
సాక్షి, ఖమ్మం: కట్టుకున్న భార్య ఇంకొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరు కాపురం పెట్టడమేకాక.. భర్తనూ తమతోపాటు కలిసి ఉండాలని షరతు విధించింది. దీంతో మనస్తాపానికి గురైన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం బాణాపురం గ్రామానికి చెందిన గుండాల వంశీ (29)కి ఐదేళ్ల క్రితం మండలంలోని గోకినేపల్లికి చెందిన యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాక, సదరు మహిళ ఇంకో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుని వేరుగా ఉంటోంది.
పలుమార్లు హెచ్చరించినా ప్రియుడిని విడిచిపెట్టలేనని చెప్పిన ఆమె, భర్తనూ తమతో కలిసి ఉండాలని సూచించింది. దీంతో మనస్తాపానికి గురైన వంశీ, శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన తీసుకున్న సెల్ఫీ వీడియోను వాట్సాప్‌లో పంపించడంతో విషయం ఆదివారం బయటపడింది. మృతుడి తండ్రి గుండాల శివయ్య ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ముదిగొండ ఎస్‌ఐ నరేశ్ తెలిపారు.
చదవండి: కాటేసిన కరెంటు తీగ
Comments
Please login to add a commentAdd a comment