంషాబాద్(రంగారెడ్డి జిల్లా ): భార్య కాపురానికి రావడంలేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని పాల్మాకులలో ఈ సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని మదన్‌పల్లి పాతతండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అలియాస్ రాజు(25)కు, మహేశ్వరం మండలం హర్షగూడ నివాసి సంధ్యతో రెండేళ్ల క్రితం పెళ్లయింది. సురేష్ వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా సంధ్య ప్రసవం కోసం 10 నెలల కిందట హర్షగూడలోని తల్లిగారింటికి వెళ్లింది. పాప పుట్టి 8 నెలలు గడుస్తున్నా కాపురానికి రావడం లేదు. పలుసార్లు సురేష్ వెళ్లి అడిగితే, తన కూతురు పేరుతో రూ.4 లక్షల డబ్బు డిపాజిట్ చేయాలి లేదా 5 గుంటల పొలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తేనే కాపురానికి వస్తానని స్పష్టం చేసింది. దీంతో మన స్తాపానికి గురైన సురేష్ ఈ నెల 7న పాల్మాకులలోని మైసమ్మ చెరువులో దూకి చనిపోయాడు. -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
కంచిలి: భార్య కాపురానికి రాలేదని ఓ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకుని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కంచిలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని జలంత్రకోటకి చెందిన సౌరాసి లక్ష్మణ్(35) వలస కూలి. చెన్నైలో కూలి పని చేస్తూ బతుకు సాగిస్తున్నాడు. ఇతనికి భార్య ఈశ్వరి కుమారుడు ఉన్నారు. లక్ష్మణ్ స్వగ్రామంలో నివాసం ఉండకపోవడంతో అతని భార్య ఈశ్వరి తన కన్నవారింట్లో సోంపేట మండలం కొరంజిభద్రలో కుమారుడుతో కలసి ఉంటోంది. చాలా రోజుల తర్వాత స్వగ్రామానికి వచ్చిన లక్ష్మణ్ భార్య దగ్గరకు వెళ్లాడు. తనుతో పాటు రావాలని భార్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. కనీసం కుమారుడినైనా తనతో పంపించాలని కోరాడు. అందుకూ ఈశ్వరి ఒప్పుకోలేదు. దీంతో భార్యభర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. లక్ష్మణ్ శనివారం రాత్రి లక్ష్మణ్ తన ఇంటికి తిరిగొచ్చేశాడు. తీవ్ర మనస్థాపం చెందిన అతడు ఇంట్లో ఉన్న కిరోసిన్ ఒంటిపై పోసుకొని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి అతగాడిని 108లో సోంపేట ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ ఆదివారం వేకువజామున మృతిచెందాడు. తాను ఆత్మహత్యకు పాల్పడటానికి కారణం మా ఇద్దరి మధ్య గొడవలే అని లక్ష్మణ్ చెప్పినట్టు పోలీసులు తెలిపారు. మృతుని భార్య ఈశ్వరి నుంచి కూడా వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు కంచిలి ఎస్ఐ కె. వెంకటసురేష్ తెలిపారు. -
భార్యను చంపి ఉరేసుకున్న భర్త
అనుమానమే పెనుభూతమై... వర్ని: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం చందూర్ గ్రామంలో ఓ వ్యక్తి భార్యను గొడ్డలితో హతమార్చి, తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. స్థానికులు,ఎస్ఐ అంజయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చందూర్ గ్రామానికి చెందిన గుండ్ల లక్ష్మణ్ (32)కు నిజామాబాద్ మండలం సిరిపురానికి చెందిన రోజా అలియాస్ స్వప్నతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు నిఖిల్ (7), అఖిల్ (5) ఉన్నారు. లక్ష్మణ్ జీవనోపాధి కోసం రెండేళ్లపాటు దుబాయ్ వెళ్లి ఏడాది క్రితం తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి భార్య ప్రవర్తనపై అనుమానం పెంచుకున్నాడు. సోమవారం రాత్రి లక్ష్మణ్ ఇంటికి వచ్చేసరికి భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. లక్ష్మణ్ తల్లి లింగవ్వ, కొందరు స్థానికులు వారిద్దరిని సముదాయించారు. అనంతరం, పిల్లలతో కల్సి పడుకున్న ఇద్దరు తెల్లారేసరికి విగతజీవులయ్యారు. మంగళవారం ఉదయం పెద్ద కుమారుడు నిఖిల్ నిద్రలేచి, రక్తం మడుగులో పడి ఉన్న తల్లిని, ఉరి వేసుకున్న తండ్రిని చూసి, పరుగెత్తుకుపోయి పక్కింట్లో ఇంట్లో ఉన్న నాన్నమ్మ లింగవ్వకు చెప్పాడు. లింగమ్మ కేకలు వేయడంతో చుట్టుపక్కలవారు వచ్చి పోలీస్‌స్టేషన్‌కు సమాచారమందించారు. రోజాను లక్ష్మణ్ గొడ్డలితో తలపై నరికి కిరాతకంగా హత్య చేశాడు. గతంలోనూ ఇరువురి మధ్య ఇదే విషయమై ఘర్షణలు జరగగా, కుల పెద్దలు పంచాయతీ నిర్వహించినట్లు సమాచారం. -
భార్యను చంపి... భర్త ఆత్మహత్య
వర్ని: నిజమాబాద్ జిల్లా వర్ని మండలం చండూరులో గుడ్ల లక్ష్మణ్(35) అనే వ్యక్తి భార్యను చంపి తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని భావిస్తున్నారు. సీఐ దామోదర్ రెడ్డి, ఎస్ఐ అంజయ్య సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
భార్యను చంపి.. ఆపై భర్త ఆత్మహత్య
న్యూఢిల్లీ: భార్యను కత్తెరతో పొడిచి చంపి అనంతరం భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తూర్పు ఢిల్లీలోని గాంధీ నగర్ ప్రాంతంలో శనివారం వెలుగుచూసింది. పూజ అనే తన భార్యను నీరజ్ అనే భర్త పలుమార్లు కత్తెరతో పొడిచి అతి దారుణంగా చంపాడు. భార్యను చంపిన అనంతరం కదిలే రైళ్లో నుంచి దూకి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు రక్తపు మడుగులో పడిఉన్న పూజ మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో గోడపై రక్తంతో రాసిన ఓ సందేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ''నా భార్యను చంపాను, నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను' అంటూ గోడపై రక్తంతో రాసినట్టు పోలీసులు గుర్తించారు. తన ఆత్మహత్యకు భార్య పూజ, ఆమె కుటుంబమే కారణమంటూ రాసి ఉందని పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం రైల్వే ట్రాక్ వద్ద భర్త నీరజ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఐదుగురిని బలిగొన్న క్షణికావేశం...
* ముగ్గురు పిల్లలను, భార్యను చంపి భర్త ఆత్మహత్య * అనాథలైన ముగ్గురు చిన్నారులు సాక్షి, బెంగళూరు : ఆర్థిక సమస్యలు... అటుపై ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతుల మధ్య మనస్పర్థలు కారణంగా క్షణికావేశంలో తీసుకున్న ఓ వ్యక్తి నిర్ణయం ఐదుగురిని బలితీసుకుంది. ముగ్గురు పిల్లలను అనాథలను చేసింది. ఈ హృదయ విదారక ఘటన బెంగళూరు శివారులోని జిగణి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు....తుమకూరు జిల్లా శిరాకు చెందిన ఫయాజ్ (35) ఉపాధి కోసం పదిహేడేళ్ల క్రితమే బెంగళూరుకు వచ్చాడు. పెయింటర్‌గా పనిచేసే ఫయాజ్‌కు బొమ్మనహళ్లి సమీపంలోని బేగూరు వద్ద ఉంటున్న కవితా అలియాస్ రేష్మా (30) పరిచయమైంది. పరిచయం ప్రేమకు దారితీసి పెద్దలను ఎదురించి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వీరికి ఆరుగురు సంతానం. మొదట్లో వచ్చిన సంపాదనతో కుటుంబం ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుండేది. అయితే సంతానం పెరడగంతో వచ్చిన ఆదాయం కుటుంబ పోషణకు సరిపోక ఫయాజ్ ఇబ్బందులు పడేవాడు. ఈ విషయాన్నే సన్నిహితుల వద్ద చెప్పుకుని బాధపడేవాడు. మరోవైపు భార్యభర్తల మధ్య ఇటీవల మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఇదిలా ఉండగా నాలుగు రోజుల ముందు ఫయాజ్ బెంగళూరు నుంచి మంచేనహళ్లికి మకాం మార్చాడు. శనివారం దంపతుల మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. పనిపై బయటికి వెళ్లి రాత్రి ఫయాజ్ ఇంటికి చేరుకున్నాడు. భార్య పిల్లలు మహబూబ్ (5), ఉసాద్ (2), సాదల్ (11 నెలలు) నిద్రపోతూ కనిపించారు. అంతే క్షణికావేశంతో ఇంటి తలుపులు వేసి ముగ్గురిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. కొద్ది సేపటి తర్వాత ఇంటి నుంచి పొగలు రావడంతో చుట్టపక్కల వారు ఇంటి తలపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్లే సరికి చేతిలో కత్తితో ఉన్న ఫయాజ్ గొంతు కోసుకున్నాడు. హుటాహుటిన బాధితులను ఆసుపత్రికి చేర్చగా అప్పటికే వారు చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. మరో ముగ్గురు పిల్లలు సంఘటన జరిగిన సమయంలో పక్కన ఉన్న ఇంటికి వెళ్లడంతో ప్రాణాలతో బయటపడ్డారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, భార్య, పిల్లలకు నిప్పంటించినప్పుడు వారు అరుపులు ఎందుకు బయటికి వినిపించలేదు అన్న దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కిరోసిన్ లేదా మంటలు పుట్టించే మరో ద్రావకం ఏదైనా ఉపయోగించాడే అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య
జైపూర్ : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జైపూర్ మండలంలోని ఖాజీపల్లి గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కొమ్ము పురుషోత్తం యాదవ్(34) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, ఎస్సై సాధీక్ పాషా వివరాల మేరకు...కొమ్ము లస్మయ్య-దేవక్కలకు ముగ్గురు కుమారులు పెద్ద కుమారుడు పురుషోత్తంకు పదిహేనేళ్లక్రితం సుజాతతో పెళ్లి జరిగింది. వ్యవసాయ పనులు చేసుకుంటు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి కుమారుడు సిద్దు(8) ఉన్నాడు. పంటల్లో సరైన దిగుబడి రాక నష్టం పోయిన పురుషోత్తం రెండేళ్లక్రితం దుబాయ్‌కి వెళ్లడానికి ప్రయత్నాలు చేశాడు. వీసా రాకపోవడంతో ఖాజిపల్లిలో కూలీ పనులు చేస్తున్నాడు. అతడి భార్య సుజాత మూడునెలలక్రితం పుట్టింటికి వెళ్లింది. భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపంతో మద్యానికి బానిసయ్యాడు. తండ్రి లస్మయ్య పలు మర్లు చెప్పినా వినలేదు. శనివారం రాత్రి ఇంట్లో పురుగుల మందు తాగాడు. కొంత సమయం తర్వాత కుటుంబ సభ్యులు గమినించి 108 ద్వారా మంచిర్యాల ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందినట్లు వారు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సాధీక్ తెలిపారు. -
భార్య మరణించిందని భర్త ఆత్మహత్య
తిరుత్తణి: భార్య ఆత్మహత్య చేసుకోవడంతో వియోగాన్ని భరించలేని భర్త ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన తిరుత్తణిలో చోటుచేసుకుంది. తిరువణ్ణామలై జిల్లా చెయ్యూరు తాలుకా కొడుక్కుత్తూరుకు చెందిన తిరువేంగడం. ఇతని కొడుకు భాగ్యరాజ్(32). బిటెక్ చదువుకున్న భాగ్యరాజ్ విశాఖపట్నంలో ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తూ వచ్చాడు. ఇతనికి ఐదేళ్ల క్రితం భువనేశ్వరితో వివాహం జరిగింది. వివాహం అనంతరం భార్యాభర్తల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఇద్దరు విడాకులు తీసుకుని విడిపోయారు. అనంతరం భాగ్యరా జ్, తన సొంత ఊరికి చెందిన అన్భళగన్ కూమార్తె విజయలక్ష్మి(28)ని ప్రేమించాడు. విజయలక్ష్మి చెన్నైలోని ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ నాల్గొవ సంవత్సరం చదువుతోంది. వీరిద్దరు ఒకరినొకరు ప్రేమించుకుని మార్చి మూడవ తేదీ చెన్నైలో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. విజయలక్ష్మి తండ్రి అన్భళగన్ వీరి వివాహాన్ని అంగీకరించలేదు. దీంతో విజయలక్ష్మి మూడవ తేదీ హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన ఆమె భర్త భాగ్యరాజ్ దిగ్భ్రాంతి చెందాడు. భార్య వియోగం భరించలేని భాగ్యరాజ్ తిరుత్తణికి వచ్చి స్థానిక బస్టాండులోని ఓ ప్రైవేటు లాడ్జిలో బస చేశాడు. బుధవా రం రాత్రి లాడ్జి రూమ్‌లో జరిగిన విషయూన్ని లెటర్ రాసిపెట్టి, తన జీన్స్ ప్యాంట్‌తో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన తిరుత్తణి ఇన్స్పెక్టర్ శిఖామణి భాగ్యరాజ్ మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
భార్యా, కూతురి గొంతుకోసి భర్త ఆత్మహత్య
-
భార్యా, కూతురి గొంతుకోసి భర్త ఆత్మహత్య
కృష్ణాజిల్లా కేంద్రమైన మచిలీపట్నం సమీపంలోని గూడూరు గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యతోపాటు కన్న కూతురిని వెంకన్న అనే వ్యక్తి గొంతు కోసి అత్యంత పాశవికంగా హత్య చేశాడు. అనంతరం అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు హత్యకు సంబంధించి స్థానికులను ప్రశ్నిస్తున్నారు. ఆ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం పోస్ట్‌మార్టం నిమిత్తం మచిలీపట్నంలోని జిల్లా ఆసుపత్రికి మృతదేహలను తరలించారు. -
భార్యబిడ్డలను కొట్టి, భర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్ : హైదరాబాద్ బాలానగర్ గౌతంనగర్‌లో శుక్రవారం దారుణం జరిగింది. భార్యాబిడ్డలను ఐరన్ రాడ్‌తో దారుణంగా కొట్టి అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన భర్త గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య కృష్ణవేణి, చిన్నారి భవాని పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాల కారణంగానే ఈ ఘటన జరిగినట్లు సమాచారం. కాగా ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
భర్త ప్రాణం తీసిన భార్య నటన
* అసభ్యంగా నటించడంతో తీవ్ర మనస్తాపం * ఉరివేసుకొని ఆత్మహత్య హైదరాబాద్: భార్య ఓ లఘుచిత్రంలో అసభ్యంగా నటించడంతో తట్టుకోలేని భర్త తీవ్ర మనస్తాపంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికితోడు అత్తింటివారి వేధింపులు అధికం కావడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ సూసైడ్‌నోట్‌లో పేర్కొన్నాడు. ఎస్సార్‌నగర్ సీఐ శంకర్ వివరాల ప్రకారం..చిత్తూరు జిల్లాకు చెందిన బండారు ఉదయ్‌భాను(32) కొటక్‌మహీంద్రా కంపెనీలో పనిచేస్తూ అమీర్‌పేట సత్యం థియేటర్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో స్నేహితులతో కలిసి నివాసముంటున్నాడు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాల నేపథ్యంలో భార్య లీలారాణి, 11 ఏళ్ల కూతురుతో గత రెండేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. కాగా భార్య ఇటీవల ఓ లఘుచిత్రంలో అసభ్యకరంగా నటించడాన్ని భాను తట్టుకోలేకపోయాడు. కొన్నిరోజులుగా బాధపడుతుండడంతోపాటు అత్తింటి వారి వేధింపులు అధికమయ్యాయి. వీటిని భరించలేని భాను మంగళవారం ఉదయం గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం సమయంలో గదికొచ్చిన స్నేహితులు తలుపులు తట్టగా లోపలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. గట్టిగా తలుపులు నెట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే భాను మృతిచెంది ఉన్నాడు. పోలీసులు సూసైడ్‌నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. ‘భార్య లఘుచిత్రంలో అసభ్యంగా నటించిందని, దీన్ని తట్టుకోలేకపోయానని, అత్తింటి వేధింపులు పెరగడంతో జీవితంపై విరక్తిచెందానని’ అందులో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జైపూర్‌లో భార్యను చంపి, ఆపై భర్త ఆత్మహత్య
జైపూర్: కుటుంబ వివాదంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తన భార్యను పదునైన కత్తితో పొడిచి చంపి, ఆపై తాను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన జైపూర్‌లోని హనుమాన్‌గఢ్ నగరంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. జైపూర్‌లోని హనుమాన్‌గఢ్‌లో విజయ్ (37), రజనీ (35) దంపతులు ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ఈ దంపతులకు 12 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు. దంపతులిద్దరూ ఇంట్లో తరుచూ గొడవ పడేవారు. వీరి వివాదం చిలికి చిలికి గాలివానలా మారింది. దీంతో మనస్తాపం చెందిన భర్త విజయ్ తన భార్య రజనీని ఓ పదునైన కత్తితో పొడిచి చంపాడు. ఆ తరువాత తాను కూడా విషం తాగి బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు చెప్పారు. రజనీ తండ్రి ఉదయం వారి ఇంటికి వచ్చిన సమయంలో వారి మృతదేహాలను చూసి నివ్వెరపోయాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. -
భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య
లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ :భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని మస్తాన్‌గూడ కాల నీలో జరిగింది. ఎస్సై ఎస్కే.లతీఫ్ కథనం ప్ర కారం.. మస్తాన్‌గూడ కాలనీకి చెందిన షేక్ షాబీర్ (38) వివాహం పట్టణంలోని గోదావరి రోడ్ కాలనీకి చెందిన షెహనాజ్ బేగంతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి సమీర్, సహజర్, అక్షబేగం పిల్లలున్నారు. కొద్ది రోజుల నుంచి షాబీర్ మద్యానికి బానిసయ్యూడు. దీంతో షెహనాజ్ బేగం తన పుట్టింటికి వెళ్లింది. ఆమె ను తీసుకొచ్చేందుకు షాబీర్ కుటుంబ సభ్యు లు షెహనాజ్ ఇంటికెళ్లగా వచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన షాబీర్ రెండు రోజుల నుంచి కని పించడంలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం వెతికినా ఫలితం లేకపోరుుంది. ఆదివా రం ఇంటి ఆవరణలో ఉన్న బావిలో షాబీర్ శ వమై తేలాడు. భార్య కాపురానికి రావడంలేద ని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గంగారంలో మద్యానికి బానిసై.. చెన్నూర్ రూరల్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గంగారం గ్రామంలో జరిగింది. ఎస్సై ఖయ్యూం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోనగిరి రామయ్య(48) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యూడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయల తోటకు చల్లే క్రిమిసంహారక మందు తాగాడు. కాసేపటికి అతడి భార్య కాంత ఇంటికి రాగా రామయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అతడి నోటి నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడం గమనించిన ఆమె వెంటనే స్థానికుల సాయంతో 108లో భర్తను చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామయ్య చనిపోయూడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాంత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. -
భార్య కాపురానికి రావడం లేదని ఆత్మహత్య
బెజ్జూర్, న్యూస్‌లైన్ : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎల్కపెల్లి(బి) గ్రామంలో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఎస్సై సుధాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గుర్లే వెంకటికి భార్య అమృత, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అమృత ఆరు నెలల క్రితం భర్తతో గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమెను కాపురానికి రావాలని కోరినా రావడం లేదు. దీంతో మనస్తాపం చెందిన వెంకటి(28) మంగళవారం రాత్రి ఇంట్లోనే పురుగుల మందుతాగాడు. బుధవారం ఉదయం సిర్పూర్లోని వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. మృతుడి తల్లి తారాబాయి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్సై వివరించారు. మానసిక క్షోభతో యువకుడు.. ఆసిఫాబాద్ : యజమాని మృతితో మానసిక క్షోభకు గురైన ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని సందీప్‌నగర్‌లో బుధవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై సాదిక్‌పాషా కథనం ప్రకారం.. సందీప్‌నగర్‌కు చెందిన కాడె సంజూ(21) కాగజ్‌నగర్‌కు చెందిన ఫ్రిజ్ మెకానిక్ వద్ద పనిచేస్తున్నాడు. రాత్రి పట్టణంలో గుర్ఖాగా ఉంటున్నాడు. ఇటీవల రాజన్న అనారోగ్యంతో మృతిచెందాడు. అతడి అంత్యక్రియలకు కాగజ్‌నగర్ వెళ్లిన సంజూ మూడు రోజులపాటు అక్కడే ఉన్నాడు. మంగళవారం తిరిగి వచ్చి రాత్రి 11గంటల సమయంలో గుర్ఖా విధులకు వెళ్లాడు. వేకువజామున 3గంటలకు వచ్చి ఇం ట్లో పడుకున్నాడు. కుటుంబ సభ్యులు ఉదయం చూసేసరిగి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపిం చాడు. మృతుడి తల్లి కోకిల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. మతిస్థిమితం లేని మహిళ.. మందమర్రి రూరల్ : మండలంలోని సారంగపల్లి గ్రామానికి చెందిన అయోషా బుధవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పట్టణ ఎస్సై రాజేందర్ కథనం ప్రకారం.. అయోషా పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయి తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. మతిస్థిమితం సరిగా లేని ఆమె ఇదివరకు పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేసింది. బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆమెకు కుమారుడు, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.