భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య | wife left from home,husband suicide in dipression | Sakshi
Sakshi News home page

భార్య కాపురానికి రాలేదని ఆత్మహత్య

Published Mon, Oct 21 2013 1:58 AM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

wife left from home,husband suicide  in dipression

లక్సెట్టిపేట, న్యూస్‌లైన్ :భార్య కాపురానికి రాలేదని మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మండలంలోని మస్తాన్‌గూడ కాల నీలో జరిగింది. ఎస్సై ఎస్‌కే.లతీఫ్ కథనం ప్ర కారం.. మస్తాన్‌గూడ కాలనీకి చెందిన షేక్ షాబీర్ (38) వివాహం పట్టణంలోని గోదావరి రోడ్ కాలనీకి చెందిన షెహనాజ్ బేగంతో 14 ఏళ్ల క్రితం జరిగింది. వీరికి సమీర్, సహజర్, అక్షబేగం పిల్లలున్నారు. కొద్ది రోజుల నుంచి షాబీర్ మద్యానికి బానిసయ్యూడు. దీంతో షెహనాజ్ బేగం తన పుట్టింటికి వెళ్లింది. ఆమె ను తీసుకొచ్చేందుకు షాబీర్ కుటుంబ సభ్యు లు షెహనాజ్ ఇంటికెళ్లగా వచ్చేందుకు ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన షాబీర్ రెండు రోజుల నుంచి కని పించడంలేదు. కుటుంబ సభ్యులు అతడి జాడ కోసం వెతికినా ఫలితం లేకపోరుుంది. ఆదివా రం ఇంటి ఆవరణలో ఉన్న బావిలో షాబీర్ శ వమై తేలాడు. భార్య కాపురానికి రావడంలేద ని మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న ట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 
 
 గంగారంలో మద్యానికి బానిసై..
 చెన్నూర్ రూరల్ : మద్యానికి బానిసైన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గంగారం గ్రామంలో జరిగింది. ఎస్సై ఖయ్యూం కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బోనగిరి రామయ్య(48) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యూడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కూరగాయల తోటకు చల్లే క్రిమిసంహారక మందు తాగాడు. కాసేపటికి అతడి భార్య కాంత ఇంటికి రాగా రామయ్య అపస్మారకస్థితిలో పడి ఉన్నాడు. అతడి నోటి నుంచి క్రిమిసంహారక మందు వాసన రావడం గమనించిన ఆమె వెంటనే స్థానికుల సాయంతో 108లో భర్తను చెన్నూర్ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి రామయ్య చనిపోయూడు. అతడికి భార్య, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కాంత ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement