
సాక్షి, ఖమ్మం క్రైం: ప్రియుడి కోసం కట్టుకున్న భర్తను మోసం చేసిందో భార్య. ఇంట్లోని బంగారు, వెండి నగలను తస్కరించింది. నగదుగా మా ర్చేందుకు యత్నించి చివరకు కట కటాల పాలైంది. ఈ సంఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకోంది. సోమవారం పోలీస్ కమి షనర్ విష్ణు వారియర్ కేసు వివరాలను వెల్లడించారు. కారేపల్లికి చెందిన తాకట్టు వ్యాపారి శివ ప్రకాష్‌దారక్, అర్చన దంప తులు. కొంతకాలంగా వీరి మధ్య గొడవలు తలెత్తడంతో అర్చన ఏపీలోని గుంటూరులో తన పుట్టింటికి వెళ్లింది. అక్కడ వెంకట కృష్ణ్ణప్రసాద్‌తో వివాహేతర సంబంధం పెట్టు కుంది. ఇటీవల తన అత్త మృతి చెందడంతో కారేపల్లికి తిరిగి వచ్చింది.
ప్రియుడితో కలసి జీవించాలనుకున్న ఆమె.. ఇంట్లో ఉన్న నగల ను తస్కరించాలని నిర్ణయించుకుంది. ఈనెల 3న ప్రియుడిని కారేపల్లికి పిలిపించుకుంది. లాకర్‌లో ఉన్న ఆభరణాలను అపహరించింది. వాటిని ప్రియుడు కృష్ణ ప్రసాద్‌కు ఇచ్చి నగదు గా మార్చాలని, తర్వాత తాను వస్తానని చెప్పి పంపించేసింది. కాగా, ఇంట్లో చోరీ జరిగిందని భర్త శివప్రకాష్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అయితే.. పోలీసులు అర్చనను తమదైన శైలిలో విచారించగా.. ప్రియుడితో కలసి తానే నగల ను అపహరించినట్లు అం గీకరించింది. దీంతో వారిద్దరిని అరెస్టు చేశారు. రూ.63 లక్షల విలువ గల బంగారు ఆభరణాలను స్వాధీనపర్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment